ఢిల్లీ: మనీలాండరింగ్ కేసుల్లోను బెయిల్ అనేది ఒక రూల్ అని, జైలు మినహాయింపుగానే ఉండాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. బుధవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనుచరుడి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనీలాండరింగ్ కేసులో కస్టడీలో ఉన్నప్పుడు నిందితుడు దర్యాప్తు అధికారికి ఇచ్చిన నేరారోపణ ప్రకటన సాక్ష్యంగా అంగీకరించేందుకు వీలుకాదని పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అనుచరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రేమ్ ప్రకాష్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మనీష్ సిసోడియా బెయిల్ తీర్పు విషయంలో కూడా.. పీఎంఎల్‌ఎ (మనీలాండరింగ్ నిరోధక చట్టం)లో బెయిల్ ఒక నియమం, జైలు మినహాయింపు అని తాము చెప్పినట్లు జస్టిస్ బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది.
ఇక.. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో నిందితురాలు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన మరుసటి రోజు ప్రేమ్ ప్రశాష్ బెయిల్ మంజూరు అయింది. మరోవైపు.. ఈ నెల ప్రారంభంలో మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు కూడా సుప్రీం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment