
ఏడు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల రెండో రోజు పరామర్శయాత్ర ముగిసింది. రెండో రోజు శుక్రవారం హుజురాబాద్, మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో ఏడు కుటుంబాలను ఆమె పరామర్శించారు. మొత్తం 131 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. షర్మిల వెంట ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తదితర నాయకులు ఉన్నారు. మరోవైపు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిలకు ప్రతిపల్లెలోనూ ఘన స్వాగతం లభించింది. రాజన్న బిడ్డను చూసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.