
'షర్మిల పరామర్శ యాత్ర వాయిదా'
నల్లగొండ: దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకలేక గుండె ఆగి మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి చేపట్టిన షర్మిల పరామర్శ యాత్ర వాయిదా పడింది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నల్లగొండ జిల్లాలో కొనసాగించాల్సిన షర్మిల పరామర్శయాత్ర తాత్కాలికంగా వాయిదా పడినట్లు వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.