సాక్షి, ఢిల్లీ: అఖిలపక్ష నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పాల్గొన్నారు.
కాగా, కరోనా వ్యాక్సిన్ల పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలో నాలుగు వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. వీటితోపాటు మరో వ్యాక్సిన్ ప్రీ క్లినికల్ దశలో ఉందని వెల్లడించింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా విజ్ఞాన మరియు సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం చెప్పారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ల పరిశోధన, అభివృద్ధి నిమిత్తం కేంద్రం ప్రకటించిన మూడో ఉద్దీపన ప్యాకేజీ 'ఆత్మనీభర్ భారత్ 3.0' లో భాగంగా 'మిషన్ కోవిడ్ సురక్ష - ఇండియన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ డెవలప్మెంట్ మిషన్' ప్రకటించినట్లు సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment