BJP National Executive Meeting: నవ భారతం నిర్మిద్దాం: మోదీ | Sakshi
Sakshi News home page

BJP National Executive Meeting: నవ భారతం నిర్మిద్దాం: మోదీ

Published Mon, Feb 19 2024 4:55 AM

BJP National Executive Meeting: PM Narendra Modi addresses BJP National Convention in New Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  నవ భారత నిర్మాణం కోసం కదలి రావాలని బీజేపీ శ్రేణులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. లక్ష్య సాధన కోసం రాబోయే 100 రోజులు ఎంతో కీలకమని, ‘అబ్‌కీ బార్‌ చార్‌ సౌ పార్‌’ మిషన్‌తో పనిచేద్దామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాకుండా దేశ నిర్మాణం కోసం పనిచేద్దామని సూచించారు. అభివృద్ధి ఎజెండా లేని కాంగ్రెస్‌ పార్టీ నుంచి దేశాన్ని, యువతను రక్షించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. భారతదేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కోరుకుంటున్నాయని చెప్పారు.

ఈ ఏడాది జూలై, ఆగస్టు, సెపె్టంబర్‌లో జరిగే కార్యక్రమాలకు హాజరు కావాలంటూ చాలా దేశాలు తనను ఆహా్వనిస్తున్నాయని తెలిపారు. ఇండియాలో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని ఆయా దేశాలు భావిస్తున్నాయని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 400 స్థానాలు వస్తాయని మన దేశంలో విపక్షాలు సైతం నినదిస్తున్నాయని గుర్తుచేశారు. ఢిల్లీలో భారత్‌ మండపంలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. బీజేపీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 64 నిమిషాలపాటు ప్రసంగించారు. కాంగ్రెస్‌ సహా విపక్షాలపై నిప్పులు చెరిగారు. సొంతంగా అనుభవించడానికి అధికారం కోరుకోవడం లేదని, దేశానికి మేలు చేయాలన్నదే తన తపన అని స్పష్టం చేశారు.

శతాబ్దాల సమస్యలను పరిష్కరించాం
దేశంలో శతాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కారించేందుకు సాహసం చేశామని మోదీ చెప్పారు. ‘‘500 ఏళ్ల నాటి అయోధ్య సమస్యను రామమందిర నిర్మాణంతో పరిష్కరించాం. ఏడు దశాబ్దాల తర్వాత ఆరి్టకల్‌ 370 నుంచి జమ్మూకశీ్మర్‌కు విముక్తి లభించింది. మూడు దశాబ్దాల తర్వాత మహిళ రిజర్వేషన్లు, ట్రిపుల్‌ తలాక్‌ చట్టాలు తెచ్చాం. పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. నా సొంతింటి గురించే ఆలోచించుకుని ఉంటే ఇంతమందికి ఇళ్లు నిర్మించివ్వడం సాధ్యమయ్యేది కాదు. మూడోసారి అధికారంలోకి వచ్చాక భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుస్తాం. సీఎంగా, ప్రధానిగా ఎంతో సాధించారు, ఇక విశ్రాంతి తీసుకోండని ఓ సీనియర్‌ నాయకుడు నాతో అన్నారు. నేను రాజనీతి, రాష్ట్రనీతి కోసం పని చేస్తా. ఛత్రపతి శివాజీ ఆశయాలే నాకు స్ఫూర్తి’’ అన్నారు.

దేశాన్ని విభజించే పనిలో కాంగ్రెస్‌  
భాష, ప్రాంతం ఆధారంగా దేశాన్ని విభజించే పనిలో కాంగ్రెస్‌ పార్టీ నిమగ్నమైందని ప్రధానమంత్రి దుయ్యబట్టారు. దేశ సైనికుల నైతిక స్థైర్యాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీసే పాపం కాంగ్రెస్‌ చేసిందన్నారు. సైన్యం సాధించిన విజయాలపై ప్రశ్నలు లేవనెత్తిందని విరుచుకుపడ్డారు. దేశానికి రఫెల్‌ యుద్ద విమానాలు రాకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పారీ్టకి, ఇండియా కూటమికి అభివృద్ధి ఎజెండానే లేదన్నారు. బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలను కాంగ్రెస్‌ పెంచి పోషించిందని విమర్శించారు. గతంలో ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ ఇప్పటికీ కుట్రలు చేస్తోందన్నారు. దేశాభివృద్ధి పట్ల ఎలాంటి ప్రణాళిక లేని ఆ పార్టీ విచ్చలవిడిగా హామీలు ఇస్తోందని ఆక్షేపించారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని దెబ్బతీసేందుకు విపక్షాలు ప్రయతి్నస్తున్నాయని మండిపడ్డారు.

వచ్చే వెయ్యేళ్లలో ‘రామరాజ్యం’
అయోధ్య రామాలయమే ప్రతీక  
బీజేపీ జాతీయ సదస్సులో తీర్మానం  

అయోధ్యలో రామ మందిర నిర్మాణం పట్ల బీజేపీ హర్షం వెలిబుచ్చింది. ఇది ప్రతి భారతీయుడికి ఆనందం కలిగించిందని పేర్కొంది. రాబోయే వెయ్యేళ్లలో సంవత్సరాల్లో స్థాపించబోయే రామరాజ్యానికి ఈ ఆలయం ప్రతీక అంటూ ఆదివారం జాతీయ సదస్సులో తీర్మానాన్ని ఆమోదించింది. ‘‘అయోధ్య రామాలయం జాతిని జాగృతం చేసే ఆలయం. వికసిత్‌ భారత్‌ తీర్మానాల సాకారంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. రాముడి జన్మస్థానంలో భవ్య మందిర నిర్మాణం చరిత్రాత్మక విజయం. తీర్మానంలో ప్రస్తావించారు. రాజ్యాంగ అసలు ప్రతిలో సీతా రామ లక్ష్మణుల చిత్రాలున్నాయి. పౌరుల ప్రాథమిక హక్కులకు రాముడు స్ఫూర్తి అనేందుకిదే నిదర్శనం. రామరాజ్యమనే భావన మహాత్మాగాంధీ హృదయంలోనూ ఉండేది. ఆ ఆదర్శాలను మోదీ చక్కగా పాటిస్తున్నారు’’ అంటూ కొనియాడింది. రామమందిర ప్రాణప్రతిష్టను విజయవంతంగా నిర్వహించిన మోదీకి అభినందనలు తెలిపింది.
 
వచ్చే వంద రోజులు కీలకం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వచ్చే 100 రోజుల ఎంతో కీలకమని  మోదీ చెప్పారు. ఈ 100 రోజులు కొత్త శక్తి, ఉత్సాహం, విశ్వాసంతో పని చేయాలని సూచించారు. ‘‘ఈ రోజు ఫిబ్రవరి 18. దేశంలో 18 ఏళ్లు నిండిన యువత 18వ లోక్‌సభకు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. రాబోయే వంద రోజుల్లో ప్రతి కొత్త ఓటరును, ప్రభుత్వ పథకాల లబి్ధదారును పలుకరించండి. ప్రతి ఇంటికీ వెళ్లండి. అందరి విశ్వాసం పొందండి. బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చేలా ప్రతి ఒక్కరూ పని చేయాలి. బీజేపీకి సొంతంగా 370కి పైగా స్థానాలు, ఎన్డీఏకి ‘అబ్‌కీ బార్, చార్‌సౌ పార్‌’ మిషన్‌తో పని చేద్దాం. ఇకపై భారత్‌ స్వప్నాలు, సంకల్పాలు విశాలమైనవిగా ఉంటాయి. ఈ పదేళ్లలో ఒక మైలురాయిని మాత్రమే చేరాం. కోట్లాది మంది ప్రజల జీవితాలను మార్చాల్సి ఉంది. తీసుకోవాల్సిన నిర్ణయాలెన్నో ఉన్నాయి. యువత, మహిళ, పేదలు, రైతుల శక్తిని ‘వికసిత్‌ భారత్‌’ నిర్మాణానికి వినియోగించుకోవాలి. ఆయా వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, కొత్త చట్టాలు తీసుకొచ్చాం. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్‌’ అనే పెద్ద తీర్మానం చేసుకున్నాం’’ అన్నారు. 

Advertisement
Advertisement