దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల గురువారం నుంచి కరీంనగర్ జిల్లాలో చేపట్టిన రెండో విడత పరామర్శ యాత్ర కొనసాగుతుంది.
కరీంనగర్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల గురువారం నుంచి కరీంనగర్ జిల్లాలో చేపట్టిన రెండో విడత పరామర్శ యాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం షర్మిల కొహెడ మండలం ధర్మసాగర్లో శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీనివాస్ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని షర్మిల హామీ ఇచ్చారు.
మహానేత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన కుటుంబాలకు అండగా ఉంటానంటూ నల్లకాల్వ వద్ద వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఆ కుటుంబ ప్రతినిధిగా షర్మిల పరామర్శ యాత్ర కొనసాగిస్తున్న విషయం విదితమే.