National Democratic Alliance
-
Narendra Modi: దేశ పురోభివృద్ధికి ఎన్డీయే కట్టుబడి ఉంది: మోదీ
చండీగఢ్: బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) దేశ పురోగతికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి అంకితభావంతో కృషి చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. పేదలు, దిగువవర్గాల అభ్యున్నతికి, సాధికారతకు కట్టుబడి ఉన్నామన్నారు. హరియాణా సీఎం నయాబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం మోదీ ఇక్కడి ఫైవ్‌స్టార్ హోటల్లో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంతులు, ఉప ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు. మొత్తం 17 మంది సీఎంలు, 18 మంది డిప్యూటీ సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మోదీ ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘సుపరిపాలన అందించడం, ప్రజలు జీవితాలను మెరుగుపర్చడంపై సు దీర్ఘంగా చర్చించాం. దేశ పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, పేదలు, అట్టడుగువర్గాలకు సాధికారతను కల్పించడానికి ఎన్డీయే కట్టుబడి ఉంది’ అని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తదితర ఎన్డీయే మిత్ర పక్షాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హరియాణా విజయా న్ని సానుకూలంగా మలచుకొని మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలను ఎదుర్కొనాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మొత్తం ఆరు తీర్మానాలను ఆమోదించినట్లు జేపీ నడ్డా తెలిపారు. ఎమర్జెన్సీ ఖండిస్తూ అమిత్ షా తీర్మానం పెట్టగా, రాజ్యంగం అమృతమహోత్సవంపై రాజ్‌నాథ్ తీర్మానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. -
ఎన్డీయే సర్కార్‌కు ‘అగ్ని’పరీక్ష తప్పదా?
న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఇంకా కొలువు దీరలేదు. ఈలోపే మిత్రపక్షాల నుంచి డిమాండ్లు మొదలవుతున్నాయి. అయితే అవి కేబినెట్ కూర్పు విషయంలోనే కాదులేండి.దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న అగ్నివీర్ పథకాన్ని సమీక్షించాల్సిందేనని ఎన్డీయే మిత్రపక్షం జనతా దళ్ యునైటెడ్(జేడీయూ) ఇప్పుడు కోరుతోంది. ఆ పార్టీ నేత కేసీ త్యాగి మీడియాతో మాట్లాడుతూ ఈ స్వరం వినిపించారు. ’’అగ్నిపథ్ పథకం మీద దేశవ్యాప్తంగా ఎంతో వ్యతిరేకత ఉంది. ఆ పథకం తెచ్చినప్పుడు సైన్యం వర్గాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. .. వాళ్ల కుటుంబాలు కూడా రోడ్డెక్కి పోరాటం చేశాయి. ఎన్నికల్లోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది కూడా. కాబట్టి, దానిని కచ్చితంగా సమీక్షించాల్సిందే. ఈ పధకంపై ప్రజలు లేవనెత్తిన లోటుపాట్లను వివరంగా చర్చించి వాటిని చక్కదిద్దాలని మా పార్టీ కోరుకుంటోందని చెప్పారు.‘‘ అని కేసీ త్యాగి అన్నారు.ఇక.. ఉమ్మడి పౌరస్మృతిపై పార్టీ అధ్యక్షుడి హోదాలో బిహార్ సీఎం నితీష్ కుమార్ లా కమిషన్ చీఫ్‌కు లేఖ రాసిన సందర్భాన్ని కూడా త్యాగి గుర్తుచేశారు. తాము ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకం కాదని, అయితే యూసీసీపై ప్రభావితమయ్యే అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ఓ పరిష్కారం అన్వేషించాలని త్యాగి పేర్కొన్నారు.రెండేళ్ల కిందట.. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం గత ఎన్డీయే హయాంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ‘అగ్నిపథ్’. అయితే నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసు అంశంపై ఆ సమయంలోనే తీవ్ర దుమారం రేగింది. దేశవ్యాప్తంగా నిరసనజ్వాలలు పెల్లుబిక్కాయి. మరోవైపు ప్రతిఏపక్షాలు సైతం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినప్పటికీ.. అగ్నివీర్ పథకం ద్వారా అగ్నీవీర్‌లను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా.. ఇండియా కూటమిలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాల్సిందేననే గళం బలంగా వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఆ తప్పిదాన్ని ఒప్పుకుని.. వెంటనే దానిని రద్దు చేయాలని కోరుతున్నారాయన. కిందటి నెలలో భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అగ్నిపథ్ పథకానికి మార్పులు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వెలిబుచ్చారు. అయితే ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఏడాది మార్చిలో ఒక ప్రకటన చేశారు. దీనిపై కాంగ్రెస్ ఇది ఎన్నికల జిమ్మిక్కు అంటూ మండిపడింది. -
ఎన్డీయే పక్ష నేతగా మోదీ.. ఎల్లుండి రాష్ట్రపతి చెంతకు భాగస్వామ్య పక్ష నేతలు
న్యూఢిల్లీ, సాక్షి: ఎన్డీయే పక్ష నేతగా మరోసారి నరేంద్ర మోదీనే ఎన్నికయ్యారు. బుధవారం సాయంత్రం సుమారు గంటన్నరపాటు సాగిన భాగస్వామ్య పక్ష నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో శనివారం సాయంత్రం ప్రధానిగా మోదీ ప్రమాణం చేయనున్నారు. బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయన నివాసంలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశం జరిగింది. సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ జరిగింది. మోదీ సారథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటునకు తీర్మానం చేశారు కూటమి పార్టీల నేతలంతా. ఆపై మోదీ సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు తెలుపుతూ చంద్రబాబు, నితీశ్, శివసేన షిండే వర్గం, ఇతర నేతలు లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్డీయే సమావేశంలో తీర్మానంమోదీ నాయకత్వంలోనే ఎన్నికల్లో పోరాటం చేశాముఎన్డీయే ఇప్పుడు సంపూర్ణ మెజారిటీ సాధించిందిమరోసారి ఆయన సారథ్యంలోనే ముందుకు సాగాలని నిర్ణయించాంమోదీనే మేం నాయకుడిగా ఎన్నుకుంటున్నాంపేదలు, మహిళలు , యువత, రైతుల కోసం ఎన్డీయే పనిచేస్తుందిఎన్డీయే పార్టీ నేతలంతా ఎల్లుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరే అవకాశం ఉంది. అమిత్ షా, చంద్రబాబు, నితీశ్ కుమార్ రాష్ట్రపతి ముర్మును కలుస్తారని తెలుస్తోంది. శనివారం సాయంత్రం ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి(హ్యాట్రిక్) ప్రమాణం చేయనున్నారు. पीएम @narendramodi के आवास पर एक घंटे चली #NDA की बैठक पूरी हुई pic.twitter.com/fkxmYSVW5Y— Pramila Dixit (@pramiladixit) June 5, 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. అభినందనలు తెలుపుకోవడంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుపై కూటమి పార్టీలు చర్చించాయి. ఇందుకోసం ఆయా పార్టీల అగ్రనేతలు బుధవారం మధ్యాహ్నానికే ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ తరఫున అగ్రనేతలు అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్ నేత నితిన్ గడ్కరీ ఈ భేటీకి హాజరయ్యారు. అలాగే.. కూటమి పార్టీల తరఫున జేడీయూ నుంచి నితీశ్ కుమార్, తెలుగు దేశం పార్టీ నుంచి చంద్రబాబు తదితరులు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 292 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్డీయేలో బీజేపీతో పాటు 15 పార్టీలు ఉన్నాయి. బీజేపీ(240), టీడీపీ(16), జేడీయూ(12), ఏక్నాథ్ షిండే శివసేన(7), ఎల్జేపీ(5), జనసేన(2), ఏజీపీ(1), హిందుస్తానీ ఆవామీ మోర్చా(1), అప్నాదళ్(1), ఎన్సీపీ అజిత్ పవార్(1) ఇతరులు(2) ఉన్నాయి. ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్డీయే సమావేశానికి ఆ పార్టీల నేతలంతా హారయ్యారు.ఇదీ చదవండి: ఫలితాలపై మనస్తాపం.. రాజీనామాకు సిద్ధం -
Lok sabha elections 2024: వాజ్‌పేయి మేజిక్
ప్రాంతీయ పార్టీల దన్ను లేనిదే సంపూర్ణ ఆధిక్యం అసాధ్యమని గుర్తించిన బీజేపీ 13వ లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. 20కి పైగా పార్టీలను నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) గూటి కిందకు తెచ్చి మెజారిటీ సాధించింది. సొంత బలం పెరగకున్నా భాగస్వాముల సాయంతో మళ్లీ అధికారంలోకి వచ్చి దేశాన్ని ఐదేళ్లూ విజయవంతంగా పాలించింది. కాంగ్రెస్ మాత్రం అంతర్గత సంక్షోభంతో బాగా దెబ్బ తిన్నది..1998 ఎన్నికల తర్వాత బీజేపీ ఏర్పాటు చేసిన నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) జాతీయ రాజకీయాల్లో పార్టీ గ్రాఫ్ బలపడేందుకు దోహదపడింది. దీనికి వాజ్‌పేయి తొలి చైర్మన్ కాగా జార్జ్ ఫెర్నాండెజ్ కనీ్వనర్. బీజేపీతో పాటు జేడీ (యూ), శివసేన, టీడీపీ, జేడీ(ఎస్) కూటమిలో ముఖ్ పార్టీలుగా ఉన్నాయి. 1999 లోక్‌సభ ఎన్నికలు సెపె్టంబర్ 5 నుంచి అక్టోబర్ 3 దాకా ఐదు దశల్లో జరిగాయి.కార్గిల్ యుద్ధం, ఫోఖ్రాన్ అణు పరీక్షలు బీజేపీకి బాగా కలిసొచ్చాయి. వాజ్‌పేయి చరిష్మా కూడా తోడై ఎన్డీఏకు 298 స్థానాలు దక్కాయి. 1984 తర్వాత ఏ పార్టీకైనా, సంకీర్ణానికైనా లోక్‌సభలో మెజారిటీ దక్కడం అదే తొలిసారి. బీజేపీకి 182 సీట్లొస్తే కాంగ్రెస్ 114తో పరిమితమైంది.సీపీఎం 33, టీడీపీ 29, సమాజ్‌వాదీ 26, జేడీయూ 21 సీట్లు గెలుచుకున్నాయి. సీపీఐకి కేవలం నాలుగు సీట్లే రావడంతో జాతీయ పార్టీ హోదా కోల్పోయింది! ఫలితాల అనంతరం డీఎంకే వంటి మరిన్ని పార్టీలు చేరడంతో ఎన్డీఏ కూటమి మరింత బలపడింది. అక్టోబర్ 13న ప్రధానిగా వాజ్‌పేయి మూడోసారి ప్రమాణం చేశారు. మొత్తమ్మీద 1996 నుంచి 1999 మధ్య మూడేళ్లలో లోక్‌సభకు ఏకంగా మూడుసార్లు ఎన్నికలు జరగడం విశేషం!కాంగ్రెస్‌లో సంక్షోభంకాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ బాధ్యతలు స్వీకరించిన ఏడాదికే పార్టీలో ముసలం మొదలైంది. జన్మతః విదేశీయురాలైన సోనియాను ప్రధాని అభ్యరి్థగా అంగీకరించేందుకు సీనియర్ నేతలు శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్ తీవ్రంగా వ్యతిరేకించారు. కలత చెందిన సోనియా రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఆమెకు మద్దతుగా నిలిచింది.కార్యకర్తలు నిరసనలు, నిరాహార దీక్షలతో హోరెత్తించారు. చివరికి 1999 మే 20న పవార్, సంగ్మా, అన్వర్‌పై కాంగ్రెస్ బహిష్కరణ వేటు వేసింది. దాంతో సోనియా రాజీనామాను వెనక్కు తీసుకుని పార్టీ సారథిగా కొనసాగారు. ఈ పరిణామం ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారింది. బీజేపీ ‘స్వదేశీ వాజ్‌పేయి – విదేశీ సోనియా’ నినాదాన్ని ఎత్తుకుంది. సోనియా అధ్యక్షతన కాంగ్రెస్‌కు అవే తొలి ఎన్నికలు.పవార్ సొంత పార్టీసోనియాగాంధీ విదేశీయతను ప్రశ్నించి కాంగ్రెస్ నుంచి బయటకు వచి్చన శరద్‌పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్ జూన్ 10న నేషనలిస్ట్ కాంగ్రెస్ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నారు. తొలి ఎన్నికల్లోనే 2.27 శాతం ఓట్లతో 8 స్థానాలను కైవసం చేసుకున్నారు. గుజరాత్ అల్లర్లునరేంద్ర మోదీ పాలనలోని గుజరాత్లో 2002 ఫిబ్రవరిలో చెలరేగిన మత ఘర్షణలతో వాజ్‌పేయి సర్కారు బాగా అప్రతిష్టపాలైంది. సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు అల్లరి మూకలు నిప్పంటించడంతో అయోధ్య నుంచి తిరిగొస్తున్న 59 మంది హిందూ భక్తులు మరణించారు. తర్వాత నెల పాటు చెలరేగిన హింసలో వెయ్యి మందికి పైనే చనిపోయారు. ఈ హింసాకాండను వాజ్‌పేయి ఖండించినా దాన్ని అరికట్టలేదన్న అపవాదు మూటగట్టుకున్నారు.విశేషాలు...► ప్రధానిగా వాజ్‌పేయి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వర్ణ చతుర్భుజి పేరిట హైవేలను విస్తరించారు. ప్రధాని గ్రామీణ్ సడక్ యోజనతో రూరల్ రోడ్లకు అక్షరాలా మహర్దశ పట్టింది.► టెలికం సేవల విస్తరణకు కీలక అడుగులు పడ్డాయి. లైసెన్స్ ఫీజుల స్థానంలో ఆదాయ పంపిణీ విధానం ప్రవేశపెట్టారు. 2000 సెపె్టంబర్ 15న బీఎస్ఎన్ఎల్ను ఏర్పాటు చేశారు.► ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ విభాగం ఏర్పాటైంది. బాల్కో, హిందుస్థాన్ జింక్, ఐపీసీఎల్, వీఎస్ఎన్ఎల్ వంటి అగ్రగామి కంపెనీలను ప్రైవేటీకరించారు.►పెట్రోలియం ధరలపై నియంత్రణ ఎత్తేయడానికి వాజ్‌పేయి సర్కారే బీజం వేసింది.13వ లోక్‌సభలో పార్టీల బలాబలాలు(మొత్తం స్థానాలు 543) పార్టీ స్థానాలు బీజేపీ 182కాంగ్రెస్ 114సీపీఎం 33టీడీపీ 29సమాజ్‌వాదీ 26జేడీ(యూ) 21శివసేన 15బీఎస్పీ 14ఇతరులు 109 – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Elections 2024: నువ్వా నేనా...!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికల్లో హోరాహోరీ తలపడేందుకు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ), కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఇండియా) సిద్ధమయ్యాయి. వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ, ఆ పార్టీని ఈసారి ఎలాగైనా మట్టికరిపించాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉన్నాయి. పేదలు, మహిళలు, రైతులు, యువతను లక్ష్యంగా చేసుకుని హామీల వర్షం కురిపిస్తున్నాయి. సొంతంగా 370కి పైగా స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్న అధికార బీజేపీ ఇప్పటికే ఏకంగా 267 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదుంది. ఇంకా కూటమి లెక్కలు తేలక కాంగ్రెస్ సతమతమవుతోంది. హోరాహోరీ పోరులో ఏ కూటమి నెగ్గేదీ తెలియాలంటే జూన్ 4న వరకు వేచి చూడాల్సిందే... అయోధ్యలో రామమందిర నిర్మాణం అనంతరం కదనోత్సాహంతో ఉన్న కమలదళం ఈ ఎన్నికల్లో భారీ లక్ష్యాలే నిర్ణయించుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 282 సీట్లు సాధించి 2019లో 303కు ఎగబాకిన బీజేపీ ఇప్పుడు ఏకంగా 370కి పైగా సీట్ల సాధనే లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్డీఏ పక్షాలతో కలిపి 400లకు పైగా సీట్లు సాధించాలని భావిస్తోంది. ఎన్డీఏకు ప్రస్తుతం 335 మంది ఎంపీలుండగా వీరిలో బీజేపీ సొంత బలమే 290 (మిగతా ఎంపీలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగి రాజీనామా చేశారు). ఇక కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో కేవలం 52 సీట్లకు పరిమితమైంది. ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న పక్షాలన్నీ కలిపి 2019లో 144 సీట్లు మాత్రమే సాధించాయి. ఆ ఎన్నికల్లో ఎన్డీఏకి 40 శాతం, ఇండియా కూటమికి 35 శాతం ఓట్లొచ్చాయి. ఎన్డీఏకు ఈసారి ఏకంగా 50 శాతానికి పైగా ఓట్ల సాధనే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఉత్తరాదిలోని అన్ని రాష్ట్రాలను చుట్టేశారు. దక్షిణాదిన కూడా దాదాపు అన్నిచోట్ల పర్యటించారు. అసెంబ్లీలవారీగా కూటముల బలాబలాలు... ► దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్డీఏ పార్టిలు 18 రాష్ట్రాల్లో, ఇండియా కూటమి పార్టిలు 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ► మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేల్లో 1,791 మంది ఎన్డీయే కూటమికి చెందినవారు కాగా 1,653 మంది ఇండియా కూటమికి చెందినవారున్నారు. ► శాసన మండలి ఉన్న ఆరు రాష్ట్రాల్లోని మొత్తం 426 ఎమ్మెల్సీల్లో 105 మంది ఇండియాకు, 184 మంది ఎన్డీఏకు చెందినవారు. ► ఎమ్మెల్యేలపరంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రతో సహా అత్యధిక జనాభా ఉన్న చాలా రాష్ట్రాల్లో ఎన్డీఏది ఆధిపత్యం. కాగా పశ్చిమబెంగాల్, కర్నాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్‌ల్లో ఇండియా కూటమిది పైచేయి. ► 2023–24 మధ్య తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఐదుచోట్ల ప్రభుత్వం మారింది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ, రెండింట కాంగ్రెస్ నెగ్గాయి. మిగతా మూడు రాష్ట్రాలను ప్రాంతీయ పార్టిలు చేజిక్కించుకున్నాయి. బీజేపీ లక్ష్యం 370 ప్లస్ ఎన్డీఏ భాగస్వాములతో సీట్ల పంపకాలను బీజేపీ శరవేగంగా తేల్చేస్తోంది... ► అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో 80 లోక్‌సభ స్థానాలకు 2019లో 62 సీట్లు బీజేపీ సాధించిన ఈసారి 70 దాటాలని టార్గెట్ పెట్టుకుంది. మిత్రపక్షాల్లో అప్నాదళ్ (ఎస్)కు 5 సీట్లు, నిషాద్ పార్టికి ఒకట్రెండు కేటాయించవచ్చు. ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ఐదు సీట్లు డిమాండ్ చేస్తున్నారు. ► మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను 26 చోట్ల బీజేపీ పోటీ చేస్తుందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. అయితే సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ (అజిత్)తో కలిసి పోటీ చేయనున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. ► 40 స్థానాలున్న బిహార్‌లో కనీసం 25 సీట్లులో పోటీ చేయనుంది. మిగతా స్థానాలను జేడీ(యూ), లోక్ జనశక్తి పార్టీ, ఉపేంద్ర కుషా్వహా రా్రïÙ్టయ లోక్ జనతాదళ్, హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్)లకు కేటాయించే అవకాశముంది. ► 28 లోక్‌సభ స్థానాలున్న కర్ణాటకలో కొత్త మిత్రుడు జేడీ(ఎస్)కు 3 స్థానాలిచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం. అక్కడ 2019 ఎన్నికల్లో 25 స్థానాలు చేజిక్కించుకున్న బీజేపీ ఈసారి వాటిని నిలబెట్టుకోవాలని చూస్తోంది. ► అస్సాంలో 14 స్థానాలకు గాను 11 స్థానాల్లో బీజేపీ, మిగతా చోట్ల మిత్రపక్షాలు అస్సాం గణ పరిషత్ (ఏజీపీ), యునైటెడ్ పీపుల్స్ లిబరేషన్ (యూపీపీఎల్) పోటీ చేస్తారు. లెక్కలు తేలక ‘హస్త’వ్యస్తం... ఈసారి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించే లక్ష్యంతో భాగస్వాములతో కాంగ్రెస్ పొత్తు కసరత్తులు చేస్తోంది. ఒంటరిగా పోటీ చేసే రాష్ట్రాలు, మిత్రపక్షాలతో కలిసి ముందుకు సాగాల్సిన రాష్ట్రాలపై పీసీసీల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అంతర్గత నిర్ణయం మేరకు కర్ణాటక (28), గుజరాత్ (26), రాజస్థాన్ (25), ఆంధ్రప్రదేశ్ (25), తెలంగాణ (17), అస్సాం (14), చత్తీస్‌గఢ్ (11), హరియాణా (10), అరుణాచల్‌ప్రదేశ్ (2)ల్లో కాంగ్రెస్ ఒంటరి పోటీ చేయనుందని సమాచారం... యూపీలో కనీసం 50 స్థానాల్లో పోటీ చేయాలని భావించినా చివరికి 17 స్థానాలకే పరిమితమవుతోంది. మిగతా చోట్ల ఇండియా కూటమి భాగస్వామి సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేయనుంది. ► మహారాష్ట్రలో కనీసం 18 సీట్లలో బరిలో దిగాలని కాంగ్రెస్ భావిస్తోంది. మిగతా వాటిని మిత్రపక్షాలు ఎన్సీపీ (శరద్), శివసేన (యూబీటీ)లకు కేటాయించనుంది. ► పశి్చమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో మొత్తం 42 స్థానాల్లోనూ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయనుంది. ► బిహార్‌లో జేడీ(యూ) జారుకోవడంతో కనీసం 25 చోట్ల పోటీ చేయాలని భావిస్తున్నా చివరికి 15 స్థానాలకే పరిమితమయ్యేలా ఉంది. మిత్రపక్షం ఆర్జేడీ మాత్రం 7 నుంచి 9 సీట్ల కంటే ఇచ్చేది లేదంటోంది! ► తమిళనాట డీఎంకేతో పొత్తున్నా కాంగ్రెస్‌కు రెండుకు మించి సీట్లు దక్కడం కష్టమే. ► జార్ఖండ్‌లోని ఏడు చోట్ల పోటీ చేసి జేఎంఎంకు 4, ఇతర పక్షాలకు 3 ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయి. ► కేరళలో 20 స్థానాల్లో 16 చోట్ల పోటీ చేసి వామపక్షాలకు 4 ఇవ్వనుంది. ► పంజాబ్‌లో ఆప్‌తో పొత్తు కుదరకపోవడం, అకాలీదళ్ కూడా దూరమవడంతో మొత్తం 13 సీట్లలోనూ కాంగ్రెస్ పోటీ చేయనుంది. ► ఢిల్లీలో మాత్రం నాలుగు చోట్ల ఆప్, మూడుచోట్ల కాంగ్రెస్ బరిలో దిగనున్నాయి. 2019లో ఇలా... 2014లో బీజేపీకి సొంతంగా 282 సీట్లు రాగా 2019 నాటికి 303కు పెరిగాయి. 2019 ఎన్నికల్లో హిందీ రాష్ట్రాలను చాలావరకు క్లీన్‌స్వీప్ చేసింది. 2019లో 31 శాతం ఓట్లు సాధించగా 2019లో 37.4కు పెంచుకుంది. 2019లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 353 ఎంపీల మద్దతుంది. కూటమి మొత్తం 40 శాతం ఓట్లు సాధించింది. ఎన్డీఏ కూటమి బలం బీజేపీ 290 జేడీ(యూ) 16 శివసేన 13 ఆర్ఎల్జేపీ 5 ఇతరులు 11 2019లో ఇలా... ప్రస్తుత ఇండియా కూటమి 2009 లోక్‌సభ ఎన్నికల్లో 40 శాతం ఓట్లతో 347 సీట్లు గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో ఓట్ల శాతం 42 శాతానికి పెరిగినప్పటికీ 161 సీట్లకే పరిమితమైంది. బీజేపీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టిల మధ్య త్రిముఖ పోటీయే ఇందుకు ప్రధాన కారణం. ఇక 2019 ఎన్నికల్లో ఇండియా కూటమి 38 శాతం ఓట్లకు, కేవలం 144 సీట్లకు పడిపోయింది. ఇండియా కూటమి బలం కాంగ్రెస్ 48 డీఎంకే 24 టీఎంసీ 22 శివసేన (యూబీటీ) 6 ఎన్సీపీ (శరద్) 4 ఇతరులు 19 -
ఎన్నికలకు ఎన్డీయే సర్వసన్నద్ధం
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) లోక్‌సభ ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈసారి కూడా తమ కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను శనివారం ఎన్నికల సంఘం ప్రకటించిన అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పలు పోస్టులు చేశారు. ‘మరోసారి మోదీ సర్కారు’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. గత పదేళ్ల తమ పాలనలో భారత్ ఎంతగానో అభివృద్ధి చెందిందని, వైభవోజ్వల మార్పును చూసిందని ఉద్ఘాటించారు. 140 కోట్ల మంది భారతీయుల శక్తియుక్తులతో అభివృద్ధిలో దేశం కొత్త రికార్డులు సృష్టించిందని హర్షం వ్యక్తంచేశారు. ప్రజలకు సుపరిపాలన అందించామని పేర్కొన్నారు. ఈ ట్రాక్ రికార్డును ఆధారంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలను అతిపెద్ద ప్రజాస్వామ్య వేడుకగా అభివరి్ణంచారు. ప్రధానమంత్రిగా వరుసగా మూడో పర్యాయం బాధ్యతలు చేపడతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి పేదరికం, అవినీతిపై యుద్ధం వేగవంతం చేస్తానని తేలి్చచెప్పారు. సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతం చేయడం తన ధ్యేయమని పేర్కొన్నారు. మూడో టర్మ్‌లో చేయాల్సిన పని చాలా ఉందని వెల్లడించారు. దేశ ప్రగతి కోసం రాబోయే వెయ్యి సంవత్సరాలకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను వచ్చే ఐదేళ్లలో తయారు చేసుకోవాలని చెప్పారు. ప్రజల ఆశీస్సుల నుంచే నాకు కొత్త శక్తి దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత 70 ఏళ్లు పాలించిన ప్రభుత్వాలు సృష్టించిన ఖాళీలను గత పదేళ్ల భర్తీ చేశామని ప్రధాని మోదీ తెలియజేశారు. దేశం సౌభాగ్యవంతంగా మారుతుందని, స్వావలంబన సాధిస్తుందన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రజల్లో పెంచామని వివరించారు. ‘వికసిత్ భారత్’ అనే లక్ష్య సాధనకు మనమంతా కలిసికట్టుగా పని చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మన దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుకోవడానికి, మన యువత కలలను సాకారం చేయడానికి మరింత పట్టుదలతో కృషి చేద్దామని సూచించారు. ప్రతిపక్షాల పరిస్థితి చుక్కాని లేని నావలా మారిందని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఎన్నికలకు వెళ్లడానికి విపక్షాలకు ఒక బలమైన అంశమే లేదన్నారు. ప్రజల కోసం కష్టపడుతున్న తమను దూషించడం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం తప్ప విపక్షాలకు ఇంకేమీ తెలియదని విమర్శించారు. -
టార్గెట్ 370.. ఎలా రీచ్ అవుదాం?
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ 3.0పై బీజేపీ ధీమాతో ఉంది. ఈ క్రమంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. సొంతంగానే 370 స్థానాలు, జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) 400కు పైగా సీట్లు గెలుచుకోవడం తథ్యమని ఇప్పటికే చాలాసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ లక్ష్య సాధనలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం కోసం కీలక సమావేశాలు నిర్వహించబోతున్నారు. శనివారం నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కమల శ్రేణులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్ కార్యాచరణ, లక్ష్యాలు.. వాటి సాధనకు ఏం చేయాలి.. ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహాలను ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఇక.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 11,500 మందికిపైగా బీజేపీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొనబోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే వందలాది మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్ష ప్రసంగంతో శనివారం మధ్యాహ్నం ప్రారంభమయ్యే జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంతో ముగుస్తాయి. -
L.K Advani: గమ్యం చేరని రథ యాత్రికుడు
లాల్‌కృష్ణ అడ్వాణీ. 1990ల నుంచి రెండు దశాబ్దాల పాటు దేశమంతటా మారుమోగిపోయిన పేరు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో రాజకీయ రథయాత్రలకు పర్యాయపదంగా మారిన పేరు. ఆయన చేపట్టిన ఆరు యాత్రల్లో అయోధ్య రథయాత్ర దేశ రాజకీయ ముఖచిత్రాన్నే శాశ్వతంగా మార్చేసింది. జాతీయ రాజకీయాల్లో బీజేపీపై ‘అంటరాని పార్టీ’ ముద్రను చెరిపేసింది. బీజేపీని కేవలం రెండు లోక్‌సభ సీట్ల స్థాయి నుంచి తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంలో వాజ్‌పేయితో పాటు అడ్వాణీది కీలకపాత్ర. వాజ్‌పేయిని భారతరత్న వరించిన తొమ్మిదేళ్లకు తాజాగా ఆయనకూ ఆ గౌరవం దక్కింది. బీజేపీకి సుదీర్ఘ కాలం అధ్యక్షునిగా కొనసాగిన రికార్డు కూడా అడ్వాణీదే. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు నేషనల్ డెమొక్రటికల్ అలయన్స్ (ఎన్డీఏ)కు ఊపిరి పోసిందీ ఆయనే. కరాచీ నుంచి కరాచీ దాకా... అడ్వాణీ నేటి పాకిస్తాన్‌లోని కరాచీలో 1927 నవంబర్ 8న జన్మించారు. 14 ఏళ్లప్పుడే ఆరెస్సెస్‌లో చేరారు. అనంతరం జనసంఘ్ నేతగా ఎదిగారు. సహచర నేత వాజ్‌పేయితో పాటు దేశవ్యాప్త క్రేజ్ సంపాదించుకున్నారు. హిందూ హృదయ సమ్రాట్‌గా గుర్తింపు పొందారు. వాజ్‌పేయిది మితవాద ఇమేజీ కాగా అడ్వాణీ మాత్రం హిందూత్వకు పోస్టర్ బోయ్‌గా ముద్ర పడ్డారు. ఇద్దరూ కలిసి జోడెద్దులుగా బీజేపీ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించారు. 1983లో కేవలం రెండు లోక్‌సభ సీట్లకు పరిమితమైన కాలంలో అడ్వాణీ బీజేపీ అధ్యక్ష పగ్గాలను అందుకున్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదు స్థానంలో రామాలయం నిర్మించాలనే డిమాండ్‌తో దేశవ్యాప్త రామ రథయాత్ర తలపెట్టారు. 1990 సెపె్టంబర్లో గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి మొదలు పెట్టిన ఈ యాత్రకు బ్రహా్మండమైన స్పందన లభించింది. అరెస్టుతో యాత్ర మధ్యలోనే ఆగినా బీజేపీకి అదెంతగానో కలిసొచి్చంది. 1991 లోక్‌సభ ఎన్నికల్లో రెండో అతి పెద్ద పారీ్టగా అవతరించింది. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసానికి తోడు 1993 నుంచి అడ్వాణీ చేపట్టిన జనాదేశ్, స్వర్ణజయంతి, భారత్ ఉదయ్, భారత్ సురక్ష వంటి రథయాత్రలు బీజేపీని కేంద్రంలో అధికారానికి చేరువ చేశాయి. చివరికి 1996లో బీజేపీ తొలిసారిగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ వాజ్‌పేయి ప్రధాని కావడంతో అడ్వాణీ కల నెరవేరలేదు. దాంతో మితవాద ముద్ర కోసం విఫలయత్నాలు చేశారు. ఆ క్రమంలో 2005లో కరాచీ వెళ్లి మరీ జిన్నాను లౌకికవాది అంటూ పొగడటం ఆయనకు మరింత చేటు చేయడమే గాక ఆరెస్సెస్ కన్నెర్రకూ కారణమైంది. ఆ దెబ్బకు సంఘ్‌తో అడ్వాణీ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. 2009 ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రధాని అభ్యరి్థగా నిలిచినా పార్టీ పరాజయం పాలైంది. యూపీఏ ప్రభుత్వ అవినీతిపై 2011లో చివరిసారి చేసిన జనచేతన యాత్రా అడ్వాణీకి అంతగా లాభించలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Times Now ETG Survey on Elections 2024: మళ్లీ ఎన్డీఏనే!
న్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొడుతుందని టైమ్స్ నౌ నవజీవన్, ఈటీజీ ఒపీనియన్ పోల్ బుధవారం వెల్లడించింది. మొత్తం 543 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి ఏకంగా 323 సీట్లొస్తాయని అంచనా వేసింది. విపక్ష ఇండియా కూటమి 163 సీట్లకు పరిమితమవుతుందని చెప్పింది. ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి 57 స్థానాలు దక్కించుకుంటాయని వెల్లడించింది. ముఖ్యంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనైతే ఆ పార్టీ దాదాపుగా క్లీన్‌స్వీప్ చేస్తుందని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 354 సీట్లు రావడం తెలిసిందే. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకు 93 సీట్లు రాగా ఇతరులకు 96 దక్కాయి. -
Times Now Survey On 2024 Elections: మళ్లీ ఎన్డీయేనే..
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే జాతీయ స్థాయిలో అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రఖ్యాత ‘టైమ్స్ నౌ’సర్వే తేలి్చచెప్పింది. మొత్తం 543 స్థానాలకు గాను ఎన్డీయేకు 296 నుంచి 326, విపక్ష ఇండియా కూటమికి 160 నుంచి 190 స్థానాలు లభిస్తాయని వెల్లడించింది. ఎన్డీయేలోని ప్రధానపక్షమైన బీజేపీ సొంతంగానే 288 నుంచి 314 సీట్లు గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. ఇక విపక్ష ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ 62 నుంచి 80 స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొంది. ఓట్ల శాతంపరంగా చూస్తే ఎన్డీయేకు 42.60శాతం, ఇండియాకు 40.20 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేస్తుందని తేలి్చంది. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలకు గాను దాదాపు మొత్తం స్థానాలు కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. వైఎస్సార్సీపీకి 24 నుంచి 25 సీట్లు లభిస్తాయని తేలి్చచెప్పింది. అంతేకాకుండా ఆ పార్టీ ఓట్ల శాతం కూడా పెరుగనున్నట్లు గుర్తించింది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది. ఈసారి 51.3 శాతం ఓట్లతో మొత్తం స్థానాలను తన ఖాతాలు వేసుకుంటుందని టైమ్స్ నౌ సర్వే తేల్చడం విశేషం. అంటే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం 1.50 శాతం పెరుగనున్నట్లు తేటతెల్లమవుతోంది. వైఎస్సార్సీపీ పట్ల నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణకు ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితికి(బీఆర్ఎస్) 9 నుంచి 11 లోక్‌సభ స్థానాలు లభిస్తాయని సర్వే తెలియజేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 2 నుంచి 3, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 3 నుంచి 4 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ఇతరులు ఒక సీటు గెలుచుకోనున్నట్లు అంచనావేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికెన్ని సీట్లు కూటమి/పార్టీ సీట్లు వైఎస్సార్సీపీ 24–25 ఎన్డీయే 0–1 ఇండియా 0 ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల శాతం కూటమి/పార్టీ ఓట్ల శాతం వైఎస్సార్సీపీ 51.3 ఎన్డీయే 1.13 ఇండియా – తెలంగాణలో ఎవరికెన్ని సీట్లు కూటమి/పార్టీ సీట్లు బీఆర్ఎస్ 9–11 ఎన్డీయే 2–3 ఇండియా 3–4 ఇతరులు 1 తెలంగాణలో ఓట్ల శాతం కూటమి/పార్టీ ఓట్ల శాతం బీఆర్ఎస్ 38.40 ఎన్డీయే 24.30 ఇండియా 29.90 ఇతరులు 7.40 జాతీయ స్థాయిలో ఏ కూటమికి ఎన్ని సీట్లు (మొత్తం సీట్లు 543) కూటమి సీట్లు ఎన్డీయే 296–326 (ఓట్ల శాతం 42.60) ఇండియా 160–190 (ఓట్ల శాతం 40.20) పార్టీ సీట్లు బీజేపీ 288–314 కాంగ్రెస్ 62–80 వైఎస్సార్సీపీ 24–25 డీఎంకే 20–24 టీఎంసీ 22–24 బీజేడీ 12–14 బీఆర్ఎస్ 9–11 ఆమ్ ఆద్మీ పార్టీ 5–7 ఇతరులు 70–80 ఏ కూటమికి ఎన్ని సీట్లు కూటమి సీట్లు ఓట్ల శాతం ఎన్డీయే 296–326 42.60 ఇండియా 160–190 40.20 మొత్తం సీట్లు 543 – ఏ పారీ్టకి ఎన్ని సీట్లు పార్టీ సీట్లు బీజేపీ 288–314 కాంగ్రెస్ 62–80 వైఎస్సార్సీపీ 24–25 డీఎంకే 20–24 టీఎంసీ 22–24 బీజేడీ 12–14 బీఆర్ఎస్ 9–11 ఆప్ 5–7 ఇతరులు 70–80 -
మోదీకే కాదు INDIAకూ అతిపెద్ద సవాల్
విపక్ష కొత్త కూటమి ఆవిర్భావంతో అధికారంలో ఉన్న ఎన్డీయే National Democratic Alliance కూడా అప్రమత్తమైంది. బెంగుళూరులో జరిగిన కాంగ్రెస్, తదితర ప్రతిపక్షాల కూటమి సమావేశానికి పోటీగా.. ఢిల్లీలో బిజెపి ఆధ్వర్యంలోని NDA కూటమి కూడా భేటీ అయింది. ఈ రెండు కూటములకు హాజరైన నేతలను గమనిస్తే, చూడడానికి విపక్ష కూటమిలో బలమైన నేతలు ఉన్నారు. అదే ఎన్డీయే కూటమిలో ప్రధాని నరేంద్ర మోదీనే అన్నిటింకి కర్త,కర్మ,క్రియగా ఉన్నట్లు కనిపించింది. గత తొమ్మిదేళ్లలో విపక్షం ఈ భేటీతో తొలిసారిగా మోదీకి ఒక సవాలు విసిరిందని చెప్పవచ్చు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇంతకాలం సర్వేలు చెబుతూ వచ్చాయి. ఇప్పుడు ఇండియా పేరుతో కొత్త కూటమి పూర్థి స్థాయి రూపానికి వస్తే రాజకీయ వాతావరణం కొంత మారే అవకాశం కూడా ఉంది. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలియన్స్ Indian National Developmental Inclusive Alliance అన్నది పూర్తి పేరు అయినా, ఇండియా మొత్తం బీజేపీ పోరాడబోతోందన్న సంకేతం ఇవ్వడానికి ఇండియా కూటమిగానే ప్రచారం చేస్తారు. అందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇండియాపై యుద్దానికి దిగితే గెలుపెవరిదో అందరికి తెలుసు అని సెంటిమెంట్ డైలాగు వాడారు. కానీ, నితీష్ కుమార్ ఈ పేరును వ్యతిరేకించారట. ఈ కూటమికి ఉండే ప్రధాన సమస్య పార్టీల మద్య వైరుధ్యాలు. అలాగే అందరూ పెద్ద నాయకులు కావడం కాబోలు. వీరిలో ప్రధాని అభ్యర్ధి ఎవరు అన్నది తేలడం కూడా అంత తేలికకాదు. కాంగ్రెస్, తదితర విపక్షాలు అవినీతి పార్టీలని, కుటుంబం కోసం పనిచేసే పార్టీలని, ఎన్డీయే మాత్రం ప్రగతిదాయకమని అని మోదీ వ్యాఖ్యానిస్తే.. దేశ రాజ్యాంగాన్ని బీజేపీ భ్రస్టుపట్టించిందని, రాష్ట్ర ప్రభుత్వాలను దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తోందని, ప్రత్యర్ధి పార్టీల నేతలపై వాటిని ప్రయోగిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటూ ఇండియా కూటమి పిలుపు ఇస్తోంది. ఇందులో కీలకమైన పాయింట్ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాని పదవిని వదలుకోవడానికి సిద్దం అవడం అని చెప్పాలి. బీజేపీ అధికారంలోకి రాకుండా ఉంటే చాలు అనే గట్టి ధోరణిని కాంగ్రెస్ కనబరుస్తోంది. ✍️ ఎన్డీయే తరపున భేటీ అయిన పార్టీలు పేరుకు 38 అయినా వాటిలో 24 పార్టీలకు ఒక్క ఎమ్.పి కూడా లేరట!. రెండు పార్టీలకు ఇద్దరు ఎమ్.పిలు ఉంటే, ఏడు పార్టీలకు ఒక్క ఎమ్.పి చొప్పునే ఉన్నారట. దానిని మోదీ సమర్ధించుకునే ప్రయత్నం చేసినా, చూసేవారికి అర్ధం అయ్యేదేమిటంటే, అసలు బలం లేని, ఎంపీలు లేని ,చిన్నా,చితక పార్టీలను పోగుచేసి , విపక్ష కూటమి కన్నా తమ వద్దే ఎక్కువ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవడానికి ప్రయత్నించినట్లు కనబడుతుంది. కొన్ని పార్టీల పేర్లను గతంలో ఎప్పుడూ విని ఉండకపోవచ్చు. వీటిలో కూడా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చిన్న పార్టీలు, అలాగే యూపీ, తమిళనాడుకు చెందిన చిన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. ఏపీ నుంచి జనసేన హాజరు అయింది.ఆ పార్టీకి ఒక్క ఎమ్.పి కూడా లేరు. అలాగే ఒక్క ఎమ్మెల్యే ఆ పార్టీ పక్షాన గెలిచినా, ప్రస్తుతం ఆ పార్టీలో లేరు. మహారాష్ట్రలో చీలిక వర్గానికి చెందిన ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్.సి.పి చీలికవర్గం మాత్రం ఎన్డీయే సమావేశానికి హాజరయ్యాయి. అదే.. విపక్ష కూటమి సమావేశానికి సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే వంటి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు, ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, మమత బెనర్జీ, స్టాలిన్ , మహారాష్ట్ర నుంచి శరద్ పవార్, ఉద్దావ్ ఠాక్రే వంటి హేమాహేమీలు హాజరవడం విశేషం. ఒంటరి కేసీఆర్ తెలంగాణ లో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఈ రెండు సమావేశాలలో దేనికి వెళ్లలేదు. కొన్నాళ్లు ఫెడరల్ ప్రంట్ అని, ఆ తర్వాత జాతీయ రాజకీయ పార్టీని స్థాపించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి ప్రధాన ప్రత్యర్ధులుగా ఉండడంతో ఆయన ఎటువైపు మొగ్గలేకపోయారు. కాంగ్రెస్ , బీజేపీయేతర కూటమి కట్టాలన్న ఆయన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆయనను ఇంతకుముందు కలిసిన అఖిలేష్ యాదవ్ కాని, జార్ఖండ్ ముఖ్యమంత్రి సొరేన్ కాని విపక్ష కూటమికే జై కొట్టారు. స్టాలిన్, నితీష్ కుమార్ వంటివారు ఇప్పటికే కాంగ్రెస్ తో జట్టు కట్టారు. దీంతో కేసీఆర్ ఒంటరిగా మిగిలిపోయినట్లయింది. ✍️ 2018 లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా క్రాస్ రోడ్స్ లో నిలబడి ఎదురు చూస్తున్నారు. ఆయన ఎన్.డి.ఎ. కూటమి నుంచి పిలుపు వస్తుందని ఆశించారు కాని అది జరగలేదు. కాకపోతే ఆయన దత్తపుత్రుడుగా పేరుపడ్డ పవన్ కల్యాణ్ ఆ కూటమిలో ఉండడం ద్వారా తన వాయిస్ ను బీజేపీకి చేరవేసే అవకాశం కల్పించుకున్నట్లయింది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎఎస్ ఆర్ కాంగ్రెస్ ఎప్పుడూ ఏ కూటమిలో లేదు కనుక ఆ చర్చే రాదు. అలాగే ఒడిషాలో బిజు జనతాదళ్ కూడా స్వతంత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల తర్వాత జాతీయ కూటములు రెండిటిలో దేనికి మెజార్టీ రాకపోతే వైఎస్సార్సీపీ, బీజేడీ, బీఆర్ఎస్ వంటి పార్టీలకు ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంటుంది. ✍️ 2019 నాటికన్నా విపక్షాలు ఈసారి ఒక స్పష్టతతో ముందుకు వచ్చినట్లు కనిపిస్తుంది. అయినా ఆయా పార్టీల మధ్య పరస్పర వైరుధ్యాలు లేకపోలేదు. పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు సీపీఎం, కాంగ్రెస్ లు ప్రత్యర్ధి పార్టీలుగా ఉన్నాయి. కాకపోతే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడడంతో వాతావరణం మారింది. వచ్చే ఎన్నికలలో కనుక కాంగ్రెస్, సీపీఎంలు టీఎంసీతో రాజీపడి సీట్ల సర్దుబాటు చేసుకోగలిగితే బిజెపికి ఇప్పుడు ఉన్న లోక్ సభ సీట్లు రావడం కష్టం కావచ్చు. ✍️ బీహారులో రెండు చిన్న పార్టీలను బీజేపీ చేర్చుకున్నా, జేడీయూ, ఆర్జేడీ ,కాంగ్రెస్ కూటమి అత్యధిక సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. డిల్లీ, పంజాబ్ లలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు సర్దుబాటు చేసుకోగలుగుతాయా?అనే సందేహం ఉన్నా.. కలిస్తే మాత్రం బీజేపీకి కొంత సమస్య ఎదురుకావచ్చు. గతసారి కర్నాటకలో జెడిఎస్ ,కాంగ్రెస్ ల ప్రభుత్వం ఉన్నా.. లోక్ సభ ఎన్నికలలో మోడీ హవా బాగా పనిచేసింది. అది అలాగే ఉండాలంటే జెడిఎస్ తో బిజెపి కూటమి కట్టాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి రావడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం. ఇలా.. వెస్ట్ బెంగాల్, కర్నాటక, తమిళనాడు, పంజాబ్, డిల్లీ జార్కండ్, బీహార్ ,కేరళ, రాజస్తాన్ ,చత్తీస్ గడ్ వంటి విపక్ష పాలిత రాష్ట్రాలలో ఇండియా కూటమి పుంజుకుంటే బిజెపికి దానిని అధిగమించడం పెద్ద సవాలు కావచ్చు. ✍️ కాకపోతే ఈ కూటమి పార్టీలలో ఉండే అంతర్గత వైరుధ్యాలను క్యాష్ చేసుకోవడానికి బిజెపి ప్రయత్నించక మానదు. ఎన్నికల ముందు ఏదైనా సరికొత్త సెంటిమెంట్ ను ముందుకు తీసుకు వస్తుందా? అనే చర్చా నడుస్తోంది కూడా. ప్రత్యేకించి యూనిఫాం సివిల్ కోడ్ ద్వారా మతపరంగా ఓట్ల పోలరైజేషన్ కు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. తెలుగుదేశం, అకాలీదళ్ వంటి పార్టీలను ఎన్.డి.ఎ.లో కలుపుకుంటారా?లేదా? అన్నది అప్పుడే చెప్పలేం. మహారాష్ట్రలో శరద్ పవార్ లేని ఎన్.సిపి అజిత్ పవార్ చీలికవర్గం, ఉద్దావ్ ఠాక్రే లేని శివసేన చీలికవర్గం ఎంతవరకు ప్రజలను ప్రభావితం చేస్తాయన్న సందేహాలు ఉన్నాయి. యూపీ, మధ్యప్రదేశ్, వంటి రాష్ట్రాలు బిజెపికి కీలకంగా మారతాయి. అందుకే.. ఇండియా కూటమికి విజయావకాశాలు ఉన్నాయన్న సంకేతాలు ప్రజలలోకి వెళితే తమకు నష్టం జరుగుతుందని భావించే బిజపి హడావుడిగా పోటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తమకు అంతకన్నా ఎక్కువ పార్టీల మద్దతు ఉందని చూపించుకునే యత్నం చేసింది. కాంగ్రెస్ నిజంగానే ప్రధాని పదవిని వదలుకుంటే నితీష్ కుమార్ లేదా మమత బెనర్జీ వంటివారు ప్రదాని పదవి రేసులోకి వచ్చే అవకాశం ఉంది. ఇండియా కూటమి ఒక ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోబోతోంది. బిజెపికి ఇంతకాలం డివైడెడ్ అప్పోజిషన్ కలిసి వచ్చింది. ఈసారి అలాకాకుండా ప్రతిపక్షం అంతా ఒకటైతే మాత్రం పలు రాష్ట్రాలలో గట్టి పోటీనే ఎదుర్కొనాల్సి రావచ్చు. ✍️ ఇప్పటికి బీజేపీదే అధికారం అనే భావన ఉన్నప్పటికీ.. వచ్చే కొద్ది నెలల్లో జరిగే పరిణామాలను బట్టి ప్రజాభిప్రాయంలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని విపక్ష కూటమి బలపడడానికి ముందే మోదీ ప్రభుత్వం జనవరి నాటికే లోక్ సభ ఎన్నికలకు వెళుతుందా? అన్న సంశయం కూడా కొన్ని వర్గాలలో ఉంది. 2004లో ఎన్డీయే, యూపీఏకి మద్య ఎలాంటి పోటీ జరిగిందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో దేశంలో పోటీ ఉండవచ్చు. కాకపోతే అప్పటి బిజెపి ప్రదాని వాజ్ పేయి సాప్ట్ కాగా, ప్రస్తుత ప్రదాని మోడీ హార్డ్ . ఆ రోజులలో యూపీఏ గెలిచినంత ఈజీగా ఇప్పుడు ఇండియా కూటమి గెలుస్తుందని చెప్పలేం. కానీ, ఐక్యమత్యంగా పోటీచేస్తే మాత్రం ఎన్డీయే తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పదన్న భావన కలుగుతోంది. ::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఎన్డీయే బల ప్రదర్శన
న్యూఢిల్లీ: బెంగళూరులో జరుగుతున్న విపక్షాల భేటీకి దీటుగా అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) తన బలాన్ని ప్రదర్శించాలని ఉవి్వళ్లూరుతోంది. మంగళవారం ఢిల్లీలో ఎన్డీయే పక్షాల కీలక సమావేశం జరుగనుంది. మరికొన్ని కొత్త పార్టీలు సైతం కూటమిలో చేరనున్నట్లు తెలుస్తోంది. లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్), ఒ.పి.రాజ్‌భర్ నేతృత్వంలోని ఎస్బీఎస్సీ, హిందూస్తానీ అవామ్ మోర్చా(సెక్యులర్) వంటి పార్టీలు అధికార కూటమిలో చేరేందుకు రంగం సిద్ధమైంది. కొత్త పార్టీల రాకతో తమ కూటమి మరింత బలోపేతం కావడం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో విపక్షాలకు భంగపాటు తప్పదని ఎన్డీయే భాగస్వామ్యపక్షాల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం జరిగే భేటీకి 38 పార్టీలు హాజరు కానున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ప్రకటించారు. ఆయా పార్టీలకు ఆహా్వనాలు పంపించామని చెప్పారు. శివసేన(ఏక్నాథ్ షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్), రా్రïÙ్టయ లోక్ జనతాదళ్(ఆర్ఎల్జేడీ) తదితర పక్షాలు సైతం తొలిసారిగా ఎన్డీయే సమావేశంలో పాల్గొనబోతున్నాయి. ఇందులో కొన్ని పార్టీలు ఇప్పటికే బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా.. వాస్తవానికి కొన్ని పార్టీలు ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయాయి. జేడీ(యూ), శివసేన(ఉద్ధవ్ ఠాక్రే), అకాలీదళ్ దూరమయ్యాయి. వీటి స్థానంలో కొత్త పార్టీలు తమ కూటమిలో అడుగు పెతుండడం ఎన్డీయేలో కొత్త ఉత్సాహం నింపుతోంది. తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకేతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొన్ని పార్టీలు కూడా ఎన్డీయే సమావేశానికి హాజరు కానున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి ఏర్పాటైన తర్వాత అధికార కూటమి సమావేశం భారీ స్థాయిలో జరుగుతుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ భేటీలో వ్యూహ రచన చేయనున్నట్లు తెలుస్తోంది. -
ఎన్డీయేలోకి ఎల్జేపీ (రామ్‌విలాస్)!
పట్నా: బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)లో బిహార్‌కు చెందిన లోక్ జనశక్తి పారీ్ట(రామ్ విలాస్) భాగస్వామిగా చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నేత, ఎంపీ చిరాగ్ పాశ్వాన్‌తో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు నిత్యానంద రాయ్ తాజాగా చర్చలు జరిపారు. బీజేపీ, దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ ఒకే విలువలను పంచుకొనేవారని గుర్తుచేశారు. ప్రజా సాధికారతతోపాటు అభివృద్ది కోసం పాశ్వాన్ ఎంతగానో తపించేవారని కొనియాడారు. అయితే, ఎన్డీయేలో లోక్ జనశక్తి పారీ్ట(రామ్ విలాస్) చేరికపై నిత్యానంద రాయ్ నేరుగా స్పందించలేదు. చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. బీజేపీతో మరో దఫా చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎన్డీయేలో చేరికపై ఇప్పుడే స్పందించడం సరైంది కాదన్నారు. బీజేపీపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన అభిమానాన్ని ఆయన గతంలో పలుమార్లు చాటుకున్నారు. -
ఇక మిగిలింది అథవాలే ఒక్కరే!
న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అధినేత, కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మరణంతో ఎన్డీయే మంత్రివర్గంలో బీజేపీ మిత్రపక్షాల నుంచి రాంధాస్ అథవాలే ఒక్కరే మిగిలారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు అయిన అథవాలే ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రిగా పని చేస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే–2 ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన అరవింద్ సావంత్(శివసేన), హర్సిమ్రత్ కౌర్ బాదల్(శిరోమణి అకాలీదళ్) గతంలోనే రాజీనామా చేశారు. తాజాగా పాశ్వాన్(ఎల్జేపీ) అనారోగ్యంతో మృతిచెందారు. (చదవండి: పాశ్వాన్ కన్నుమూత ) ఇక శివసేన, శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయాయి. మరో మిత్రపక్షం జేడీ(యూ) కేంద్రంలో ఎన్డీయే సర్కారుకు బయటి నుంచి మద్దతు ఇస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాకుండా 57 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో 24 మంది కేబినెట్, 9 మంది సహాయ మంత్రులు(స్వతంత్ర హోదా), 24 మంది సహాయ మంత్రులు. అరవింద్ సావంత్, హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా, పాశ్వాన్ మరణంతో కేబినెట్ మంత్రుల సంఖ్య 21కి పడిపోయింది. అలాగే రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి మృతితో సహాయ మంత్రుల సంఖ్య 23కు పడిపోయింది. రాజ్యాంగం ప్రకారం ప్రధాని మోదీ 80 మంది మంత్రులను నియమించుకునేందుకు అవకాశం ఉంది. -
బిహార్ ఎన్డీఏ నుంచి ఎల్జేపీ ఔట్
న్యూఢిల్లీ: బిహార్‌లో అధికారంలో ఉన్న నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) నుంచి ఆదివారం కీలక భాగస్వామ్య పక్షం లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వైదొలగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోరాడుతామని స్పష్టం చేసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 143 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించింది. భవిష్యత్తులో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలన్నది తమ లక్ష్యమని, అందుకు కృషి చేస్తామని పేర్కొంది. ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ అధ్యక్షతన జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామ్యపక్షంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆ భేటీలో నిర్ణయించారు. లక్షలాది బిహారీల అభిప్రాయాలను క్రోడీకరించి తాము రూపొందించిన ‘బిహార్ ఫస్ట్.. బిహారీ ఫస్ట్’ దార్శనిక పత్రం అమలు జేడీయూతో కలిసి కూటమిలో ఉంటే సాధ్యం కాదని స్పష్టమైందని వ్యాఖ్యానించింది. జేడీయూతో సైద్ధాంతిక విభేదాల కారణంగా కూటమికి సంబంధం లేకుండా బరిలో నిలవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, బీజేపీ అభ్యర్థులు పోటీలో నిలిచిన స్థానాల్లో ఎల్జేపీ తరఫున అభ్యర్థులను నిలపబోమని తెలిపింది. బీజేపీపై వ్యతిరేకత లేదని, ప్రధాని మోదీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొంది. ఎల్జేపీ నిర్ణయంతో.. రానున్న ఎన్నికల్లో జేడీయూ పలు స్థానాల్లో నష్టపోనుందని, కాంగ్రెస్, ఆర్జేడీల విపక్ష కూటమి లాభపడే అవకాశముందని భావిస్తున్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: వీఐపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీకి దిగుతామని విపక్ష కూటమి నుంచి బయటకు వచ్చిన వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) ప్రకటించింది. రామ్‌విలాస్ పాశ్వాన్‌కు శస్త్ర చికిత్స కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్‌కు ఆదివారం గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. అస్వస్థతతో గత కొన్ని వారాలుగా పాశ్వాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దళిత నేత హత్య బహిష్కృత ఆర్జేడీ నేత శక్తి మాలిక్ ఆదివారం హత్యకు గురయ్యారు. బిహార్‌లోని పుర్నియా జిల్లాలోని ఆయన నివాసంలో దుండగులు ఆయనపై కాల్పులు జరిపి, పారిపోయారు. ఇది రాజకీయ హత్య అని, దళిత నాయకుడైన తన భర్త స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన భార్య ఆరోపించారు. శక్తి మాలిక్ హత్య అనంతరం ఒక వీడియో వైరల్ అయింది. రాణిగంజ్ టికెట్ కావాలంటే రూ. 50 లక్షలు ఇవ్వాలని తేజస్వీ యాదవ్ శక్తి మాలిక్‌ను డిమాండ్ చేస్తున్నట్లుగా, అంతు చూస్తానని బెదిరించినట్లు, కులం పేరుతో దూషించినట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ కేసులో తేజస్వీ, తేజ్ ప్రతాప్ యాదవ్‌లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. -
ఎన్డీయేకు గుడ్‌బై చెప్పిన మిత్రపక్షం
చండీగఢ్: వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డీఏ) నుంచి వైదొలుగుతున్నట్లు శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) ప్రకటించింది. శనివారం ఇక్కడ జరిగిన పార్టీ అత్యవసర సమావేశం అనంతరం పార్టీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రైతులు తమ పంటలను కనీస మద్దతు ధరకు విక్రయించుకునేందుకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి కేంద్రం నిరాకరించడంతోపాటుగా, జమ్మూకశ్మీర్‌లో పంజాబీని రెండో అధికారి భాష స్థాయి నుంచి తొలగించడం వంటి చర్యలకు నిరసనగా ఎన్డీఏ నుంచి బయటకు రావాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. రైతుల ఆకాంక్షలను గౌరవించడంలో కేంద్రం విఫలమైనందునే..బీజేపీతో తమ పార్టీ చిరకాల మైత్రికి ఫుల్స్టాప్ పెట్టాల్సివచ్చిందన్నారు. -
మ్యాజిక్ ఫిగర్‌కు ఎన్డీఏ దూరం
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్(ఎన్డీయే) కూటమి అధికారానికి 20 సీట్ల దూరంలో నిలవనుందని తాజా సర్వే ఒకటి తేల్చింది. ఎన్డీయేకు 252, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 147, ఈ రెండు కూటముల్లోనూ లేని ఇతర పార్టీలకు 144 సీట్లు వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది. జనవరి నెలలో ఆంగ్ల వార్తాచానెల్ ‘టెమ్స్ నౌ’.. వీఎంఆర్ సంస్థతో కలిసి.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలపై సర్వే నిర్వహించింది. జనవరి 14 నుంచి 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 15, 731 మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలు సేకరించింది. గతంలో ఇండియాటుడే, రిపబ్లిక్ చానెళ్లు ప్రకటించిన సర్వేల తరహాలోనే ఈ సర్వే సైతం ‘ఇతరులకు’ కీలక స్థానం కల్పించింది. మొత్తం 543 సీట్లలో మెజారిటీ మార్కు 272కి 20 సీట్ల దూరంలో ఎన్డీయే నిలవడం విశేషం. యూపీఏకు కేవలం 147 సీట్లు రానున్న నేపథ్యంలో.. ఇతర పార్టీలు సాధించిన 144 స్థానాలు అత్యంత కీలకం కానున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి 215, కాంగ్రెస్‌కు 96 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. 2014లో ఎన్డీయే 336 సీట్లు సాధించి అధికారంలోకి రాగా, అందులో మెజారిటీ మార్కు 272ను మించి 282 సీట్లు బీజేపీ గెల్చుకున్నవే కావడం గమనార్హం. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 44 సీట్లు సాధించగా, ఈ ఎన్నికల్లో కొంత పుంజుకున్నా.. సెంచరీ స్థానాలకు కొంత దూరంగానే నిలుస్తుందని సర్వే తేల్చింది. ఇతరుల్లో.. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ తమతమ రాష్ట్రాలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయని సర్వే పేర్కొంది. పశ్చిమబెంగాల్లోని మొత్తం 42 స్థానాల్లో 32 సీట్లను తృణమూల్ కాంగ్రెస్.. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 సీట్లలో అత్యధికంగా 23 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంటాయంది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో 10 సీట్లను తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్), 5 స్థానాలను కాంగ్రెస్, ఒక్కో సీటు చొప్పున బీజేపీ, ఎంఐఎం గెలుచుకుంటాయంది. ఒడిశాలో బీజేపీ బలం పుంజుకుంటుందని సర్వే అంచనా వేసింది. మొత్తం 21 సీట్లలో 13 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, బీజేడీ 8 సీట్లకు పరిమితమవుతుందని వెల్లడించింది. ఇక్కడ 2014లో బీజేడీ 20 సీట్లు గెలుచుకుంది. 2019లో ఈశాన్య రాష్ట్రాల్లోని 11 సీట్లలో బీజేపీ 9 స్థానాలు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ– వీఎంఆర్ సర్వే పేర్కొంది. యూపీలో.. కీలక రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లోని మొత్తం 80 స్థానాల్లో ఎస్పీ– బీఎస్పీ కూటమికి 51, ఎన్డీయేకు 27 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ 2 స్థానాలకే పరిమితమవుతుందని తేల్చింది. 2014లో వేర్వేరుగా పోటీ చేసి ఎస్పీ 5 సీట్లు గెలుచుకోగా, బీఎస్పీ బోణీ చేయకపోవడం గమనార్హం. ఆ ఎన్నికల్లో యూపీలో ఎన్డీయే 73 సీట్లు గెలుచుకుంది. ఇతర కీలక రాష్ట్రాల్లో.. రాజస్తాన్‌లో బీజేపీ గతంలో మొత్తం 25 సీట్లను గెలుచుకోగా, ఈసారి ఆ సంఖ్య 17కి తగ్గుతుందని, 8 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. 2014లో గుజరాత్‌లోని మొత్తం 26 సీట్లను క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ ఈ సారిఅందులోనుంచి రెండు సీట్లను కాంగ్రెస్‌కు కోల్పోనుంది. కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో 14 సీట్లు గెలుచుకుంటాయి. మధ్యప్రదేశ్‌లోని 29 సీట్లలో బీజేపీ 23, కాంగ్రెస్ 6 గెలుచుకోనున్నాయి. 2014లో బీజేపీ 27, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 48 సీట్లలో ఎన్డీయే 43 (2014 కన్నా ఒక సీటు ఎక్కువ), యూపీఏ 5 గెలుచుకుంటాయి. బిహార్‌లో(40) గత ఎన్నికల్లో ఎన్డీయే 30 సీట్లు గెలుచుకోగా.. ఈ సారి 25 కి పరిమితమవుతుంది. యూపీఏ బలం 15కి పెరుగుతుంది. మొత్తం సీట్లు: 543 ఎన్డీఏ: 252 యూపీఏ: 147 ఇతరులు: 144 కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాద్రా నగర్ హవేలీ (1), డామన్ డయ్యూ (1), అండమాన్ నికోబార్ దీవులు (1) లోక్‌సభ స్థానాలను ఎన్డీయే పార్టీలు, అటు చండీగఢ్ (1) స్థానాన్ని యూపీఏ గెలుస్తుంది. లక్షద్వీప్ (1)లో ఎన్సీపీ, సిక్కింలో ఉన్న ఒక్క స్థానాన్ని ఇతరులు గెలుచుకుంటారు. పుదుచ్చేరిలోనూ ఒక లోక్‌సభ సీటు ఉన్నప్పటికీ దాని గురించి సర్వే నివేదికలో ప్రస్తావించలేదు. -
ఏపీ సీఎం చంద్రబాబుకు షాక్
-
కేంద్ర ప్రభుత్వంలోకి జేడీ(యూ)
పట్నా: బిహార్ అధికార పక్షం జనతాదళ్ యునైటెడ్ పార్టీ అధికారికంగా నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కూటమిలో భాగస్వామిగా మారిపోయింది. శనివారం జరిగిన పార్టీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడు నితీశ్ కుమార్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో కేంద్ర కేబినెట్ లోకి ప్రవేశించేందుకు జేడీ(యూ)కు మార్గం సుగమం అయ్యింది. మహాకూటమి నుంచి నిష్క్రమించి బీజేపీ కూటమితో నితీశ్ చేతులు కలిపిన విషయం తెలిసిందే. దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ తన వర్గీయులతో వేర్వేరు సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇదిలా ఉంటే జేడీ(యూ) సమావేశం జరుగుతున్న సమయంలో శరద్ మద్ధతుదారులు, ఆర్జేడీ కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో నితీశ్ ఇంటి బయట భద్రతను భారీగా పెంచారు. లాలూ విసుర్లు... ఇది జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశం కాదని, బీజేపీ భేటీ అని, వాళ్లే ఎన్డీఏలో చేరుతున్నారంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎద్దేవా చేశారు. కుంభకోణాల నుంచి బయటపడేందుకు నితీశ్, సుశీల్ మోదీలు పబ్లిక్‌గా ముక్కు ముక్కు రాసుకుంటున్నారని లాలూ పేర్కొన్నారు. -
చిన్న షేర్లు ముద్దు
కొత్త ప్రభుత్వం ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపడుతుందన్న అంచనాలు మార్కెట్లలో ఊపందుకున్నాయి. సంస్కరణల జోరు పెరుగుతుందన్న ఆశలు ఇందుకు జత కలిశాయి. మౌలిక సదుపాయాలు, విద్యుత్, సిమెంట్, మైనింగ్, బ్యాంకింగ్ తదితర రంగాలకు జవసత్వాలు కల్పించే బాటలో పటిష్ట విధాన నిర్ణయాలుంటాయని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో సోమవారం ట్రేడింగ్‌లో ఇన్ఫ్రా, పవర్ రంగాల షేర్లు కొనుగోళ్ల వెల్లువతో రేసు గుర్రాల్లా దూసుకెళ్లాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్ 6% జంప్‌చేయగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ సైతం 4% ఎగసింది. ట్రేడైన షేర్లలో 2,154 లాభపడితే, 698 నష్టపోయాయి. రాష్ట్ర కంపెనీల హవా... చిన్న షేర్లలో జేపీ పవర్ 30%పైగా దూసుకెళ్లగా, రాష్ర్ట కంపెనీల షేర్లు జీవీకే పవర్, కేఎస్కే ఎనర్జీ, ఐవీఆర్సీఎల్ ఇన్ఫ్రా, ల్యాంకో ఇన్ఫ్రా, జీఎంఆర్ ఇన్ఫ్రా 20% స్థాయిలో ఎగశాయి. ఈ బాటలో ఇతర మిడ్ క్యాప్స్ జేకే లక్ష్మీ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా, ఇండియాబుల్స్ పవర్, సుజ్లాన్ ఎనర్జీ, జేకే సిమెంట్, హెచ్‌సీసీ, బీఈఎంఎల్, జేపీ ఇన్ఫ్రా, పుంజ్‌లాయిడ్, గేట్‌వే డిస్ట్రిపార్క్స్, సింటెక్స్, బీఎస్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్, బీజీఆర్ ఎనర్జీ, ఓరియంట్ సిమెంట్, ఇండియా సిమెంట్, కల్పతరు పవర్, ఇండియన్ బ్యాంక్, వోల్టాస్, జేపీ అసోసియేట్స్, ఎన్సీసీ, శ్రేఈ ఇన్ఫ్రా, క్రాంప్టన్ గ్రీవ్స్, దేనా బ్యాంక్, స్టెరిలైట్ టెక్, ఐఆర్బీ ఇన్ఫ్రా, సద్భావ్ ఇంజినీరింగ్, జిందాల్ సా తదితరాలు 20-12% మధ్య పురోగమించాయంటే వీటికి ఏ స్థాయిలో డిమాండ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు! మార్కెట్ల దూకుడుకు అనుగుణంగా రిటైల్ ఇన్వెస్టర్లు సైతం పెట్టుబడులకు ఉపక్రమిస్తుండటంతో బ్రోకింగ్ షేర్లు మోతీలాల్ ఓస్వాల్, ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సైతం 20% జంప్ చేయడం విశేషం!