సాక్షి, న్యూఢిల్లీ: మోదీ 3.0పై బీజేపీ ధీమాతో ఉంది. ఈ క్రమంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. సొంతంగానే 370 స్థానాలు, జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) 400కు పైగా సీట్లు గెలుచుకోవడం తథ్యమని ఇప్పటికే చాలాసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ లక్ష్య సాధనలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం కోసం కీలక సమావేశాలు నిర్వహించబోతున్నారు.
శనివారం నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కమల శ్రేణులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్ కార్యాచరణ, లక్ష్యాలు.. వాటి సాధనకు ఏం చేయాలి.. ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహాలను ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఇక..
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 11,500 మందికిపైగా బీజేపీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొనబోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే వందలాది మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్ష ప్రసంగంతో శనివారం మధ్యాహ్నం ప్రారంభమయ్యే జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంతో ముగుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment