కల్వకుర్తి: సోమవారం నుంచి జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర ఆరంభమవుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన కల్వకుర్తిలో విలేకరులతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మృతికి తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిలయాత్ర చేస్తున్నారని వివరించారు. జిల్లాలో ఐదురోజుల పాటు పది నియోజకవర్గాల్లో జరిగే ఈ యాత్రలో 21 మంది బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దివంగత రాజశేఖరరెడ్డి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేస్తారని తెలిపారు. యాత్రకు అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు.
ఉదయం 11గంటలకు..
ముందుగా మాడ్గుల మండలం కుర్మేడు గ్రామం మీదుగా కొత్త బ్రాహ్మణపల్లికి విచ్చే సి అక్కడ వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం రెడ్డిపురం గ్రామంలో జె.రాయపురెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. 12.30 గంటలకు ఆమనగల్లుకు చేరుకుని అంబేద్కర్, రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి కడ్తాలకు చేరుకుంటారని ఎడ్మ వెల్లడించారు. అక్కడి నుంచి సాయంత్రం 4.30 గంటలకు దేవుని పడకల్‌కు చేరుకుని మృతిచెందిన తుమ్మల నర్సింహా కుటుంబాన్ని, వెల్జాల గ్రామంలో మృతిచెందిన అంజనమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారని ఆయన పేర్కొన్నారు. అక్కడి నుంచి మిడ్జిల్ మండల కేంద్రం నుంచి కల్వకుర్తి పట్టణానికి సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేస్తారని చెప్పారు. మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు కల్వకుర్తి నుంచి అమ్రాబాద్‌కు చేరుకుంటారని తెలిపారు. ఆమె వెంట పార్టీ తెలంగాణ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులే టి శ్రీనివాస్‌రెడ్డి, గట్టు రాంచంద్రరావు, శివకుమార్, జనక్‌ప్రసాద్, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, నల్లారి సూర్యప్రకాష్‌రావు, అబ్దుల్ రహమాన్, కొండ రాఘవరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు రానున్నారని తెలిపారు. పరామర్శయాత్రను ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయాలని ఎడ్మ కిష్టారెడ్డి కోరారు.
యాత్రను జయప్రదం చేయండి : ఎడ్మ కిష్టారెడ్డి
Published Mon, Dec 8 2014 1:14 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement