కోదాడలో షర్మిల పరామర్శ యాత్ర
నల్గొండ: వైఎస్సార్ సీపీ నేత వైఎస్ షర్మిల ఈ రోజు నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గంలో పరామర్శయాత్ర కొనసాగించనున్నారు. తొలుత ఆమె కోదాడ మండలం తొగర్రాయిలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన రాంప్రసాద్ కుటుంబాన్ని పరామర్శిస్తారు.
అనంతరం కోదాడకు చెందిన సురభి శ్రీనివాస్, వల్లంశెట్టి రాంప్రసాద్ కుటుంబాన్ని, చిల్కూరు మండలం ఆచార్యగూడెంలో అల్వాల ముత్తయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. తరువాత మునగాల మండలం గణపవరానికి చెందిన సారెడ్డి శ్రీనివాస రెడ్డి కుటుంబాన్ని, వెంకటరామాపురానికి చెందిన మరుకుంట్ల గురవయ్య కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు