
నాయక్ కుటుంబానికి షర్మిల పరామర్శ
దేవచర్ల: పరామర్శయాత్రలో భాగంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల బుధవారం సాయంత్రం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందపేట మండలం పరిధిలోని దేవచర్లతండా చేరుకున్నారు.
తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందిన హనుమానాయక్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటామని భరోసాయిచ్చారు. అంతకుముందు రాజన్న తనయ షర్మిలకు ఆత్మీయ స్వాగతం లభించింది. జగనన్న సోదరిని చూసేందుకు అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.