
ఆడెపు బాలమ్మ కుటుంబానికి పరామర్శ
నల్గొండ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో గుండెపోటుతో మృతి చెందిన ఆడెపు బాలమ్మ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్రలో భాగంగా ఆమె బుధవారం దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మదనాపురంలో బాలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
బాలమ్మ భర్తతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో షర్మిల మాట్లాడారు. తాము ఉండేందుకు ఇల్లు కూడా లేదని, వైఎస్ ఉండి ఉంటే తమకు పక్కా ఇల్లు వచ్చి ఉండేదని తెలిపారు. బాలమ్మకు వైఎస్ఆర్ అంటే ఎంతో అభిమానం అని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు.
కాగా ఇచ్చిన మాట కోసం తండ్రి మరణవార్తతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన కుమార్తె వైఎస్ షర్మిల నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆనాడు వందల కిలోమీటర్లు నడిచిన వైఎస్ షర్మిల.... సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట కోసం ఇప్పుడు పరామర్శ యాత్ర చేస్తున్నారు.