భోపాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలను బాగానే జరిపారు.. కానీ ఆయన ఒక్కడి కోసం దాదాపు 32 వేల మందిని నీట ముంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నర్మద బచావో ఆందోళన్ కార్యకర్తలు. నిన్న ఓ వైపు నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా.. మరోవైపు నర్మదా బాచావో ఆందోళనకారులు ఖంద్వా-బరోడా రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేధా పాట్కర్ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆయన ఒక విషయం గుర్తిస్తే మంచిది. జనజీవనానికిక ఆటంకం కలగకుండా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రధానిగా ఆయన మీద ఉంది. మోదీ పుట్టిన రోజు వేడుకల కోసం గుజరాత్ ప్రభుత్వం సర్దార్ సరోవర్ ఆనకట్టలో నీటి మట్టాన్ని 139 మీటర్లకు పెంచింది. ఆయన ఒక్కడి కోసం ఎందరో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదు. అందుకే మేం ఆయన పుట్టిన రోజు వేడుకలను బహిష్కరిస్తున్నాం. బ్యాక్ వాటర్ వల్ల బర్వానీ, ధార్, అలీరాజ్‌పూర్ జిల్లాలోని 192 గ్రామాలు పూర్తిగా, పాక్షికంగా మునిగిపోయాయి. ఆ ప్రాంతాల్లోని ప్రజలకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించిన తర్వాతే.. స్లూయిస్ గేట్లను మూసివేయాలి’ అని మేధా పాట్కర్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment