మహిళా క్రికెట్‌ దిగ్గజం మిథాలీని ప్రశంసిస్తూ మోదీ లేఖ | PM Narendra Modi writes to Mithali Raj | Sakshi
Sakshi News home page

మహిళా క్రికెట్‌ దిగ్గజం మిథాలీని ప్రశంసిస్తూ మోదీ లేఖ

Published Sun, Jul 3 2022 5:40 AM | Last Updated on Sun, Jul 3 2022 5:40 AM

PM Narendra Modi writes to Mithali Raj - Sakshi

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఆయన ట్విట్టర్‌లో ఆ లేఖను పోస్ట్‌ చేశారు.

‘రెండు దశాబ్దాలకు పైగా మీరు భారత క్రికెట్‌కు సేవలందించారు. మీ ప్రతిభాపాఠవాలతో జాతీయ జట్టును నడిపించిన తీరు అమోఘం. మీ ప్రదర్శన అద్భుతం. ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. మీ కెరీర్‌ మొత్తం అంకెలతో ఉన్నత శిఖరాలకు చేరింది. మీ సుదీర్ఘ ప్రయాణంలో మీరెన్నో రికార్డులను నెలకొల్పారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక టాప్‌స్కోరర్‌గా నిలిచారు. ఓ అథ్లెట్‌గా ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యారు’ అని ప్రధాని అందులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement