సాక్షి, హైదరాబాద్: యాదాద్రిలో వ్యభిచారకూపంలో చిక్కుకున్న చిన్నారులు సాక్షులుగా ఇచ్చే వాంగ్మూ లాలను హైదరాబాద్‌లో ఉన్న భరోసా కేంద్రంలోని న్యాయస్థానంలో నమోదు చేయాలని, దీనికి తగిన చర్యలు తీసుకోవాలని దర్యాప్తు అధికారులను మంగ ళవారం హైకోర్టు ఆదేశించింది. వాంగ్మూలం ఇచ్చే చిన్నారులకు నైతిక స్థైర్యాన్ని ఇచ్చేందుకు ఆ న్యాయ స్థానంలో ప్రాక్టీస్ చేసే ముగ్గురు మహిళా న్యాయవా దులతో కమిటీ ఏర్పాటు చేయాలని మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది.
వారి వాంగ్మూలాల నమోదును వీడి యో తీయాలని చెప్పింది. భరోసా కేంద్రం పిల్లలు, మహిళలకు ఉద్దేశించిందని, ఈ కేంద్రంలో వాంగ్మూ లాలు నమోదు చేస్తే ఆ చిన్నారులకు స్నేహపూరిత వాతావరణంలో ఉన్నట్లు ఉంటుందని పేర్కొంది. వాంగ్మూలాల నమోదు సమయంలో ఆ వ్యవహారం తో సంబంధం లేని వ్యక్తులెవరినీ అనుమతించరాద ని స్పష్టం చేసింది. ఆ చిన్నారుల శరీరాల్లో హార్మోన్ల అవశేషాలు ఉన్నాయో లేదో అన్న అంశంపై వచ్చే వారానికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 6కు వాయిదా వేసిం ది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ టీబీరాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
డీఎన్‌ఏ పరీక్షలు పూర్తి..
యాదాద్రిలో చిన్నారులను వ్యభిచార వృత్తిలోకి దింపిన వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను హైకోర్టు పిల్‌గా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవా రం సీజే నేతృత్వంలో ని ధర్మాసనం మరో సారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ.. చిన్నారుల శరీరాల్లో హార్మోన్ల అవశేషాలపై నివేదిక ఇచ్చేందుకు గడువు కావాలని కోరారు.
ఇప్పటికే డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి, చిన్నారుల అసలు తల్లిదండ్రులను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న ట్లు చెప్పారు. స్వచ్ఛంద సంస్థ ప్రజ్వల తరఫు సీనియర్ న్యాయవాది రవిచందర్ స్పందిస్తూ.. సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద ఆ చిన్నారుల వాంగ్మూ లాలను నమోదును భరోసా కేంద్రంలోని న్యాయ స్థానంలో చేపడితే బాగుంటుందని ప్రతిపాదించారు. ఇందుకు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది.
సెక్షన్ 164 కింద వాంగ్మూలాలను నమోదు చేసేందుకు ఎంత సమయం పడుతుందని ధర్మా సనం ప్రశ్నించగా, ఇది సంబంధిత న్యాయస్థానం నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని శరత్ తెలిపారు. వాంగ్మూలాల నమోదుకు భరోసా కేంద్రంలోని కోర్టులో నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలని దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసిం ది. ఇందుకు సంబంధించిన వివరాలను తదుపరి విచారణ నాటికి తమ ముందుంచాలని ఆదేశించిం ది. హార్మోన్ల విషయంలో ఎండ్రోకైనాలజీ వైద్యుల నివేదికనూ తమ ముందుంచాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment