సాక్షి, కోదాడ : విజయవాడ కనదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తుండగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన కందారపు ప్రణయ్‌తేజ(20), ప్రవీణ్, దామోదర్, మధు నలుగురు స్నేహితులు. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం రాత్రి కారులో విజయవాడకు బయలుదేరారు.
మార్గమధ్యలో కోదాడలోని శ్రీరంగాపురం క్రాస్‌రోడ్ వద్దకు చేరుకోగానే విజయవాడ నుంచి పట్టణంలోకి ఒక్కసారిగా మలుపు తిరుగుతున్న బస్సును వీరి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురుకి తీవ్ర గాయాలయ్యా యి. సమాచారం అందుకున్న పోలీసులు ఘ టన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు వెనుక సీట్లో కూర్చున్న ప్రణయ్‌తేజ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. మిగిలిన ముగ్గురి పరి స్థితి కూడా విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
మృతదేహానికి కోదాడ ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రాజమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment