New India
-
BJP National Executive Meeting: నవ భారతం నిర్మిద్దాం: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: నవ భారత నిర్మాణం కోసం కదలి రావాలని బీజేపీ శ్రేణులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. లక్ష్య సాధన కోసం రాబోయే 100 రోజులు ఎంతో కీలకమని, ‘అబ్కీ బార్ చార్ సౌ పార్’ మిషన్‌తో పనిచేద్దామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాకుండా దేశ నిర్మాణం కోసం పనిచేద్దామని సూచించారు. అభివృద్ధి ఎజెండా లేని కాంగ్రెస్ పార్టీ నుంచి దేశాన్ని, యువతను రక్షించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. భారతదేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కోరుకుంటున్నాయని చెప్పారు. ఈ ఏడాది జూలై, ఆగస్టు, సెపె్టంబర్లో జరిగే కార్యక్రమాలకు హాజరు కావాలంటూ చాలా దేశాలు తనను ఆహా్వనిస్తున్నాయని తెలిపారు. ఇండియాలో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని ఆయా దేశాలు భావిస్తున్నాయని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 400 స్థానాలు వస్తాయని మన దేశంలో విపక్షాలు సైతం నినదిస్తున్నాయని గుర్తుచేశారు. ఢిల్లీలో భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. బీజేపీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 64 నిమిషాలపాటు ప్రసంగించారు. కాంగ్రెస్ సహా విపక్షాలపై నిప్పులు చెరిగారు. సొంతంగా అనుభవించడానికి అధికారం కోరుకోవడం లేదని, దేశానికి మేలు చేయాలన్నదే తన తపన అని స్పష్టం చేశారు. శతాబ్దాల సమస్యలను పరిష్కరించాం దేశంలో శతాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కారించేందుకు సాహసం చేశామని మోదీ చెప్పారు. ‘‘500 ఏళ్ల నాటి అయోధ్య సమస్యను రామమందిర నిర్మాణంతో పరిష్కరించాం. ఏడు దశాబ్దాల తర్వాత ఆరి్టకల్ 370 నుంచి జమ్మూకశీ్మర్‌కు విముక్తి లభించింది. మూడు దశాబ్దాల తర్వాత మహిళ రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ చట్టాలు తెచ్చాం. పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. నా సొంతింటి గురించే ఆలోచించుకుని ఉంటే ఇంతమందికి ఇళ్లు నిర్మించివ్వడం సాధ్యమయ్యేది కాదు. మూడోసారి అధికారంలోకి వచ్చాక భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుస్తాం. సీఎంగా, ప్రధానిగా ఎంతో సాధించారు, ఇక విశ్రాంతి తీసుకోండని ఓ సీనియర్ నాయకుడు నాతో అన్నారు. నేను రాజనీతి, రాష్ట్రనీతి కోసం పని చేస్తా. ఛత్రపతి శివాజీ ఆశయాలే నాకు స్ఫూర్తి’’ అన్నారు. దేశాన్ని విభజించే పనిలో కాంగ్రెస్ భాష, ప్రాంతం ఆధారంగా దేశాన్ని విభజించే పనిలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైందని ప్రధానమంత్రి దుయ్యబట్టారు. దేశ సైనికుల నైతిక స్థైర్యాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీసే పాపం కాంగ్రెస్ చేసిందన్నారు. సైన్యం సాధించిన విజయాలపై ప్రశ్నలు లేవనెత్తిందని విరుచుకుపడ్డారు. దేశానికి రఫెల్ యుద్ద విమానాలు రాకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పారీ్టకి, ఇండియా కూటమికి అభివృద్ధి ఎజెండానే లేదన్నారు. బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలను కాంగ్రెస్ పెంచి పోషించిందని విమర్శించారు. గతంలో ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఇప్పటికీ కుట్రలు చేస్తోందన్నారు. దేశాభివృద్ధి పట్ల ఎలాంటి ప్రణాళిక లేని ఆ పార్టీ విచ్చలవిడిగా హామీలు ఇస్తోందని ఆక్షేపించారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని దెబ్బతీసేందుకు విపక్షాలు ప్రయతి్నస్తున్నాయని మండిపడ్డారు. వచ్చే వెయ్యేళ్లలో ‘రామరాజ్యం’ అయోధ్య రామాలయమే ప్రతీక బీజేపీ జాతీయ సదస్సులో తీర్మానం అయోధ్యలో రామ మందిర నిర్మాణం పట్ల బీజేపీ హర్షం వెలిబుచ్చింది. ఇది ప్రతి భారతీయుడికి ఆనందం కలిగించిందని పేర్కొంది. రాబోయే వెయ్యేళ్లలో సంవత్సరాల్లో స్థాపించబోయే రామరాజ్యానికి ఈ ఆలయం ప్రతీక అంటూ ఆదివారం జాతీయ సదస్సులో తీర్మానాన్ని ఆమోదించింది. ‘‘అయోధ్య రామాలయం జాతిని జాగృతం చేసే ఆలయం. వికసిత్ భారత్ తీర్మానాల సాకారంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. రాముడి జన్మస్థానంలో భవ్య మందిర నిర్మాణం చరిత్రాత్మక విజయం. తీర్మానంలో ప్రస్తావించారు. రాజ్యాంగ అసలు ప్రతిలో సీతా రామ లక్ష్మణుల చిత్రాలున్నాయి. పౌరుల ప్రాథమిక హక్కులకు రాముడు స్ఫూర్తి అనేందుకిదే నిదర్శనం. రామరాజ్యమనే భావన మహాత్మాగాంధీ హృదయంలోనూ ఉండేది. ఆ ఆదర్శాలను మోదీ చక్కగా పాటిస్తున్నారు’’ అంటూ కొనియాడింది. రామమందిర ప్రాణప్రతిష్టను విజయవంతంగా నిర్వహించిన మోదీకి అభినందనలు తెలిపింది. వచ్చే వంద రోజులు కీలకం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వచ్చే 100 రోజుల ఎంతో కీలకమని మోదీ చెప్పారు. ఈ 100 రోజులు కొత్త శక్తి, ఉత్సాహం, విశ్వాసంతో పని చేయాలని సూచించారు. ‘‘ఈ రోజు ఫిబ్రవరి 18. దేశంలో 18 ఏళ్లు నిండిన యువత 18వ లోక్‌సభకు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. రాబోయే వంద రోజుల్లో ప్రతి కొత్త ఓటరును, ప్రభుత్వ పథకాల లబి్ధదారును పలుకరించండి. ప్రతి ఇంటికీ వెళ్లండి. అందరి విశ్వాసం పొందండి. బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చేలా ప్రతి ఒక్కరూ పని చేయాలి. బీజేపీకి సొంతంగా 370కి పైగా స్థానాలు, ఎన్డీఏకి ‘అబ్కీ బార్, చార్సౌ పార్’ మిషన్‌తో పని చేద్దాం. ఇకపై భారత్ స్వప్నాలు, సంకల్పాలు విశాలమైనవిగా ఉంటాయి. ఈ పదేళ్లలో ఒక మైలురాయిని మాత్రమే చేరాం. కోట్లాది మంది ప్రజల జీవితాలను మార్చాల్సి ఉంది. తీసుకోవాల్సిన నిర్ణయాలెన్నో ఉన్నాయి. యువత, మహిళ, పేదలు, రైతుల శక్తిని ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి వినియోగించుకోవాలి. ఆయా వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, కొత్త చట్టాలు తీసుకొచ్చాం. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే పెద్ద తీర్మానం చేసుకున్నాం’’ అన్నారు. -
మహిళా సాధికారతకు చంద్రయాన్–3 చిహ్నం
న్యూఢిల్లీ: ఎటువంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించే నవ భారత స్ఫూర్తికి చంద్రయాన్–3 మిషన్ ఒక ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. మహిళా సాధికారతకు ఈ కార్యక్రమం సజీవ ఉదాహరణ అని కొనియాడారు. ప్రతీ నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. అనంతమైన అంతరిక్షాన్ని భారతీయ మహిళలు సవాల్ చేస్తున్నారని అన్నారు. ‘ఇండియా డాటర్స్ ఇంత ప్రతిష్టాత్మకంగా ఉంటే భారత్ అభివృద్ధిని ఎవరు అడ్డుకోగలరు’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘మహిళల నేతృత్వంలో జరిగే అభివృద్ధి మన దేశ స్వాభావిక లక్షణంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అసాధ్యమైనది ఏదైనా ఉంటే మహిళా శక్తితో సుసాధ్యంగా చేయొచ్చు. చంద్రయాన్–3 మిషన్ దీనికి నిలువెత్తు ఉదాహరణ’ అని చెప్పారు. చంద్రయాన్ మిషన్‌లో ఎందరో మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ప్రత్యక్షంగా భాగస్వాములైన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. అందరినీ కలుపుకొనిపోయేలా జీ20 సదస్సు ‘సెపె్టంబర్లో ఢిల్లీలో జరిగే జీ20 సదస్సు అందరినీ కలుపుకొని పోయేలా ఉంటుంది. ఈ సదస్సుకు భారత్ నేతృత్వం వహించడమంటే ప్రజల ఆధ్వర్యంలో జరుగుతున్నట్టే. భారత్ సత్తా సెపె్టంబర్లో అందరికీ తెలుస్తుంది. ప్రపంచ క్రీడల్లో భారత్ రాణించాలి. అందుకు ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దేశీయ క్రీడలైన హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడల్లో మనం వెనకబడకూడదు. సెపె్టంబర్ నుంచి దేశంలో ప్రతీ ఇంటి నుంచి, ప్రతీ గ్రామం నుంచి మట్టిని సేకరించే కార్యక్రమం జరుగుతుంది. ఆ మట్టిని అమృత కలశాల్లో భద్రపరిచి అమృత్ కలశ యాత్ర నిర్వహిస్తాం. ఆ మట్టితో ఢిల్లీలో అమృత వాటిక నిర్మాణం జరుగుతుంది’ అని మోదీ అన్నారు. తెలుగు కూడా ప్రాచీన భాషే ‘మన సంస్కృతి సంప్రదాయాలతో మమేకం కావాలంటే మాతృభాష శక్తిమంతమైన మాధ్యమం. తెలుగు భాష సాహిత్యంలో వారసత్వ సంపదలో ఎన్నో వెలకట్టలేని రత్నాలు దాగున్నాయి’ అంటూ తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని మోదీ కొనియాడారు. ‘సంస్కృతం మాదిరిగా తెలుగు ప్రాచీన భాషే. ప్రతీ ఏడాది ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం’ అని గుర్తుచేసిన ప్రధాని మోదీ తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. -
‘స్పేస్’లో మన ప్రగతి గర్వకారణం!
సాక్షి, హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వంటి స్వదేశీ సంస్థల ప్రగతి భారతీయులందరూ గర్వంగా తలెత్తుకుని తిరిగేలా చేస్తోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. అయితే పరిశోధనల ఫలితాలు సామాన్య ప్రజలకు కూడా చేరినప్పుడే వాటికి సార్థకత అని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని భూభౌతిక పరిశోధన కేంద్రం (ఎన్జీఆర్ఐ)లో ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ స్పేస్ సెక్టార్: న్యూ ఇండియా’ పేరిట జరిగిన ఒకరోజు సదస్సులో గవర్నర్ మాట్లాడారు. అంతరిక్ష రంగంలో ఇస్రో ఘనతలను కొనియాడారు. అంతరిక్ష రంగంలో జరిగిన పరిశోధనలు వివిధ రూపాల్లో సామాన్యుడికి ఉపయోగపడ్డాయని వివరించారు. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌లు స్కైరూట్, ధ్రువ స్పేస్‌లు దేశంలోనే మొదటిసారి ప్రైవేటుగా రాకెట్, ఉపగ్రహాలను విజయవంతంగా పరీక్షించడాన్ని గవర్నర్ అభినందించారు. 2026 నాటికి అంగారకుడిపైకి మనిషి.. అంతరిక్ష రంగంలో వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటే.. ఇంకో మూడేళ్లలోనే మనిషి అంగారక గ్రహంపైకి అడుగుపెట్టినా ఆశ్చ ర్యం లేదని ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ చెప్పారు. ప్రపంచంలో పౌర అవసరాలు తీర్చేందుకు అంత రిక్ష ప్రయోగాలు చేపట్టిన తొలి దేశంగా భారత్‌కు రికార్డు ఉందని, స్పేస్ టెక్నాలజీని గరిష్టంగా ఉపయోగించుకున్నదీ మన మేనని తెలిపారు. ప్రస్తుతం సుమారు 50 ఉపగ్రహాలు దేశానికి సేవలు అందిస్తున్నాయని.. పెరుగుతు న్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటి సంఖ్య రెండు వందలకుపైగా ఉండాలని పేర్కొన్నారు. అరగంటలో ఖండాలు దాటేయవచ్చు.. అంతరిక్ష రంగంలో రానున్న పదేళ్లు చాలా కీలకమని దేశంలో తొలి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సీఈవో పవన్‌కుమార్ చందన తెలిపారు. ప్రపంచంలోని 90కిపైగా దేశాలకు తమవైన ఉపగ్రహాలు లేవని, యాభై శాతం జనాభాకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో లేదని వివరించారు. మరో పది, ఇరవై ఏళ్లలో కేవలం అరగంట సమయంలోనే ఖండాలను దాటేసేందుకు రాకెట్లను ఉపయోగించే పరిస్థితి రానుందని చెప్పారు. విమానాల మాదిరిగానే రాకెట్లను కూడా మళ్లీమళ్లీ వాడుకునే దిశగా స్కైరూట్ పరిశోధన చేపట్టిందని తెలిపారు. సెమినార్లో ధ్రువస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో నెక్కంటి సంజయ్, అకాడమీ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సీహెచ్ మోహనరావు, ఎన్జీఆర్ఐ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ విభాగం కార్యదర్శి ఎం రవిచంద్రన్ పాల్గొన్నారు. -
‘మీ నవ భారత జాతిపిత దేశానికి ఏం చేశారో చెప్పండి?’
పట్నా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నవ భారత జాతిపితగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ అభివర్ణించిన విషయం తెలిసింది. ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. నవీన భారత జాతి పిత దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. ‘వారు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడలేదు. ఆర్ఎస్ఎస్ కూడా స్వాతంత్య్ర పోరాటం చేయలేదు. అయినా, నవీన భారత జాతిపితగా పేర్కొన్నట్లు విన్నాం. అసలు నవీన భారత్‌కు సరికొత్త జాతి పిత ఏం చేశారు? ’ అనిఘాటుగా స్పందించారు నితీశ్ కుమార్. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటిస్తే తనకు ఎటువంటి సమస్య లేదని పేర్కొన్నారు నితీశ్. తాను ప్రధాని కావాలని కోరుకోవడం లేదని పునరుద్ఘాటించారు. అన్ని మిత్ర పక్షాలతో మాట్లాడి వారు ఈ అంశాన్ని ప్రకటించాలని, ప్రస్తుతం నేతలంతా భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్నారని గుర్తు చేశారు. బిహార్ విద్యాశాఖలో ఉద్యోగులకు నియామక పత్రాలు అంద జేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. మరోవైపు.. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సైతం అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీతో ఎవరినీ పోల్చలేమని స్పష్టం చేశారు. ‘జాతిపితతో ఎవరినీ పోల్చలేం. వారి(బీజేపీ) సరికొత్త భారత్ కేవలం కొద్ది మంది ధనవంతుల కోసం మాత్రమే ఏర్పడింది. మిగిలిన ప్రజలు ఇంకా పేదరికంలోకి వెళ్లారు. క్షుద్భాతతో అలమటిస్తున్నారు. ఇలాంటి సరికొత్త ఇండియా మాకు అవసరం లేదు’అని స్పష్టం చేశారు. #WATCH | They had nothing to do with the fight for Independence. RSS didn't have any contribution towards the fight for Independence...we read about the remark of 'New father of nation'...what has the 'new father' of 'new India' done for nation?: Bihar CM Nitish Kumar (31.12) pic.twitter.com/5RdJmrasIP — ANI (@ANI) January 1, 2023 ఇదీ చదవండి: ఆ వ్యాఖ్య ప్రధాని మోదీని అవమానించడమే: సంజయ్ రౌత్ ధ్వజం -
అవినీతి, ఉగ్రవాదానికి అడ్డుకట్ట
పారిస్: ముందెన్నడూ లేని రీతిలో దేశంలో అవినీతికి, బంధుప్రీతికి, ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేశామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రజాధనాన్ని లూటీ చేయటానికి కూడా కళ్లేలు వేశామన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు తమకు అఖండ మెజారిటీ ఇస్తూ... ‘నవభారత నిర్మాణం’ అనే గురుత బాధ్యతను తమ భుజాలపై పెట్టారన్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారత సంతతికి చెందినవారిని ఉద్దేశించి శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయటంతో పాటు దాన్ని శిక్షార్హమైన నేరంగా చేస్తూ కీలకమైన చట్టం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని పరోక్షంగా ఆయన ప్రస్తావిస్తూ.. ‘తాత్కాలిక వ్యవహారాలకు ఇక భారత్‌లో చోటులేదు. ఎందుకంటే మనది గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ, రాముడు, కృష్ణుడు అవతరించిన గడ్డ. దాదాపు 125 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో అతి పెద్ద సమస్యగా మారిన కేవలం ఒకే ఒక్క తాత్కాలిక వ్యవహారాన్ని డీల్ చేయటానికి 70 ఏళ్లు పట్టిన విషయం మీరే చూశారు. ఈ పరిస్థితిపై నవ్వాలో ఏడ్వాలో నాకు తెలియడం లేదు. అయితే, శాశ్వత ప్రాతిపదికన చేపట్టే పనుల ద్వారానే లక్ష్య సాధన సాధ్యమవుతుంది’ అని స్పష్టంచేశారు. ‘ఓట్ల రూపంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారానే దేశ పురోగమనం సాధ్యమవుతోంది తప్ప మోదీ కారణంగా కాదు’ అని ఆయన పేర్కొనగానే సభికులంతా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ‘మోదీ ఉంటేనే సాధ్యం’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.‘‘నవభారత్ నిర్మాణం లో భాగంగానే అవినీతి, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, ప్రజాధనం దోపిడీ, ఉగ్రవాదం వం టి వాటిపై గతంలో ఎన్నడూ లేని విధంగా పోరాటం సాగించి అడ్డుకట్ట వేశాం. అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు దూసుకెళ్తున్నాం. కాప్– 21 సమ్మిట్‌లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం వాతా వరణ మార్పుల లక్ష్యాలను 2030 సంవత్సరం వరకు కాకుండా వచ్చే ఏడాదిన్నరలోనే సాధిస్తాం’’ అని ప్రధాని తెలిపారు. ఇన్ఫ్రా అనే పదాన్ని ప్రస్తావిస్తూ... ‘‘దీన్లో ఇన్ అంటే ఇండియా. ఫ్రా అంటే ఫ్రాన్స్. ఇన్ఫ్రా మాదిరిగా ఇరువురి సంబంధాలూ దృఢంగా ఉండాలి’’ అన్నారాయన. ఫుట్‌బాల్ భాషలో మోదీ ప్రసంగం భారత్‌తో ఫ్రాన్స్‌కు ఉన్న స్నేహ సంబంధాన్ని ఫుట్‌బాల్ ఆటతో పోలుస్తూ ప్రధాని మోదీ ఆసక్తికర ప్రసంగం చేశారు. వివిధ పరిస్థితుల్లో భారత్, ఫ్రాన్స్‌లు కలసి నిర్మాణాత్మక పద్ధతిలో పని చేశాయన్నారు. ‘ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే దేశానికి నేనొచ్చాను. మీకందరికీ గోల్ ఎంత ముఖ్యమైనదో తెలుసు. గత అయిదేళ్లలో మేం కూడా అసాధ్యం అనిపించేలా ఉన్న గోల్స్‌ను అధికారుల ఆత్మవిశ్వాసం సాధించగలిగింది’ అని ప్రధాని పేర్కొన్నారు. అంతకుముందు ప్రధాని ఫ్రాన్సులో 1950, 1960ల్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద మృతుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోదీ యూఏఈ రాజధాని అబుదాబీకి బయలుదేరారు. అక్కడి నుంచి బహ్రెయిన్‌కు వెళ్లనున్నారు. -
ఆ టెకీలపై ప్రధాని మోదీ ప్రశంసలు
-
ఆ టెకీలపై ప్రధాని మోదీ ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ : నవ భారత్ ఆవిష్కరణకు యువత బాటలు పరుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. విద్యార్ధులు, యువతరం విద్యా సముపార్జనకు, కెరీర్ మెరుగుపరుచుకునేందుకు సన్నద్ధమయ్యే తరుణమిదని మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూపీలోని రాయ్‌బరేలికి చెందిన ఇద్దరు యువ ఐఐటీ ప్రొఫెషనల్స్ తమ నైపుణ్యాలను ఉపయోగించి ‘స్మార్ట్ గావ్’ యాప్ రూపొందించడాన్ని ప్రస్తావించిన ప్రధాని వారిని అభినందించారు. భారత్ మూలాల్లోనే వినూత్న ఆవిష్కరణలను రూపొందించే సత్తా ఉందన్నారు. మన నైపుణ్యాలకు పదునుపెట్టే దిశగా మరిన్ని విజయగాథలు వెలుగు చూడాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో యువత ఎన్నో అవాంతరాలు, అడ్డంకులను అధిగమించి విజయం సాధిస్తున్నారని సోదాహరణంగా వివరించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో యువతరం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ దేశంలో ఏ మూల ఏ ఒక్కరి విజయగాధైనా తనలో ఉత్తేజం నింపుతుందన్నారు. -
సరళతర పాలన.. సులభతర జీవనం
సాక్షి, హైదరాబాద్: పాలనను సరళ తరం చేసి మానవ జీవనాన్ని సులభతరం చేయడమే ఈ–గవర్నెన్స్ ప్రధాన ధ్యేయం కావాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన ‘న్యూ ఇండియా’ ఆవిర్భావానికి ఇది అత్యవసరమని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ హైటెక్స్‌లో ఈ–గవర్నెన్స్‌పై జరిగిన జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ‘కనిష్ట ప్రభుత్వంతో గరిష్ట పాలన అందించడానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఈ–గవర్నెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఎన్నో విజయాలు సాధించింది. సీపీజీఆర్ఏఎంఎస్ పోర్టల్‌కు మూడేళ్ల కింద 2 లక్షల ఫిర్యాదులొస్తే ఈ ఏడాది 16 లక్షల ఫిర్యాదులు అందాయి. వీటిలో 86 శాతం పరిష్కరించాం. ప్రభుత్వం నుంచి మెరుగైన స్పందనే ఇందుకు కారణం’ అని అన్నారు. ప్రభుత్వంలో కింది స్థాయి ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ పద్ధతి, దస్తా వేజు పత్రాలపై గెజిటెడ్ అధికారుల ప్రమాణీకరణ తొలగింపు, ఇలా కాలం చెల్లిన 1,500కు పైగా నియమాలు రద్దు చేశామని చెప్పారు. తెలంగాణ ‘మీ–సేవ’కు పతకం.. కార్యక్రమంలో జాతీయ ఈ–గవర్నెన్స్ పురస్కారాలను మంత్రి జితేంద్రసింగ్ ప్రదానం చేశారు. 8 కేటగిరీల్లో 19 అవార్డులు అందజేశారు. ప్రతి కేటగిరీలో స్వర్ణ పతకానికి రూ. 2 లక్షల నగదు బహుమతి, ప్రశంసాపత్రం.. రజత పతకానికి రూ.1 లక్ష నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందించారు. తెలంగాణ ‘మీ–సేవా’విభాగానికి రజత పతకం దక్కింది. కార్యక్రమంలో పరిపాలన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి కె.వి. ఇయాపెన్, డీఏఆర్పీజీ అదనపు కార్యదర్శి వసుధ మిశ్రా, తెలంగాణ అదనపు ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. -
నవభారత్‌కు బాటలు
సాక్షి,న్యూఢిల్లీ: నూతన సంవత్సరంలో కుల, మత విద్వేషాలు లేని అవినీతి రహిత నవ భారత్‌కు నాంది పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న వేళ 21వ శతాబ్దంలో జన్మించి ఓటు హక్కు పొందడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలోకి ప్రవేశిస్తున్న వారిని స్వాగతిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో మహత్తర ఆయుధమైన ఓటుతో దేశ రూపురేఖలను మార్చవచ్చని అన్నారు. గత నెలలో సానుకూల భారత్ ఆవిష్కారానికి సూచనలు చేయాలని తాను కోరిన మీదట పలు నిర్మాణాత్మక సూచనలు వచ్చాయని చెప్పారు. యువత కోసం నూతన అవకాశాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. నైపుణ్యాభివృద్ధి నుంచి యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రక్రియ ఊపందుకుందని చెప్పారు. అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేలా నవభారత యువతను ప్రోత్సహిస్తున్నామన్నారు. 2018 రిపబ్లిక్ వేడుకలకు ఆసియా నేతలను భారత్ ఆహ్వానిస్తున్నదని చెప్పారు. పలు ఆసియా నేతలు తొలిసారిగా గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధులుగా హాజరవుతారని తెలిపారు. ముస్లిం మహిళల సాధికారత కోసం తమ ప్రభుత్వం ఏడు దశాబ్ధాల నాటి ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసే చర్యలు చేపట్టిందని చెప్పారు. -
రాష్ట్రంలో మూడు వెనుకబడిన జిల్లాలు
సాక్షి, హైదరాబాద్: తొలిసారిగా రాష్ట్రంలోని కొత్త జిల్లాలను కేంద్రం గుర్తిం చింది. ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన జిల్లాల జాబితాలో జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలకు చోటు దక్కింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 115 జిల్లాల్లో రాష్ట్రం నుంచి మూడు జిల్లాలను నీతి ఆయోగ్ ఈ జాబితాలో చేర్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో 2022 న్యూ ఇండియా లక్ష్య సాధన దిశగా జిల్లాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వెనుకబాటుతనం, పేదరికం, తీవ్రవాద ప్రాబల్యంతోపాటు అక్షరాస్యత, ఆరోగ్య ప్రమాణాలు, విద్య, తాగునీరు, విద్యుత్ వసతి వంటి కీలకమైన మౌలిక వసతులను ప్రామాణికంగా తీసుకుని జిల్లాలను ఎంపిక చేసే బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించింది. వేగంగా పనులు జరిగేలా చూసేందుకు కేంద్రం ఈ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఖమ్మం జిల్లాకు రాజీవ్ రంజన్ మిశ్రా, ఆసిఫాబాద్ జిల్లాకు వసుధా మిశ్రా, భూపాలపల్లి జిల్లాకు సంజయ్‌కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం తరఫున నోడల్ అధికారులను నియమించాలని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభు త్వం ఖమ్మం జిల్లాకు జి.అశోక్‌కుమార్, భూపాలపల్లి జిల్లాకు నవీన్ మిట్టల్, ఆసిఫాబాద్ జిల్లాకు నదీమ్ అహ్మద్‌ను నోడల్ ఆఫీసర్లుగా నియమించింది. మరో మూడు జిల్లాలకు చోటివ్వండి.. కేంద్రం గుర్తించిన వెనుకబడిన ప్రాంతాల జాబితాలో రాష్ట్రంలోని మరో మూడు జిల్లాలకు అవకాశం కల్పించాలని రాష్ట్రం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌కు రాష్ట్ర సీఎస్ ఎస్పీ సింగ్ లేఖ రాశారు. సామాజిక ఆర్థిక పరిస్థితులు, వెనుకబడిన ప్రాంతాల గుర్తింపునకు నీతి అయోగ్ ఎంచుకున్న ప్రమాణాల ప్రకారం మహబూబాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాలను ఈ జాబితాలో చేర్చాల్సిన అవసరముందని ప్రస్తావించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నందున ఆ జిల్లాను సైతం జాబితాలో చేర్చాలని కోరారు. -
మోదీపై రతన్ టాటా ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా కంపెనీ అధినేత రతన్ టాటా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. 'నవభారతం' కోసం ప్రధాని మోదీ కలలు కంటున్నారని, తన కలల మేరకు నవభారతాన్ని నిర్మించేందుకు ప్రధాని మోదీకి ఒక అవకాశాన్ని ఇవ్వాలని టాటా సూచించారు. సీఎన్‌బీసీ టీవీ18కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన టాటా.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్ననాటి నుంచి నరేంద్రమోదీని సన్నిహితంగా గమనిస్తున్నట్టు తెలిపారు. వేగంగా విధాన నిర్ణయాలు తీసుకునే ఆయన సామర్థ్యాన్ని టాటా కొనియాడారు. కేవలం మూడురోజుల్లో భూకేటాయింపులు జరిపి.. పశ్చిమబెంగాల్ నుంచి గుజరాత్‌కు టాటా నానో కారు ఫ్యాక్టరీ తరలిరావడానికి మోదీ ఎంతగానో సహకరించారని గుర్తుచేసుకున్నారు. 'ప్రధానిగా మోదీ ఓ కొత్త భారతాన్ని అందించాలని అనుకుంటున్నారు. ఇందుకు మనం ఆయనకు ఒక అవకాశాన్ని ఇవ్వాలి. భారత్‌ను కొత్తగా మలచడానికి అవసరమైన సృజనాత్మకత, సామర్థ్యం ఆయనకు ఉన్నాయి. ఆయన నాయకత్వంలో నవభారతం సాకారం కాగలదని నేను ఆశాభావంతో ఉన్నాను' అని టాటా అన్నారు. -
నవభారత్‌కు బాటలుః మోదీ
సాక్షి, అహ్మదాబాద్: దేశానికి స్వాతంత్ర్యం సమకూరి 75 ఏళ్లు పూర్తయ్యే 2022 నాటికి దేశాన్ని నవభారత్‌గా మలిచేందుకు ఏ అవకాశాన్నీ జారవిడుచుకోరాదని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. ప్రతిష్టాత్మక సర్ధార్ సరోవర్ డ్యామ్‌ను ఆదివారం జాతికి అంకింత చేసిన అనంతరం గుజరాత్‌లోని దభోయ్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 125 కోట్ల ప్రజలు తనతో ఉన్నంతవరకూ తాను చిన్న వాటి గురించి ఆలోచించనని భారీ ప్రాజెక్టులతో ప్రజలకు మేలు తలపెడతానన్నారు. నీటిపారుదల, జలవనరుల గురించి నిత్యం తపించిన సర్ధార్ పటేల్, అంబేడ్కర్లను మనం స్మరించుకోవాలన్నారు. సర్ధార్ సరోవర్ డ్యామ్‌కు నిధులిచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ నిరాకరిస్తే గుజరాత్లో సాధువులు, భక్తులు సహకరించారని, విరాళాలతో ముందుకొచ్చారని చెప్పారు. దేశంలోని కరువు పీడిత ప్రాంతాలకు నర్మదా జలాలను పంచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసిన ప్రజలను ప్రశంసించారు. సర్ధార్ పటేల్‌కు సరోవర్ డ్యామ్ ద్వారా దేశం ఘనమైన నివాళి ఇచ్చిందని అన్నారు.దేశంలోని తూర్పు ప్రాంతం నీటి కొరతతో ఇబ్బందులు పడుతుంటే..పశ్చిమ భారతం విద్యుత్, గ్యాస్ కొరత ఎదుర్కొంటున్నదనీ, ఈ ఇబ్బందులనూ త్వరలోనే అధిగమిస్తామన్నారు. దేశాన్ని అభివృద్ధిలో నూతన శిఖరాలకు చేర్చుతామని చెప్పారు.సర్ధార్ సరోవర్ డ్యామ్ జలక్రీడలు, సాహస క్రీడలు, పర్యాటానికి హబ్‌గా మారుతుందని అన్నారు. -
నవభారత్‌కు బాటలుః మోదీ
-
ఇక కులం, కశ్మీర్ లాంటి సమస్యలు ఉండవు
- 2022 నాటికి న్యూఇండియా సాకారం - అప్పటికి అన్ని సమస్యలను పరిష్కరిస్తాం: రాజ్‌నాథ్ - ఆసక్తికరంగా మారిన కేంద్ర హోం మంత్రి ప్రతిజ్ఞ న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అన్నింటికీ 2022లోగా పరిష్కారం చూపుతామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఉగ్రవాదం మొదలుకొని కుల వ్యవస్థ దాకా మొత్తాన్ని మార్చేస్తామన్నారు. న్యూఇండియా ఉద్యమంలో భాగంగా శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ‘సంకల్ప్ సే సిద్ధి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేయించిన ప్రతిజ్ఞపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ‘ఉగ్రవాదం, కశ్మీర్ సమస్య, నక్సలిజం.. ఇలా దేశంలో సమస్యలు చాలా ఉన్నాయి. అయితే, వాటన్నింటినీ 2022లోగా పరిష్కరిస్తామని నేను భరోసా ఇస్తున్నాను. న్యూఇండియాను నిర్మిద్దామని మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. రాబోయే నవభారతంలో సమస్యలకు తావులేదు’ అని రాజ్‌నాథ్ ఉద్ఘాటించారు. అనంతరం.. సభికుల చేత.. ‘పేదరికం లేని, అవినీతి లేని, ఉగ్రవాదరహిత, మతవిద్వేషరహిత, కులరహిత, స్వచ్ఛభారత్‌ను నిర్మించుకుందాం’ అనే ప్రమాణాన్ని చేయించారు. ‘స్వాతంత్ర్య సమరయోధులు 1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలుపెడితే 1947కు స్వాతంత్ర్యం సిద్ధించింది. అలానే న్యూఇండియా నిర్మాణం కోసం ఇప్పుడు(2017లో) ప్రతిజ్ఞచేసి.. 2022నాటికి సాకారం చేసుకుందాం’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. కాగా, రాజ్‌నాథ్ ప్రకటనపై భిన్న స్పందనలు వెలువడ్డాయి. 2018లోగా చొరబాట్లను శాశ్వతంగా నిరోధిస్తామని, ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె వేస్తామని, నక్సల్స్ సమస్యకు ముగింపు పలుకుతామని గతంలో ప్రకటించినా, అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో తాజా ప్రకటన కూడా కేవలం ప్రకటనగానే మిగిలిపోతుందని విపక్షాల నేతలు పెదవి విరిచారు. -
ఇక బీమా ఐపీవోలు!
⇒ క్యూ కడుతున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ⇒ త్వరలో ఎస్బీఐ, న్యూ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ ⇒ ఐపీవో యత్నాల్లో హెచ్డీఎఫ్సీ లైఫ్ న్యూఢిల్లీ: దిగ్గజ బీమా కంపెనీలు ఈ ఏడాది వరసగా పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నాయి. జాబితాలో ముందు వరసలో ఎస్బీఐ లైఫ్, న్యూ ఇండియా అష్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూటీఐ మ్యూచువల్ ఫండ్ నిలుస్తుండగా... ప్రైవేటు రంగానికి చెందిన మరో ప్రముఖ బీమా కంపెనీ హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ సైతం ఐపీవో సన్నాహాలు చేసుకుంటోంది. ఇవి ఐపీవోల ద్వారా రూ.20,000 కోట్ల నిధులను సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే వీటిలో కొన్ని కంపెనీలు ఐపీవో ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించాయి కూడా. ఐపీవో ద్వారా షేర్ల విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉంటుందని ఎస్బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఐపీవో ద్వారా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో 10 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించే ప్రతిపాదనకు ఎస్బీఐ బోర్డు ఆమోదం తెలిపింది కూడా. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ గతేడాది రూ.6,000 కోట్లు సమీకరించడం ద్వారా స్టాక్ మార్కెట్లో నమోదైన విషయం తెలిసిందే. ఐపీవోకు వచ్చిన తొలి బీమా కంపెనీ ఇదే. హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 10 శాతం వాటా విక్రయించనున్నట్టు హెచ్డీఎఫ్సీ గతేడాది ఏప్రిల్‌లోనే ప్రకటించింది. అయితే మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను తనలో విలీనం చేసుకోవడం ద్వారా స్టాక్ మార్కెట్లో నమోదవ్వాలని ఆ తర్వాత భావించింది. కానీ, ఈ ఒప్పందానికి ఐఆర్డీఏ అభ్యంతరాలు చెబుతున్న నేపథ్యంలో ఈ సంస్థ తిరిగి ఐపీవో ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తొలుత సాధారణ బీమా కంపెనీలే! ప్రభుత్వ రంగ కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.72,500 కోట్లు సమీకరించాలన్న లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. ఈ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ రంగంలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవోకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్, జీఐసీలో 25 శాతం చొప్పున వాటాలను ప్రభుత్వం విక్రయించనుంది. ఆకర్షణీయమైన ధరలను నిర్ణయించిన ఐపీవోలకు మంచి స్పందన లభిస్తుందని, లిస్టింగ్ రోజే లాభాలకు అవకాశం ఉంటుందని క్వాంటమ్ ఏఎంసీ డైరెక్టర్ ఐవీ సుబ్రహ్మణ్యం చెప్పారు. అధిక ధరను ఖరారు చేసిన కంపెనీలు ఆకర్షణీయమైన ధరల వద్ద లిస్ట్ కాకపోవచ్చన్నారు. యూటీఐ ఐపీవో ఇక యూటీఐ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా ఐపీవోకు రావాలని ఎప్పటి నుంచో సన్నాహాల్లో ఉంది. దీన్లో ఎస్బీఐ, ఎల్ఐసీ, బీవోబీ, పీఎన్బీలకు 18.5 శాతం చొప్పున మొత్తం 74 శాతం వాటా ఉంది. తాజా ఐపీవో ద్వారా ఇవి తమ వాటాలో కొంత విక్రయించనున్నాయి. మిగిలిన 26 శాతం వాటా అమెరికాకు చెందిన టీరోవ్ ప్రైస్ సంస్థ చేతిలో ఉంది. ఐపీవోకు రానున్న తొలి మ్యూచువల్ ఫండ్ కంపెనీగా యూటీఐ అస్సెట్ మేనేజ్మెంట్ నిలవనుంది. ఐపీవో మార్కెట్లో ఈ ఏడాది సందడి నెలకొననుందని, దాదాపు సగం కంపెనీలు ఇప్పటికే ముసాయిదా పత్రాలను సెబీ వద్ద దాఖలు చేసి, అనుమతి కోసం వేచి ఉన్నాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. గతేడాది 26 కంపెనీలు ఐపీవోల ద్వారా రూ.26,000 కోట్ల నిధులన్నీ సమీకరించాయి. గత ఆరు సంవత్సరాల్లో ఇదే రికార్డు. -
నగదు తక్కువగా వాడండి
⇒ అవినీతిపై పోరును ఉధృతం చేయండి ⇒ మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: నల్లధనం, అవినీతిపై పోరును ఉధృతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. నోట్ల రద్దు తర్వాత మొదలైన డిజిటల్ చెల్లింపుల ఉద్యమానికి మద్దతు కొనసాగించాలని, దైనందిన జీవితంలో తక్కువ నగదు వాడాలని ఆదివారం తన ‘మన్‌కీ బాత్’ ప్రసంగంలో సూచించారు. ‘నల్ల ధనం, అవినీతిపై మన పోరాటాన్ని తదుపరి దశకు తీసుకెళ్లాలి... నగదు వాడకాన్ని తగ్గించేందుకు మనవంతు కృషి చేయాలి’ అని పేర్కొన్నారు. స్కూలు ఫీజుల చెల్లింపు, మందులు, రేషన్ సరుకుల కొనుగోలుకు, విమానం, రైలు టికెట్లకు డిజిటల్ చెల్లింపులు చేయాలని కోరారు. ‘ఇలా దేశానికి ఎంత సేవచేయగలరో, నల్లధనం, అవినీతిపై పోరులో ధీర సైనికుడిలా ఎలా మారగలరో మీరు ఊహించలేరు’ అని పేర్కొన్నారు. ఆరు నెలల్లోనే.. ఈ ఏడాది 2,500 కోట్ల డిజిటల్ లావాదేవీలు ఉండగలవని బడ్జెట్లో అంచనా వేశారని, అయితే 125 కోట్లమంది దేశ ప్రజలు పూనుకుంటే ఈ లక్ష్యాన్ని ఆరునెలల్లోనే సాధించగలరని మోదీ అన్నారు. గత కొన్ని నెలల్లో ప్రజలు డిజిటల్ చెల్లింపుల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. ‘నగదు రహిత లావాదేవీలను నేర్చుకోవడానికి పేదలు యత్నిస్తున్నారు.. భీమ్ యాప్‌ను కోటిన్నరమంది డౌన్లోడ్ చేసుకున్నారు’ అని వెల్లడించారు. శిశువుకు అమ్మప్రేమ పూర్తిగా దక్కాలి ప్రసూతి సెలవులను 12 నుంచి 26 వారాలకు పెంచడం ద్వారా కార్మిక మహిళల సంక్షేమం దిశగా దేశం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ‘భావి భారత పౌరులైన నవజాత శిశువులకు తల్లిప్రేమ, సంరక్షణ పూర్తిగా దక్కాలి’ అని వ్యాఖ్యానించారు. స్వచ్ఛ భారత్, నవ భారత్ లక్ష్యాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. ఆహారాన్ని వృథా చేయడం పేదలకు అన్యాయం చేయడమేనన్నారు. నవ భారత్ ప్రభుత్వ పథకం కానీ, రాజకీయ పార్టీ కార్యక్రమం కానీ కాదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ పౌరులుగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తే నవ భారత నిర్మాణానికి అదే శుభారంభమవుతుందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ వాసులకు శుభాకాంక్షలు బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, అభివృద్ధి కోసం చేసే పోరులో ఆ దేశ ప్రజలకు భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ ప్రగతి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ‘భారత్, బంగ్లాల జాతీయగీతాలను రచించిన రవీంద్రనాథ్ టాగూర్ జిలియన్వాలా బాగ్ మారణకాండకు నిరసనగా నైట్‌హుడ్ బిరుదును త్యజించడం గర్వకారణం. అంతవరకు మైదానంలో ఆటలకే పరిమితమైన ఓ కుర్రవాడికి ఇది ప్రేరణను, జీవితాశయాన్ని అందించింది. అమరుడిగా మారిన ఆ కుర్రవాడు మరెవరో కాదు, 12 ఏళ్ల భగత్‌సింగ్’ అని కొనియాడారు. మహాత్మాగాంధీ ప్రారంభించిన చంపారణ్ సత్యాగ్రహాన్నీ మోదీ ప్రశంసించారు. గాంధీ తన ఆచరణతో దేశ ప్రజలను బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి తెచ్చారన్నారు. ఎవరిపైనా అభిప్రాయాల్ని రుద్దం బ్రహ్మకుమారీల సదస్సులో మోదీ మౌంట్ అబూ(రాజస్తాన్): భారత్ తన అభిప్రాయాలను ఎవరిపైనా బలవంతంగా రుద్దదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో సుసంపన్నమైన భిన్నత్వం ఉందని, దేవుడొక్కడే అన్నది దేశ సంప్రదాయ సారాంశమని వ్యాఖ్యానించారు. ఆదివారమిక్కడ జరిగిన బ్రహ్మ కుమారీల సదస్సును ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ‘భారత్‌లో హిందువులు, ముస్లింలు, పార్సీలకు దేవుడంటే ఒక్కడే. సత్యం ఒకటే.. భిన్న వర్గాల ప్రజలు దాన్ని భిన్నరకాలుగా వ్యక్తీకరిస్తారు.. తన అభిప్రాయాలను ఇతరులపై రుద్దడంలో భారత్‌కు విశ్వాసం లేదు’ అన్నారు. 2030 నాటికి దేశ ఇంధనోత్పత్తిలో శిలాజేతర ఇంధనం 40 శాతంగా ఉండాలని భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని తెలిపారు. బ్రహ్మకుమారీస్ సంస్థ నగదు రహిత లావాదేవీలు, శిశువులకు పోషకాహార ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు. స్కూళ్లు, కాలేజీల్లో యోగాను తప్పనిసరి చేయాలని బ్రహ్మకుమారీస్ ప్రధాన కార్యదర్శి రాజయోగి బీకే నిర్వాయర్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. -
అది ఇండియన్స్ డ్రీమ్: 'మన్‌కీ బాత్'లో మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం ద్వారా పలు అంశాలపై తన అభిప్రాయాలను దేశంతో పంచుకున్నారు. 30వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఆయన ఆదివారం దేశ ప్రజలతో ముచ్చటించారు. ఆయన ఏమన్నారంటే.. అవినీతితోపాటు నల్లధనాన్ని కూడా భారతీయులు తిరస్కరించారు. అందుకే వారు డిజిటల్ లావాదేవీలు జరుపుతున్నారు. కొత్త 1.5 కోట్లమంది భారతీయుల డిజిటల్ లావాదేవీలవైపు మళ్లారు. 125 కోట్లమంది భారతీయుల శక్తి, నైపుణ్యాలను మలిచేవిధంగా నవభారతం ఉండబోతున్నది. భవ్య, దివ్య భారత నిర్మాణమే లక్ష్యం నవభారతం రాజకీయ మ్యానిఫెస్టో మరో కార్యక్రమమో కాదు. ఇది 125 కోట్ల భారతీయుల కల. మహాత్మాగాంధీ ఎందుకు భారతీయులకు ప్రత్యేకమో చంపారణ్ సత్యాగ్రహం ద్వారా నిరూపించారు. ఆయన మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా ప్రజాశక్తిని చాటారు. మహాత్మాగాంధీ చంపారణ్ ఉద్యమానికి నేటితో వందేళ్లు. గాంధీ దేశంలో చేపట్టిన తొలి ఉద్యమం ఇదే. 45వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బంగ్లాదేశ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. -
న్యూ ఇండియా త్రీ ఇన్ వన్ పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అల్పాదాయ వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఒకే పథకంలో మూడు రకాల బీమా రక్షణను కల్పించే విధంగా సరికొత్త బీమా పథకాన్ని ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీ న్యూ ఇండియా ప్రవేశపెట్టింది. జీవిత బీమా రక్షణతో పాటు ఆరోగ్య, ప్రమాద బీమా రక్షణను కల్పించే విధంగా దీన్ని రూపొందిచామని, ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని సోమవారం ప్రారంభిస్తున్నట్లు న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ జి.శ్రీనివాసన్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే లక్ష రూపాయల బీమాతో పాటు, హాస్పిటలైజేషన్ అయితే రూ.20-30 వేలు వైద్య చికిత్సా వ్యయం కింద పొందవచ్చు. దీంతో పాటు ప్రమాద బీమా రక్షణ కూడా ఉంటుంది. ఈ మూడింటికి కలిపి వార్షిక ప్రీమియం రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఈ కాంబినేషన్ ప్రోడక్టును ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ స్వాగతించారు.