వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర మంగళవారం ముగిసింది. జిల్లాలో మూడు విడతల్లో 73 కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఇవాళ ఉదయం వైఎస్ షర్మిల... పాలంపేటలో ఫహీముద్దీన్, ఘణపురంలో కోటగిరి రవీందర్, ధర్మారావుపేటలో గంపల లక్ష్మీ కుటుంబ సభ్యులు పరామర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో ప్రారంభం: వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర మంగళవారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించింది. నేటి సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారు జిల్లాలో మొత్తం 30మంది ఉండగా, తొలివిడత పరామర్శ యాత్రలో 12 కుటుంబాలను పరామర్శించనున్నారు.