
రెండోరోజు వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
నాగార్జున సాగర్ : నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర రెండోరోజుకు చేరింది. గురువారం ఉదయం ఆమె నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని వెంకట నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అంతకు ముందు సిద్దార్థ హోటల్ కూలీలతో వైఎస్ షర్మిల ఆత్మీయంగా మాట్లాడారు.
కాగా పెద్దవూర, అనుముల, త్రిపురారం మండలాల్లో వైఎస్ షర్మిల నేడు పర్యటిస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో... కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబసభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇస్తారు.