National executive meetings
-
BJP National Executive Meeting: నవ భారతం నిర్మిద్దాం: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: నవ భారత నిర్మాణం కోసం కదలి రావాలని బీజేపీ శ్రేణులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. లక్ష్య సాధన కోసం రాబోయే 100 రోజులు ఎంతో కీలకమని, ‘అబ్కీ బార్ చార్ సౌ పార్’ మిషన్‌తో పనిచేద్దామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాకుండా దేశ నిర్మాణం కోసం పనిచేద్దామని సూచించారు. అభివృద్ధి ఎజెండా లేని కాంగ్రెస్ పార్టీ నుంచి దేశాన్ని, యువతను రక్షించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. భారతదేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కోరుకుంటున్నాయని చెప్పారు. ఈ ఏడాది జూలై, ఆగస్టు, సెపె్టంబర్లో జరిగే కార్యక్రమాలకు హాజరు కావాలంటూ చాలా దేశాలు తనను ఆహా్వనిస్తున్నాయని తెలిపారు. ఇండియాలో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని ఆయా దేశాలు భావిస్తున్నాయని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 400 స్థానాలు వస్తాయని మన దేశంలో విపక్షాలు సైతం నినదిస్తున్నాయని గుర్తుచేశారు. ఢిల్లీలో భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. బీజేపీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 64 నిమిషాలపాటు ప్రసంగించారు. కాంగ్రెస్ సహా విపక్షాలపై నిప్పులు చెరిగారు. సొంతంగా అనుభవించడానికి అధికారం కోరుకోవడం లేదని, దేశానికి మేలు చేయాలన్నదే తన తపన అని స్పష్టం చేశారు. శతాబ్దాల సమస్యలను పరిష్కరించాం దేశంలో శతాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కారించేందుకు సాహసం చేశామని మోదీ చెప్పారు. ‘‘500 ఏళ్ల నాటి అయోధ్య సమస్యను రామమందిర నిర్మాణంతో పరిష్కరించాం. ఏడు దశాబ్దాల తర్వాత ఆరి్టకల్ 370 నుంచి జమ్మూకశీ్మర్‌కు విముక్తి లభించింది. మూడు దశాబ్దాల తర్వాత మహిళ రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ చట్టాలు తెచ్చాం. పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. నా సొంతింటి గురించే ఆలోచించుకుని ఉంటే ఇంతమందికి ఇళ్లు నిర్మించివ్వడం సాధ్యమయ్యేది కాదు. మూడోసారి అధికారంలోకి వచ్చాక భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుస్తాం. సీఎంగా, ప్రధానిగా ఎంతో సాధించారు, ఇక విశ్రాంతి తీసుకోండని ఓ సీనియర్ నాయకుడు నాతో అన్నారు. నేను రాజనీతి, రాష్ట్రనీతి కోసం పని చేస్తా. ఛత్రపతి శివాజీ ఆశయాలే నాకు స్ఫూర్తి’’ అన్నారు. దేశాన్ని విభజించే పనిలో కాంగ్రెస్ భాష, ప్రాంతం ఆధారంగా దేశాన్ని విభజించే పనిలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైందని ప్రధానమంత్రి దుయ్యబట్టారు. దేశ సైనికుల నైతిక స్థైర్యాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీసే పాపం కాంగ్రెస్ చేసిందన్నారు. సైన్యం సాధించిన విజయాలపై ప్రశ్నలు లేవనెత్తిందని విరుచుకుపడ్డారు. దేశానికి రఫెల్ యుద్ద విమానాలు రాకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పారీ్టకి, ఇండియా కూటమికి అభివృద్ధి ఎజెండానే లేదన్నారు. బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలను కాంగ్రెస్ పెంచి పోషించిందని విమర్శించారు. గతంలో ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఇప్పటికీ కుట్రలు చేస్తోందన్నారు. దేశాభివృద్ధి పట్ల ఎలాంటి ప్రణాళిక లేని ఆ పార్టీ విచ్చలవిడిగా హామీలు ఇస్తోందని ఆక్షేపించారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని దెబ్బతీసేందుకు విపక్షాలు ప్రయతి్నస్తున్నాయని మండిపడ్డారు. వచ్చే వెయ్యేళ్లలో ‘రామరాజ్యం’ అయోధ్య రామాలయమే ప్రతీక బీజేపీ జాతీయ సదస్సులో తీర్మానం అయోధ్యలో రామ మందిర నిర్మాణం పట్ల బీజేపీ హర్షం వెలిబుచ్చింది. ఇది ప్రతి భారతీయుడికి ఆనందం కలిగించిందని పేర్కొంది. రాబోయే వెయ్యేళ్లలో సంవత్సరాల్లో స్థాపించబోయే రామరాజ్యానికి ఈ ఆలయం ప్రతీక అంటూ ఆదివారం జాతీయ సదస్సులో తీర్మానాన్ని ఆమోదించింది. ‘‘అయోధ్య రామాలయం జాతిని జాగృతం చేసే ఆలయం. వికసిత్ భారత్ తీర్మానాల సాకారంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. రాముడి జన్మస్థానంలో భవ్య మందిర నిర్మాణం చరిత్రాత్మక విజయం. తీర్మానంలో ప్రస్తావించారు. రాజ్యాంగ అసలు ప్రతిలో సీతా రామ లక్ష్మణుల చిత్రాలున్నాయి. పౌరుల ప్రాథమిక హక్కులకు రాముడు స్ఫూర్తి అనేందుకిదే నిదర్శనం. రామరాజ్యమనే భావన మహాత్మాగాంధీ హృదయంలోనూ ఉండేది. ఆ ఆదర్శాలను మోదీ చక్కగా పాటిస్తున్నారు’’ అంటూ కొనియాడింది. రామమందిర ప్రాణప్రతిష్టను విజయవంతంగా నిర్వహించిన మోదీకి అభినందనలు తెలిపింది. వచ్చే వంద రోజులు కీలకం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వచ్చే 100 రోజుల ఎంతో కీలకమని మోదీ చెప్పారు. ఈ 100 రోజులు కొత్త శక్తి, ఉత్సాహం, విశ్వాసంతో పని చేయాలని సూచించారు. ‘‘ఈ రోజు ఫిబ్రవరి 18. దేశంలో 18 ఏళ్లు నిండిన యువత 18వ లోక్‌సభకు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. రాబోయే వంద రోజుల్లో ప్రతి కొత్త ఓటరును, ప్రభుత్వ పథకాల లబి్ధదారును పలుకరించండి. ప్రతి ఇంటికీ వెళ్లండి. అందరి విశ్వాసం పొందండి. బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చేలా ప్రతి ఒక్కరూ పని చేయాలి. బీజేపీకి సొంతంగా 370కి పైగా స్థానాలు, ఎన్డీఏకి ‘అబ్కీ బార్, చార్సౌ పార్’ మిషన్‌తో పని చేద్దాం. ఇకపై భారత్ స్వప్నాలు, సంకల్పాలు విశాలమైనవిగా ఉంటాయి. ఈ పదేళ్లలో ఒక మైలురాయిని మాత్రమే చేరాం. కోట్లాది మంది ప్రజల జీవితాలను మార్చాల్సి ఉంది. తీసుకోవాల్సిన నిర్ణయాలెన్నో ఉన్నాయి. యువత, మహిళ, పేదలు, రైతుల శక్తిని ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి వినియోగించుకోవాలి. ఆయా వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, కొత్త చట్టాలు తీసుకొచ్చాం. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే పెద్ద తీర్మానం చేసుకున్నాం’’ అన్నారు. -
BJP National Convention 2024: 100 రోజులు.. 370 స్థానాలు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి 370 నియోజవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అగ్రనేతలు దిశానిర్దేశం చేశారు. బీజేపీ సొంతంగానే 370 స్థానాలు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కనీసం 400 స్థానాలు దక్కించుకోవడానికి రాబోయే వంద రోజులు కష్టపడి పనిచేయాలని వెల్లడించారు. గడిచిన పదేళ్ల కాలంలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు లభిస్తున్నగౌరవాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమయ్యాయి. మరో మూడు నెలల్లోగా జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు. తొలిరోజు భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, కోర్ కమిటీ సభ్యులు, ఇతర సీనియర్ నేతలు సహా 11 వేల మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విజయాలను తెలిలియజేసే ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోదీ, నడ్డా తదితరులు తిలకించారు. అనంతరం పలువురు ముఖ్యనేతలు ప్రసంగించారు. ఎన్నికల్లో గెలుపు లక్ష్యాలు, ప్రచార వ్యూహాలపై మార్గనిర్దేశం చేశారు. ముఖర్జీకి నిజమైన నివాళి: మోదీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవడమే బీజేపీ లక్ష్యమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. శనివారం బీజేపీ జాతీయ ఆఫీసు–బేరర్ల భేటీలో ఆయన ప్రసంగించారు. జమ్మూకాశీ్మర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తూ రాజ్యాంగంలో చేర్చిన ఆరి్టకల్ 370ని జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో 370 స్థానాలు సాధించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి 100 రోజుల ప్రణాళిక ప్రకారం కార్యకర్తలు బూత్ స్థాయిలో పనిచేయాలని సూచించారు. ప్రతి బూత్‌లో కొత్తగా 370 ఓట్లు అధికంగా బీజేపీకి లభించేలా చూడటంతోపాటు కొత్త ఓటర్లను ఆకర్షించాలని చెప్పారు. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం: జేపీ నడ్డా ప్రధాని మోదీ నాయకత్వంలో పదేళ్ల కాలంలో బీజేపీ అనేక విజయాలు సాధించిందని జేపీ నడ్డా అన్నారు. 2014లో 5 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో బీజేపీ, 17 రాష్ట్రాల్లో ఎన్డీయే అధికారంలో ఉందని గుర్తుచేశారు. పశి్చమ బెంగాల్లో బీజేపీకి 10 శాతం ఓట్లు పెరిగాయని చెప్పారు. కొన్ని నెలల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పారీ్టకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని, మూడు రాష్ట్రాల్లో విజయం సాధించామని తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీ పరంగా గెలిచామని అన్నారు. రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేల సంఖ్య ఒక్కటి నుంచి 8కి, ఓట్ల శాతం 7.1 నుంచి 14కు పెరిగిందని వెల్లడించారు. తెలంగాణను వదిలిపెట్టబోమని, అక్కడ అధికారంలోకి వస్తామని, అందుకు ప్రణాళికలు తయారవుతున్నాయని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశ ప్రజలంతా దీపాలు వెలిగించినా, ప్రతిపక్ష నేతలు మాత్రం ఈ మహత్కార్యానికి దూరంగా ఉన్నారని విమర్శించారు. తెలంగాణ, ఏపీ నుంచి భారీగా హాజరైన నేతలు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు భారీగా హాజరయ్యారు. తెలంగాణ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపీ కె.లక్ష్మణ్‌లతో పాటు సీనియర్ నేతలు ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కూన శ్రీశైలం గౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సీనియర్ నేతలు సోము వీర్రాజు, కిరణ్‌కుమార్‌రెడ్డి, విష్ణువర్ధ్దన్‌రెడ్డి, సత్యకుమార్, కిలారు దిలీప్ హాజరయ్యారు. -
టార్గెట్ 370.. ఎలా రీచ్ అవుదాం?
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ 3.0పై బీజేపీ ధీమాతో ఉంది. ఈ క్రమంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. సొంతంగానే 370 స్థానాలు, జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) 400కు పైగా సీట్లు గెలుచుకోవడం తథ్యమని ఇప్పటికే చాలాసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ లక్ష్య సాధనలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం కోసం కీలక సమావేశాలు నిర్వహించబోతున్నారు. శనివారం నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కమల శ్రేణులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్ కార్యాచరణ, లక్ష్యాలు.. వాటి సాధనకు ఏం చేయాలి.. ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహాలను ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఇక.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 11,500 మందికిపైగా బీజేపీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొనబోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే వందలాది మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్ష ప్రసంగంతో శనివారం మధ్యాహ్నం ప్రారంభమయ్యే జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంతో ముగుస్తాయి. -
మోదీ శంఖారావం
న్యూఢిల్లీ: ఏడాదిన్నర ముందే ప్రధాని మోదీ ఎన్నికల శంఖం పూరించారు. ‘‘లోక్‌సభ ఎన్నికలు కేవలం 400 రోజుల దూరంలోనే ఉన్నాయి. ఇక టాప్ గేర్‌లో దూసుకెళ్లాల్సిన సమయం వచ్చేసింది. చరిత్ర సృష్టిద్దాం పదండి’’ అంటూ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశ రాజధానిలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చివరి రోజైన మంగళవారం కీలకాంశాలపై లోతైన చర్చ జరిగింది. ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అన్ని రాష్ట్రాల నుంచి హాజరైన 350 మంది బీజేపీ అగ్ర నేతలు, కేంద్ర మంత్రులు, సీఎంలు కూలంకషంగా చర్చించారు. చివరగా మోదీ కీలకోపన్యాసం చేశారు. భావి కార్యాచరణపై నేతలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. అతి విశ్వాసానికి ఎక్కడా చోటివ్వొద్దని హెచ్చరించారు. ‘‘బోహ్రాలు, పాస్మాండాలు, సిక్కులు... ఇలా సమాజంలోని ప్రతి వర్గానికీ చేరువ కండి. ఎన్నికల లబ్ధి గురించి ఆలోచించకుండా వారి సంక్షేమం కోసం పాటుపడండి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల వద్దకు తీసుకెళ్లండి. అన్నిచోట్లా, ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో ముమ్మరంగా ప్రత్యేక కార్యక్రమాలు, మోర్చాలు నిర్వహించండి. అక్కడి ప్రజలకు మరింత చేరువ కండి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కూడా అక్కడికీ చేరవేయండి. సరిహద్దు గ్రామాల యువతను బీజేపీ కార్యకర్తలుగా తీర్చిదిద్దండి. తద్వారా అక్కడా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయండి. 18–25 ఏళ్ల యువతకు దేశ రాజకీయ చరిత్ర తెలియదు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన విచ్చలవిడి అవినీతి, తప్పిదాలు తెలియవు. వీటన్నింటిపైనా వారికి అవగాహన కల్పించండి. అంతటి దుష్పరిపాలనను బీజేపీ ఎలా సుపరిపాలనగా మార్చి చూపించిందో యువతలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి’’ అని సూచించారు. ‘‘రానున్నది మన దేశానికి అత్యుత్తమ సమయం. వచ్చే పాతికేళ్ల అమృత కాలాన్ని కర్తవ్య కాలంగా మార్చుకుని కష్టపడితేనే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలం. ప్రజలకు సేవ చేసేందుకు అన్ని విధాలుగా కష్టపడదాం’’ అన్నారు. ‘‘అతి విశ్వాసానికి పోతే ప్రతికూల ఫలితాలు తప్పవు. 1998లో మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్‌సింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా బీజేపీ కేవలం అతి విశ్వాసం వల్లే ఓడింది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం’’ అంటూ నేతలను హెచ్చరించారు. మోదీ ప్రసంగం స్ఫూర్తిదాయకంగా మాత్రమే గాక సరికొత్త దిశానిర్దేశం చేసేదిగా సాగిందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. ప్రసంగ విశేషాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ సాకారానికి కృషి చేయాల్సిందిగా బీజేపీ కార్యకర్తలకు మోదీ పిలుపునిచ్చారు. పార్టీ కంటే దేశానికి ప్రాధాన్యమిస్తూ రాజకీయ నాయకునిగా గాక రాజనీతిజ్ఞుడిగా ఆయన ప్రసంగం సాగింది’’ అని ఫడ్నవీస్ చెప్పారు. ధర్తీ బచావో... పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిద్దామని బీజేపీ శ్రేణులకు మోదీ పిలుపునిచ్చారు. ‘‘బేటీ పఢావో మాదిరిగా ధర్తీ బచావో (భూమిని కాపాడండి) ఉద్యమానికి శ్రీకారం చుడదాం. రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించుకుందాం. కాశీ–తమిళ సంగమం తరహాలో భిన్న సంస్కృతులను, ప్రాంతాలను కలిపే వారధిగా పార్టీని తీర్చిదిద్దుకుందాం’’ అని సూచించారు. సినిమాలపై అనవసర వ్యాఖ్యలొద్దు: మోదీ సినిమాలు తదితర అంశాలపై అనవసర ప్రకటనలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని బీజేపీ నేతలను, శ్రేణులను మోదీ ఆదేశించారు. ‘‘ఏదో సినిమా గురించి మనవాళ్లలో ఎవరో ఏదో అంటారు. టీవీల్లో, మీడియాలో రోజంతా అదే వస్తుంది. అభివృద్ధి అజెండా తదితర అసలు విషయాలన్నీ పక్కకు పోతాయి. అందుకే అనవసర వ్యాఖ్యలేవీ చేయకండి’’ అని కరాఖండిగా చెప్పినట్టు సమాచారం. షారుఖ్‌ఖాన్ నటించిన పఠాన్ సినిమాలో కాషాయాన్ని కించపరిచారంటూ దాని బహిష్కరణకు నరోత్తం మిశ్రా, రామ్ కదమ్ తదితర బీజేపీ నేతలు, మంత్రులు బహిరంగంగా పిలుపునివ్వడం, దానిపై విమర్శలు చెలరేగడం తెలిసిందే. -
సంగ్రామ యాత్ర స్ఫూర్తితో ప్రజల్లోకి వెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రజా సంగ్రామ యాత్ర స్ఫూర్తిని ఇతర రాష్ట్రాలూ కొనసాగించాలని ప్రధాని మోదీ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజలకు పార్టీని చేరువ చేసిన మాదిరే ఇతర రాష్ట్రాల్లోనూ యాత్రలు నిర్వహించి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల చివరి రోజున ప్రధాని మోదీ ముగింపు ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా బండి ప్రజా సంగ్రామ యాత్రను ప్రస్తావించారు. ‘సార్వత్రిక ఎన్నికలకు కేవలం 400 రోజులే సమయముంది. ఈ ఏడాదే 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల రాష్ట్రాలతో పాటు, కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలంటే పార్టీ శ్రేణులు, నేతలు మరింతగా ప్రజల్లోకి వెళ్లాలి. వారితో మమేకం కావాలి. అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ ప్రజల్లోకి వెళ్లారు. ప్రభుత్వ అణిచివేతను ఎదుర్కొని నిర్వహించిన ఈ యాత్రకు మంచి స్పందన లభించింది. ఇలాంటి యాత్రల ద్వారా ప్రజలతో మమేకం అవ్వొచ్చు. వారి సమస్యలు వినే అవకాశం ఉంటుంది. తద్వారా వాటికి పరిష్కారాలు దొరుకుతాయి. ఇలాంటి యాత్రలే దేశంలో అవసరమైన అన్ని రాష్ట్రాల్లోనూ నిర్వహించండి’ అని మోదీ చెప్పారు. ఇదే సమయంలో యాత్ర జరుగుతున్న తీరును ప్రతి రాష్ట్రం నుంచి ఐదుగురు సభ్యులు బృందాలుగా వెళ్లి యాత్ర అనుభవాలు గమనించాలని, ప్రజల స్పందనను వినాలని ఆయన సూచించారు. తెలంగాణలో పార్టీ మెరుగు: అమిత్ షా ఇక జాతీయ కార్యవర్గాల సమావేశాల భేటీ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ జేపీ నడ్డా నేతృత్వంలో పార్టీ అద్భుతంగా పనిచేసిందని, ప్రజలకు సేవ చేసిందని కొనియాడారు. నడ్డా అధ్యక్షతన మహారాష్ట్ర, హరియాణాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయగా, యూపీ ఉత్తరాఖండ్, మణిపూర్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయాన్ని సాధించిందని కొనియాడారు. ఆయన నేతృత్వంలోనే పశ్చిమబెంగాల్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పార్టీ గణనీయంగా మెరుగుపడిందని, చెప్పుకోదగ్గ విజయాలు సాధించిందని అన్నారు. రెండో రోజు మరో ముగ్గురు: కాగా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణకు పార్టీ నాయకత్వం చాలా ప్రాధాన్యాన్నిచ్చింది. సమావేశాల మొదటి రోజున తెలంగాణలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్రపై బండి సంజయ్ ప్రజెంటేషన్‌ను ఇవ్వగా, రెండో రోజు దేశంలోని పరిస్థితులపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టగా, సామాజిక, ఆర్ధిక అంశాలపై వివేక్ వెంకట్‌స్వామి, కేంద్ర పథకాలపై పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. అధికారమే లక్ష్యంగా కొట్లాడండి: నడ్డా తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా కొట్లాడాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర నేతలకు పిలుపునిచ్చారు. నడ్డా పదవీకా లాన్ని పొడిగించిన నేపథ్యంలో కార్యవర్గ సమావేశం అనంతరం బండి సంజయ్, డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఇంద్రసేనారెడ్డి తదితరులు ఆయన్ను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటించిన నడ్డా తెలంగాణలో పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. తాను కూడా తరచూ తెలంగాణలో పర్యటిస్తానని నేతలకు చెప్పారు. -
కౌంట్ డౌన్ 400.. బీజేపీ నేతలకు పొలిటికల్ ప్లాన్ వివరించిన మోదీ
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశాల సందర్బంగా రానున్న లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ కౌంట్‌డౌన్ మొదలుపెట్టింది. బీజేపీ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. కాగా, మరో 400 రోజుల్లో లోక్‌సభ ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు పార్టీ నాయకులంతా సిద్ధం కావాలని మోదీ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో తిరిగి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన పార్టీ శ్రేణులకు భరోసా నింపారు. అయితే, ఇందుకోసం పార్టీ నాయకులంతా ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలను కచ్చితంగా కలుసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ప్రధాని పార్టీ నాయకులను కోరారు. ఎన్నికలు కేవలం 400 రోజుల్లోనే ఉన్న నేపథ్యంలో మిషన్ మోడ్‌లో పనిచేయాలని కోరారు. తెలంగాణ , పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాలలో బీజేపీ మరింత బలోపేతమైన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజాసంగ్రామ యాత్రను పార్టీ శ్రేణులకు వివరించారు. ఈ యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్తున్న బండి సంజయ్‌ను ప్రధాని మోదీ స్వయంగా అభినందించారు. సమావేశాల చివరి రోజున బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగిస్తూ పార్టీ జాతీయ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎడాది జూన్ వరకు ఈ పదవి కాలం పొడిగించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. మొత్తానికి రెండు రోజులపాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలు పార్టీ ప్రతినిధుల్లో ఫుల్ జోష్ నింపాయి. ఈ సమావేశాలకు దాదాపు 350 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో సామాజిక, ఆర్థిక, విదేశాంగ అంశాలపై పలు తీర్మానాలను ఆమోదించారు. -
మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీని ప్రశంసిస్తూ మోదీ లేఖ
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్‌ను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ట్విట్టర్లో ఆ లేఖను పోస్ట్ చేశారు. ‘రెండు దశాబ్దాలకు పైగా మీరు భారత క్రికెట్‌కు సేవలందించారు. మీ ప్రతిభాపాఠవాలతో జాతీయ జట్టును నడిపించిన తీరు అమోఘం. మీ ప్రదర్శన అద్భుతం. ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. మీ కెరీర్ మొత్తం అంకెలతో ఉన్నత శిఖరాలకు చేరింది. మీ సుదీర్ఘ ప్రయాణంలో మీరెన్నో రికార్డులను నెలకొల్పారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక టాప్‌స్కోరర్‌గా నిలిచారు. ఓ అథ్లెట్‌గా ట్రెండ్ సెట్టర్ అయ్యారు’ అని ప్రధాని అందులో పేర్కొన్నారు. -
బీజేపీ సంబరాలకు ఫడ్నవీస్ దూరం
ముంబై: మహారాష్ట్ర సీఎం అవుతారని అంతా భావించగా బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయంతో ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ ఈ పరిణామంపై అసంతృప్తిగా ఉన్నారా? ఆయన వ్యవహార శైలి ఈ అనుమానాలను బలపరిచేలానే ఉందంటున్నారు. మహారాష్ట్రలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చినందుకు శుక్రవారం రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంబరాలకు ఆయన డుమ్మా కొట్టారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా హాజరు కాబోరని సమాచారం. ఆదివారం నుంచి జరిగే రెండు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన చర్చల్లో ఫడ్నవీస్ బిజీగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. షిండే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తామని ఆయన గురువారం ప్రకటించడం, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దాన్ని వెంటనే ఖండించడం తెలిసిందే. బీజేపీ కూడా ప్రభుత్వంలో చేరుతుందని, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అవుతారని నడ్డా ప్రకటించారు. 2014 నుంచి 19 దాకా ఐదేళ్ల పాటు ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో షిండే ఆయన కేబినెట్లో మంత్రిగా పని చేశారు. ఇప్పుడు షిండే మంత్రివర్గంలో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా చేరాల్సి వచ్చింది! మరోవైపు షిండే ప్రమాణస్వీకారం ముగుస్తూనే ఎన్సీపీ నేత ధనంజయ్ ముండేతో ఫడ్నవీస్ భేటీ అయినట్టు చెబుతున్నారు. అయితే ఫడ్నవీస్ డిప్యూటీ అవడం అనూహ్యమేమీ కాదని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చెప్పుకొచ్చారు. ‘‘ఇది చాలా మందికి షాకిచ్చిందని నాకు తెలుసు. కానీ ఇందులో అనూహ్యమేమీ లేదు. హిందూత్వ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు షిండేకు సీఎం పోస్టు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. కానీ షిండే స్వయంగా ఫడ్నవీస్‌ను తన మంత్రివర్గంలో చేరాల్సిందిగా కోరారు. దాంతో ఢిల్లీ పెద్దల అనుమతితో ఆయన చేరారు’’ అని చెప్పారు. మనకింద పని చేసిన వ్యక్తి సారథ్యంలో పని చేయాలంటే ఎంతో పెద్ద మనసుండాలన్నారు. -
మోదీకి యాదమ్మ మెనూ
‘ఇంటి వంట’ స్త్రీలకు అప్పజెప్పి ‘ఉత్సవ వంట’ మగాడు హస్తగతం చేసుకున్నాడు. నలభీములే భారీ వంటలు చేస్తారట. పెద్ద పెద్ద హోటళ్లలో చెఫ్స్ మగాళ్లే ఉండాలట. ఈ మూస అభిప్రాయాన్ని మన తెలంగాణ మహా వంటగత్తె బద్దలు కొట్టింది. ‘వింటే భారతం వినాలి తింటే గూళ్ల యాదమ్మ వంట తినాలి’ అని పేరు సంపాదించింది. అందుకే హైదరాబాద్‌కు మోదీ వస్తుంటే కాల్ యాదమ్మకు వెళ్లింది. ‘యాదమ్మగారూ ఏం వొండుతున్నారు ప్రధానికి?’ అని అడిగితే నోరూరించేలా ఆమె చెప్పిన మాటలు ఏమిటో తెలుసా? ప్రధాని మోదీ ఇష్టపడే వంటకం ఏమిటో తెలుసా? కిచిడి. ఆయన గుజరాతీ కాబట్టి ‘ఢోక్లా’ అంటే కూడా చాలా ఇష్టం. శనగపిండి, మజ్జిగ కలిపి చేసే ‘ఖాండ్వీ’ ఉంటే మరో ముద్ద ఎక్కువ తింటారు. ఈ మూడూ మామిడి పచ్చడి, శ్రీఖండ్ ఉంటే సరేసరి. అయితే ఈసారి ఆయనను సంతోషపెట్టే వంటకాలు వేరే ఉన్నాయి. అవి అచ్చు తెలంగాణ వంటకాలు. తెలుగు వంటకాలు. హైదరాబాద్ పర్యటనకు హాజరవుతున్న మోదీ ‘స్థానిక వంటకాలు తింటాను’ అని చెప్పినందున సిద్ధమవుతున్నాయి. అయితే వీటిని వండుతున్నది ఫైవ్‌స్టార్ హోటళ్ల చెఫ్‌లు కాదు. కరీంనగర్ పల్లె నుంచి ఇంతింతై ఎదిగిన గొప్ప వంటకత్తె గూళ్ల యాదమ్మ. ఆమెతో ‘సాక్షి’ మాట్లాడింది. గంగవాయిలి కూర... ఆలుగడ్డ వేపుడు ‘మోదీ గారికి ఏం వండాలో చివరి నిమిషంలో చెప్తామన్నారు. కాని తెలంగాణ రుచి తెలియాలంటే ఏం వండాలో మనసులో అనుకున్నా. ముద్దపప్పు, గంగవాయిలి కూర, పప్పు చారు, పుంటికూర, ఆలుగడ్డ వేపుడు, పచ్చి పులుసు చేద్దామనుకుంటున్నా’ అంది గూళ్ల యాదమ్మ. వీటితో పాటు సకినాలు, సర్వపిండి, అరిసెలు, భక్ష్యాలు, పాయసం, పప్పుగారెలు యాదమ్మ లిస్ట్‌లో ఉన్నాయి. ‘ఇంతకాలం 20 వేలు, 50 వేల మందికి వంట చేశాను.135 కోట్ల మందికి ప్రధాని అయిన మోదీకి చేస్తానని ఏనాడూ అనుకోలేదు. ఒక రకంగా దేశ ప్రజలందరికీ వంట చేసినట్లుగానే భావిస్తున్నా’ అంది యాదమ్మ. జీవితం చెదిరినా రుచి కుదిరింది ‘మా స్వగ్రామం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి. అత్తవారు పక్కనే కొండాపూర్. పదిహేనేళ్లకు పెళ్లయితే కొడుకు పుట్టిన మూడు నెలలకు నా భర్త చంద్రయ్య పనిలో మట్టిపెళ్లెలు కూలి మరణించాడు. బతుకు చెదిరిపోయింది. అత్తగారి ఇంట నరకం మొదలయ్యింది. నేనూ నా కొడుకు బతకాలంటే నా కాళ్ల మీద నిలబడాలనుకున్నాను. 1993లో కొండాపూర్‌లో తెల్లవారుజామున 4 గంటలకు భుజాన మూడు నెలల పసిగుడ్డును వేసుకుని బస్టాప్‌కు వచ్చి కరీంనగర్ బస్సెక్కా. కొన్నాళ్లు స్కూల్ ఆయాగా పని చేశా. ఆ తర్వాత నా గురువు వెంకన్న వద్ద పనికి కుదరడం నా జీవితాన్ని మార్చివేసింది. ఆయన రోజుకు 15 రూపాయలు కూలీ ఇచ్చేవాడు. ఆ దశ నుంచి లక్షల రూపాయల కాంట్రాక్టుతో వేల మందికి భోజనం పెట్టే స్థాయికి ఎదిగాను’ అంది యాదమ్మ. నిజానికి భారీ వంటలంటే మగవారే సమర్థంగా చేయగలరు అనే స్థిర అభిప్రాయం ఉంది. కాని యాదమ్మ వేల మందికి అలవోకగా వండుతూ పెద్ద పెద్ద వంట మాస్టర్లను చకితులను చేస్తోంది. ఇది సామాన్యమైన విజయం కాదు. నాటుకోడి... నల్ల మాంసం ‘నేను తెలంగాణ నాన్‌వెజ్ కూడా బాగా చేస్తాను. అవే నాకు పేరు తెచ్చాయి. మటన్, చికెన్, నాటుకోడి, బిర్యానీ, నల్ల మాంసం, బోటీ, చేపల పులుసు, చైనీస్, ఇండియన్ అన్ని వెరైటీలు చేస్తాను.అయితే పని వస్తేనే సరిపోదు.క్రమశిక్షణ ఉండాలి. 25 ఏళ్ల కింద కరీంనగర్ పట్టణంలో స్కూటీ నడిపే ఐదారుగురు మహిళల్లో నేను ఒకదాన్ని. టైంకు ఫంక్షన్లకు వెళ్లాలని పట్టుబట్టి మరీ స్కూటీ నేర్చుకున్నా. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్‌లు బాగా ప్రోత్సహిస్తారు. వారి ఇంట్లో, రాజకీయ పార్టీలకు నాదే వంట. కాలేజీ ఫంక్షన్ల నుంచి రాజకీయ సభల దాకా 20 వేల మందికి ఇట్టే వండిపెడతా.ఈ రోజు నా వద్ద 30 మంది స్త్రీలకు ఉపాధి కల్పిస్తున్నా, నా దగ్గర పని నేర్చుకున్న స్త్రీలు ఎందరో వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడ్డారు క్యాటరింగ్ చేసుకుంటూ’ అందామె. వేములవాడ నుంచి పుష్కరాల దాకా ‘కష్టపడుతూ నిజాయతీగా ఉంటే దేవుడు అవకాశాలు తానే ఇస్తాడు. అలాగే నాకూ ఇస్తున్నాడు. ఏటా శివరాత్రి ఉత్సవాలకు దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో భక్తులకు వండి పెట్టే భాగ్యం దక్కింది. అలాగే కొండగట్టు హనుమాన్ జయంతి వేడుకలకు కూడా పిలుస్తారు. గోదావరి పుష్కరాలకు కూడా వండాను. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్తవారింట్లోనే 25 ఏళ్లుగా వంటలు చేస్తున్నాను. సీఎం గారిని చాలాసార్లు చూశాను. ఆయన నా వంటలు రుచి చూశారు. కానీ ఏనాడూ మాట్లాడే అవకాశం దక్కలేదు. ఆయన కుమారుడు కేటీఆర్ మూడు సభలకు వండిపెట్టాను. అందులో అసెంబ్లీ ఎన్నికలకి ముందు తరవాత 50 వేల మందికి వండాను. ఇటీవల తీగల బ్రిడ్జి శంకుస్థాపన సమయంలోనూ 20 వేల మందికి వంట చేశాను. నా వంటలు బాగున్నాయని కేటీఆర్ కితాబిచ్చారు’ అందామె. ఇంటికి పెద్దకొడుకయ్యా ‘నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. మా నాన్న అనారోగ్యంతో చనిపోతూ చిన్న చెల్లె, తమ్ముడు బాధ్యతలను నాకు అప్పగించారు. తమ్ముడిని నా దగ్గరే ఉంచి చదివించి వాడి పెళ్లి చేశాను. చెల్లి పెళ్లిలోనూ నాకు చేతనైనంత సాయపడ్డా. మొన్న ఊళ్లో అమ్మవారి గుడిలో విగ్రహం పెట్టించి, వెండి కిరీటం చేయించా. ఊరంతా కదలివచ్చి అభినందించింది. అంతేకాదు, నాకు ఊరి నుంచి రావాల్సిన మూడున్నర ఎకరాల భూమిని నా కొడుకు వెంకటేశ్ పేరిట ఊరంతా ఒక్కటై చేయించింది’ అందామె. ఒంటరి మహిళలకు భయం వద్దు ‘ఏ కారణం చేతనైనా సమాజంలో మహిళలు ఒంటరిగా బతకాల్సి వస్తే అస్సలు భయపడవద్దు. కష్టపడి చేసే ఏ పనైనా బెరుకు, భయం వద్దు. నిజాయతీగా చేస్తే తప్పకుండా ఎదుగుదల ఉంటుంది. ఆ నిజాయతీ మీకు, మీ పనికి తప్పకుండా గుర్తింపు తీసుకువస్తాయి. ఏనాడూ ఆడిన మాట తప్పకూడదు. అలా చేస్తే మార్కెట్లో, సమాజంలో పలుచనైపోతాం. నేను లక్ష రూపాయల వంటకు ఆర్డర్ తీసుకున్నాక అదేరోజు పని చేయాలంటూ కోటి రూపాయల ఆర్డర్ వచ్చినా తీసుకోను. మాటంటే మాటే.ఆ నిజాయితీ ఉంటే తప్పకుండా పైకి రావచ్చు’ అందామె. యాదమ్మను మెచ్చుకోకుండా ఎలా ఉండగలం? – భాషబోయిన అనిల్‌కుమార్, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ ఫొటోలు: ఏలేటి శైలేందర్‌రెడ్డి -
2019లో భారీ మెజార్టీతో..!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేకులంతా ఏకమై ప్రారంభించనున్న మహాకూటమి ఓ మిథ్య అని ఆయన అభివర్ణించారు. ఢిల్లీలో రెండ్రోజులపాటు జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభోత్సవంలో షా మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మేకిన్ ఇండియా నినాదంతో ముందుకెళ్తుంటే బ్రేకింగ్ ఇండియా లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. 2014లో పార్టీ, కూటమి సాధించిన సీట్లకంటే ఈ సారి మరిన్ని ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమగ్ర అభివృద్ధి, పేదల సంక్షేమం, జాతీయవాదం అంశాలపై బీజేపీ ఎన్నికల ప్రచారం ఉండాలని కార్యవర్గ సభ్యులకు మోదీ సూచించారు. ‘వరుస ఎన్నికల్లో ఓటమితో ఆత్మరక్షణలో ఉన్న విపక్షాలు అర్బన్ నక్సల్స్‌కు మద్దతివ్వడంతోపాటు భారత్‌ను ముక్కలు ముక్కలు (బ్రేకింగ్ ఇండియా) చేద్దామని ప్రయత్నిస్తున్నారు’ అని షా అన్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల పార్టీ ముఖ్య పదాధికారులు (మొత్తం 175 మంది) హాజరయ్యారు. ఆదివారం జరిగే ముగింపు సమావేశంలో మోదీ ప్రసంగిచనున్నారు. రాజకీయ, ఆర్థిక తీర్మానాలను ప్రతిపాదించి ఆమోద ముద్ర వేయనున్నారు. బెంగాల్, ఒడిశా, తెలంగాణలపై.. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణల్లో అక్కడి ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలపై ఉన్న ప్రజావ్యతిరేకత కారణంగా ఎక్కువసీట్లు గెలుస్తామని షా చెప్పారు. 2014లో మొత్తం 543 సీట్లలో బీజేపీ 283 సీట్లు గెలిచింది. ‘బీజేపీ 2014లో ఇప్పుడు ఏకమవుతున్న అన్ని పార్టీలను చిత్తుగా ఓడించింది. ఇప్పుడు వాళ్లందరూ ఏకమైనా ఫలితాల్లో పెద్ద తేడా ఉండదు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మోదీ చరిష్మా, పార్టీ సంస్థాగత బలం కారణంగా మళ్లీ అధికారంలోకి వస్తాం’ అని షా అన్నారు. ‘కాంగ్రెస్ చెప్పిందే మన్మోహన్ సింగ్ పాటిస్తారు. ఇక్కడ మోదీ ముందుండి నడిపిస్తారు’ అని అన్నారు. పాక్‌పై భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన సెప్టెంబర్ 28ని శౌర్యదివస్‌గా జరపాలని, గాంధీజీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. వాజ్‌పేయిని గుర్తుచేసుకుంటూ.. మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయిని పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం స్మరించుకుంది. ఆరోగ్యం సహకరించినదాకా ప్రతీ జాతీయ కార్యవర్గ సమావేశానికి అటల్జీ హాజరైన విషయాన్ని స్మరించుకుంది. ‘దేశ ప్రజల ఆకాంక్షలన నెరవేర్చడంలో విశ్వసనీయమైన నేతగా అటల్జీ తనకంటూ ప్రత్యేకతను ఏర్పర్చుకున్నారు. ఆయన చిత్తశుద్ధి, కఠోర శ్రమకారణంగానే ఇది సాధ్యమైంది. సిద్ధాంతాలకు కట్టుబడి ధ్రుఢనిశ్చయంతో ముందుకెళ్లడం ద్వారానే అనుకున్న లక్ష్యాలను ఆయన సాధించగలిగారు’ అని వాజ్‌పేయి సంతాప తీర్మానంలో పేర్కొంది. రైతుల ఆదాయం రెట్టింపుచేసేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలుపుతూ వ్యవసాయ తీర్మానాన్ని ఆమోదించింది. ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌లలో ఓకే ఈ సమావేశాల్లో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు పార్లమెంటు ఎలక్షన్లపై చర్చ జరిగింది. ఇప్పటివరకు జరిగిన వివిధ సర్వేలు, పార్టీ అంతర్గత వివరాల ప్రకారం ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలున్నట్లు తెలిసింది. రాజస్తాన్‌లో ప్రజావ్యతిరేకత ఉందని పార్టీ ఈ సమస్యను దాటుకుని ముందుకెళ్లటం చాలా కష్టమని పార్టీ నివేదికలు చెబుతున్నాయి. రాజస్తాన్ సీఎం, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు, కీలక మంత్రులు, ఇతర పార్టీ ముఖ్యులతో షా ఆదివారం షా భేటీ కానున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మోదీ, అమిత్ నేతృత్వంలోనూ ముందుకెళ్లాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. దీనికితోడు 2019 జనవరిలో పూర్తికానున్న అమిత్ షా అధ్యక్ష పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. అసెంబ్లీ, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీ సంస్థాగత ఎన్నికలను వాయిదా వేయాలని తీర్మానించారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేద్దామనుకునేవారు కచ్చితంగా ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీచేసి తమ సత్తా చాటాలని ఆయన తెలంగాణ ముఖ్యనేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ అభ్యర్థుల జాబితాను విడతలవారీగా విడుదల చేయాలని పార్టీ నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే రోజే 35 మందితో తొలి జాబితాను ప్రకటించనున్నారు. ఆ తర్వాత 2 దశల్లో మిగిలిన 84 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. వ్యూహాలపై జాతీయ కార్యవర్గ భేటీ అనంతరం తెలంగాణ నేతలతో వేరుగా ఆయన భేటీ కానున్నారు. -
అందరి లక్ష్యం ‘బీజేపీ’
పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బెంగళూరులో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సమావేశాలు బెంగళూరు:దేశంలోని చాలా మంది ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. దేశ చర్రితలో ఎన్నడూ లేని విధంగా 2014లో పూర్తి మెజారిటీతో కాంగ్రెసేతర పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, అంతేకాక అదే ఏడాదిలో జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో సైతం బీజేపీ అఖండ విజయాన్ని కైవసం చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత తొ లిసారిగా బెంగళూరులోని లలిత్ అశోక హోటల్లో జాతీయ కార్యనిర్వాహక సభ్యుల సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు వివిధ రాష్ట్రాల నుంచి 330 మంది కార్యనిర్వాహక సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, హర్యాణ, జార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవేంద్రఫడ్నావిస్, మనోహర్ లాల్ ఖత్తార్, రఘుబార్దాస్లతో పాటు గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పార్సేకర్, జమ్మూకాశ్మీర్ ఉపముఖ్యమంత్రి నిర్మల్కుమార్సింగ్ను అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ సత్కరించారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ... తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీలో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన పనులే ఇందుకు ప్రధాన కారణమని అన్నారు. పాలనలో పారదర్శకత తీసుకురావడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎన్నో లక్షల కోట్ల ఆదాయం చేకూరిందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వృద్ధిరేటు 4.4 నుంచి 7.4 శాతానికి పెరిగిందన్నారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకువెళ్లాలన్నారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీలోనూ లేని విధంగా బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని అన్నారు. అందువల్లే సామాన్య పార్టీ కార్యకర్తగా ప్రయాణం మొదలు పెట్టిన నరేంద్రమోదీ ప్రస్తుతం ప్రధానిగా మారారని అన్నారు. కష్టపడి పనిచేసే వారికి సరైన గుర్తింపు ఉంటుంది అని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏదీ లేదన్నారు. బీహార్‌లో తాము జేడీయూతో కలిసి ఉన్నంత వరకు పాలన బాగానే సాగిందని, అయితే తమ మైత్రీ బంధాన్ని జేడీయూ వద్దనుకున్న తర్వాత అక్కడ మళ్లీ ఆటవిక రాజ్యం(జంగల్ రాజ్య్-2) పాలన ప్రారంభమైందని అన్నారు. ఈ నేపథ్యంలో బీహార్ ప్రజలు అక్కడి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారని తెలిపారు. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆటవిక పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని, అక్కడి ప్రజలు తప్పక బీజేపీకి సంపూర్ణ మెజారిటీ అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఇక దక్షిణం
పార్టీ పటిష్టతే లక్ష్యంగా నేటి నుంచి బెంగళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు గురువారం మధ్యాహ్నం నగరానికి చేరుకోనున్న ప్రధాని మోదీ మూడు రోజుల పాటు సమావేశాలు బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేయడంతో పాటు అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను బెంగళూరులో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను బీజేపీ రాష్ట్రశాఖ శ్రేణులు పూర్తి చేశాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న మొట్టమొదటి జాతీయ కార్యవర్గ సమావేశాలు కావడంతో ఈ సమావేశాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంలో ఉద్యాననగరి మొత్తం కాషాయమయంగా మారిపోయింది. గురువారం ఉదయం నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు మూడు రోజుల పాటు(శనివారం వరకు) కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, పదాధికారులు పాల్గొననున్నారు. నగరంలో మూడు రోజుల పాటు జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించిన వివరాలను బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కర్ణాటకతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని మరింత పటిష్టం చేయడమే ఈ సమావేశాల్లో ముఖ్య చర్చాంశం కానుందని ప్రహ్లాద్ జోషి తెలిపారు. సమావేశాల ఏర్పాట్లను కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.అశోక్ నేతృత్వంలో రూపొందించిన 33 కమిటీలు పర్యవేక్షించనున్నాయని పేర్కొన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర శాఖ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్ రావు మాట్లాడుతూ...మే 27 నాటికి కేంద్రంలో బీజేపీ అధికారాన్ని చేపట్టి ఏడాది పూర్తవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు చెప్పారు. అంతేకాక పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై సైతం ఇదే సమావేశాల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు వెల్లడించారు. మూడు రోజుల పాటు నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల వివరాలు 2వ తేదీ: గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం రాత్రి 8గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, అన్ని రాష్ట్రశాఖల అధ్యక్షులు, పదాధికారులు పాల్గొంటారు. గురువారం మద్యాహ్నం 2.30గంటలకు నగరానికి చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం 4గంటల నుంచి 8 గంటల వరకు ఈ సమావేశంలో పాల్గొని సభ్యులందరితో చర్చిస్తారు. 3వ తేదీ : శుక్రవారం ఉదయం 10 గంటలకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఫ్లోర్ లీడర్లతో పాటు మొత్తం 330 మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఇక ఇదే రోజు సాయంత్రం 5గంటలకు నగరంలోని నేషనల్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సమావేశంలో ప్రధానమంత్రి మోదీ పాల్గొని ప్రసంగిస్తారు . 4వ తేదీ : శనివారం ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు కార్యవర్గ సమావేశం కొనసాగుతుంది. సమావేశాల ముగింపు కార్యక్రమం అనంతరం 3గంటలకు ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఇదే రోజు సాయంత్రం 6గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీ వెళతారు.