అద్వానీ ఆశీర్వాదం తీసుకున్న మోదీ | Narendra Modi Meets Veteran BJP Leader LK Advani | Sakshi
Sakshi News home page

అద్వానీ ఆశీర్వాదం తీసుకున్న మోదీ

Published Fri, Jun 7 2024 3:28 PM | Last Updated on Fri, Jun 7 2024 3:44 PM

Narendra Modi Meets Veteran BJP Leader LK Advani

ఢిల్లీ: బీజేపీ అగ్రనేత నరేంద్రమోదీ ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌.కే అద్వానీని కలిశారు. ఎన్డీయే నేతగా ఎన్నికైన నేపథ్యంలో నరేంద్ర మోదీ స్వయంగా అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. అద్వానీ ఇంటి నుంచి బీజేపీ మరో సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం కూడా  తీసుకున్నారు. ఇక.. ఇద్దరు సీనియర్‌ నేతలను తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు మోదీ.

 

 నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. వీరు ఇరువురు కాసేపు ముచ్చటించారు.

 

మరోవైపు.. నరేంద్ర మోదీని ఎన్డియే పక్ష నేతగా శుక్రవారం ఏకగ్రీవంగా కూటమి ఎంపీలంతా కలిసి ఎన్నుకున్నారు. ఇక.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని రాష్ట్రపతిని సాయంత్రం  7గంటలకు కలిసి.. ఎంపీల జాబితాను ఎన్డియే కూటమి ఇవ్వనుంది. నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా ఎల్లుండి సాంయత్రం 6 గంటలకు  ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement