
ధనమ్మ పరిస్థితిపై చలించిపోయిన వైఎస్ షర్మిల
నాగార్జునసాగర్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను ఆయన తనయ వైఎస్ షర్మిల పరామర్శిస్తున్నారు. నల్గొండ జిల్లాలో రెండోరోజు పరామర్శయాత్రలో భాగంగా గురువారం మధ్యాహ్నం నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారంలో మైల రాములు కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.
గుండె జబ్బుతో బాధపడుతున్న రాములు భార్య ధనమ్మ పరిస్థితిని చూసి షర్మిల చలించిపోయారు. ధనమ్మను వెంటనే హైదరాబాద్కు తీసుకురావాలని ఆమె కుటుంబ సభ్యులకు సూచించారు. రాములు కొడుకు చదువుకు అవసరమైన సాయం అందిస్తామని హామీయిచ్చారు. అంతకుముందు వెంకట నర్సయ్య, బోడయ్య నాయక్ కుటుంబాలను వైఎస్ షర్మిల ఈ ఉదయం కలుసుకుని, పరామర్శించారు.