old city Conflicts
-
గవర్నర్‌తో సీపీ మహేందర్ రెడ్డి భేటీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో సీపీ మహేందర్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పాతబస్తీలో జరిగిన గొడవలపై తీసుకున్నచర్యల గురించి గవర్నర్‌కు మహేందర్ రెడ్డి వివరించారు. బుధవారం తెలంగాణ అఖిల పక్ష నాయకులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో దాడులపై పోలీస్ కమిషనర్‌ను గవర్నర్ వివరణ కోరారు. పాతబస్తీ మీర్ చౌక్ ఘటనతో పాటు అజంపురాలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కుమారుడిపై దాడి ఘటనలపై సీపీ వివరించారు. వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నామని... త్వరలో నిందితులందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పినట్లు సమాచారం. మీర్ చౌక్‌లో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీపై దాడి కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
'అలజడులు సృష్టిస్తే ఉపేక్షించం'
హైదరాబాద్: బల్దియా పీఠంపై తొలిసారిగా టీఆర్ఎస్ జెండా ఎగురవేయబోతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం ఆజంపురాలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు శాంతికాముకులని, ఎలాంటి అలజడులకు, వివాదాలకు అవకాశం ఇవ్వరని స్పష్టం చేశారన్నారు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడే వరకు తన కార్యాలయం నుంచే పరిపాలన కొనసాగిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పద్నాలుగేళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో రాజకీయ అలజడులు సృష్టిస్తే అటువంటి దుష్టశక్తులపై చర్యలు తీసుకోవటంలో ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. గత ప్రభుత్వాల హయాంలో బల్దియాకు వెళ్లాలంటే లంచాలు ఇస్తేనే పనులు జరిగేవని... ఇప్పుడా దుస్థితి రాబోదన్నారు. అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ నగరంపై దృష్టి పెట్టారని... హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. -
పాతబస్తీ దాడులపై సీపీ సమీక్ష
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఓల్డ్ సిటీలో జరిగిన దాడులపై పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బుధవారం పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఓల్డ్ సిటీ దాడుల నిందితులను గుర్తించి... వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తనపై దాడి చేశారని బీజేపీ అభ్యర్ధి బుధవారం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో అక్బరుద్దీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.