
బోడయ్య నాయక్ కుటుంబానికి పరామర్శ
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తున్నారు. నల్గొండ జిల్లాలో రెండోరోజు పరామర్శయాత్రలో భాగంగా...నాగార్జునసాగర్ నియోజకవర్గం గరికేనాటి తండాలోని బోడయ్యనాయక్ ఇంటికి ఆమె గురువారం వెళ్లారు . ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి...ఆ కుటుంబం స్థితిగతులను తెలుసుకున్నారు. అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. అంతకు ముందు వెంకట నర్సయ్య కుటుంబ సభ్యుల్ని వైఎస్ షర్మిల పరామర్శించారు.