
యాదయ్య కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
రంగారెడ్డి: పరామర్శయాత్రలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల గురువారం అరిగె యాదయ్య కుటుంబాన్నిపరామర్శించారు. నాల్గో రోజు పరామర్శయాత్రలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం మోమినపేటకు చేరుకున్న షర్మిల.. తొలుత అరిగె దయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం ఎల్కతలలోని ఆలంపల్లి వెంకటేశ్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల గత నెల 29 వ తేదీన మలివిడత పరామర్శయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.