paramarsa yatra
-
మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు
-
మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు
♦ ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆత్మబంధువులను కలుసుకున్నాం ♦ తెలంగాణలో పరామర్శ యాత్ర ముగింపు సందర్భంగా షర్మిల ♦ నిజామాబాద్ జిల్లా పోతంగల్ కలాన్‌లో పైలాన్‌కు శంకుస్థాపన సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పావురాల గుట్టలో జగనన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు. మాట తప్పని, మడప తిప్పని వైఎస్ కుటుంబం.. ఇచ్చిన మాటకు ఎప్పుడూ కట్టుబడే ఉంటుందన్నారు. ‘‘ఎంత కష్టమొచ్చినా.. ఎంత నష్టం జరిగినా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్న సంతృప్తి, సంతోషం మా సొంతం. ఎంత దూరమైనా, ఎంత మారుమూలన ఉన్నా ప్రతి గడపను వెతుక్కుంటూ వెళ్లాం. ప్రతి కుటుంబాన్ని పరామర్శించాం..’’ అని పేర్కొన్నారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక 750 మంది మృతి చెందగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 494 కుటుంబాలను పరామర్శించారు. అనంతరం తెలంగాణలో షర్మిల 55 రోజులపాటు 8,510 కిలోమీటర్లు పరామర్శ యాత్ర చేపట్టి 256 కుటుంబాలను కలిశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం పోతంగల్ కలాన్‌లో పరామర్శ యాత్ర ముగించా రు. ఈ సందర్భంగా షర్మిల.. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎడ్మ కిష్టారెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కొండా రాఘవరెడ్డితో కలసి వైఎస్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారి స్మారకార్థం ఇడుపులపాయలో నిర్మించిన తరహాలో నిర్మించనున్న పైలాన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు. ఆ మాటకు కాంగ్రెస్ రాజకీయ రంగు ‘‘వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలకు పరామర్శిస్తానని పావురాలగుట్టలో జగనన్న మాటిచ్చారు. అది వైఎస్‌కు కొడుకు హోదాలో ఇచ్చిన మాట. కానీ దానికి కాంగ్రెస్ రాజకీయ రంగు పూసింది’’ అంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మా కుటుంబమంతా స్వయంగా వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలసి.. ఓదార్పు యాత్ర చేస్తామని వేడుకొన్నాం. కానీ వీల్లేదన్నారు.. బెదిరించారు. అయినా చనిపోయిన వారి కుటుంబాలకు ఆసరాగా ఉండాలన్న మా కుటుంబ సంకల్పం చెక్కుచెదరలేదు. అందుకు కాంగ్రెస్ వాళ్లు టీడీపీతో కలసి జగనన్న మీద కేసులు పెట్టారు. చార్జిషీట్లు వేశారు. 16 నెలలు జైల్లో పెట్టారు. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిప్పుకొంటూనే ఉన్నారు. కానీ ఈ రోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. అందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో 750 కుటుంబాలను పరామర్శించాం. వారి బాధలో పాలుపంచుకొని, వారి త్యాగాన్ని, అభిమానాన్ని గుర్తించాం. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నేను వెళ్లిన ప్రతి పల్లె, ప్రతి వాడలో ఆప్యాయంగా స్వాగతం పలికారు’’ అని షర్మిల వివరించారు. వైఎస్ ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు దివంగత రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారని షర్మిల చెప్పారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 పథకాల్లో ఆయన జీవించే ఉంటారన్నారు. దళితులకు 23 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేసిన ఘనత వైఎస్‌దేనని చెప్పారు. జలయజ్ఞం ద్వారా 25 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తెచ్చారన్నారు. పేదలకు 45 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారన్నారు. ‘‘వైఎస్ చనిపోయి ఆరేళ్లు అయినా ఈనాటికీ ఆయన పథకాలను అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయంటే ఆ పథకాల్లో ఎంతో గొప్పతనం ఉంది. అందుకే అంటున్నా.. వైఎస్‌కు మరణం లేదు’’ అని చెప్పారు. వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా వైఎస్ మరణ వార్త విని చనిపోయిన కుటుంబాలను కలుసుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని షర్మిల పేర్కొన్నారు. ‘‘నాన్న మరణవార్త విని తట్టుకోలేక 750 మంది చనిపోయారు. అది సామాన్యమైన విషయం కాదు. నాన్నను ప్రాణం కంటే మిన్నగా అభిమానించి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులకు వైఎస్ కుటుంబం శిరస్సు వంచి, చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది’’ అని షర్మిల అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్మ కిష్టారెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా సూర్యప్రకాశ్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె.శివకుమార్, నాయుడు ప్రకాశ్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, మెరక శ్రీధర్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు నాడెం శాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి బొడ్డు సాయినాథ్‌రెడ్డి, డి.గోపాల్‌రెడ్డి, డాక్టర్ కె.నగేశ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ముగిసిన పరామర్శ యాత్ర వైఎస్ తనయ షర్మిల తెలంగాణలో చేపట్టిన పరామర్శ యాత్ర శుక్రవారం ముగిసింది. 2014 డిసెంబర్ 8న మహబూబ్‌నగర్ నుంచి మొదలైన పరామర్శ యాత్ర రాష్ట్రవ్యాప్తంగా కొనసాగింది. 55 రోజులపాటు 8,510 కిలోమీటర్ల మేర ప్రయాణించి 256 కుటుంబాలను కలిసిన ఆమె.. శుక్రవారం పోతంగల్ కలాన్‌లో పరామర్శ యాత్రను ముగించారు. యాత్ర చివరి రోజున జిల్లాలో షర్మిల మూడు కుటుంబాలను పరామర్శించారు. కోటగిరి మండలం పోతంగల్లో గౌరు నడిపి వీరయ్య, గాంధారి మండలం బ్రాహ్మణపల్లిలో నీరడి పోచయ్య, పోతంగల్ కలాన్‌లో మంగలి నారాయణ కుటుంబాలను పరామర్శించారు. అనంతరం కలాన్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైఎస్ కోసం చనిపోయినవారి స్మారకార్థం పైలాన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, ఒక మొక్క నాటారు. ఆ ప్రాంతాన్ని చక్కటి ఆహ్లాదకరమైన పార్కుగా మలుస్తామని చెప్పారు. షర్మిలకు అభినందనలు: పొంగులేటి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు పరామర్శ యాత్రను విజయవంతంగా పూర్తి చేసినందుకు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి షర్మిలకు అభినందనలు తెలిపారు. మండుటెండలు.. చలి.. జోరువానలు సైతం లెక్కచేయకుండా ఇచ్చిన మాట కోసం షర్మిల తమ ఆత్మబంధువులను కలిశారన్నారు. తెలంగాణలో మొదటిసారి ఓదార్పు యాత్ర కోసం వరంగల్ వెళ్తే.. వైఎస్ దయాదాక్ష్యిణ్యాలపై కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాల సూచనలతో కొన్ని శక్తులు అడ్డుకున్నాయని పొంగులేటి దుయ్యబట్టారు. ఐదు సంవత్సరాలైనా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబాన్ని పరామర్శించారన్నారు. మహానేత కుటుంబానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు అండగా ఉంటారని, ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి జగన్ కుటుంబం అండగా ఉంటుందని చెప్పారు. -
తెలంగాణలో ముగిసిన పరామర్శ యాత్ర
-
షర్మిలకు పొంగులేటి అభినందనలు
-
గ్రేటర్ పరిధిలో షర్మిల పరామర్శయాత్ర
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరామర్శయాత్ర చేస్తున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణవార్త విని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. పరామర్శ యాత్రలో భాగంగా మంగళవారం ఉదయం లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి బయల్దేరిన రాజన్న తనయ.... హైటెక్‌సిటీ, కొండాపూర్, మియాపూర్ మీదుగా చందానగర్ చేరుకున్నారు. అక్కడ తారానగర్ తుల్జాభవన్ దేవాలయం సమీపంలోని దిగంబరరావు ఇంటికి వెళ్లి... ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. దిగంబరరావు కుటుంబం స్థితిగతులను, కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరామర్శ యాత్రలో వైఎస్ షర్మిల వెంట... వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. -
మెదక్ జిల్లాలో ముగిసిన షర్మిల పరామర్శ యాత్ర
-
పెద్దదిక్కుగా ఉంటాం: షర్మిల
-
పెద్దదిక్కుగా ఉంటాం: షర్మిల
మెదక్ జిల్లాలో రెండ్రోజుల్లో 13 కుటుంబాలకు పరామర్శ ♦ ఆత్మీయ స్వాగతంతో అక్కున చేర్చుకున్న ప్రజలు.. ముగిసిన యాత్ర ♦ నేటి నుంచి మూడ్రోజులపాటు గ్రేటర్ హైదరాబాద్‌లో పరామర్శ ♦ మొత్తం 13 కుటుంబాలను కలవనున్న వైఎస్ తనయ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గుండె చెదిరిన వారికి ధైర్యం చెప్పారు.. అండగా నిలబడతామని అభయమిచ్చారు. ఆత్మీయ పలకరింపుతో అక్కున చేర్చుకున్నారు..! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మెదక్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర సోమవారం ముగిసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక గుండెపగిలి చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల రెండు రోజులు జిల్లాలో పర్యటించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలసి ఆదివారం ఏడు కుటుంబాలను పరామర్శించిన ఆమె.. సోమవారం 350 కిలోమీటర్లు ప్రయాణం చేసి 6 కుటుంబాలను కలిశారు. నర్సాపూర్, ఆందోల్ నియోజకవర్గాల్లో ప్రజలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులిచ్చి ఆశీర్వదించారు. దుబ్బాక నుంచి రెండోరోజు పర్యటన ప్రారంభించిన షర్మిల మొదట కూడవెళ్లిలో కొండ్ర బాలయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడ్నుంచి భూంపల్లి మీదుగా దౌల్తాబాద్ మండలం కొత్తపల్లి వెళ్లి అమ్మొళ్ల పోచయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కౌడిపల్లి మండలం కొట్టాలలో గారబోయిన నారాయణ, హత్నూర మండలం బ్రాహ్మణగూడెంలో తిమ్మాపురం కిషన్, మునిపల్లి మండలం తాటిపల్లిలో గోవింద్‌గారి రాజేందర్, కొండాపూర్ మండలం గొల్లపల్లిలో గడీల పార్వతమ్మ కుటుంబాలను పరామర్శించారు. ‘‘అధైర్యపడొద్దు.. మీ బతుకులు మారే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. మీ జీవితాలను మార్చడానికి నేనున్నా..’ అంటూ తన ముందు కంటతడి పెట్టుకున్న మహిళల కన్నీళ్లను షర్మిల తుడిచారు. సర్పంచుల స్వాగతం నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం బ్రాహ్మణగూడేనికి షర్మిల వస్తున్నారన్న సంగతి తెలుసుకున్న సమీప గ్రామాల్లోని దాదాపు 20 మంది సర్పంచులు వచ్చి షర్మిలకు స్వాగతం పలికారు. వారితో షర్మిల కొద్దిసేపు మాట్లాడారు. వైఎస్సార్ హయాంలో గ్రామాలు పరిపుష్టిగా ఉన్నాయని, రైతులు ఆర్థికంగా బాగున్నారని వారు గుర్తు చేశారు. ఇప్పుడు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కరువు తరుముతోంది.. ఊరు పొమ్మం టోంది. ఊళ్లో ఉంటే బతుకు లేదు బిడ్డా..తాగటానికి కూడా నీళ్లు దొరుకుతలేదు. మా ఊరి చుట్టూ నాలుగు బీరు ఫ్యాక్టరీలు ఉన్నాయి కానీ చేతికి రూపాయి పని దొరుకుత లేదు. వానలు పడితే రైతుకు మేలు. ఇప్పుడు వానలు ఉన్నయా? ఆ వానలు మీ నాన్నతోనే పోయినయ్..’’ అంటూ గొల్లపల్లికి చెందిన గడీల లక్ష్మమ్మ షర్మిల ముందు తన గోడు వెళ్లబోసుకుంది. పరామర్శ యాత్రలో షర్మిల వెంట వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు బీశ్వ రవీందర్‌రెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు న ర్రా భిక్షపతి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య, రాష్ట్ర కార్యదర్శులు కె.వెంకట్‌రెడ్డి, విలియం మునిగాల, జి.ధనలక్ష్మి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్.షర్మిల సంపత్ తదితరులున్నారు. నేటి నుంచి ‘గ్రేటర్’లో పరామర్శ యాత్ర సాక్షి, సిటీబ్యూరో: ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మంగళవారం కూడా షర్మిల మెదక్ జిల్లాలో పర్యటించి నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించాలి. అయితే ఎన్నికల కోడ్ వస్తే హైదరాబాద్ జిల్లాలో ఆత్మబంధువులను కలవడం సాధ్యం కాదని పార్టీ నేతలు చేసిన సూచనతో షర్మిల తన షెడ్యూల్ మార్చుకున్నారు. మెదక్‌లో రెండ్రోజుల్లోనే పరామర్శలను పూర్తి చేసి, సోమవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం నుంచి మూడ్రోజులపాటు గ్రేటర్ హైదరాబాద్‌లో షర్మిల పరామర్శ యాత్ర చేపడతారు. తొలిరోజు శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో 8 కుటుంబాలను పరామర్శిస్తారు. బుధవారం సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో 7 కుటుంబాలను పరామర్శిస్తారు. గురువారం ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో 2 కుటుంబాలను పరామర్శిస్తారు. ‘గ్రేటర్’లో షర్మిల తలపెట్టిన పరామర్శ యాత్రను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు ఆదం విజయ్‌కుమార్, సురేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. -
మెతుకుసీమలో రాజన్న తనయ
-
ఏ కష్టమొచ్చినా మేమున్నాం
మెదక్ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల ♦ తొలిరోజు మూడు నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలకు పరామర్శ ♦ అధైర్య పడొద్దంటూ కుటుంబీకులకు భరోసా ♦ బాగా చదువుకోవాలంటూ పిల్లలకు సూచన ♦ బోనాలు, బతుకమ్మలతో ఆత్మీయ స్వాగతం పలికిన జనం సాక్షి, సంగారెడ్డి/గజ్వేల్/కొండపాక/చిన్నకోడూరు: ‘‘మీకు అండగా జగనన్న ఉన్నాడు.. ఏ కష్టం వచ్చినా నేనున్నా. ధైర్యం కోల్పోవద్దు..’’ అంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబీకులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల భరోసానిచ్చారు. ఆ కుటుంబాలను అక్కున చేర్చుకొని ఆత్మస్థైర్యం నింపారు. కుటుంబ సభ్యులను పేరుపేరున పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆదివారం మెదక్ జిల్లాలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి షర్మిల పరామార్శ యాత్ర ప్రారంభించారు. వైఎస్ మరణంతో గుండె పగిలి చనిపోయినవారి కుటుంబాల పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ‘బాగా చదువుకోవాలమ్మా..’ అని వారికి చెప్పారు. రాజన్న బిడ్డ స్వయంగా వచ్చి ధైర్యం చెప్పటం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందని వారు పొంగిపోయారు. ఆప్యాయత పంచుతూ... ధైర్యం చెబుతూ... వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబీకులను షర్మిల ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. అంబర్‌పేటలో మన్నె జయమ్మ భర్త నాగమల్లేష్, కుమారులు సందీప్, మనోజ్‌కుమార్, మామ సాయిలును పలకరించగా వారు తమ గోడు వెల్లబోసుకున్నారు. ‘‘మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. రెక్కల కష్టమే ఆధారం. పని సరిగ్గా దొరక్క తాత్కాలికంగా అల్వాల్‌లో ఉంటున్నం. పిల్లల్ని అక్కడే ప్రభుత్వ బడిలో చదివిస్తున్నా’’ అని షర్మిలతో నాగ మల్లేష్ చెప్పారు. అందుకు షర్మిల స్పందిస్తూ.. ‘‘మంచిరోజులొస్తాయి.. బాధ పడకండి.. పిల్లలూ మీరు మంచిగా చదువుకోవాలి.. మంచి పేరు తెచ్చుకోవాలి’’ అని సూచించారు. మర్పడగలో శకుంతల మరణంతో మేనమామ, మేనత్తల వద్ద ఆశ్రయం పొందుతున్న ఆమె పిల్లలు పూజ(12), గణేష్(15)లను షర్మిల ఓదార్చారు. ఈ సందర్భంగా తల్లి మరణంతో దిక్కులేని వారిగా మారామంటూ పూజ బోరున విలపించింది. ఆ చిన్నారి బాధను చూసి షర్మిల చలించిపోయారు. దగ్గరకు తీసుకొని ఓదార్చారు. ‘‘దుఃఖం వద్దు.. బాగా చదువుకోండి. కష్టాలకు కుంగిపోవద్దు. మీకు మేమున్నాం’’ అంటూ భరోసానిచ్చారు. మాటిండ్లలో వజ్రవ్వ కుమారులు బాల్నర్సు, రాజులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, తాము అన్ని విధాల ఆదుకుంటామని, పిల్లల చదువుకు సహకరిస్తామని మాటిచ్చారు. పరామర్శయాత్రలో షర్మిల వెంట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లా సూర్యప్రకాశ్, జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు బీశ్వ రవీందర్‌రెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నర్రా భిక్షపతి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య, కొమ్మెర వెంకట్‌రెడ్డి, ఏపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజా చరణ్‌రెడ్డి, తెలంగాణ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి విజయ తదితరులు ఉన్నారు. ఆత్మీయ స్వాగతం పలికిన జనం తొలిరోజు పరామర్శ యాత్రలో భాగంగా షర్మి ల గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల పరిధిలోని 200 కిలోమీటర్లు ప్రయాణించి ఏడు కుటుంబాలను పరామర్శించారు. ఉదయం 11:10 సమయంలో హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి మేడ్చల్ మీదుగా మెదక్ జిల్లా దండుపల్లికి చేరుకున్న షర్మిలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నియోజకవర్గాల్లో షర్మిల ఎక్కడివెళ్లినా ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. బోనాలు, బతుకమ్మలు, ఊరేగింపులు, మంగళహారతులు, డప్పుల చప్పుళ్లు, బాణసంచా మోతలతో ఆహ్వానించారు. షర్మిల మొదట వర్గల్ మండలం అంబర్‌పేటలో మన్నె జయమ్మ కుటుం బాన్ని పరామర్శించారు. అనంతరం కొండపాక మండలం మర్పడగలో శ్రీపతి శకుంతల, అదే మండలంలోని బందారంలో నమిలె పోచయ్య, చిన్నకోడూరు మండలం మాటిం డ్లలో కారంకంటి వజ్రవ్వ, దుబ్బాక మండలం పెద్దగుండ్లవల్లిలో బిట్ట ప్రభాకర్, తొగుట మండలం వేములఘాట్‌లో బత్తుల బాలవ్వ, తొగుట మండలం కాన్గల్‌లో గడిల బలరాం కుటుంబాలను పరామర్శించారు. -
జనవరి 3 నుంచి మెదక్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల జనవరి 3వ తేదీ నుంచి మెదక్ జిల్లాలో పరామర్శ యాత్ర చేయనున్నారని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆపార్టీ నేతలు శివకుమార్, నల్యా సూర్యప్రకాశ్, భిక్షపతి విలేకర్లతో మాట్లాడుతూ... పరామర్శయాత్రలో భాగంగా జిల్లాలో మొత్తం 13 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తారని తెలిపారు. మెదక్ జిల్లాలో మొత్తం మూడు రోజులపాటు షర్మిల పరామర్శ యాత్ర సాగుతుందని పేర్కొన్నారు. జనవరి 5వ తేదీతో మెదక్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర ముగియనుందన్నారు. ఆ తర్వాత అంటే జనవరి 6వ తేదీన నిజామాబాద్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ జిల్లాలో ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారని వివరించారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 7 జిల్లాల్లో పరామర్శ యాత్ర పూర్తయిందని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత హైదరాబాద్ నగరంలో పరామర్శయాత్ర ప్రారంభమవుతుందని వారు తెలిపారు. కడప కలెక్టరేట్లో అంబేద్కర్ విగ్రహం కూల్చడంపై వైఎస్ఆర్ సీపీ నేతలు శివకుమార్, నల్యా సూర్యప్రకాశ్, భిక్షపతి స్పందించారు. ఈ ఘటన దారుణమని వారు అభివర్ణించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ను అరెస్ట్ చేయాలని వారు రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తొలగించిన విగ్రహం స్థానంలో మరో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. దళితుల్ని అణచివేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కుట్రకు పాల్పడ్డారని వారు విమర్శించారు. -
రాజన్న బిడ్డగా వచ్చా..!
♦ నిజామాబాద్ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల ♦ ధైర్యంగా ఉండండి.. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది ♦ కోట్లాది మంది గుండెల్లో వైఎస్ బతికే ఉన్నారు ♦ నిజామాబాద్‌లో ఆరు, ఆదిలాబాద్‌లో మూడు కుటుంబాలకు పరామర్శ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ఆదిలాబాద్: ‘‘రాజన్న బిడ్డగా మీ దగ్గరకు వచ్చా... మిమ్మల్ని కలుసుకొమ్మని జగనన్న పంపాడు.. ధైర్యంగా ఉండండి.. రాజన్న పాలనలో ప్రజలంతా కష్టాల్లేకుండా బతికారు.. మళ్లీ మంచి రోజులొస్తాయి..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు. వైఎస్సార్ మరణించి ఆరేళ్లు గడుస్తున్నా... కోట్లాది మంది గుండెల్లో బతికే ఉన్నారన్నారు. సోమవారం ఆదిలాబాద్‌లో జిల్లాలో పరామర్శ యాత్ర ముగిసిన అనంతరం ఆమె నిజామాబాద్ జిల్లాలోకి అడుగుపెట్టారు. బాల్కొండ మండలం సోన్ బ్రిడ్జి వద్ద జిల్లాలోకి యాత్ర ప్రవేశించగా.. షర్మిలకు జిల్లా అధ్యక్షుడు పెద్దపట్లోళ్ల సిద్ధార్థరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సోమవారం ఆదిలాబాద్‌లో మూడు, నిజామాబాద్‌లో ఆరు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్‌లో కాసు బక్కయ్య, లోకేశ్వరం మండలం హవర్గాలో పర్స భోజన్న, దిలావర్పూర్లో కామాటిబొల్ల ముత్యం కుటుంబీకులను పరామర్శించారు. బజార్ హత్నూర్‌లో వైఎస్ అభిమాని ఈర్ల శివుడు ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం దూదిగాంలో మొదలైన పరామర్శ యాత్ర సదాశివనగర్ మండలంలోని రామారెడ్డి వరకు సాగింది. రాజన్న పాలనను గుర్తు చేసిన జనం.. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇతర నాయకులతో కలిసి షర్మిల నిజామాబాద్‌లో ఆరు కుటుంబాలను పరామర్శించారు. మొదటగా బాల్కొండ మండలం దూద్గాంలో వెల్మల కంచెట్టి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం డిచ్పల్లి మండలం యానాంపల్లిలో బత్తుల నర్సయ్య, సదాశివనగర్ మండల కేంద్రంలో డీకొండ కిషన్, ముంజాల లింగాగౌడ్ కుటుంబాలను పరామర్శించారు. తర్వాత రామారెడ్డిలోని గంగాధర్, పిప్పరి రాజు కుటుంబాలను కలిశారు. ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. గ్రామస్తుల కోరిక మేరకు బాల్కొండ మండలంలోని మెండోరాలో షర్మిల పర్యటించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రైతులు ఆమెతో మాట్లాడారు. ‘‘వైఎస్ పాలనలో రైతు రాజయ్యాడమ్మా.. అప్పుడు పసుపు క్వింటాల్ 16 వేలు ధర పలికింది. రాజన్న పాలనలో రైతు ఏనాడు రోడ్డెక్క లేదు. రాజన్న లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది..’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘వైఎస్ బతికుంటే పేదల ముఖాల్లో సంతోషం ఉండేది.. రైతుల కళ్లల్లో ఆనందం ఉట్టి పడేది. రాజన్నను ప్రజలు మరువలేకపోతున్నారు.. ధైర్యం గా ఉండండి.. మంచి రోజులు వస్తాయి.’’ అని ప్రజలకు షర్మిల భరోసా ఇస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్సీపీ రాష్ర్ట అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి ఆధ్వర్యంలో సాగిన పరామర్శ యాత్ర లో జిల్లా అధ్యక్షుడు పెద్దపట్లోళ్ల సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ముజతబూ అహ్మద్, వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రపుల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేష్‌రెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు బీష్వ రవీందర్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్యాంసుందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ టి.ఇన్నారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు మహిపాల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి, ఐల వెంకన్నగౌడ్, మంద వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సస్పెండ్ చేయడం బాధాకరం వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నదాతల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించినందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో సహా, ప్రతిపక్ష పార్టీల సభ్యులను సస్పెండ్ చేయడం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన సర్కారు ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయడంలో, గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమవుతున్న ప్రభుత్వం ఈ అంశాలపై సమాధానం చెప్పలేకే ఇలాంటి చర్యలకు దిగుతోందని విమర్శించారు. కరువు సాయం, మద్దతు ధరలు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. తెలంగాణ వరప్రదాయని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు వైఎస్ శ్రీకారం చుట్టగా.. ప్రాజెక్టును తామే నిర్మించామని చెప్పుకోవడం కోసం ప్రభుత్వం బ్యారేజీ స్థలాన్ని మార్చాలని చూస్తోందని విమర్శించారు. -
అసెంబ్లీలో ‘ఆశ’ సమస్య
♦ ప్రస్తావిస్తామని హామీనిచ్చిన షర్మిల ♦ వైఎస్ బతికి ఉంటే ఆశ కార్యకర్తలు పర్మనెంట్ అయ్యేవారు ♦ ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకున్న రాజన్నకు మరణం లేదు ♦ చేయి చేయి కలిపి ఆయన ఆశయాలు సాధించుకుందాం ♦ ఆదిలాబాద్ జిల్లాలో రెండో రోజు కొనసాగిన పరామర్శ యాత్ర సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: మహానేత వైఎస్సార్ బతికుంటే ఆశ కార్యకర్తలు పర్మనెంట్ ఉద్యోగులు అయ్యేవారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ఆశ కార్యకర్తల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని హామీనిచ్చారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో రెండోరోజు పరామర్శ యాత్ర కొనసాగింది. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన ఐదు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన వేమనపల్లి మండలంలో యాత్ర సాగింది. లక్ష్మీపూర్‌లో గండ్రపెద్ద రామారావు కుటుంబీకులను పరామర్శించారు. అటవీప్రాంతమైన ఖానాపూర్ మండలం తాటిగూడలో గుగ్లావత్ మంగ్యానాయక్, ఇదే మండలం సత్తన్నపల్లిలో భూక్యా వసంత నాయక్, జన్నారం మండల కేంద్రంలో రాథోడ్ లుంబా నాయక్, కడెం మండలం లింగాపూర్‌లో కొలిప్యాక భూమన్న కుటుం బీకులకు భరోసా కల్పించారు. యాత్రలో భాగంగా బెల్లంపల్లి, మంచిర్యాల, కన్నెపల్లిలో ఆశ కార్యకర్తలు షర్మిల వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ధైర్యంగా ఉండాలని.. మంచి రోజులు ముందున్నాయని షర్మిల వారికి భరోసా కల్పించారు. అనంతరం జన్నారం మండల కేంద్రంలో పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజల గుండెల్లో వైఎస్ ఒక నాయకుడు మరణిస్తే వందలాది మంది గుండెలు ఆగిపోయిన ఘటన దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని, రాష్ట్ర ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకున్న వైఎస్‌కు మరణం లేదని షర్మిల పేర్కొన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ైవె ఎస్సార్ ప్రజల గుండెల్లో కొలువై ఉంటారన్నారు. ‘‘వైఎస్ సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల వారు లబ్ధిపొందారు. కరెంట్, ఆర్టీసీ, గ్యాస్ వంటి చార్జీలు పైసా కూడా పెంచకుండానే అనేక పథకాలు అమలు చేశారు. మహిళల్ని అక్కాచెల్లెళ్లుగా భావిం చి వారికి పావలా వడ్డీకే రుణాలిచ్చారు. మహిళా సాధికారతకు బాటలు వేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. గతంలో కొన్ని ప్రభుత్వాలు సర్కారు ఆసుపత్రుల్లో యూజర్ చార్జీలు వసూలు చేశాయి. కానీ వైఎస్సార్ నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. కుయ్.. కుయ్.. అంటూ వచ్చే 108 వాహనాలు లక్షలాది మందికి ప్రాణం పోస్తున్నాయి. వైఎస్ బతికుంటే ఇల్లు లేని నిరుపేద రాష్ట్రంలో ఉండే వారు కాదు’’ అని పేర్కొన్నారు. చేయి చేయి కలిపి వైఎస్సార్ ఆశయాలు సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఒకేసారి రుణమాఫీ చేయాలి రైతుల రుణాల్ని ఒకేసారి మాఫీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. పొంగులేటి ఆధ్వర్యంలో సాగిన పరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ముస్తాఫా అహ్మద్, వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రపుల్లారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్, యాత్ర ఆదిలాబాద్ జిల్లా పరిశీలకులు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎం.భగవంత్‌రెడ్డి, వేముల శేఖర్, విలియం మునిగెల, మేస్రం శంకర్, పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఐల వెంకన్న గౌడ్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మంద వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు సుమిత్గుప్త, మాజీద్‌ఖాన్, ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శ్రీవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి నిజామాబాద్ జిల్లాలో యాత్ర సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: షర్మిల సోమవారం నుంచి రెండ్రోజుల పాటు నిజామాబాద్ జిల్లాలో పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. తొలిరోజు బాల్కొండ మండలం దూద్గాం నుంచి మొదలవుతుంది. తొలిరోజు ఆరు, మరుసటి రోజు ఆరు కుటుంబాలను కలుస్తారు. రెండు రోజుల్లో సుమారు 214 కిలోమీటర్లు ప్రయాణిస్తారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పెద్దపట్లోళ్ల సిద్ధార్థరెడ్డి తెలిపారు. -
ఎస్పీఎం కార్మికుల పోరాటానికి మద్దతు
♦ ఆదిలాబాద్ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల ♦ పేపర్ మిల్లు తెరిపించేందుకు పోరాడతాం ♦ కార్మికుల కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తాం ♦ కోట్లాది మంది గుండెల్లో నిలిచిన వైఎస్ రాజశేఖరరెడ్డి ♦ అడుగుజాడల్లో నడుద్దామని పిలుపు ♦ రాజన్న బిడ్డకు గుస్సాడీ నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/కరీంనగర్: సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం)ను తిరిగి తెరిపించేందుకు జరుగుతున్న పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ప్రకటించారు. ఎస్పీఎం కార్మికులకు తమ పార్టీ అండగా ఉంటుందని.. కార్మికుల కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక గుండె ఆగి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు చేపట్టిన పరామర్శయాత్రలో భాగంగా షర్మిల శనివారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. తొలుత కాసిపేట మండలం దేవాపూర్‌లో మహ్మద్ జాకీర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కాగజ్‌నగర్ మండలం చింతగూడ గ్రామానికి వెళ్లి కొట్రాక ఆనంద్‌రావు కుటుంబాన్ని కలుసుకున్నారు. ఆ కుటుంబాల సభ్యులతో మాట్లాడి.. వారి సమస్యలను తెలుసుకున్నారు. వైఎస్ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యాత్రలో భాగంగా కాగజ్‌నగర్‌లోని లారీ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి షర్మిల మాట్లాడారు. నిరుపేదల గుండెల్లో కొలువై ఉన్న వైఎస్సార్‌కు మరణం లేదన్నారు. వైఎస్సార్ హయాంలో అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందని.. తెలుగుజాతి ఉన్నంత వరకు ఆయన బతికే ఉంటారని పేర్కొన్నారు. కాగా తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన షర్మిలకు ఆత్మీయ స్వాగతం లభించింది. సాయంత్రం 4.30 గంటలకు మంచిర్యాలకు చేరుకున్న షర్మిలకు.. వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు ఆదివాసీ సంప్రదాయ రీతిలో గుస్సాడీ నృత్యాలు, ప్రత్యేక వాయిద్యాలతో స్వాగతం పలకగా... కాగజ్‌నగర్‌లో మహిళలు మంగళ హారతులతో ఆహ్వానించారు. ఆదిలాబాద్ జిల్లా యాత్రలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్‌కుమార్, ఇన్చార్జి మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, జిల్లా పరిశీలకులు భగవంత్‌రెడ్డి, పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో 885 కిలోమీటర్లు.. కరీంనగర్ జిల్లాలో శనివారం వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో మూడు కుటుంబాలను షర్మిల కలుసుకున్నారు. బోయినిపల్లి మండలం స్తంభంపల్లిలో చంద్రగిరి నర్సమ్మ, సిరిసిల్ల మండలం మండేపల్లి, చీర్లవంచ గ్రామాల్లో కొమ్మెట లచ్చయ్య, ఈసరి లచ్చవ్వ కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయా కుటుం బాల సభ్యులు షర్మిలకు తమ కష్టాలను వివరించారు. షర్మిల వారిని ఓదార్చారు. అందరూ ధైర్యంగా ఉండాలని, త్వరలోనే మంచిరోజులు వస్తాయని భరోసా కల్పిం చారు. దీంతో కరీంనగర్ జిల్లాలో షర్మిల యాత్ర ముగిసింది. రెండు దఫాలుగా (సెప్టెంబర్ 22-24, అక్టోబర్ 1-3 తేదీల్లో) నిర్వహించిన ఈ యాత్రలో కరీంనగర్ జిల్లాలో 885 కిలోమీటర్లు ప్రయాణించి, 30 కుటుంబాలను ఆమె పరామర్శించారు. -
కరీంనగర్ లో ముగిసిన వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
-
కరీంనగర్ లో ముగిసిన వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర కొనసాగుతోంది. సిరిసిల్ల మండలం చీర్లవంచలో లచ్చవ్వ కుటుంబాన్ని ఆమె శనివారం పరామర్శించి, ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇవాళ ఉదయం వైఎస్ షర్మిల మూడు కుటుంబాలను పరామర్శించారు. దీంతో జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర నేటితో ముగిసింది. మహానేత మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన 30 కుటుంబాలను ఆమె పరామర్శించారు. జిల్లావ్యాప్తంగా రెండువిడతల్లో 13 నియోజకవర్గాల్లో 900 కిలోమీటర్లు పర్యటించారు. -
కరీంనగర్లో రెండో రోజు వైఎస్ షర్మిల పరామర్శయాత్ర
-
'వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఎకరాకు సాగునీరు'
-
ఏడు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల రెండో రోజు పరామర్శయాత్ర ముగిసింది. రెండో రోజు శుక్రవారం హుజురాబాద్, మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో ఏడు కుటుంబాలను ఆమె పరామర్శించారు. మొత్తం 131 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. షర్మిల వెంట ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తదితర నాయకులు ఉన్నారు. మరోవైపు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిలకు ప్రతిపల్లెలోనూ ఘన స్వాగతం లభించింది. రాజన్న బిడ్డను చూసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. -
కొనసాగుతున్న షర్మిల పరామర్శయాత్ర
కరీంనగర్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల గురువారం నుంచి కరీంనగర్ జిల్లాలో చేపట్టిన రెండో విడత పరామర్శ యాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం షర్మిల కొహెడ మండలం ధర్మసాగర్లో శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీనివాస్ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని షర్మిల హామీ ఇచ్చారు. మహానేత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన కుటుంబాలకు అండగా ఉంటానంటూ నల్లకాల్వ వద్ద వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఆ కుటుంబ ప్రతినిధిగా షర్మిల పరామర్శ యాత్ర కొనసాగిస్తున్న విషయం విదితమే. -
వెంకటలక్ష్మీ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
వెంకటలక్ష్మీ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
కరీంనగర్(సుల్తానాబాద్): సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామానికి చెందిన కుంభం వెంకటలక్ష్మీ కుటుంబాన్ని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కుటుంబానికి అండగా ఉంటారని సమస్యలు ఉంటే తమకు ఫోన్‌ద్వారా వివరించాలని సూచించారు. వైఎస్ షర్మిల వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నల్లసూర్యప్రకాశ్, బోయినిపల్లి శ్రీనివాస్‌రావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు వేణుమాధవరావులతో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పరామర్శ యాత్రలో పాల్గొన్నారు. -
వైఎస్ ఆశయాలను కొనసాగిద్దాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/వరంగల్: ‘‘దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కలిపి పేదల కు 46 లక్షల ఇళ్లను కట్టిస్తే దివంగత మహానేత రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఒక్క మన రాష్ట్రంలోనే 46 లక్షల పక్కా ఇళ్లను కట్టి చూపించారు. ఆయన బతికుంటే ఈ రోజు ప్రతి పేదవాడికీ ఇల్లుండేది. ప్రతి ఎకరాకూ నీళ్లొచ్చేవి. ప్రతీ విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ పొందేవాడు..’’ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు. వైఎస్ లేకపోయినా ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందని చెప్పారు. అందుకోసం అందరం చేయి చేయి కలిపి మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంగళవారం వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కాటారంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోతే దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా కొన్ని వందల గుండెలు ఆగిపోయాయి. ఒక నాయకుడు లేకపోతే వందల గుండెలు ఎందుకు ఆగిపోయాయి? అంతమంది ఎందుకు అభిమానిస్తారు? ఎందుకంటే.. ప్రజల గుండెల్లో బాధను తన బాధగా మార్చుకున్న వ్యక్తి రాజశేఖరరెడ్డి గారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసిన నాయకుడాయన. పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపించిన మహా నాయకుడు. తన చేతనైనంత మేరకు ప్రతి ఒక్కరికీ మేలు చేసిన నేత. వైఎస్ చనిపోయి ఆరేళ్లవుతున్నా ఈ రోజు వరకు కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు..’’ అని షర్మిల అన్నారు. వరంగల్‌లో 73 కుటుంబాలకు పరామర్శ వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శయాత్ర ముగిసింది. మూడు దశల్లో 12 రోజులపాటు జిల్లాలో యాత్ర కొనసాగింది. మొత్తం 73 కుటుంబాలను పరామర్శించారు. చివరి రోజు మంగళవారం భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో 11 కుటుంబాలను పరామర్శించా రు. ములుగు నియోజకవర్గం వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ఎండీ ఫహీముద్దీన్ కుటుంబాన్ని, బావుసింగ్‌పల్లిలోని ఆజ్మీరా గోపానాయక్ కుటుంబాన్ని ఓదార్చారు. భూ పాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంలోని కోటగిరి రవీందర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఇదే మండలంలోని ధర్మారావుపేటలోని గంపల లక్ష్మీ కుటుంబానికి భరోసా కల్పించారు. చివరగా భూపాలపల్లి మండలం జంగేడులోని గట్టు నల్లపోశాలు కుటుంబాన్ని పరామర్శించారు. నూటొక్క దీపాలతో స్వాగతం.. షర్మిల పరామర్శ యూత్ర మంగళవారం వరంగల్ జిల్లాలో ముగిసి కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించింది. కాటారం మండలం మేడిపల్లి వద్ద పార్టీ జిల్లా ఇన్చార్జి నల్లా సూర్యప్రకాష్, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సెగ్గెం రాజేష్ ఆధ్వర్యంలో షర్మిలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి మహాముత్తారం మండలంలోని బోర్లగూడెం వెళ్లిన షర్మిల... వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన అసోదుల రాములు కుటుంబాన్ని పరామర్శించారు. దాదాపు అరగంటకుపైగా వారితో గడిపి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఏ కష్టమొచ్చినా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. అనంతరం కాటారం వచ్చిన షర్మిలకు వైఎస్ అభిమానులు, పార్టీ శ్రేణులు నూటొక్క దీపాలతో స్వాగతం పలికారు. జిల్లాలో షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర తొలిరోజు 82 కిలోమీటర్లు సాగింది. రెండు జిల్లాల్లో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పరామర్శ యాత్రలో పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాసరావు, నాయకులు వెంకటరెడ్డి, సొల్లు అజయ్‌వర్మ, ఎం.రాజమ్మ, మైనారిటీ, సేవాదళ్, విద్యార్థి విభాగం, ప్రోగ్రాం కమిటీ అధ్యక్షులు సలీం, సుధాకర్, దేవరనేని వేణుమాధవరావు, పారుపల్లి వేణుమాధవరావు, అప్పం కిషన్, కాయిత రాజ్‌కుమార్ యాదవ్, సంగాల ఇరికియం, రవితేజారెడ్డి, సుమిత్‌గుప్తా, ఎల్లాల సంతోష్‌రెడ్డి, కె.శంకర్, మతిన్ముజదాది, ఎం.విలియం, ఎన్.శాంతికుమార్, ఆరె లింగారెడ్డి పాల్గొన్నారు. -
వరంగల్ జిల్లాలో ముగిసిన పరామర్శ యాత్ర
-
వైఎస్ఆర్కు మరణం లేదు: వైఎస్ షర్మిల
కరీంనగర్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి మరణం లేదని, తెలుగు జాతి ఉన్నంతవరకూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని ఆయన కుమార్తె వైఎస్ షర్మిల అన్నారు. పరామర్శ యాత్రలో భాగంగా ఆమె మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. కాటారం మండలం గారేపల్లి చౌరస్తాలో వైఎస్ షర్మిల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల బాధను తన బాధగా భావించి ప్రతి ఒక్కరికీ మేలు చేయడం వల్లే రాజశేఖరరెడ్డి...రాజన్న అయ్యారని ఆమె పేర్కొన్నారు. కాగా కాటారం మండలంలోని మారుమూల గ్రామం బోర్లగూడెంలో వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన అసోదుల రామయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. రాత్రి ఆమె కాటారంలోనే బస చేస్తారు. -
వరంగల్ జిల్లాలో ముగిసిన పరామర్శ యాత్ర
వరంగల్ : వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర మంగళవారం ముగిసింది. జిల్లాలో మూడు విడతల్లో 73 కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఇవాళ ఉదయం వైఎస్ షర్మిల... పాలంపేటలో ఫహీముద్దీన్, ఘణపురంలో కోటగిరి రవీందర్, ధర్మారావుపేటలో గంపల లక్ష్మీ కుటుంబ సభ్యులు పరామర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో ప్రారంభం: వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర మంగళవారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించింది. నేటి సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారు జిల్లాలో మొత్తం 30మంది ఉండగా, తొలివిడత పరామర్శ యాత్రలో 12 కుటుంబాలను పరామర్శించనున్నారు. తొలిదశ పరామర్శ యాత్రలో మంథని, పెద్దపల్లి, ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, చొప్పదండి నియోజకవర్గాల మీదుగా మొత్తం 371 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తారు. కాగా వరంగల్ జిల్లాలో యాత్ర ముగించుకుని కరీంనగర్ జిల్లాకు ప్రవేశించిన ఆమెకు వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు,అభిమానులు మేడిపల్లి వద్ద ఘన స్వాగతం పలికారు. -
మంచి రోజులు మళ్లీ వస్తాయి
-
మంచి రోజులు మళ్లీ వస్తాయి
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘‘అంతా మంచే జరుగుతుంది. మీరు ఇక నుంచి మా కుటుంబమే. ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నాం. మంచి రోజులు మళ్లీ వస్తాయి...’’ అని వరంగల్ జిల్లాలో వైఎస్సార్ మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు షర్మిల భరోసా కల్పించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన చివరి దశ పరామర్శ యాత్ర సోమవారం మొదలైంది. ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరిన షర్మిల భువనగిరి, ఆలేరు, జనగామ, వరంగల్, ములుగు మీదుగా మధ్యాహ్నం ఒంటి గంటకు మంగపేట మండలం బండారిగూడెం చేరుకున్నారు. షర్మిలకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు కొండా రాఘవరెడ్డి, బీష్వ రవీందర్, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మొదటి రోజు ములుగు నియోజకవర్గంలోని ఆరు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. పూర్తిగా అటవీ ప్రాంతంలో సాగిన యాత్రలో షర్మిలను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు రహదారులపైకి వచ్చారు. అడుగడుగునా ఆత్మీయతతో ఆదరించారు. యాత్ర సాగిందిలా.. తొలుత ములుగు నియోజకవర్గం మంగపేట మండలం బండారిగూడెంలోని దోమగండి ముత్తయ్య ఇంటికి షర్మిల వెళ్లారు. ముత్తయ్య భార్య దోమగండి నర్సమ్మను పరామర్శించారు. అక్కడ్నుంచి ఇదే మండలం రాజుపేటలోని దుబ్బ ముత్తయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దుబ్బ ముత్తయ్య భార్య కృష్ణకుమారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం ఏటూరునాగారంలోని వలస చిన్నక్క ఇంటికి చేరుకున్నారు. ‘ధైర్యంగా ఉండండి.. మీకు అండగా ఉంటా..’ అంటూ చిన్నక్క కుమారుడు కృష్ణమూర్తికి భరోసా కల్పించారు. అనంతరం గోవిందరావుపేట మండలం దుంపెల్లిగూడంలోని దేవిరెడ్డి రాంచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అక్కడ్నుంచి చల్వాయిలోని మేడిపల్లి అమ్మాయమ్మ ఇంటికి వెళ్లి.. ఆమె కోడలు రాంబాయమ్మను పరామర్శించారు. చివరగా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్‌లోని బేతి వెంకట్‌రెడ్డికి ఇంటికి వెళ్లి వారి కుటుంబీకులతో మాట్లాడారు. మంగళవారం ములుగు, భూపాలపల్లి నియోజకవర్గంలోని ఐదు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. దీంతో వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర ముగియనుంది. వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నే తృత్వంలో జరిగిన పరామర్శ యాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మునిగాల విలియం, నాడెం శాంతికుమార్, ఆరె లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద దిక్కును కోల్పోయాం.. వైఎస్సార్ మృతితో తమ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయినట్లే అయ్యిందని పలువురు షర్మిలతో వాపోయారు. ‘‘మీ నాయన మా కోసం ఎంతో చేశారు. అప్పుడే పింఛన్లు ఇచ్చుడు షురూ జేసిండ్లు. ఆరోగ్యశ్రీ, 108 సర్వీసు, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ... ఎన్నో చేసిండ్లు. వైఎస్ పోయాక అలా లేదు. ఇప్పుడు రుణమాఫీ అంతా అయోమయంగా ఉన్నది’’ అని మంగపేట మండలం రాజుపేటలోని దుబ్బ ముత్తయ్య బంధువులు చెప్పారు. ‘‘వైఎస్ ఉంటే మాకు భరోసా ఉండేది. ఇంత దూరం మా కోసం వచ్చావా అమ్మా... మీరు చల్లగా ఉండాలి’ అని ఏటూరు నాగారానికి చెందిన వలస చిన్నక్క కుటుంబ సభ్యులు షర్మిలతో అన్నారు. మొదటి రోజు షర్మిల ఆరు కుటుంబాలను పరామర్శించారు. మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల మీదుగా యాత్ర సాగింది. 108 కిలోమీటర్ల యాత్రలో దారిపొడవునా షర్మిలకు ప్రజలు అభివాదం చేస్తూ ఘన స్వాగతం పలికారు. డిమాండ్ల సాధన కోసం నిరసన దీక్షలు చేస్తున్న ఆశా వర్కర్లు మంగపేట, ఏటూరు నాగారంలో షర్మిలను కలిసి తమ కోసం పోరాడాలని కోరారు. తమ పార్టీ అండగా ఉంటుందని షర్మిల వారితో అన్నారు. ములుగును జిల్లా కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని అఖిలపక్ష నేతలు షర్మిలకు, వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. మూతపడిన బిల్ట్ కాగితం గుజ్జు పరిశ్రమను తెరిపించేందుకు సహకరించాలని ఆ పరిశ్రమ కార్మికులు కమలాపురంలో షర్మిలను కోరారు. -
అండగా ఉంటాం, అధైర్యపడొద్దు: వైఎస్ షర్మిల
వరంగల్ : వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల చివరి విడత పరామర్శ యాత్ర కొనసాగుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు సోమవారం నుంచి జిల్లాలో చివరిదశ పరామర్శ చేపట్టారు. 11 కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. ఈ రోజు ఉదయం లోటస్ పాండ్ నుంచి మంగపేట మండలం బండారిగూడెం చేరుకున్న షర్మిల... ఆ గ్రామంలోని దోమగండి ముత్తయ్య కుటుంబీకులను పరామర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణ వార్తను తట్టుకోలేక ముత్తయ్య ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. అనంతరం అదే మండలం రాజుపేటలోని దుబ్బ ముత్తయ్య కుటుంబాన్ని, గోవిందరావుపేట మండలం దుంపెల్లి గూడెంలో దేవిరెడ్డి రాంచంద్రారెడ్డి కుటుంబాన్ని, చల్వాయిలోని మేడిపల్లి అమ్మయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అధైర్య పడవద్దని... మీరంతా మా కుటుంబమే అని వారికి ధైర్యం చెప్పారు. కష్టాల్లో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చివరిగా బుస్సాపూర్ లోని బేతి వెంకట్ రెడ్డి కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శిస్తారు. కాగా తొలిదశలో 32 కుటుంబాలను, రెండోదశలో మరో 30 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం సాయంత్రం భూపాలపల్లి మీదగా ఈ యాత్ర కరీంనగర్లో ప్రవేశిస్తుంది. -
నేటినుంచి షర్మిల పరామర్శ
నేడు, రేపు వరంగల్‌లో చివరి దశ అనంతరం కరీంనగర్ జిల్లాలోకి.. మొత్తం 23 కుటుంబాలకు పరామర్శ సాక్షి ప్రతినిధి, వరంగల్/కరీంనగర్/హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమ, మంగళవారాల్లో వరంగల్ జిల్లాలో చివరి విడత పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. మహానేత మరణాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలోనే ఎక్కువ మంది చనిపోయారు. మృతుల కుటుం బాలకు అండగా ఉంటానంటూ కర్నూలు జిల్లా నల్లకాల్వ వద్ద వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు ఆ కుటుంబ ప్రతినిధిగా షర్మిల వరంగల్ జిల్లాలో ఆగస్టు 24-28 మధ్య 32 కుటుంబాలను, సెప్టెం బర్ 7-11 మధ్య 30 కుటుంబాలను పరామర్శించారు. సోమవారం నుంచి చివరి దశలో ములుగు, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 11 కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం మంగళవారం సాయంత్రం యాత్ర కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. వైఎస్ మృతిని తట్టుకోలేక జిల్లాలో 30 మంది మరణించారు. తొలి దశలో 12 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. యాత్ర ఇలా...: సోమవారం ఉదయం 8.30కు హైదరాబాద్ లోటస్‌పాండ్ నుంచి షర్మిల పరామర్శ యాత్రకు బయల్దేరతారు. వరంగల్ జిల్లా మంగపేట మండలం బండారిగూడెంలో దోమగండి ముత్తయ్య, రాజుపేటలో దుబ్బ ముత్తయ్య కుటుంబాలను పరామర్శిస్తారు. తర్వాత ఏటూరునాగారంలో వలస చిన్నక్క, గోవిందరావుపేట మండలం దుంపెల్లిగూడెంలో దేవిరెడ్డి రాంచంద్రారెడ్డి, చల్వాయిలో మేడపల్లి అమ్మాయమ్మ, బుస్సాపూర్‌లో బేతి వెంకట్‌రెడ్డి కుటుంబాలను ఓదారుస్తారు. మంగళవారం మరో ఐదు కుటుంబాలను పరామర్శించిన అనంతరం వరంగల్ జిల్లాలో యూత్ర ముగించుకుని సాయంత్రం కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశిస్తారు. కాటారం మండలం బొర్లగూడెంలో ఎ. రామయ్య కుటుంబాన్ని పరామర్శించి రాత్రి కాటారంలో బస చేస్తారు. బుధవారం ఆరు కుటుంబాలను పరామర్శించి రాత్రి ధర్మారంలో బసచేస్తారు. 24న గురువారం మరో ఐదు కుటుంబాలను పరామర్శించి రాత్రి హైదరాబాద్ పయనమవుతారు. జిల్లాలోని మంథని, పెద్దపల్లి, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో 371 కి.మీ. మేర యూత్ర జరగనుంది. -
వైఎస్ షర్మిలను కలిసిన అఖిలపక్ష నేతలు
వరంగల్ : వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ కొనసాగుతోంది. బుధవారం ఉదయం గూడూరు నుంచి ఆమె యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా షర్మిల ఐదు కుటుంబాలను పరామర్శించనున్నారు. ముందుగా నెక్కొండ మండలం వెంకటాపురానికి చేరుకుంటారు. అక్కడ సూరం ఐలయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం దీక్షకుంట్లలో చేతం చంద్రయ్య, కొమ్ముల మల్లమ్మ కుటుంబాన్ని, అక్కడ నుంచి చెన్నారావుపేట మండలం జీజీఆర్పల్లికి చేరుకుని బూస నర్సయ్య కుటుంబానికి భరోసా కల్పిస్తారు. చివరగా మూలుగు నియోజకవర్గం కొత్తగూడ మండలం ఓటాయితండలోని బానోత్ మంగళి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ క్రమంలో 144 కిలోమీటర్ల దూరం మేరకు యాత్ర సాగుతుంది. మరోవైపు గూడూరులో పరామర్శ యాత్రలో ఉన్న వైఎస్ షర్మిలను అఖిలపక్ష నేతలు కలిశారు. మహబూబాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా కొత్త జిల్లా ఏర్పాటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని వైఎస్ షర్మిల ప్రకటించారు. అఖిలపక్ష నేతలకు సంఘీభావం తెలిపారు. -
ముగిసిన షర్మిల పరామర్శ యాత్ర
రంగారెడ్డి:దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను ఓదార్చడానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల జిల్లాలో చేపట్టిన పరామర్శయాత్ర ముగిసింది. చివరిరోజు పరామర్శయాత్రలో భాగంగా గురువారం మధ్యాహ్నం మోమినపేటకు చేరుకున్న షర్మిల.. తొలుత అరిగె యాదయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం ఎల్కతలలోని ఆలంపల్లి వెంకటేశ్ కుటుంబాన్నిషర్మిల పరామర్శించారు. నాలుగు రోజుల పాటు 590 కిలోమీటర్ల మేర షర్మిల పరామర్శయాత్ర సాగింది. ఏడు నియోజకవర్గాల్లో 15 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. గత నెల 29 వ తేదీన వైఎస్ షర్మిల జిల్లాలో మలివిడత పరామర్శయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. -
నాలుగోరోజుకు చేరిన వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
-
యాదయ్య కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
రంగారెడ్డి: పరామర్శయాత్రలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల గురువారం అరిగె యాదయ్య కుటుంబాన్నిపరామర్శించారు. నాల్గో రోజు పరామర్శయాత్రలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం మోమినపేటకు చేరుకున్న షర్మిల.. తొలుత అరిగె దయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం ఎల్కతలలోని ఆలంపల్లి వెంకటేశ్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల గత నెల 29 వ తేదీన మలివిడత పరామర్శయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. -
మీ భవిష్యత్తుకు నాది భరోసా!
► వైఎస్ మరణం తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలతో షర్మిల ► ఇంటికి పెద్దదిక్కు లేకుంటే ఎంత ఆవేదన ఉంటుందో నాకు తెలుసు ► ఏ కష్టమొచ్చినా ఫోన్ చేయండి.. ఆదుకుంటాం ► బాధలో ఉన్నవారికి బాసటగా నిలవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది ► ర ంగారెడ్డి జిల్లాలో రెండోరోజు కొనసాగిన పరామర్శ యాత్ర సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ఇంటికి పెద్ద దిక్కు లేకపోతే ఎంత ఆవేదన ఉంటుందో నాకు తెలుసు.. పిల్లల భవిష్యత్తు కోసం గుండె నిబ్బరం చేసుకోండి.. ఏ కష్టమొచ్చినా నాకు ఫోన్ చేయండి..’ అంటూ వైఎస్ మరణం తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల భరోసా ఇచ్చారు. ‘బాధ్యత ఒకరిచ్చేది కాదు.. తమకు తామే తీసుకోవాలి.. బాధలో ఉన్న కుటుంబానికి బాసటగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని అన్నారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక రంగారెడ్డి జిల్లాలో ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్న షర్మిల మంగళవారం రెండోరోజు కండ్లకోయ, మేడ్చల్, కేశవరం, ల క్ష్మాపూర్, మూడు చింతలపల్లిలో 5 కుటుంబాలను కలిశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమ కుటుంబీకులు చనిపోయిన సంఘటనను గుర్తుచేసుకుని విలపించడంతో షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. ‘వైఎస్సార్ మరణంతో నా కొడుకు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు..’ అని కేశవపురంలో వెంకటేశ్ తండ్రి యాదయ్య కన్నీరుమున్నీరవడం చూసి షర్మిల చలించిపోయారు. ‘పెద్దయ్యా.. ధైర్యంగా ఉండు.. వైఎస్ కుటుంబం మీకు అండగా ఉంటుంది’ అంటూ కళ్లు చెమర్చారు. ఏ సహాయం కావాల్సినా ఫోన్ చేయాలని ఓదార్చారు. ఉద్వేగ క్షణాలు.. ఆత్మీయ పలకరింపులు.. పరామర్శ యాత్రలో భాగంగా తొలుత కండ్లకోయ గ్రామానికి వెళ్లిన షర్మిల.. సాయిబాబాగౌడ్ కుటుంబాన్ని కలుసుకున్నారు. కుటుంబ పెద్ద ఆకాల మరణంతో ముగ్గురు ఆడపిల్లలను సాకలేకపోతున్నానని, చనిపోవడానికి కూడా ప్రయత్నించానని సాయిబాబా గౌడ్ భార్య అరుణజ్యోతి చెప్పడంతో షర్మిల ఉద్వేగానికి గురయ్యారు. ‘పిల్లలను బాగా చదివించు. ఉద్యోగాలు వస్తాయి. జీవితంలో స్థిరపడితే అన్నీ సమస్యలు తొలిగిపోతాయి’ అని ఆమెకు గుండె ధైర్యం చెప్పారు. పిల్లల ఉన్నత చ దువులకు ఆసరాగా నిలుస్తామని చెప్పారు. అనంతరం లక్ష్మాపూర్‌లో నూతనకంటి మహేశ్ కుటుంబాన్ని కలిసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తండ్రి పక్షవాతం బారిన పడి చనిపోయాడంటూ విలపించిన మహేశ్ తల్లి సావిత్రిని అక్కునచేర్చుకున్నారు. ‘ప్రస్తుతం ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయింది. 108 సర్వీసులు నిలిచిపోయాయి. నాన్నగారు ప్రవేశపెట్టిన అన్ని పథకాలకు కోత పెట్టారు’ అని లక్ష్మాపూర్ సర్పంచ్ శ్యామల..షర్మిల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మేడ్చల్ ఇందిరానగర్ కాలనీలో వైఎస్ ఆకస్మిక మరణానికి తట్టుకోలేక మరణించిన కొల్తూరి ముత్యాలు కుటుంబాన్ని షర్మిల ఓదార్చారు. భర్త మరణంతో తామంతా అనాథలుగా మారమంటూ కన్నీరు పెట్టుకున్న ముత్యాలు భార్య యాదమ్మకు ధైర్యం చెప్పారు. తన విజిటింగ్ కార్డు ఇచ్చి ఎలాంటి సమస్యలు ఉన్నా ఫోన్ చేయాలని సూచించారు. తర్వాత మూడు చింతలపల్లిలో జామ కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ప్రతి కుటుంబానికి మేమున్నాం: పొంగులే టి వైఎస్ మరణంతో చనిపోయినవారి ప్రతి కుటుంబానికీ ఆసరాగా ఉంటామని వైఎస్సార్ సీపీ తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. వైఎస్ మరణించి ఆరేళ్లయినా.. అభిమానం చెక్కుచెదరలేదంటే ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణమన్నారు. షర్మిల వెంట పార్టీ ప్రధాన కార్యద ర్శులు శివకుమార్, ఎడ్మ కిష్టారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, గాదె నిరంజన్‌రెడ్డి, మతిన్ ముజాద్ అలీ, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు భీష్వ రవీందర్, సయ్యద్ ముజతబా అహ్మద్, జార్జ్ హెర్బత్, ప్రఫుల్లారెడ్డి, ఎం.జయరాజ్, సందీప్‌కుమార్, రామ్మోహన్, శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కుసుమ కుమార్‌రెడ్డి, బి.రఘురామరెడ్డి, సామ యాదిరెడ్డి, జి.రాంభూపాల్‌రెడ్డి, అమృతాసాగర్, సూర్యనారాయణ రెడ్డి, భగవంతరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కె.వెంకట్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు బంగి లక్ష్మణ్, నేతలు మేరీ, షర్మిల సంపత్, బ్రహ్మానందరెడ్డి, సుభాన్‌గౌడ్, విజయ్‌కుమార్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు. -
సాయిబాబాగౌడ్ కుటుంబానికి షర్మిల పరామర్శ
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల మంగళవారం మేడ్చల్‌లో సాయిబాబాగౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారికి తాము అండగా ఉంటామని సాయిబాబాగౌడ్ కుటుంబ సభ్యులకు షర్మిల భరోసా ఇచ్చారు. పరామర్శ యాత్రలో భాగంగా రెండో రోజు మంగళవారం కండ్లకోయ, కేసారం, మాడుచింతలపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల్లోని వైఎస్ మృతిని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించనున్నారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె షర్మిల తెలంగాణలో పరామర్శయాత్ర చేపట్టిన విషయం విదితమే. అందులోభాగంగా సోమవారం షర్మిల రంగారెడ్డి జిల్లాలో పరామర్శయాత్ర ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో షర్మిల నాలుగు రోజుల పాటు పరామర్శ చేయనున్నారు. -
తొలిరోజు ముగిసిన వైఎస్ షర్మిల పరామర్శయాత్ర
-
అంజయ్య కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
జిల్లాలో ముగిసిన వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
-
వీరయ్య కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
శ్రీనివాస్ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
'షర్మిల పరామర్శ యాత్ర వాయిదా'
నల్లగొండ: దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకలేక గుండె ఆగి మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి చేపట్టిన షర్మిల పరామర్శ యాత్ర వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నల్లగొండ జిల్లాలో కొనసాగించాల్సిన షర్మిల పరామర్శయాత్ర తాత్కాలికంగా వాయిదా పడినట్లు వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. -
18 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
-
18 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
హైదరాబాద్: ఈ నెల 18 నుంచి నల్లగొండ జిల్లాలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాలమరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబ సభ్యులను షర్మిల ఓదారుస్తారు. పరామర్శ షెడ్యూల్ ను తెలంగాణ వైఎస్సార్సీపీ నేతలు శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవ రెడ్డి తెలియజేశారు. 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు ఆమె పరామర్శయాత్ర కొనసాగుతుందని తెలిపారు. భువనగిరి నియోజక వర్గం నుంచి ప్రారంభమై ఆలేరు, తుంగతుర్తి, నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ నియోజక వర్గాల్లో ఆమె పరామర్శ యాత్ర కొనసాగుతుందని అన్నారు. అంతేకాకుండా బుధవారం ప్రారంభించాల్సిన తెలంగాణ వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఈ నెల 15 వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. -
నల్గొండలో ఏడోవ రోజు షర్మిల పరామర్శ యాత్ర
-
ముగిసిన షర్మిలమ్మ పరామర్శ యాత్ర
నల్గొండ(సుర్యాపేట): దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఆగిన పేద హృదయాలను ఓదార్చి సాంత్వన చేకూర్చలనే సంకల్పంతో ప్రారంభించిన పరామార్శ యాత్ర మొదటి షెడ్యూల్ ముగిసింది. గత వారం రోజులుగా నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న షర్మిలమ్మ పరామర్శ యాత్రను మంగళవారం ముగించారు. దేవరకొండ నియోజకవర్గం నుంచి ప్రారంభమైన యాత్ర ఆరు నియోజకవర్గాల మీదుగా సాగి సూర్యాపేటలో ముగిసింది. యాత్రలో చివరి రోజు సందర్భంగా వైఎస్ తనయ మూడు కుంటుంబాల ను పరామర్శించి వారి స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా నల్గొండలోని ముప్పై కుటుంబాలను పరామర్శించిన జగన్ సోదరి మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. షర్మిలమ్మ వెళ్లిన ప్రతిచోట ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు. ముఖ్యంగా వృద్ధులు వైఎస్ తనయను చూడడానికి ఆసక్తి కనబరిచారు. -
నేటితో ముగిసిన షర్మిల తొలిదశ పరామర్శ యాత్ర
నల్గొండ: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల జిల్లాలో చేపట్టిన తొలిదశ పరామర్శయాత్ర మంగళవారంతో ముగిసింది. ఏడురోజుల పాటు జిల్లాలో పర్యటించిన ఆమెకు వైఎస్సార్ అభిమానులు బ్రహ్మరధం పట్టారు. వైఎస్సార్ ఆకస్మిక మృతిని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించడానికి షర్మిల యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల ఆరు నియోజకవర్గాల్లో 30 కుటుంబాలను పరామర్శించారు. షర్మిల పరామర్శ యాత్రపై బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. -
నల్గొండలో 6వ రోజు షర్మిల పరామర్శ యాత్ర
నల్గొండ: నల్గొండ జిల్లాలో వైఎస్సార్ సీపీ నాయకురాలు వైఎస్ షర్మిల ఆరో రోజు సోమవారం పరామర్శ యాత్ర చేపడుతున్నారు. ఆత్మకూరు మండలం సోంపేటలో నర్రాలచ్చయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ఆ కుటుంబాన్ని ఓదార్చారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. -
కోదాడ.. కదిలొచ్చే..
కోదాడ నియోజకవర్గంలోని ఆరు కుటుంబాలకు పరామర్శ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చిన వైఎస్ తనయ తొగర్రాయి, కోదాడ, ఆచార్యులగూడెం, గణపవరం, వెంకట్రాంపురంలలో పర్యటన నియోజకవర్గంలో ప్రజలనుంచి మంచి స్పందన {పతి గ్రామంలోనూ షర్మిల కోసం ప్రజల ఎదురుచూపులు కోదాడలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల పలు చోట్ల వైఎస్సార్ విగ్రహాలకు నివాళి సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల ఐదోరోజు ఆదివారం కోదాడ నియోజకవర్గంలోని ఆరు కుటుంబాలను పరామర్శించారు. తొగర్రాయి, కోదాడ, ఆచార్యులగూడెం, గణపవరం, వెంకట్రాంపురంలలో వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఆమె కలుసుకున్నారు. వారి ఇళ్లకు వెళ్లి ఆయా కుటుంబాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తన తండ్రి కోసం చనిపోయిన వారి కుటుంబాలకు తమ కుటుంబం అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. చిన్నపిల్లలతో ముచ్చటించి వారిని బాగా చదువుకోవాలని సూచించారు. పెద్దవాళ్లను పలకరించిన షర్మిల అందరూ ధైర్యంగా ఉండాలని, అందరికీ దేవుడు మేలు చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. షర్మిల యాత్ర సందర్భంగా కోదాడ నియోజకవర్గ ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. కోదాడ పట్టణంతో పాటు చిలుకూరు, బేతవోలు, ఆచార్యులగూడెం, బరాఖత్‌గూడెం, గణపవరంలలో ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. తన యాత్ర సందర్భంగా షర్మిల పలుచోట్ల వైఎస్ విగ్రహాలకు నివాళులర్పించారు. కోదాడ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఆమె పూలమాల వేశారు. ఐదోరోజు యాత్ర సాగిందిలా... పరామర్శయాత్రలో భాగంగా ఆదివారం ఉదయం షర్మిల కోదాలోని సీసీరెడ్డి విద్యానిలయం నుంచి బయలుదేరి నేరుగా మండలంలోని తొగర్రాయి గ్రామానికి వెళ్లారు. అక్కడ మందా ప్రసాద్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. మందా ప్రసాద్ భార్య జయమ్మ తన కుటుంబ పరిస్థితులను షర్మిలకు వివరించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పిన షర్మిల అక్కడి నుంచి మళ్లీ కోదాడ వచ్చారు. కోదాడ ప్రమీల టవర్స్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత నాగార్జునసెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తెలంగాణ తల్లికి నమస్కరించి నేరుగా సురభి శ్రీనివాస్ కుటుంబం వద్దకు వెళ్లారు. అక్కడ శ్రీనివాస్ తల్లి అచ్చమ్మ, భార్య విజయ కుమారి, కూతురు రమ్యలు వారి పరిస్థితులు షర్మిల దృష్టికి తీసుకువెళ్లారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన షర్మిల అక్కడ అవని అనే చిన్నారికి అక్షరాభ్యాసం చేశారు. ఆ తర్వాత వల్లంశెట్ల రాంప్రసాద్ కుటుంబం వద్దకు వెళ్లారు. అక్కడ రాంప్రసాద్ భార్య విజయలక్ష్మి, తల్లి సుగుణమ్మలు షర్మిలతో మాట్లాడారు. అక్కడి నుంచి ఆమె సీసీరెడ్డి స్కూల్లో భోజనం చేసుకుని నేరుగా చిలుకూరు మండలం ఆచార్యులగూడెం వెళ్లారు. మార్గమధ్యంలో చిలుకూరు, బేతవోలు గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఆచార్యులగూడెంలో అలవాల ముత్తయ్య కుటుంబం వద్దకు వెళ్లి వారిని ఓదార్చారు. ముత్తయ్య భార్య నాగలక్ష్మి షర్మిలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తన ఆవేదనను షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. ముత్తయ్య కుమారుడు భాస్కర్, కుమార్తె శ్రీలతలతో మాట్లాడిన షర్మిల వారిని బాగా చదువుకోవాలని సూచించారు. అక్కడి నుంచి మునగాల మండలం గణపవరం గ్రామానికి వెళ్లారు. అక్కడ సారెడ్డి జితేందర్‌రెడ్డి (శ్రీనివాసరెడ్డి) కుటుంబాన్ని ఆమె కలుసుకున్నారు. భార్య భాగ్యలక్ష్మి, పిల్లలు తేజశ్రీ, సుజాత, తల్లిదండ్రులు సైదమ్మ, కోటిరెడ్డిలతో మాట్లాడారు. వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పిన షర్మిల అక్కడి నుంచి బయలుదేరి వెంకట్రాపురం వెళ్లి మునుకుంట్ల గురవయ్య కుటుంబాన్ని కలుసుకున్నారు. ఆ తర్వాత అదే మండలంలోని వెంకట్రాంపురం గ్రామంలో మునుకుంట్ల గురవయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అక్కడ గురవయ్య కొడుకు లింగయ్య, కోడలు భవాని, మనుమరాలు ప్రియాంకలు తమ కుటుంబ పరిస్థితిని వివరించారు. వారికి షర్మిల ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు గురవయ్య మనుమరాలు రాధ, వేణుగోపాల్ దంపతుల కుమార్తెకు షర్మిల ‘హర్ష’ అని నామకరణం చేశారు. అక్కడే అన్నప్రాసన కూడా చేశారు. అడుగడుగునా బ్రహ్మరథం కోదాడ నియోజకవర్గ ప్రజలు షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. ఉదయం కోదాడ పట్టణంతో పాటు మండలంలోని తొగర్రాయిలలో ప్రజలు ఆమెకు స్వాగతం పలికారు. ఆ తర్వాత చిలుకూరు మండలంలో ప్రవేశించిన దగ్గర నుంచి గ్రామగ్రామాన ప్రజలు షర్మిల కోసం క్యూలు కట్టారు. గుంపులుగా నిలబడి ఆమెతో కరచాలనం చేసేందుకు, మాట్లాడేందుకు ప్రయత్నించారు. పరామర్శ మార్గమధ్యంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ ప్రజలను షర్మిలను చూసేందుకు రోడ్లపైకి వచ్చారు. ఇక మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్న సమయంలో అయితే ఆయా ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడారు. మొత్తంమీద కోదాడ నియోజకవర్గంలో ప్రజలు వైఎస్ కుటుంబంపై తమకున్న ప్రేమను చాటారు. కాగా, షర్మిల మార్గమధ్యలో ఉన్న కోదాడ, బాలాజీనగర్, చిలుకూరు, బేతవోలు, పోలేనిగూడెంలలో ఉన్న వైఎస్ విగ్రహాలకు నివాళులర్పించారు. అదే విధంగా కోదాడ పట్టణంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా పూలమాల వేశారు. కన్నీళ్లు పెట్టుకున్న షర్మిల గణపవరంలో సారెడ్డి జితేందర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తున్న సందర్భంగా షర్మిల కన్నీటి పర్యంతమయ్యారు. జితేందర్‌రెడ్డి తండ్రి కోటిరెడ్డి షర్మిలతో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన కళ్లనీళ్లు తుడిచిన షర్మిల తట్టుకోలేక తానూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు కోటిరెడ్డి తన భుజంపై ఉన్న టవల్‌తో షర్మిల కన్నీళ్లు తుడిచారు. జితేందర్‌రెడ్డి కుమార్తెను దగ్గరకు తీసుకున్న షర్మిల ఆమెను అక్కును చేర్చుకుని ఆశీర్వదించారు. ఉదయం తొగర్రాయిలో మంద ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆయన కోడలు... ‘మామయ్యా.. షర్మిలమ్మ వచ్చింది... ఎక్కడకు వెళ్లావయ్యా.’ అంటూ రోదించిన తీరు అందరినీ కన్నీళ్లు పెట్టించింది. సురభిశ్రీనివాస్ తల్లి, భార్య, కుమార్తె, రాంప్రసాద్ భార్య, తల్లి, ముత్తయ్య భార్య, జితేందర్‌రెడ్డి భార్య, ఇద్దరు కుమార్తెలు, తల్లిదండ్రులు షర్మిలను చూసి తట్టుకోలేక ఉద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఓదార్చిన షర్మిల కళ్ల నిండా నీళ్లు నింపుకుని వారికి ధైర్యం చెప్పారు. షర్మిల వెంట తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ యెర్నేని వెంకటరత్నంబాబు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు గున్నం నాగిరెడ్డి, శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్, అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, ఆకుల మూర్తి, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్ణారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముస్తాబ్ అహ్మద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మెండెం జయరాజ్, కార్యదర్శి షర్మిలా సంపత్, సహాయ కార్యదర్శి ఇరుగు సునీల్, మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి, ఖమ్మం జిల్లా నాయకుడు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మధిర ఎంపీపీ వేమిరెడ్డి కృష్ణారెడ్డి, యువజన విభాగం నాయకుడు నరేందర్‌రెడ్డి, కోదాడ నియోజకవర్గ నేతలు తుమ్మలపల్లి భాస్కర్, పెంట్యాల పాపారావు, కర్ల సుందర్‌బాబు, అహ్మద్ అలీ, కన్నె కొండలరావు, లైటింగ్ ప్రసాద్, ఎస్తేర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పచ్చిపాల వేణు యాదవ్ తదితరులున్నారు. -
కోదాడలో షర్మిల పరామర్శ యాత్ర
నల్గొండ: వైఎస్సార్ సీపీ నేత వైఎస్ షర్మిల ఈ రోజు నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గంలో పరామర్శయాత్ర కొనసాగించనున్నారు. తొలుత ఆమె కోదాడ మండలం తొగర్రాయిలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన రాంప్రసాద్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం కోదాడకు చెందిన సురభి శ్రీనివాస్, వల్లంశెట్టి రాంప్రసాద్ కుటుంబాన్ని, చిల్కూరు మండలం ఆచార్యగూడెంలో అల్వాల ముత్తయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. తరువాత మునగాల మండలం గణపవరానికి చెందిన సారెడ్డి శ్రీనివాస రెడ్డి కుటుంబాన్ని, వెంకటరామాపురానికి చెందిన మరుకుంట్ల గురవయ్య కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు -
రైతును రాజును చేసిన ఘనత వైఎస్‌దే: వైఎస్ షర్మిల
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదవాడిని తన భుజాన మోసి, రైతును రాజును చేశాడు కాబట్టే ఆయన కోట్లాది మంది తెలుగు గుండెల్లో రాజన్నగా కొలువుదీరాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదర షర్మిల అన్నారు. నల్లగొండ జిల్లాలో నాలుగోరోజు శనివారం పరామర్శయాత్రలో భాగంగా షర్మిల హుజూర్నగర్ నియోజక వర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి షర్మిల మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓ నాయకుడి గురించి వందలాది గుండెలు ఆగిపోయిన చరిత్ర ఎప్పుడూ లేదని, అది ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి విషయంలోనే జరిగిందని అన్నారు. రైతులు, రైతు కూలీలకు అండగా నిలబడ్డ వైఎస్ వారి కోసం ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారని చెప్పారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలతో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుని లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని, లక్షలాది మంది పేదలు తలెత్తుకుని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నారని, కుయ్...కుయ్...కుయ్ అంటూ వచ్చిన 108 వాహనం లక్షలాది మందికి ప్రాణం పోసిందని చెప్పారు. ఏ పన్ను, చార్జీలు పెంచకుండానే అన్ని పథకాలను అద్భుతంగా అమలుచేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ నిలిచిపోయారని ఆమె అన్నారు. వైఎస్ ఆశయాలను మనమే ముందుకు తీసుకెళ్లాలని, ఆయన పథకాలను మనమే కొనసాగించుకోవాలని, అందుకే రాజన్న రాజ్యం కోసం అందరం చేయి చేయి కలపాలని షర్మిల ప్రజలను కోరారు. షర్మిల వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు ఎడ్మ కిష్టారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి తదితరులున్నారు. నాలుగోరోజు ఐదు కుటుంబాలకు పరామర్శ పరామర్శయాత్రలో భాగంగా షర్మిల నాలుగోరోజు ఐదు కుటుంబాలను పరామర్శించారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి వారి కుటుంబసభ్యులను కలుసుకున్నారు. అందరినీ పలకరించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా నేరేడుచర్ల మండలంలోని దిర్శించర్లలో తురక లింగయ్య కుటుంబాన్ని, ఆ తర్వాత గరిడేపల్లి మండలం కాల్వపల్లిలో వెంకటగిరి జయమ్మ, హుజూర్నగర్ పట్టణంలోని సుందరయ్య నగర్లో లింగంపాండు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం భోజన విరామం తర్వాత మేళ్లచెర్వు మండల కేంద్రంలోని చల్లాపూర్ణయ్య కుటుంబం వద్దకు వెళ్లారు. అక్కడ పూర్ణయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి అదే మండలంలోని కందిబండ గ్రామంలో పేరుపంగు లింగయ్య కుటుంబాన్ని పరామర్శించడంతో నాలుగోరోజు యాత్ర ముగిసింది. వైఎస్ విగ్రహావిష్కరణ హుజూర్నగర్ నియోజకవర్గంలో గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం బస్టాండ్ సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షర్మిల గ్రామస్తులనుద్దేశించి మాట్లాడుతూ..ఇన్నేళ్లయినా నాన్నను గుర్తుపెట్టుకుని విగ్రహాన్ని ఏర్పాటుచేసిన ప్రజలకు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. -
'వైఎస్ షర్మిల రాక ధైర్యానిచ్చింది'
నల్గొండ : నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర కొనసాగుతోంది. శనివారం ఉదయం ఆమె తన పరామర్శ యాత్రను హుజూర్నగర్ నియోజవర్గం నుంచి ప్రారంభించారు. దిర్శినచెర్లలో వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తట్టుకోలేక ప్రాణాలు విడిచిన తుర్క లింగయ్య కుటుంబ సభ్యులను వైఎస్ షర్మిల పరామర్శించారు. లింగయ్య చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చారు. కాగా షర్మిల రాక తమకెంతో ధైర్యాన్ని ఇచ్చిందని తుర్క లింగయ్య కుటుంబ సభ్యులు తెలిపారు. ఏ కష్టమొచ్చినా.. మేమున్నామని గుర్తుపెట్టుకోమంటూ రాజన్న బిడ్డ భరసో ఇవ్వడం ఊరట కలిగించిందంటున్నారు. -
మురిసిన మిర్యాల
⇒ నియోజకవర్గంలోని నాలుగు కుటుంబాలకు పరామర్శ ⇒ మూడోరోజు ప్రేమానురాగాల మధ్య సాగిన షర్మిల యాత్ర ⇒ నందిపాడు, సల్కునూరు, సీతారాంపురం, ఆలగడపలలో పర్యటన ⇒ ఆప్యాయతతో పలకరించిన షర్మిలను చూసి ఆనందబాష్పాలు ⇒ వైఎస్ పాలనను గుర్తు తెచ్చుకున్న మృతుల కుటుంబ సభ్యులు తెలుగింటి ఆడబిడ్డ... ఆల‘గడప’ తొక్కగా... సల్కునూరు ప్రజలు..సాదర స్వాగతం పలకగా... మిర్యాల మురిసిపోయింది... సీతారాంపురం...జనపురమైంది... నందిపాడు...ఆనందతాండవం చేసింది... రాజన్నబిడ్డకు మూడో రోజూ మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా ఆదరాభిమానాలు చూపారు. పరామర్శయాత్రలో భాగంగా షర్మిల శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని నాలుగు కుటుంబాలను ఓదార్చారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో నిర్వహిస్తున్న పరామర్శయాత్రలో భాగంగా షర్మిల మూడోరోజు శుక్రవారం మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని నంది పాడు క్యాంపు, సల్కునూరు, మిర్యాలగూడ, ఆలగడపలలో నాలుగు కుటుంబాలను సందర్శించారు. ఆయా కుటుంబాలకు చెందిన సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. షర్మిల రాకతో ఆ కుటుంబాలు ఉద్వేగానికి లోనయ్యాయి. ఎంతో ఆప్యాయంగా తమను పలకరించిన వైఎస్ తనయను చూసి ఆనంద భాష్పాలు రాల్చాయి. వైఎస్ లాంటి నాయకుడు రాడని, భవిష్యత్తులో రాలేడని చెప్పిన వారు తండ్రి లాంటి నాయకుడిలా జగనన్నను తీర్చిదిద్దాలని దేవుడిని వేడుకుంటున్నట్టు షర్మిలకు చెప్పారు. షర్మిల కూడా పరామర్శకు వెళ్లిన కుటుంబాల సభ్యులతో ఎంతో ప్రేమగా ఉన్నారు. వారిని ఆప్యాయంగా పేరుపేరునా పలకరించారు. వారు తనపై ఉన్న అభిమానంతో చేసి పెట్టిన పాయసం, స్వీట్లు తిని, కుటుంబసభ్యులకు తినిపించారు. మొత్తంమీద మూడోరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో షర్మిల యాత్ర ప్రేమానురాగాల మధ్య సాగింది. మూడో రోజు యాత్ర సాగిందిలా... పరామర్శ యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు బయలుదేరిన షర్మిల ముందుగా నందిపాడు క్యాంపులోని పేరం దుర్గమ్మ కుటుంబాన్ని సందర్శించారు. దుర్గమ్మ కుటుంబ సభ్యులు బొట్టు పెట్టి వైఎస్ తనయను తమ ఇంట్లోకి ఆహ్వానించారు. తమ కుటుంబ పరిస్థితులను దుర్గమ్మ కోడలు జ్యోతి, కూతుళ్లు సంజాత, సైదమ్మ, జ్యోతిలు షర్మిలకు వివరించారు. వారి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న షర్మిల వారి కుటుంబానికి ధైర్యం చెప్పి వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా వేములపల్లి మండలం సల్కునూరు గ్రామానికి వెళ్లి అక్కడ రేఖ ఇద్దయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఇద్దయ్య కుటుంబసభ్యులు షర్మిలకు మంగళహారతులు పట్టి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇద్దమ్మ కోడలు జానకమ్మ తమ కుటుంబ పరిస్థితిని షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పిన షర్మిల అక్కడి నుంచి శెట్టిపాలెం గ్రామానికి వెళ్లారు. అక్కడ భోజనం పూర్తి చేసుకుని మార్గమధ్యంలో గ్రామంలోనే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం చిన్నమసీదు వెనుక ఉన్న అక్కిమళ్ల సుందర్ కుటుంబం వద్దకు వెళ్లారు. అక్కడ సుందర్ భార్య కృష్ణవేణి, కూతురు పద్మలు తమ కుటుంబ పరిస్థితిని షర్మిలకు వివరించారు. కనీసం తనకు ఉండడానికి ఇల్లు కూడా లేదని, తాను ఒంటరిగా ఉంటున్నానని రోదిస్తూ చెప్పిన కృష్ణవేణిని చూసి షర్మిల చలించి కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడ వారి కుటుంబానికి భరోసా చెప్పి షర్మిల నేరుగా ఆలగడప గ్రామానికి వెళ్లి అక్కడ కొప్పోజు సావిత్రమ్మ కుటుం బాన్ని పరామర్శించారు. సావిత్రమ్మ ఇద్దరు కుమార్తెలు షర్మిలతో మాట్లాడారు. ఆలగడప వెళ్లిన సందర్భంగా షర్మిలకు స్థానికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. గ్రామస్తులంతా షర్మిలను చూసేందుకు కదలివచ్చారు. అక్కడ మూడోరోజు యాత్ర ముగించుకున్న షర్మిల నేరేడుచర్ల మండలంలోని సిటీసెంట్రల్ స్కూల్లో రాత్రిబస చేశారు. దేవుడు నాలాంటి వాళ్లను తీసుకెళ్లినా బాగుండేది... పరామర్శలో భాగంగా షర్మిల ఆయా కుటుంబాల వద్దకు వెళ్లినప్పుడు వారి కుటుంబ సభ్యుల ఆనందాలకు అవధులు ఉండడం లేదు. ఆనందం.. ఆవేదన... ఉద్వేగం కలగలిపిన ఆనంద భాష్పాలతో ఆమెతో తమ కష్టసుఖాలను పంచుకున్నారు. పేరం దుర్గమ్మ కుటుంబం వద్దకు వెళ్లినప్పుడు ఆమె కోడలు జ్యోతి మాట్లాడుతూ ‘వైఎస్సార్ ఉంటే మాకు ఈ రేకుల ఇల్లు ఉండేది కాదు. ఎక్కడ నిద్రపోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇళ్లంతా పుచ్చిపోయి ఉంది. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్న ఇల్లు ఇవ్వలేదు. వర్షం వస్తే ఇళ్లంతా సరవలు పెట్టాలి, దుప్పట్లు కూడా తడిసిపోతున్నాయి. మా అక్కలాగా మాతో మాట్లాడుతున్నావు. ఐదేండ్లయినా ఎవరూ వచ్చి పలకరించలేదు. మీరు అండ దండగా ఉంటారని మా ఆశ. వైఎస్ మా అన్నయ్య అని నా తోబుట్టువు మా అత్తయ్య ఎప్పుడు చెపుతుండేది. వైఎస్ చనిపోయిన రోజు మా అత్త చాలా బాధపడింది. దేవుడు నాలాంటి వాళ్లను తీసుకెళ్లిన బాగుండేది. అంతటి మంచి పాలన చేసే వైఎస్‌ను తీసుకెళ్లాడని ఏడ్చింది.’ అని చెప్పింది. దుర్గమ్మ కోడలు సైదమ్మ మాట్లాడుతూ ‘వైఎస్ ఉన్నప్పుడు 20 మంది ఉంటే అందరికి పింఛన్లు వచ్చాయి. పింఛన్లు రూ.200కు పెంచిన ఘనత వైఎస్‌దే. ఆ నాయకుడు భవిష్యత్తులో మళ్లీ రాడు. ఆయనలాగా ప్రజలను, పేదలను ఆదుకునేవాడు కరువయ్యాడు, ఆయనలాగా జగనన్నను తీర్చిదిద్దాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.’ అని చెప్పారు. పావలా వడ్డీ వస్తుందా తల్లీ..! అక్కడే ఉన్న మహిళలనుద్దేశించి షర్మిల ‘ఎవరైనా డ్వాక్రాగ్రూపుల్లో ఉన్నారా... ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందా.’ అని ప్రశ్నించగా చెల్లించడం లేదని అక్కడి మహిళలు చెప్పారు. వైఎస్ ఉన్నప్పుడులా వడ్డీ పథకం కింద రూపాయి కడితే ముప్పావలా తిరిగి ఇచ్చేవారని, ఇప్పుడు ఎలాంటి సాయమూ అందడం లేదని చెప్పారు. సల్కునూరులో ఇద్దయ్య కుటుంబాన్ని సందర్శించినప్పుడు కూడా షర్మిల పలు ప్రశ్నలు వేసి ప్రజల స్థితిగతులను తెలుసుకున్నారు. ‘ వ్యవసాయం ఎట్లుంది? పంట ఎందుకు పండడం లేదు? బోర్లున్నాయా? నీళ్లులేవా? పొలానికి ఏడుగంటల ఉచిత విద్యుత్ వస్తోందా?’ అని ఆమె ఆరాతీయడం గమనార్హం. షర్మిల వెంట పరామర్శయాత్రలో వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముస్తఫా అహ్మద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు షర్మిలా సంపత్, గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్ కుమార్, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, నాగార్జున సాగర్, మునుగోడు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ఎం.డి.సలీం, మల్లు రవీందర్‌రెడ్డి, ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పచ్చిపాల వేణుయాదవ్ తదితరులున్నారు. -
మీ ప్రేమను ఎన్నటికీ మర్చిపోలేం..
షర్మిల పరామర్శయాత్రలో వెల్లువెత్తిన అభిమానం వైఎస్ కుటుంబంపై ప్రేమను చాటుకుంటున్న మృతుల కుటుంబాలు తమ ఇంటికి స్వయంగా వచ్చి పరామర్శించడంతో ఉద్వేగం వారి ఆవేదన విని షర్మిల కంటతడి అడుగడుగునా వైఎస్ జగన్ సోదరికి ఆత్మీయ ఆదరణ నల్లగొండ జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పరామర్శ యాత్ర ‘ఇన్నాళ్ల తర్వాత కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుని వచ్చావా తల్లీ.. మా గుండెల్లో మీ నాన్న (వైఎస్) ఉన్నాడు. మీరు మా కుటుంబంపై చూపిస్తున్న ప్రేమను మేమెన్నటికీ మర్చిపోలేం..’.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పరామర్శయాత్రలో అడుగడుగునా వెల్లువెత్తుతున్న అభిమానమిది. తమ బాధలు పంచుకుని, కష్టాల్లో ఓదార్చడానికి వచ్చిన షర్మిలను చూసిన ఉద్వేగమిది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు నల్లగొండ జిల్లాలో షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర మూడోరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో సాగింది. ఈ నియోజకవర్గ పరిధిలో నాలుగు కుటుంబాలను ఆమె శుక్రవారం పరామర్శిం చారు. కుటుంబంలో ఒక్కొక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ.. కష్టసుఖాలను తెలుసుకున్నారు. షర్మిల తమ ఇంటికి రావడంతో వారంతా ఉద్వేగానికి లోనయ్యారు. షర్మిల ఒక్కో కుటుంబంతో అరగంటకు పైగా గడిపి, వారి బాగోగులను, సమస్యలను తెలుసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబ సభ్యుల ఆవేదనను విని చలించి కంటతడి పెట్టారు. వారందరికీ తమ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మూడో రోజు నాలుగు కుటుంబాలు మూడో రోజు యాత్రలో తొలుత నందిపాడు క్యాంపులోని పేరం దుర్గమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అక్కడ దుర్గమ్మ కోడలు జ్యోతి షర్మిలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. దుర్గమ్మ కుటుంబ సభ్యుల పరిస్థితిని అడిగి తెలుసుకున్న షర్మిల.. వారికి ధైర్యాన్ని చెప్పి వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామానికి వెళ్లారు. అక్కడ రేఖ ఇద్దమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. సల్కునూరులో స్థానికులు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం షర్మిల శెట్టిపాలెం గ్రామంలో భోజనం చేసి.. అక్కడే ఉన్న వైఎస్ విగ్రహానికి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి మిర్యాలగూడ వెళ్లి సీతారాంపురంలో అక్కిమళ్ల సుందర్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. సుందర్ భార్య కృష్ణవేణి కన్నీటి మధ్య తన కుటుంబ స్థితిగతులను షర్మిలకు వివరించారు. ఆమె ఆవేదనను చూసిన షర్మిల కూడా చలించిపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామానికి చేరుకుని కొప్పోజు సావిత్రమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ఇక్కడ ఆమెకు జనం పెద్దఎత్తున స్వాగతం పలికారు. సావిత్రమ్మ కుటుంబానికి ధైర్యం చెప్పిన షర్మిల మూడోరోజు యాత్రను ముగించారు. షర్మిల వెంట వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముస్తఫా అహ్మద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, రాష్ట్ర నాయకులు షర్మిలా సంపత్, గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్ కుమార్, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, నాగార్జునసాగర్, మునుగోడు నియోజకవర్గాల ఇన్చార్జులు ఎండీ సలీం, మల్లు రవీందర్‌రెడ్డి, ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి తదితరులున్నారు. ఒడిలో చేరిన చిన్నారులు.. నందిపాడు క్యాంపులో పేరం దుర్గమ్మ కుటుంబాన్ని సందర్శించినపుడు దుర్గమ్మ మనువరాళ్లు, మనవడిని కాసేపు షర్మిల ప్రేమతో లాలించారు. వారిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడుతూ ముచ్చట్లు చెప్పించారు. దుర్గమ్మ మనుమరాలు లక్ష్మీ దుర్గాభవాని అయితే షర్మిల చేతిలో చేతులేసి ఊగుతూ చిటిపొట్టి పలుకులతో ముచ్చటించింది. ఆ తర్వాత ఇంట్లో తయారుచేసిన పాయసాన్ని షర్మిలకు తినిపించాలని తీసుకువచ్చింది. వెంటనే షర్మిల ఆ చిన్నారికి తొలుత పాయసం తినిపించి, ఆ తర్వాత తాను కూడా తిన్నారు. దుర్గమ్మ మనవడు విశ్వనాథ్ అయితే ఎగిరి గంతేసి షర్మిల ఒడిలోకి వచ్చాడు. ఒడిలో కూర్చునే మా అమ్మమ్మ చనిపోయిందంటూ ఏడ్చాడు. ఇన్నాళ్లూ పలకరించిన వాళ్లే లేరమ్మా.. మిర్యాలగూడలోని సీతారాంపురం లో అక్కిమళ్ల సుందర్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించినప్పుడు సుందర్ భార్య కృష్ణవేణి కన్నీటి పర్యంతమయ్యారు. భర్త మరణించిన తర్వాత కనీసం తనను పలకరించేవారు లేరని, ఇన్నాళ్లకు కూడా గుర్తుపెట్టుకుని తన వద్దకు వచ్చినందుకు సంతోషంగా ఉందని షర్మిలతో చెప్పారు. తన ఇల్లు, కుమార్తె ఆరోగ్య పరిస్థితి, తన కష్టాల గురించి చెప్పుకొంటూ కన్నీటి పర్యంతమైన కృష్ణవేణిని, ఆమె కుమార్తె పద్మ ఆవేదనను చూసి చలించిపోయిన షర్మిల కూడా కంటతడి పెట్టారు. -
నల్లగొండ జిల్లాలో పరామర్శయాత్ర మూడోవ రోజు
-
ధనమ్మ పరిస్థితిపై చలించిపోయిన వైఎస్ షర్మిల
నాగార్జునసాగర్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను ఆయన తనయ వైఎస్ షర్మిల పరామర్శిస్తున్నారు. నల్గొండ జిల్లాలో రెండోరోజు పరామర్శయాత్రలో భాగంగా గురువారం మధ్యాహ్నం నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారంలో మైల రాములు కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. గుండె జబ్బుతో బాధపడుతున్న రాములు భార్య ధనమ్మ పరిస్థితిని చూసి షర్మిల చలించిపోయారు. ధనమ్మను వెంటనే హైదరాబాద్‌కు తీసుకురావాలని ఆమె కుటుంబ సభ్యులకు సూచించారు. రాములు కొడుకు చదువుకు అవసరమైన సాయం అందిస్తామని హామీయిచ్చారు. అంతకుముందు వెంకట నర్సయ్య, బోడయ్య నాయక్ కుటుంబాలను వైఎస్ షర్మిల ఈ ఉదయం కలుసుకుని, పరామర్శించారు. -
బోడయ్య నాయక్ కుటుంబానికి పరామర్శ
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తున్నారు. నల్గొండ జిల్లాలో రెండోరోజు పరామర్శయాత్రలో భాగంగా...నాగార్జునసాగర్ నియోజకవర్గం గరికేనాటి తండాలోని బోడయ్యనాయక్ ఇంటికి ఆమె గురువారం వెళ్లారు . ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి...ఆ కుటుంబం స్థితిగతులను తెలుసుకున్నారు. అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. అంతకు ముందు వెంకట నర్సయ్య కుటుంబ సభ్యుల్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. -
బోడయ్యనాయక్ కుటుంబానికి షర్మిల పరామర్శ
-
కంటతడి పెట్టిన వైఎస్ షర్మిల
నాగార్జున సాగర్ : వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కామిశెట్టి వెంకటనర్సయ్య కుటుంబాన్ని వైఎస్ షర్మిల గురువారం పరామర్శించారు. ఈరోజు ఉదయం వైఎస్ షర్మిల నాగార్జున సాగర్ హిల్‌కాలనీలోని వెంకట నర్సయ్య నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకటనర్సయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉద్వేగానికి గురైన ఆమె కంటతడి పెట్టారు. కాగా వెంకటనర్సయ్యకు ఐదుగురు కుమార్తెలు. నాగార్జునసాగర్ డ్యాం కార్యాలయంలో అటెండర్‌గా పని చేసేవాడు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అతడిని ఎంతగాను ఆకట్టుకున్నాయి. దాంతో వెంకటనర్సయ్య వైఎస్ఆర్ను ఆరాధ్యదైవంగా కొలిచేవాడు. ఈ క్రమంలో వైఎస్ దుర్మరణం అతన్ని కుంగదీసింది. ప్రజానేత కానరాని లోకాలకు వెళ్లాడే అని మదనపడ్డాడు. దిగులుతో ఆ తర్వాత రోజున ఆఫీస్‌లో వైఎస్ సంతాపసభ జరుగుతుండగా... బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం మగదిక్కులేనిది అయింది. ఆ కుటుంబం వెంకటనర్సయ్య జ్ఞాపకాలతో కాలాన్నీ వెళ్లదీస్తూ వస్తోంది. -
రెండోరోజు వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
-
రెండోరోజు వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
నాగార్జున సాగర్ : నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర రెండోరోజుకు చేరింది. గురువారం ఉదయం ఆమె నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని వెంకట నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అంతకు ముందు సిద్దార్థ హోటల్ కూలీలతో వైఎస్ షర్మిల ఆత్మీయంగా మాట్లాడారు. కాగా పెద్దవూర, అనుముల, త్రిపురారం మండలాల్లో వైఎస్ షర్మిల నేడు పర్యటిస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో... కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబసభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇస్తారు. -
నాయక్ కుటుంబానికి షర్మిల పరామర్శ
దేవచర్ల: పరామర్శయాత్రలో భాగంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల బుధవారం సాయంత్రం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందపేట మండలం పరిధిలోని దేవచర్లతండా చేరుకున్నారు. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందిన హనుమానాయక్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటామని భరోసాయిచ్చారు. అంతకుముందు రాజన్న తనయ షర్మిలకు ఆత్మీయ స్వాగతం లభించింది. జగనన్న సోదరిని చూసేందుకు అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
'తెలుగుజాతి ఉన్నంత వరకు వైఎస్ఆర్ సజీవం'
కోట్లాది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణంతో వందలాది గుండెలు ఆగిపోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభించారు. దేవరకొండ రోడ్ షోలో షర్మిల మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర, ఉచిత విద్యుత్తు, రైతులకు రుణాలు, ఉపాధిహామి లాంటి ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదే అని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కన్నతండ్రిలా ప్రజలకు మంచిపాలన అందించారని కొనియాడారు. 'పేదరికం కారణంగా చదువులు ఆగిపోరాదని ఆకాంక్షించిన వైఎస్ఆర్, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంతో లక్షలాది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించారు. పేదవారికి జబ్బుచేస్తే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి లక్షలాది మందికి వైద్యం అందించారు. వైఎస్ఆర్ హయాంలో ధరలు పెరగలేదు' అని షర్మిల అన్నారు. రాజన్నకు మరణం లేదు.. తెలుగుజాతి ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో సజీవంగా వైఎస్ఆర్ ఉంటారని చెప్పారు. -
ఆడెపు బాలమ్మ కుటుంబానికి పరామర్శ
-
ఆడెపు బాలమ్మ కుటుంబానికి పరామర్శ
నల్గొండ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో గుండెపోటుతో మృతి చెందిన ఆడెపు బాలమ్మ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్రలో భాగంగా ఆమె బుధవారం దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మదనాపురంలో బాలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాలమ్మ భర్తతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో షర్మిల మాట్లాడారు. తాము ఉండేందుకు ఇల్లు కూడా లేదని, వైఎస్ ఉండి ఉంటే తమకు పక్కా ఇల్లు వచ్చి ఉండేదని తెలిపారు. బాలమ్మకు వైఎస్ఆర్ అంటే ఎంతో అభిమానం అని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. కాగా ఇచ్చిన మాట కోసం తండ్రి మరణవార్తతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన కుమార్తె వైఎస్ షర్మిల నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆనాడు వందల కిలోమీటర్లు నడిచిన వైఎస్ షర్మిల.... సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట కోసం ఇప్పుడు పరామర్శ యాత్ర చేస్తున్నారు. -
తండ్రికి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల
నల్గొండ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుమార్తె వైఎస్ షర్మిల ఘనంగా నివాళులు అర్పించారు. నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్రలో భాగంగా ఆమె బుధవారం మాల్ గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అంతకు ముందు వైఎస్ షర్మిలకు నల్గొండ జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాజన్న తనయని చూసేందుకు పోటీ పడ్డారు. -
పరామర్శ యాత్రకు బయల్దేరిన వైఎస్ షర్మిల
హైదరాబాద్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక మృతి చెందినవారి కుటుంబాలను ఓదార్చేందుకు ఆయన తనయ వైఎస్ షర్మిల బయల్దేరారు. బుధవారం ఉదయం ఆమె లోటస్ పాండ్ నుంచి పరామర్శయాత్రకు బయల్దేరారు. ఐదున్నర ఏళ్ల క్రితం నల్లకాల్వ సాక్షిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఓదార్పు ప్రకటనలో భాగంగా ఆయన సోదరి షర్మిల నేటి నుంచి నల్లొండ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వైఎస్ షర్మిల ముందుగా దేవరకొండ నియోజకవర్గంలోని మదనాపురంలో ఆడెపు బాలమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అటు నుంచి దేవరచర్ల తండా, గువ్వలగుట్ట ప్రాంతాల్లో పర్యటించి నాగార్జునసాగర్‌లో రాత్రి బస చేస్తారు. జిల్లాలోని 30 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. ఇదీ టూర్ షెడ్యూల్ 21న దేవరకొండ నియోజకవర్గంలో 3 కుటుంబాలకు పరామర్శ 22న తేదీన నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 3 కుటుంబాలకు పరామర్శ 23న తేదీన మిర్యాలగూడ నియోజకవర్గంలో 4 కుటుంబాలకు పరామర్శ 24న తేదీన హుజూర్నగర్ నియోజకవర్గంలో 5 కుటుంబాలకు పరామర్శ 25న తేదీన కోదాడ నియోజకవర్గంలో 6 కుటుంబాలకు పరామర్శ 26,27 తేదీల్లో సూర్యాపేట నియోజకవర్గంలోని 9 కుటుంబాలకు పరామర్శ -
షర్మిల పరామర్శయాత్రను జయప్రదం చేయాలి
హుజూర్నగర్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక జిల్లాలో మృతిచెందిన వైఎస్సార్ అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల ఈనెల 21న జిల్లాలో చేపడుతున్న పరామర్శయాత్రను జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఎర్నేని వెంకటరత్నంబాబు కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి, బడుగు, బలహీనవర్గాలకు లబ్ధిచేకూర్చాయన్నారు. ఆయన సంక్షేమ పథకాలవల్ల లబ్ధిపొంది, ఆయనపై మమకారం పెంచుకున్న లక్షలాదిమంది ప్రజలు వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేకపోయారన్నారు. ఆయన అభిమానులుగా ఉండి మృతిచెందిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్సార్ కుమార్తె షర్మిల పరామర్శయాత్ర చేపట్టిందన్నారు. ఈనెల 21న ప్రారంభమయ్యే పరామర్శయాత్ర దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో కొనసాగుతుందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ పరామర్శయాత్రకు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఆ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కోడి మల్లయ్యయాదవ్, పోతుల జ్ఞానయ్య, నాయకులు గుర్రం వెంకటరెడ్డి, కస్తాల ముత్తయ్య, మట్టారెడ్డి, పిచ్చిరెడ్డి, జడ రామకృష్ణ, సాముల ఆదినారాయణరెడ్డి, మందా వెంకటేశ్వర్లు, గండు శ్రీను, బత్తిని సత్యనారాయణ, గొట్టెముక్కల రాములు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ పథకాలకు అభిమానులే రక్షకులు:షర్మిల
మహబూబ్‌నగర్: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతి పేదవాడిని అభిమానించి, ప్రేమించి, గుండెలలో పెట్టుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. అందుకే పేదవాడి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఆయన అనేక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి ఆమె రెండవరోజు పరామర్శ యాత్ర ప్రారంభించారు. ప్రతి గ్రామంలోనూ ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. మన్ననూరులో ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి అమ్రాబాద్ చేరుకొని అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం అమ్రాబాద్, అచ్చంపేటలలో అశేష అభిమానులు ఉద్దేశించి ఆమె మాట్లాడారు. మహానేత వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ప్రతిపేదవాడికీ అందేలా పోరాడవలసిన బాధ్యత అయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, మనందరదీ అన్నారు. ప్రతిపేదవాడు గర్వంగా తలెత్తుకొని కార్పోరేట్ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం చేయించుకునేలా 'ఆరోగ్యశ్రీ' అనే అద్భుత పథకం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగిపోకూడదని 'ఫీజు రీయింబర్స్మెంట్' పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశం కల్పించారని చెప్పారు. ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో 'ఇందిరమ్మ ఇల్లు' పథకం ద్వారా 46లక్షల పక్కా ఇళ్లు నిర్మించారనన్నారు. అలాగే 104, 108, జలయజ్ఞం, ఉచిత విద్యుత్... వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అయిదేళ్లపాటు ఏ ఒక్క ఛార్జీ, పన్ను పెంచకుండా పాలన సాగించారని చెప్పారు. ఒక వ్యక్తి మరణిస్తే ఆ బాధ తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక కొన్ని వందల మంది మరణించడం ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడైనా చూశామా? అని ఆమె ప్రశ్నించారు. అది ఒక్క మహానేత విషయంలో జరిగిందన్నారు. ఆయన అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షానే ఉన్నారని, అందువల్లే అలా జరిగిందని తెలిపారు. అమ్రాబాద్‌లో వైఎస్ మరణ వార్తను జీర్ణించుకోలేక అమరుడైన పర్వతనేని రంగయ్య భార్య అనసూయను షర్మిల పరామర్శించారు. కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. ఆ తరువాత ఎత్తం గ్రామంలో నరసింహ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. తాము అండగా ఉంటామని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ యాత్రంలో షర్మిల వెంట పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు మామిడి శ్యాం సుందర రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బీస్వా రవీందర్, ఎడ్మ కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ** మరిన్ని చిత్రాలకు క్లిక్ చేయండి -
నేటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర
-
యాత్రను జయప్రదం చేయండి : ఎడ్మ కిష్టారెడ్డి
కల్వకుర్తి: సోమవారం నుంచి జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర ఆరంభమవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన కల్వకుర్తిలో విలేకరులతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మృతికి తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిలయాత్ర చేస్తున్నారని వివరించారు. జిల్లాలో ఐదురోజుల పాటు పది నియోజకవర్గాల్లో జరిగే ఈ యాత్రలో 21 మంది బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దివంగత రాజశేఖరరెడ్డి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేస్తారని తెలిపారు. యాత్రకు అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. ఉదయం 11గంటలకు.. ముందుగా మాడ్గుల మండలం కుర్మేడు గ్రామం మీదుగా కొత్త బ్రాహ్మణపల్లికి విచ్చే సి అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం రెడ్డిపురం గ్రామంలో జె.రాయపురెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. 12.30 గంటలకు ఆమనగల్లుకు చేరుకుని అంబేద్కర్, రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి కడ్తాలకు చేరుకుంటారని ఎడ్మ వెల్లడించారు. అక్కడి నుంచి సాయంత్రం 4.30 గంటలకు దేవుని పడకల్‌కు చేరుకుని మృతిచెందిన తుమ్మల నర్సింహా కుటుంబాన్ని, వెల్జాల గ్రామంలో మృతిచెందిన అంజనమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారని ఆయన పేర్కొన్నారు. అక్కడి నుంచి మిడ్జిల్ మండల కేంద్రం నుంచి కల్వకుర్తి పట్టణానికి సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేస్తారని చెప్పారు. మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు కల్వకుర్తి నుంచి అమ్రాబాద్‌కు చేరుకుంటారని తెలిపారు. ఆమె వెంట పార్టీ తెలంగాణ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులే టి శ్రీనివాస్‌రెడ్డి, గట్టు రాంచంద్రరావు, శివకుమార్, జనక్‌ప్రసాద్, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, నల్లారి సూర్యప్రకాష్‌రావు, అబ్దుల్ రహమాన్, కొండ రాఘవరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు రానున్నారని తెలిపారు. పరామర్శయాత్రను ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయాలని ఎడ్మ కిష్టారెడ్డి కోరారు. -
నేటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర
* మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదురోజుల పాటు సాగనున్న యాత్ర * 13 నియోజకవర్గాల మీదుగా 921 కిలోమీటర్ల పర్యటన సాక్షి, హైదరాబాద్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి ‘పరామర్శ యాత్ర’కు శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో తొలి విడతలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 21 కుటుంబాలను షర్మిల పరామర్శించి, వారికి జగన్ అండగా ఉన్నారన్న భరోసా ఇవ్వనున్నారు. ఐదు రోజుల పాటు సాగే ఈ యాత్ర జిల్లాలోని 13 నియోజకవర్గాల మీదుగా 921 కిలోమీటర్ల మేర సాగనుంది. యాత్ర సాగుతుందిలా... సోమవారం ఉదయం 9 గంటలకు లోటస్‌పాండ్‌లోని నివాసంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం షర్మిల.. పరామర్శ యాత్ర ప్రారంభిస్తారు. హైదరాబాద్ నుంచి నేరుగా కల్వకుర్తి నియోజకవర్గానికి చేరుకుంటారు. బ్రాహ్మణపల్లి గ్రామంలో జిల్లా నాయకులు షర్మిలకు స్వాగతం పలుకుతారు. అనంతరం మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామ పరిధిలోని రెడ్డిపురంలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన జె.రాయపురెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడ్నుంచి తలకొండపల్లి మండలం దేవుని పడకల్ గ్రామంలో తుమ్మల నర్సింహ కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత అదే మండలంలోని వెల్జాలలో ఎస్.అంజమ్మ కుటుంబాన్ని పరామర్శించి కల్వకుర్తి చేరుకుంటారు. అక్కడ వైఎస్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరిస్తారు. రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో పరామర్శ యాత్ర కొనసాగిస్తారు. 12వ తేదీ వరకు జిల్లాలో పరామర్శ యాత్ర, వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాలు సాగుతాయి. 12న షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం మల్లాపూర్‌లో పరామర్శతో యాత్ర ముగుస్తుంది. పరామర్శ యాత్రతో పార్టీ పటిష్టం వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్ సాక్షి, బళ్లారి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో వైఎస్సార్ సీపీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్ తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి తెలంగాణలో చేపట్టనున్న పరామర్శ యూత్రతో అక్కడ పార్టీ పుంజుకుంటుందని ఆయన చెప్పారు. ఆమెరాక కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఆదివారం కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో ఎంపీ బి.శ్రీరాములును ఆయ న మర్యాదపూర్వకంగా కలుసుకున్న అనంతరం ‘సాక్షి’తో మాట్లాడారు. -
పాలమూరులో షర్మిల పర్యటన సాగేదిలా!
-
పరామర్శ యాత్రకు సర్వం సిద్ధం
రేపటి నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలో షర్మిల పర్యటన ‘సాక్షి’తో వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారిని పరామర్శించేందుకు పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపడుతున్న ‘పరామర్శ యాత్ర’కు సర్వం సిద్ధం చేసినట్లు వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా షర్మిల పరామర్శ యాత్రకు సంబంధించి ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ నెల 8 నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర చేపడుతున్నారన్నారు. ఆ జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుందన్నారు. 18 మంది మృతుల కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని వివరించారు. -
షర్మిల పరామర్శయాత్ర పెడ్యూల్ లో స్వల్ప మార్పులు
హైదరాబాద్: వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో చేపట్టనున్నపరామర్శ యాత్ర షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దివంగత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల జరప తలపెట్టిన యాత్ర డిసెంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా ఈనెల 8వ తేదీ సోమవారం ఉదయం లోటస్ పాండ్ నుంచి షర్మిల యాత్ర ఆరంభించనున్నారు. తొలుత కొత్త బ్రాహ్మణపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులు అర్పించిన అనంతరం పరామర్శ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. తొలిరోజు ఇర్విన్, దేవుని వడ్కల్, వెలిజాలలో మూడు కుటంబాలను షర్మిల పరామర్శిస్తారు. అనంతరం అదే రోజు సాయంత్రం కల్వకుర్తిలో మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరిస్తారు. తొమ్మిదవ తేదీ ఉదయం అమ్రాబాద్ లో ఓ కుటుంబాన్ని పరామర్శించి తరువాత అచ్చంపేటలో మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరిస్తారు. 10వ తేదీన పెంటవల్లి, చిట్యాల, రాణిపేట, నందిన్నెలో మూడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. ఆ రోజు రాత్రికి దయార్ లో ఆమె బస చేస్తారు. 11వ తేదీ ఉదయం జూరాల నుంచి పరామర్శయాత్ర ఆరంభం కానుంది. కొన్నూరు, కోసి, అమీన్ కుంట, ఇండావూర్ లో ఐదు రైతు కుటుంబాలను షర్మిల పరామర్శించి.. సాయంత్రం కొడంగల్ లో బస చేస్తారు. 12 వ తేదీ పెద ఎర్కిచర్ల, గుండ పాటవల్లి, నర్సప్ప గూడ, మలావూర్ లో నాలుగు కుటుంబాలను షర్మిల పరామర్శించడంతో మహబూబ్ నగర్ జిల్లా యాత్ర ముగియనుంది. ఆరోజు సాయంత్రం షాద్ నగర్ మీదుగా షర్మిల హైదరాబాద్ కు చేరుకుంటారు. -
ఈనెల 8నుంచి షర్మిల పరామర్శ యాత్ర
-
వైఎస్ షర్మిల మొదట విడత పర్యటన షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టనున్నపరామర్శ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. దివంగత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల జరప తలపెట్టిన యాత్ర డిసెంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా ఈనెల 8వ తేదీ సోమవారం ఉదయం లోటస్ పాండ్ నుంచి షర్మిల యాత్ర ఆరంభించనున్నారు. తొలుత బ్రాహ్మణపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులు అర్పించిన అనంతరం పరామర్శ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. తొలిరోజు ఇర్విన్, దేవుని వడ్కల్, వెలాలలో మూడు కుటంబాలను షర్మిల పరామర్శిస్తారు. అనంతరం 9వ తేదీ ఉదయం అమ్రాబాద్ లో ఓ కుటుంబాన్ని పరామర్శించిన తరువాత అచ్చంపేటలో మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ పిదప కౌలావూర్ లో రెండు కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. 10వ తేదీన పెంటవల్లి, చిట్యాల, రాణిపేట, నందిన్నెలో మూడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. ఆ రోజు రాత్రికి దయార్ లో ఆమె బస చేస్తారు. 11వ తేదీ ఉదయం జూరాల నుంచి పరామర్శయాత్ర ఆరంభం కానుంది. కొన్నూరు, కోసి, అమీన్ కుంట, ఇండావూర్ లో ఐదు రైతు కుటుంబాలను షర్మిల పరామర్శించి.. సాయంత్రం కౌడంగల్ లో బస చేస్తారు. 12 వ తేదీ పెద ఎర్కిచర, గుండ పాటవల్లి, నర్సప్ప గూడ, మలావూర్ లో నాలుగు కుటుంబాలను షర్మిల పరామర్శించడంతో మహబూబ్ నగర్ జిల్లా యాత్ర ముగియనుంది. ఆరోజు సాయంత్రం షాద్ నగర్ మీదుగా షర్మిల హైదరాబాద్ కు చేరుకుంటారు. -
'రైతు కుటుంబాలకూ షర్మిల పరామర్శ'
మహబూబ్‌నగర్: వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల 5 రోజుల పాటు మహబూబ్‌నగర్ జిల్లాలో పరామర్శ యాత్ర చేపట్టనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. ఈ నెల 8 నుంచి 12 వరకు 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర సాగుతుందని చెప్పారు. పరామర్శ యాత్ర పోస్టర్ ను మహబూబ్‌నగర్ లో సోమవారం కిష్టారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 921 కిలోమీటర్ల మేర షర్మిల యాత్ర చేయనున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కూడా షర్మిల పరామర్శిస్తారని చెప్పారు. కల్వకుర్తి నుంచి పరామర్శ యాత్ర ప్రారంభం కానుంది. -
8 నుంచి షర్మిల ‘తెలంగాణ’యాత్ర
-
8 నుంచి షర్మిల ‘తెలంగాణ’యాత్ర
* తెలంగాణ రాష్ట్ర వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి * కల్వకుర్తిలో ప్రారంభమయ్యే పరామర్శ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: దివంగత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పరామర్శించనున్నారు. డిసెంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి ఈ పరామర్శ యాత్ర ప్రారంభం కానుంది. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పర్యటించాక జడ్చర్ల-షాద్‌నగర్‌లో యాత్ర ముగియనుంది. ఈ మేరకు ఆది వారం లోటస్‌పాండ్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయం లో పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి... పరామర్శ యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్మ కిష్టారెడ్డి, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాష్, హెచ్ఏ రెహ్మాన్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 18 మంది కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని చెప్పారు. గతంలో జగన్ ఖమ్మంలో ఓదార్పు యాత్రను పూర్తి చేశారని, కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడిందన్నారు. ఇప్పుడు జగన్ సోదరి షర్మిల యాత్రను కొనసాగిస్తారన్నారు. వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయపద్రం చేయాలన్నారు. ఇది ఎన్నికలు, రాజకీయం కోసమో చేసే యాత్ర కాదని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. పార్టీ రాష్ట్ర నేతలు మామిడి శ్యాంసుం దర్‌రెడ్డి, బి.రవీందర్ రెడ్డి, శేఖర్ పంతులు, పి.నాగిరెడ్డి, గాదె నిరంజన్ రెడ్డి, భీంరెడ్డి సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.