వరంగల్ : వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ కొనసాగుతోంది. బుధవారం ఉదయం గూడూరు నుంచి ఆమె యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా షర్మిల ఐదు కుటుంబాలను పరామర్శించనున్నారు. ముందుగా నెక్కొండ మండలం వెంకటాపురానికి చేరుకుంటారు. అక్కడ సూరం ఐలయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం దీక్షకుంట్లలో చేతం చంద్రయ్య, కొమ్ముల మల్లమ్మ కుటుంబాన్ని, అక్కడ నుంచి చెన్నారావుపేట మండలం జీజీఆర్పల్లికి చేరుకుని బూస నర్సయ్య కుటుంబానికి భరోసా కల్పిస్తారు. చివరగా మూలుగు నియోజకవర్గం కొత్తగూడ మండలం ఓటాయితండలోని బానోత్ మంగళి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ క్రమంలో 144 కిలోమీటర్ల దూరం మేరకు యాత్ర సాగుతుంది.
మరోవైపు గూడూరులో పరామర్శ యాత్రలో ఉన్న వైఎస్ షర్మిలను అఖిలపక్ష నేతలు కలిశారు. మహబూబాబాద్ను జిల్లాగా ప్రకటించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా కొత్త జిల్లా ఏర్పాటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని వైఎస్ షర్మిల ప్రకటించారు. అఖిలపక్ష నేతలకు సంఘీభావం తెలిపారు.
వైఎస్ షర్మిలను కలిసిన అఖిలపక్ష నేతలు
Published Wed, Sep 9 2015 10:16 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM
Advertisement
Advertisement