
ముగిసిన షర్మిలమ్మ పరామర్శ యాత్ర
నల్గొండ(సుర్యాపేట): దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఆగిన పేద హృదయాలను ఓదార్చి సాంత్వన చేకూర్చలనే సంకల్పంతో ప్రారంభించిన పరామార్శ యాత్ర మొదటి షెడ్యూల్ ముగిసింది. గత వారం రోజులుగా నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న షర్మిలమ్మ పరామర్శ యాత్రను మంగళవారం ముగించారు. దేవరకొండ నియోజకవర్గం నుంచి ప్రారంభమైన యాత్ర ఆరు నియోజకవర్గాల మీదుగా సాగి సూర్యాపేటలో ముగిసింది.
యాత్రలో చివరి రోజు సందర్భంగా వైఎస్ తనయ మూడు కుంటుంబాల ను పరామర్శించి వారి స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా నల్గొండలోని ముప్పై కుటుంబాలను పరామర్శించిన జగన్ సోదరి మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. షర్మిలమ్మ వెళ్లిన ప్రతిచోట ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు. ముఖ్యంగా వృద్ధులు వైఎస్ తనయను చూడడానికి ఆసక్తి కనబరిచారు.