సోమవారం ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్‌ను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్న బీజేపీ చీఫ్ నడ్డా
న్యూఢిల్లీ: బెంగళూరులో జరుగుతున్న విపక్షాల భేటీకి దీటుగా అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) తన బలాన్ని ప్రదర్శించాలని ఉవి్వళ్లూరుతోంది. మంగళవారం ఢిల్లీలో ఎన్డీయే పక్షాల కీలక సమావేశం జరుగనుంది. మరికొన్ని కొత్త పార్టీలు సైతం కూటమిలో చేరనున్నట్లు తెలుస్తోంది. లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్), ఒ.పి.రాజ్‌భర్ నేతృత్వంలోని ఎస్‌బీఎస్సీ, హిందూస్తానీ అవామ్ మోర్చా(సెక్యులర్) వంటి పార్టీలు అధికార కూటమిలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
కొత్త పార్టీల రాకతో తమ కూటమి మరింత బలోపేతం కావడం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో విపక్షాలకు భంగపాటు తప్పదని ఎన్డీయే భాగస్వామ్యపక్షాల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం జరిగే భేటీకి 38 పార్టీలు హాజరు కానున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ప్రకటించారు. ఆయా పార్టీలకు ఆహా్వనాలు పంపించామని చెప్పారు. శివసేన(ఏక్‌నాథ్ షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్), రా్రïÙ్టయ లోక్ జనతాదళ్(ఆర్‌ఎల్‌జేడీ) తదితర పక్షాలు సైతం తొలిసారిగా ఎన్డీయే సమావేశంలో పాల్గొనబోతున్నాయి. ఇందులో కొన్ని పార్టీలు ఇప్పటికే బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా..
వాస్తవానికి కొన్ని పార్టీలు ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయాయి. జేడీ(యూ), శివసేన(ఉద్ధవ్ ఠాక్రే), అకాలీదళ్ దూరమయ్యాయి. వీటి స్థానంలో కొత్త పార్టీలు తమ కూటమిలో అడుగు పెతుండడం ఎన్డీయేలో కొత్త ఉత్సాహం నింపుతోంది. తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకేతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొన్ని పార్టీలు కూడా ఎన్డీయే సమావేశానికి హాజరు కానున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి ఏర్పాటైన తర్వాత అధికార కూటమి సమావేశం భారీ స్థాయిలో జరుగుతుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ భేటీలో వ్యూహ రచన చేయనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment