న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఏర్పడి వంద రోజులు దాటింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు ఓ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం సాధించిన ప్రగతి పనులను ఇందులో వెల్లడించారు.
జాన్‌లో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి దాదాపు రూ. 15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఇందులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వంరూ. 3 లక్షల కోట్లు కేటాయించిందని, 49,000 కోట్లతో దాదాపు 25,000 గ్రామాలను రోడ్డు నెట్‌వర్క్‌లకు అనుసంధానం చేసినట్లు తెలిపారు.
50,600 కోట్లతో దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులను విస్తరించాలని కేంద్రం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. గత పదేళ్లలో ఇళ్లు, టాయిలెట్లు, గ్యాస్ కనెక్షన్లు, త్రాగునీరు, విద్యుత్తు, ఉచిత ఆహార ధాన్యాలు, ఆరోగ్యం అందించినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల వరకు దేశంలోల్లు లేని వారు ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేయనున్నట్లు అమిత్ షా తెలిపారు.
మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకువచ్చిందన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని, ప్రజలు వాటికి సాక్ష్యాలుగా నిలిచినట్లు ఆయన పేర్కొన్నారు. రూ. 76,000 కోట్లతో మహారాష్ట్రలోని వాధ్వన్‌లో మెగా పోర్ట్‌ను నిర్మించనున్నారని చెప్పారు. ఇది ప్రపంచంలోనే టాప్ 10 పోర్టులలో ఒకటిగా మారనుందని తెలిపారు.
ప్రభుత్వం PM eBus సేవా పథకాన్ని ప్రారంభించిందని, స్టార్టప్‌ల కోసం ఏంజెల్ పన్ను రద్దు ద్వారా 31% పన్ను భారాన్ని తొలగించిందని, అభివృద్ధి కోసం భారతదేశం అంతటా 12 పారిశ్రామిక జోన్‌లను గుర్తించిందని పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ గురించి మంత్రి మాట్లాడుతూ.. సైబర్‌క్రైమ్‌ను పరిష్కరించడానికి వచ్చే ఐదేళ్లలో 5,000 మంది సైబర్ కమాండోలను నియమించనున్నట్లు చెప్పారు.
చదవండి: Atishi Marlena: ఢిల్లీ సీఎం కాబోతున్న ఈ మహిళ ఎవరు
యువత కోసం రూ. 2 లక్షల కోట్ల ప్రధానమంత్రి ప్యాకేజీని కూడా ప్రకటించామని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఐదేళ్లలో 4.10 కోట్ల మంది యువత దీని ద్వారా లబ్ధి పొందుతారని, కోటి మంది యువతకు అలవెన్సులు, వన్‌టైమ్ సహాయంతో పాటు అగ్రశ్రేణి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను కూడా అందించాలనితమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.
‘ఈ 100 రోజుల్లో మధ్యతరగతి వారికి కూడా చాలా ఉపశమనం లభించింది. ఇప్పటి వరకు రూ. 7 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటిపన్ను లేదు. ఒక ర్యాంక్ వన్ పెన్ష మూడవ ఎడిషన్ అమలు చేస్తున్నాం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లు మంజూరు చేశాం. వాటిలో 1 కోటి పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లు నిర్మాణం జరుగుతున్నాయి.
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి, వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం, పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా, బీహార్‌లోని బిహ్తా విమానాశ్రయాన్ని అప్‌గ్రేడ్ చేస్తున్నా. అగట్టి, మినికాయ్‌లో కొత్త ఎయిర్‌స్ట్రిప్‌లను కూడా నిర్మిస్తున్నాం. బెంగళూరు మెట్రో, పూణే ప్రాజెక్టులను కూడా చేపట్టాం. ఈ 100 రోజుల్లో మెట్రో, థానే ఇంటిగ్రేటెడ్ రింగ్ మెట్రో అనేక ఇతర మెట్రో పనులు చేస్తున్నాం.
వ్యవసాయ రంగంలో, 17వ విడత పిఎం కిసాన్ సమ్మాన్ యోజనలో 9.5 కోట్ల మంది రైతులకు ప్రభుత్వం రూ. 20,000 కోట్లు పంపిణీ చేసింది ఇప్పటి వరకు 12.33 కోట్ల మంది రైతులకు రూ. 3 లక్షల కోట్లు పంపిణీ చేశాం. గుజరాత్‌లోని సనంద్‌లో రూ. 3,300 కోట్లతో ప్రభుత్వం సెమీకండక్టర్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తుంది. యూనిట్ రోజుకు ఆరు మిలియన్ చిప్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. "రాబోయే 10 సంవత్సరాలలో, సెమీకండక్టర్స్‌లో భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తుంది.’ అని తెలిపారు
ఇదిలాఉండగా.. మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా వివిధ మంత్రిత్వశాఖలు, పార్టీ నాయకులు వివరణాత్మక ప్రణాళికను రూపొందించాయన్నారు. ఇందులోభాగంగా సేవా పఖ్వాడా అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమాలు మంగళవారం నుంచి అక్టోబరు 2 వరకు కొనసాగుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment