వైఎస్ఆర్కు మరణం లేదు: వైఎస్ షర్మిల | YS rajashekar reddy is alive in every one's heart: ys sharmila | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్కు మరణం లేదు: వైఎస్ షర్మిల

Published Tue, Sep 22 2015 6:51 PM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

వైఎస్ఆర్కు మరణం లేదు: వైఎస్ షర్మిల - Sakshi

వైఎస్ఆర్కు మరణం లేదు: వైఎస్ షర్మిల

కరీంనగర్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి మరణం లేదని, తెలుగు జాతి ఉన్నంతవరకూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని ఆయన కుమార్తె వైఎస్ షర్మిల అన్నారు.  పరామర్శ యాత్రలో భాగంగా ఆమె మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. కాటారం మండలం గారేపల్లి చౌరస్తాలో వైఎస్ షర్మిల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రజల బాధను తన బాధగా భావించి ప్రతి ఒక్కరికీ మేలు చేయడం వల్లే రాజశేఖరరెడ్డి...రాజన్న అయ్యారని ఆమె పేర్కొన్నారు. కాగా కాటారం మండలంలోని మారుమూల గ్రామం బోర్లగూడెంలో వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన అసోదుల రామయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. రాత్రి ఆమె కాటారంలోనే బస చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement