
పరామర్శ యాత్రకు సర్వం సిద్ధం
- రేపటి నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలో షర్మిల పర్యటన
- ‘సాక్షి’తో వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
- పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారిని పరామర్శించేందుకు పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపడుతున్న ‘పరామర్శ యాత్ర’కు సర్వం సిద్ధం చేసినట్లు వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
శనివారం ఆయన ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా షర్మిల పరామర్శ యాత్రకు సంబంధించి ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ నెల 8 నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర చేపడుతున్నారన్నారు. ఆ జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుందన్నారు. 18 మంది మృతుల కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని వివరించారు.