ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే జిల్లాల విభజన చేయాలని తెలంగాణ వైఎస్సార్సీపీ నేత శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికారాబాద్ను జిల్లా కేంద్రం చేయాలంటూ వివిధ పార్టీల నేతలను ఆదివారం అఖిలపక్ష నేతలు కలిశారు. అందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు.