నవభారత్‌కు బాటలుః మోదీ
సాక్షి, అహ్మదాబాద్: దేశానికి స్వాతంత్ర్యం సమకూరి 75 ఏళ్లు పూర్తయ్యే 2022 నాటికి దేశాన్ని నవభారత్‌గా మలిచేందుకు ఏ అవకాశాన్నీ జారవిడుచుకోరాదని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. ప్రతిష్టాత్మక సర్ధార్ సరోవర్ డ్యామ్‌ను ఆదివారం జాతికి అంకింత చేసిన అనంతరం గుజరాత్‌లోని దభోయ్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 125 కోట్ల ప్రజలు తనతో ఉన్నంతవరకూ తాను చిన్న వాటి గురించి ఆలోచించనని భారీ ప్రాజెక్టులతో ప్రజలకు మేలు తలపెడతానన్నారు. నీటిపారుదల, జలవనరుల గురించి నిత్యం తపించిన సర్ధార్ పటేల్, అంబేడ్కర్‌లను మనం స్మరించుకోవాలన్నారు. సర్ధార్ సరోవర్ డ్యామ్‌కు నిధులిచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ నిరాకరిస్తే గుజరాత్‌లో సాధువులు, భక్తులు సహకరించారని, విరాళాలతో ముందుకొచ్చారని చెప్పారు.
దేశంలోని కరువు పీడిత ప్రాంతాలకు నర్మదా జలాలను పంచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసిన ప్రజలను ప్రశంసించారు. సర్ధార్ పటేల్‌కు సరోవర్ డ్యామ్ ద్వారా దేశం ఘనమైన నివాళి ఇచ్చిందని అన్నారు.దేశంలోని తూర్పు ప్రాంతం నీటి కొరతతో ఇబ్బందులు పడుతుంటే..పశ్చిమ భారతం విద్యుత్, గ్యాస్ కొరత ఎదుర్కొంటున్నదనీ, ఈ ఇబ్బందులనూ త్వరలోనే అధిగమిస్తామన్నారు. దేశాన్ని అభివృద్ధిలో నూతన శిఖరాలకు చేర్చుతామని చెప్పారు.సర్ధార్ సరోవర్ డ్యామ్ జలక్రీడలు, సాహస క్రీడలు, పర్యాటానికి హబ్‌గా మారుతుందని అన్నారు.