
నేటితో ముగిసిన షర్మిల తొలిదశ పరామర్శ యాత్ర
నల్గొండ: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల జిల్లాలో చేపట్టిన తొలిదశ పరామర్శయాత్ర మంగళవారంతో ముగిసింది. ఏడురోజుల పాటు జిల్లాలో పర్యటించిన ఆమెకు వైఎస్సార్ అభిమానులు బ్రహ్మరధం పట్టారు. వైఎస్సార్ ఆకస్మిక మృతిని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించడానికి షర్మిల యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే షర్మిల ఆరు నియోజకవర్గాల్లో 30 కుటుంబాలను పరామర్శించారు. షర్మిల పరామర్శ యాత్రపై బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి.