గవర్నర్తో సీపీ మహేందర్ రెడ్డి భేటీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్తో సీపీ మహేందర్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పాతబస్తీలో జరిగిన గొడవలపై తీసుకున్నచర్యల గురించి గవర్నర్కు మహేందర్ రెడ్డి వివరించారు.
బుధవారం తెలంగాణ అఖిల పక్ష నాయకులు గవర్నర్కు ఫిర్యాదు చేయడంతో దాడులపై పోలీస్ కమిషనర్ను గవర్నర్ వివరణ కోరారు. పాతబస్తీ మీర్ చౌక్ ఘటనతో పాటు అజంపురాలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కుమారుడిపై దాడి ఘటనలపై సీపీ వివరించారు. వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నామని... త్వరలో నిందితులందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పినట్లు సమాచారం. మీర్ చౌక్లో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీపై దాడి కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.