
అహ్మదాబాద్: నర్మదా నదిపై తలపెట్టిన సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని రాజకీయ అండ ఉన్న అర్బన్ నక్సల్స్ (అభివృద్ధి నిరోధక శక్తులు) ఏళ్ల తరబడి అడ్డుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వారు ఇప్పటికీ ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం పర్యావరణ మంత్రుల జాతీయ సదస్సును గుజరాత్‌లోని నర్మదా జిల్లా ఏక్తా నగర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించారు.
వివిధ సంస్థల అండతో అర్బన్ నక్సల్స్ సాగిస్తున్న ప్రచారం కారణంగా అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయన్నారు. వీరు న్యాయవ్యవస్థ, ప్రపంచబ్యాంకులను సైతం ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. జాప్యం వల్ల సమయం, పెద్ద మొత్తంలో డబ్బు వృథా అవుతోందన్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యావరణ అనుమతుల కోసం 6 వేల దరఖాస్తులు, మరో 6,500 దరఖాస్తులు అటవీ శాఖ అనుమతుల కోసం పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
ఇదీ చదవండి: సీఎంగా నా వారసుడిని వారే నిర్ణయిస్తారు: గెహ్లాట్
Comments
Please login to add a commentAdd a comment