
తండ్రికి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల
నల్గొండ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుమార్తె వైఎస్ షర్మిల ఘనంగా నివాళులు అర్పించారు. నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్రలో భాగంగా ఆమె బుధవారం మాల్ గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అంతకు ముందు వైఎస్ షర్మిలకు నల్గొండ జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాజన్న తనయని చూసేందుకు పోటీ పడ్డారు.