mithali raj
-
ఓటు వేసిన VVS లక్ష్మణ్, మిథాలీ రాజ్
-
ధోని, యువరాజ్లకు అరుదైన గౌరవం
భారత క్రికెట్ దిగ్గజాలు మహేంద్రసింగ్ ధోని, యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలతో పాటు భారత మహిళా క్రికెట్ దిగ్గజాలు మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామిలకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వీరికి లైఫ్ టైమ్ మెంబర్షిప్ ఇచ్చి సత్కరించింది. వీరితో పాటు మరో 14 మంది పురుష, మహిళా క్రికెట్ దిగ్గజాలకు కూడా ఎంసీసీ జీవితకాల సభ్యత్వాన్ని అందించి గౌరవించుకుంది. భారత క్రికెట్ దిగ్గజాలతో పాటు వెస్టిండీస్‌కు చెందిన మెరిస్సా అగ్యూలైరా, ఇంగ్లండ్‌కు చెందిన జెన్నీ గన్, లారా మార్ష్, ఇయాన్ మోర్గాన్, కెవిన్ పీటర్సన్, అన్యా శ్రుబ్సోల్, పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ హఫీజ్, ఆస్ట్రేలియాకు చెందిన రేచల్ హేన్స్, బంగ్లాదేశ్‌కు చెందిన ముష్రఫే మోర్తాజా, న్యూజిలాండ్‌కు చెందిన రాస్ టేలర్, ఆమీ సాటరెత్‌వైట్, సౌతాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్‌లను ఎంసీసీ లైఫ్ టైమ్ మెంబర్షిప్ ఇచ్చి గౌరవించింది. ఈ వివరాలను ఎంసీసీ సీఈఓ, సెక్రెటరీ గుయ్ లావెండర్ ఇవాళ (ఏప్రిల్ 5) అధికారికంగా ప్రకటించారు. కాగా, ఎంసీసీ లైఫ్ టైమ్ మెంబర్షిప్ అందుకున్న ధోని, యువరాజ్, రైనా భారత్ 2011 వన్డే వరల్డ్‌కప్ సాధించిన జట్టులో సభ్యులు కాగా.. మిథాలీ రాజ్ మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు (7805) సాధించిన బ్యాటర్‌గా, ఝులన్ గోస్వామి వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన మహిళా బౌలర్ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఎంసీసీ చివరిసారిగా లైఫ్ టైమ్ మెంబర్‌షిప్‌లను 2021 అక్టోబర్‌లో ప్రకటించింది. నాడు ఇంగ్లండ్‌కు చెందిన అలిస్టర్ కుక్, సౌతాఫ్రికాకు చెందిన జాక్ కల్లిస్, భారత్‌కు చెందిన హర్భజన్ సింగ్‌లతో పాటు మరో 15 మందికి ఈ గౌరవం దక్కింది. -
టాపార్డరే కీలకం: మిథాలీ
న్యూఢిల్లీ: ఈనెల 10 నుంచి దక్షిణాఫ్రికా వేదికగా జరిగే సీనియర్ మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భారత అవకాశాలు టాపార్డర్ రాణించడంపైనే ఆధారపడి ఉంటాయని దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ తెలిపింది. ‘భారత టాపార్డరే కీలకం. ఓపెనర్ స్మృతి మంధాన ఫామ్‌లో ఉంది. ఆమె మ్యాచ్ విన్నర్. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కూడా బాగా ఆడుతోంది. ఇటీవలే సఫారీలో అండర్–19 మెగా ఈవెంట్ గెలుచుకొచ్చిన షఫాలీ వర్మ, రిచా ఘోష్‌ల అనుభవం కూడా భారత సీనియర్ జట్టుకు ఉపకరిస్తుంది. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లాంటి మేటి జట్లను ఓడిస్తే మిగతా జట్లపై విజయం సులువవుతుంది. బౌలింగ్‌లో సవాళ్లు ఎదురవుతాయి. ఈ కఠిన పరీక్షను ఎదుర్కోవాలంటే బౌలర్లు తమ ప్రదర్శనను మెరుగుపర్చుకోవాల్సిందే’ అని మిథాలీ విశ్లేషించింది. -
గుజరాత్ జెయింట్స్ మెంటార్‌గా మిథాలీ రాజ్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అహ్మదాబాద్ జట్టు ‘గుజరాత్ జెయింట్స్’కు భారత మాజీ కెపె్టన్ మిథాలీ రాజ్ మెంటార్‌గా వ్యవహరించనుంది. మిథాలీ లాంటి స్టార్‌ను తమ బృందంలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉందని డైరెక్టర్ ప్రణవ్ అదానీ చెప్పారు. డబ్ల్యూపీఎల్ కోసం ఆమె రిటైర్మెంట్ను పక్కన పెట్టి తొలి టోర్నీలో ఆడవచ్చని వినిపించింది. అయితే తాజా ప్రకటనతో మిథాలీ ప్లేయర్‌గా ఆడే అవకాశాలు లేవని తేలిపోయింది. గుజరాత్లో విమెన్స్ క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు.. మెంటార్‌గా మిథాలీ సపోర్ట్ అందించనుంది. మార్చిలో జరిగే డబ్ల్యూపీఎల్‌లో ఐదు జట్లు బరిలోకి దిగనున్నాయి. గత వారం జరిగిన ఫ్రాంచైజీల వేలంలో అదానీ గ్రూప్ రూ. 1298 కోట్లతో గుజరాత్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. విమెన్స్ క్రికెట్ డెవలప్కావడానికి బీసీసీఐ తీసుకున్న చొరవ చాలా బాగుందని మిథాలీ కితాబిచ్చింది. యంగ్‌స్టర్స్ క్రికెట్‌ను ప్రొఫెషన్‌గా తీసుకునేందుకు ఇది దోహదం చేస్తుందని చెప్పింది. -
వరల్డ్ కప్ ఫైనల్ ఆ టీమ్స్ మధ్యే మిథాలీ రాజ్ సంచలన కామెంట్స్
-
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఇంటికే.. ఆ రెండు జట్ల మధ్యే ఫైనల్!
టీ20 ప్రపంచకప్ 2022 (సూపర్-12) సమరం రసవత్తరంగా సాగుతోంది. సూపర్-12 మ్యాచ్‌లు అఖరి దశకు చేరుకున్నప్పటికీ ఇంకా సెమీస్ బెర్త్‌లు ఖారారు కాలేదు. గ్రూపు-1 నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక సెమీస్ రేసులో ఉండగా.. గ్రూపు-2 నుంచి భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సెమీఫైనల్ స్థానాలు కోసం పోటీ పడుతున్నాయి. ఇక ఆడిలైడ్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే తమ సెమీస్ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్‌కు చేరే జట్లను భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అంచనా వేసింది. ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో భారత్- న్యూజిలాండ్ జట్లు తలపడే అవకాశం ఉంది అని మిథాలీ తెలిపింది. స్టార్ స్పోర్ట్స్‌తో మిథాలీ మాట్లాడుతూ.. నా అంచనా ప్రకారం సెమీఫైనల్‌కు గ్రూపు-2 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్లు చేరుకుంటాయి. అదే విధంగా గ్రూపు-1 నుంచి న్యూజిలాండ్ కచ్చితంగా సెమీఫైనల్లో అడుగు పెడుతోంది. అయితే మరో స్థానం కోసం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఫైనల్‌కు భారత్, న్యూజిలాండ్ జట్లు చేరుతాయని భావిస్తున్నా" అని ఆమె పేర్కొంది. చదవండి: బంగ్లాదేశ్‌తో భారత్ కీలక పోరు.. గెలిస్తే సెమీస్ బెర్త్! -
పాకిస్తాన్ - నెదర్లాండ్స్ మ్యాచ్.. కామెంటేటర్‌గా మిథాలీ రాజ్
భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సరికొత్త అవతరమెత్తనుంది. టీ20 ప్రపంచకప్-2022లో కామెంటేటర్‌గా మిథాలీ రాజ్ వ్యవహరించనుంది..ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం జరగనున్న నెదర్లాండ్స్-పాకిస్తాన్ మ్యాచ్‌తో కామెంటేటర్‌గా ఆమె న్యూ జర్నీ ప్రారంభం కానుంది. ఆమె వ్యాఖ్యాతగా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో ఒప్పందం కుదర్చుకుంది. అదే విధంగా ఆదివారం సాయంత్రం జరగనున్న భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు కూడా మిథాలీ కామెంటేటర్‌గా వ్యవహరించనుంది. ఇక 22 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు ఈ ఏడాది జూన్‌లో మిథాలీ రాజ్ ముగింపు పలికింది. తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన రికార్డులు మిథాలీ తన పేరిట లిఖించుకుంది. ముఖ్యంగా మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికి మిథాలీ పేరునే ఉంది. చావో రేవో తెల్చుకోనున్న పాకిస్తాన్ ఇక మెగా ఈ టోర్నీలో వరుస ఓటములతో సతమతమవుతున్న పాకిస్తాన్ పసికూన నెదర్లాండ్స్‌తో చావోరేవో తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఒక వేళ పాకిస్తాన్ ఓటమి చెందితే.. అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాగా గత మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ కంగుతిన్న సంగతి తెలిసిందే. అంతకుముందు తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో పాక్ ఓటమి పాలైంది. చదవండి: AUS Vs WI: ఆసీస్‌తో టెస్టు సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! చంద్రపాల్ కొడుకు ఎంట్రీ -
న్యూజిలాండ్ తర్వాత మనమే.. కానీ ఆ విషయంలో మాత్రం..
BCCI Equal Pay Decision: మ్యాచ్ ఫీజుల విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భారత మహిళల క్రికెట్‌కు కొత్త ఊపు తెచ్చే చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్న రోజును అతి ప్రత్యేకమైన ‘రెడ్ లెటర్ డే’గా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అభివర్ణించగా... ఇదో చారిత్రాత్మక నిర్ణయమని, దీని ద్వారా మహిళల క్రికెట్లో కొత్త శకంలోకి ప్రవేశిస్తున్నామని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘‘లింగ వివక్షను తొలగించి.. సమానత్వాన్ని పెంపొందించే క్రమంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. భారత క్రికెట్లో మరో ముందడుగు పడింది’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా బోర్డును అభినందించాడు. ఇకపై ఇలా మ్యాచ్ ఫీజుల విషయంలో టీమిండియా పురుష క్రికెటర్లు, మహిళా క్రికెటర్ల మధ్య ఎప్పటి నుంచో ఉన్న అంతరాన్ని తొలగించింది. ఇకపై భారత మహిళల జట్టు కాంట్రాక్ట్ క్రికెటర్లకు కూడా పురుషుల జట్టుతో సమానంగా మ్యాచ్ ఫీజు లభిస్తుంది. ఇక నుంచి మహిళా క్రికెటర్లకు టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేలకు రూ. 6 లక్షలు, టి20 మ్యాచ్‌కు రూ. 3 లక్షల చొప్పున చెల్లిస్తారు. ఇంతకు ముందు ఇలా ఉండేది ఇప్పటి వరకు మహిళా క్రికెటర్లకు వన్డే, టి20లకు రూ.1 లక్ష లభిస్తుండగా, టెస్టు మ్యాచ్‌కు రూ. 2 లక్షల 50 వేలు ఇస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన బోర్డు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత క్రికెట్లో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని, వివక్షను దూరం చేసే దిశగా తొలి అడుగు అని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొనగా... తాజా నిర్ణయం మహిళల క్రికెట్ అభివృద్ధికి మరింతగా దోహదం చేస్తుందని అధ్యక్షుడు రోజర్ బిన్నీ వ్యాఖ్యానించారు. కివీస్ తర్వాత మనమే ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మాత్రమే ఇలా పురుష, మహిళా క్రికెటర్లకు సమానంగా మ్యాచ్ ఫీజులు చెల్లిస్తోంది. భారత్ రెండో జట్టు కాగా... ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో కూడా వ్యత్యాసం కొనసాగుతోంది. కాంట్రాక్ట్ విషయంలో మాత్రం 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరిన నాటి నుంచి భారత మహిళల జట్టు ప్రదర్శన మరింతగా మెరుగవుతూ వస్తోంది. దీనిని మరింత ప్రోత్సాహించే దిశగా తాజా ప్రకటన వెలువడింది. అయితే బోర్డు కాంట్రాక్ట్ మొత్తం విషయంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. మహిళా క్రికెటర్లలో ‘ఎ’ గ్రేడ్‌కు రూ. 50 లక్షలు, ‘బి’, ‘సి’ గ్రేడ్లకు రూ. 30 లక్షలు, రూ. 10 లక్షలు చొప్పున బోర్డు ఇస్తోంది. అదే పురుష క్రికెటర్లకు మాత్రం ఎ, బి, సి గ్రేడ్లలో వరుసగా రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు, రూ. 1 కోటితో పాటు ‘ఎ’ ప్లస్ కేటగిరీలో రూ. 7 కోట్లు లభిస్తాయి. చదవండి: T20 WC 2022: 'బాబర్ ఒక పనికిరాని కెప్టెన్.. ఆడింది చాలు ఇంటికి వచ్చేయండి' -
Telangana Politics: బీజేపీ ప్రచారానికి నితిన్, మిథాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. సినీ, క్రీడా, కళా రంగాల ప్రముఖు లను ఆకర్షించే పనిని వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్‌తో, సాయంత్రం సినీ నటుడు నితిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు అంగీకరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే వారు బీజేపీలో చేరుతారా, లేక కేవలం ప్రచారానికే పరిమితం అవుతారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. రాజకీయ, సాంస్కృతిక అంశాలపై... శనివారం రాత్రి నోవాటెల్‌కు వచ్చిన సినీ నటుడు నితిన్ జేపీ నడ్డాతో సుమారు గంట పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సినిమాలతోపాటు రాజకీయ అంశాలపై వారు చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రాంతం నుంచి ప్రముఖ హీరోగా నితిన్ ఎదగడాన్ని జేపీ నడ్డా అభినందించారని.. సినిమా శక్తివంతమైన మాధ్యమమని, ప్రజల్లో మార్పునకు ఒక సాధనంగా పనిచేస్తుందని పేర్కొన్నారని తెలిపాయి. తాను ప్రధాని మోదీ నుంచి స్ఫూర్తి పొంది అభిమానిగా మారానని, రాబోయే రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని నితిన్ పేర్కొన్నట్టు వెల్లడించాయి. ఈ సమావేశం అనంతరం జేపీ నడ్డా తెలుగులో ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణలో ఈ రోజు ప్ర ముఖ నటుడు నితిన్‌ను కలవడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నాం. నితిన్ తన రాబోయే సినిమాల గురించీ చెప్పారు. అతనికి శుభాభినందనలు తెలియజేశాను..’’అని తన ట్వీట్లో నడ్డా పేర్కొన్నారు. క్రీడలకు ప్రాధాన్యం: మిథాలీరాజ్ ప్రధాని మోదీ హయాంలో దేశంలో క్రీడలకు ప్రాధాన్యం పెరిగిందని నడ్డాతో భేటీలో మిథాలీరాజ్ హర్షం వ్యక్తం చేశారు. క్రీడా రంగంలో శిక్షణ, మౌలిక వసతుల కల్పన పెరిగిందని.. క్రీడాకారుల్లో ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు. 20ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్న తనకు క్రీడారంగంలో గత 8 ఏళ్లలో చోటుచేసుకున్న సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడోత్సవాల్లో భారత్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మునుగోడు’పై పకడ్బందీ కార్యాచరణ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా విజయం సాధించే దిశగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగాలని రాష్ట్ర బీజేపీ నేతలకు జేపీ నడ్డా సూచించారు. శనివారం రాత్రి నోవాటెల్ హోటల్లో పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి తదితరులు నడ్డాతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. పార్టీ నేతలు పూర్తి సమన్వయంతో ముందుకెళ్లాలని, టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ.. బీజేపీకి ప్రజా మద్దతును కూడగట్టాలని ఆదేశించారు. ప్రచారానికి ఓకే అన్న మిథాలీరాజ్, నితిన్: కె.లక్ష్మణ్ నితిన్, మిథాలీరాజ్‌లతో నడ్డా జరిపిన భేటీల్లో పాల్గొన్న ఎంపీ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ దేశానికి సరైన నాయకత్వం అందిస్తున్నట్టు వారు పేర్కొన్నారని కె.లక్ష్మణ్ చెప్పారు. మోదీ కోసం తమ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారని.. ఎన్నికల ప్రచారానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని వివరించారు. ప్రధాని మోదీని స్వయంగా కలవాలని వారు కోరారని.. దీంతో వారిని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని నడ్డా తనకు సూచించారని తెలిపారు. చదవండి: (జేపీ నడ్డాతో ముగిసిన హీరో నితిన్ భేటీ) -
మిథాలీ రాజ్‌తో జేపీ నడ్డా సమావేశం
-
రిటైర్మెంట్ పై యూ టర్న్
-
రిటైర్మెంట్ ప్రకటనపై యూ టర్న్ తీసుకోనున్న మిథాలీ రాజ్..?
Mithali Raj: భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ సారధి మిథాలీ రాజ్ ఇటీవలే క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె తన రిటైర్మెంట్ ప్రకటనపై వెనక్కు తగ్గాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఐసీసీ హండ్రెడ్ పర్సెంట్ క్రికెట్ పోడ్కాస్ట్లో ఆమె మాట్లాడుతూ.. మళ్లీ మైదానంలోకి దిగుతానంటూ సూచనప్రాయంగా వెల్లడించింది. వచ్చే ఏడాది గనుక మహిళల ఐపీఎల్ ప్రారంభమైతే తప్పక తాను బరిలో ఉంటానని పరోక్షంగా పేర్కొంది. Mithali Raj said, "It would be lovely to be part of the women's IPL. I'm open to coming out of retirement." (To ICC). — Mufaddal Vohra (@mufaddal_vohra) July 25, 2022 ఐపీఎల్ కోసం ఆ ఆప్షన్‌ను (రీఎంట్రీ) ఎప్పుడూ ఓపెన్‌గా పెట్టుకుంటానని తెలిపింది. ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారా అని ఎదురైన ప్రశ్నకు మిథాలీ పైవిధంగా స్పందించింది. కాగా, మహిళల ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ గత కొద్ది కాలంగా భారీ కసరత్తు చేస్తుంది. వుమెన్స్ ఐపీఎల్‌ను ఎలాగైనా వచ్చే ఏడాది (2023) ప్రారంభిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా కొద్దిరోజుల కిందట ప్రకటన కూడా చేశారు. మొత్తం 6 జట్లతో మహిళల ఐపీఎల్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. చదవండి: Ind Vs WI 2nd ODI: నిరాశకు లోనయ్యాను.. ద్రవిడ్ సర్ చాలా టెన్షన్ పడ్డారు! -
Shabaash Mithu: సండే సినిమా ఉమన్ ఇన్ బ్లూ
‘మెన్ ఇన్ బ్లూ’ అంటే భారత క్రికెట్ జట్టు. అంటే మగ జట్టు. క్రికెట్ మగవారి ఆట. క్రికెట్ కీర్తి మగవారిది. క్రికెట్ గ్రౌండ్ మగవారిది. కాని ఈ ఆటను మార్చే అమ్మాయి వచ్చింది. ‘మెన్ ఇన్ బ్లూ’ స్థానంలో ‘ఉమెన్ ఇన్ బ్లూ’ అనిపించింది. స్త్రీలు క్రికెట్ ఆడలేరు అనే విమర్శకు తన బ్యాట్‌తో సమాధానం ఇచ్చింది. ‘మిథాలి రాజ్’ మన హైదరాబాదీ కావడం గర్వకారణం. ఆమె బయోపిక్ ‘శభాష్ మిథు’ తాజాగా విడుదలైంది. అంచనాలకు తగ్గట్టు లేకపోయినా స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. సినిమాలో ఒక ప్రెస్మీట్లో మిథాలి రాజ్ పాత్రధారి అయిన తాప్సీ పన్నును అడుగుతాడు జర్నలిస్టు– మీ ఫేవరెట్ పురుష క్రికెటర్ ఎవరు? అని. దానికి తాప్సీ ఎదురు ప్రశ్న వేస్తుంది– ఈ ప్రశ్నను మీరెప్పుడైనా పురుష క్రికెటర్లను అడిగారా... వాళ్ల అభిమాన మహిళా క్రికెటర్ ఎవరు అని? మిథాలి రాజ్ నిజ జీవితంలో జరిగిన ఈ ఘటన సినిమాలో అంతే ప్రభావవంతంగా ఉంటుంది. ఏ ప్రశ్న ఎవరికి వేయాలో కూడా మన సమాజంలో ‘కండీషనింగ్’ ఉంటుంది. మహిళా క్రికెట్ బోర్డును బిసిసిఐలో విలీనం చేశాక (సినిమాలో) టీమ్ యూనిఫామ్స్ పంపమంటే పురుష జట్టు వాడేసిన యూనిఫామ్స్‌ను పంపుతారు. ‘మా పేర్లతో మాకు బ్లూ కలర్ యూనిఫామ్స్ కావాలి’ అని మిథాలి డిమాండ్ చేస్తుంది. దానికి బిసిసిఐ చైర్మన్ ముప్పై ఏళ్లుగా అక్కడ పని చేస్తున్న ప్యూన్‌ను పిలిచి ‘నీకు తెలిసిన మహిళా క్రికెటర్ల పేర్లు చెప్పు?’ అంటాడు. ప్యూన్ చెప్పలేకపోతాడు. ‘మీ గుర్తింపు ఇంత. మీకు ఇవి చాలు’ అంటాడు. మిథాలి ఆ మాసిన యూనిఫామ్‌ను అక్కడే పడేసి వచ్చేస్తుంది. మన దేశంలో మహిళలు చదువులోనే ఎంతో ఆలస్యంగా రావాల్సి వచ్చింది. ఇక ఆటల్లో మరింత ఆలస్యంగా ప్రవేశించారు. అసలు ఆటల్లో ఆడపిల్లలను, యువతులను ప్రోత్సహించాలన్న భావన సమాజానికి, ప్రభుత్వాలకు కలగడానికి కూడా చాలా సమయం పట్టింది. ఒకవేళ వాళ్లు ఆడుతున్నా మన ‘సంప్రదాయ ఆలోచనా విధానం’ వారికి అడుగడుగున ఆంక్షలు విధిస్తుంది. సినిమాలో/ నిజ జీవితంలో మిథాలి రాజ్ కుటుంబం మొదట కొడుకునే క్రికెట్లో చేరుస్తుంది. సినిమాలో కొంత డ్రామా మిక్స్ చేసి కూతరు కూడా క్రికెట్లో ప్రవేశించినట్టు చూపారు. నిజ జీవితంలో మిథాలి బాల్యంలో బద్దకంగా ఉంటోందని ఆమెను కూడా క్రికెట్లో చేర్చాడు తండ్రి. సోదరుడి ఆట కంటే మిథాలి ఆట బాగుందని కోచ్ చెప్పడంతో మిథాలి అసలైన శిక్షణ మొదలవుతుంది. ఆమె ఎలా ఎదిగిందనేది ఈ సినిమా చూపిస్తుంది. 1983లో భారత జట్టు ‘వరల్డ్ కప్’ సాధించాక క్రికెట్ ఆటగాళ్లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. క్రికెట్లో వ్యాపారాన్ని కనిపెట్టిన బిసిసిఐ విపరీతంగా మేచ్‌లు ఆడిస్తూ ఆటగాళ్లను పాపులర్ చేసింది. టెస్ట్‌లు, వన్డేలు, టూర్లు ఇవి క్రికెట్‌ను మరపురానీకుండా చేశాయి. 1987 ‘రిలయన్స్ కప్’ నాటికి ఈ దేశంలో క్రికెట్ ఎదురు లేని క్రీడగా అవతరించింది. మహిళా క్రికెట్ జట్టు 1978 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా వరల్డ్ కప్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నా దాని గురించి ఎవరికీ తెలియదు. ఎవరూ పట్టించుకోలేదు. మిథాలి రాజ్‌కు ముందు భారత మహిళా క్రికెట్లో మంచి మంచి ప్లేయర్లు ఉన్నా మిథాలి రాజ్ తర్వాత పరిస్థితి మారింది. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి ఆడిన తొలి మేచ్లోనే సెంచరీ కొట్టిన అద్భుత ప్రతిభ మిథాలిది. అతి చిన్న వయసులో ఆమె కెప్టెన్ అయ్యింది. 2013, 2017 ప్రపంచ కప్‌లలో ఆమె వల్ల టీమ్ ఫైనల్స్ వరకూ వెళ్లింది. టెస్ట్‌లలో, వన్ డేలలో, టి20లో అన్నీ కలిపి దాదాపు 10 వేల పరుగులు చేసిన మిథాలి ప్రపంచంలో మరో మహిళా క్రికెటర్‌కు లేని అలాగే పురుష క్రికెటర్లకు లేని అనేక రికార్డులు సొంతం చేసుకుంది. అయితే సినిమాలో చూపినట్టు ఆమెకు సౌకర్యవంతమైన జీవన నేపథ్యం ఉంది. కాని జట్టులో ఉన్న మిగిలిన సభ్యులు భిన్న నేపథ్యాలు, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వారు. మిథాలీకి, ఈ సభ్యులకు మధ్య సఖ్యత కుదరడం వారందరిలో ఒక టీమ్ స్పిరిట్ రావడం... ఇదంతా ఈ సినిమాలో చూడొచ్చు. మహిళా జట్టుగా తాము ఎదుర్కొన్న తీవ్ర వివక్ష, ఆశ నిరాశలు, మరోవైపు పురుష జట్టు ఎక్కుతున్న అందలాలు... ఇవన్నీ సినిమాలో ఉన్నాయి. మిథాలి రాజ్ బయోపిక్‌గా వచ్చిన ‘శభాష్ మిథు’ బహుశా హైదరాబాద్ ఆటగాళ్ల మీద వచ్చిన మూడో బయోపిక్. దీనికి ముందు అజారుద్దీన్ మీద ‘అజార్’, సైనా నెహ్వాల్ మీద ‘సైనా’ వచ్చాయి. అవి రెండు నిరాశ పరిచాయి. ‘శభాష్ మిథు’ ఇంకా బాగా ఉండొచ్చు. దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ మిథాలి కేరెక్టర్ గ్రాఫ్‌ను పైకి తీసుకెళ్లడంలో విఫలమయ్యాడు. గొప్ప ఎమోషన్ తీసుకురాలేకపోయాడు. క్లయిమాక్స్‌ను ఆట ఫుటేజ్‌తో నింపడం మరో లోపం. ఈ సినిమా మరింత బడ్జెట్‌తో మరింత పెద్ద దర్శకుడు తీయాలేమో అనిపిస్తుంది. అయినా సరే ఈ కాలపు బాలికలకు, యువ క్రీడాకారిణులకు ఈ సినిమా మంచి బలాన్ని ఇస్తుంది. ధైర్యాన్ని ఇచ్చి ముందుకు పొమ్మంటుంది. క్రీడల్లో సత్తా చాటుకోమంటుంది. తల్లిదండ్రులను, సమాజాన్ని ఆడపిల్లలను క్రీడల్లో ప్రోత్సహించమని చెబుతుంది. ఏ నిరాడంబర ఇంటిలో ఏ మిథాలి రాజ్ ఉందో ఎవరికి తెలుసు. -
సవాల్‌గా తీసుకుని ఈ సినిమా చేశాను: తాప్సీ
‘‘రెగ్యులర్ సినిమాల కన్నా బయోపిక్స్ కాస్త కష్టంగా, డిఫరెంట్‌గా ఉంటాయి. ఆల్రెడీ ఒక వ్యక్తి యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఆ పాత్ర పోషించడం అనేది ఇంకా కష్టం. నా కెరీర్లో చేసిన అత్యంత కష్టమైన పాత్రల్లో ‘శభాష్ మిథు’లో చేసిన పాత్ర ఒకటి’’ అన్నారు తాప్సీ. భారత మాజీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘శభాష్ మిథు’. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో తాప్సీ టైటిల్ రోల్ చేశారు. వయాకామ్ 18 సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో తాప్సీ మాట్లాడుతూ – ‘‘నాకు క్రికెట్ గురించి అంతగా తెలియదు. బ్యాట్ పట్టుకోవడం కూడా రాదు. చిన్నతనంలో ‘రేస్’, ‘బాస్కెట్‌బాల్’ వంటి ఆటలు ఆడాను కానీ క్రికెట్ ఆడలేదు. అందుకే ‘శభాష్ మిథు’ సినిమా ప్రాక్టీస్‌లో చిన్నప్పుడు క్రికెట్ ఎందుకు ఆడలేదా? అని మాత్రం ఫీలయ్యాను. ‘శభాష్ మిథు’ సినిమా క్రికెట్ గురించి మాత్రమే కాదు.. మిథాలీ రాజ్ జీవితం కూడా. అందుకే ఓ సవాల్‌గా తీసుకుని ఈ సినిమా చేశాను. మిథాలి జర్నీ నచ్చి ఓకే చెప్పాను. ట్రెండ్‌ను బ్రేక్ చేయాలనుకునే యాక్టర్‌ని నేను. సమంతతో కలిసి వర్క్ చేయనున్నాను. ఈ ప్రాజెక్ట్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను’’ అని అన్నారు. ‘‘కవర్ డ్రైవ్‌ను తాప్సీ నాలాగే ఆడుతుంది. మహిళా క్రికెట్లో నేను రికార్డులు సాధించానని నా టీమ్ నాతో చెప్పారు. అయితే ఆ రికార్డ్స్ గురించి నాకు అంత పెద్దగా తెలియదు. కెరీర్లో మైల్‌స్టోన్స్ ఉన్నప్పుడు అవి హ్యాపీ మూమెంట్స్ అవుతాయి. కీర్తి, డబ్బు కోసం నేను క్రికెట్‌ను వృత్తిగా ఎంచుకోలేదు. ఇండియాకు ఆడాలనే ఓ తపనతోనే హార్డ్‌వర్క్ చేశాను. నాపై ఏ ఒత్తిడి లేదు. నా ఇష్ట ప్రకారంగానే రిటైర్మెంట్ ప్రకటించాను’’ అన్నారు మిథాలీ రాజ్. -
మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీని ప్రశంసిస్తూ మోదీ లేఖ
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్‌ను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ట్విట్టర్లో ఆ లేఖను పోస్ట్ చేశారు. ‘రెండు దశాబ్దాలకు పైగా మీరు భారత క్రికెట్‌కు సేవలందించారు. మీ ప్రతిభాపాఠవాలతో జాతీయ జట్టును నడిపించిన తీరు అమోఘం. మీ ప్రదర్శన అద్భుతం. ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. మీ కెరీర్ మొత్తం అంకెలతో ఉన్నత శిఖరాలకు చేరింది. మీ సుదీర్ఘ ప్రయాణంలో మీరెన్నో రికార్డులను నెలకొల్పారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక టాప్‌స్కోరర్‌గా నిలిచారు. ఓ అథ్లెట్‌గా ట్రెండ్ సెట్టర్ అయ్యారు’ అని ప్రధాని అందులో పేర్కొన్నారు. -
'మన్ కీ బాత్'లో మిథాలీ రాజ్ గురించి ప్రస్తావించిన మోదీ
తాజాగా జరిగిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ సారధి మిథాలీ రాజ్ గురించి ప్రస్తావించారు. దేశంలోని యువ అథ్లెట్లకు మిథాలీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. భారత మహిళల క్రికెట్‌కు మిథాలీ అందించిన సేవలు చిరస్మరణీమని అన్నారు. మిథాలీ అసాధారణ క్రికెటర్ అని, క్రీడలకు సంబంధించి దేశంలోని మహిళలకు ఆమె ఆదర్శప్రాయురాలని ప్రశంసించారు. మహిళల క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడంలో మిథాలీ కీలకపాత్ర పోషించిందని ఆకాశానికెత్తారు. ఇటీవలే క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, మిథాలీ రాజ్ జూన్ 8న క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 1999 జూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మిథాలీ 23 ఏళ్ల కెరీర్లో ఎన్నో రికార్డులను సాధించింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు (7805), అత్యధిక మ్యాచ్‌లు (232), టెస్ట్‌ల్లో అతి చిన్న వయస్సులో డబుల్ సెంచరీ.. ఇలా మిథాలీ ఖాతాలో పలు ప్రపంచ రికార్డులు ఉన్నాయి. చదవండి: 30 సార్లు లైంగిక వేధింపులకు గురయ్యాను.. మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సంచలన ఆరోపణలు -
చరిత్ర సృష్టించేందుకు మరో 45 పరుగుల దూరంలో ఉన్న టీమిండియా క్రికెటర్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టీ20ల్లో ఓ భారీ రికార్డును తన పేరిట లిఖించుకునేందుకు అత్యంత సమీపంలో ఉంది. శ్రీలంకతో రేపటి నుంచి (జూన్ 23) ప్రారంభంకాబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో హర్మన్ మరో 45 పరుగులు సాధిస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనుంది. 121 టీ20ల్లో 103 స్ట్రయిక్ రేట్‌తో 2319 పరుగులు చేసిన హర్మన్ శ్రీలంకతో సిరీస్‌లో మరో 45 పరుగులు చేస్తే టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక టీ20 పరుగుల రికార్డును (2364) అధిగమిస్తుంది. మిథాలీ రాజ్ 89 మ్యాచ్‌ల్లో 17 అర్ధ సెంచరీల సాయంతో 37.52 సగటున 2364 పరుగులు సాధించగా.. హర్మన 121 టీ20ల్లో సెంచరీ, 6 అర్ధ సెంచరీల సాయంతో 26.35 సగటున పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే, భారత మహిళా జట్టు శ్రీలంక పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే. జూన్ 23, 25, 27 తేదీల్లో డంబుల్లా వేదికగా మొత్తం టీ20లు జరుగనుండగా.. జులై 1, 4, 7 తేదీల్లో పల్లెకెలె వేదికగా వన్డే సిరీస్ జరుగనుంది. చదవండి: మిథాలీరాజ్ రిటైర్మెంట్.. కొత్త కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ -
‘శభాష్’ అనిపించుకోగలిగాను!
2005... మెదక్ పట్టణంలో ఒక చిన్నస్థాయి క్రికెట్ టోర్నీ... అమ్మాయిలు క్రికెట్ ఆడటమే అరుదు అనుకుంటే కొందరు స్థానికుల చొరవతో టోర్నమెంట్ కూడా జరుగుతోంది. ఒక మ్యాచ్‌లో సరిగా చూస్తే మిథాలీ రాజ్ బ్యాటింగ్ చేస్తోంది. ఆమె భారత క్రికెట్ జట్టు తరఫున ఆడటం మొదలు పెట్టి అప్పటికే ఆరేళ్లు దాటింది... కానీ అక్కడ బరిలోకి దిగడానికి ఆమె సంకోచించలేదు... ఇలాంటి అంకితభావమే ఆమెను గొప్పగా తీర్చిదిద్దింది. ఆటపై ఉన్న అభిమానమే ఏకంగా 23 ఏళ్లు దేశం తరఫున ఆడేలా చేసింది. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన పలు విశేషాలు... బయోపిక్... బయోగ్రఫీ... రిటైర్మెంట్ తర్వాతి కెరీర్‌పై కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. నాకు తెలిసిన విద్య క్రికెట్ మాత్రమే కాబట్టి ఆటకు సంబంధించిందే అవుతుంది. ప్రస్తుతం నా బయోపిక్ ‘శభాష్ మిథూ’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాను. నా బాల్యం నుంచి పెద్ద స్థాయికి ఎదిగే వరకు వేర్వేరు అంశాలతో సినిమా ఉంటుంది. అయితే ఎక్కడితో సినిమాను ముగిస్తున్నామో ఇప్పుడే చెప్పను. తాప్సీ చక్కటి నటి కావడంతో పాటు మహిళా ప్రధాన చిత్రాలు కూడా కొన్ని చేసింది కాబట్టి బయోపిక్ కోసం ఆమెను సరైన వ్యక్తిగా అనుకున్నాం. దీంతో పాటు నా ఆటోబయోగ్రఫీ పని కూడా నడుస్తోంది. త్వరలోనే పుస్తకం విడుదలవుతుంది. లోటుగా భావించడం లేదు ప్రపంచకప్ గెలవాలనేది నా కల. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను కూడా. అయితే చివరకు అది లేకుండానే కెరీర్ ముగిసింది. కానీ అది లేనంత మాత్రాన నా ఇన్నేళ్ల ప్రదర్శన విలువ తగ్గదు. భారత పురుషుల క్రికెట్లోనూ చూస్తే ప్రపంచకప్ గెలిచిన టీమ్‌లో భాగం కాకపోయినా, క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లుగా నిలిచినవారు ఎంతో మంది ఉన్నారు. రెండు ప్రపంచకప్‌లలో జట్టును ఫైనల్‌కు చేర్చడం కూడా చెప్పుకోదగ్గ ఘనతే కాబట్టి విచారం ఏమీ లేదు. సుదీర్ఘ కెరీర్‌కు అదే కారణం చాలా ఎక్కువగా కష్టపడే తత్వమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. నిలకడగా, మార్పు లేకుండా ఇన్నేళ్ల పాటు ఒకే తరహా ‘టైమ్ టేబుల్’ను అమలు చేశాను. అత్యుత్తమంగా ఎదిగేందుకు సన్నద్ధత, ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం, ఆటకు మెరుగులు దిద్దుకోవడం, అదే ప్రాక్టీస్, అదే డ్రిల్స్‌ను ఏకాగ్రత చెదరకుండా 23 ఏళ్ల పాటు కొనసాగించగలిగాను. రోజూ ఇదేనా అనే భావన లేకుండా మైదానంలోకి వచ్చేదాన్ని. నా సాధన నాకు ఎప్పుడూ బోర్ కొట్టలేదు. అందుకే ఇలాంటి కెరీర్ సాధ్యమైంది. సమాజంలో కొందరు నేను క్రికెట్ ఆడటంపై కామెంట్లు చేసినా... మైదానంలో మాత్రం ఎప్పుడూ, ఎలాంటి వివక్ష ఎదుర్కోలేదు. అలా అనుకోలేదు ఎన్నో గంటల ప్రాక్టీస్ తర్వాత కూడా ఆడింది చాలు, కొంత విరామం తీసుకుందాం, కొంచెం విశ్రాంతిగా కూర్చుందాం అనే ఆలోచన రాలేదు. చాలా ఎక్కువగా కష్టపడుతున్నాను కదా, ఇంత అవసరమా అనుకోలేదు. సరిగ్గా చెప్పాలంటే నాపై నేను ఎప్పుడూ జాలి పడలేదు. 23 ఏళ్ల కెరీర్లో నేను గాయాలపాలైంది కూడా చాలా తక్కువ. అప్పుడప్పుడు గాయపడినా సిరీస్ మొత్తానికో, ఒక టోర్నీకో ఎప్పుడూ దూరం కాలేదు. రక్తం కారినప్పుడు కూడా బయటకు వెళ్లాలనే భావన రాలేదు. నొప్పి, బాధను భరిస్తూనే ఆడేందుకు ప్రయత్నించా. ఆట ముగిసిన తర్వాతే కోలుకోవడంపై దృష్టి పెట్టా. ఇన్నేళ్ళలో ఇది కూడా నన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఒక్క 2009లో మాత్రమే మోకాలి గాయంతో చాలా బాధపడ్డా. రిటైర్మెంట్ ఇద్దామని అనుకున్న క్షణమది. అయితే అదృష్టవశాత్తూ కొన్నాళ్ల క్రితమే అధికారికంగా బీసీసీఐలోకి రావడంతో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సౌకర్యాలను తొలిసారి ఉపయోగించుకునే అవకాశం కలిగి కోలుకోగలిగాను. అన్ని చోట్లా ఆడాను కెరీర్ ఆరంభంలో బీసీసీఐ సహకారం లేని సమయంలో ఆర్థికపరంగా మేం ఎదుర్కొన్న సమస్యలు, వాటిని పట్టించుకోకుండా ఆడటం గురించి అందరికీ తెలుసు. అయితే మరో అంశం గురించి నేను చెప్పాలి. క్రికెట్‌పై ఆ సమయంలో నాకున్న అపరిమిత ప్రేమ, పిచ్చి ఎక్కడికైనా వెళ్లేలా చేసింది. భారత్ తరఫున అరంగేట్రం చేసి ఆరేళ్లు దాటిన తర్వాత కూడా నేను ‘ఇన్విటేషన్ టోర్నమెంట్’లకు వెళ్లడం మానలేదు. చిన్న పట్టణాల్లో, హైస్కూల్ మైదానాల్లో జరిగిన మ్యాచ్‌లలో కూడా పాల్గొన్నాను. టర్ఫ్ వికెట్, మ్యాట్ వికెట్ ఏదైనా సరే... ఆడే అవకాశం వస్తే చాలని అనిపించేది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించినా, మంచి జ్ఞాపకాలవి. టి20లు కలిసి రాలేదు నేను అంతర్జాతీయ క్రికెట్ మొదలు పెట్టినప్పుడు టి20లు లేవు. మహిళల క్రికెట్లోనూ టెస్టులు ఉండి ఉంటే దాంతో పాటు వన్డేలను ఎంచుకొని అసలు టి20 ఆడకపోయేదాన్నేమో. కానీ టెస్టులు లేకపోవడంతో రెండో ఫార్మాట్ అవసరం ఏర్పడింది. నేను మూడో టి20 ఆడే సమయానికే నా అంతర్జాతీయ కెరీర్ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఇంత ఆలస్యంగా మొదలు పెట్టడంతో నేను సర్దుకోవడానికే టైమ్ పట్టింది. ఓపెనర్‌గా వచ్చే సాహసం చేశాక పరిస్థితి కొంత మెరుగుపడింది. అయితే ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాలేదు. కోచ్ రమేశ్ పొవార్‌తో వివాదంతో నా కెరీర్ ముగియలేదు. ఆ తర్వాతా రెండు సిరీస్‌లు ఆడి ఇక చాలనుకున్నాను. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాను. ప్రస్తుత క్రికెటర్లతో పోల్చరాదు వాణిజ్యపరంగా నాకు ఆశించినంత గుర్తింపు రాలేదనేది వాస్తవం. వాస్తవికంగా చూస్తే సగంకంటే ఎక్కువ కెరీర్ నన్ను ఎక్కువ మంది కనీసం గుర్తు కూడా పట్టని విధంగానే సాగింది. అలాంటప్పుడు కార్పొరేట్లు ఎలా ముందుకొస్తాయి. సరిగా గమనిస్తే 2017 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాతి నుంచి భారత మహిళల ప్రతీ మ్యాచ్ టీవీలో లైవ్‌గా వచ్చింది. అంతకుముందు అసలు టీవీల్లో కూడా కనిపిస్తే కదా! స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌లతో పోలిస్తే నా ప్రయాణం పూర్తిగా భిన్నం. వీరితో పోలిస్తే ఇప్పుడే వచ్చిన షఫాలీ, రిచాలు కూడా భిన్నం. కాబట్టి పోలిక అనవసరం. భారత మహిళల క్రికెట్ ఎదుగుదలలో నేనూ కీలక భాగం కావడమే అన్నింటికంటే ఎక్కువ సంతృప్తినిచ్చే అంశం. -
ఎవరు మర్చిపోలేని ఆట ఆడి చూపిస్తా.. ఆసక్తిగా ట్రైలర్
Taapsee Pannu Starrer Shabaash Mithu Trailer Released: ప్రత్యేకమైన శైలీలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో ఉంది తాప్సీ పన్ను. ఇప్పటివరకు తప్పడ్, హసీనా దిల్రూబా, రష్మీ రాకెట్, లూప్ లపేటా చిత్రాలతో అలరించింది ఈ పంజాబీ భామ. తాజగా తాప్సీ నటించిన చిత్రం 'శభాష్ మిథూ'. శ్రీజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌గా తెరకెక్కింది. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శభాష్ మిథూ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. రెండు నిమిషాల 44 సెకన్లపాటు సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. మిథాలీ చిన్నతనంలో కన్న కలను చెబుతూ ప్రారంభమైన ట్రైలర్ ఎమోషనల్‌గా ఆకట్టుకునేలా ఉంది. మిథాలీ ఆటను మొదలు పెట్టడం, ప్రాక్టీస్, కెప్టెన్‌గా మారడం, క్రికెట్లో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత, వారికి గుర్తింపు తీసుకువచ్చేందుకు పడిన కష్టాలు తదితర అంశాలను సినిమాలో చక్కగా చూపించనున్నట్లు తెలుస్తోంది. తాప్సీ నటన అద్భుతంగా ఉంది. మన గుర్తింపును ఎవరూ మరిచిపోలేనంతలా ఆట ఆడి చూపిస్తా అని తాప్సీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. వయకామ్ 18 స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్.. వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! -
Mithali Raj: అందని ద్రాక్ష.. అవమానం భరించి.. ఫేర్వెల్ మ్యాచ్?!
సాక్షి క్రీడా విభాగం : భారత క్రికెట్ అంటేనే పురుషుల క్రికెట్... స్టార్లు అంటేనే సన్నీ, కపిల్, వెంగీ, సచిన్, ధోని, కోహ్లి.... భారత్‌లో మతమైన క్రికెట్‌కు మెజార్టీ ప్రజల అభిమతమిదే! ఇలాంటి దేశంలో అమ్మాయిలకూ ఓ అధ్యాయం ఉందని మిథాలీ రాజ్ వచ్చాకే తెలిసింది. దీన్ని సువర్ణాధ్యాయంగా మలిచిన ఘనత కూడా ముమ్మాటికి ఆమె ఆటదే. 23 ఏళ్ల క్రితం ప్రభలేని మహిళా క్రికెట్‌కు కొత్త శోభ తెచ్చింది. ఆమె పరుగులు పెడుతున్నప్పుడు అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డులో మన మహిళా క్రికెట్ లేదు. (ఆలస్యంగా బీసీసీఐ గొడుగు కిందకు వచ్చింది). ఆమె సెంచరీలు కొడుతుంటే... రూ. లక్షల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రైజ్‌మనీ రాలేదు. సిరీస్‌లను గెలిపిస్తే ఖరీదైన కారు (ప్లేయర్ ఆఫ్ ది సిరీస్) ఇవ్వలేని అమ్మాయిల క్రికెట్ గతి అది. ఇవేవీ తనకు దక్కకపోయినా... తను నమ్ముకున్న క్రికెట్‌కు 23 ఏళ్ల పాటు సేవలందించిన ధీరవనిత మిథాలీ. గత కొన్నేళ్లుగా భారత మహిళల క్రికెట్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మార్పు వెనుక మిథాలీ పాత్ర కూడా ఎంతో ఉంది. 23 ఏళ్ల క్రితం ఆడిన తొలి మ్యాచ్‌లోనే అజేయ శతకంతో తారలా దూసుకొచ్చింది మిథాలీ రాజ్. ఈ 23 ఏళ్లలో మహిళల క్రికెట్లో తరాలు మారాయి. ఫార్మాట్లు మారాయి. ప్లేయర్లు మారారు. కానీ మిథాలీ ఆటలో మాత్రం మెరుపు తగ్గలేదు. అద్భుతమైన బ్యాటింగ్‌తో, తనకే సాధ్యమైన రీతిలో కళాత్మకత, దూకుడు కలగలిపి భారత్ తరఫునే కాకుండా మహిళల క్రికెట్లో ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్‌గా పేరు సంపాదించింది. రోజువారీ ఖర్చులకు సరిపడా డబ్బులు లభించని సమయంలో తనకిష్టమైన భరత నాట్యాన్ని వదులుకొని క్రికెట్ పట్ల ప్రేమతో దానిని కెరీర్‌గా ఎంచుకున్న మిథాలీ టీవీల్లో వాణిజ్య ప్రకటనల్లో కనిపించే స్థాయికి ఎదిగింది. ఆమె ఆటకు సంబంధించి అంకెలు, గణాంకాలను పరిశీలిస్తే మిథాలీని అభిమానులు ఆప్యాయంగా ‘లేడీ సచిన్’ అని పిలుస్తారు. Mithali Raj reflects on her glorious cricketing journey and the struggles behind it 📽️ pic.twitter.com/NwW3q5bukE — ICC (@ICC) June 8, 2022 అంచెలంచెలుగా... హైదరాబాద్ నగరంలోని సెయింట్ జాన్స్ అకాడమీలో క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న మిథాలీ ఆ తర్వాత వేర్వేరు వయో విభాగాల్లో రాణిస్తూ తన ప్రత్యేకత చాటుకుంది. మహిళల క్రికెట్‌కు ఏమాత్రం గుర్తింపులేని సమయంలో దానిని కెరీర్‌గా ఎంచుకోవడం పెద్ద సాహసమే. అయితే మిథాలీ తల్లిదండ్రులు దొరైరాజ్, లీలా రాజ్ తమ కూతురిని ఎల్లవేళలా ప్రోత్స హించారు. 1999లో వన్డే కెరీర్‌ను శతకంతో మొదలుపెట్టిన మిథాలీ... 2002లో టెస్టుల్లో అరంగేట్రం చేసింది. తొలి రెండు టెస్టుల్లో నిరాశపరిచినా... మూడో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మిథాలీకి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. కెప్టెన్‌గా అదుర్స్... 2003 వచ్చేసరికి భారత జట్టులో మిథాలీ స్థానం సుస్థిరమైపోయింది. 2005లో ఆమెకు తొలిసారి నాయకత్వ బాధ్యతలు లభించాయి. మిథాలీ కెప్టెన్సీలో భారత జట్టు 2005 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత కూడా మిథాలీ నేతృత్వంలో భారత జట్టు ఎన్నో మధుర విజయాలు సాధించింది. ఇందులో ద్వైపాక్షిక సిరీస్‌లు, ఆసియా కప్‌లు, ముక్కోణపు టోర్నీలు, నాలుగు దేశాల టోర్నీలు ఉన్నాయి. అందని ద్రాక్ష... వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును (పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి) రెండుసార్లు ఫైనల్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పిన మిథాలీ రాజ్ ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. ఆమె కెరీర్లో ఇది లోటుగా ఉండిపోనుంది. 2005 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్... 2017 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది. అవమానం భరించి... విండీస్ ఆతిథ్యమిచ్చిన 2018 టి20 ప్రపంచకప్‌లో భారత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అయితే ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో మిథాలీ రాజ్‌ను తుది జట్టులో నుంచి తప్పించడం వివాదాస్పదమైంది. టోర్నీ సమయంలో అప్పటి చీఫ్ కోచ్ రమేశ్ పొవార్‌తోపాటు జట్టులోని ఇతర సీనియర్ సభ్యులు తను జట్టులో సభ్యురాలే కాదన్నట్లు ప్రవర్తించారని అప్పటి బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ సాబా కరీమ్‌లకు మిథాలీ లేఖ రాయడం పెను దుమారం రేపింది. ఈ వివాదం తర్వాత 2019లో టి20 నుంచి మిథాలీ వీడ్కోలు తీసుకుంది. వన్డే, టెస్టు ఫార్మాట్లపై మరింతగా దృష్టి సారించింది. కరోనా కారణంగా గత రెండేళ్లు పెద్దగా సిరీస్‌లు లేకపోయినా మిథాలీ ఆటలో నిలకడ కనబరుస్తూ వచ్చింది. ఈ ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్ సారథ్యంలో భారత జట్టు టైటిల్ ఫేవరెట్‌గా కనిపించినా... సమష్టి ప్రదర్శన లేకపోవడంతో భారత్ రౌండ్ రాబిన్ లీగ్‌లో ఐదో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇదే చివరి ప్రపంచకప్ ఈ టోర్నీకి ముందే తనకు ఇదే చివరి ప్రపంచకప్ అని మిథాలీ ప్రకటించింది. దాంతో టోర్నీ ముగిశాక మిథాలీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతుందని అందరూ భావించారు. కానీ మిథాలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ నెలలో శ్రీలంకలో పర్యటనకు భారత వన్డే, టి20 జట్లను బుధవారం ప్రకటించడానికి కొన్ని గంటల ముందు మిథాలీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది. భారత మహిళల క్రికెట్‌కు మిథాలీ రాజ్ సేవలకు గుర్తింపుగా ఆమె కోసం ప్రత్యేకంగా ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ భావించింది. అయితే దీనిపై మిథాలీ ఆసక్తి చూపలేదని సమాచారం. చదవండి: Ind Vs SA: కుర్రాళ్లకు భలే చాన్సులే.. ఇక్కడ మెరిస్తే డైరెక్ట్‌గా ఆస్ట్రేలియాకు! Mithali Raj: మిథాలీరాజ్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం? View this post on Instagram A post shared by ICC (@icc) -
అలా ఈ ప్రయాణం అజేయ సెంచరీతో మొదలై హాఫ్ సెంచరీతో ముగిసింది!
Mithali Raj Retirement: రెండు దశాబ్దాలకుపైగా అలసటన్నది లేకుండా ఆడుతూ... లెక్కలేనన్ని కీర్తి శిఖరాలు అధిరోహిస్తూ... ‘ఆమె’ ఆటను అందలాన్ని ఎక్కిస్తూ... భావితరాలకు బాటలు వేస్తూ... ఇక బ్యాట్‌తో సాధించాల్సిందీ ఏమీ లేదని భావిస్తూ... భారత మహిళల క్రికెట్ మణిహారం మిథాలీ రాజ్ ఆటకు అల్విదా చెప్పింది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన మిథాలీ అత్యున్నత దశలో ఆట నుంచి వీడ్కోలు తీసుకుంది. న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించింది. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ఈ మేరకు ఆమె ట్విటర్లో లేఖ విడుదల చేసింది. ఇన్నేళ్లు భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం గర్వంగా ఉందని పేర్కొన్న మిథాలీ... రెండు దశాబ్దాలకుపైగా సాగిన తన క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని... ప్రస్తుతం భారత మహిళల క్రికెట్‌ను ప్రతిభావంతులైన క్రీడాకారిణుల చేతుల్లో పెడుతున్నానని పేర్కొంది. ఇన్నేళ్లపాటు అనుక్షణం తన వెన్నంటే ఉండి ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని 39 ఏళ్ల ఈ హైదరాబాద్ క్రికెటర్ తెలిపింది. 1999 జూన్ 26న ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అజేయ సెంచరీ (114 నాటౌట్)తో అద్భుత అరంగేట్రం చేసిన మిథాలీ... 2022 మార్చి 27న దక్షిణాఫ్రికాతో చివరి వన్డే (68 పరుగులు) ఆడింది. 23 ఏళ్ల ఆమె అంతర్జాతీయ కెరీర్ సెంచరీతో మొదలై అర్ధ సెంచరీతో ముగియడం విశేషం. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్న లక్ష్యంతో నా ప్రస్థానం మొదలైంది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ప్రతి ఒక సంఘటనతో కొత్త విషయాలు నేర్చుకున్నాను. గత 23 ఏళ్లలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. అన్ని ప్రయాణాల మాదిరిగానే నా క్రికెట్ కెరీర్‌కు ముగింపు వచ్చింది. అందుకే అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి భారత్‌ను విజేతగా నిలబెట్టాలని కృషి చేశా. ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ భవిష్యత్ ఉజ్వలంగా ఉందని... యువ క్రికెటర్ల చేతుల్లో సురక్షితంగా ఉందని భావిస్తూ నా కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నా. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా ఎల్లవేళలా నాకు మద్దతు ఇచ్చిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి, బోర్డు కార్యదర్శి జై షాకు ధన్యవాదాలు చెబుతున్నా. ఏళ్లపాటు భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండటం గర్వకారణంగా ఉంది. నాయకత్వ బాధ్యతలు నన్ను వ్యక్తిగానే కాకుండా భారత క్రికెట్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు దోహదపడ్డాయి. ప్లేయర్‌గా నా ప్రయాణం ముగిసినా... భవిష్యత్‌లో మహిళల క్రికెట్ ఉన్నతికి నా వంతుగా కృషి చేస్తా. ఇన్నాళ్లు నా వెన్నంటే నిలిచి ప్రేమ, ఆప్యాయతలు పంచిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. –మిథాలీ రాజ్ మిథాలీ కెరీర్ గ్రాఫ్... ఆడిన వన్డేలు 232 ►చేసిన పరుగులు: 7,805, నాటౌట్: 57 ►అత్యధిక స్కోరు: 125 నాటౌట్ ►సగటు: 50.68 ►సెంచరీలు: 7, అర్ధ సెంచరీలు: 64 ►క్యాచ్‌లు: 64, తీసిన వికెట్లు: 8 ఆడిన టెస్టులు 12 ►చేసిన పరుగులు: 699, నాటౌట్: 3 ►అత్యధిక స్కోరు: 214, సగటు: 43.68 ►సెంచరీలు: 1, అర్ధ సెంచరీలు: 4, క్యాచ్‌లు: 12 ఆడిన టి20లు 89 ►చేసిన పరుగులు: 2,364 ►అత్యధిక స్కోరు: 97 నాటౌట్ ►సగటు: 37.52 ►సెంచరీలు: 0 ►అర్ధ సెంచరీలు: 17, క్యాచ్‌లు: 19 చదవండి: Mithali Raj: మిథాలీరాజ్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం? You will continue to inspire millions, @M_Raj03! 👏 👏 We will miss your presence in the dressing room.#ThankYouMithali pic.twitter.com/qDBRYEDHAM — BCCI Women (@BCCIWomen) June 8, 2022 -
మిథాలీరాజ్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం?
భారత సీనియర్ మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించింది. 23 ఏళ్ల కెరీర్లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్న మిథాలీరాజ్ 39 ఏళ్ల వయసుకు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. తాజాగా ఆమె ఆటకు రిటైర్మెంట్ ఇవ్వడంతో.. మిథాలీ పెళ్లి ఎందుకు చేసుకోలేదన్న ప్రస్తావన మరోసారి తెరమీదకు వచ్చింది. వాస్తవానికి మిథాలీ 22 ఏళ్లు వయసులోనే ఆమె కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. క్రికెట్లో బిజీగా ఉన్న మిథాలీ ఎన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేసుకుంటూ వెళ్లింది. 27-30 ఏళ్లు వచ్చిన తర్వాత మిథాలీరాజ్ పెళ్లి గురించి ఆలోచించింది. అప్పుడు వచ్చిన సంబంధాల్లో చాలా మంది క్రికెట్‌ని వదిలేయాలని చెప్పడంతో.. అలాంటి వారు తనకు అవసరం లేదని ఇంట్లోవాళ్లతో చెప్పేసింది. అలా మిథాలీ క్రికెట్ కెరీర్ కోసం తన పర్సనల్ లైఫ్‌ని.. పెళ్లిని త్యాగం చేసింది. అయితే పెళ్లి చేసుకోనందుకు తానేం బాధపడడం లేదని.. సింగిల్ లైఫ్ చాలా సంతోషంగా ఉందని ఒక సందర్భంలో మిథాలీ చెప్పుకొచ్చింది. 'కొన్నాళ్ల క్రిందట నాకు పెళ్లి ఆలోచన వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. ఎందుకంటే పెళ్లైన వాళ్లను చూసిన తర్వాత సింగిల్‌గా ఉండడమే చాలా బెటర్ అనిపిస్తోంది.' అంటూ పేర్కొన్న మిథాలీ ఇప్పటికి సింగిల్‌గానే బతికేస్తుంది. మరి రిటైర్మెంట్ తర్వాత ఒక తోడు కోసం పెళ్లి గురించి ఆలోచిస్తుందేమో చూడాలి. ఇక డిసెంబర్ 3, 1982న రాజస్థాన్‌లో జోద్‌పూర్‌లో జన్మించిన మిథాలీ రాజ్, హైదరాబాద్‌లో చదువుకుంది. ఆంధ్రా టీమ్ తరుపున దేశవాళీ క్రికెట్ టోర్నీలు ఆడిన మిథాలీ రాజ్... ఎయిర్ ఇండియా, రైల్వేస్ టీమ్స్ తరుపున కూడా ప్రాతినిథ్యం వహించింది.అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 మ్యాచులు ఆడిన మిథాలీ రాజ్... టెస్టుల్లో 699, వన్డేల్లో 7805, టీ20ల్లో 2364 పరుగులు చేసింది. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లు కలిపి 10వేల పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా మిథాలీరాజ్ చరిత్ర సృష్టించింది. చదవండి: Mitali Raj Intresting Facts: మిథాలీరాజ్‌లో మనకు తెలియని కోణాలు.. శెభాష్ మిథూ: 23 ఏళ్ల కెరీర్.. అరుదైన రికార్డులు! హ్యాట్సాఫ్! -
అంతర్జాతీయ క్రికెట్‌కు మిథాలీరాజ్ గుడ్ బై (ఫొటోలు)
-
మిథాలీరాజ్ రిటైర్మెంట్.. కొత్త కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్
భారత సీనియర్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై పలు సందేహాలు వచ్చాయి. హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు స్మృతి మంధాన పేర్లు ఎక్కువగా వినిపించాయి. కాగా కెప్టెన్‌గా ఇంతకముందు అనుభవం ఉన్న హర్మన్‌ప్రీత్ వైపే బీసీసీఐ మొగ్గు చూపింది. శ్రీలంకతో జరగనున్న వన్డే, టి20 సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్‌ను టీమిండియా మహిళా కెప్టెన్‌గా నిర్ణయింది. దీంతోపాటు లంకతో జరగనున్న వన్డే, టి20 సిరీస్‌లకు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. జూన్ 23 నుంచి మొదలయ్యే శ్రీలంక పర్యటనలో భారత మహిళా జట్టు.. మూడు టి20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇక నాలుగేళ్లుగా టి20 కెప్టెన్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్.. మిథాలీ రాజ్ గైర్హాజరీలో కొన్ని మ్యాచ్‌లకు వన్డే కెప్టెన్‌గా వ్యవహరించింది. తాజాగా మిథాలీ రిటైర్మెంట్తో వన్డే కెప్టెన్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనుంది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కి భారత మహిళా జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యషికా భాటియా, మేఘనా, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, తానియా భాటియా, హర్లీన్ డియోల్ టి20 సిరీస్‌కి భారత మహిళా జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యషికా భాటియా, మేఘనా, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్ చదవండి: Mitali Raj Intresting Facts: మిథాలీరాజ్‌లో మనకు తెలియని కోణాలు.. ప్రొటీస్‌తో టి20 సిరీస్‌కు కేఎల్ రాహుల్ దూరం.. కెప్టెన్‌గా రిషబ్ పంత్ -
మిథాలీరాజ్‌లో మనకు తెలియని కోణాలు..
మిథాలీరాజ్.. టీమిండియా మహిళా క్రికెట్లో ఆమె స్థానం సుస్థిరం. మెన్స్ క్రికెట్లో సచిన్ ఎంత పాపులర్ అయ్యాడో.. టీమిండియా మహిళా క్రికెట్లో మిథాలీరాజ్ అంతే స్థానం సంపాదించింది. మహిళా క్రికెట్లో టీమిండియా తరపున ఎన్నో రికార్డులు ఆమె సొంతం. 1999లో 16 ఏళ్ల వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన మిథాలీ బుధవారం తన 23 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ఆమె సాధించిన రికార్డుల గురించి అందరికి తెలుసు.. కానీ ఆమెలోని మరో యాంగిల్ గురించి చాలా మంది తెలియదు. అంతేకాదు కెరీర్ అనగానే ప్రయాణం ఎప్పుడు సాఫీగా సాగదు. ఎత్తుపల్లాలు.. వివాదాలు సహజమే. అయితే మిథాలీ విషయంలో చెప్పుకునే వివాదాలు పెద్దగా లేనప్పటికి ఒకటి రెండు మాత్రం తెరమీదకు వస్తాయి. మరి మిథాలీ రాజ్‌లో మనకు తెలియని కోణాలు, వివాదాలు ఏంటనేది ఒకసారి పరిశీలిద్దాం. క్రికెటర్‌గా మాత్రమే కాదు.. గ్లామర్ షోతోనూ రాజస్థాన్‌లో పుట్టి.. హైదరాబాద్‌లో పెరిగిన మిథాలీ రాజ్ క్రికెట్లో ఎంతో హుందాగా కనిపిస్తోంది. బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ హుందాతనం మరింతగా ఉంటుంది. అలా ఉంది కాబట్టే మహిళా క్రికెట్లో అనేక రికార్డులు ఆమె సొంతమయ్యాయి. మరి ఇంత హుందాగా కనిపించే మిథాలీ రాజ్‌లో చాలా మందికి తెలియని మరో యాంగిల్ గ్లామర్ షో. క్రికెట్ మ్యాచ్‌లు లేనప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ మ్యాగజైన్లకు ఫోజులు ఇవ్వడం మిథాలీ రాజ్‌కు అలవాటు. గ్లామర్ ఒలికించడానికి ఏ మాత్రం మొహమాటపడని మిథాలీ రాజ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలాసార్లు వైరల్‌గా మారాయి. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. పుస్తక ప్రియురాలు.. మన మిథాలీ మిథాలీ రాజ్‌కు క్రికెట్‌తో పాటు మరో మంచి అలవాటు ఉంది. అదే పుస్తక పఠనం. ఖాళీ సమయం దొరికితే చాలు పుస్తకాలను తిరగేస్తుంది. మ్యాచ్‌లు జరిగే సమయాల్లోనూ మిథాలీ తన బ్యాటింగ్ వచ్చేవరకు పుస్తకాలు చదువుతుంటుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. విదేశాల్లో మ్యాచ్‌లు ఆడాల్సి వస్తే మిథాలీ రాజ్ తన సూట్‌కేసులో పుస్తకాలకు ప్రత్యేక చోటు కల్పిస్తుందట. ఇంగ్లండ్ వేదికగా 2017లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ సందర్బంగా మిథాలీ పుస్తకాలు చదువుతున్న ఫోటోలు తొలిసారి ప్రత్యక్షమయ్యాయి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి స్వేచ్చగా బ్యాటింగ్ చేయడానికి వీలుగా ఉంటుందని మిథాలీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. మళ్లీ 2022 మహిళా వన్డే ప్రపంచకప్‌లోనూ అదే ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్బంగా మిథాలీ తన బ్యాటింగ్ వచ్చేవరకు డగౌట్లో కూర్చొని పుస్తక పఠనం చేయడం ఆసక్తిని కలిగించింది. మిథాలీని చుట్టుముట్టిన వివాదాలు.. 2018 టీ20 వరల్డ్‌కప్ సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ రమేశ్ పవార్ భారత మహిళా జట్టుకి కోచ్‌గా వ్యవహారించాడు.ఆ సమయంలో భారత వన్డే కెప్టెన్ మిథాలీరాజ్‌కి భారత టీ20 జట్టులో చోటు కల్పించకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. తనను కావాలనే టీ20 జట్టుకి దూరం చేస్తున్నారని హెడ్ కోచ్ రమేశ్ పవార్, సీఓఏ సభ్యురాలు డయానా ఎడ్లుల్జీలపై మిథాలీ ఆరోపణలు చేసింది. బ్యాటింగ్ ఆర్డర్లో తనని కింద ఆడాల్సిందిగా వాళ్లు ఒత్తిడి పెడుతున్నారని మిథాలీ అప్పట్లో ఆరోపణలు చేసింది. అయితే రమేశ్ పవార్.. మిథాలీపై రివర్స్ ఆరోపణలు చేశాడు.'' ఒక సీనియర్ ప్లేయర్‌గా జట్టు పరిస్థితిని అర్థం చేసుకుని ఆడాల్సిన మిథాలీరాజ్, బ్యాటింగ్ ఆర్డర్లో కిందకి పంపితే, రిటైర్మెంట్ ప్రకటిస్తానని బెదిరించిందని’ పేర్కొన్నాడు. ఇక ఐర్లాండ్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మిథాలీజ్ 50 పరుగులు చేసి ఆదుకుంది. అయితే మిథాలీ ఇన్నింగ్స్‌లో 25 డాట్ బాల్స్ ఉండడంతో ఆమె కేవలం తన వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతోందంటూ రమేశ్ పవార్ విమర్శలు చేయడం ఆసక్తి రేపింది.ఈ సంఘటన తర్వాత రమేశ్ పవార్ కాంట్రాక్ట్ గడువు ముగిసి ఆ పదవి నుంచి తప్పుకోవడంతో డబ్ల్యూవీ రామన్, భారత మహిళా జట్టుకి కోచ్‌గా వ్యవహారించాడు. మళ్లీ మూడేళ్ల తర్వాత రమేశ్ పవార్‌ను తిరిగి మహిళా టీమ్ హెడ్ కోచ్‌గా ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. రమేశ్ పవార్‌తో వివాదం తర్వాత టి20 క్రికెట్ నుంచి మిథాలీరాజ్ రిటైర్మెంట్ తీసుకుంది . టి20 కెప్టెన్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్, మిథాలీరాజ్ మధ్య కూడా విభేదాలున్నాయని తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. నిధానంగా ఆడే మిథాలీ.. టి20ల్లో పనికి రాదని హర్మన్‌ప్రీత్ భావించేదని.. ఇదే ఈ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణమని కొన్నాళ్లు ప్రచారం జరిగింది. చదవండి: మిథాలీ రాజ్ అరుదైన రికార్డులు ఇవే! ఎవరికీ సాధ్యం కాని రీతిలో రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్ Your contribution to Indian Cricket has been phenomenal. Congratulations @M_Raj03 on an amazing career. You leave behind a rich legacy. We wish you all the very best for your second innings 🙌🙌 pic.twitter.com/0R66EcM0gT — BCCI (@BCCI) June 8, 2022 #MithaliRaj - Queen of 🆒#WWC17 pic.twitter.com/F8GvP5oZJa — ICC Cricket World Cup (@cricketworldcup) June 24, 2017 -
శెభాష్ మిథూ: 23 ఏళ్ల కెరీర్.. అరుదైన రికార్డులు! హ్యాట్సాఫ్!
Mithali Raj Retirement: భారత క్రికెటర్‌గా దాదాపు 23 ఏళ్ల పాటు కొనసాగించిన ప్రస్థానానికి మిథాలీ రాజ్ ముగింపు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. రెండేళ్ల క్రితం పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన ఆమె.. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించారు. కాగా 39 ఏళ్ల మిథాలీ క్రికెటర్‌గా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అరుదైన రికార్డులతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచి లెజెండ్‌గా ఖ్యాతి గడించారు. మిథాలీ రిటైర్మెంట్ సందర్భంగా ఆమె సాధించిన ఘనతల గురించి సంక్షిప్తంగా.. ♦1999లో మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. చివరిసారిగా ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ♦వన్డేల్లో అత్యధిక పరుగులు(7805) సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు ♦వన్డే క్రికెట్లో అత్యధిక అర్ధ శతకాలు బాదిన మహిళా క్రికెటర్‌గా ఘనత ♦వుమెన్ వరల్డ్‌కప్ ఈవెంట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ జాబితాలో రెండో స్థానంలో మిథాలీ రాజ్(1321 పరుగులు) ♦వన్డేల్లో అత్యధిక సెంచరీలు(7) సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా ఖ్యాతి. ♦టీ20 ఫార్మాట్ అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ సాధించిన పరుగులు 2364. 2019లో చివరి మ్యాచ్ ఆడిన ఆమె.. టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్‌గా కొనసాగుతున్నారు. ►మహిళా క్రికెట్లో ఇప్పటి వరకు 10 వేల కంటే ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్‌గా మిథాలీ. అన్ని ఫార్మాట్లలో కలిపి ఆమె చేసిన పరుగులు 10868. ►మహిళా ప్రపంచకప్ ఈవెంట్లో ఏకంగా ఆరుసార్లు( 2000, 2005, 2009, 2013, 2017, 2022) పాల్గొన్న క్రికెటర్‌గా గుర్తింపు. ►మహిళా టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా మిథాలీ. 2002లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 214 పరుగులు సాధించిన మిథాలీ. ►మహిళా వన్డే క్రికెట్లో అతి పిన్న వయసులో సెంచరీ సాధించిన బ్యాటర్‌గా మిథాలీ రాజ్‌కు పేరు. 16 ఏళ్ల 205 రోజుల వయసులో ఆమె ఈ ఘనత సాధించారు. ►మహిళా క్రికెట్లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన క్రికెటర్‌గా మిథాలీ రాజ్ అరుదైన రికార్డు. ఆమె 22 ఏళ్ల 274 రోజుల పాటు క్రికెటర్‌గా ఉన్నారు. ♦మహిళా ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక సార్లు(12) హాఫ్ సెంచరీ ప్లస్ స్కోరు చేసిన క్రికెటర్‌గా మిథాలీ(న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డెబీ హాక్లేతో కలిసి సంయుక్తంగా మొదటి స్థానం). ♦అదే విధంగా కెప్టెన్‌గానూ మెగా ఈవెంట్లో యాభై కంటే ఎక్కువ పరుగులు సాధించడం ఎనిమిదోసారి. ♦వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్‌గా మిథాలీ రికార్డు. ♦మహిళల క్రికెట్లోనే కాకుండా పురుషుల క్రికెట్లోనూ ఎవ్వరికీ సాధ్యం కాని అత్యంత అరుదైన రికార్డు మిథాలీ సొంతం. అదేమిటంటే.. తన కంటే 21 ఏళ్ల చిన్నదైన, తన అంతర్జాతీయ అరంగ్రేటం తర్వాత నాలుగేళ్లకు పుట్టిన రిచా ఘోష్‌తో కలిసి మిథాలీ వరల్డ్‌కప్-2022లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. చదవండి: Nicholas Pooran: ఐపీఎల్లో పర్లేదు.. అక్కడ మాత్రం తుస్! కానీ పాక్‌తో మ్యాచ్‌లో.. View this post on Instagram A post shared by ICC (@icc) -
అంతర్జాతీయ క్రికెట్‌కు మిథాలీరాజ్ గుడ్‌బై
-
Mithali Raj: రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్
Mithali Raj Retirement: భారత మహిళా క్రికెట్ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ సీనియర్ బ్యాటర్ సోషల్ మీడియా వేదికగా బుధవారం ప్రకటన విడుదల చేశారు. క్రికెటర్‌గా సుదీర్ఘ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకుంటున్నానని, అప్పుడు కూడా ఇలాగే తనపై ప్రేమను కురిపిస్తూ అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ‘‘ఇండియా జెర్సీ వేసుకుని దేశానికి ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నా ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. 23 ఏళ్లుగా ప్రతి సవాలును ఎదుర్కొంటూ జీవితాన్ని ఆస్వాదిస్తూ వచ్చాను. ప్రతి సవాలు నుంచి గొప్ప అనుభవం గడించాను. ప్రతి ప్రయాణం లాగే ఇది కూడా ఏదో ఒకరోజు ముగించాల్సిందే కదా! ఈరోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నాను. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జట్టును గెలిపించాలని భావించేదానిని. ఇప్పుడిక ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చింది. ఎంతో మంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు రావాలి. భారత మహిళా క్రికెట్ భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోవాలి’’ అంటూ మిథాలీ భావోద్వేగ నోట్ షేర్ చేశారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి, కార్యదర్శి జై షాకు మిథాలీ ధన్యవాదాలు తెలిపారు. క్రికెటర్‌గా తన ప్రయాణం ముగిసినా ఆటలో ఏదో విధంగా భాగస్వామ్యం అవుతానంటూ భవిష్యత్ ప్రణాళికల గురించి హింట్ ఇచ్చారు. భారత మహిళా క్రికెట్‌కు సేవలు అందించడంలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. తనకు అండగా నిలిచి ఆదరాభిమానాలు చూపిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా 2019లో టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిథాలీ తాజాగా వన్డే, టెస్టులకు కూడా గుడ్ బై చెప్పారు. 1999లో అరంగ్రేటం చేసిన మిథాలీ రాజ్.. భారత మహిళా జట్టు కెప్టెన్‌గా ఎదిగారు. 232 వన్డేల్లో 7805 పరుగులు సాధించారు. భారత్ తరఫున 12 టెస్టులు, 89 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడారు. చదవండి: Ind Vs SA: పాండ్యా, సంజూపై ద్రవిడ్ ప్రశంసలు.. అతడికి జట్టులో చోటు మాత్రం ఇవ్వరు కదా! Thank you for all your love & support over the years! I look forward to my 2nd innings with your blessing and support. pic.twitter.com/OkPUICcU4u — Mithali Raj (@M_Raj03) June 8, 2022 -
తాప్సీ 'శభాష్ మిథు' అనిపించుకునేది ఆరోజే..
Taapsee Pannu Shabaash Mithu Movie Release Date Fixed: శభాష్ మిథు ఆట చూపించే డేట్‌ను ఫిక్స్ చేసింది ఆ చిత్ర బృందం. నిజానికి ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది 'శభాష్ మిథు' చిత్రం. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఖరారు అయింది. జూలై 15న విడుదల చేయనున్నట్లు శుక్రవారం (ఏప్రిల్ 29) ప్రకటించింది చిత్ర యూనిట్. తాప్సీ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాకు శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ప్రముఖ భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మిథాలీ రాజ్ సాధించిన విజయాలతోపాటు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలను మూవీలో ప్రస్తావించినట్లుగా చిత్ర యూనిట్ ఓ సందర్భంలో పేర్కొంది. ఇక ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'డంకీ' సినిమాతో బిజీగా ఉంది తాప్సీ. ఈ సినిమాకు రాజ్ కుమార్ హిరాణీ దర్శకుడు. చదవండి: షాకింగ్ : న్యూడ్‌గా నటించిన హీరోయిన్ ఆండ్రియా? ఇంతవరకు నేను సౌత్ సినిమాలే చూడలేదు: బాలీవుడ్ నటుడు -
ఉత్కంఠభరితమైన దృశ్యాలు..ఊహకందని భావోద్వేగాలు!
-
అరుదైన దృశ్యాలు.. ఊహకందని భావోద్వేగాలు!
అందరి జీవితాల్లోనూ కొన్ని అపురూప క్షణాలు ఉంటాయి. అలాంటి వాటిని తడిమి చూసుకున్నప్పుల్లా ఒకలాంటి ఉద్వేగానికి లోనవుతాం. ఆటల్లోనూ ఇలాంటి అరుదైన క్షణాలు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ప్రతిస్పందనగా రకరకాల భావోద్వేగాలకు గురవుతుంటాం. ముఖ్యంగా గెలుపోటములను నిర్ణయించే సమయంలో క్రీడాకారులతో ప్రేక్షకులు కూడా ఒత్తిడి, ఉత్కంఠ, ఆందోళన చెందుతుంటారు. ఆట చివరి క్షణాల్లోని నాటకీయతను మునివేళ్లపై నిల్చుకుని వీక్షిస్తుంటారు ఫ్యాన్స్. ఫలితాలకు అనుగుణంగా ఆనందం, నిరాశ, నిస్పృహ లాంటి భావావేశాలను ప్రకటిస్తుంటారు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నమెంట్లలో ఎంతో పోటీ ఉంటుందో క్రీడాభిమానులందరికీ ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. సరిగ్గా అలాంటి సందర్భమే ఈసారి ఎదురయింది. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీ నుంచి భారత జట్టు భారంగా నిష్ర్కమించింది. తుది అంకానికి చేరువయ్యేందుకు చివరి బంతి వరకు పడతులు పోరు సాగించినా ఫలితం మనకు అనుకూలంగా రాలేదు. అయితే గెలుపు కోసం ఇరు జట్ల క్రీడాకారిణులు సాగించిన సమరం స్ఫూర్తిదాయకంగా నిలవడంతో పాటు ప్రేక్షకులకు ఉత్కంఠతో కూడిన వినోదాన్ని అందించింది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో మార్చి 27న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీరాజ్ బృందం పోరాడి ఓడింది. చివరి బంతికి ఫలితం వచ్చిన ఈ మ్యాచ్‌లో అఖరి క్షణాలను ఆటగాళ్లతో పాటు అభిమానులు ఆత్రుతగా చూశారు. తమ జాతకం భారత్ టీమ్ చేతిలో ఉండడంతో వెస్టిండీస్ క్రీడాకారిణులు మరింత ఉత్కంఠగా మ్యాచ్‌ను వీక్షించారు. మిథాలీరాజ్ బృందం ఓడిన క్షణంలో డ్రెసింగ్స్లో రూమ్‌లో విండీస్ క్రీడాకారిణుల ఆనందోత్సాహాలు మిన్నంటాయి. (క్లిక్: కత్తి మీద సాము లాంటిది.. ఎలా డీల్ చేస్తారో?!) ఓడిపోయామనుకున్న మ్యాచ్‌లో గెలిచినట్టు తేలడంతో దక్షిణాఫ్రికా శిబిరంలో సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమయ్యాయి. విజయం సాధించేశామన్న సంతోషంతో భారత బృందం ప్రదర్శించిన ఆనంద క్షణాలు.. నోబాల్ నిర్వేదం, ఓటమి బాధతో నిర్వేద వదనంతో నిష్క్రమించిన క్షణాలు, కామెంటేటర్లు మాటలు మర్చిపోయి అవాక్కయిన దృశ్యాలు.. ఇప్పుడు జ్ఞాపకాలుగా మిగిలాయి. కెమెరాలో నిక్షిప్తమైన ఈ అరుదైన దృశ్యాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తన అధికారిక ట్విటర్లో పేజీ షేర్ చేసింది. జయాపజయాలను పక్కనపెడితే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ప్రదర్శించిన పోరాట పటిమ అందరి మనసులను గెలిచింది. (క్లిక్: భారత్ కొంపముంచిన నోబాల్..) -
ఓటమిని తట్టుకోవడం కష్టమే.. అయితే: విరాట్ కోహ్లి ట్వీట్ వైరల్
Virat Kohli Message: టీ20 ప్రపంచకప్-2021లో దాయాది పాకిస్తాన్ చేతిలో కనీవినీ ఎరుగని ఓటమి.. కనీసం సెమీస్ కూడా చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమణ.. అప్పటి టీమిండయా సారథి విరాట్ కోహ్లికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. తాజాగా ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ఇలాంటి ఘటనే ఎదురైంది. మెగా ఈవెంట్లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పట్టుదలగా పోరాడినా ఫలితం లేకపోవడంతో రిక్తహస్తాలతో వెనుదిరిగింది. ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శన వృథాగా మిగిలిపోవడంతో అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. అయితే, గెలుపు కోసం వారు పోరాడిన తీరు మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి సైతం మిథాలీ సేనకు మద్దతుగా నిలిచాడు. ఈ మేరకు.. ‘‘గెలుపే లక్ష్యంగా ముందుకు సాగారు. కానీ అలా జరుగలేదు. మెగా టోర్నీ నుంచి నిష్క్రమించడం అమితంగా బాధిస్తుంది. అయినా, మీరు గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డారు. మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం’’ అని ట్విటర్ వేదికగా తన స్పందన తెలియజేశాడు. ఓటమిని తట్టుకోవడం కష్టమేనని , అయితే గెలిచేందుకు చివరి వరకు పోరాడటం గొప్ప విషయం అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇదిలా ఉండగా.. ఐపీఎల్-2022 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో తలపడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్(88), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (41 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్ ఆడినా 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. A spectacular run-chase by @PunjabKingsIPL in a high-scoring thriller sums up a Super Sunday 😍#TATAIPL #PBKSvRCB pic.twitter.com/7x90qu4YjI — IndianPremierLeague (@IPL) March 27, 2022 చదవండి: IPL 2022 MI Vs DC: 6,1,6,4,1,6.. ముంబై చేసిన అతి పెద్ద తప్పిదం అదే.. అందుకే ఓడిపోయింది! Always tough to bow out of a tournament you aim to win but our women's team can hold their heads high. You gave it your all and we are proud of you. 🙏🏻🇮🇳 — Virat Kohli (@imVkohli) March 28, 2022 -
World Cup 2022: అంతా నువ్వే చేశావు.. కానీ ఎందుకిలా? మా గుండె పగిలింది!
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా ప్రపంచకప్ టోర్నీ-2022లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలుత 48 పరుగులు చేసి మిథాలీ సేన భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించిన ఆమె.. ‘బౌలర్’గానూ అదరగొట్టింది. ఈ మెగా ఈవెంట్లో తొలిసారి బౌలింగ్ వేసిన హర్మన్.. రెండు వికెట్లు తీసింది. View this post on Instagram A post shared by ICC (@icc) అంతేకాదు.. దక్షిణాఫ్రికా ధాటిగా ఆడుతున్న వేళ ఓపెనర్ లిజెలీ లీని రనౌట్ రూపంలో వెనక్కి పంపి భారత్‌కు శుభారంభం అందించింది. అదే విధంగా మరో రెండు రనౌట్లలోనూ భాగమైంది. సెమీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు ఇలా శాయశక్తులా కృషి చేసింది. కానీ సానుకూల ఫలితం రాలేదు. View this post on Instagram A post shared by ICC (@icc) భారత అభిమానుల హృదయాలను ముక్కలు చేస్తూ.. దక్షిణాఫ్రికా ఆఖరి బంతికి విజయం సాధించి మిథాలీ సేన సెమీస్ చేరకుండా అడ్డుకుంది. దీంతో హర్మన్ ‘హీరోచిత’ పోరాటం వృథాగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో హర్మన్ అద్భుత ప్రదర్శనకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ భావోద్వేగానికి గురవుతున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) భారత్ కష్టాల్లో కూరుకుపోయిన వేళ వికెట్ తీసినపుడు ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగిన దృశ్యాలను పంచుకుంటూ.. ‘‘నీ ఆట తీరు పట్ల మాకెంతో గర్వంగా ఉంది. ఆఖరి వరకు మ్యాచ్‌ను తీసుకురాగలిగావు. అంతా నువ్వే చేశావు. కానీ దురదృష్టం వెంటాడింది. ఏదేమైనా ఆట పట్ల నీకున్న అంకితభావం అమోఘం. మరేం పర్లేదు హర్మన్.. ఓడినా మీరు మా మనసులు గెలిచారు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఓటమి పాలై భారత్ వరల్డ్‌కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. After that wicket, Harman was in tears and was consoled by Smriti. This is what it meant to her.#CWC22 #CricketTwitter pic.twitter.com/rrKJxRRGew — Krithika (@krithika0808) March 27, 2022 -
World Cup 2022: భారత్ కొంపముంచిన నోబాల్.. లక్కీగా వెస్టిండీస్ సెమీస్‌లోకి!
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భారత్ ప్రయాణం ముగిసింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ సేన 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో గత వరల్డ్‌కప్ రన్నరప్ భారత మహిళా జట్టు ఈసారి కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న 274 పరుగుల భారీ స్కోరు చేసినా దురదృష్టం వెంటాడింది. ఇక ఆదిలో దక్షిణాఫ్రికా వికెట్ తీసిన ఆనందం అంతలోనే ఆవిరైపోగా.. 26వ ఓవర్ తర్వాత వికెట్లు పడటం ఊరటనిచ్చింది. ముఖ్యంగా 48 పరుగులతో రాణించిన భారత జట్టు వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బంతితోనూ అద్భుతం చేయడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది. మొత్తంగా 8 ఓవర్లు బౌలింగ్ వేసిన హర్మన్ 2 వికెట్లు కూల్చింది. View this post on Instagram A post shared by ICC (@icc) అంతేగాక మూడు రనౌట్లలో భాగమైంది. ఆమె అద్భుత ప్రదర్శనతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. అయితే, చివర్లో దీప్తి శర్మ నోబాల్ భారత్ కొంపముంచింది. ఆఖరి బంతికి దక్షిణాఫ్రికా బ్యాటర్ మిగ్నన్ డు ప్రీజ్ సింగిల్ తీసి మిథాలీ సేన సెమీస్ ఆశలపై నీళ్లు చల్లింది. అయితే, దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి వెస్టిండీస్‌కు వరంగా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) కాగా అంతకు ముందు గురువారం జరగాల్సిన దక్షిణాఫ్రికా- వెస్టిండీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. దీంతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ క్రమంలో 7 పాయింట్లతో వెస్టిండీస్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఇక ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయంతో ఇంగ్లండ్ గెలుపొంది సెమీస్ చేరింది. విండీస్‌ను వెనక్కినెట్టింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైన కారణంగా టాప్-4లోకి చేరలేకపోయింది. దీంతో మిథాలీ సేన సెమీస్ నుంచి నిష్క్రమించగా.. విండీస్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో వెస్టిండీస్ జట్టులో ఆనందాలు వెల్లివిరిశాయి. చదవండి: IPL 2022: శ్రేయస్ కెప్టెన్సీ భేష్.. అతడిని తుదిజట్టులోకి తీసుకోవడం తెలివైన నిర్ణయం: టీమిండియా మాజీ క్రికెటర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
మిథాలీ రాజ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు .. ప్రపంచకప్ చరిత్రలో..!
Mithali Raj: భారత మహిళా క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (84 బంతుల్లో 68; 8 ఫోర్లు) చేసిన ఆమె.. ప్రపంచకప్ టోర్నీల్లో అత్యంత లేటు వయసులో ఈ ఘనత సాధించిన భారత మహిళా బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించింది. Youngest Indian to score 50 in WC - Mithali Raj Oldest Indian to score 50 in WC - Mithali Raj Pure class, quality and longevity. Well done, skip @M_Raj03 🙌🏾🙌🏾 pic.twitter.com/4HbpjPm12P — BCCI Women (@BCCIWomen) March 27, 2022 యాదృచ్చికంగా ప్రపంచకప్ టోర్నీల్లో అత్యంత చిన్న వయసులో, ఇదే ప్రత్యర్ధిపై (దక్షిణాఫ్రికా) హాఫ్ సెంచరీ (2000 వన్డే ప్రపంచకప్‌లో) చేసిన భారత మహిళా బ్యాటర్ రికార్డు కూడా మిథాలీ పేరిటే నమోదై ఉంది. దీంతో ప్రపంచకప్ టోర్నీల్లో అతి చిన్న వయసులో, అతి పెద్ద వయసులో ఒకే ప్రత్యర్ధిపై హాఫ్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా మిథాలీ రాజ్ రికార్డుల్లోకెక్కింది. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. స్మృతి మంధాన (71), షఫాలీ వర్మ (53), మిథాలీ (68), హర్మాన్‌ప్రీత్ కౌర్ (48) రాణించంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఛేదనలో లారా వోల్వార్ట్ (80), లారా గూడాల్ (49), డుప్రీజ్ (51 నాటౌట్) రాణించడంతో సఫారీ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆఖరి బంతి వరకు పోరాడినప్పటికీ ఫలితంగా లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో టీమిండియా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. చదవండి: IPL 2022: లేటు వయసులో లేటెస్ట్ రికార్డు నెలకొల్పిన ధోని -
World Cup 2022: నరాలు తెగే ఉత్కంఠ.. తప్పని ఓటమి.. టోర్నీ నుంచి భారత్ అవుట్
ICC Women World Cup 2022 Ind W Vs Sa W: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భారత్‌కు భంగపాటు తప్పలేదు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మిథాలీ సేనకు నిరాశే ఎదురైంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం దక్షిణాఫ్రికానే వరించింది. మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది. దీంతో భారత మహిళా జట్టు సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. చివరి వరకు పోరాడిన మిథాలీ సేన పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ గెలిచి శుభారంభం న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన(71), షఫాలీ వర్మ(53), కెప్టెన్ మిథాలీ రాజ్(68), వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ 48 పరుగులతో రాణించారు. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మెరుగైన స్కోరు సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నీం ఇస్మాయిల్ రెండు, అయబోంగా ఒకటి, ట్రియాన్కు ఒకటి, మసబాట క్లాస్ రెండు వికెట్లు పడగొట్టారు. నరాలు తెగే ఉత్కంఠ ఆరంభంలోనే దక్షిణాఫ్రికా ఓపెనర్ లిజెలీ లీను హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్ చేయడంతో భారత్‌కు మంచి బ్రేక్ వచ్చింది. కానీ మరో ఓపెనర్ లారా వొల్వార్డ్ 80 పరుగులు సాధించి పటిష్ట పునాది వేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన లారా గుడాల్ సైతం 49 పరుగులు సాధించగా.. కీలక సమయంలో మిగ్నన్డు ప్రీజ్ 52 పరుగులతో రాణించి అజేయంగా నిలిచింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఆఖరికి మరోవైపు.. వరుస విరామాల్లో వికెట్లు పడటంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. ముఖ్యంగా ఈ టోర్నీలో తొలిసారి బౌలింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ వికెట్లు తీస్తూ.. రనౌట్లలో భాగం కావడం ముచ్చటగొలిపింది. హర్మన్ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ ఆఖరి బంతి వరకు భారత్ పోరాడగలిగింది. అయితే, 49.5వ ఓవర్లో దీప్తి శర్మ నోబాల్ వేయడంతో భారత్ ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆఖరి బంతికి డు ప్రీజ్ సింగిల్ తీయడంతో భారత్ పరాజయం ఖరారైంది. దీంతో టోర్నీ నుంచి రిక్త హస్తాలతో వెనుదిరిగింది. View this post on Instagram A post shared by ICC (@icc) స్కోర్లు: ఇండియా- 274/7 (50) దక్షిణాఫ్రికా- 275/7 (50) View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: అదరగొట్టిన స్మృతి, షఫాలీ, మిథాలీ.. హర్మన్ సైతం..
Update: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో మిథాలీ సేన ప్రయాణం ముగిసింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో కనీసం సెమీస్ కూడా చేరకుండానే మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు అదరగొట్టింది. సెమీస్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మిథాలీ సేన భారీ స్కోరు సాధించింది. కాగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో ఓపెనర్లు స్మృతి మంధాన(71), షఫాలీ వర్మ(53) శుభారంభం అందించగా.. కెప్టెన్ మిథాలీ రాజ్(68) సైతం అర్ధ సెంచరీతో మెరిసింది. ఇక , వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ 48 పరుగులతో రాణించింది. View this post on Instagram A post shared by ICC (@icc) దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ప్రత్యర్థికి గట్టి సవాల్ విసిరింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నీం ఇస్మాయిల్‌కు రెండు, అయబోంగా ఖాకు ఒకటి, ట్రియాన్కు ఒకటి, మసబాట క్లాస్‌కు రెండు వికెట్లు దక్కాయి. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
ICC Womens WC 2022: టీమిండియా సెమీస్‌కు చేరాలంటే..?
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా మంగళవారం టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా మహిళల జట్టు ఆకట్టుకునే ప్రదర్శనతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం టీమిండియా ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు.. మూడు ఓటములతో ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌పై 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి నెట్‌రన్‌రేట్‌ను కూడా మెరుగుపరుచుకుంది. బంగ్లాతో మ్యాచ్‌కు ముందు మైనస్‌లో ఉన్న రన్‌రేట్.. ఇప్పుడు +0.768గా ఉంది. కాగా సెమీస్‌లో మూడు, నాలుగు స్థానాల కోసం ఇంగ్లండ్, భారత్, వెస్టిండీస్ పోటీపడుతున్నాయి. ఇంగ్లండ్‌కు రెండు మ్యాచ్‌లు ఉన్నప్పటికి నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆ జట్టు తాను ఆడబోయే రెండు మ్యాచ్‌లు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఇక ఆదివారం(మార్చి 27న) సౌతాఫ్రికాతో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సమీకరణాలు అవసరం లేకుండా 8 పాయింట్లతో సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ సాతాఫ్రికాతో మ్యాచ్‌లో ఓడినప్పటికి మరో అవకాశం ఉంది. టీమిండియాతో మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గనుక వెస్టిండీస్ ఓడిపోతే.. టీమిండియా సెమీస్‌కు చేరుకుంటుంది. అలా కాకుండా వెస్టిండీస్ గెలిస్తే టీమిండియాకు నెట్‌రన్‌రేట్ కీలకం కానుంది. సౌతాఫ్రికాతో మ్యచ్‌లో టీమిండియా ఓడినప్పటికి.. తక్కువ పరుగుల తేడాతో ఓడిపోవాలి. అప్పుడే నెట్ రన్‌రేట్ ఆధారంగా సెమీస్‌కు వెళుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనతో మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా వెస్టిండీస్‌ను ఓడిస్తే సరిపోతుంది. చదవండి: PAK vs AUS: బాబర్ ఆజం.. కేవలం రికార్డుల కోసమే టెస్టు సిరీస్ ఆడుతున్నావా? World Cup 2022: అరుదైన రికార్డు సాధించిన గోస్వామి.. తొలి భారత బౌలర్‌గా! View this post on Instagram A post shared by ICC (@icc) -
అదరగొట్టిన భారత్.. బంగ్లాను చిత్తు చేసిన మిథాలీ సేన(ఫొటోలు)
-
World Cup 2022: అదరగొట్టిన మిథాలీ సేన.. బంగ్లాపై భారీ విజయంతో..
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు అదరగొట్టింది. ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. హామిల్టన్ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42)కు తోడు యస్తికా భాటియా అర్ధ శతకంతో రాణించడంతో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. అయితే, గత మ్యాచ్‌లో అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న కెప్టెన్ మిథాలీ రాజ్(0) మరోసారి నిరాశపరిచింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. షర్మీన్ అక్తర్ రూపంలో తొలి వికెట్ కోల్పోయిన బంగ్లా.. 15 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో భారత బౌలర్లు వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించారు. దీంతో 40.3 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మిథాలీ సేన 110 పరుగులతో సునాయాస విజయం సాధించి సెమీస్ మార్గాలను సుగమం చేసుకుంది. ఇక బంగ్లా బౌలర్లలో రీతూ మోని 3, నహీదా అక్తర్ 2, జహనారా ఆలం ఒక వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా అత్యధికంగా 4 వికెట్లు తీసి సత్తా చాటింది. ఝులన్ గోస్వామికి రెండు, రాజేశ్వరీ గైక్వాడ్‌కు ఒకటి, పూజా వస్త్రాకర్‌కు రెండు, పూనమ్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కాయి. ఇక అర్ధ శతకంలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యస్తికా భాటియాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ స్కోర్లు: భారత మహిళా జట్టు: 229/7 (50) బంగ్లాదేశ్ మహిళా జట్టు: 119 (40.3) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం' -
World Cup 2022: నిరాశ పరిచిన మిథాలీ రాజ్.. రాణించిన మంధాన, షఫాలీ, యస్తికా
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత జట్టు మెరుగైన స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి పరుగులు సాధించింది. కాగా హామిల్టన్ వేదికగా సాగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన మిథాలీ సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42) శుభారంభం అందించారు. దీంతో 14 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. అయితే, బంగ్లా బౌలర్ నహీదా అక్తర్ మంధానను అవుట్ చేయగా.. రీతూ మోనీ వరుసగా రెండు వికెట్లు పడగొట్టింది. ఫామ్‌లో ఉన్న షఫాలీ వర్మను, కెప్టెన్ మిథాలీ రాజ్(0)ను పెవిలియన్‌కు పంపింది. View this post on Instagram A post shared by ICC (@icc) దీంతో ఐదు పరుగుల వ్యవధిలోనే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యస్తికా భాటియా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది. అర్ధ శతకం సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్(14), రిచా ఘోష్(26), పూజా వస్త్రాకర్(30), స్నేహ్ రాణా(27) పరుగులు సాధించారు. ఈ క్రమంలో భారత్ 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో రీతూ మోని 3, నహీదా అక్తర్ 2, జహనారా ఆలం ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్.. సెమీస్ ఆశలు సజీవం
ICC Women ODI World Cup 2022 Ind W Vs Ban W : మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ప్రపంచకప్‌లో సెమీస్ ఆశలు సజీవంగా భారత్ నిలుపుకుంది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల ధాటికి 119 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్నేహ్ రానా నాలుగు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించింది. అదే విధంగా గోస్వామి, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు సాధించి తమ వంతు పాత్ర పోషించారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో సల్మా ఖతూన్(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42) రాణించగా.. యస్తికా భాటియా అర్ధ శతకంతో జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. 12: 53 PM బంగ్లాదేశ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. భారత్ విజయానికి ఒక వికెట్ దూరంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మిథాలీ సేన సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. 12: 42 AM బంగ్లాదేశ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. భారత్ విజయానికి ఇంకా రెండు వికెట్ల దూరంలో నిలిచింది. 12: 37 AM ఏడో వికెట్ డౌన్ బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. 98 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. 12: 12 AM ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ ఝులన్ గోస్వామి బౌలింగ్‌లో సల్మా ఖతూన్ వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. లతా మొండాల్, రీతూ మోనీ క్రీజులో ఉన్నారు. 28 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 76-6 11: 59 AM 25 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ స్కోరు: 69-5 11: 31 AM: భారత బౌలర్లు జోరు మీదున్నారు. వరుస విరామాల్లో వికెట్లు కూలుస్తూ బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపిస్తున్నారు. స్నేహ్ రాణా బౌలింగ్‌లో రుమానా ఐదో వికెట్‌గా వెనుదిరిగింది. దీంతో 40 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. 11: 25 AM బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో ముర్షీదా ఖతూన్ అవుట్ అయింది. రుమానా అహ్మద్, లతా మొండాల్ క్రీజులో ఉన్నారు. స్కోరు- 35-4(17 ఓవర్లు) View this post on Instagram A post shared by ICC (@icc) 11: 14 AM: మూడో వికెట్ డౌన్ ప్రపంచకప్ టోర్నీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. స్నేహ్ రాణా బౌలింగ్‌లో నిగర్ సుల్తానా హర్మన్‌ప్రీత్ కౌర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. అంతకుముందు గైక్వాడ్ షర్మిన్ అక్తర్‌ను, పూజా వస్త్రాకర్ ఫర్గాగాను అవుట్ చేశారు. 14 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ స్కోరు: 28/3 10: 52 AM: 15 పరుగుల వద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. పూజా వస్త్రాకర్ బౌలింగ్‌లో ఫర్గానా హోక్ ఎల్బీగా వెనుదిరిగింది. 9 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ రెండు వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) 10: 40 AM: 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ షర్మిన్ అక్తర్ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. 5 పరుగులు చేసిన అక్తర్..గైక్వాడ్ బౌలింగ్‌లో స్నేహ్ రానాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. 6 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) 10: 30 AM: 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నాలుగు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. 09: 51 AM: ప్రపంచకప్-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42) రాణించగా.. యస్తికా భాటియా అర్ధ శతకంతో జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇక బంగ్లా బౌలర్లలో రీతూ మోని 3, నహీదా అక్తర్ 2, జహనారా ఆలం ఒక వికెట్ పడగొట్టారు. 09: 17 AM:అయ్యో.. యస్తికా హాఫ్ సెంచరీ సాధించిన మరుసటి బంతికే భారత బ్యాటర్ యస్తికా భాటియా అవుట్ అయింది. రీతూ మోని బౌలింగ్‌లో నహీదా అక్తర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. యస్తికా రూపంలో మిథాలీ సేన ఆరో వికెట్ కోల్పోయింది. పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా క్రీజులో ఉన్నారు. స్కోరు 180-6(44 ఓవర్లలో). 09: 16 AM: అర్ధ శతకం పూర్తి చేసుకున్న యస్తికా ఓవైపు వికెట్లు పడుతున్నా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తూ భారత బ్యాటర్ యస్తికా భాటియా హాఫ్ సెంచరీ చేసింది. 79 బంతులు ఎదుర్కొన్న ఆమె 50 పరుగులు పూర్తి చేసుకుంది. సల్మా బౌలింగ్‌లో సింగిల్ తీసి అర్ధ శతకం సాధించింది. భారత్ స్కోరు:176-5(43) View this post on Instagram A post shared by ICC (@icc) 09: 00 AM: ఐదో వికెట్ కోల్పోయిన భారత్ రిచా ఘోష్ రూపంలో మిథాలీ సేన ఐదో వికెట్ కోల్పోయింది. నహీదా అక్తర్ బౌలింగ్‌లో నిగర్ సుల్తానాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ప్రస్తుతం పూజా వస్త్రాకర్, యస్తికా భాటియా(44) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరు: 163-5(39 ఓవర్లలో) 08: 43 AM: 35 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 147/4 యస్తికా భాటియా 37 పరుగులు, రిచా ఘోష్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. 08: 20 AM: 30 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 121/4. యస్తికా భాటియా(20), రిచా ఘోష్(9) బ్యాటింగ్ చేస్తున్నారు. 08: 11 AM: హర్మన్ అవుట్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళా జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. లతా మొండాల్ బౌలింగ్‌లో వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్(14)గా వెనుదిరిగింది. యస్తికా భాటియా, రిచా ఘోష్ క్రీజులో ఉన్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) 08: 04 AM: ఆచితూచి ఆడుతున్న యస్తికా, హర్మన్ భారత బ్యాటర్లు యస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్ ఆచితూచి ఆడుతున్నారు. వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ సింగిల్స్ తీస్తున్నారు. ఈ క్రమంలో 25 ఓవర్లు ముగిసే సరికి మిథాలీ సేన 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. 7: 45 AM: కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ వరుసగా రెండు వికెట్లు కూల్చి జోరు మీదున్న బంగ్లా బౌలర్ రీతూ మోని, నహీదా అక్తర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. వీరి బౌలింగ్‌లో సింగిల్స్ కూడా తీయలేక యస్తికా, హర్మన్ డిఫెన్స్ ఆడుతున్నారు. 20 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 80/3 7: 40 AM: 18 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 79-3. యస్తికా భాటియా, హర్మన్ ప్రీత్ కౌర్ క్రీజులో ఉన్నారు. 7: 33 AM: వరుసగా వికెట్లు పడగొడుతున్న బంగ్లా బౌలర్లు ఆరంభంలో తడబడ్డా బంగ్లా బౌలర్లు వరుసగా వికెట్లు కూలుస్తూ ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంటున్నారు. రీతూ మోని మరోసారి భారత్‌ను దెబ్బకొట్టింది. క్రీజులోకి వచ్చీ రాగానే భారత కెప్టెన్ మిథాలీ రాజ్‌ను అవుట్ చేసింది. 16 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 74-3 View this post on Instagram A post shared by ICC (@icc) 7: 30 AM: మిథాలీ సేనకు మరో షాక్ తగిలింది. అర్ధ శతకానికి చేరువవుతున్న షఫాలీ వర్మ(42)ను రీతూ మోని పెవిలియన్‌కు పంపింది. షఫాలీ రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. యస్తికా భాటియా, మిథాలీ రాజ్ క్రీజులో ఉన్నారు. 7: 28 AM: జోరు మీదున్న భారత జట్టుకు బంగ్లా బౌలర్ నహీదా అక్తర్ షాకిచ్చింది. 30 పరుగులతో క్రీజులో ఉన్న మంధానను అవుట్ చేసింది. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 7: 22 AM: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మిథాలీ సేనకు శుభారంభం లభించింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ అదరగొడుతున్నారు. ఈ క్రమంలో 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 72-0 View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. హామిల్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్ అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది. -
శభాష్ మిథు టీజర్ చూశారా?
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం శభాష్ మిథు. హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుంచి సోమవారం టీజర్ రిలీజైంది. జనాలతో కిక్కిరిసిపోయిన స్టేడియంలోకి టీమ్‌ను గెలిపించడానికి నేనున్నానంటూ భరోసానిస్తూ బ్యాట్‌ను పైకెత్తుతూ అడుగుపెట్టింది తాప్సీ. ఈ టీజర్ చూసిన క్రికెట్ అభిమానులు సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియో నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ మహిళా క్రీడాకారిణిపై వస్తున్న బయోపిక్ కావడంతో శభాష్ మిథుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం మాజీ క్రికెటర్ నూషిన్ అల్ ఖదీర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది తాప్సీ. అచ్చంగా మిథాలీ రాజ్‌లా ఆడటం, ప్రవర్తించడం మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. కాగా తాప్సీ గతంలోనూ క్రీడానేపథ్యం ఉన్న చిత్రాలు చేసింది. సూర్మ, సాండ్ కీ ఆంఖ్, రష్మీ రాకెట్ వంటి స్పోర్ట్స్ రిలేటెడ్ మూవీస్‌లో నటించింది. View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) చదవండి: రెండోసారి తల్లయ్యాక స్టార్ హీరోయిన్ రహస్య వివాహం! -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డ్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. లీగ్ మ్యాచ్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తద్వారా వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేజింగ్ చేసిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డులలెక్కింది. మరో వైపు తమ రికార్డునే ఆస్ట్రేలియా ఐదేళ్ల తర్వాత బ్రేక్ చేసింది. 2017 ప్రపంచకప్‌లో శ్రీలంకపై 262 పరుగుల లక్క్క్ష్యాన్ని ఆస్ట్రేలియా చేధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో యస్తికా భాటియా (59), కెప్టెన్ మిథాలీ రాజ్(68) హర్మన్ ప్రీత్ కౌర్ (57) పరుగులతో రాణించారు. ఇక 278 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో రేచల్ హేన్స్(43), అలీసా హేలీ(72), కెప్టెన్ లానింగ్(97) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: World Cup 2022: మిథాలీ సేనకు షాక్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆసీస్ -
World Cup 2022: మిథాలీ సేనకు షాక్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆసీస్
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022లో భాగంగా ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియా మరోసారి అదరగొట్టింది. భారత మహిళా జట్టుతో ఆక్లాండ్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో గెలుపొందింది. తద్వారా ఈ టోర్నీలో ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి సగర్వంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు.. సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలైన మిథాలీ సేనకు నిరాశ తప్పలేదు. టాస్ గెలిచి.. మిథాలీ సేనతో మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన 10 పరుగులకే నిష్క్రమించగా.. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (12 పరుగులు) నిరాశపరిచింది. అయితే, యస్తికా భాటియా (59), కెప్టెన్ మిథాలీ రాజ్(68) స్కోరు బోర్డును పరిగెత్తించారు. View this post on Instagram A post shared by ICC (@icc) కానీ ఆసీస్ బౌలర్ డార్సీ బ్రౌన్ వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టి జట్టును దెబ్బకొట్టింది. ఆ తర్వాత వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 57 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. ఇక ఆఖర్లో బ్యాట్ ఝులిపించిన పూజా వస్త్రాకర్ 34 పరుగులు సాధించింది. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు స్కోరు చేసింది. ఆది నుంచి దూకుడుగా.. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆది నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు రేచల్ హేన్స్(43), అలీసా హేలీ(72) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వీరికి తోడు కెప్టెన్ మెగ్ లానింగ్ 97 పరుగులు సాధించి జట్టు విజయానికి బాటలు వేసింది. అయితే, మధ్యలో వరుణుడి ఆటంకం, గెలుపునకు 31 పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఆసీస్ మూడో వికెట్ కోల్పోవడం ఉత్కంఠను పెంచాయి. View this post on Instagram A post shared by ICC (@icc) సగర్వంగా సెమీస్‌కు ఈ క్రమంలో సెంచరీకి చేరువైన లానింగ్‌ను మేఘనా సింగ్ అవుట్ చేయడంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. అయితే, ఆఖరి మూడు బంతుల వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌దే పైచేయి అయింది. ఝులన్ గోస్వామి బౌలింగ్‌లో బెత్ మూనీ వరుస ఫోర్లు కొట్టి ఆసీస్ విజయాన్ని ఖరారు చేసింది. ఫోర్ బాది జట్టును సెమీ ఫైనల్‌కు చేర్చింది. ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ మెగ్ లానింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా స్కోర్లు: ఇండియా- 277/7 (50) ఆస్ట్రేలియా- 280/4 (49.3) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
టీమిండియా బౌలర్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా!
భారత వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి అరుదైన రికార్డు సాధించింది. ప్రపంచంలోనే 200 వన్డేలు ఆడిన తొలి బౌలర్‌గా గోస్వామి రికార్డులకెక్కింది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో గోస్వామి ఈ ఘనత సాధించింది. అంతేకాకుండా 200 వన్డే మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్‌గా గోస్వామి నిలిచింది. ఇక భారత కెప్టెన్ మిథాలీ రాజ్ 230 వన్డేలు ఆడి తొలి స్ధానంలో ఉంది. ఇక వన్డే ఫార్మాట్లో 250 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గా గోస్వామి నిలిచిన సంగతి తెలిసిందే. కాగా గోస్వామి వరుసగా ఐదో వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె 2005లో తొలి వరల్డ్‌కప్ భారత తరుపున ఆడింది. అదే విధంగా మహిళల ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు (40 వికెట్లు) తీసిన బౌలర్‌గా కూడా గోస్వామి రికార్డు సృష్టించింది. చదవండి: Jhulan Goswami: చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: మిథాలీ సంచలనం.. ప్రపంచ రికార్డు.. ఎవరికీ సాధ్యం కాని ఫీట్!
ICC Women World Cup 2022 Ind Vs Aus- Mithali Raj: గత కొన్ని రోజులుగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతూ వరల్డ్‌కప్-2022 టోర్నీలో నిరాశ పరిచిన భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించింది. ప్రపంచకప్ ఈవెంట్లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అర్ధ శతకం బాదింది. 77 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. తన ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించింది. కాగా మిథాలీ కెరీర్లో ఇది 63వ అర్ధ శతకం. ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా మిథాలీ రాజ్ సరికొత్త రికార్డు సృష్టించింది. మహిళా ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక సార్లు(12) హాఫ్ సెంచరీ ప్లస్ స్కోరు చేసిన క్రికెటర్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ రికార్డును అధిగమించింది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డెబీ హాక్లేతో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచింది. ఇక కెప్టెన్‌గానూ మిథాలీకి ఈ మెగా ఈవెంట్లో యాభై కంటే ఎక్కువ పరుగులు సాధించడం ఎనిమిదోసారి. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి సారథిగా మిథాలీ నిలిచింది. ఆమె తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ ఆరు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లతో రెండో స్థానంలో ఉంది. కాగా ప్రపంచకప్ సెమీస్ చేరాలంటే, బలమైన జట్టుగా పేరొందిన ఆస్ట్రేలియాతో కీలక పోరులో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. యస్తికా భాటియా (59), కెప్టెన్ మిథాలీ రాజ్(68), హర్మన్ ప్రీత్ కౌర్ (57) అర్ధ శతకాలతో రాణించారు. ఇక అంతకుముందు వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్‌గా మిథాలీ రాజ్ నిలిచింది. తద్వారా ఆస్ట్రేలియా సారథి బెలిండా క్లార్క్(23 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును ఆమె బ్రేక్ చేసింది. చదవండి: Women WC 2022- Mithali Raj: 5 పరుగులకే అవుట్ అయినా.. ప్రపంచకప్ టోర్నీలో మిథాలీ అరుదైన రికార్డు View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: ఆసీస్‌తో పోరు.. అదరగొట్టిన మిథాలీ, యస్తికా, హర్మన్..!
ICC Women World Cup 2022 IND W Vs AUS W: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ మంచి స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు సాధించింది. కాగా న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన మిథాలీ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తలిగింది. గత రెండు మ్యాచ్‌లలో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ స్మృతి మంధాన 10 పరుగులకే పెవిలియన్ చేరింది. ఆ తర్వాత మరో ఓపెనర్ షఫాలీ వర్మ 12 పరుగులు సాధించి అవుట్ అయింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక వనౌడౌన్‌లో వచ్చిన యస్తికా భాటియా (59), కెప్టెన్ మిథాలీ రాజ్(68) కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేసిన ఆసీస్ బౌలర్ డార్సీ బ్రౌన్ మంచి ఫామ్‌లోకి వచ్చిన యస్తికాను అవుట్ చేసింది. ఆ తర్వాత మిథాలీ అలనా కింగ్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 57 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆఖర్లో 34 పరుగులు చేసి మెరుపులు మెరిపించిన పూజా వస్త్రాకర్ రనౌట్ కావడంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది.ఇక ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్కు మూడు, జెస్ జొనాసెన్‌కు ఒకటి, అలనా కింగ్‌కు 2 వికెట్లు దక్కాయి. View this post on Instagram A post shared by ICC (@icc) భారత్ స్కోరు: 277-7 (50 Ov) View this post on Instagram A post shared by ICC (@icc) -
Womens WC 2022: ఆస్ట్రేలియా విజయం.. టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టం
-
పోరాడినా... తప్పని ఓటమి!
స్ఫూర్తిదాయక ఆటతో వెస్టిండీస్‌పై భారీ విజయం సాధించి ఆశలు రేపిన భారత మహిళల ఆట ఒక్కసారిగా గతి తప్పింది. పేలవ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ ముందు మన జట్టు తలవంచింది. ఒక్కరూ కూడా కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత ఆరంభంలోనే రెండు వికెట్లు తీసినా... చివరకు ప్రత్యర్థి గెలుపును ఆపలేకపోయారు. మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండు బలమైన ప్రత్యర్థులే కావడంతో సెమీస్ చేరేందుకు భారత్ తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. మౌంట్ మాంగనీ: గత వన్డే వరల్డ్ కప్ ఫైనలిస్ట్‌ల మధ్య జరిగిన సమరం దాదాపు ఏకపక్షంగా సాగింది. ఇంగ్లండ్ కూడా గొప్పగా ఆడకపోయినా చేవ లేని భారత బ్యాటింగ్ ఆ జట్టుకు కలిసొచ్చింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత మహిళలపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 36.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. స్మృతి మంధాన (58 బంతుల్లో 35; 4 ఫోర్లు), రిచా ఘోష్ (56 బంతుల్లో 33; 5 ఫోర్లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చార్లీ డీన్ (4/23) భారత్‌ను పడగొట్టింది. అనంతరం ఇంగ్లండ్ 31.2 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. కెప్టెన్ హీతర్ నైట్ (72 బంతుల్లో 53 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో పాటు నాట్ సివర్ (46 బంతుల్లో 45; 8 ఫోర్లు) రాణించింది. టపటపా... తన రెండో ఓవర్లోనే ఓపెనర్ యస్తిక భాటియా (8)ను అవుట్ చేసి భారత్ పతనానికి శ్రీకారం చుట్టిన ష్రబ్సోల్ తన తర్వాతి ఓవర్లో మిథాలీ రాజ్ (1)ను కూడా వెనక్కి పంపించింది. ఆ వెంటనే లేని సింగిల్‌కు ప్రయత్నించి దీప్తి శర్మ (0) రనౌటైంది. డీన్ వేసిన ఒకే ఓవర్లో హర్మన్ (14), స్నేహ్ రాణా (0) కూడా పెవిలియన్ చేరడంతో 61 పరుగుల వద్దే భారత్ సగం వికెట్లు కోల్పోయింది. దాంతో మరో ఎండ్‌లో స్మృతి తన సహజశైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడుతూ ఆదుకునే ప్రయత్నం చేసింది. అయితే ఎకెల్‌స్టోన్ బౌలింగ్‌లో స్మృతి వికెట్ల ముందు దొరికిపోగా, పూజ వస్త్రకర్ (6) కూడా ఇదే తరహాలో అవుటైంది. ఈ దశలో రిచా, జులన్ గోస్వామి (20) కొంత ధాటిని ప్రదర్శించడంతో స్కోరు వంద పరుగులు దాటింది. మేఘనకు 3 వికెట్లు... సునాయాస ఛేదనలో ఇంగ్లండ్ తడబాటుకు గురైంది. 4 పరుగులకే ఆ జట్టు వ్యాట్ (1), బీమాంట్ (1) వికెట్లు కోల్పోయింది. మేఘన తన తొలి స్పెల్‌లో ప్రత్యర్థిని కట్టిపడేసింది. 4 ఓవర్లలో ఆమె 20 డాట్ బంతులు వేయడం విశేషం. అయితే నైట్, సివర్ చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లండ్‌ను గెలుపు దిశగా నడిపించారు. సివర్ను అవుట్ చేసి పూజ ఈ జోడీని విడదీయగా...66 బంతుల్లో నైట్ అర్ధసెంచరీ పూర్తయింది. విజయానికి చేరువైన దశలో ఒకే ఓవర్లో ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయినా, కెప్టెన్ నైట్ అజేయంగా నిలిచి తన బాధ్యతను పూర్తి చేసింది. చదవండి: 46 ఏళ్ల వయసులో సెంచరీ.. ముద్దుల్లో ముంచిన ఫేమస్ హీరోయిన్ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: కుప్పకూలిన మిడిలార్డర్.. విఫలమైన మిథాలీ.. కేవలం
ICC Women World Cup 2022 Ind W Vs Eng W: న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2022లో భాగంగా భారత మహిళా జట్టు బుధవారం ఇంగ్లండ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మిథాలీ సేన 134 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ యస్తికా భాటికా 11 బంతుల్లో 8 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఆమె స్థానంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ 5 బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు సాధించింది. దీప్తి శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్‌గా వెనుదిరిగింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది. కానీ ఇంగ్లండ్ బౌలర్ చార్లెట్ డీన్ భారత్‌ను దెబ్బకొట్టింది. ఒకే ఓవర్ హర్మన్‌తో పాటు ఆమె స్థానంలో క్రీజులోకి వచ్చిన స్నేహ్ రాణాను పెవిలియన్‌కు పంపింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఆ తర్వాత సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో మంధాన ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించింది. ఇక నిలకడగా ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్(33 పరుగులు) రనౌట్ కావడంతో భారత్ మరింతగా కష్టాల్లో కూరుకుపోయింది. ఝులన్ గోస్వామి కాసేపు బ్యాట్ ఝులిపించినా ఆమెకు సహకారం అందించేవాళ్లు కరువయ్యారు. View this post on Instagram A post shared by ICC (@icc) పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రాజేశ్వరీ గైక్వాడ్ ముగ్గురూ కలిసి కేవలం 10 పరుగులు మాత్రమే సాధించారు. ఈ క్రమంలో భారత్ 36.2 ఓవర్లలో 134 చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో చార్లెట్ డీన్‌కు నాలుగు, శ్రుబ్సోలేకు రెండు, సోఫీకి ఒకటి, కేట్ క్రాస్‌కు ఒక వికెట్ దక్కాయి. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్ స్కోరు: 134-10 (36.2 ఓవర్లు). -
World Cup 2022: నిరాశలో మిథాలీ సేన.. భారత్‌పై ఇంగ్లండ్ విజయం
England Women vs India Women Updates: మహిళల వన్డే ప్రపంచకప్-2022లో భాగంగా మిథాలీ సేనపై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. సోఫీ ఎక్లెస్టోన్ ఫోర్ బాది ఇంగ్లండ్ విజయాన్ని ఖరారు చేసింది. కాగా వరల్డ్‌కప్-2022లో ఇంగ్లండ్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ స్కోర్లు: ఇండియా- 134 (36.2ఓవర్లు) ఇంగ్లండ్- 136/6 (31.2 ఓవర్లు) 11: 30 AM: ఆరో వికెట్ డౌన్ మేఘనా సింగ్ వరుసగా రెండో వికెట్ తీసింది. సోఫీ స్థానంలో క్రీజులోకి వచ్చిన బ్రంట్‌ను అవుట్ చేసింది. 11: 29 AM: ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ సోఫీ డన్క్లేను మేఘనా సింగ్ పెవిలియన్‌కు పంపింది. దీంతో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 11: 17 AM 26 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 104-4 జోన్స్ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 10: 53 AM: 20 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు: 80/3 విజయానికి ఇంకో 55 పరుగులు అవసరం 10: 48 AM: క్రీజులో నిలదొక్కుకున్న నటాలి సీవర్‌ను భారత ప్లేయర్ పూజా వస్త్రాకర్ పెవిలియన్‌కు పంపింది. అర్ధ శతకానికి చేరువైన నటాలిని అవుట్ చేసింది. దీంతో 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె క్రీజును వీడింది. హైథర్నైట్, అమీ ఎలెన్ జోన్స్ క్రీజులో ఉన్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) 15 ఓవర్లలో ఇంగ్లండ్ 59/2 10:35 AM: ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ మహిళల జట్టు 15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. నటాటీ సివర్ 41, హెథర్ నైట్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. 10:05 AM: 8 ఓవర్లలో ఇంగ్లండ్ 23/2 టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. హెథర్‌నైట్, నటాలి సీవర్ 11 పరుగులతో ఆడుతున్నారు. 9: 48 AM: రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ భారత బౌలర్ మేఘనా సింగ్ భారత జట్టుకు శుభారంభం అందించింది. ఇంగ్లండ్ ఓపెనర్ వ్యాట్‌ను ఒక్క పరుగుకే పెవిలియన్ చేర్చింది. దీంతో భారత్‌కు తొలి వికెట్ లభించింది. ఝులన్ గోస్వామి అద్భుత బంతితో ఇంగ్లండ్ మరో ఓపెనర్ టామీ బీమౌంట్‌ను పెవిలియన్‌కు చేర్చింది. 10 బంతులు ఎదుర్కొన్న బీమౌంట్ ఒకే ఒక్క పరుగు చేసి ఝులన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. ఈ క్రమంలో 3 ఓవర్లలో 4 పరుగులు మాత్రమే సాధించిన ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది. 9: 00 PM: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2022లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళా జట్టు 134 పరుగులకు ఆలౌట్ అయింది. స్మృతి మంధాన(35), హర్మన్‌ప్రీత్ కౌర్(14), రిచా ఘోష్(33), ఝలన్ గోస్వామి(20) మినహా మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. 8: 52 AM: తొమ్మిది వికెట్లు కోల్పోయిన భారత్ ఝులన్ గోస్వామి రూపంలో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసి ఝులన్ పెవిలియన్ చేరింది. రాజేశ్వరీ గైక్వాడ్, మేఘనా సింగ్ క్రీజులో ఉన్నారు. 8: 48 AM: ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్ బ్యాట్ ఝులిపిస్తూ భారత శిబిరంలో నిరాశను పోగొట్టిన రిచా ఘోష్ 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయింది. దీంతో మిథాలీ సేన ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 8: 35 AM: రిచా ఘోష్, ఝులన్ గోస్వామి బ్యాటింగ్ చేస్తున్నారు. 31 ఓవర్లలో భారత్ స్కోరు: 108/7 8: 17 AM: ఏడో వికెట్ కోల్పోయిన భారత్ పూజా వస్త్రాకర్(6 పరుగులు) రూపంలో భారత మహిళా జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. చార్లెట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. రిచా ఘోష్, ఝులన్ గోస్వామి క్రీజులో ఉన్నారు. భారత స్కోరు: 88-7 8: 03 AM: మంధాన అవుట్ వరుసగా వికెట్లు కోల్పోతున్న వేళ భారత జట్టు ఆశాకిరణంగా నిలిచిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఇన్నింగ్స్‌కు తెరపడింది. సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో మంధాన ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. రిచా ఘోష్, పూజా వస్త్రాకర్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 72-6 View this post on Instagram A post shared by ICC (@icc) ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. హర్మన్ స్థానంలో క్రీజులోకి వచ్చిన స్నేహ్ రాణా డకౌట్ అయింది. ఆమె రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. స్మతి మంధాన, రిచా ఘోష్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 64/5 (17.5) View this post on Instagram A post shared by ICC (@icc) 7: 46 AM: నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ ఇంగ్లండ్ బౌలర్ చార్లెట్ భారత్ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టింది. క్రీజులో కుదురుకున్నట్లుగా అనిపించిన హర్మన్‌ప్రీత్ కౌర్‌ను పెవిలియన్‌కు పంపింది. దీంతో భారత్ కీలక వికెట్ కోల్పోయింది. 7: 33 AM: నిలకడగా ఆడుతున్న స్మతి మంధాన భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(26 పరుగులు) నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. ఓవైపు వికెట్లు పడుతున్నా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తోంది. మరో ఎండ్‌లో వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(12 పరుగులు) ఆమెకు చక్కటి సహకారం అందిస్తోంది. కాగా మెగా టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరు అద్భుత సెంచరీలు సాధించి భారత్‌కు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) 7: 18 AM: మూడు వికెట్లు కోల్పోయిన భారత్ పది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు- 37-3 దీప్తి రనౌట్ భారత జట్టుకు మరో షాక్ తగిలింది. బ్యాటర్ దీప్తి శర్మ రనౌట్‌గా వెనుదిరిగింది. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరింది. ఏంటిది మిథాలీ! ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్ యస్తికా భాటికా నిరాశపరిచింది. 8 పరుగులకే నిష్క్రమించింది. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం మరోసారి విఫలమైంది. 5 బంతులు ఎదుర్కొన్న ఆమె ఒకే ఒక్క పరుగు చేసి వెనుదిరగడంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. View this post on Instagram A post shared by ICC (@icc) టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2022లో భాగంగా భారత మహిళా జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. మిథాలీ బృందాన్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పంతం నీదా.. నాదా సై సుమారు ఐదేళ్ల క్రితం... వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరిన భారత మహిళల జట్టును ఇంగ్లండ్ ఓడించింది. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడినా...మిథాలీ సేన 9 పరుగులతో ఓడిపోకతప్పలేదు. దీంతో రన్నరప్‌గానే మిగిలిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రపంచకప్-2022లో మరోసారి ఇరు జట్లు తొలిసారిగా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. అయితే, ఇంగ్లండ్‌లో పేరుకు గొప్ప ప్లేయర్లు ఉన్నా ప్రస్తుత ఈవెంట్లో జట్టుకు ఒక్క విజయం కూడా దక్కలేదు. ఈ మ్యాచ్‌లోనూ గనుక ఓడితే ఇంగ్లండ్ సెమీస్ దారులు దాదాపుగా మూసుకుపోయినట్లే. మరోవైపు.. గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయంతో భారత్ ఆత్మవిశ్వాసంతో ఉంది. మరి ఈ ప్రతీకార మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి! -
India vs England: ప్రతీకారానికి సమయం!
దాదాపు ఐదేళ్ల క్రితం...అద్భుత ఆటతీరుతో భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరింది. నాటి మన ఆటను చూస్తే టైటిల్ ఖాయమనిపించింది. అయితే ఆఖరి మెట్టుపై ఇంగ్లండ్ మన విజయాన్ని అడ్డుకుంది. చివరి వరకు పోరాడినా...మిథాలీ సేన 9 పరుగులతో ఓడి రన్నరప్‌గానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నాటి మ్యాచ్ తర్వాత ఇప్పుడు మరోసారి వరల్డ్ కప్‌లో ఇరు జట్లు ముఖాముఖీ తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ సారి ఆధిక్యం ఎవరిదనేది ఆసక్తికరం. మౌంట్ మాంగనీ: వరల్డ్ కప్‌లో ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే ఇంగ్లండ్‌కంటే భారత్ పరిస్థితే మెరుగ్గా ఉంది. న్యూజిలాండ్ చేతిలో ఓడినా...పాకిస్తాన్, వెస్టిండీస్‌లపై సాధించిన ఘన విజయాలు జట్టును ముందంజలో నిలిపాయి. మరో వైపు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఖాతా తెరవలేకపోయింది. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓడిన ఆ జట్టు పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. వాళ్లిద్దరి ఆటతో... కీలక పోరుకు ముందు ఇద్దరు స్టార్ బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ ఫామ్‌లోకి రావడం భారత్‌కు అతి పెద్ద సానుకూలాంశం. విండీస్‌పై వీరిద్దరు శతకాలతో చెలరేగారు. మరో ఇద్దరు కీలక ప్లేయర్లు యస్తిక, రిచా ఘోష్ తమపై ఉన్న అంచనాలకు అనుగుణంగా సత్తా చాటాల్సి ఉంది. ఆల్రౌండర్లుగా స్నేహ్ రాణా, దీప్తి శర్మ కూడా ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నారు. జులన్ అనుభవం, పూజ వస్త్రకర్ పదునైన బౌలింగ్ భారత్‌ను బలంగా మార్చాయి. అయితే అన్నింటికి మించి కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా మెరుగైన ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. గత మూడు మ్యాచ్‌లలో కలిపి ఆమె 45 పరుగులే చేయగలిగింది. గెలిపించేదెవరు? ఇంగ్లండ్‌లో పేరుకు అంతా గొప్ప ప్లేయర్లు ఉన్నా జట్టుకు ఒక్క విజయం కూడా అందించలేకపోవడం అనూహ్యం. ఈ మ్యాచ్‌లోనూ ఓడితే ఆ జట్టు సెమీస్ దారులు దాదాపుగా మూసుకుపోతాయి. సివర్ ఒక సెంచరీ, బీమాంట్ రెండు అర్ధ సెంచరీలు మినహా ఆ జట్టునుంచి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. హీతర్‌నైట్, డన్‌క్లీ, జోన్స్ తగిన ప్రభావం చూపించలేకపోయారు. బౌలింగ్‌లో కూడా ఎకెల్‌స్టోన్, ష్రబ్సోల్ అంచనాలకు అందుకోలేకపోవడంతో టీమ్ గెలవడం సాధ్యం కాలేదు. ఇలాంటి స్థితిలో ఆ జట్టు భారత్‌ను నిలువరించాలంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. -
అదరగొట్టిన మిథాలీ సేన (ఫోటోలు)
-
World Cup 2022: శెభాష్ స్మృతి, హర్మన్.. ఇదే అత్యధిక స్కోరు!
ICC Women ODI World Cup 2022 Ind W Vs WIW: ఐసీసీ మహిళా వన్డే కప్-2022లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మిథాలీ సేన అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, యస్తికా భాటియా శుభారంభం అందించారు. మంధాన 119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 123 పరుగులు చేయగా.. యస్తికా 31 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ 5 పరుగులకే పెవిలియన్ చేరగా, దీప్తి శర్మ 15 పరుగులకే అవుట్ అయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, మంధానతో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించింది. 107 బంతుల్లో 109 పరుగులు సాధించింది. ఇందులో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక మంధాన, హర్మన్ అద్భుత సెంచరీలతో ఆకట్టుకోవడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. కాగా ఈ వరల్డ్‌కప్ టోర్నీలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక చివర్లో 53 పరుగులకే విండీస్ ఐదు వికెట్లు తీసినప్పటికీ అప్పటికే భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. వెస్టిండీస్‌తో మ్యాచ్: భారత మహిళా జట్టు స్కోరు: 317-8 (50 ఓవర్లలో) మంధాన, హర్మన్ సెంచరీలు స్మృతి మంధాన- 119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 123 పరుగులు హర్మన్‌ప్రీత్ కౌర్- 107 బంతుల్లో 109 పరుగులు చదవండి: Aaron Finch: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆసీస్ కెప్టెన్.. ఐపీఎల్‌లోకి రీఎంట్రీ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) The HIGHEST total of #CWC22 India put on a fabulous show with the bat 🙌 West Indies picked up 5 wickets for 53 runs near the end, but the damage was already done by then.#WIvIND SCORECARD ⬇️ — ESPNcricinfo (@ESPNcricinfo) March 12, 2022 -
Women WC 2022: ప్రపంచకప్ టోర్నీలో మిథాలీ రాజ్ అరుదైన రికార్డు..
ICC Women ODI World Cup 2022- Mithali Raj: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్‌గా నిలిచింది. తద్వారా ఆస్ట్రేలియా సారథి బెలిండా క్లార్క్(23 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టింది. కాగా ఐసీసీ మెగా టోర్నీలో 39 ఏళ్ల మిథాలీకి కెప్టెన్‌గా ఇది 24వ మ్యాచ్. అదే విధంగా.. విండీస్‌తో మ్యాచ్ ద్వారా మరో ఘనతను కూడా మిథాలీ తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచకప్ ఆరు ఎడిషన్లలో పాల్గొన్న మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఇక విండీస్‌తో మ్యాచ్‌లో బ్యాటర్‌గా మాత్రం మిథాలీ ఆకట్టుకోలేకపోయింది. 11 బంతులు ఎదుర్కొన్న ఆమె 5 పరుగులకే అవుట్ అయి అభిమానులకు మరోసారి నిరాశే మిగిల్చింది. మహిళా వన్డే కప్ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కెప్టెన్లు: మిథాలీ రాజ్- భారత్- 24 బెలిండా క్లార్క్- ఆస్ట్రేలియా- 23 సుసాన్ గోట్మాన్(న్యూజిలాండ్)- 19 త్రిష్ మెకెల్వీ(న్యూజిలాండ్)- 15 మేరీ పాట్ మూరే(ఐర్లాండ్)- 15 చదవండి: Aaron Finch: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆసీస్ కెప్టెన్.. ఐపీఎల్‌లోకి రీఎంట్రీ -
World Cup 2022: అదరగొట్టిన మిథాలీ సేన.. విండీస్‌పై భారీ విజయం.. ఏకంగా
ICC Women ODI World Cup 2022: Updates: 1: 23 PM ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 155 పరుగుల భారీ తేడాతో విండీస్‌పై గెలుపొందింది. 1: 10 PM తొమ్మిదో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్.. విజయానికి అడుగుదూరంలో భారత మహిళా జట్టు. స్కోరు: 158/9 (37) 1: 05 PM: ఎనిమిదో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ 12: 58 PM 34 ఓవర్లు ముగిసే సరికి వెస్టిండీస్ స్కోరు: 155/7. 12: 34 PM వెస్టిండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ మిడిలార్డర్ కుప్పకూలింది. ఈ క్రమంలో 28 ఓవర్లకే టేలర్ బృందం 7 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుత స్కోరు: 145/7 (28). ఇక భారత్‌పై విజయం సాధించాలంటే 173 పరుగులు అవసరం. 12: 21 PM: వెస్టిండీస్ మహిళా జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఓపెనర్లు మెరుపులు మెరిపించినా.. మిడిలార్డర్ విఫలం కావడంతో 24 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో చినెలె హెన్రీ ఆరో వికెట్‌గా వెనుదిరిగింది. 12: 15: వెస్టిండీస్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ దెబ్బ కొడుతున్నారు. ఇప్పటికే స్నేహ్ రాణా, మేఘన రెండేసి వికెట్లు తీయగా... కాంప్‌బెల్‌ను ఐదో వికెట్‌గా పూజా వస్త్రాకర్ పెవిలియన్‌కు పంపింది. 11: 55 AM: ఆరంభంలో ధాటిగా ఆడిన విండీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతోంది. హేలీ మాథ్యూస్ రూపంలో నాలుగో వికెట్ డౌన్ అయింది. స్నేహ్ రాణా అద్భుత బౌలింగ్‌లో హేలీ 43 పరుగుల వద్ద నిష్క్రమించింది. విండీస్ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసిన ఇద్దరు ఓపెనర్లు డాటిన్, హేలీని స్నేహ్ పెవిలియన్‌ను పంపి భారత్‌కు బ్రేక్ ఇచ్చింది. 11: 52 AM: కెప్టెన్ టేలర్ రూపంలో విండీస్ మూడో వికెట్ కోల్పోయింది. మేఘనా సింగ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. 11: 49 AM: 17 ఓవర్లలో విండీస్ స్కోరు: 112/2 స్కోరు బోర్డును పరిగెత్తిస్తున్న విండీస్ బ్యాటర్లకు భారత బౌలర్లు మేఘనా సింగ్, స్నేహ్ రాణా బ్రేకులు వేశారు. డాటిన్(62 పరుగులు)ను స్నేహ్ పెవిలియన్‌కు చేర్చగా.. వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన నైట్‌ను మేఘన అవుట్ చేసింది. 11: 07 AM: దీటుగా బదులిస్తున్న వెస్టిండీస్ మహిళా జట్టు ఆతిథ్య న్యూజిలాండ్, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌లపై సంచలన విజయాలు సాధించిన విండీస్ భారత్‌తో మ్యాచ్‌లోనూ సత్తా చాటుతోంది. 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. 10 ఓవర్లలో 81 పరుగులు చేసింది. భారత్ విసిరిన సవాల్‌కు దీటుగా బదులిస్తోంది. ఓపెనర్ డియాండ్ర డాటిన్ 36బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకుంది. మరో ఓపెనర్ హేలీ 32 పరుగులు చేసింది. పది ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు: 81-0 స్మృతి, హర్మన్ మెరుపులు.. భారత్ భారీ స్కోరు 10: 08 AM న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత మహిళా జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేన.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన(123), వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(109) అద్భుత సెంచరీలతో జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మిగతా వాళ్లలో యస్తికా భాటియా(31 పరుగులు), పూజా వస్త్రాకర్(10) తప్ప మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 10: 03 AM ఎనిమిదో వికెట్డౌన్ ఝులన్ గోస్వామి రూపంలో భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 10 AM: ఆఖర్లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. అనిసా మహ్మద్ బౌలింగ్‌లో పూజా వస్త్రాకర్ అవుట్ కాగా.. అలియా హర్మన్‌ను పెవిలియన్‌కు పంపింది. దీంతో 49 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. 9: 52 AM: భారత్ ప్రస్తుత స్కోరు: 296/5 (47) 9: 49 AM: విండీస్ బౌలర్ అలియా రిచా ఘోష్‌ను పెవిలియన్‌కు పంపింది. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిచా క్రీజు వీడింది. తద్వారా భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. రిచా స్థానంలో పూజా వస్త్రాకర్ మైదానంలో దిగింది. 9: 46 AM: హర్మన్ చేసెను అద్భుతం భారత బ్యాటర్, వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత సెంచరీ సాధించింది. 100 బంతుల్లో 100 పరుగులు చేసింది. 9: 32 AM: 44 ఓవర్లలో భారత్ స్కోరు: 268/4 (44) హర్మన్ ప్రీత్ కౌర్-83, రిచా ఘోష్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 9: 25 AM: స్మృతి అవుట్: సెంచరీ సాధించి జోరు మీదున్న స్మృతి అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది. షమీలియా బౌలింగ్‌లో సెల్మాన్కు క్యాచ్ ఇచ్చి 123 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె నిష్క్రమించింది. రిచా ఘోష్ క్రీజులోకి వచ్చింది. స్కోరు: 264/4 (42.5) 9: 23 AM: దంచి కొడుతున్న స్మృతి, హర్మన్ విండీస్‌లో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ దంచి కొడుతున్నారు. 42 ఓవర్లలో భారత్ స్కోరు: 257-3 9: 16 AM: శెభాష్ మంధాన విండీస్‌తో మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన శతకం సాధించింది. విండీస్ బౌలర్ హేలీ బౌలింగ్‌లో ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకుంది. మరోవైపు వైస్ కెప్టెన్ హర్మన్ కూడా అర్ధ శతకం పూర్తి చేసుకుని జోరు మీదుంది. 9: 06 AM శతకానికి చేరువవుతున్న స్మృతి మంధాన. 99 బంతుల్లో 94 పరుగులు 9: 00 AM: 35 ఓవర్ల తర్వాత భారత్ స్కోరు: 190-3 మంధాన, హర్మన్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. 8: 33 AM: 30 ఓవర్లలో భారత్ స్కోరు: 160/3 స్మృతి మంధాన 65, హర్మన్‌ప్రీత్ కౌర్ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు. మంధాన హాఫ్ సెంచరీ 8: 18 AM: అర్ధ శతకం పూర్తి చేసుకున్న స్మృతి మంధాన 67 బంతుల్లో 53 పరుగులు సాధించిన భారత ఓపెనర్ ధాటిగా ఆడుతున్న మంధాన 8:15 AM: 25 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 125-3 స్మృతి మంధాన 44, హర్మన్‌ప్రీత్ కౌర్ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. 7: 55 AM: 20 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు- 100-3. స్మృతి మంధాన 32 పరుగులు, హర్మన్‌ప్రీత్ కౌర్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్ల శుభారంభం.. కానీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. సెడాన్ పార్కు వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన, యస్తికా భాటియా(31 పరుగులు) శుభారంభం అందించారు. అయితే, కెప్టెన్ మిథాలీ రాజ్ మరోసారి నిరాశ పరిచింది. కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరింది. తుది జట్లు: భారత్: యస్తికా భాటియా, స్మృతి మంధాన, దీప్తి శర్మ, మిథాలీ రాజ్(కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్(వికెట్ కీపర్), స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరీ గైక్వాడ్ వెస్టిండీస్: డియేండ్ర డాటిన్, హేలీ మాథ్యూస్, కైసియా నైట్(వికెట్ కీపర్), స్టెఫానీ టేలర్(కెప్టెన్), షిమానె కాంప్‌బెల్, చెడాన్ నేషన్, చినెల్లె హెన్రీ, అలియా అలెన్, షమీలియా కానెల్, అనిసా మహ్మద్, షకేరా సెల్మాన్. చదవండి: Aaron Finch: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆసీస్ కెప్టెన్.. ఐపీఎల్‌లోకి రీఎంట్రీ View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: టాప్‌లో ఆస్ట్రేలియా.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే!
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ మెగా ఈవెంట్లో న్యూజిలాండ్ మహిళా జట్టు అదరగొట్టింది. వరుసగా బంగ్లాదేశ్, భారత జట్లపై విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఉంది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022లో భాగంగా సెడాన్ పార్కు వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో వైట్ ఫెర్న్స్ మిథాలీ రాజ్ సేనపై 62 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అంతకు ముందు బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది న్యూజిలాండ్. ఇక ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలుపొందిన ఆస్ట్రేలియా మహిళా జట్టు 4 పాయింట్లు సాధించడంతో పాటు మెరుగైన రన్‌రేటుతో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిచినప్పటికీ రన్‌రేటు పరంగా వెనుకబడ్డ వెస్టిండీస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా(ఒక మ్యాచ్- ఒక విజయం), భారత్(ఆడినవి-2 గెలిచింది 1), ఇంగ్లండ్ (ఆడినవి 2, ఓడినవి 2), బంగ్లాదేశ్(ఆడినవి 2, ఓడినవి 2), పాకిస్తాన్(ఆడినవి 2, ఓడినవి 2) మహిళా జట్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన నేపథ్యంలో ఫ్యాన్స్ మిథాలీ రాజ్ ఆట తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దూకుడుగా ఆడలేక చతికిలపడ్డారంటూ ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్‌పై ఘన విజయం తర్వాత మీ నుంచి ఇలాంటి ఆట తీరు ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2022- Delhi Capitals: పాపం.. రూ. 6.5 కోట్లు.. అన్రిచ్ నోర్జే స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీరే! -
World Cup 2022: భారత్‌కు తప్పని ఓటమి.. న్యూజిలాండ్ ఘన విజయం
ICC Women ODI World Cup 2022 Ind W Vs Nz W: న్యూజిలాండ్ చేతిలో భారత మహిళా జట్టుకు మరోసారి పరాభవం తప్పలేదు. గత రికార్డులను కొనసాగిస్తూ న్యూజిలాండ్ మహిళా జట్టు భారత్ మీద అద్భుత విజయం సాధించింది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022లో భాగంగా న్యూజిలాండ్‌లోని సెడాన్ పార్కు వేదికగా జరిగిన మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఇప్పటికే బంగ్లాదేశ్‌పై విజయంతో జోరు మీదున్న వైట్ ఫెర్న్స్ సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన మిథాలీ సేన.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం లభించకపోయినా.. అమీలియా కెర్ అర్ధ శతకంతో చెలరేగడంతో ఇన్నింగ్స్ గాడిన పడింది. ఆ తర్వాత అమీ సాటర్త్‌వైట్ 75 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. వీరికి తోడు వికెట్ కీపర్ బ్యాటర్ కేటే మార్టిన్ కూడా 41 పరుగులు సాధించింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి వైట్ ఫెర్న్స్ 260 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన మిథాలీ రాజ్ బృందానికి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ 71 పరుగులు, కెప్టెన్ మిథాలీ రాజ్ 31 పరుగులు తప్ప ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. దీంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2022 భారత్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్లు న్యూజిలాండ్- 260/9 (50) భారత్- 198 (46.4) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అమీ సాటర్త్‌వైట్(న్యూజిలాండ్) చదవండి: IPL 2022- Delhi Capitals: పాపం.. రూ. 6.5 కోట్లు.. అన్రిచ్ నోర్జే స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీరే! -
NZ Vs IND: సరిపోని హర్మన్‌ప్రీత్ మెరుపులు.. టీమిండియా పరాజయం
-
ICC Womens World Cup: కివీస్‌తో తేల్చుకోవాల్సిందే
హామిల్టన్: ప్రపంచకప్ సన్నాహాల కోసమే న్యూజిలాండ్‌కు వచ్చిన భారత మహిళల క్రికెట్ జట్టు ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో ఓడిపోయింది. అయితే అసలైన వరల్డ్‌కప్‌లో మాత్రం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి మిథాలీ రాజ్ బృందం శుభారంభం చేసింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో జైత్రయాత్ర సాగించాలని టీమిండియా ఆశిస్తోంది. గురువారం భారత్ తమ రెండో లీగ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. పాక్‌తో తొలి మ్యాచ్‌లో నెగ్గినప్పటికీ బ్యాటింగ్ గొప్పగా అయితే లేదు. టాపార్డర్‌లో ఓపెనర్ షఫాలీ వర్మ సహా మిడిలార్డర్ బ్యాటర్స్ కెప్టెన్ మిథాలీ, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ ఇలా ఏ ఒక్కరూ పట్టుమని పది పరుగులైనా చేయలేకపోయారు. వీరంతా కలిసి చేసింది 15 పరుగులే! లోయర్ ఆర్డర్లో స్నేహ్ రాణా, పూజ వస్త్రకర్ రాణించకపోతే టీమిండియా కష్టాల్లో పడేది. ఇప్పుడు పటిష్టమైన న్యూజిలాండ్‌తో ఏ ఒకరో ఇద్దరో ఆడితే ఏ మాత్రం సరిపోదు. పాక్‌తో ఆడినట్లు ఆడితే అసలు కుదరనే కుదరదు. ముఖ్యంగా మిడిలార్డర్ బాధ్యత తీసుకోవాలి. ఓపెనర్ స్మృతి మంధాన ఫామ్‌లో ఉండటం సానుకూలాంశమైనప్పటికీ మిగతావారు కూడా జట్టు స్కోరులో భాగం కావాలి. అప్పుడే ఆతిథ్య జట్టుకు సవాల్ విసరొచ్చు. లేదంటే ద్వైపాక్షిక సిరీస్‌లో ఎదురైన ఫలితమే ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పటిష్టంగా కివీస్ మరోవైపు కివీస్ తమ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో చివరి ఓవర్లో ఓడింది. కానీ వెంటనే తేరుకున్న న్యూజిలాండ్... బంగ్లాదేశ్‌ను సులువుగా ఓడించింది. ఓపెనర్లు సోఫీ డివైన్, సుజీ బేట్స్, అమెలియా కెర్ సూపర్ ఫామ్‌లో ఉండటం జట్టుకు బలం. బౌలింగ్‌లోనూ లియా తహుహు, జెస్ కెర్, అమీ సాటర్త్‌వైట్ ప్రత్యర్థి బ్యాటర్స్‌పై నిప్పులు చెరుగుతున్నారు. సొంతగడ్డ అనుకూలతలు ఎలాగూ ఉన్నాయి. ఇలా ఏ రకంగా చూసిన కూడా భారత్, న్యూజిలాండ్‌ల మధ్య గురువారం ఆసక్తికర పోరు జరగడం ఖాయం. ఇందులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. ఓవరాల్‌గా ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 12 మ్యాచ్‌లు జరిగాయి. 2 మ్యాచ్‌ల్లో భారత్, 9 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. -
World Cup 2022: న్యూజిలాండ్‌తో భారత్ పోరు.. వాళ్లదే పైచేయి.. అయినా గానీ..
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2022 ఎనిమిదో మ్యాచ్‌లో భాగంగా భారత జట్టు ఆతిథ్య న్యూజిలాండ్‌తో గురువారం తలపడనుంది. సెడాన్ పార్కు వేదికగా జరిగే మ్యాచ్‌లో వైట్ ఫెర్న్స్తో మిథాలీ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఇరు జట్లు వన్డేల్లో ఎన్నిసార్లు పోటీపడ్డాయి? ప్రపంచకప్ చరిత్రలో ఎవరిది పైచేయి అన్న వివరాలు పరిశీలిద్దాం. వాళ్లే ముందున్నారు! అంతర్జాతీయ స్థాయిలో భారత మహిళా జట్టు న్యూజిలాండ్‌తో ఇప్పటి వరకు 53 వన్డేలు ఆడింది. ఇందులో వైట్ ఫెర్న్స్ 32 విజయాలు సాధించగా... భారత్ ఇరవైంట మాత్రమే గెలుపొందింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. వరల్డ్‌కప్‌లో ముఖాముఖి రికార్డు ప్రపంచకప్ చరిత్రలోనూ భారత్‌పై న్యూజిలాండ్ జట్టుదే పైచేయి. ఇప్పటి వరకు ఈ ఐసీసీ మెగా ఈవెంట్లో ఇరు జట్లు తొమ్మిదిసార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో తొమ్మిదింట వైట్ ఫెర్న్స్ జయకేతనం ఎగురవేయగా.. భారత్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. మిథాలీ సూపర్ రికార్డు భారత మహిళా జట్టు వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్‌కు న్యూజిలాండ్‌పై మంచి రికార్డు ఉంది. ఇరు జట్ల బ్యాటర్లతో పోలిస్తే ఆమే అందరి కంటే ఒక అడుగు ముందు ఉన్నారు. ఇప్పటివరకు ఈ వెటరన్ బ్యాటర్ 273 పరుగులు సాధించారు. ఇక ప్రపంచకప్ చరిత్రలోనూ ఇరు జట్లు పోటీ పడినపుడు మిథాలీ మాత్రమే సెంచరీ సాధించారు. 2017 వరల్డ్‌కప్‌లో మిథాలీ 109 పరుగులు చేశారు. అంకెల్లో వెనుకబడ్డా.. ఆత్మవిశ్వాసంతో మిథాలీ సేన ప్రపంచకప్-2017లో న్యూజిలాండ్- భారత్ 2017లో చివరిసారిగా మెగా ఈవెంట్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మిథాలీ సేన 186 పరుగుల తేడాతో వైట్ ఫెర్న్స్‌పై ఘన విజయం సాధించింది. తద్వారా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక 109 పరుగులు సాధించిన కెప్టెన్ మిథాలీరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. కాగా ప్రస్తుత టోర్నీలో భాగంగా భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారీ విజయంతో బోణీ కొట్టింది. 107 పరుగుల తేడాతో గెలుపొంది ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. మరోవైపు.. న్యూజిలాండ్ సైతం బంగ్లాదేశ్ మహిళా జట్టుపై 9 వికెట్ల తేడాతో గెలుపొంది జోష్ మీద ఉంది. ఈ క్రమంలో మార్చి 10 నాటి పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: ICC Test Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన జడేజా.. నంబర్ 1 -
Ind W Vs Pak W: పాక్ కెప్టెన్ కూతురిని ముద్దు చేసిన భారత మహిళా క్రికెటర్లు.. వైరల్
ICC Women's World Cup 2022 Ind Vs Pak: ‘దాయాదులు’... ‘చిరకాల ప్రత్యర్థులు’... ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. ఇక ఐసీసీ మేజర్ ఈవెంట్లలో ఇరు జట్లు పోటీ పడుతున్నాయంటే అభిమానులు చేసే సందడి మామూలుగా ఉండదు. టైటిల్ గెలవకపోయినా సరేగానీ.. దాయాది చేతిలో ఓడితే మాత్రం అస్సలు జీర్ణించుకోలేరు. అందుకు కారణమైన ఆటగాళ్లను ఏ స్థాయిలో ట్రోల్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యక్తిగత దూషణలకు సైతం దిగుతారు. అయితే, క్రికెటర్లు మాత్రం ఈ ‘వైరాన్ని’ కేవలం మైదానం వరకే పరిమితం చేస్తారు. ఒక్కసారి బయట అడుగుపెట్టాక అంతా కలిసిపోయి సరదాగా ఉంటారు. పురుషుల టీ20 ప్రపంచకప్-2021లో భారత్ పాక్ చేతిలో ఓటమి పాలైన తర్వాత మెంటార్ ధోని, అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి క్రీడా స్ఫూర్తిని చాటిన తీరు ఇందుకు నిదర్శనం. తాజాగా మహిళల వన్డే వరల్డ్‌కప్-2022లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఈ మెగా ఈవెంట్లో భారత మహిళా జట్టు పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో దాయాదిని చిత్తు చేసి గెలుపు సంబరంలో మునిగిపోయింది. పాక్ మహిళా జట్టు ఓటమి బాధలో కూరుకుపోయింది. ఇదంతా ఆట వరకే! పాక్ కెప్టెన్ కూతురిని ముద్దు చేసిన భారత మహిళా క్రికెటర్లు మ్యాచ్ ముగిసిన తర్వాత భారత మహిళా క్రికెటర్లు పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బిస్మా మరూఫ్ పట్ల వ్యవహరించిన తీరు ఆకట్టుకుంటోంది. ప్రపంచకప్ ఆడేందుకు న్యూజిలాండ్ వచ్చిన బిస్మా.. తన చిన్నారి పాపాయిని కూడా వెంట తీసుకువచ్చింది. ఆ చిట్టితల్లిని చూసి ముచ్చటపడిన భారత మహిళా క్రికెటర్లు ఆ ‘అమ్మ’ దగ్గరకు వెళ్లి బుజ్జాయిని కాసేపు ఆడించారు. బిడ్డను ఎత్తుకున్న బిస్మా చుట్టూ చేరి పాపతో సరదాగా గడిపారు. ఆ తర్వాత ఆమెతో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐసీసీ సైతం ఈ ఫొటోను ట్విటర్లో షేర్ చేసింది. ‘‘ఇండియా- పాకిస్తాన్ క్రికెట్ స్ఫూర్తి గురించి చిన్నారి ఫాతిమా ఇప్పుడే పాఠాలు నేర్చుకుంటోంది’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు... ‘‘ఫొటో ఆఫ్ ది డే.. ఎంత హృద్యంగా ఉంది. అత్యంత అందమైన అద్బుతమైన క్షణాలు ఇవి. హృదయం పరవశించిపోతోంది’’ అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్- 2022 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు: ఇండియా-244/7 (50) పాకిస్తాన్-137 (43) 102 పరుగుల తేడాతో భారత్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: పూజా వస్త్రాకర్ చదవండి: Shane Warne Death: విషాద సమయంలో ఇలాంటివి అవసరమా.. గావస్కర్‌పై విమర్శలు! Little Fatima's first lesson in the spirit of cricket from India and Pakistan 💙💚 #CWC22 📸 @TheRealPCB pic.twitter.com/ut2lCrGL1H — ICC (@ICC) March 6, 2022 This video .. 🇮🇳🙌🏻🇵🇰#INDvPAK #INDvSL #PAKvIND #PAKvAUS#CWC22 #Peshawarblast pic.twitter.com/VuoCOGyzKW — DhrubaJyot Nath 🇮🇳 (@Dhrubayogi) March 6, 2022 Photo of the day!! #INDvPAK pic.twitter.com/OmHXuLPaVv — Milan Nakrani (@milannaks) March 6, 2022 View this post on Instagram A post shared by ICC (@icc) -
మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు.. తొలి క్రికెటర్‌గా
ఐసీసీ మహిళల వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు సాధించింది. మౌంట్ మౌన్‌గనుయ్ వేదికగా జరగుతోన్న ఈ మ్యాచ్‌తో అత్యధిక వన్డే ప్రపంచకప్‌లు ఆడిన తొలి మహిళా క్రీడాకారిణిగా మిథాలీ నిలిచింది. ఇప్పటి వరకు మిథాలీ రాజ్ మొత్తం ఆరు వన్డే ప్రపంచకప్‌లో పాల్గొంది. 2000 వరల్డ్‌కప్‌లో మిథాలీ అరంగేట్రం చేసింది. వరుసగా 2000, 2005, 2009, 2013, 2017, 2022 ప్రపంచకప్‌లలో భారత జట్టుకు మిథాలీ ప్రాతినిధ్యం వహించింది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డెబ్బీ హాక్లీ, ఇంగ్లండ్ క్రీడాకారిణి షార్లెట్ ఎడ్వర్డ్స్‌ల రికార్డును మిథాలీ రాజ్ బ్రేక్ చేసింది. హాక్లీ, ఎడ్వర్డ్స్ వరుసగా ఐదు ప్రపంచకప్‌ల్లో ఆడారు. ఇక ఆరు ప్రపంచకప్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా మిథాలీ రాజ్ సమం చేసింది. వరుసగా 1992,1996,1999,2003,2007,2011 ప్రపంచకప్‌లలో భారత తరుపున సచిన్ ఆడారు. చదవండి: Ravindra Jadeja: జడేజా సరికొత్త రికార్డు.. టీమిండియా తరపున మూడో ఆటగాడిగా -
INDW Vs PAKW: పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం
-
INDW Vs PAKW: పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకునేనా..?
India Take On Pakistan In Womens ODI World Cup 2022: గతేడాది పురుషుల టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి భారత మహిళల జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రేపు (మార్చి 6) పాక్‌తో జరగబోయే మ్యాచ్‌లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. న్యూజిలాండ్‌లోని మౌంట్ మౌంగనూయి ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. Pakistan and India captains exchanging greetings on the eve of their match. How excited are you? #CWC22 #BackOurGirls pic.twitter.com/fTEawDeiUI — Pakistan Cricket (@TheRealPCB) March 5, 2022 వార్మప్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, విండీస్లపై విజయాలు సాధించి ఫుల్ జోష్‌లో ఉన్న మిథాలీ సేన.. పాక్‌తో రేపు జరగబోయే మ్యాచ్‌లోనూ పైచేయి సాధించాలని ఆశిస్తుంది. మరోవైపు భారత్‌ను ఓడించేందుకు బిస్మా మహరూఫ్ నేతృత్వంలోని పాక్ సైతం ఉవ్విళ్లూరుతుంది. భారత్‌కు కలిసొచ్చే విషయం ఏంటంటే పాక్‌తో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉండటమే కాకుండా మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ కౌర్ వార్మప్ మ్యాచ్‌లో సెంచరీ సాధించి సూపర్ ఫామ్‌లో ఉంది. గత రికార్డులను పరిశీలిస్తే.. మహిళల వన్డే క్రికెట్లో భారత్-పాక్‌లు ఇప్పటి వరకు 10 సందర్భాల్లో ఎదురెదురుపడగా, అన్ని సార్లు టీమిండియానే విజయం వరించింది. ఇందులో 3 విజయాలు ప్రపంచకప్ టోర్నీల్లో దక్కినవే కావడం విశేషం. ఇక పొట్టి క్రికెట్లో ఇరు జట్లు తలపడిన 11 మ్యాచ్‌ల్లో టీమిండియా ఒకేసారి ఓడిపోయింది. చదవండి: బంగ్లాకు షాకిచ్చిన అఫ్ఘానిస్థాన్.. టీ20 సిరీస్ సమం -
పాకిస్తాన్‌తో భారత్ తొలి మ్యాచ్.. మీరు సిద్దంగా ఉండండి: విరాట్ కోహ్లి
మహిళల ప్రపంచకప్-2022 సమరానికి భారత జట్టు సిద్దమైంది. మార్చి 6న భారత్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మిథాలీ సేనకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మద్దతుగా నిలిచాడు. అంతే కాకుండా సోషల్ మీడియా వేదికగా భారత జట్టుకు మద్దతు తెలియజేయాలని అభిమానులను విరాట్ కోహ్లి కోరాడు. మిథాలీ రాజ్ నేతృత్వంలోని జట్టు దక్షిణాఫ్రికా,వెస్టిండీస్‌తో జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోను విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది. 2017 వన్డే ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్.. ఈ సారి ఎలాగైనా గెలిచి తొలిసారి వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలవాలని భావిస్తోంది. ఇక కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనుంది. "భారత జట్టుకు సపోర్ట్ చేయడానికి సిద్దంగా ఉండండి. మన మద్దతు తెలియజేయడానికి ఇంతకంటే మంచి సమయం మరి ఉండదు. ఎందుకంటే ఇది ఐసీసీ మహిళల ప్రపంచకప్-2022 సమరం. కాబట్టి మార్చి 6 ఉదయం 6.30 గంటలకు అలారమ్ సెట్ చేయండి" అని కోహ్లి ట్వీట్ చేశాడు. కాగా అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో వుమెన్ క్రికెట్‌కు విరాట్ మద్దతుగా నిలిచాడు. అదే విధంగా అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ చేరిన యువ భారత జట్టుకు విరాట్ కోహ్లి విలువైన సలహాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అండర్ 19 ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. చదవండి: Womens ODI World Cup 2022: ప్రపంచ కప్ సమరానికి సై.. భారత్ తొలి మ్యాచ్‌లోనే.. -
'ప్రపంచకప్ టైటిల్‌తో నా కెరీర్‌ను ముగించాలి అనుకుంటున్నా'
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 సమరానికి రంగం సిద్దమైంది. న్యూజిలాండ్ వేదికగా మెగా టోర్నమెంట్ మార్చి 4నుంచి ప్రారంభం కానుంది. మౌంట్ మౌంగానుయ్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో అతిథ్య న్యూజిలాండ్.. వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. కాగా మెగా టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత కెప్టెన్ మిథాలీ రాజ్ తన మనసులోని మాటను బయట పెట్టింది. "2000లో కూడా న్యూజిలాండ్‌లోనే జరిగిన ప్రపంచకప్‌లో ఆడాను. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడకు వచ్చాను. "నా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రపంచకప్ టైటిల్‌తో ముగించాలని కోరుకుంటున్నా. మా జట్టు సభ్యులంతా బాగా ఆడి మా ప్రణాళికలన్నీ సఫలం చేయాలని ఆశిస్తున్నా. కొన్ని సిరీస్‌ల ముందు మా జట్టు బాగా ఆడలేదనేది వాస్తవం. అయితే ప్రపంచకప్ సమయానికి అన్నీ చక్కదిద్దుకున్నాం. ప్రపంచకప్ గెలిస్తే మా ఆటగాళ్లందరికీ స్వదేశంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మమ్మల్ని చూసి అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నాం" అని మిథాలీ విలేకరుల సమావేశంలో పేర్కొంది. ఇక మిథాలీ రాజ్‌కు ఇది 6వ వన్డే వరల్డ్ కప్. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా ఆమె నిలవనుంది. చదవండి: Womens ODI World Cup 2022: ప్రపంచ కప్ సమరానికి సై.. భారత్ తొలి మ్యాచ్‌లోనే.. -
మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం.. ప్రపంచకప్ తర్వాత..!
భారత మహిళల జట్టు వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐసీసీ మహిళల ప్రపంచకప్-2022 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే టీ20లకు మిథాలీ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 4-1తేడాతో ఓటమి చవిచూసింది. అయితే అఖరి వన్డేలో గెలిచి భారత్ వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో మంధానతో పాటు మిథాలీ, హర్మాన్ ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీలతో రాణించారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన మిథాలీ తన రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించింది. "ఈ టోర్నమెంట్ తర్వాత నేను రిటైర్మెంట్ ప్రకటిస్తాను.. నా రిటైర్మెంట్ తర్వాత జట్టు యువ క్రికెటర్లతో మరింత బలంగా మారుతుందని భావిస్తున్నాను" అని మిథాలీ పేర్కొంది. ఇప్పటి వరకు 222 వన్డేల్లో భారత తరుపున ఆడిన మిథాలీ రాజ్ 7,516 పరుగులు సాధించింది. తన కేరిర్‌లో 7 సెంచరీలు, 61 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: Rohit Sharma: కోహ్లి రికార్డుకే ఎసరు పెట్టిన హిట్‌మ్యాన్ -
'ప్రపంచకప్‌లో భారత వైస్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్'
న్యూజిలాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్- 2022లో భారత జట్టు సత్తా చాటడానికి సిద్దమవుతోంది. అయితే ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో భారత్ ఓటమి చవిచూసింది. ఇక కివీస్ పర్యటనలో పేలవ ప్రదర్శన కనబర్చిన భారత టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా వన్డేల్లో భారత జట్టు వన్డే కెప్టెన్‌గా మిథాలీ రాజ్ ఉండగా.. వైస్ కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ ఉంది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేకు కౌర్ దూరం కావడంతో.. దీప్తి శర్మ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టింది. కాగా తిరిగి ఐదో వన్డేలో జట్టులోకి హర్మన్ ప్రీత్ కౌర్ వచ్చింది. అయినప్పటికీ దీప్తి శర్మనే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించింది. ఈ నేపథ్యంలో రానున్న ప్రప్రంచకప్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్ నుంచి తొలిగించనున్నట్లు వార్తలు వినిపించాయి. కాగా ఈ వార్తలపై భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించింది. రాబోయే ప్రపంచకప్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యవహరిస్తుందని మిథాలీ రాజ్ సృష్టం చేసింది. "దీప్తి శర్మని చివరి రెండు వన్డేలకు వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. కానీ ప్రపంచకప్‌లో మాత్రం హర్మన్‌ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్. యువ క్రికెటర్లకు నేను ఇచ్చే సలహా ఒక్కటే. ఇటువంటి పెద్ద టోర్నమెంట్లో ఒత్తిడి తట్టుకోని ఆడాలి. ఒత్తిడితో ఆడితే మీరు ప్రపంచ కప్‌లో అంతగా రాణించకపోవచ్చు" అని వర్చువల్ విలేకరుల సమావేశంలో మిథాలీ పేర్కొంది. ఇక మార్చి 4 నుంచి ఐసీసీ మహిళల ప్రపంచకప్- 2022 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. చదవండి: IND vs SL: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు' -
హమ్మయ్య.. మొత్తానికి భారత్ గెలిచింది
న్యూజిలాండ్ పర్యటనలో వరుస నాలుగు ఓటమిల తర్వాత.. ఐదో వన్డే గెలిచి భారత మహిళల జట్టు వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. ఓవల్ వేదికగా జరగిన అఖరి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత విజయంలో స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీ కీలక పాత్ర పోషించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీలియా కేర్(66), సోఫియా డివైన్(34),లారెన్ డౌన్(30) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో గైక్వాడ్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(71), హర్మన్ ప్రీత్ కౌర్(63), మిథాలీ(57) పరగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కాగా ఐదు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 4-0తేడాతో కైవసం చేసుకుంది. ఇక వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమీలియా కేర్‌కి మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. చదవండి: Bhanuka Rajapaksa: అభిమాన క్రికెటర్ కోసం రోడ్డెక్కిన లంకేయులు -
NZ W Vs Ind W: అదరగొట్టిన తెలుగమ్మాయి.. భారీ స్కోరు.. అయినా తప్పని ఓటమి.. సిరీస్ వాళ్లదే
NZ W Vs Ind W 3rd ODI: - క్వీన్స్టౌన్: మళ్లీ భారీ స్కోరు చేసినా... భారత మహిళల జట్టు న్యూజిలాండ్ చేతిలో వరుసగా మూడో వన్డేలోనూ ఓటమి చవిచూసి మరో రెండు వన్డేలుండగానే సిరీస్‌ను 0–3తో కోల్పోయింది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో మొదట మిథాలీ రాజ్ బృందం 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (41 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), షఫాలీ వర్మ (57 బంతుల్లో 51; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 100 పరుగులు జోడించారు. మిడిలార్డర్లో దీప్తి శర్మ (69 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధసెంచరీ సాధించింది. 280 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 49.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. మహిళల వన్డే క్రికెట్లో ఇది రెండో అత్యుత్తమ ఛేజింగ్. అమెలియా కెర్ (67; 8 ఫోర్లు), అమి సాటెర్త్‌వైట్ (59; 6 ఫోర్లు), లారెన్ డౌన్ (52 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేటీ మారి్టన్ (37 బంతుల్లో 35) మెరిపించి కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. జులన్ గోస్వామికి మూడు వికెట్లు దక్కాయి. చదవండి: Ind Vs Wi 2nd T20: ఆఖరి 2 బంతుల్లోనూ సిక్స్‌లు కొట్టాలి.. హర్షల్ ఆ అవకాశం ఇవ్వలేదుగా.. మనదే సిరీస్ -
క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డు.. అరంగేట్రం తర్వాత పుట్టిన క్రికెటర్‌తో..!
IND VS NZ 2nd ODI: భారత్-న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య క్వీన్స్టౌన్ వేదికగా జరిగిన రెండో వన్డే సందర్భంగా క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డు ఆవిష్కృతమైంది. మహిళల క్రికెట్లోనే కాకుండా పురుషుల క్రికెట్లోనూ ఎవ్వరికీ సాధ్యం కాని అత్యంత రేర్ ఫీట్‌ను భారత మహిళా జట్టు సారథి మిథాలీ రాజ్ సాధించింది. ఈ మ్యాచ్‌లో అజేయమైన అర్ధ శతకంతో(81 బంతుల్లో 66 నాటౌట్, 3 ఫోర్లు) రాణించిన మిథాళీ.. తన కంటే 21 ఏళ్ల చిన్నదైన, తన అంతర్జాతీయ ఆరంగ్రేటం తర్వాత నాలుగేళ్లకు పుట్టిన రిచా ఘోష్ (64 బంతుల్లో 65, 6 ఫోర్లు, ఒక సిక్స్)తో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో కనీవిని ఎరుగని రికార్డును తన పేరిట లిఖించుకుంది. Most 50+ scores by Indian captains against New Zealand in ODIs : 7* - Mithali Raj 6 - Md Azharuddin 6 - MS Dhoni 4 - Virat Kohli#NZvIND — Rhitankar Bandyopadhyay (@rhitankar8616) February 15, 2022 మిథాలీ రాజ్ 1999లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగ్రేటం చేయగా, రిచా ఘోష్ 2003లో జన్మించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ మిథాలీ రాజ్ ఖాతాలో పలు రికార్డులు వచ్చి చేరాయి. అంతర్జాతీయ క్రికెట్లో 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా, వన్డే క్రికెట్లో న్యూజిలాండ్‌పై అత్యధిక హాఫ్ సెంచరీలు(7) నమోదు చేసిన భారత కెప్టెన్‌గా, వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు(739) చేసిన టీమిండియా సారధిగా మిథాళీ పలు రికార్డులు నెలకొల్పింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్లు ధోని, కోహ్లిల రికార్డులను సైతం బద్దలు కొట్టింది. Most runs by Indian captains against New Zealand in ODIs : 739* - Mithali Raj 723 - MS Dhoni 678 - Md Azharuddin 487 - Virat Kohli Mithali has now scored more runs than any other Indian captains against NZ in ODIs.#NZvIND — Rhitankar Bandyopadhyay (@rhitankar8616) February 15, 2022 ఇదిలా ఉంటే, న్యూజిలాండ్ పర్యటనలో భారత మహిళల జట్టు వరుసగా రెండో వన్డేలోనూ ఓడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేయగా, న్యూజిలాండ్ వుమెన్స్ జట్టు 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అమిలియా కెర్(135 బంతుల్లో 119 నాటౌట్, 7 ఫోర్లు) అద్బుత సెంచరీతో కడదాకా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది. టీమిండియాలో కెప్టెన్ మిథాలీరాజ్, రిచా ఘోష్ అర్ధ సెంచరీలతో చెలరేగగా, ఓపెనర్ సబ్బినేని మేఘన 50 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసి ఆకట్టుకుంది. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో మూడో వన్డే ఫిబ్రవరి 18న జరగనుంది. -
రెండో వన్డేలోనూ టీమిండియా మహిళా జట్టు ఓటమి
న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా వుమెన్స్ జట్టు రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ అమిలియా కెర్ అద్భుత సెంచరీతో భారత మహిళల జట్టుకు ఓటమి తప్పలేదు. కాగా ఐదు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా వుమెన్స్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీరాజ్(81 బంతుల్లో 66 నాటౌట్, 3 ఫోర్లు), రిచా ఘోష్(64 బంతుల్లో 65, 6 ఫోర్లు, ఒక సిక్స్)తో రాణించారు. ఓపెనర్ సబ్బినేని మేఘన 49 పరుగులతో ఆకట్టుకుంది. న్యూజిలాండ్ బౌలర్లలో డివైన్ 2 వికెట్లు తీయగా.. అమిలా కెర్, ఫ్రాన్ జోనస్, రోస్‌మేరీ మెయిర్, జెస్ కెర్లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వుమెన్స్ 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అమిలియా కెర్(135 బంతుల్లో 119 నాటౌట్, 7 ఫోర్లు) అద్బుత సెంచరీతో కడదాకా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది. మిగతావారిలో మ్యాడీ గ్రీన్(61 బంతుల్లో 52,5 ఫోర్లు), సోఫి డివైన్ 33 పరుగులతో రాణించారు. టీమిండియా వుమెన్స్ బౌలర్లలో దీప్తి శర్మ 4, పూనమ్ యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్, రాజేశ్వరి గైక్వాడ్ తలా ఒక వికెట్ తీశారు. -
Ind Vs NZ: తొలి వన్డేలో నిరాశే... ప్చ్... మన మేఘన కూడా...
Ind W Vs NZ W 1st ODI - క్వీన్స్టౌన్: వన్డే సిరీస్‌నూ భారత మహిళల జట్టు పరాజయంతోనే ప్రారంభించింది. తొలి వన్డేలో భారత్ 62 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. కెపె్టన్ మిథాలీ రాజ్ (73 బంతుల్లో 59; 6 ఫోర్లు) రాణించినా పరాజయం తప్పలేదు. శనివారం జరిగిన ఈ పోరులో మొదట న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 275 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ సుజీ బేట్స్ (111 బంతుల్లో 106; 10 ఫోర్లు) శతక్కొట్టింది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, పూజా వ్రస్తాకర్, రాజేశ్వరి, దీప్తి శర్మ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 49.4 ఓవర్లలో 213 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి అంతర్జాతీయ వన్డే ఆడుతున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (4) నిరాశపరిచింది. యస్తిక (41; 4 ఫోర్లు), మిథాలీ మూడో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. వీళ్లిద్దరు ఔటయ్యాక మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోవడంతో భారత్ లక్ష్యానికి దూరమైంది. చదవండి: IPL Mega Auction 2022: రూ.15.25 కోట్లు.. ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు JENSEN STRIKES! @Jensen_Hayley digs one in and gets the wicket of Yastika Bhatia for 41. Good catch from @MaddyLGreen circling the boundary! Tune in LIVE to see the final quarter of our @kfcnz ODI on @sparknzsport 📲#NZvIND pic.twitter.com/jMzP5iW0LW — WHITE FERNS (@WHITE_FERNS) February 12, 2022 -
Ind W vs NZ W: ప్రపంచ కప్ సన్నాహకాలు.. కివీస్‌తో ఐదు వన్డేలు
Ind W vs NZ W ODI Series: మిథాలీరాజ్ సారథ్యంలోని భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్ మహిళలతో ఐదు వన్డేల సిరీస్‌లో తలపడుతోంది. క్వీన్స్‌టౌన్‌లో ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ‘అమెజాన్ ప్రైమ్’లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. బుధవారం జరిగిన ఏకైక టి20లో కివీస్ 18 పరుగులతో భారత్‌ను ఓడించింది. న్యూజిలాండ్‌తో తలపడనున్న భారత మహిళా జట్టు- షెడ్యూల్: మ్యాచ్‌లన్నీ క్వీన్టౌన్స్లోని జాన్ డెవిస్ ఓవల్ మైదానంలో జరుగనున్నాయి. ►మొదటి వన్డే: ఫిబ్రవరి 12- శనివారం ►రెండో వన్డే: ఫిబ్రవరి 15- మంగళవారం ►మూడో వన్డే: ఫిబ్రవరి 18- శుక్రవారం ►నాలుగో వన్డే: ఫిబ్రవరి 22- మంగళవారం ►ఐదో వన్డే: ఫిబ్రవరి 24- గురువారం చదవండి: IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 మెగా వేలం.. పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్! -
ICC Women's ODI Rankings: రెండో ర్యాంక్‌లో మిథాలీ
ICC Women ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన మహిళా బ్యాటర్స్ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియన్ బ్యాటర్ అలీసా హీలీ (750 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా.. మిథాలీ 738 పాయింట్లతో ఆమె తర్వాతి స్థానం ఆక్రమించింది. ఇక భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఐదు నుంచి నాలుగో స్థానానికి చేరింది. స్మృతి మంధాన ఆరో ర్యాంకులో మార్పులేదు. బౌలింగ్ విభాగంలో జులన్ గోస్వామి రెండో ర్యాంక్‌లో... ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ నాలుగో ర్యాంక్‌లో కొనసాగుతోంది. చదవండి: Icc U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా IPL 2022 Auction: వేలంలో మనవాళ్లు 23 మంది.. అంబటి, హనుమ విహారి, తన్మయ్, మనీశ్ రెడ్డి.. ఇంకా.. -
తెర మీదే అయినా... తగ్గేదే లే!
సినిమాలో ఆటా (డ్యాన్స్) పాటా హీరోయిన్లకు కామన్. అయితే సినిమాలో వేరే ఆట (స్పోర్ట్స్) ఆడాల్సి వస్తే! సినిమా ఆటే కదా అని తేలికగా తీసుకోరు. కెమెరా ముందే అయినా... తగ్గేదే లే! అంటూ విజృంభిస్తారు. తాప్సీ, అనుష్కా శర్మ, జాన్వీ కపూర్... ఈ ముగ్గురూ వెండితెరపై అసలు సిసలైన క్రికెటర్లు అనిపించుకోవడానికి శిక్షణ తీసుకున్నారు. ఆగేదే లే అంటూ బరిలోకి దిగారు. ఆ ఆట విశేషాలు తెలుసుకుందాం. గ్లామర్‌కి చిరునామా అనే తరహా పాత్రలు తాప్సీ చాలానే చేశారు. అయితే చాన్స్ వస్తే అందుకు భిన్నమైన పాత్రలు చేయడానికి వెనకాడరు. పింక్, నామ్ షబానా, సూర్మ, సాండ్ కీ ఆంఖ్, రష్మీ రాకెట్ తదితర హిందీ చిత్రాలతో కెరీర్ ఇన్నింగ్స్‌ని బ్రహ్మాండంగా తీసుకెళుతున్నారు తాప్సీ. ఇప్పటికే సూర్మ, సాండ్ కీ ఆంఖ్, రష్మీ రాకెట్ వంటి క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాల్లో నిరూపించుకున్నారు. ఇప్పుడు ‘శభాష్ మిథు’లో క్రికెటర్‌గా తెరపై దూసుకు రావడానికి రెడీ అయ్యారు. భారతీయ ప్రముఖ మహిళా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా కోసం మాజీ క్రికెటర్ నూషిన్ అల్ ఖదీర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు తాప్సీ. ‘‘నిర్భయంగా ఆడే ప్రతి క్రీడాకారుల వెనక ఓ నిర్భయమైన కోచ్ ఉంటారు. నాలోని బెస్ట్‌ని బయటికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు నూషిన్’’ అని గత ఏడాది టీచర్స్ డే సందర్భంగా తాప్సీ పేర్కొన్నారు. ఇక అచ్చంగా మిథాలీ రాజ్‌లా కనబడటం మీద కాదు కానీ ఆమెలా ఆడటం, ప్రవర్తించడం మీద ఎక్కువగా దృష్టి పెట్టామని కూడా తాప్సీ అన్నారు. ‘‘పోస్టర్ షూట్‌కి ముందు నేను మిథాలీ రాజ్‌తో మాట్లాడాను. పోస్టర్ చూశాక తనకూ, నాకూ పెద్దగా తేడా ఉన్నట్లు అనిపించలేదని మిథాలీ అన్నారు. సినిమా చూశాక కూడా ఆమె ఈ మాట అనాలని ఎదురు చూస్తున్నాను’’ అన్నారు తాప్సీ. వచ్చే నెల 4న ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు ఇటీవల ఈ చిత్రబృందం ప్రకటించింది. ఇక బాలీవుడ్లో ఉన్న మరో గ్లామరస్ హీరోయిన్ అనుష్కా శర్మ. తాప్సీలానే అనుష్క కూడా చాలెంజింగ్ రోల్స్ చేస్తుంటారు. ‘ఎన్‌హెచ్ 10, పరీ, సూయీ థాగా’ చిత్రాలు అందుకు ఓ ఉదాహరణ. 2017లో క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుని, నటనకు చిన్న బ్రేక్ ఇచ్చారు అనుష్కా శర్మ. ఇప్పుడు మళ్లీ నటించాలనుకుంటున్నారు. బ్రేక్ తర్వాత ఓ చాలెంజింగ్ రోల్‌తో ప్రేక్షకులకు కనిపించనున్నారు. భారత ప్రముఖ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్‌లో అనుష్క నటిస్తున్నారు. ‘చక్‌ద ఎక్స్‌ప్రెస్’ టైటిల్‌తో ప్రోసిత్ రాయ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాగా కాన్సెప్ట్ నచ్చి, ‘ఎన్‌హెచ్ 10’, ‘పరీ’లాంటి చిత్రాలను నిర్మించిన అనుష్కా శర్మ ‘చక్‌ద ఎక్స్‌ప్రెస్’ని కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చాలామందికి ఓ కనువిప్పు అని అనుష్కా శర్మ చెబుతూ – ‘‘మహిళలు క్రికెట్ ఆడటం అనేది పెద్ద విషయంగా అనుకుంటున్న సమయంలో ఝలన్ క్రికెటర్‌గా మారి, ప్రపంచ వేదికపై తన దేశం గర్వపడేలా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా ఆమె జీవితం గురించి మాత్రమే కాదు.. మహిళా క్రికెట్ గురించి కూడా చెబుతుంది. క్రికెట్ ఆడటం ద్వారా మహిళలకు ఓ మంచి కెరీర్ ఉండదనే ఆలోచనా ధోరణిని మార్చేందుకు ఝులన్ కృషి చేశారు. భారతదేశంలో మహిళా క్రికెట్లో విప్లవాత్మక మార్పులు చేసినందుకు ఝులన్, ఆమె సహచరులకు సెల్యూట్ చేయాలి’’ అన్నారు. ఇక.. ప్రాక్టీస్ అంటారా? ఇంట్లోనే మంచి క్రికెటర్ ఉన్నారు కాబట్టి.. క్రికెటర్ పాత్ర కోసం భర్త విరాట్ నుంచి అనుష్క టిప్స్ అడిగి తెలుసుకుని ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు తాప్సీ సినిమాల పరంగా స్కోర్ యాభైకి టచ్ అవుతుంటే అటు అనుష్కా శర్మ స్కోర్ పాతిక చిత్రాల వరకూ ఉంది. అయితే పట్టుమని పది సినిమాల స్కోర్ కూడా లేని జాన్వీ కపూర్ కూడా క్రికెట్ బ్యాట్‌తో నటిగా ప్రేక్షకుల నుంచి మంచి స్కోర్ దక్కించుకోవడానికి రెడీ అయ్యారు. దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ ‘ధడక్’ చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’ బయోపిక్‌ని జాన్వీ అంగీకరించడం విశేషం. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఎయిర్ ఫోర్స్‌లో తొలి మహిళా అధికారిగా పాల్గొన్న గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీ మెప్పించగలిగారు. ఇప్పుడు క్రికెట్ నేపథ్యంలో ఉన్న సినిమా సైన్ చేశారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ క్రికెటర్లుగా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు జాన్వీ. హెల్మెట్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను బుధవారం షేర్ చేసి, ‘‘క్రికెట్ క్యాంప్.. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’’ అని పేర్కొన్నారు జాన్వీ. శరన్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదల కానుంది. ‘శభాష్ మిథు’, ‘చక్‌ద ఎక్స్‌ప్రెస్’, ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ .. చిత్రాలపై మంచి అంచనాలు ఉన్నాయి. తాప్సీ, అనుష్కా శర్మ, జాన్వీ కపూర్ మంచి ఆర్టిస్టులే కాబట్టి వెండితెర క్రికెటర్లుగా ప్రేక్షకుల నుంచి మంచి స్కోర్ దక్కించుకుంటారని చెప్పొచ్చు. -
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
వెస్టిండీస్ వేదికగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్-2022కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు మిథాలీ రాజ్ నాయకత్వం వహించనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, తానియా భాటియా, రిచా ఘోష్ వికెట్ కీపర్ల లిస్ట్‌లో ఉన్నారు. ఇక ఈ మెగా టోర్నమెంట్ మార్చి 4న బే ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ తలపడనుంది. ఇక మార్చి 4న భారత్ తన తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా భారత్ ఈసారి టైటిల్ బరిలో హాట్ ఫేవరేట్ దిగనుంది. భారత జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన , షఫాలి వర్మ, యాస్తిక, దీప్తి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, ఝులన్, పూజ, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా (వికెట్ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్ స్టాండ్‌బై: ఎస్. మేఘన, ఏక్తా బిష్త్, సిమ్రాన్ దిల్ బహదూర్ చదవండి: SA Vs IND: ఎవరీ అల్లావుద్దీన్ పాలేకర్.. భారత్‌తో ఏంటి సంబంధం ? #TeamIndia squad for ICC Women's World Cup 2022 & New Zealand ODIs: Mithali Raj (C), Harmanpreet Kaur (VC), Smriti, Shafali, Yastika, Deepti, Richa Ghosh (WK), Sneh Rana, Jhulan, Pooja, Meghna Singh, Renuka Singh Thakur, Taniya (WK), Rajeshwari, Poonam. #CWC22 #NZvIND pic.twitter.com/UvvDuAp4Jg — BCCI Women (@BCCIWomen) January 6, 2022 -
Mithali Raj Birthday: మిరాకిల్ మిథాలీ
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ అంటే కేవలం పురుషులకేనా మాది కూడా అంటూ బౌండరీలు చెరిపేసి సవాల్ విసిరిన ధీర. కొడితే సిక్స్ కొట్టాలి అన్నట్టుగా తొలి టెస్ట్‌లోనే సెంచరీ. రికార్డుల మీద రికార్డులు. క్రికెట్‌ను ప్రేమించే ప్రతీ అమ్మాయికి ఆమె ఒక స్ఫూర్తి పతాక. భారత మహిళా క్రికెట్లో ఒక సంచలనం. మిథాలీ రాజ్ లేడీ టెండూల్కర్‌గా పాపులర్ అయిన మిథాలీ రాజ్ 39వ పుట్టినరోజు సందర్భంగా హ్యపీ బర్త్‌డే అంటోంది. మిథాలీ రాజ్అంటే పరుగుల వదర. రికార్డుల మీద రికార్డులుగుర్తుకొస్తాయి. భారతీయ మహాళా క్రికెట్‌కు ఆమెవిశేష సేవలందించారు. మి థాలీ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘శభాష్ మిథూ’ లో వెండితెర పిచ్ మీద మిథాలీ రాజ్‌గా హీరోయిన్ తాప్సీ నటిస్తోంది. వియాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్లో ‘శభాష్ మిథూ’ వచ్చే ఏడాది డిసెంబరు 4న థియేటర్లను పలకరించనుంది. -
మిథాలీ రాజ్ ర్యాంక్ యథాతథం..
ICC ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు మిథాలీ రాజ్, స్మృతి మంధాన స్థానాల్లో ఎటువంటి మార్పు లేదు. 738 రేటింగ్స్‌తో మిథాలీ మూడో స్థానంలో కొనసాగుతుండగా... 710 రేటింగ్స్‌తో స్మృతి ఆరో ర్యాంక్‌లో నిలిచింది. వీరిద్దరు మినహా మరో భారత బ్యాటర్ టాప్–10లో చోటు దక్కించుకోలేదు. బౌలింగ్ విభాగంలో టీమిండియా వెటరన్ పేసర్ జులన్ గోస్వామి రెండో స్థానంలో ఉంది. చదవండి: Trent Boult: బస్ డ్రైవర్‌ను హగ్ చేసుకున్న కివీస్ స్టార్ బౌలర్ -
వరల్డ్ కప్ 2022కి సిద్ధంగా ఉండండి: తాప్సీ
ఓ ప్రత్యేకమైన శైలీలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో ఉంది తాప్సీ పన్ను. తప్పడ్, హసీనా దిల్రూబా, రష్మీ రాకెట్ చిత్రాలతో అలరించింది ఈ పంజాబీ భామ. ఇప్పుడు శభాష్ మిథూ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలిపింది. శ్రీజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నారు. 'ఉదయయం 8 గంటలకు ఒక కల వచ్చింది. క్రికెట్ కేవలం జెంటిల్మెన్ గేమ్ అవ్వని రోజు ఒకటి వస్తుంది. నీలి రంగులో మహిళలు త్వరలో వచ్చేస్తారు అని తన అభిమానులకు తాప్సీ చెప్పింది. మాది ఒక టీమ్ అవుతుంది. దానికి ఒక గుర్తింపు వస్తుంది. నీలి రంగులో మహిళలు త్వరలో రాబోతున్నారు. వరల్డ్ కప్ 2022కి సిద్ధంగా ఉండండి' అని తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది తాప్సీ. View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) తాప్సీ పన్ను రష్మీ రాకెట్లో జెండర్ సమస్యలు ఎదుర్కొనే అథ్లెట్‌గా నటించింది. ఇప్పుడు మరో స్పోర్ట్స్‌కు సంబంధించిన చిత్రం శభాష్ మిథూలో లీడ్ రోల్ ప్లే చేయనుంది. మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపకిక్గా రూపొందిస్తున్నారు. 2005, 2007లో ప్రపంచ వరల్డ్ కప్ మహిళల క్రికెట్ జట్టుకు మిథాలీ నాయకత్వం వహించింది. 20 ఏళ్ల ఆటను పూర్తి చేసిన తర్వాత 2019లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. -
చరిత్ర సృష్టించనున్న మిథాలీ.. తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డు
Mithali Raj Becomes First Indian Woman Cricketer To Receive Khel Ratna Award: భారత మహిళా క్రికెట్ జట్టు టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించనుంది. క్రీడల్లో భారత దేశపు అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకోనున్న మొదటి మహిళా క్రికెటర్‌గా నిలువనుంది. గతంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు పురుష క్రికెటర్లను మాత్రమే వరించింది. 1998లో సచిన్ టెండూల్కర్, 2008లో ఎంఎస్ ధోని, 2018లో విరాట్ కోహ్లి, 2020లో రోహిత్ శర్మ ఈ అవార్డును అందుకున్నారు. కాగా, 22 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ కలిగిన 38 ఏళ్ల మిథాలీ.. 10 వేలకు పైగా పరుగులతో పాటు మరెన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకూ ఆమె 12 టెస్టులు, 220 వన్డేలు, 89 టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఇదిలా ఉంటే, ఈ అవార్డుకు మిథాలీతో పాటు టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ సహా మొత్తం 11 మంది క్రీడాకారులకు నామినేట్ అయ్యారు. వీరితో పాటు మరో 34 మంది ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ జాబితాలో టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ తదితరులు ఉన్నారు. చదవండి: నీరజ్ చోప్రా, లవ్లీనా, మిథాలీ రాజ్, పీఆర్ రాజేశ్... ఈసారి వీళ్లంతా.. -
నీరజ్ చోప్రా, లవ్లీనా, మిథాలీ రాజ్, పీఆర్ రాజేశ్... ఈసారి వీళ్లంతా..
Mithali And Neeraj Among 11 Recommended For Khel Ratna Award: ఒకవైపు ఒలింపిక్ పతక విజేతలు... మరోవైపు ముగ్గురు జాతీయ జట్ల కెప్టెన్లు... దేశ అత్యున్నత క్రీడా పురస్కారానికి తగిన అర్హత ఉన్న ఆటగాళ్లను ప్రభుత్వం సముచితంగా గౌరవించనుంది. ‘ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ అవార్డుకు ఒకేసారి 11 మంది పేర్లను ఎంపిక కమిటీ ప్రతిపాదించగా... వీటికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అధికారిక ఆమోద ముద్ర వేయడం లాంఛనం కానుంది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి అథ్లెట్ నీరజ్ చోప్రాకు ఊహించిన విధంగానే ‘ఖేల్‌రత్న’ చెంత చేరగా... సుదీర్ఘ కెరీర్లో జాతీయ జట్టుకు సేవలు అందించిన భారత ఫుట్‌బాల్, హాకీ, మహిళల క్రికెట్ జట్ల సారథులు సునీల్ ఛెత్రి, శ్రీజేశ్, మిథాలీ రాజ్‌లకు ఈ అవార్డు మరింత శోభ తెచ్చింది. తమ ప్రతిభతో దేశానికి పేరు తెచి్చన మరో 35 మంది పేర్లను ‘అర్జున’ అవార్డు కోసం కూడా సిఫారసు చేశారు. నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్) ప్రస్తుతం భారత్‌లో పరిచయం అవసరం లేని పేరు. ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పాల్గొనడమే గొప్ప విజయంగా ఇన్నాళ్లూ భావిస్తూ రాగా, ఏకంగా స్వర్ణ పతకంతో మెరిసి నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఐదేళ్ల క్రితం ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో మొదలైన ఈ జావెలిన్ త్రోయర్ విజయ ప్రస్థానం టోక్యోలో ఒలింపిక్స్ గోల్డ్ వరకు చేరింది. 2018లో ‘అర్జున’ అందుకున్న 24 ఏళ్ల నీరజ్ ఒలింపిక్ ప్రదర్శనకు ‘ఖేల్‌రత్న’ అవార్డు ఒక లాంఛనంలాంటిదే. సునీల్ ఛెత్రి ఫుట్‌బాల్ ప్రపంచంలో ఏమాత్రం గుర్తింపు లేకుండా ఎక్కడో మూలన మిణుకుమిణుకుమంటూ కనిపించే భారత జట్టుకు సుదీర్ఘ కాలంగా సునీల్ ఛెత్రి ఊపిరి పోస్తున్నాడు. 16 ఏళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఛెత్రి 120 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 80 గోల్స్ సాధించిన అతను ఇటీవలే దిగ్గజ ఫుట్‌బాలర్ లయోనల్ మెస్సీతో సమంగా నిలిచాడు. భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన, అత్యధిక గోల్స్ చేసిన ఛెత్రి... ఫుట్‌బాల్‌లో తొలి ‘ఖేల్‌రత్న’ కావడం విశేషం. 2011లో అతను ‘అర్జున అవార్డు’ గెలుచుకున్నాడు. రవికుమార్ దహియా (రెజ్లింగ్) టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన రజత పతకానికి దక్కిన గుర్తింపు ఇది. హరియాణాలోని సోనెపట్‌లో ‘మ్యాట్’ల నుంచి ఒలింపిక్ విజేతగా నిలిచే వరకు రవి తన పట్టుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒలింపిక్ విజయానికి ముందు 2019లో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సాధించిన కాంస్యం అతని అత్యుత్తమ ప్రదర్శన కాగా... రవికి ప్రభుత్వం తరఫున ఇదే తొలి పురస్కారం. ఒలింపిక్స్‌కు ముందే అతని పేరును ‘అర్జున’ అవార్డు కోసం ఫెడరేషన్ ప్రతిపాదించినా... టోక్యో విజయంతో అతని అవార్డు స్థాయి సహజంగానే పెరిగింది. లవ్లీనా (బాక్సింగ్) అసోంకు చెందిన 24 ఏళ్ల లవ్లీనా టోక్యో ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగంలో కాంస్యం సాధించి అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన లవ్లీనా వరుసగా రెండేళ్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్యాలు సాధించి ఒలింపిక్స్ దిశగా దూసుకెళ్లింది. గత ఏడాదే ఆమెకు ‘అర్జున’ పురస్కారం దక్కింది. తనకు లభించనున్న ‘ఖేల్‌రత్న’ అవార్డును తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్లు లవ్లీనా తెలిపింది. మిథాలీ రాజ్ (క్రికెట్) 22 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్... 10 వేలకు పైగా పరుగులు... ఒకటా, రెండా...అంకెలకు అందని ఎన్నో ఘనతలు భారత స్టార్ మిథాలీ రాజ్ అందుకుంది. భారత మహిళల క్రికెట్‌కు పర్యాయపదంగా మారి రెండు తరాల వారధిగా నిలిచిన మిథాలీ అమ్మాయిలు క్రికెట్లోకి అడుగు పెట్టేందుకు అసలైన స్ఫూర్తిగా నిలిచింది. 39 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్నెస్, ఆటతో కొనసాగడమే కాకుండా భారత టెస్టు, వన్డే జట్టు కెపె్టన్‌గా కూడా జట్టును నడిపిస్తోంది. 1999లో తొలి మ్యాచ్ ఆడిన ఈ హైదరాబాదీ కీర్తి కిరీటంలో ఎన్నో అవార్డులు, రివార్డులు చేరాయి. ఇప్పుడు ‘ఖేల్‌రత్న’ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలవడం సహజ పరిణామం. 2003లోనే ‘అర్జున’ అందుకున్న మిథాలీ సాధించిన ఘనతలకు ‘ఖేల్‌రత్న’ నిజానికి బాగా ఆలస్యంగా వచ్చినట్లే భావించాలి! భారత్ తరఫున మిథాలీ 12 టెస్టులు, 220 వన్డేలు, 89 టి20 మ్యాచ్‌లు ఆడింది. పీఆర్ శ్రీజేశ్ (హాకీ) భారత హాకీకి బలమైన ‘గోడ’లా నిలుస్తూ అనేక అంతర్జాతీయ విజయాల్లో శ్రీజేశ్ కీలకపాత్ర పోషించాడు. గోల్‌కీపర్‌గా అనేక ఘనతలు సాధించిన అతను జట్టు కెపె్టన్‌గా కూడా వ్యవహరించాడు. కేరళకు చెందిన శ్రీజేశ్ 244 మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన టీమ్‌లో అతను భాగస్వామి. అంతకుముందే కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్స్ ట్రోఫీ, చాంపియన్స్ ట్రోఫీలలో చిరస్మరణీయ విజయాలు సాధించిన జట్లలో శ్రీజేశ్ కూడా ఉన్నాడు. 2015లో అతనికి ‘అర్జున’ పురస్కారం లభించింది. ఐదుగురు పారాలింపియన్లకు ‘ఖేల్‌రత్న’ ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం సుమీత్ అంటిల్ (జావెలిన్ త్రో): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం అవని లేఖరా (షూటింగ్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం, రజతం కృష్ణ నాగర్ (బ్యాడ్మింటన్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం మనీశ్ నర్వాల్ (బ్యాడ్మింటన్): టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం చదవండి: న్యూజిలాండ్‌తో మ్యాచ్ అనంతరం పాక్ ఫ్యాన్స్ ఓవరాక్షన్.. ఏం చేశారో చూడండి..! -
టాస్ విషయంలో ధోని నుంచి చాలా నేర్చుకోవాలి
Need to learn from MS Dhoni To Win Toss.. టీమిండియా వుమెన్స్ కెప్టెన్‌గా మిథాలీ రాజ్ టాస్ నెగ్గిన సందర్భాల కంటే ఓడిపోయినవే ఎక్కువగా ఉన్నాయి. మిథాలీకి టాస్ విషయంలో ఏ మాత్రం కలిసిరాదని పలుమార్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఇంగ్లండ్‌తో జరిగిన పింక్‌బాల్ టెస్టులో మిథాలీ టాస్ ఓడిపోయింది. దీంతో మ్యాచ్ అనంతరం మిథాలీతో జరిగిన ఇంటర్య్వూలో మరోసారి టాస్ ప్రస్తావన వచ్చింది. దీనిపై మిథాలీ రాజ్ ఫన్నీవేలో స్పందించింది. టాస్ ఓడిపోవడం అనేది నా దృష్టిలో పెద్ద విషయం కాదు. అనవసరంగా దీనిని పెద్ద ఇష్యూ చేయడం నాకు ఇష్టం ఉండదు. కాల్ చెప్పడం వరకే నా బాధ్యత.. ఆ తర్వాత జరిగేది నా చేతుల్లో ఉండదు. అయితే టాస్ గెలవడం విషయంలో ధోని నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది. అని చెప్పుకొచ్చింది. చదవండి: Ind-W Vs Aus-W: 30 ఏళ్ల తర్వాత... తొలిసారిగా.. భారత్, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఏకైక డే–నైట్ ‘పింక్ బాల్’ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. మూడు దశాబ్దాల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’గా ముగించడం విశేషం. మ్యాచ్ చివరి రోజు ఆస్ట్రేలియాకు భారత్ 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 32 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 2 వికెట్లకు 36 పరుగులు చేసింది. ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో మరో 17 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 143/4తో చివరి రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 96.4 ఓవర్లలో 9 వికెట్లకు 241 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ గురువారం నుంచి మొదలవుతుంది. చదవండి: T20 World Cup 2021: హార్దిక్ పాండ్యాపై విశ్వాసం ఎక్కువ.. అతన్ని తొలగించరు! Talk about taking a cue from @msdhoni to win the toss 🙂🙂#TeamIndia | @M_Raj03 | #AUSvIND pic.twitter.com/kFtDHeuItW — BCCI Women (@BCCIWomen) October 3, 2021 -
Ind-W Vs Aus-W: 30 ఏళ్ల తర్వాత... తొలిసారిగా..
Ind W Vs Aus W Pink Ball Test: భారత్, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఏకైక డే–నైట్ ‘పింక్ బాల్’ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. మూడు దశాబ్దాల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’గా ముగించడం విశేషం. 1991 జనవరిలో సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్‌ను భారత్ చివరిసారి ‘డ్రా’ చేసుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల్లో భారత్ ఓడిపోయింది. తాజా టెస్టులో మ్యాచ్ చివరి రోజు ఆస్ట్రేలియాకు భారత్ 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 32 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 2 వికెట్లకు 36 పరుగులు చేసింది. ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో మరో 17 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 143/4తో చివరి రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 96.4 ఓవర్లలో 9 వికెట్లకు 241 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో.... 136 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 37 ఓవర్లలో 3 వికెట్లకు 135 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. షఫాలీ వర్మ (52; 6 ఫోర్లు), స్మృతి మంధాన (31; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన 25 ఏళ్ల స్మృతి మంధాన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ గురువారం నుంచి మొదలవుతుంది. Watch highlights from that innings here #AUSvIND https://t.co/7lk4fXLqmJ — cricket.com.au (@cricketcomau) October 3, 2021 The sides will have to settle for two points apiece after four tough days of Test cricket. #AUSvIND #PinkBallTest https://t.co/H6lNJOUhGR — cricket.com.au (@cricketcomau) October 3, 2021 -
IndW Vs AusW Pink Ball Test: భారత అమ్మాయిల ‘పింక్’ ఆట
గోల్డ్‌కోస్ట్: భారత మహిళల జట్టు ‘పింక్’ టెస్టుకు ‘సై’ అంటోంది. ఆ్రస్టేలియాతో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగే నాలుగు రోజుల టెస్టు నేటి నుంచి జరగనుంది. మిథాలీ రాజ్ బృందానికి డే–నైట్ టెస్టు కొత్తనుకుంటే... ఆసీస్‌తో ఆడటం కూడా ఒక రకంగా కొత్తే! ఎందు కంటే ఇరు జట్ల మధ్య సంప్రదాయ మ్యాచ్ జరిగి దశాబ్దంన్నరకాలం అవుతోంది. ఆఖరిసారిగా 2006లో ఇరు జట్లు టెస్టులో తలబడ్డాయి. మళ్లీ 15 ఏళ్ల తర్వాత ముఖాముఖీ టెస్టు పోరుకు ఇప్పుడు సిద్ధమయ్యాయి. కెపె్టన్ మిథాలీ రాజ్, వెటరన్ సీమర్ జులన్ గోస్వామి అప్పటి మ్యాచ్ ఆడారు. ఇప్పుడు వీళ్లిద్దరితో ఆడుతున్న వాళ్లంతా కొత్తవాళ్లే! ఇక మ్యాచ్ విషయానికొస్తే భారత్‌కు ఈ ఏడాది ఇది రెండో టెస్టు. ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఏకైక టెస్టులో మిథాలీ సేన చక్కని పోరాటస్ఫూర్తి కనబరిచింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా 2019లో యాషెస్ సిరీస్ ఆడాక మళ్లీ టెస్టులే ఆడలేదు. ఈ నేపథ్యంలో భారత అమ్మాయిలకు ఇంగ్లండ్‌తో టెస్టు అనుభవం పైచేయి సాధించేందుకు దోహదం చేయొచ్చు. జట్లు (అంచనా) భారత మహిళల జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, స్మృతి, పూనమ్ రౌత్/యస్తిక, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, తానియా, పూజ/శిఖా పాండే, జులన్, మేఘన, రాజేశ్వరి గైక్వాడ్. ఆ్రస్టేలియా మహిళల జట్టు: మెగ్ లానింగ్ (కెప్టెన్), అలీసా హీలీ, బెత్ మూనీ, ఎలీస్ పెర్రీ, తాలియా, యాష్ గార్డెనెర్, సదర్లాండ్, సోఫీ, వేర్హామ్, డార్సీ బ్రౌన్, స్టెల్లా. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటివరకు 9 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా 5 టెస్టుల్లో గెలుపొందగా, నాలుగు ‘డ్రా’గా ముగిశాయి. భారత్ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. -
టాప్ ర్యాంకు కోల్పోయిన మిథాలీ... అదరగొట్టిన ఝులన్ గోస్వామి
ICC ODI Rankings: భారత మహిళల వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తన టాప్ ర్యాంక్‌ను కోల్పోయింది. ఐసీసీ మంగళవారం ప్రకటించిన మహిళల వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో ఆమె అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో మిథాలీ విఫలం కావడం ఆమె ర్యాంక్‌పై ప్రభావం చూపింది. ఈ క్రమంలో మిథాలీ రాజ్ 738 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా... రెండో స్థానంలో ఉన్న లిజెల్లే లీ (దక్షిణాఫ్రికా) 761 పాయింట్లతో తొలి ర్యాంక్‌ను అందుకుంది. అదే విధంగా... భారత జట్టు మరో బ్యాటర్ స్మృతి మంధాన 710 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇక బౌలర్లలో ఝలన్ గోస్వామి 727 పాయింట్లతో రెండు స్థానాలు పురోగమించి.. ద్వితీయ స్థానానికి చేరుకుంది. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్‌లో భాగంగా ఝలన్ గోస్వామి 4 వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. బ్యాట్‌తోనూ సత్తా చాటిన ఆమె... ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్-10లో నిలిచింది. ఈ విభాగంలో గతంలో టాప్-4లో ఉన్న దీప్తి శర్మ.. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి పడిపోయింది. చదవండి: Unmukt Chand: అమెరికన్ లీగ్‌లో పరుగుల సునామీ సృష్టించిన మాజీ భారత బ్యాటర్ -
పోటీలో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే!
మెకాయ్: ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సి స్థితిలో మిథాలీ రాజ్ సారథ్యంలోని టీమిండియా నేడు జరిగే రెండో వన్డే (డే–నైట్)లో బరిలోకి దిగనుంది. చేతి బొటన వేలి గాయంతో రెండో వన్డేకు కూడా వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దూరమైంది. కొంతకాలంగా టీమ్ బ్యాటింగ్ భారాన్ని కెప్టెన్ మిథాలీ రాజ్ మాత్రమే మోస్తోంది. ఇకనైనా ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన తమ పేలవ ఫామ్‌కు ఫుల్స్టాప్ పెట్టి పరుగులు సాధించాల్సి ఉంది. ఇక బౌలింగ్‌లో మరోసారి జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్‌లు కీలకం కానున్నారు. 2018 నుంచి వన్డేల్లో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాను ఓడించాలంటే భారత్ అంచనాలకు మించి ఆడాల్సి ఉంది. కాగా తొలి వన్డేలో ఆసీస్ 9 వికెట్ల తేడాతో మిథాలీ సేనపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: T20 World Cup 2021: అలా జరిగితే అఫ్గాన్ జట్టును బహిష్కరిస్తాం.. ఐసీసీ వార్నింగ్ -
9 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం.. బౌలర్ అరుదైన రికార్డు
Australia Beats India By 9 Wickets: ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు ఓటమితో ఆరంభించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన మిథాలీ బృందం... ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో ఓడింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1–0తో ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 225 పరుగులు చేసింది. మిథాలీ రాజ్ (107 బంతుల్లో 63; 3 ఫోర్లు) వరుసగా ఐదో అర్ధ సెంచరీ సాధించింది. యస్తిక భాటియా (51 బంతుల్లో 35; 2 ఫోర్లు), రిచా ఘోష్ (29 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. 18 ఏళ్ల ఆసీస్ యువ పేసర్ డార్సీ బ్రౌన్ 4 వికెట్లు తీసింది. తద్వారా వన్డేల్లో నాలుగు వికెట్లు తీసిన అతి పిన్న ఆస్ట్రేలియా బౌలర్‌గా బ్రౌన్ ఘనతకెక్కింది. ఛేదనలో ఆస్ట్రేలియా 41 ఓవర్లలో వికెట్ మాత్రమే నష్టపోయి 227 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు రాచెల్ హేన్స్ (100 బంతుల్లో 93 నాటౌట్; 7 ఫోర్లు), అలెస్సా హీలీ (77 బంతుల్లో 77; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 126 పరుగులు జోడించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మెగ్ లానింగ్ (69 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు)తో కలిసి హేన్స్ జట్టుకు విజయాన్ని అందించింది. ఆసీస్ మహిళల టీమ్‌కు వన్డేల్లో ఇది వరుసగా 25వ విజయం కావడం విశేషం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా బ్రౌన్ నిలిచింది. రెండో వన్డే 24న ఇదే వేదికగా జరగనుంది. ‘టాప్’లోనే మిథాలీ మహిళల వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ మిథాలీ రాజ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఐసీసీ మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె 762 ర్యాంకింగ్ పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. స్మృతి మంధాన (7వ స్థానం) ర్యాంక్‌లో ఎటుంటి మార్పు లేదు. బౌలింగ్ విభాగంలో భారత వెటరన్ పేసర్ జులన్ గోస్వామి ఒక స్థానం మెరుగు పర్చుకుని నాలు గో స్థానంలో నిలిచింది. పూనమ్ యాదవ్ (భారత్) 9వ స్థానంలో ఉంది. ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ ఒక స్థానం పైకి ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచింది. చదవండి: KL Rahul: కేఎల్ రాహుల్ అరుదైన ఘనత.. గేల్ తర్వాతి స్థానంలో -
భారత మహిళల క్రికెట్ టీమ్‌కు శుభారంభం దక్కేనా!
మెకాయ్: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల చేతుల్లో ఎదురైన వన్డే సిరీస్ పరాభవాల తర్వాత భారత మహిళల జట్టు మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఆస్ట్రేలియా పర్యటనను నేడు జరిగే తొలి వన్డేతో భారత్ ఆరంభించనుంది. బొటనవేలి గాయంతో వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్‌కు దూరమైంది. 2018 మార్చి నుంచి ఆస్ట్రేలియాకు వన్డేల్లో ఓటమనేదే లేదు. ఈ మధ్య కాలంలో ఆ జట్టు 24 మ్యాచ్‌లు ఆడగా అన్నింటిలోనూ విజయం సాధించిది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాను ఓడించాలంటే భారత్ అన్ని విభాగాల్లోనూ విశేషంగా రాణించాలి. -
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్ ర్యాంక్‌లో మిథాలీ రాజ్
Mithali Raj: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. మిథాలి 762 పాయింట్లతో..దక్షిణాఫ్రికా ఓపెనర్ లిజెల్లీ లీ తో కలిసి ఉమ్మడిగా నెం1 స్థానంలో కొనసాగుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో లీ అజేయంగా 91 పరగులు సాధించి టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన అలిస్సా హీలీ మూడవ స్థానంలో ఉండగా, భారత ఓపెనర్ స్మృతి మంధాన తొమ్మిదో స్థానంలో నిలిచింది. బౌలర్లలో భారత పేసర్ జూలన్ గోస్వామి, సీనియర్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ వరుసగా ఐదవ, తొమ్మిదవ స్థానంలో నిలిచారు. ఆల్ రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ ఐదవ స్థానంలో కొనసాగుతోంది. . టీ 20 ర్యాంకింగ్స్‌లో భారత యువ సంచలనం షఫాలి వర్మ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుంది. చదవండి: T20 World Cup 2021: ‘ఆ రెండు జట్లే హాట్ ఫేవరేట్.. అయితే టీమిండియా కూడా’ -
Australia Tour: టీమిండియా వుమెన్స్‌లో కొత్తగా ముగ్గురికి చోటు
న్యూఢిల్లీ: త్వరలో ఆ్రస్టేలియా పర్యటనకు వెళ్లే మహిళల జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. మూడు ఫార్మాట్లకు మీడియం పేసర్ మేఘనా సింగ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ యస్తిక భాటియా ఎంపిక కాగా...టి20ల్లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రేణుకా సింగ్‌కు తొలి అవకాశం దక్కింది. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన అరుంధతీ రెడ్డిని టెస్టు, వన్డే జట్టునుంచి తప్పించి టి20ల్లో మాత్రం కొనసాగించారు. మిథాలీరాజ్ సారథ్యంలో 18 మంది సభ్యులతో కూడిన జట్టు ఏకైక (డే అండ్ నైట్) టెస్టు, 3 వన్డేలు, 3 టి20లు ఆడుతుంది. చదవండి: Finn Allen: వ్యాక్సిన్ రెండు డోసుల తర్వాత క్రికెటర్‌కు కరోనా పాజిటివ్ -
మిథాలీ రాజ్.. 16 ఏళ్లలో తొమ్మిదోసారి ‘టాప్’
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఆమె.. తన 16 ఏళ్ల వన్డే కెరీర్లో తొమ్మిదోసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. గతవారం ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ 30 పాయింట్లు కోల్పోవడంతో మిథాలీ తిరిగి అగ్రపీఠాన్ని అధిరోహించింది. పాక్‌తో జరిగిన 5 వన్డేల సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో 49, 21 పరుగులు మాత్రమే చేసిన స్టెఫానీ.. తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి ఐదో ప్లేస్‌లో నిలిచింది. 🔝 @M_Raj03 has regained her position as the No.1 batter on the @MRFWorldwide ICC Women's ODI Player Rankings. Full list: https://t.co/jxTLqOK1gm pic.twitter.com/oAHUTu4eRY — ICC (@ICC) July 20, 2021 కాగా, అంతకుముందు వారం పాక్‌తో జరిగిన తొలి వన్డేలో అజేయమైన సెంచరీ సాధించడం ద్వారా స్టెఫానీ గతవారం టాప్ ర్యాంక్‌కు చేరింది. మరోవైపు స్టెఫానీ ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఈ జాబితాలో ఆసీస్ ఆల్‌రౌండర్ ఎలైస్ పెర్రీ టాప్కు చేరుకుంది. ఇక బౌలింగ్ విభాగంలో కూడా స్టెఫానీ మూడు స్థానాలు దిగజారింది. మొత్తంగా స్టెఫానీ గతవారం జరిగిన పాక్ సిరీస్‌లో దారుణంగా విఫలం కావడంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన పట్టును కోల్పోయింది. ఇక టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ మంధాన కెరీర్ అత్యుత్తమ మూడో ర్యాంక్‌కు చేరుకుంది. -
టాప్ లేపిన మిథాలీ.. మూడేళ్ల తర్వాత అగ్రపీఠం కైవసం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్, యువ ఓపెనర్ షెఫాలీ వర్మ దుమ్ము లేపారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అద్భుతంగా రాణించిన మిథాలీ.. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడేళ్ల తర్వత మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా చిచ్చర పిడుగు షెఫాలీ టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన.. 701 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 💥 @M_Raj03 is the new No.1 💥In the latest @MRFWorldwide ICC Women's ODI Player Rankings for batting, the India skipper climbs to the 🔝 of the table.Full list: https://t.co/KjDYT8qgqn pic.twitter.com/2HIEC49U5i— ICC (@ICC) July 6, 2021 బౌలింగ్ విభాగంలో జూలన్ గోస్వామి(694 పాయింట్లు) 4వ స్థానంలో, పూనమ్ యూదవ్(617 పాయింట్లు) 9వ ర్యాంక్‌లో నిలిచారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బౌలర్లు జెస్ జొనాస్సెన్ (808 పాయింట్లు), మేఘన్ షట్(762 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండర్ల విభాగంలో టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తి శర్మ(331 పాయింట్లు) ఐదో ర్యాంకును దక్కించుకోగా.. మరిజన్నె కప్ (సౌతాఫ్రికా), ఎలిసా పెర్రి(ఆస్ట్రేలియా) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక, టీ20 ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బ్యాటింగ్ విభాగంలో ఇద్దరు భారత మహిళా బ్యాటర్లు టాప్ -10లో నిలిచారు. టీమిండియా చిచ్చర పిడుగు షెఫాలీ వర్మ 776 రేటింగ్ పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలువగా, మరో స్టార్ బ్యాటర స్మృతి మంధాన(693 పాయింట్లు) నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. ఈ ఫార్మాట్లోని బౌలింగ్ విభాగంలో భారత బౌలర్లు దీప్తి శర్మ 5వ ర్యాంక్‌లో, రాధా యాదవ్ 6వ స్థానంలో ఉన్నారు. ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి శర్మ.. 304 పాయింట్లతో ఐదో ర్యాంకులో ఉంది. -
నా పరుగుల దాహం తీరనిది: మిథాలీ రాజ్
వార్సెస్టెర్: రెండు దశాబ్దాలకుపైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పటికీ తన పరుగుల దాహం ఇంకా తీరలేదని భారత మహిళా స్టార్ క్రికెటర్, టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో రాణించి కెరీర్‌కు వీడ్కోలు పలుకుతానని తెలిపింది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత సారథి అద్భుత పోరాటపటిమతో జట్టును గెలిపించింది. ఈ క్రమంలోనే ఆమె అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా చరిత్ర పుటలకెక్కింది. మ్యాచ్ అనంతరం వర్చువల్ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ‘ఈ సుదీర్ఘ పయనం అంత సులువుగా సాగలేదు. ఎన్నో సవాళ్లు, మరెన్నో ఒడిదుడుకులు అన్నింటినీ తట్టుకున్నాను. అయినా ఎందుకనో... కొన్నిసార్లు వీడ్కోలు చెప్పాలని అనిపించిన ప్రతీసారి ఏదో శక్తి నన్ను బలంగా ముందుకు సాగేలా చేసింది. అందువల్లే 22 ఏళ్ల పాటు ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతూనే ఉన్నాను. ఇన్నేళ్లు ఆడినా కూడా నా పరుగుల దాహం, పరుగులు చేయాలనే తపన నానాటికీ పెరుగుతూనే ఉంది. టీమిండియాకు ఇంకా ఎన్నో విజయాలు అందించాలనే పట్టుదల అలాగే ఉంది. మారిన పరిస్థితులు, ప్రత్యర్థి బౌలర్ల ఎత్తుగడల నేపథ్యంలో బ్యాటింగ్‌లో మార్పుచేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు నేను వాటి మీదే దృష్టి పెట్టాను’ అని 38 ఏళ్ల మిథాలీ వివరించింది. తన స్ట్రయిక్ రేట్‌పై విమర్శించే వారితో తనకు పనిలేదని చెప్పింది. ‘గతంలో నేను ఎన్నోసార్లు ఇదే చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నా... నేనెపుడు విమర్శకుల్ని పట్టించుకోను. నా స్ట్రయిక్ రేట్‌పై వారి వ్యాఖ్యల్ని కూడా పరిగణించను. ఏళ్ల తరబడి ఆడతున్న నాకు వాళ్ల ధ్రువీకరణ అక్కర్లేదు. క్రీజులో బ్యాటింగ్ చేసే సమయంలో నాకు ఎదురయ్యే బౌలర్లపై కన్నేయాలి. షాట్ల ఎంపిక, బంతిని ఎక్కడకు పంపించి పరుగులు తీయాలనే అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇతరత్రా అంశాలతో నాకు పనిలేదు. నేనేంటో... నాపై జట్టు బరువుబాధ్యతలెంటో నాకే బాగా తెలుసు’ అని ఘాటుగా స్పందించింది. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టును ‘డ్రా’ చేసుకున్న భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌ను 1–2తో కోల్పోయింది. ఈ పర్యటనలో చివరిదైన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఈనెల 9న జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది. -
India vs England: మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు
వొర్సెస్టర్: స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో కెప్టెన్ మిథాలీ రాజ్ భారత మహిళల జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది. మిథాలీ అజేయ అర్ధ సెంచరీ (86 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు) సాధించడంతోపాటు చివరి వరకు క్రీజులో నిలిచి భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. దాంతో చివరిదైన మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ మహిళల జట్టుపై గెలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 219 పరుగులు చేసింది. నాట్ స్కివర్ (49; 5 ఫోర్లు), కెప్టెన్ హీతర్ నైట్ (46; 4 ఫోర్లు) రాణించారు. దీప్తి శర్మ 3 వికెట్లు తీసింది. లక్ష్యఛేదనలో భారత్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 46.3 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు స్మృతి మంధాన (49; 8 ఫోర్లు), షఫాలీ వర్మ (19; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. జెమీమా (4) విఫలమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (16), దీప్తి శర్మ (18; 1 ఫోర్) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరడంతో భారత్ గెలుపుపై అనుమానాలు తలెత్తాయి. అయితే అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న మిథాలీ... స్నేహ్ రాణా (22 బంతుల్లో 24; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 50 పరుగులు జోడించింది. చివర్లో స్నేహ్ అవుటవ్వగా... భారత విజయ సమీకరణం 6 బంతుల్లో 6 పరుగులుగా ఉంది. చివరి ఓవర్లో తొలి రెండు బంతులకు రెండు పరుగులు రాగా... మూడో బంతిని బౌండరీ బాదిన మిథాలీ భారత్‌కు విజయాన్ని కట్టబెట్టింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓడటంతో సిరీస్‌ను 1–2తో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. మిథాలీ మైలురాయి: ఈ మ్యాచ్ మిథాలీకి చిరస్మరణీయ మ్యాచ్ అయ్యింది. ఆమె వ్యక్తిగత స్కోరు 15 పరుగులకు చేరుకున్నపుడు మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా అవతరించింది. చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్; 10,273 పరుగులు) పేరిట ఉన్న రికార్డును మిథాలీ అధిగమించింది. ప్రస్తుతం మిథాలీ మూడు ఫార్మాట్లలో కలిపి 10,337 పరుగులు (11 టెస్టుల్లో 669; 217 వన్డేల్లో 7,304; 89 టి20 మ్యాచ్‌ల్లో 2,364 పరుగులు) చేసింది. -
రెండో వన్డేలోనూ ఓడిన మిథాలీ సేన..సిరీస్ ఇంగ్లండ్ వశం
టాంటన్: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కెప్టెన్ మిథాలీ రాజ్(92 బంతుల్లో 7 ఫోర్లతో 59) అర్ధశతకంతో రాణించినా.. భారత మహిళా జట్టుకు ఓటమి తప్పలేదు. బుధవారం అర్దరాత్రి దాటక ముగిసిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళలు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి, టీమిండియాపై 5 వికెట్లతో ఘన విజయం సాధించారు. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్నారు. తొలి వన్డేలో చిత్తుగా ఓడిన మిథాలీ సేన.. రెండో వన్డేలోనూ అదే తడబాటును కొనసాగించింది. చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన ఓపెనర్లు స్మృతి మంధాన(22), షెఫాలీ వర్మ(44) శుభారంభం అందించినా.. మిగతా బ్యాటర్లు దాన్ని అందిపుచ్చుకోలేకపోయారు. ఓవైపు నుంచి మిథాలీ రాజ్ పోరాడినా.. మరోవైపు ఆమెకు ఎవరూ అండగా నిలవలేదు. జెమీమా రోడ్రిగ్స్(8), హర్మన్ ప్రీత్ కౌర్(19), దీప్తీ శర్మ(5), స్నేహ్ రాణా(5), తానియా భాటియా (2), శిఖా పాండే(2) దారుణంగా విఫలమయ్యారు. చివర్లో టెయిలెండర్లు జూలన్ గోస్వామి(19 నాటౌట్), పూనమ్ యాదవ్(10) విలువైన పరుగులు సాధించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో కేట్ క్రాస్(5/34), సోఫీ ఎక్లెస్టోన్ (3/33) భారత్ పతనాన్ని శాసించారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 47.3 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసి 15 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. ఆ జట్టులో ఓపెనర్ లారెన్ విన్ఫీల్డ్ హిల్(42), లోయరార్డర్ బ్యాటర్లు సోఫియా డంక్లీ(73 నాటౌట్), కేథరీన్ బ్రంట్(33 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. జూలన్ గోస్వామి, శిఖా పాండే, స్నేహ్ రాణా తలో వికెట్ తీశారు. భారత్ పతనాన్ని శాసించిన కేట్ క్రాస్(5/34)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన చివరి వన్డే జులై 3న జరుగనుంది. -
‘ఖేల్‌రత్న’ బరిలో మిథాలీ
న్యూఢిల్లీ: భారత అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ ఖేల్‌రత్న’ కోసం భారత మహిళల టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ల పేర్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కేంద్ర క్రీడా శాఖకు ప్రతిపాదించింది. ‘అర్జున’ అవార్డు కోసం సీనియర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రాలను సిఫారసు చేసింది. గతేడాది కూడా ధావన్‌ను ప్రతిపాదించినప్పటికీ చివరకు అవార్డుల కమిటీ అతన్ని పక్కన బెట్టింది. హైదరాబాద్‌కు చెందిన 38 ఏళ్ల మిథాలీ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆమె మొత్తం 11 టెస్టుల్లో (669 పరుగులు), 215 వన్డేల్లో (7,170 పరుగులు), 89 టి20 మ్యాచ్‌ల్లో (2,364 పరుగులు) భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. మిథాలీతో పాటు అశ్విన్ ఇదివరకే ‘అర్జున’ పురుస్కారం పొందారు. 34 ఏళ్ల అశ్విన్ 79 టెస్టుల్లో 413 వికెట్లు, 111 వన్డేల్లో 150 వికెట్లు, 46 టి20 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు పడగొట్టాడు. ఫుట్‌బాల్ స్టార్ సునీల్ ఛెత్రి... భారత ఫుట్‌బాల్ స్టార్, కెప్టెన్ సునీల్ ఛెత్రి కూడా ‘ఖేల్‌రత్న’ ప్రతిపాదిత జాబితాలో ఉన్నాడు. ఈసారి కూడా ఈ జాబితా చాంతాడంత ఉంది. భారత అథ్లెటిక్స్ సమాఖ్య జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను సిఫారసు చేస్తే... ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్ప్రింటర్ ద్యుతీచంద్‌ను అత్యున్నత పురస్కారానికి నామినేట్ చేసింది. రెండుసార్లు యూరోపియన్ టూర్ టైటిల్స్ నెగ్గిన గోల్ఫర్ శుభాంకర్ శర్మ, నాలుగోసారి ఒలింపిక్స్‌కు అర్హత పొందిన టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ శరత్ కమల్... ‘షూటింగ్’ డబుల్ ట్రాప్‌లో ప్రపంచ టైటిల్ గెలిచిన అంకుర్ మిట్టల్, అంజుమ్ మౌద్గిల్‌లను వారి క్రీడా సమాఖ్యలు ‘ఖేల్‌రత్న’కు సిఫారసు చేశాయి. అన్ని ప్రతిపాదనలు స్క్రూటినీ చేశాక కేంద్ర ప్రభుత్వం నియమించిన అవార్డుల కమిటీ పురస్కార విజేతలను ఎంపిక చేస్తుంది. తెలుగమ్మాయి జ్యోతి సురేఖ కూడా... తెలుగమ్మాయి, మేటి ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ కూడా ‘రాజీవ్ ఖేల్‌రత్న’ జాబితాలో ఉంది. భారత ఆర్చరీ సంఘం సురేఖ ప్రతిభను గుర్తించి అత్యున్నత క్రీడాపురస్కారానికి సిఫారసు చేసింది. కాంపౌండ్ విభాగంలో పోటీపడే 24 ఏళ్ల సురేఖ ప్రపంచకప్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కలిపి మొత్తం 12 పతకాలు సాధించింది. -
రాజీవ్‌ఖేల్‌రత్న రేసులో అశ్విన్, మిథాలీ రాజ్
ఢిల్లీ: 2021 ఏడాదికి సంబంధించి క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌ఖేల్ రత్న అవార్డుకు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌లను సిఫార్సు చేస్తున్నట్లు బీసీసీఐ బుధవారం వెల్లడించింది. వీరితో పాటు కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, శిఖర్ ధావన్‌ల పేర్లను అర్జున అవార్డుకు సిఫార్సు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ కేంద్ర క్రీడాశాఖకు సిఫార్సు చేస్తు దరఖాస్తును పంపించింది. కాగా అశ్విన్, మిథాలీ రాజ్‌లు రాజీవ్‌ఖేల్‌రత్న అవార్డుకు అన్ని అర్హతలు ఉన్నాయని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా రవిచంద్రన్ అశ్విన్ కొన్ని రోజులుగా టెస్టుల్లో మంచి ఫామ్‌ను కనబరుస్తున్నాడు. 2019-21 డబ్ల్యూటీసీ టోర్నీలో భాగంగా అశ్విన్ 71 వికెట్లు తీసి తొలిస్థానంలో నిలిచాడు. టెస్టుల్లో టీమిండియా తరపున 400 వికెట్లకు పైగా తీసిన మూడో స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక మిథాలీ రాజ్ 22 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ను ఇటీవలే పూర్తి చేసుకుంది. ఐసీసీ ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లోనూ మిథాలీ రెండేళ్ల తర్వాత టాప్-5లోకి అడుగుపెట్టింది. కాగా గతేడాది రాజీవ్‌ఖేల్ రత్న అవార్డును టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: దుమ్మురేపిన మిథాలీ.. రెండేళ్ల తర్వాత
దుబాయ్: ఐసీసీ మంగళవారం ప్రకటించిన ఐసీసీ వుమెన్స్ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా వుమెన్స్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సత్తా చాటింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో 72 పరుగులతో ఆకట్టుకున్న మిథాలీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 5లోకి అడుగుపెట్టింది. 725 పాయింట్లతో మూడు స్థానాలు ఎగబాకిన ఆమె ఐదో స్థానంలో నిలిచింది. తాజాగా 22 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ను పూర్తి చేసుకున్న మిథాలీ 38 ఏళ్ల వయసులోనూ అద్భుత ఫామ్‌తో అదరగొడుతుంది. 2019 తర్వాత మిథాలీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్ 5లోకి అడుగుపెట్టడం విశేషం. ఇక బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లండ్‌కు చెందిన టామీ బ్యూమాంట్ 791 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌వుమన్ లిజీ లీ 758 పాయింట్లతో రెండో స్థానంలో, ఆసీస్‌కు చెందిన అలీసా హేలీ 756 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో టీమిండియా నుంచి జులన్ గోస్వామి 681 పాయింట్లతో తన ఐదో స్థానాన్ని నిలుపుకోగా.. ఆసీస్‌కు చెందిన జెస్ జోనాసన్, మేఘన్ స్కట్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక ఆల్‌రౌండ్ విభాగంలో టీమిండియా నుంచి దీప్తి శర్మ ఐదో స్థానంలో నిలవగా.. ఎలిస్సే పేరీ(ఆస్ట్రేలియా) తొలి స్థానంలో,మేరీజన్నే కాప్(దక్షిణాఫ్రికా), స్టాఫైన్ టేలర్(వెస్టిండీస్) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియా తొలి వన్డేలో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 34.5 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కాగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే రేపు(బుధవారం) జరగనుంది. అంతకముందు ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక డే నైట్ టెస్టు మ్యాచ్‌ను టీమిండియా డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ఐసీసీ అధికారిక ప్రకటన: టీ20 ప్రపంచకప్ టోర్నీ ఎప్పుడంటే.. ఊహించని విధంగా బౌన్సర్ వేశాడు.. దాంతో In the latest @MRFWorldwide ICC Women's ODI Player Rankings for batting: ↗️ @M_Raj03 enters top five ↗️ @natsciver moves up one spot Full list: https://t.co/KjDYT8qgqn pic.twitter.com/szonwdMmn9 — ICC (@ICC) June 29, 2021 -
సచిన్ రికార్డుపై కన్నేసిన మిథాలీ రాజ్
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత సుదీర్ఘ కాలం వన్డే క్రికెట్ ఆడిన రెండో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. 1999, జూన్ 26న అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఆమె.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే ద్వారా వన్డే క్రికెట్లో 22 వసంతాలు పూర్తి చేసుకొంది. ఈ క్రమంలో ఆమె సచిన్ రికార్డుపై కన్నేసింది. సచిన్.. 22 ఏళ్ల 91 రోజుల పాటు వన్డే క్రికట్లో కొనసాగగా, మిథాలీ మరో 90 రోజుల్లో ఆ రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. కాగా, కొంతకాలం క్రితమే పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన మిథాలీ.. టెస్ట్‌లు, వన్డే క్రికెట్లో కొనసాగుతుంది. వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచి క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తున్న ఆమె.. టీమిండియాను ఇప్పటి వరకు రెండు సార్లు వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్‌కు చేర్చింది. కాగా, 38 ఏళ్ల మిథాలీ.. వన్డేల్లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అత్యధిక మ్యాచ్‌లు(215), అత్యధిక పరుగులు(7170), అత్యధిక అర్ధసెంచరీలు(56) ఇలా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఓవరాల్‌గా 11 టెస్ట్‌లు, 215 వన్డేలు, 89 టీ20లు ఆడిన మిథాలీ.. 8 శతకాలు 77 అర్ధశతకాల సాయంతో 10000కుపైగా పరుగులను సాధించింది. చదవండి: యూరో కప్ నుంచి పోర్చుగల్ ఔట్.. రొనాల్డో భావోద్వేగం -
పరాజయంతో మొదలు...
బ్రిస్టల్: ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టులో స్ఫూర్తిదాయక ఆటతీరుతో ‘డ్రా’గా ముగించిన భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే సిరీస్‌ను మాత్రం పరాజయంతో ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టును ఓడించింది. 202 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బీమోంట్ (87 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్), సీవర్ (74 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్) అజేయ అర్ధ సెంచరీలు చేశారు. అబేధ్యమైన మూడో వికెట్‌కు 119 పరుగులు జోడించారు. మొదట భారత జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (108 బంతుల్లో 72; 7 ఫోర్లు) అర్థసెంచరీతో ఆకట్టుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన (10; 1 ఫోర్), షఫాలీ వర్మ (15; 3 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరగ్గా... పూనమ్ రౌత్ (32; 4 ఫోర్లు), దీప్తి శర్మ (30; 3 ఫోర్లు) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఎకిల్‌స్టోన్ 3, కేథరిన్ బ్రంట్, ష్రబ్సోల్ చెరో 2 వికెట్లు తీశారు. -
వన్డే సమరానికి ‘సై’
బ్రిస్టల్: ఏడేళ్ల తర్వాత ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో చక్కని పోరాటపటిమ కనబరిచిన భారత మహిళల జట్టు ఇప్పుడు అదే ఉత్సాహంతో వన్డే సమరానికి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని మిథాలీ సేన ఆశిస్తోంది. ఈ మ్యాచ్‌తో భారత టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ వన్డేల్లో అరంగేట్రం చేయనుంది. 2019లో టి20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన ఈ హరియాణా టాపార్డర్ బ్యాటర్ ఇంగ్లండ్ గడ్డపైనే ఇటీవల ఏకైక టెస్టు ఆడింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధసెంచరీ (96, 63)లతో అదరగొట్టిన షఫాలీ ఇప్పుడు వన్డే కెరీర్‌కు గొప్ప ప్రారంభం ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సొంతగడ్డపై ఇంగ్లండ్ క్లిష్టమైన ప్రత్యర్థి. కెప్టెన్ హెదర్‌నైట్, బీమోంట్‌లతో పాటు బ్యాటింగ్ ఆల్ రౌండర్లు సీవర్, సోఫియా రాణిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. బౌలింగ్‌లో కేట్ క్రాస్, ఎకిల్‌స్టోన్, ష్రబ్‌సోల్‌లతో ఈ విభాగం కూడా పటిష్టంగా ఉంది. ఇంగ్లండ్‌తో ఇప్పటివరకు 71 మ్యాచ్‌ల్లో తలపడిన భారత్ 30 మ్యాచ్‌ల్లో గెలిచింది. 37 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. -
సమరానికి సమయం...
ఇంగ్లండ్ గడ్డపై భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ ఒకవైపు... దీని గురించి సుదీర్ఘ చర్చోపచర్చలు సాగుతుండగా మరోవైపు సౌతాంప్టన్ నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో భారత మహిళల జట్టు ప్రశాంతంగా తమ సన్నాహాలు కొనసాగిస్తోంది. పురుషుల టీమ్‌తో పాటే ప్రయాణించి ఒకేసారి ఇంగ్లండ్ చేరిన మహిళలు డబ్ల్యూటీసీ ఫైనల్‌కంటే రెండు రోజుల ముందుగానే మైదానంలోకి దిగబోతున్నారు. నేటి నుంచి ఆతిథ్య జట్టుతో మిథాలీ బృందం తలపడే ఏకైక టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నాలుగు రోజుల ఈ పోరు ఎంత హోరాహోరీగా సాగుతుందనేది ఆసక్తికరం. భారత జట్టు తాము ఆడిన గత వరుస మూడు టెస్టుల్లో కూడా గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే నాలుగో విజయంతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలుస్తుంది. బ్రిస్టల్: ఏడేళ్ల విరామం తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. బుధవారం నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. 2014 తర్వాత భారత్ టెస్టులు ఆడనుండటం ఇదే తొలిసారి కాగా... ఈ మధ్య కాలంలో మూడు టెస్టులు ఆడిన ఇంగ్లండ్‌దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. అయితే గత పర్యటనలో ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించిన భారత జట్టును తక్కువగా అంచనా వేయలేం. సీనియర్లపైనే భారం... భారత్ ఈ ఏకైక టెస్టు కోసం 18 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ఇందులో 8 మందికి మాత్రమే గతంలో టెస్టు ఆడిన అనుభవం ఉండగా... అందరూ ఆడిన మ్యాచ్‌లు కలిపి 30 మాత్రమే. వన్డే, టి20 ఫార్మాట్ రెగ్యులర్ ప్లేయర్లు ఈ ఫార్మాట్లో అదే స్థాయి ఆటను ప్రదర్శించడం అంత సులువు కాదు. పైగా వీరందరూ కనీసం దేశవాళీ క్రికెట్లో కూడా నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడలేదు. ఈ నేపథ్యంలో ఎంతో కొంత సీనియర్లే మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. పదేసి టెస్టుల అనుభవం ఉన్న కెప్టెన్ మిథాలీ రాజ్, పేసర్ జులన్ గోస్వామి జట్టును ముందుండి నడిపించాలి. బ్యాటింగ్‌లో మిథాలీ కీలకం కానుంది. ఆమె బలమైన డిఫెన్స్ కూడా వికెట్ల పతనాన్ని అడ్డుకోగలదు. అయితే జులన్ చాలా కాలంగా బౌలింగ్‌లో సుదీర్ఘ స్పెల్‌లు వేయలేదు కాబట్టి ఎలా ఆడుతుందనేది చూడాలి. ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్‌లో హర్మన్ ప్రీత్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ కీలకం కానున్నారు. క్రీజ్‌లో కాస్త ఓపిక ప్రదర్శించి ఎక్కువ సమయం క్రీజ్‌లో గడపగలిగితే వీరిద్దరు పరుగులు రాబట్టగల సమర్థులు. దీప్తి శర్మ ఆల్‌రౌండ్ నైపుణ్యంతో పాటు ఓపెనర్‌గా పూనమ్ రౌత్ కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంది. స్పిన్నర్‌గా పూనమ్ యాదవ్‌కు కూడా తన సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశం. పేసర్లలో శిఖా పాండే, అరుంధతి రెడ్డిలలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది చూడాలి. అన్నింటికి మించి అందరి దృష్టి ఉన్న బ్యాటర్ షఫాలీ వర్మ. టి20లు మినహా కనీసం వన్డేల అనుభవం కూడా లేని షఫాలీని టెస్టులోకి ఎంపిక చేసింది ఆమె దూకుడైన ఆట కారణంగానే. షఫాలీ చెలరేగితే భారత్ పైచేయి సాధించగలదు. ఊహించినట్లుగానే ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఆశించినంత ప్రాక్టీస్ లభించలేదు. అయితే పరిమిత వనరులతోనే మెరుగ్గా ఆడగలమని జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. అనుభవజ్ఞులతో... 15 మంది సభ్యుల ఇంగ్లండ్ టెస్టు జట్టులో 11 మందికి టెస్టులు ఆడిన అనుభవం ఉంది. అందరూ కలిసి 47 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ఇంగ్లండ్ జట్టు ఆడిన గత మూడు టెస్టుల్లో బరిలోకి దిగిన వారంతా దాదాపుగా ప్రస్తుత జట్టులో ఉన్నారు. కెప్టెన్ హీతర్‌నైట్, నటాలీ స్కివర్, ఓపెనర్ బీమాంట్, ఆల్‌రౌండర్ బ్రంట్‌లకు తమకంటూ అంతర్జాతీయ మహిళా క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. పేసర్లు ష్రబ్సోల్, కేట్ క్రాస్‌లతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ అత్యంత ప్రభావవంతమైన బౌలర్‌గా పేరు సంపాదించుకుంది. వీరందరికీ ఒంటి చేత్తో మ్యాచ్‌ను శాసించగల సామర్థ్యం ఉంది. సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుండటంతో పాటు ఫిట్నెస్పరంగా కూడా వీరంతా మన జట్టు సభ్యులతో పోలిస్తే చాలా ముందంజలో ఉన్నారు. ఇన్నేళ్ల కెరీర్లో నేను చాలా తక్కువ టెస్టులే ఆడాననేది వాస్తవం. అయితే ఫార్మాట్ ఏదైనా సన్నాహాలు మాత్రం ఒకే తరహాలో ఉం టాయి. మేం అలాగే సిద్ధమయ్యాం. ఈ క్రమం లో అనేక మంది ఇతర క్రికెటర్ల సలహాలు, సూచనలు కూడా తీసుకున్నాం. జట్టులోని జూనియర్ సహచరులకు కూడా టెస్టులు ఎలా ఆడాలనేదాని గురించి మేం చెప్పాం. చాలా మందికి కొత్త కాబట్టి అనవసరపు ఒత్తిడి పెంచుకోవద్దని, స్వేచ్ఛగా ఆడుతూ క్రికెట్‌ను ఆస్వాదించాలని చెప్పాం. మున్ముందు జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లలో తప్పనిసరిగా కనీసం ఒక టెస్టు ఉంటే బాగుంటుందనేది నా సూచన. –మిథాలీ రాజ్, భారత కెప్టెన్ కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు 10 రోజులు బర్మింగ్హమ్: 2022 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్ పోటీలు జరిగే తేదీల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. టి20 ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్‌లను జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు నిర్వహిస్తారు. కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్‌కు చోటు కల్పించడం ఇదే మొదటిసారి. ఆగస్టు వరకు లీగ్ మ్యాచ్‌లు, ఆగస్టు 6న సెమీఫైనల్ జరగనుండగా...ఆగస్టు 7న ఫైనల్‌తో పాటు మూడో స్థానం కోసం పోరు నిర్వహిస్తారు. కామన్వెల్త్ క్రీడల్లో ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా అర్హత సాధించగా... ఆతిథ్య జట్టు హోదాలో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. ఒకే వెస్టిండీస్ జట్టుగా కాకుండా వేర్వేరు కరీబియన్ దేశాలు (ట్రినిడాడ్, జమైకా తదితర) పోటీ పడి వాటిలోంచి ఒక టీమ్, 2022 జనవరిలో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి మరో జట్టు అర్హత సాధిస్తాయి. -
టెస్టు క్రికెట్లో భారత మహిళల జట్టు ప్రదర్శన
మహిళల క్రికెట్లో తొలి టెస్టు మ్యాచ్ 1934లో జరిగితే భారత మహిళలు టెస్టు ఆడేందుకు మరో 42 ఏళ్లు పట్టింది. ఆట మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే ‘ఉమెన్ యాషెస్’ పేరుతో మహిళల టెస్టు ఫార్మాట్‌ను బ్రతికిస్తుండగా... ఒకదశలో వీటితో పోటీ పడిన న్యూజిలాండ్ కూడా 17 ఏళ్లుగా టెస్టు మ్యాచ్ ఆడనే లేదు. ముందుగా వన్డేలు, ఆపై టి20ల జోరులో సుదీర్ఘ ఫార్మాట్ మనుగడ సాగించడం కష్టంగా మారిపోతున్న తరుణంలో ఏడేళ్ల తర్వాత మన భారత మహిళల జట్టుకు మరో టెస్టు ఆడే అవకాశం దక్కింది. రేపటి నుంచి మిథాలీ రాజ్ బృందం ఇంగ్లండ్‌తో తలపడనున్న నేపథ్యంలో భారత టెస్టు క్రికెట్‌కు సంబంధించిన విశేషాలు.... గెలుపు పిలుపు.... 1. నవంబర్ 17–19, 1976 ప్రత్యర్థి: వెస్టిండీస్, వేదిక: పట్నా ఫలితం: 5 వికెట్లతో భారత్ విజయం తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 127 పరుగులకే కుప్పకూలింది. భారత్ 9 వికెట్లకు 161 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 88 పరుగులకే ఆలౌటైంది. 55 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. 2. మార్చి 19–22, 2002 ప్రత్యర్థి: దక్షిణాఫ్రికా, వేదిక: పార్ల్ ఫలితం: 10 వికెట్లతో భారత్ విజయం అంజుమ్ చోప్రా, అంజు జైన్, హేమలత, మిథాలీ, మమతా అర్ధ సెంచరీలతో భారత్ 9 వికెట్లకు 404 పరుగులకు డిక్లేర్ చేసింది. దక్షిణాఫ్రికా 150 పరుగులకే ఆలౌటైంది. ఫాలోఆన్‌లో దక్షిణాఫ్రికా జట్టు 266 పరుగులు చేసింది. 13 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి భారత్ ఈ ఏకైక టెస్టులో గెలిచి తొలిసారి సిరీస్ కూడా సొంతం చేసుకుంది. 3. ఆగస్టు 29–సెప్టెంబర్ 1, 2006 ప్రత్యర్థి: ఇంగ్లండ్, వేదిక: టాంటన్ ఫలితం: 5 వికెట్లతో భారత్ విజయం తొలి ఇన్నింగ్స్‌లో భారత్ చేసిన 307 పరుగులకు జవాబుగా ఇంగ్లండ్ 99 పరుగులకే ఆలౌటైంది. ఫాలోఆన్‌లో ఇంగ్లండ్ 305 పరుగులు సాధించగా ... 98 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. 4. ఆగస్టు 13–16, 2014 ప్రత్యర్థి: ఇంగ్లండ్, వేదిక: వామ్స్లీ ఫలితం: 6 వికెట్లతో భారత్ విజయం తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 92 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ 114 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 202 పరుగులు సాధించగా, భారత్ 181 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. 5. నవంబర్ 16–19, 2014 ప్రత్యర్థి: దక్షిణాఫ్రికా, వేదిక: మైసూరు ఫలితం: ఇన్నింగ్స్ 34 పరుగులతో భారత్ గెలుపు కామిని (192), పూనమ్ రౌత్ (130) సెంచరీలతో భారత్ 6 వికెట్లకు 400 వద్ద డిక్లేర్ చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 234, రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత జట్టు ఆడిన మొత్తం సిరీస్‌లు: 19 ఆస్ట్రేలియా చేతిలో 4, ఇంగ్లండ్, వెస్టిండీస్ చేతిలో ఒక్కో టెస్టులో భారత్ ఓడింది. 6 అత్యల్ప స్కోరు (వెస్టిండీస్‌పై, 1976–జమ్మూలో) 65 అత్యధిక వికెట్లు (డయానా ఎడుల్జీ–20 టెస్టుల్లో) 63 అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (నీతూ డేవిడ్, ఇంగ్లండ్‌పై, 1995–జంషెడ్పూర్) 8/58 సుధా షా (అత్యధిక టెస్టులు) 21 ప్రస్తుత జట్టులో అత్యధికంగా మిథాలీ రాజ్, జులన్ గోస్వామి ఆడిన టెస్టుల సంఖ్య. 2002లో వీరిద్దరు ఒకే మ్యాచ్ (ఇంగ్లండ్‌తో లక్నోలో) ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేశారు.10 ఆడిన టెస్టు మ్యాచ్‌ల సంఖ్య. ఇందులో 5 గెలిచిన భారత్ 6 ఓడింది. మరో 25 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.36 అత్యధిక స్కోరు (ఇంగ్లండ్‌పై, 2002–టాంటన్‌లో) 467 అత్యధిక పరుగులు (సంధ్యా అగర్వాల్–13 టెస్టుల్లో )110 అత్యధిక వ్యక్తిగత స్కోరు (మిథాలీ రాజ్; ఇంగ్లండ్‌పై, 2002–టాంటన్‌లో). భారత్ తరఫున ఇప్పటి వరకు 12 సెంచరీలు నమోదు కాగా... ఏకైక డబుల్ సెంచరీ ఇదే కావడం విశేషం. 214 శాంతా రంగస్వామి (కెప్టెన్‌గా ఎక్కువ టెస్టులు)12 -
మహిళా క్రికెట్‌కు మీడియా మద్దతు అవసరం..
ముంబై: ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల క్రికెట్‌కు మీడియా మద్దతు అవసరం ఎంతైనా ఉందని, అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్‌కు తానెప్పుడూ డుమ్మా కొట్టాలని అనుకోనని భారత మహిళల టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ మిథాలీ రాజ్ వెల్లడించారు. సమాజంలో మీడియా ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి క్రీడారంగానికి చెందిన వారందరూ తెలుసుకోవాలని ఆమె సూచించారు. క్రీడారంగానికి చెందిన వారెవరికైనా క్వారంటైన్లో గడపడం కష్టమేనని, ఒక్కసారి మైదానంలోకి అడుగుపెట్టాక ఆ కష్టాలు వాటంతటవే కనుమరుగవుతాయని ఒసాకాను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. మహిళా క్రికెట్ అభ్యున్నతి కోసం తనతో పాటు ప్రతి ఒక్క మహిళా క్రికెటర్ కలిసి రావాలని, ఈ క్రమంలో ప్రతి ఒక్కరు మీడియాతో హుందాగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. మీడియాతో మాట్లాడేది లేదంటూ టెన్నిస్ క్రీడాకారిణి నయోమి ఒసాకా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మిథాలీ ఈ మేరకు స్పందించారు. కాగా, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ ప్రపంచ నంబర్ 2 టెన్నిస్క్రీడాకారిణి ఒసాకా ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆమె తీసుకున్న నిర్ణయంతో అభిమానులందరూ నిరాశ చెందడమే కాకుండా, టోర్నీ కూడా కళావిహీనంగా మారిపోయింది. మీడియాతో మాట్లాడేది లేదంటూ, ప్రెస్ కాన్ఫరెన్స్‌ను బాయ్‌కాట్ చేసిన ఒసాకాకు ఆదివారం మ్యాచ్ రిఫరీ ఫైన్ విధించారు. ఈ నిర్ణయం వెలువడిన కొన్ని గంటలకే ఆమె ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. తాను సహజమైన పబ్లిక్ స్పీకర్‌ను కాకపోవడం వల్ల ప్రపంచ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు తీవ్రంగా ఆందోళన చెందుతానని, నిజానికి 2018 యూఎస్ ఓపెన్ నుంచి తాను కుంగుబాటులో ఉన్నానని, అందుకే మీడియా సమావేశానికి ఒప్పుకోలేదని ఆమె వివరణ ఇవ్వడం కొసమెరుపు. చదవండి: డీకే తిట్టుకున్న బ్యాట్‌తో తొలి ఫిఫ్టీ కొట్టిన రోహిత్.. -
Mithali Raj: వ్యక్తిగతం కాదు... సమష్టితత్వం ముఖ్యం
న్యూఢిల్లీ: దేశానికి ఆడేటప్పుడు వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు ఎలాంటి ప్రాధాన్యం ఉండదని మహిళల జట్టు టెస్టు, వన్డే సారథి మిథాలీ రాజ్ పేర్కొంది. చాన్నాళ్ల తర్వాత మహిళల జట్టు పూర్తిస్థాయి సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళుతోంది. వచ్చేనెల 16 నుంచి బ్రిస్టల్‌లో ఏకైక టెస్టు జరుగుతుంది. ఈ నేపథ్యం లో మిథాలీ మాట్లాడుతూ... ‘కోచ్ రమేశ్ పొవార్‌తో వివాదం గతంతో సమానం. నేను ఎన్నో ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నా. ఇక్కడ వ్యక్తిగతం పనికి రాదు. సమష్టితత్వమే కావాలి. 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో నేనెప్పుడూ వ్యక్తిగత ఇష్టాలకు విలువ ఇవ్వలేదు. జట్టు కోసమే ఆడాను. ఇకమీదట కూడా అంతే’ అని పేర్కొంది. ‘నా కెరీర్లో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. చేదు అనుభవాలూ ఉన్నాయి. కానీ అవన్నీ వెంట మోసుకెళ్లలేదు. వర్తమానమే జట్టుకు అవసరం. ఇప్పుడు కోచ్‌తో జట్టు ప్రయోజనాలపైనే చర్చించుకుంటాం. మిగతావి అప్రస్తుతం. ఇక్కడ మా ఇద్దరి లక్ష్యం జట్టును ముందుకు తీసుకెళ్లడమే. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడాక... ఆస్ట్రేలియాతో మరో టెస్టు ఆడనున్నాం. తొలిసారి డే–నైట్ టెస్టు ఆడనున్నాం. కెరీర్ ముగిసేలోపు డే–నైట్ టెస్టు ఆడతానని ఊహించలేదు. నా కల నిజమవుతున్నందుకు ఆనందంగా ఉంది’ అని మిథాలీ తెలిపింది. (చదవండి: ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్న టీమిండియా మాజీ సారధి) -
'మీరు చేస్తుంది గొప్ప పని.. అది నాకు కోపం తెప్పించింది'
ముంబై: దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ చాలా రాష్ట్రాలు లాక్డౌన్ పాటిస్తున్నాయి. చాలా మంది కరోనా బారీన పడుతూ తమ ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పలువురు టీమిండియా క్రికెటర్లు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు తమకు తోచినంత సాయం అందిస్తున్నారు. గతేడాది మిథాలీ రాజ్ లాక్డౌన్ సమయంలో పనులు లేక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆహారంతో పాటు నిత్యావసర సరుకులు అందించారు. కాగా ఈ ఏడాది మిథాలీ ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలకు దూరం కావడంతో.. ఆమె తండ్రి దొరై రాజ్ ఆ బాధ్యతను తాను పూర్తి చేసే పనిలో పడ్డారు. తాజాగా మిథాలీ రాజ్ తండ్రి దొరై రాజ్ ఆటోడ్రైవర్లకు నిత్యావసర సరుకులు అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి చేస్తున్న పనిని పొగుడుతూనే ఆయన మాస్క్ సరిగా ధరించనందుకు కోపం వచ్చిందని ట్విటర్లో తెలిపింది. '' నాన్న గతేడాది నేను చేసిన పనిని ఈసారి మీరు భుజానికి ఎత్తుకున్నారు. కష్టాల్లో ఉన్న వారికి ఫుడ్‌తో పాటు నిత్యావసరాలు అందించి అండగా నిలబడ్డారు. నాకోసం ఇదంతా చేస్తున్న నాన్న మాస్క్ మాత్రం సరిగా ధరించలేదు.. ఆ ఒక్క విషయంలో మాత్రం నాకు కోపంగా ఉంది.'' అంటూ ట్వీట్ చేసింది. కాగా టీమిండియా పరుషుల జట్టుతో పాటు మహిళల జట్టు ఒకేసారి ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనున్నాయి. జూన్ 2న బీసీసీఐ ఏర్పాటు చేయనున్న చార్టడ్ ఫ్లైట్‌లో ఇంగ్లండ్‌కు వెళ్లనున్నారు. కాగా టీమిండియా పురుషుల జట్టు జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా కివీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుంది. అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది. ఇదే సమయంలో టీమిండియా మహిళల జట్టు ఇంగ్లండ్‌తో ఒక టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. Distribution of food grains and a small amount for sustenance being given to auto drivers by the Mithali raj initiative, something I started last year to do my bit in these COVID times . Dad doing the honours in my absence. Only problem is his mask 😷🤦🏻♀️ pic.twitter.com/m53O4fpVKq — Mithali Raj (@M_Raj03) May 26, 2021 -
‘పింక్ టెస్టు’ బరిలో మహిళలు
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు తమ 45 ఏళ్ల టెస్టు మ్యాచ్ చరిత్రలో ఇప్పటి వరకు 36 టెస్టులు ఆడింది. జూన్ 16నుంచి ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ జట్టుకు 37వది అవుతుంది. దీని తర్వాత తొలి సారి మన టీమ్ మిథాలీ రాజ్ నాయకత్వంలో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ఆడటం ఖాయమైంది. సెప్టెంబర్ 30నుంచి పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగే ఏకైక టెస్టును ‘పింక్ బాల్’తో నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మహిళల క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా పింక్ బాల్ టెస్టు అవకాశం కల్పించినట్లు బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. ఆస్ట్రేలియాలో భారత మహిళల జట్టు పర్యటన షెడ్యూల్‌ను ఆసీస్ క్రికెట్ బోర్డు (సీఏ) ఖరారు చేసింది. సెప్టెంబర్ 19, 22, 24 తేదీల్లో వన్డేలు...అక్టోబర్ 7, 9, 11 తేదీల్లో టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ రెండింటి మధ్య ఏకైక టెస్టును నిర్వహిస్తారు. మహిళల క్రికెట్లో గతంలో ఒకే ఒక డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరిగింది. 2017లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య సిడ్నీలో జరిగిన ఈ టెస్టు డ్రాగా ముగిసింది. -
మిథాలీ రాజ్‌ను టార్గెట్ చేసి ఆ వ్యాఖ్యలు చేశాడా?
ఢిల్లీ: టీమిండియా ఉమెన్స్ క్రికెట్ మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్.. మహిళల జట్టులోనూ స్టార్ క్రికెటర్ల ఆధిపత్యం పెరిగిపోయిదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీసీసీఐ గత గురువారం రామన్ స్థానంలో రమేశ్ పొవార్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసిన క్రమంలో రామన్ తన గళం పెంచాడు. ఒకవైపు పొవార్‌కు ఆల్ ద బెస్ట్ చెబుతూనే, కొన్ని విమర్శలు చేశాడు. మహిళల క్రికెట్లో స్టార్ కల్చర్ పెరిగిపోయిందంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్కి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు. కాగా, ఈ వ్యాఖ్యలు భారత మహిళా క్రికెట్ జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను టార్గెట్ చేసినట్లే కనబడుతోంది. ''ఉమెన్స్ టీమ్‌లో కొంత మంది క్రికెటర్ల ఆధిపత్యం పెరిగిపోయింది. జట్టుకి మించి ఎవరూ ఎక్కువ కాకూడదనేది నా ఉద్ధేశం. ఇప్పటికైనా టీమ్‌లో స్టార్ కల్చర్‌కి స్వస్తి పలకాలని కోరుతున్నా’ అని రామన్ విమర్శించాడు. డబ్ల్యూవీ రామన్ 2018 డిసెంబర్లో మహిళల జట్టు కోచ్‌గా ఎంపికయ్యారు. కానీ గత రెండున్నరేళ్లలో కరోనా దెబ్బకు పెద్దగా మ్యాచ్‌లే జరగలేదు. 2020 మార్చిలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్... ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ తర్వాత ఏడాదిపాటు టీమ్ బరిలోకి దిగలేదు. గత మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 1–4తో... టి20 సిరీస్‌ను 1–2తో ఓడిపోయింది. ఇదే రామన్‌పై వేటుకు కారణం కావచ్చు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఒక సిరీస్‌లో ఓటమికి కోచ్‌ను బాధ్యుడిని చేయడం ఆశ్చర్యకరం. నిజానికి కోచ్‌గా రామన్‌కు మంచి గుర్తింపు ఉంది. టెక్నిక్‌పరమైన అంశాల్లో తమ ఆటతీరు ఆయన వల్లే మెరుగైందని భారత అమ్మాయిలు పలు సందర్భాల్లో చెప్పారు. ఇక రెండేళ్ల క్రితం కోచ్‌గా ఉన్న రమేశ్ పొవార్‌పై తీవ్రస్థాయిలో మిథాలీ రాజ్ ఆరోపణలు గుప్పించింది. ‘ఉద్దేశపూర్వకంగా నా కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు’ అంటూ పొవార్‌పై నిప్పులు చెరిగింది. దీనిపై పొవార్ కూడా గట్టిగా బదులిచ్చాడు. ఓపెనర్‌గా అవకాశం ఇవ్వకపోతే టోర్నీ మధ్యలో తప్పుకుంటానని మిథాలీ బెదిరించిందని, జట్టులో సమస్యలు సృష్టించిందని పొవార్ వ్యాఖ్యానించాడు. తదనంతర పరిణామాల్లో పొవార్‌ను కోచ్ పదవి నుంచి బోర్డు తప్పించింది. అయితే అదే పొవార్ మళ్లీ జట్టుకు ప్రధాన కోచ్‌గా రాగా.. మిథాలీ ఇప్పుడు వన్డే టీమ్ కెప్టెన్‌గా ఉంది. ఇప్పుడు రామన్ ఎవరు పేరు ప్రస్తావించకుండా స్టార్ కల్చర్ పెరిగిపోయిందంటూ రాసిన లేఖ మహిళా క్రికెట్ జట్టులో చర్చనీయాంశంగా మారింది. చదవండి: ఆమె బాధలో ఉంది.. బీసీసీఐ పట్టించుకోకపోవడం దారుణం రమేశ్ పొవార్‌కు బీసీసీఐ బంపర్ ఆఫర్.. రెండోసారి -
పొవార్ మళ్లీ వచ్చాడు...
దాదాపు రెండున్నరేళ్ల క్రితం భారత మహిళల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ రమేశ్ పొవార్. ఆ తర్వాత డబ్ల్యూవీ రామన్ ఆ స్థానంలోకి వచ్చాడు. ఇప్పుడు రామన్‌కు కొనసాగింపు ఇవ్వని బీసీసీఐ, ఇంటర్వ్యూ ద్వారా పొవార్‌కే మరో అవకాశం కల్పించింది. నాడు మిథాలీ రాజ్‌తో వివాదం తర్వాత పొవార్ తన పదవి పోగొట్టుకోగా... టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్ చేరిన తర్వాత కూడా రామన్‌కు మరో అవకాశం దక్కకపోవడం విశేషం. ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా రమేశ్ పొవార్ నియమితుడయ్యాడు. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్ సభ్యులుగా ఉన్న బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూ ద్వారా పొవార్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ పదవి కోసం 35 మంది పోటీ పడటం విశేషం. ఇందులో ఇప్పటి వరకు కోచ్‌గా వ్యవహరించిన డబ్ల్యూవీ రామన్‌తోపాటు హృషికేశ్ కనిత్కర్, అజయ్ రాత్రా, మమతా మాబెన్, దేవిక పల్షికర్, హేమలత కలా, సుమన్ శర్మ తదితరులు ఉన్నారు. ‘పొవార్ చాలా కాలంగా కోచింగ్‌లో ఉన్నాడు. జట్టు కోసం అతను రూపొందించిన విజన్ మాకు చాలా నచ్చింది. టీమ్‌ను అత్యున్నత స్థాయికి చేర్చేందుకు అతని వద్ద చక్కటి ప్రణాళికలు ఉన్నాయి. ఆటపై అన్ని రకాలుగా స్పష్టత ఉన్న పొవార్ ఇకపై ఫలితాలు చూపించాల్సి ఉంది’ అని ïసీఏసీ సభ్యుడు మదన్‌లాల్ వెల్లడించారు. 42 ఏళ్ల పొవార్‌ను ప్రస్తుతం రెండేళ్ల కాలానికి కోచ్‌గా నియమించారు. మహిళల సీనియర్ టీమ్‌తో పాటు ‘ఎ’ టీమ్, అండర్–19 టీమ్‌లను కూడా అతనే పర్యవేక్షించాల్సి ఉంటుంది. మిథాలీ రాజ్‌తో వివాదం తర్వాత... రమేశ్ పొవార్ కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత మహిళల జట్టు వరుసగా 14 టి20 మ్యాచ్‌లు గెలిచింది. అతడిని మొదటిసారి జూలై 2018లో జట్టుకు హెడ్ కోచ్‌గా తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ఆ తర్వాత అదే ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్‌లో జరిగిన టి20 ప్రపంచకప్ వరకు కాంట్రాక్ట్ పొడిగించారు. ఈ టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరింది. ఇంగ్లండ్ చేతిలో 8 వికెట్లతో భారత్ చిత్తుగా ఓడిన ఈ మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్ మిథాలీ రాజ్‌కు తుది జట్టులో స్థానం లభించలేదు. అయితే టోర్నీ ముగిశాక పొవార్‌పై మిథాలీ తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. ‘ఉద్దేశపూర్వకంగా నా కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు’ అంటూ పొవార్‌పై మిథాలీ నిప్పులు చెరిగింది. దీనిపై పొవార్ కూడా గట్టిగా బదులిచ్చాడు. ఓపెనర్‌గా అవకాశం ఇవ్వకపోతే టోర్నీ మధ్యలో తప్పుకుంటానని మిథాలీ బెదిరించిందని, జట్టులో సమస్యలు సృష్టించిందని పొవార్ వ్యాఖ్యానించాడు. తదనంతర పరిణామాల్లో పొవార్‌ను కోచ్ పదవి నుంచి బోర్డు తప్పించింది. టి20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన కలిసి పొవార్‌నే కొనసాగించమంటూ బీసీసీఐకి ప్రత్యేకంగా లేఖ రాసినా బోర్డు పట్టించుకోలేదు. రమేశ్ పొవార్ కెరీర్... ఆఫ్‌స్పిన్నర్‌గా భారత్ తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడిన రమేశ్ పొవార్ 40 వికెట్లు పడగొట్టాడు. ముంబైకి చెందిన పొవార్ ఫస్ట్ క్లాస్ కెరీర్లో 470 వికెట్లు, 4,245 పరుగులు ఉన్నాయి. ఐపీఎల్లో అతను పంజాబ్ కింగ్స్ ఎలెవన్, కొచ్చి టస్కర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కోచ్‌గా ఈసీబీ లెవల్–2 సర్టిఫికెట్ అతనికి ఉంది. మహిళల జట్టు కోచ్ పదవి నుంచి తప్పించిన తర్వాత ఎన్సీఏలో కోచ్‌గా పని చేసిన పొవార్ శిక్షణలోనే ముంబై ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో విజేతగా నిలిచింది. రామన్‌కు అవకాశం దక్కేనా? డబ్ల్యూవీ రామన్ 2018 డిసెంబర్లో మహిళల జట్టు కోచ్‌గా ఎంపికయ్యారు. కానీ గత రెండున్నరేళ్లలో కరోనా దెబ్బకు పెద్దగా మ్యాచ్‌లే జరగలేదు. 2020 మార్చిలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్... ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ తర్వాత ఏడాదిపాటు టీమ్ బరిలోకి దిగలేదు. గత మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 1–4తో... టి20 సిరీస్‌ను 1–2తో ఓడిపోయింది. ఇదే రామన్‌పై వేటుకు కారణం కావచ్చు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఒక సిరీస్‌లో ఓటమికి కోచ్‌ను బాధ్యుడిని చేయడం ఆశ్చర్యకరం. నిజానికి కోచ్‌గా రామన్‌కు మంచి గుర్తింపు ఉంది. టెక్నిక్‌పరమైన అంశాల్లో తమ ఆటతీరు ఆయన వల్లే మెరుగైందని భారత అమ్మాయిలు పలు సందర్భాల్లో చెప్పారు. జట్టు సభ్యులందరికీ రామన్‌పై గౌరవ మర్యాదలు ఉన్నాయి. జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత పురుషుల ద్వితీయ శ్రేణి జట్టుకు రామన్ కోచ్‌గా వెళ్లవచ్చని, అందుకే తప్పించారని వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఓకే కానీ లేదంటే సరైన కారణం లేకుండా కొనసాగింపు ఇవ్వకపోవడం మాత్రం బోర్డు నిర్ణయంపై సందేహాలు రేకెత్తించేదే. మిథాలీతో పొసగేనా... త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటన కోచ్‌గా పొవార్‌కు తొలి బాధ్యత. ఈ సిరీస్‌లో పాల్గొనే జట్టు ఎంపిక కోసం నీతూ డేవిడ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీతో పొవార్ సమావేశం కానున్నాడు. ఇప్పటికే టి20ల నుంచి తప్పుకున్న మిథాలీ రాజ్ వన్డేల్లో ఇప్పటికీ కీలక బ్యాటర్ కావడంతోపాటు కెప్టెన్‌గా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్ వరకు ఆడతానని కూడా ఆమె స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టూర్ కోసం ఆమె కెప్టెన్సీ నిలబెట్టుకోగలదా అనేది మొదటి సందేహం. భవిష్యత్తు పేరు చెప్పి ఆమెను తప్పించినా ఆశ్చర్యం లేదు. ఇక వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియా పర్యటన కూడా ఉంది. అంటే దాదాపు ఏడాది పాటు మిథాలీ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతోపాటు కోచ్‌తో కూడా సరైన సంబంధాలు కొనసాగించడం పెద్ద సవాల్. నాటి ఘటన తర్వాత ఇద్దరూ కలిసి పని చేయడం అంత సులువు కాదు. గతానుభవాన్ని బట్టి చూస్తే పొవార్ అనూహ్యంగా ఏదో ఒక రోజు జట్టు ప్రయోజనాల కోసం అంటూ మిథాలీని పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదు. ఇంటర్వ్యూ సందర్భంగా మిథాలీతో వివాదం గురించి కూడా పొవార్‌తో మాట్లాడినట్లు మదన్‌లాల్ చెప్పారు. ‘ఆ ఘటనలో తన తప్పేమీ లేదని, అందరు ప్లేయర్లతో కలిసి పని చేసేందుకు తాను సిద్ధమని పొవార్ స్పష్టం చేశాడు’ అని మదన్‌లాల్ వివరణ ఇచ్చారు. -
Mithali Raj: వన్డే వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు!
న్యూఢిల్లీ: తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో అందనిద్రాక్షగా ఉన్న వన్డే వరల్డ్‌కప్ టైటిల్ కోసం వచ్చే ఏడాది మరోసారి ప్రయత్నిస్తానని భారత మహిళా స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్ తర్వాత తాను ఆటకు వీడ్కోలు పలికే అవకాశాలున్నాయని ఈ హైదరాబాదీ క్రికెటర్ సంకేతాలు ఇచ్చింది. ‘అంతర్జాతీయ క్రికెట్లో 21 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. 2022 నా కెరీర్లో చివరి ఏడాది కావొచ్చు. కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాను. అయినప్పటికీ నా ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి కేంద్రీకరిస్తున్నాను. వయసు పెరుగుతున్నకొద్దీ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో నాకు తెలుసు’ అని శనివారం వర్చువల్‌గా జరిగిన ‘1971: ది బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ క్రికెటింగ్ గ్రేట్‌నెస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. ‘వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనేముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి. ఇప్పటి నుంచి ప్రతి సిరీస్ మాకు ముఖ్యమే. వరల్డ్‌కప్ కోసం పటిష్ట జట్టును రూపొందించే పనిలో ఉన్నాం. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మనం కొంచెం బలహీనంగా ఉన్నాం. సీనియర్ జులన్ గోస్వామి రిటైరైతే ఆమె స్థానాన్ని భర్తీ చేసేవారు కావాలి’ అని 38 ఏళ్ల మిథాలీ తెలిపింది. 1999లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన మిథాలీ రాజ్ ఇప్పటివరకు 10 టెస్టులు, 214 వన్డేలు, 89 టి20 మ్యాచ్‌లు ఆడింది. ప్రత్యర్థి జట్టుపై ఎప్పుడూ దూకుడుగా వ్యవహరించాలని... ఈ విషయంలో విరాట్ కోహ్లిని మిథాలీ రాజ్ బృందం ఆదర్శంగా తీసుకోవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ సూచించారు. -
స్మృతి, మిథాలీ ర్యాంక్‌లు యథాతథం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు స్మృతి మంధాన, మిథాలీ రాజ్ స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. 710 పాయింట్లతో స్మృతి ఏడో ర్యాంక్‌లో... 709 పాయింట్లతో మిథాలీ ఎనిమిదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో జులన్ గోస్వామి ఐదో ర్యాంక్‌లో, పూనమ్ యాదవ్ ఎనిమిదో ర్యాంక్‌లో, శిఖా పాండే పదో ర్యాంక్‌లో నిలిచారు. ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి శర్మ ఐదో స్థానంలో ఉంది. -
ఎదురులేని రైల్వేస్ జట్టు
రాజ్‌కోట్: దేశవాళీ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో తమకు ఎదురులేదని ఇండియన్ రైల్వేస్ జట్టు మరోసారి నిరూపించుకుంది. ఆదివారం ముగిసిన బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో మిథాలీ రాజ్ నాయకత్వంలోని రైల్వేస్ జట్టు 12వసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన రైల్వేస్ అన్నింట్లోనూ గెలిచి అజేయంగా నిలువడం విశేషం. ఇప్పటి వరకు ఈ టోర్నీ 14 సార్లు జరగ్గా... 12 సార్లు రైల్వేస్, ఒక్కోసారి ఢిల్లీ, బెంగాల్ జట్లు విజేతగా నిలిచాయి. జార్ఖండ్‌తో జరిగిన ఫైనల్లో రైల్వేస్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ సరిగ్గా 50 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఇంద్రాణి రాయ్ (49; 3 ఫోర్లు), మణి నిహారిక (39 నాటౌట్; 4 ఫోర్లు), దుర్గా ముర్ము (31; 3 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. రైల్వేస్ బౌలర్లలో స్నేహ్ రాణా మూడు వికెట్లు పడగొట్టగా, మేఘన సింగ్, ఏక్తా బిష్త్‌లకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. అనంతరం రైల్వేస్ 37 ఓవర్లలో మూడు వికెట్లకు 169 పరుగులు చేసి గెలిచింది. రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్ర అమ్మాయి సబ్బినేని మేఘన (53; 6 ఫోర్లు), పూనమ్ రౌత్ (59; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. స్నేహ్ రాణా (22 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడింది. జార్ఖండ్ బౌలర్లలో దేవయాని రెండు వికెట్లు తీసింది. -
మిథాలీ, పీవీ సింధులపై ప్రధాని మోదీ ప్రశంసలు
ఢిల్లీ: భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. మార్చి 8న ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్నామని, ఇదే నెలలో చాలామంది భారత మహిళా క్రిడాకారిణిలు తమ పేరిట సరికొత్త రికార్డులు నమోదు చేయడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. మన్ కీ బాత్ 75వ ఎపిసోడ్లో భాగంగా ఆదివారం ఆలిండియా రేడియోలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో విజేతలుగా నిలిచిన పలువురు మహిళల గురించి ప్రస్తావించారు. మహిళా క్రికెట్ చరిత్రలో 10 వేల పరుగుల మైలురాయిని దాటిన తొలి భారత క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ నిలిచారని, ఆమె సాధించిన విజయానికి తాను అభినందనలు తెలియజేస్తున్నానని ప్రధాని చెప్పారు. అదేవిధంగా పీవీ సింధు గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. సింధు అద్భుతమైన క్రీడా ప్రదర్శనలతో అనేక అవార్డులు అందుకున్నారని ప్రధాని గుర్తుచేశారు. మిథాలీ, సింధు ఇద్దరూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారని ఆయన కొనియాడారు. ఢిల్లీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్‌లోనూ మహిళలు పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచారని, బంగారు పతకాల జాబితాలోనూ భారత్ ముందంజలో ఉన్నదని ప్రధాని తెలిపారు. జనతా కర్య్ఫూ ప్రపంచానికి సూర్తి: ప్రధాని మోదీ 75వ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మోదీ ఏడాది పూర్తి చేసుకున్న జనతా కర్ఫ్యూపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనతా కర్య్ఫూ సందర్భంగా ప్రజలు చూపించిన క్రమశిక్షణ.. యావత్ ప్రపంచానికే ప్రేరణగా నిలిచిందన్నారు. దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కురువృద్ధులు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని ప్రధాని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో జయ్ చౌదరీ అనే వందేండ్ల వృద్ధుడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడని, యూపీలో 109 ఏండ్ల రామ్ దులయ్యా, ఢిల్లీలో 107 ఏండ్ల కేవల్ కృష్ణ కరోనా కరోనా టీకా వేయించుకున్నారని ప్రధాని చెప్పారు. చదవండి: 25 పతకాలతో టాప్‌లో.. చీఫ్ సెలెక్టర్ అయి ఉంటే.. అతన్ని తీసుకొచ్చేవాడిని -
మిథాలీ రాజ్ మరో అరుదైన ఘనత..
లక్నో: భారత్ మహిళల వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ మరో అరుదైన ఘనతను సాధించింది. ఇటీవల పదివేల అంతర్జాతీయ పరుగులు చేసిన రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచిన మిథాలీ.. ఇప్పుడు వన్డేల్లో 7వేల పరుగులు చేసిన తొలి బ్యాట్‌వుమెన్‌గా నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని అటల్ బిహారి వాజ్‌పేయి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో 26వ పరుగుల వద్ద మిథాలీ ఈ మైలురాయిని అందుకుంది.తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెట్ ఎడ్వర్డ్స్(5992), ఆస్ట్రేలియాకు చెందిన బెలిందా క్లార్క్ (4844) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ సెంచరీతో(104 పరుగులు నాటౌట్) మెరవగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ 55 పరుగులు చేసింది. 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 22వ ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 110 పరుగులు చేసింది. 38 ఏళ్ల మిథాలీ ఇటీవల ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలో 10వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా, తొలి భారతీయ వుమెన్ క్రికెటర్‌గా నిలిచింది. 1999లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మిథాలీరాజ్.. ఇప్పటి వరకు 213 వన్డే మ్యాచుల్లో.. 50.7 సగటుతో 7008 పరుగులు చేయగా.. ఇందులో ఏడు సెంచరీలు, 54 అర్ధసెంచరీలు సాధించింది. చదవండి: జెర్సీ 18.. జెర్సీ 22.. నిజంగా అద్బుతం -
టీమిండియా తొలి ఉమెన్ క్రికెటర్‌గా
లక్నో: టీమిండియా ఉమెన్స్ వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి టీమిండియా ఉమెన్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. అలాగే అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఈ ఫీట్‌ను అందుకున్న రెండో క్రికెటర్‌గా రికార్డు అందుకుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరగుతున్న మూడో వన్డేలో మిథాలీ ఈ ఘనతను అందుకుంది. ఇన్నింగ్స్ 28వ ఓవర్లో అన్నే బోస్క్ వేసిన బంతిని బౌండరీగా మలిచిన మిథాలీ ఈ ఫీట్‌ను చేరుకుంది. మొత్తంగా చూసుకుంటే మిథాలీ రాజ్ ఇప్పటివరకు 10 టెస్టుల్లో 663 పరుగులు, 210 వన్డేల్లో 6938 పరుగులు, 89 టీ20ల్లో 2364 పరుగులు సాధించింది. ఇందులో వన్డేల్లో 7 సెంచరీలు చేయగా.. టెస్టుల్లో 1 సెంచరీ సాధించింది. కాగా ఇప్పటివరకు అంతర్జాతీయ కెరీర్లో అన్ని ఫార్మాట్లు కలిపి 10వేల పరుగులు సాధించిన మహిళ క్రికెటర్‌గా ఇంగ్లండ్‌కు చెందిన చార్లెట్ ఎడ్వర్డ్స్ తొలి స్థానంలో ఉంది. ఇంగ్లండ్ తరపున ఎడ్వర్డ్స్ 23 టెస్టుల్లో 1676 పరుగులు, 191 వన్డేల్లో 5992 పరుగులు, 95 టీ20ల్లో 2605 పరుగులు సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ 77 పరుగులతో రాణించగా.. మిథాలీ, హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ 36 పరుగులతో రాణించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 4 ఓవర్లలో వికెట్లు కోల్పోకుండా 8 పరుగులు చేసింది. చదవండి: త్రో వేయడంలో కన్ఫ్యూజన్.. అసలు మజా అక్కడే పంత్‌ను వదిలేశాం.. మీరు వదిలేస్తే మంచిది: రోహిత్ Congratulations, Mithali Raj 👏 A modern-day legend. pic.twitter.com/XyI89zWL47 — ICC (@ICC) March 12, 2021 -
చెలరేగిన స్మృతి మంధాన.. దక్షిణాఫ్రికా చిత్తు
లక్నో: తొలి వన్డేలో ఎదురైన పరాజయం నుంచి భారత మహిళల క్రికెట్ జట్టు వెంటనే తేరుకుంది. రెండో వన్డేలో దక్షిణాఫ్రికాను ఆల్‌రౌండ్ ప్రదర్శన తో దెబ్బకొట్టి సిరీస్‌లో సమంగా నిలిచింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించింది. బౌలింగ్‌లో వెటరన్ సీమర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జులన్ గోస్వామి (4/42) దక్షిణాఫ్రికాను వణికించగా... తర్వాత బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (64 బంతుల్లో 80 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగింది. స్మృతికి పూనమ్ రౌత్ (89 బంతుల్లో 62 నాటౌట్; 8 ఫోర్లు) తోడుగా నిలిచింది. దాంతో భారత్ 28.4 ఓవర్లలో కేవలం వికెట్ నష్టపోయి 160 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. ఛేజింగ్‌లో వరుసగా పది అర్ధ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా స్మృతి గుర్తింపు పొందింది. అంతకుముందు టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 41 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు లిజెల్లి లీ (4), వోల్వర్డ్ (9) జట్టు స్కోరు 20 పరుగులకే వెనుదిరిగారు. ఈ దశలో లారా గుడ్‌ఆల్ (49; 2 ఫోర్లు), సునే లూస్ (36; 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించాక కెప్టెన్ లూస్‌ను మాన్సీ జోషి అవుట్ చేసింది. అక్కడి నుంచి భారత బౌలర్లు పట్టుబిగించారు. కేవలం 58 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లను పడేశారు. లూస్, గుడ్‌ఆల్ తర్వాత ఇంకెవరూ భారత బౌలింగ్‌కు అసలు క్రీజులో నిలిచే సాహసం చేయలేకపోయారు. స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ 3, మాన్సి జోషి 2 వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ (9) తక్కువ స్కోరుకే వెనుదిరగగా... స్మృతి, పూనమ్ రౌత్‌తో కలిసి అబేధ్యమైన రెండో వికెట్‌కు 138 పరుగులు జోడించడంతో భారత్ విజయం ఖాయమైంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే షబ్నిమ్ బౌలింగ్‌లో స్మృతి రెండు వరుస సిక్సర్లతో ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో స్మృతి 46 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆమెకు అండగా నిలిచిన పూనమ్ రౌత్ 79 బంతుల్లో ఫిఫ్టీని అధిగమించింది. ఐదు వన్డేల సిరీస్ 1–1తో సమంగా ఉండగా... మూడో వన్డే శుక్రవారం ఇదే వేదికపై జరుగుతుంది. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో ఆడటం ద్వారా అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా మిథాలీ రాజ్ గుర్తింపు పొందింది. 1999లో అరంగేట్రం చేసిన మిథాలీ ఇప్పటివరకు 310 మ్యాచ్‌లు (10 టెస్టులు+211 వన్డేలు+82 టి20లు) ఆడింది. 309 మ్యాచ్‌లతో (23 టెస్టులు+191 వన్డేలు+95 టి20లు) చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) పేరిట ఉన్న రికార్డును మిథాలీ అధిగమించింది. -
దక్షిణాఫ్రికాతో సిరీస్: భారత జట్టు ఇదే
ముంబై: దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్‌కు కెప్టెన్ మిథాలీ రాజ్, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సభ్యుల పేర్లను శనివారం వెల్లడించింది. కాగా ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో గల భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా అంతర్జాతీయ స్టేడియంలో భారత- సౌతాఫ్రికా మహిళా జట్లు తలపడనున్నాయి. మొత్తంగా 8 మ్యాచ్‌లను ఇక్కడే నిర్వహించనున్నారు. మార్చి 7 నుంచి 17 వరకు వన్డే సిరీస్, మార్చి 20-23 వరకు టీ20 సిరీస్ జరుగనుంది. కాగా తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి టీ20 జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. వన్డే సిరీస్ జట్టు: మిథాలీ రాజ్(కెప్టెన్), స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగస్, పూనం రౌత్, ప్రియా పునియా, యస్తిక భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్(వైస్ కెప్టెన్), డి. హేమలత, దీప్తి శర్మ, సుష్మా వర్మ(వికెట్ కీపర్), శ్వేత వర్మ(వికెట్ కీపర్), రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, ఝులన్ గోస్వామి, మాన్సి జోషి, పూనం యాదవ్, సి. ప్రత్యూష, మోనికా పటేల్. టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలి వర్మ, జెమీమా రోడ్రిగస్, దీప్తి శర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, సుష్మా వర్మ(వికెట్ కీపర్), నుజత్ పర్వీన్(వికెట్ కీపర్), ఆయుషి సోని, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, పూనం యాదవ్, మాన్సి జోషి, మోనికా పటేల్, సి. ప్రత్యూష, సిమ్రన్ దిల్ బహదూర్. చదవండి: కీలకమైన నాల్గో టెస్టు నుంచి వైదొలిగిన బుమ్రా -
బ్యాట్ పట్టిన బ్యూటీ.. వీడియో వైరల్
హీరోయిన్ తాప్సీ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న ‘రష్మీ రాకెట్’ మూవీ షూటింగ్ ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తాప్సీకి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తాప్పీ క్రికెట్ బ్యాట్ పట్టుకొని నెట్ ప్రాక్టిస్ చేస్తున్నారు. వైవిధ్యమైన చిత్రాల్లో నటించే తాప్సీ.. సినిమా కోసం ఎలాంటి విద్యనైనా నేర్చుకోవడంలో ముందుంటారు. ఆమె నటిస్తున్న మరో చిత్రం ‘షాబాష్ మిథు’. ఈ మూవీలో ఆమె భారత మహిళ క్రికెట్ ప్లేయర్ మిథాలి రాజ్ పాత్రలో కనిపించనున్నారు. అందుకోసం తాప్సీ క్రికెట్లో శిక్షణ తీసుకుంటూ బ్యాటింగ్ మెలకువలు నేర్చుకుంటున్నారు. ఈ సినిమాలో క్రికెట్ ప్లేయర్ మిథాలి రాజ్ బయోపిక్‌గా తెరకెక్కనుంది. క్రికెట్ శిక్షణకు సంబంధించిన తాప్సీ ఫొటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. ఆమె శిక్షణ వారం రోజులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆమెకు నూషిన్ అల్ ఖదీర్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆమె తన కొత్తం చిత్రం ‘లూప్ లపేటా’ చిత్రీకరణలో పాల్గొన్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: బాయ్‌ఫ్రెండ్ గురించి నోరువిప్పిన తాప్సీ -
ఇన్‌స్టాలో దుమ్మురేపిన టీమిండియా
ముంబై: టీమిండియా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు స్థాయిలో 16 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించి సత్తా చాటింది. టీమిండియా మెన్స్‌తో పాటు ఉమెన్స్ క్రికెట్ కలిపి ఈ ఫాలోవర్స్‌ను సాధించడం విశేషం. ఈ స్థాయిలో ఫాలోవర్స్ పెరగడానికి ప్రధాన కారణం ఆసీస్ పర్యటనే అని చెప్పొచ్చు. ఆసీస్ గడ్డపై టీమిండియా వీరోచిత ప్రదర్శన చేసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవడంతో టీమిండియాకు ఎనలేని క్రేజ్ వచ్చింది. చదవండి: ఒక్క టెస్ట్.. 3 రికార్డులు.. కోహ్లికి మాత్రమే డిసెంబర్ నుంచి టీమిండియాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరాధించేవాళ్లు బాగా పెరిగారు. టీమిండియా యువ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్ హీరోలుగా మారిపోవడం.. సీనియర్లు పుజారా, రహానే, రోహిత్‌లకు విపరీతమైన ఫాలోయింగ్ పెరగడమే దీనికి కారణం. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ టీమిండియా అఫీషియల్ పేజీలో పోస్టును రాసుకొచ్చింది. 'ఇన్‌స్టాలో మాకు పెద్ద ఫ్యామిలీ లభించింది. దాదాపు 16 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.. ఇట్స్ ఏ బిగ్ ఫ్యామిలీ.. మీ ప్రేమకు, అభిమానానికి, మద్దతుకు మనస్సూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం' అంటూ క్యాప్షన్ జత చేశారు. ఇండియన్ క్రికెట్ టీమ్ రిలీజ్ చేసిన ఫోటోలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు టీమిండియా ఉమెన్స్ కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, పుజారా, రహానే, అశ్విన్‌తో పాటు పలువురి ఫోటోలు ఉన్నాయి. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా టీమిండియా ఫిబ్రవరి 5వ తేదీ నుంచి చెన్నై వేదికగా తొలి టెస్టు ఆడనున్న సంగతి తెలిసిందే.చదవండి: షమీకి భార్య హసీన్ జహాన్ మరో షాక్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
అది నా అదృష్టం
మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా ‘శభాష్ మిథు’ అనే చిత్రం తెరకెక్కనుంది. తాప్సీ టైటిల్ రోల్లో కనిపిస్తారు. ‘ఈ సినిమా చేయడం నా అదృష్టంలా భావిస్తున్నాను’ అన్నారు తాప్సీ. ‘శభాష్ మిథు’ చేయడం గురించి తాప్సీ మాట్లాడుతూ– ‘ఈ సినిమా చేయడంలో రెండు రకాల సవాళ్లు ఉన్నాయి. మొదటిది క్రికెట్. నాకు క్రికెట్ ఆడటం రాదు. ప్రొఫెషనల్ ప్లేయర్లా ఆడటం నేర్చుకోవాలి. రెండవది మిథాలీ రాజ్‌లా స్క్రీన్ మీద కనిపించాలి. మిథాలీ వ్యక్తిత్వం నా వ్యక్తిత్వం పూర్తిగా భిన్నమైనవి. ఆమె చాలా నెమ్మదస్తురాలు. ఏ మాట అయినా ఆమె ఆలోచించే మాట్లాడతారు. నేను అందుకు పూర్తి విరుద్ధం. మహిళా క్రికెట్లో మిథాలీ ఒక ఐకాన్. ఆమె పాత్రను స్క్రీన్ మీద పోషించే అవకాశం రావడం అదృష్టం. కేవలం క్రీడాకారిణిగానే కాదు.. ఒక వ్యక్తిగా మిథాలీ అంటే నాకెంతో గౌరవం’’ అన్నారు తాప్సీ. ‘స్పోర్ట్స్ పర్సన్‌గా నటించడానికి మీ బాయ్‌ఫ్రెండ్ (మాథ్యూస్ బో, బ్యాడ్మింటన్ ప్లేయర్) నుంచి ఏదైనా టిప్స్ తీసుకున్నారా? అనే ప్రశ్నకు– ‘‘మెదడు ఆపరేషన్ చేసేవాళ్లు, హృదయానికి సంబంధించిన వాళ్లు ఏం చేయాలో చెప్పకూడదు కదా. రెండూ వేరు వేరు స్పోర్ట్స్. అలానే పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను విడివిడిగా ఉంచడానికి ఇష్టపడతాం’’ అని సమాధానమిచ్చారు. -
హ్యపీ బర్త్‌డే మిథాలీ రాజ్..
భారత మహిళా క్రికెట్లో మిథాలీ రాజ్ ఓ పెను సంచలనం. 1999లో ఉమెన్స్ క్రికెట్లోకి ప్రవేశించిన మిథాలీ రాజ్ ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి ఔరా అనిపించింది. ఐర్లాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 114 పరుగులు సాధించి అప్పటివరకు భారతదేశంలో క్రికెట్ అంటే పురుషులు మాత్రమే ఆడగలరు అని కామెంట్లు చేసిన వారికి గట్టి సమాధానం చెప్పింది. ఈ ప్రదర్శన తీసివేసేది కాదని కొద్ది రోజుల్లోనే తెలిసేలా చేసింది. (చదవండి : 'క్రికెటర్ కాకపోయుంటే రైతు అయ్యేవాడు') 2002లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఉమెన్స్ తరపున మొదటి డబుల్ సెంచరీ చేయడంతో పాటు.. 214 పరుగులు అత్యధిక స్కోరు నమోదు చేసి మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. అప్పటివరకు మహిళల క్రికెట్లో కారెన్ రోల్టన్ పేరిట ఉన్న 209 పరుగులే అత్యధిక స్కోరుగా ఉండేది. మిథాలీ కేవలం మూడో టెస్టులోనే అత్యధిక పరుగుల రికార్డును తుడిచేయడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అనతికాలంలోనే మహిళల ఉమెన్స్ క్రికెట్లో టీమిండియా తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌వుమెన్‌గా రికార్డులకెక్కింది. వన్డేల్లో నంబర్‌వన్ బ్యాట్స్‌వుమెన్‌గా ధీర్ఘకాలికంగా కొనసాగిన మిథాలీ రాజ్ రికార్డు సృష్టించారు. అంతేకాదు.. భారత పురుషుల క్రికెట్లో క్రికెట్ గాడ్‌గా పిలవబడే సచిన్ టెండూల్కర్ స్థాయిలోనే.. మహిళల క్రికెట్లో మిథాలీ లేడీ టెండూల్కర్‌గా కితాబులందుకుంది. అలాంటి మిథాలీ రాజ్ ఇవాళ(డిసెంబర్ 3) 38 పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఐసీసీ మిథాలీ రాజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ వీడియోనూ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా మిథాలీకి బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఆమె సాధించిన విజయాలు, పలు రికార్డులతో పాటు కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. (చదవండి : మ్యాచ్‌కు ముందు తండ్రి చనిపోయినా..) ►రాజస్తాన్‌లోని జోద్‌పూర్‌లో 1982 డిసెంబర్ 3న జన్మించిన మిథాలీ రాజ్ కుటుంబం నిజానికి తమిళనాడు వ్యాస్తవ్యులు. తండ్రి దొరై రాజ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అధికారి కావడంతో నిత్యం బదిలీలు జరిగేవి. తల్లి లీలారాజ్ గృహిణి. ఆ తర్వాత వీరి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. ►మిథాలీ 10 ఏళ్ల వయసులోనే క్రికెట్ ఆడడం మొదలుపెట్టింది. హైదరాబాద్‌లోని కీస్ హైస్కూల్లో 10 వ తరగతి వరకు చదివిన మిథాలీ సికింద్రాబాద్‌లోని కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. ఇండియన్ రైల్వే క్రికెట్ తరపున తొలిసారి డమొస్టిక్ క్రికెట్లో ఆడారు. అప్పుడే ఒకప్పటి స్టార్ మహిళా క్రికెటర్లు అయిన అంజుమ్ చోప్రా, పూర్ణిమా రాహు, అంజు జైన్ పరిచయమయ్యారు. ►1999లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా మిథాలీ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. ►2005లో టీమిండియా ఉమెన్స్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మిథాలీ రెండు ప్రపంచకప్‌ల్లో(2005,2017) రెండు సార్లు భారతజట్టును ఫైనల్ చేర్చిన ఘనత సాధించింది. ►అంతర్జాతీయ మహిళల క్రికెట్లో భారత్ తరపున తొలిసారి 6వేల పరగులు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె టీమిండియా తరపున అన్ని ఫార్మాట్లు(వన్డే, టీ20, టెస్టులు) లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్నారు. అంతేకాదు.. వన్డేల్లో వరుసగా 7 అర్థసెంచరీలు సాధించడంతో పాటు వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్‌గా రికార్డు సాధించింది. ►ఇండియా నుంచి టీ20ల్లో 2వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌వుమెన్‌గా రికార్డు సృష్టించింది. ►కాగా ఇప్పటివరకు మిథాలీ రాజ్ టీమిండియా మహిళల జట్టు తరపున 209 వన్డేల్లో 6888, 10 టెస్టుల్లో 663, 89 టీ20ల్లో 2,364 పరుగులు సాధించింది. ఇందులో వన్డేల్లో 53 అర్థసెంచరీలు, 7 సెంచరీలు ఉండగా.. టెస్టుల్లో 4 అర్థసెంచరీలు, ఒక సెంచరీ సాధించింది. 🥇 Leading run-scorer in women's ODIs ⭐ Highest run-scorer for 🇮🇳 in women's T20Is 🏆 Two-time Women's @cricketworldcup finalist 🔥 Most consecutive fifties in women's ODIs - 7️⃣ Happy birthday to Mithali Raj! 📽️ Watch her tell her story in this special video from CWC 2017: pic.twitter.com/Sp5QnmyN3s — ICC (@ICC) December 3, 2020 -
47 పరుగులకే ఆలౌట్..
షార్జా: మహిళల టీ20 చాలెంజ్ చరిత్రలో చెత్త రికార్డు నమోదైంది. గురువారం ట్రయల్‌బ్లేజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెలాసిటి 15.1 ఓవర్లలో 47 పరుగులకే కుప్పకూలింది. దాంతో టోర్నీ చరిత్రలో అత్యల్ప స్కోరును తన పేరిట లిఖించుకుంది. ట్రయల్‌బ్లేజర్స్ బౌలర్ సోఫీ ఎక్సీస్టోన్ దెబ్బకు వెలాసిటీ విలవిల్లాడింది. సోఫీ 3.1 ఓవర్లలో నాలుగు వికెట్లు సాధించి వెలాసిటీ పతనాన్ని శాసించింది. కేవలం 9 పరుగులకే ఇచ్చి 2.80 ఎకానమీతో అదరగొట్టింది. వెలాసిటీ జట్టులో ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు.అందులో ఫఫాలీ వర్మ(13) చేసిన పరుగులే అత్యధికం కావడం గమనార్హం. వ్యాట్(3), మిథాలీ(1), వేదా(0),సుష్మా వర్మ(1)లు తీవ్రంగా నిరాశపరిచారు. సోఫీకి జతగా గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్‌లు బౌలింగ్‌లో రాణించారు. జులన్ గోస్వామి, రాజేశ్వరిలు తలో రెండు వికెట్లు తీశారు. వెలాసిటీ నిర్ధేశించిన 48 పరుగుల టార్గెట్‌ను ట్రయల్‌బ్లేజర్స్ 7.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి ఛేదించింది. మంధనా(6) వికెట్‌ను ఆదిలో కోల్పోయినా దీంద్రా డాటిన్( 29 నాటౌట్), రిచా గోష్(13 నాటౌట్)లు టార్గెట్‌ను ఛేదించారు. కాగా, వెలాసిటీ నిన్న అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. సూపర్ నోవాస్ జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ విజయం సాధించగా, దాన్ని ఈరోజు కొనసాగించలేకపోయింది. -
వెలాసిటీ బోణీ
షార్జా: మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ నాయకత్వంలోని వెలాసిటీ జట్టు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ ఐదు వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని సూపర్ నోవాస్ జట్టుపై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఓపెనర్ చమరి ఆటపట్టు (39 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించింది. ఏక్తాబిష్త్ 3 వికెట్లు తీసింది. తర్వాత వెలాసిటీ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సునె లూస్ (21 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), సుష్మ వర్మ (33 బంతుల్లో 34; 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. రాణించిన చమరి... ఓపెనర్ ప్రియా (11), జెమీమా రోడ్రిగ్స్ (7) విఫలమైనా... మరో ఓపెనర్ చమరి ఆటపట్టు కుదరుగా ఆడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించింది. మనాలీ, కాస్పెరెక్ ఓవర్లలో సిక్సర్లు బాదిన చమరి దూకుడుకు జహనార చెక్ పెట్టింది. కాసేపటికే హర్మన్ (27 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు)ను జహనార పెవిలియన్ చేర్చగా... తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వారిలో సిరివర్దెనె (18) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 20వ ఓవర్ వేసిన ఏక్తా బిష్త్ ఆఖరి రెండు బంతుల్లో రాధా యాదవ్ (2), షకీరా (5)లను అవుట్ చేసింది. జహనార, కాస్పెరెక్ చెరో 2 వికెట్లు తీశారు. ఆఖర్లో ఉత్కంఠ... బంతికో పరుగు చొప్పున చేయాల్సిన లక్ష్యం. కానీ ఖాతా తెరువకుండానే ఓపెనర్ వ్యాట్ (0)ను, లక్ష్యఛేదనలో సగం పరుగులు చేయగానే షఫాలీ (11 బంతుల్లో 17), కెప్టెన్ మిథాలీ (7), వేద కృష్ణమూర్తి (28 బంతుల్లో 29; 4 ఫోర్లు) వికెట్లను కోల్పోయింది. 13 ఓవర్లలో వెలాసిటీ స్కోరు 65/4. ఇంకా 42 బంతుల్లో 61 పరుగులు చేయాల్సిన సమీకరణం. చివరి 5 ఓవర్లలో అయితే ఓవర్‌కు 10 చొప్పున 50 పరుగులు చేయాలి. లక్ష్యానికి దాదాపు దూరమైన తరుణంలో సుష్మ, సునె లూస్ భారీ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. పూనమ్ 16వ ఓవర్లో ఇద్దరు చెరో సిక్సర్ బాదడంతో 14 పరుగులు, సిరివర్దెనె 17వ ఓవర్లో 11 పరుగులు రావడంతో లక్ష్యం సులువైంది. సుష్మ అవుటైనా... ఆఖరి 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... లూస్, శిఖాపాండే చెరో బౌండరీతో గెలిపించారు. నేడు జరిగే మ్యాచ్‌లో వెలాసిటీతో ట్రయల్ బ్లేజర్స్ తలపడుతుంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
యూఏఈ చేరుకున్న మహిళా క్రికెటర్లు
దుబాయ్: మహిళల టి20 చాలెంజ్ సిరీస్ కోసం భారత టాప్–30 మహిళా క్రికెటర్లు గురువారం యూఏఈ చేరుకున్నారు. షార్జా వేదికగా నవంబర్ 4 నుంచి 9 వరకు జరుగనున్న ఈ టోర్నీలో భారత వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్, టి20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ తదితరులు పాల్గొననున్నారు. తొమ్మిదిరోజుల పాటు ముంబైలో క్వారంటైన్లో ఉన్న మహిళా క్రికెటర్లు... బయో బబుల్‌లోకి ప్రవేశించే ముందు మరో వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. ఆరు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీలో సూపర్నోవాస్, ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్లు తలపడనున్నాయి. ఈ జట్లకు మిథాలీరాజ్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ సారథ్యం వహిస్తారు. మినీ ఐపీఎల్‌గా పరిగణించే ఈ టోర్నీతోనే భారత మíహిళా క్రికెటర్లు కరోనా విరామం తర్వాత తొలి సారి మళ్లీ బ్యాట్ పడుతున్నారు. -
స్క్వాడ్ దిగుతోంది..
సూపర్ నోవాస్.. మిరుమిట్ల బ్యాట్ల మోత. ట్రయల్ బ్లేజర్స్.. వికెట్ల కుప్ప కూల్చివేత. వెలాసిటీ.. ఇన్నింగ్స్ వెన్ను విరిచివేత. విధ్వంసానికి మహిళల జట్లు సిద్ధం. మీరు ఎవరి వైపు? మిథాలీ! మంధాన! హర్మన్! ముగ్గురు యోధుల మహా సంగ్రామం! మహిళల టి20 చాలెంజ్ టోర్నీకి రంగం సిద్ధం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రస్తుతం జరుగుతున్న పురుషుల ఐపీఎల్ ముగియడానికి వారం ముందే అక్కడి క్రికెట్ మైదానాలలో మహిళల టి20 చాలెంజ్ టోర్నీ ప్రారంభం కాబోతోంది. పురుషుల ఐపీఎల్లో 8 జట్లు ఉంటే, మహిళల చాలెంజ్ టోర్నీలో 3 జట్లు ఉంటున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ ∙రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్. ఇవి పురుషుల జట్లు. ప్రాంతం పేరు లేకుండా పురుషుల జట్టు పేరే లేదు. మహిళల మూడు జట్ల పేర్లు ఇందుకు భిన్నమైనవి. సూపర్ నోవాస్, ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ! సూపర్ నోవాస్ అంటే నవ్యోజ్వల తారలు. నక్షత్ర భారీ విస్ఫోటన కాంతులు. ట్రయల్ బ్లేజర్స్ అంటే నవపథ యోథులు. కొత్తపుంతలు తొక్కించేవారు. వెలాసిటీ అంటే గమన వేగం. 2008లో పురుషుల ఐపీఎల్ మొదలైన పదేళ్లకు 2018లో మహిళల కోసం టి20 చాలెంజ్ టోర్నీ ప్రారంభం అయినప్పటికీ సూపర్ నోవాస్, ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ అనే ఈ మూడు శక్తిమంతమైన పేర్లతో మహిళా జట్లు క్రీజ్‌లోకి దిగాయి. సూపర్ నోవాస్‌కి హర్మన్‌ప్రీత్ కౌర్, ట్రయల్ బ్లేజర్స్‌కి స్మృతి మంధాన, వెలాసిటీకి మిథాలీ రాజ్ కెప్టెన్లు. తొలి ఏడాది సూపర్ నోవాస్, ట్రయల్ బ్లేజర్స్ మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్ అమ్మాయి మిథాలీ రాజ్ సూపర్ నోవాస్‌లో భాగంగా ఉన్నారు. రెండో ఏడాదికి మిథాలీ కెప్టెన్‌గా వెలాసిటీ టీమ్ వచ్చింది. ఇప్పుడు జరగబోతున్నది మూడో టి20 చాలెంజ్ టోర్నీ. నవంబర్ 4న సూపర్ నోవాస్–వెలాసిటీ మధ్య... 5న వెలాసిటీ–ట్రయల్æబ్లేజర్స్ మధ్య... 7న ట్రయల్ బ్లేజర్స్–సూపర్ నోవాస్ మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. టాప్–2లో నిలిచిన జట్ల మధ్య 9న ఫైనల్ ఉంటుంది. మొదటి రెండేళ్ల విజేత సూపర్ నోవాస్. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ. ఈసారి కూడా హర్మన్ప్రీతేనా లేక మంధానా లేదా మిథాలీలలో ఒకరు కప్పును చేజిక్కించుకుంటారా అనే ఆసక్తి పెరుగుతూ వస్తోంది. మహిళా మినీ ఐపీఎల్‌గా పేరున్న ఈ టి20 చాలెంజ్ టోర్నీలో జట్ల పేర్ల కన్నా, టీమ్‌ల కెప్టెన్ల పేర్లపైనే క్రీడాభిమానుల ఫోకస్ ఎక్కువగా ఉండటానికి కారణం సూపర్ నోవాస్, ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ అనే పవర్ నేమ్‌కి హర్మన్, స్మృతి, మిథాలీల ఆట తీరు స్పష్టమైన ప్రతీకగా కనిపించడమే. సూపర్ నోవాస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆల్ రౌండర్. రైట్ హ్యాండెడ్ బ్యాట్స్ఉమన్. రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ బౌలింగ్. వంద అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి ఇండియన్ క్రికెటర్ కూడా హర్మనే. ఆమె ఆటతీరు కళ్లు మిరుమిట్లుగొల్పేలా ఉంటుంది. బహుశా అందుకే ఆమె ఉన్న జట్టుకు సూపర్ నోవాస్ అని బీసీసీఐ పేరు పెట్టినట్లుంది. మొదటి మ్యాచ్‌లో సూపర్ నోవాస్ తలపడబోతున్న వెలాసిటీ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ రైట్‌హ్యాండ్ బ్యాట్స్ఉమన్. మెరుపు వేగంతో వచ్చే బంతినైనా బెరుకు లేకుండా ఫేస్ చేసి రన్స్ని కుప్పలుపోసే ‘వెలాసిటీ’ ఆమె బ్యాట్‌కు ఉంది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు తీసిన ప్లేయర్. ఏడు వన్డేల్లో వరుసగా ఏడు అర్ధ సెంచరీలు చేసిన రికార్డు ఉంది. క్రికెట్ మగవాళ్ల ఆట అనే అపోహను తన వేగవంతమైన రన్ రేట్‌తో పోగొట్టారు మిథాలీ. అందుకే ఆమె టీమ్‌కు ‘వెలాసిటీ’ అనే పేరు సరైనది అనిపిస్తుంది. ఇక ట్రైల్బ్లేజర్స్ జట్టు కెప్టెన్ స్మృతీ మంధాన ఎడంచేతి వాటం బ్యాట్స్ఉమన్. మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలదు. స్మృతి ఇన్స్పిరేషన్ మిథాలీ రాజ్. ఈ చాలెంజ్ టోర్నీ రెండో రోజు తన ఇన్స్పిరేషన్ మీదనే పోటీపడబోతున్నారు స్మృతి. ఈ మూడు జట్ల నాలుగు మ్యాచ్‌ల టి20 చాలెంజ్ టోర్నీలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ప్లేయర్స్ కూడా తమ తమ టీమ్‌ల తడాఖాను చూపించేందుకు సిద్ధం అవుతున్నారు. సూపర్ నోవాస్ జట్టు.. హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్ (వైస్–కెప్టెన్), చమరి ఆటపట్టు, ప్రియా పునియా, అనూజా పాటిల్, రాధాయాదవ్, తాన్యా భాటియా (వికెట్ కీపర్), శశికళా సిరివర్థనే, పూనమ్ యాదవ్, షకేరా సేల్మన్, అరుంధతీ రెడ్డి, పూజా వస్త్రాకర్, అయుషీ సోని, ఆయాబోంగా ఖాక, ముస్కాన్ మాలిక్. ట్రయల్ బ్లేజర్స్ జట్టు స్మతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), పూనమ్ రౌత్, రిచా ఘోష్, డి.హేమలత, నుఝాత పర్వీన్ (వికెట్ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, హర్లీన్ డియోల్, జులన్ గోస్వామి, సిమ్రాన్ దిల్ బహదూర్, సల్మా ఖాటున్, సోఫీ ఎకిల్‌స్టోన్, నథకన్ ఛంతమ్, డియాండ్రా డోటిన్, కష్వీ గౌతమ్. వెలాసిటీ జట్టు మిథాలీ రాజ్ (కెప్టెన్), వేద కృష్ణమూర్తి (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, సుష్మా వర్మ (వికెట్ కీపర్), ఏక్తా బిస్త్, మాన్సి జోషి, శిఖా పాండే, దేవికా వైద్య, సుశ్రీ దివ్యదర్శిని, మనాలీ దక్షిణి, లే కాస్పెరెక్, డానియెలా వ్యాట్, సనీలెస్, జహనారా ఆలమ్, ఎం. అనఘ. -
దేశానికి ఎంత గర్వకారణం.. అయినా వివక్ష
ఒక కుండలో నీళ్లు ఉన్నాయి. ఇద్దరు ఎండనపడి వచ్చారు. ఒక స్త్రీ.. ఒక పురుషుడు. నడిచొచ్చింది సమాన దూరం. మోసుకొచ్చింది సమాన భారం. పురుషుడికి గ్లాసు నిండా నీళ్లిచ్చి.. స్త్రీకి అరగ్లాసు ఇస్తే ఏమిటర్థం?! ఆమెది నడక కాదనా? ఆమెది బరువు కాదనా? ఆమెసలు మనిషే కాదనా? ఎండ ఈక్వల్ అయినప్పుడు.. కుండా ఈక్వల్ అవాలి కదా! ఇప్పుడు కొంచెం నయం. ఉండండి, 83 శాతం అంటే కొంచెం కాకపోవచ్చు. చాలా నయం. ఎనభై మూడు శాతం క్రీడాంశాలలో స్త్రీ, పురుషులన్న వ్యత్యాసం చూపకుండా ‘ఈక్వల్ పేమెంట్’ ఇస్తున్నారు! బి.బి.సి. రిపోర్ట్ ఇది. బి.బి.సి. మీడియాలో కూడా ఆమధ్య ఒకరిద్దరు పైస్థాయి మహిళా ఉద్యోగులు జాబ్‌ని వాళ్ల ముఖాన కొట్టేసి బయటికి వచ్చేశారు. జార్జికి వంద పౌండ్లు ఇస్తూ, అదే పనికి ఒలీవియాకు 60 పౌండ్లు ఇస్తుంటే ఎవరైనా అదే పని చేస్తారు. ఇదిగో, ఇలా అడిగేవాళ్ల వల్లనే ఎప్పటికైనా మహిళలకు సమాన ప్రతిఫలం వస్తుంది. ఫురుషులతో సమానంగా. మన దేశంలో ఇలా అడిగినవాళ్లు.. స్పోర్ట్‌లో.. ఐదుగురు మహిళలు ఉన్నారు. తక్కినవాళ్లూ ‘పేమెంట్‌లో ఏంటీ పక్షపాతం!’ అని అంటూనే ఉన్నా.. ప్రధానంగా సానియా మీర్జా, దీపికా పల్లికల్, అతిది చౌహన్, అపర్ణా పపొట్, మిథాలీరాజ్ ఎప్పటికప్పుడు ఈ ఎక్కువతక్కువల్ని గుర్తు చేస్తూ వస్తున్నారు. ఐపీఎల్‌నే తీస్కోండి. పురుషులు ఆడేదీ అదే ఆట, స్త్రీలు ఆడేదీ అదే ఆట. వచ్చే క్యాష్ మాత్రం స్త్రీలకు తక్కువ. టెన్నిస్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, స్క్వాష్.. ఏదైనా వీళ్లకు వచ్చేది వాళ్లకు ఇచ్చే దాంట్లో నాలుగింట ఒక వంతు తక్కువే! ‘‘మీకు న్యాయంగా అనిపిస్తోందా.. తక్కువ చేసి ఇవ్వడానికి’’ అని ఉమెన్ ప్లేయర్స్ అడిగితే.. ‘‘స్పాన్సరర్స్ రాకుంటే మేమైనా ఏం చేస్తాం. పురుషులు ఆడితే చూసినంతగా, స్త్రీలు ఆడితే చూడరు. ఉమెన్ ఈవెంట్లకు ఖర్చు తప్ప, లాభం ఎక్కడిది!’’ అని సమాధానం. నిజమే కదా పాపం అనిపించే అబద్ధం ఇది. డబ్బులు బాగానే వస్తాయి. డబ్బులు ఇవ్వడానికే మనసు రాదు. ∙∙ మార్చిలో ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. అదీ బి.బి.సి. వాళ్లదే. పురుషులతో సమానంగా మహిళలకూ పారితోషికం, ఇతరత్రా బెనిఫిట్స్ ఇవ్వాలని ఎక్కువమంది ఇండియన్ క్రీడాభిమానులు అంటున్నారట. అంటే వాళ్లు స్పోర్ట్స్‌ని చూస్తున్నారు కానీ, స్పోర్ట్స్ ఉమన్ అని స్పోర్ట్మన్ అనీ చూడ్డం లేదు. పైగా పద్నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ సర్వేలో నాలుగింట మూడొంతుల మంది.. ఆటల్ని ఇష్టపడేవాళ్లే. సినిమాలు, పొలిటికల్ న్యూస్ లేకున్నా బతికేస్తాం కానీ, కళ్లముందు ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ లేకుంటే ఆ పూటకు బతికినట్లే ఉండదని కూడా చెప్పారట. వాళ్లకు కోహ్లీ అని, మిథాలీ అని కాదు. క్రికెట్ కావాలి. సెరెనా అనీ, జకోవిచ్ అని కాదు. టెన్నిస్ కావాలి. ‘కోహ్లీనే కావాలి’ అని వాళ్లు అడిగినా మిథాలీకి రెమ్యునరేషన్ తగ్గించడం కరెక్టు కాదు. గెలిచేందుకు పెట్టే ఎఫర్ట్.. ఆ కష్టం.. వాటికి మనీని తగ్గించి ఇవ్వడం క్రీడాకారిణుల ప్రతిభను, తపనను, శ్రమను తక్కువగా చూడటమే. ఈ అసమానత్వాన్ని ప్రశ్నించకుండా రిటైర్ అయిపోతే, తమకు తాము అన్యాయం చేసుకోవడం మాత్రమే కాదు, కొత్తగా వచ్చేవాళ్లకూ అన్యాయం చేసినట్లే. అందుకే క్రీడాకారిణులు గళం విప్పుతున్నారు. తమ స్వరం వినిపిస్తున్నారు. ఇప్పటికే విదేశీ క్రీడా క్లబ్బులు, ఆసోసియేషన్లు, ఫెడరేషన్లు, కౌన్సిళ్లు, లీగ్‌లు, బోర్డులు, కమిటీలు.. ‘ఈక్వల్ పే’ అమలు చెయ్యడానికి అతి కష్టం మీదనైనా ఒళ్లొంచుతున్నాయి. నాలుగేళ్లు నిరసన భారతదేశపు అత్యుత్తమస్థాయి స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్.. ప్రైజ్ మనీలోని అసమానతలకు నిరసనగా 2012 నుంచి 2015 వరకు వరుసగా నాలుగేళ్లు ‘నేషనల్ స్క్వాష్ చాంపియన్ షిప్’ను బాయ్‌కాట్ చేశారు. ‘స్పోర్ట్స్‌మ్యాన్ స్పిరిట్ లేదు. డబ్బే ముఖ్యమా!’ అని ఆమెపై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ తన నిర్ణయం మీద తను ఉన్నారు. స్త్రీ పురుషులిద్దరికీ ప్రైజ్ మనీ సమానంగా ఉండేంత వరకు నేషనల్స్ ఆడేది లేదని కూడా స్పష్టంగా చెప్పారు. ఆమె ర్యాంకింగ్ పురుషుల కంటే కూడా ఎక్కువగా ఉండేది! నేటికీ తక్కువే మేరీ కోమ్, సైనా నెహ్వాల్, పి.వి.సింధు.. దేశానికి ఎంత గర్వకారణం! అయినా వివక్ష ఉంటోంది. స్త్రీ పురుష సమానత్వం, సాధికారత అని ఎంత మాట్లాడుకున్నా మనమింకా పురుష ప్రపంచంలోనే జీవిస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది నాకు. మన క్రీడా ప్రతిభ మెరుగైంది కానీ, క్రీడాకారిణులకు ఇచ్చే ప్రైజ్ మనీ పురుషులకు వచ్చే మొత్తం కన్నా తక్కువగానే ఉంటోంది. – సానియా మీర్జా, టెన్నిస్ స్టార్ (నిరుడు ‘ఫిక్కీ’ చర్చా వేదికపై) ఆటతో సాధించొచ్చు ఈక్వల్ పే ఉండాలి. ఈక్వల్ ప్రైజ్ మనీ ఉండాలి. ఆట తీరుతో కూడా వీటిని సాధించవచ్చు. గుడ్ బ్రాండ్ క్రికెట్ ఆడితే మంచి మార్కెటింగ్ జరుగుతుంది. మ్యాచిల వల్ల ఆదాయం వస్తుంది. పురుషుల ఆటల్లో వచ్చే లాభాల్లోంచి మాకేం పంచి పెట్టనక్కర్లేదు. మా విజయాల్లోని షేర్‌ను తీసుకోడానికే మేము ఇష్టపడతాం. మొత్తానికైతే పారితోషికాల విషయంలో మునుపటి కన్నా కొంత బెటర్ అయ్యాం. – మిథాలీ రాజ్, స్టార్ క్రికెటర్ (ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో) నమ్మకంగా చెప్పలేం ఆర్థికంగా కొంచెం మెరుగయినట్లే ఉంది. అయితే ఈక్వల్ ప్లేకి ఈక్వల్ పే ఉందా అని నమ్మకంగా చెప్పగలిగిన పరిస్థితి అయితే లేదు. పురుషులకు సమానంగా స్త్రీలకు ప్రైజ్ మనీ ఇవ్వాలి. – అపర్ణా పొపట్, బాడ్మింటన్ (గత ఏడాది ఎకనమిక్ టైమ్స్ ‘పనాచ్’ రౌండ్ టేబుల్ చర్చలో) పోలికే లేదు ప్రైజ్ మనీలోనే కాదు, అన్నిట్లోనూ మహిళా జట్లు, మహిళా క్రీడాకారులకు వివక్ష ఎదురౌతోంది. పురుషుల ఫుట్‌బాల్‌తో మహిళల ఫుట్‌బాల్‌ను పోల్చనే లేము. వాళ్ల లీగ్‌తో మా లీగ్‌ను పోల్చలేం. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్‌ని (సక్సెస్ అయ్యేందుకు ఉండే అవకాశం) కూడా కంపేర్ చెయ్యలేం. ప్రతి దాంట్లోనూ ఇంతని చెప్పలేనంత అసమానత్వం ఉంది. – అదితి చౌహాన్, ఫుట్‌బాల్ గోల్ కీపర్ -
ప్రతిభను వెలికితీస్తాం
న్యూఢిల్లీ: యువ ప్రతిభను వెలికితీయడమే తమ ప్యానెల్ లక్ష్యమని భారత మహిళల క్రికెట్ చీఫ్ సెలక్టర్ నీతూ డేవిడ్ అన్నారు. 16 ఏళ్ల వయస్సులోనే సత్తా చాటుతోన్న భారత క్రికెటర్ షఫాలీ వర్మలాంటి ప్లేయర్లను ప్రోత్సహిస్తామని ఆమె చెప్పారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం అన్ని స్థాయిల క్రికెట్లో హిట్టింగ్, ఆట వేగం పెరిగిపోయిందని విశ్లేషించారు. యువ సత్తాతో పాటు అనుభవజ్ఞులు కూడిన జట్టుతో అద్భుతాలు చేయొచ్చని ఆమె వివరించారు. ‘ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో కూడా వేగం చాలా పెరిగింది. గతంలో ఇలా ఉండేది కాదు. ప్లేయర్లు దూకుడుగా ఆడుతున్నారు. వారి ఆలోచనా విధానం మారింది. అందుకు తగినట్లే షఫాలీలా ఆడే వారు కావాలి. మన దగ్గర చాలా మంది యువ ప్రతిభావంతులు ఉన్నారు. తగిన సమయంలో వారికి అవకాశాలు కల్పించాలి. వారితో పాటు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి అనుభవజ్ఞులు ఉంటేనే జట్టుకు సమతూకం వస్తుంది. వారు మెరుగ్గా ఆడినంత కాలం రిటైర్మెంట్ గురించి ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో వారికి బాగా తెలుసు’ అని ఆమె చెప్పుకొచ్చారు. మెగా టోర్నీల్లో తుదిపోరులో జట్టు వైఫల్యంపై దృష్టిసారిస్తామన్న ఆమె భారత్ ప్రపంచకప్ సాధించడమే అంతిమ లక్ష్యమని వ్యాఖ్యానించింది. -
ధోనిలా ఇంకెవరూ ఉండరు : మిథాలీ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్పై భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించారు. మరో మహేంద్ర సింగ్ ధోని ఎప్పటికీ ఉండరని మిథాలీ రాజ్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్టు ధోని శనివారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించాడు. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో ధోని తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఏడాది కాలంగా అతను జట్టుకు దూరంగా ఉంటూ ఏ స్థాయి క్రికెట్లో కూడా ఆడలేదు. ఈ క్రమంలోనే బీసీసీఐ సోమవారం తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియోలో మిథాలీ ధోనిని ప్రశంసలతో ముంచెత్తారు. ‘అతను చెప్పింది చేస్తాడు. దేశం కోసం ఆడాలని కాంక్షించే చిన్న చిన్న పట్టణాలకి చెందిన కుర్రాళ్లకి అతను ఆదర్శం. క్లిష్ట పరిస్థితులలో కూడా అతను ఉక్కు సంకల్పంతో ప్రశాంతతతో వ్యవహరించే తీరును ఎంత పొగిడినా తక్కువే. బ్యాటింగ్ అయినా, వికెట్ కీపింగ్ అయినా అతనిది అసమానమైన శైలి. క్రికెట్ పాఠ్య పుస్తకాల్లోలేని ఆ హెలికాప్టర్ షాట్ అతని ప్రతిభ, ఆత్మ విశ్వాసానికి నిదర్శనం. అతనిలా ఇంకెవరూ ఉండరు’ అని మిథాలీ అన్నారు. అంతర్జాతీయ కెరీర్లో ధోని 90 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధశతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్ చేశాడు. వీటిల్లో 10 శతకాలలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. ఇక 98 టీ 20 మ్యాచ్‌లలో 1600 పరుగుల సాధించాడు. -
మరోసారి ప్రయత్నిస్తాం
న్యూఢిల్లీ: తన కెరీర్లో లోటుగా ఉన్న ప్రపంచకప్ టైటిల్‌ను వచ్చే ఏడాది సాధించాలనే పట్టుదలతో ఉన్నట్లు భారత మహిళల క్రికెట్ వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది. గతంలో మూడు పర్యాయాలు టైటిల్‌కు సమీపంగా వచ్చినప్పటికీ అనుకున్నది సాధించలేకపోయామని ఆమె వ్యాఖ్యానించింది. అందరి ఆశీర్వాదాలతో ఈసారి వరల్డ్‌కప్ సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. ‘2005లో... ఆ తర్వాత 2017 వన్డే ప్రపంచకప్‌లో రెండుసార్లు ఫైనల్లో బోల్తాపడ్డాం. అప్పుడు కెప్టెన్‌గా, ప్లేయర్‌గా చాలా కష్టపడ్డా. 2017 ఫైనల్లో గెలిస్తే రిటైర్ అవ్వాలని అనుకున్నా. కానీ అది జరగలేదు. ఆ తర్వాత 2018లో టి20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో పరాజయం పాలయ్యాం. టైటిల్‌కు చాలా దగ్గరగా వచ్చి దూరమయ్యాం. కాబట్టి మరోసారి ప్రయత్నిద్దామని గట్టిగా నిశ్చయించుకున్నా. దేవుడి దయవల్ల ఈసారి సాధిస్తామని నమ్ముతున్నా’ అని 37 ఏళ్ల మిథాలీ వివరించింది. మహిళల క్రికెట్ ఆలస్యంగా బీసీసీఐ పరిధిలోకి రావడంతో ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది ప్రతిభగల అమ్మాయిలు క్రికెట్‌కు దూరమయ్యారని నిరాశ వ్యక్తం చేసింది. -
2021 ప్రపంచకప్‌తోనే ముగిస్తా
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఎప్పుడంటూ తరచుగా ఎదురయ్యే ప్రశ్నలకు భారత మహిళల వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ సమాధానమిచ్చింది. తన సుదీర్ఘ కెరీర్‌ను వచ్చే ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్‌తో ముగిస్తానంటూ ఆమె ఆదివారం ప్రకటించింది. ఇప్పటివరకు ఐదు ప్రపంచకప్ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ హైదరాబాదీ... 2021లో న్యూజిలాండ్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. ‘2021 వన్డే ప్రపంచకప్ నాకు చివరి టోర్నీ కానుంది. అప్పడు భారతే టైటిల్‌ను గెలుస్తుందని భావిస్తున్నా. ఒకవేళ అదే జరిగితే భారత్‌లో మహిళల క్రికెట్ అభివృద్ధికి గొప్ప మలుపు అవుతుంది. ఎందరో అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. 2017 ప్రపంచకప్ ఫైనల్ ప్రభావం మనం ఇప్పుడు చూస్తున్నాం’ అని మిథాలీ వివరించింది. తాను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటితో పోలిస్తే ఇప్పుడు మహిళా క్రికెటర్లకు మంచి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల తరహాలో ఐసీసీ ఈవెంట్లలో ఇప్పుడు భారత్ కూడా టైటిల్ ఫేవరెట్‌గా నిలుస్తోందన్న ఆమె... దీనికి ఆటగాళ్ల కృషితోపాటు బీసీసీఐ సహాయక సిబ్బంది తోడ్పాటే కారణమని చెప్పింది. ‘మహిళల క్రికెట్లో చాలా మార్పులు వచ్చాయి. నేను అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సమయంలో విదేశీ పర్యటనల సమయంలో ఆట గురించి చాలా నేర్చుకున్నా. కానీ ఇప్పుడు షెఫాలీ వర్మ లాంటి యువ క్రీడాకారిణిలకు అరంగేట్రానికి ముందే అంతర్జాతీయ అనుభవం ఉంటుంది. దేశవాళీ టోర్నీలు, చాలెంజర్ ట్రోఫీలు ఆడటం ద్వారా వారు చాలా నేర్చుకుంటున్నారు. మాకు అప్పుడు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) శిబిరాల గురించి కూడా అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు మహిళా క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టులు కూడా దక్కుతున్నాయి. ఆదాయం పెరగడంతో కేవలం ఆటపై దృష్టి సారించేందుకు ఇది ఉపయోగపడుతోంది’ అని మిథాలీ వివరించింది. -
విరుష్క జోడీ విరాళం రూ. 3 కోట్లు!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమని కలచి వేస్తున్నాయని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోరు కోసం అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. పీఎం–కేర్స్ ఫండ్, మహారాష్ట్ర ముఖ్య మంత్రి సహాయనిధి కోసం తామిద్దరం నిధులు అందించనున్నట్లు ప్రకటించారు. అయితే తాము ఎంత మొత్తం విరాళంగా ఇస్తున్నది మాత్రం వారిద్దరు గోప్యంగా ఉంచారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరు రూ. 3 కోట్లు విరాళం ఇచ్చారని తెలిసింది. ‘అనుష్క, నేను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. మేం అందించే ఈ సహాయం కొంతమందికైనా ఊరట కలిగిస్తుందని నమ్ముతున్నాం. కరోనా సృష్టిస్తోన్న విలయం చూస్తుంటే మా హృదయం తరుక్కుపోతుంది’ అని కోహ్లి ట్విట్టర్లో రాసుకొచ్చాడు. మరోవైపు భారత మహిళల వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ రూ. 5 లక్షలు పీఎం–కేర్స్ ఫండ్‌కు... రూ. 5 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందిస్తున్నట్లు తెలిపింది. మరో మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ రూ. 2 లక్షలు విరాళం ప్రకటించింది. భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సత్యన్ రూ. లక్షా 25 వేలు విరాళంగా ప్రకటించాడు. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్, రాజ్యసభ ఎంపీ హోదాలో తన నెల జీతాన్ని విరాళంగా ఇచ్చింది. కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ 18 ఏళ్ల టీనేజ్ షూటర్ మను భాకర్ లక్ష రూపాయల్ని హరియాణా ప్రభుత్వానికి ఇచ్చింది. -
‘ఇంకా వరల్డ్ చాంపియన్ కాలేదు కదా’
న్యూఢిల్లీ: పురుషుల, మహిళల క్రికెట్‌ను సమాన దృష్టితో చూడాలని ఇటీవల భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ చేసిన వ్యాఖ్యల్ని మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా ఖండించారు. అసలు ఆ డిమాండే అనైతికమన్నారు. పురుషుల క్రికెట్‌తో మహిళల క్రికెట్‌ను ఎందుకు సమానంగా చూడాలంటూ ప్రశ్నించారు. ఇంకా వరల్డ్‌కప్ లాంటి ఎటువంటి మెగా టైటిల్‌ను గెలవని భారత మహిళా క్రికెట్ జట్టు.. పురుషుల క్రికెట్ జట్టుతో సమానంగా చూడాలంటూ డిమాండ్ చేయడం సరైనది కాదని అంజుమ్ చోప్రా అభిప్రాయ పడ్డారు. (ఆరోజు కోసం ఎదురుచూస్తున్నా..) మన మహిళా క్రికెట్ జట్టు సభ్యులు.. మరొక మహిళా క్రికెట్ జట్టు సభ్యులతో పోల్చుకోవాలని సూచించారు. ఇక్కడ ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుతో భారత మహిళా జట్టు పోల్చుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు. ‘ నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. ఈ సమయంలో పురుషుల క్రికెట్‌తో మహిళల క్రికెట్‌ను సమానంగా చూడాలనే చర్చ ఎందుకు వచ్చినట్లు. భారత మహిళా క్రికెట్ జట్టు ఇప్పటివరకూ వరల్డ్‌కప్ గెలవలేదు. భారత మెన్స్ జట్టు వరల్డ్‌కప్ సాధిస్తే, మహిళలు ఇంకా ఎటువంటి మేజర్ ట్రోఫీని సాధించలేదు కదా. మరి పోలిక ఎందుకు’ అని అంజుమ్ చోప్రా పేర్కొన్నారు. బీసీసీఐ ఇటీవల కాంట్రాక్ట్‌ల ప్రకారం.. గ్రేడ్-ఎ మహిళా క్రికెటర్లకు రూ. 50లక్షలు వార్షిక వేతనం వస్తుండగా, అదే కేటగిరీలో ఉన్న మెన్స్ జట్టు సభ్యులకు రూ. 5 కోట్లు వస్తుంది. ఇక ఎ+ కేటగిరీలో ఉన్న పురుష క్రికెటర్లకు రూ. 7 కోట్లు వార్షిక ఆదాయం లభిస్తుంది. (ధోని టార్గెట్ రూ. 30 లక్షలే..) -
ఆరోజు కోసం ఎదురుచూస్తున్నా..
న్యూఢిల్లీ : మూడేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టును ఫైనల్ వరకు నడిపించిన సారథి, హైదరాబాదీ మిథాలీ రాజ్ కెరీర్ 21 ఏళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతోంది. 2021లో జరిగే తర్వాతి ప్రపంచ కప్‌లో కూడా ఆమెనే సారథిగా వ్యవహరించే అవకాశం ఉంది. టి20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో ఐసీసీ తరఫున వివిధ కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ టోర్నీకి లభించిన ఆదరణ, రాబోయే రోజుల్లో భారత మహిళల క్రికెట్‌కు సంబంధించి వివిధ అంశాలపై ఆమె మాట్లాడింది. విశేషాలు మిథాలీ మాటల్లోనే... టోర్నీలో మన ప్రదర్శనపై... భారత బౌలర్లంతా టోర్నీలో అద్భుతంగా రాణించారు. లీగ్ దశలో వారి ప్రదర్శన వల్లే జట్టు సెమీఫైనల్ చేరింది. దురదృష్టవశాత్తూ మన బ్యాటింగ్ విఫలమైంది. ఫైనల్‌కు ముందు ఎనిమిది రోజుల విరామం రావడం కూడా లయను దెబ్బ తీసింది. పైగా ఎంసీజీలాంటి మైదానంలో భారీ సంఖ్యలో ఉన్న ప్రేక్షకుల మధ్య ఒత్తిడిని అధిగమించి ఆడటం అమ్మాయిలకు సవాల్‌గా మారింది. దాంతో ఫైనల్లో అన్ని రంగాల్లో విఫలమయ్యాం. 2017, 2018, 2020లలో ఒకే తరహా ఫలితం కనిపించింది. లీగ్ దశలో చాలా బాగా ఆడటం, చివరకు వచ్చే సరికి ఓటమిని ఆహ్వానించడం. ఇలాంటి ఒత్తిడి దశను దాటాలంటే నాకు తెలిసి మా జట్టుకు ఒక స్పోర్ట్స్ సైకాలజిస్ట్ అవసరం ఉంది. (చీరకట్టుతో క్రికెట్ ఆడిన మిథాలీ) భారత మహిళల జట్టును రాటుదేల్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై... జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కారణంగా మహిళల జట్టు సభ్యులకు కూడా ఎంతో మేలు జరిగింది. కాంట్రాక్ట్ ప్లేయర్లు అక్కడకు వెళ్లి తమ ఫిట్నెస్ను, ఆటకు ప్రత్యేక కోచ్‌ల పర్యవేక్షణలో మెరుగుపర్చుకోవచ్చు. షఫాలీ వర్మలాంటి 16 ఏళ్ల అమ్మాయిలో ఎంతో సత్తా ఉంది. అలాంటి ప్లేయర్లకు ఎన్సీఏలో సరైన మార్గనిర్దేశనం లభిస్తుంది. మహిళల ఐపీఎల్‌లాంటిది ఉంటే వారి ఆట మెరుగవుతుంది. వాస్తవికంగా ఇప్పటికిప్పుడు చెప్పాలంటే అండర్–19, అండర్–23, ‘ఎ’ జట్ల టోర్నీలు నిర్వహించాల్సి ఉంది. ఇలా చేస్తే వచ్చే రెండేళ్లలో ఏ సమయంలోనైనా జాతీయ జట్టులో స్థానం కోసం పోటీ పడగలిగేంత పూర్తి స్థాయి సత్తా ఉన్న కనీసం 30–40 మంది అమ్మాయిలు సిద్ధమవుతారు. వచ్చే ఏడాది తొలిసారి మహిళల విభాగంలో అండర్–19 ప్రపంచ కప్‌ను నిర్వహించనుండటం శుభపరిణామం. మహిళల క్రికెట్‌పై కరోనా ప్రభావం... దురదృష్టవశాత్తూ చాలా ఎక్కువగా ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వన్డే ప్రపంచ కప్ ఉంటే ఆలోగా మేం ఆడబోయే మ్యాచ్‌ల సంఖ్య చాలా చాలా తక్కువ ఉండవచ్చు. క్వాలిఫయర్స్ ఇప్పటికే వాయిదా పడగా, ఐపీఎల్‌తో పాటు జరగాల్సిన టి20 చాలెంజ్ టోర్నీ దాదాపుగా పోయినట్లే. నాలుగు దేశవాళీ టోర్నీలూ రద్దయ్యాయి. ఇప్పుడున్న స్థితిలో ప్లేయర్లు స్పెషల్ ఫిట్నెస్ కోసం జిమ్‌కు కూడా వెళ్లలేరు. ఇంట్లోనే ఉండి ఏదైనా చేయాల్సిందే. అయితే న్యూజిలాండ్‌లాంటి దేశాలతో పోలిస్తే ఎక్కువ జనాభా ఉన్న మన దేశంలో రిస్క్ తీసుకోలేము. ఈ స్థితిలో మేం క్రికెట్‌కంటే కూడా దేశం గురించి, రాబోయే రోజుల్లో ఎదుర్కోవాల్సిన ప్రమాదాల గురించే ఎక్కువగా భయపడుతున్నాం. (వచ్చే ఏడాదైనా.. మహిళల ఐపీఎల్ మొదలు పెట్టండి!) సుదీర్ఘ కెరీర్, రాబోయే బయోపిక్‌పై... నేనెప్పుడూ వర్తమానంలో బాగా పనిచేయడంపైనే దృష్టి పెట్టాను. అయితే భవిష్యత్తులో ఇంకా ఏమేం చేయాలో ఎప్పుడూ ఆలోచించేదాన్ని. ఒక అథ్లెట్ కెరీర్ ఎన్నో ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. అందుకే క్రికెటర్‌గా ఇంకా ఎదగడం గురించే ప్రయత్నించాను. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాక దాని కోసం శ్రమించాను. అందుకే 21 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగగలుగుతున్నాను. బయోపిక్‌లో (తాప్సీ నటిస్తోంది) నా క్రికెట్ ప్రయాణం గురించి మరీ ఎక్కువ వివరాలు ఉండకపోవచ్చు. అయితే ఒక్కసారి వెనక్కి చూసుకుంటే గర్వంగా అనిపిస్తుంది. 16 ఏళ్ల వయసులో ట్రైన్లలో వెళ్లి మ్యాచ్‌లు ఆడేదాన్ని. ఇప్పుడు అదే వయసు అమ్మాయి ఫ్లయిట్లలో ప్రయాణిస్తోంది. ఇన్నేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. మహిళల క్రికెట్ ఎదుగుదలలో నేనూ భాగం కావడం గొప్పగా చెప్పుకోగలను. రాబోయే రోజుల్లో మన దేశంలో పురుషుల క్రికెట్‌తో సమానంగా మహిళల క్రికెట్‌ను కూడా చూసే రోజులు, అలాంటి గుర్తింపు రావాలని కోరుకుంటున్నా. దాని కోసం ఎదురు చూస్తున్నా. ప్రపంచకప్ ఫైనల్ ప్రేక్షకుల సంఖ్యపై... ఇంతటి భారీ జనసందోహాన్ని నేనెప్పుడూ చూడలేదు. 2017 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు లార్డ్స్ మైదానం నిండిపోయినా, దాని సామర్థ్యం చాలా తక్కువ. దాదాపు 87 వేల మంది ప్రత్యక్షంగా మహిళల క్రికెట్ మ్యాచ్ చూశారంటే మామూలు విషయం కాదు. మహిళల క్రికెట్ భవిష్యత్తు భద్రంగా ఉందని ఇది చూపించింది. -
వచ్చే ఏడాదైనా.. మహిళల ఐపీఎల్ మొదలు పెట్టండి!
న్యూఢిల్లీ: మహిళల ఐపీఎల్ గురించి పదే పదే చర్చ జరుగుతున్నా...దానిని పూర్తి స్థాయిలో నిర్వహించడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు. ఐపీఎల్ 2020 సందర్భంగా నాలుగు జట్లతో మహిళల టి20 చాలెంజ్ టోర్నీని నిర్వహించాలని మాత్రం నిర్ణయించింది. అయితే పూర్తి స్థాయి ఐపీఎల్ గురించి బోర్డు ఇంకా ఎంత కాలం ఎదురు చూస్తుందని భారత వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రశ్నించింది. వచ్చే ఏడాదినుంచైనా దీనిని మొదలు పెడితే బాగుంటుందని ఆమె సూచించింది. ‘కనీసం 2021లోనైనా మహిళల ఐపీఎల్ నిర్వహించాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరీ భారీ స్థాయిలో కాకపోయినా పురుషుల లీగ్‌తో పోలిస్తే స్వల్ప మార్పులతోనైనా ఇది మొదలు కావాలి. ఉదాహరణకు నలుగురు విదేశీ ఆటగాళ్లకు బదులుగా ఐదు లేదా ఆరుగురు ఆడవచ్చనే నిబంధన పెట్టవచ్చు’ అని మిథాలీ వ్యాఖ్యానించింది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన కొత్తలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ...‘కనీసం ఏడు జట్ల మహిళల ఐపీఎల్ నిర్వహించాలంటే వాస్తవికంగా ఆలోచించాలి. మన దగ్గర అంత మంది నాణ్యమైన క్రికెటర్లు అందుబాటులో లేరు. అందుకు కనీసం నాలుగేళ్లు పడుతుంది’ అని వ్యాఖ్యానించాడు. అయితే ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచిన నేపథ్యంలో మహిళల ఐపీఎల్‌పై డిమాండ్ పెరిగింది. దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా దీనికి మద్దతునిచ్చారు. మహిళల ఐపీఎల్ వస్తే అప్పుడు ఆటగాళ్ల సంఖ్య ఎలాగూ పెరుగుతుందని, ఇప్పుడు ఉన్న ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు మహిళల టీమ్‌లను నిర్వహించగలవని మిథాలీ చెప్పింది. ‘దేశవాళీలో ఎక్కువ మంది ప్రతిభావంతులైన అమ్మాయిలు లేరనే విషయాన్ని నేనూ అంగీకరిస్తా. అయితే ఇప్పుడున్న ఫ్రాంచైజీలే మహిళా జట్లను తీసుకుంటే పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బోర్డు ఎప్పటికీ వేచి చూస్తామంటే ఎలా. ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కదా. ఒక్కో ఏడాది మెల్లగా స్థాయి పెంచుకుంటూ పోవచ్చు. అప్పుడు నలుగురు విదేశీ ఆటగాళ్లకే పరిమితం చేయవచ్చు’ అని మిథాలీ అభిప్రాయ పడింది. -
చీరకట్టుతో క్రికెట్ ఆడిన మిథాలీ
మహిళా క్రికెట్లో టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. సుదీర్ఘ కాలం భారత మహిళల క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగారు. ఎందరో మహిళా క్రీడాకారులకు స్ఫూర్తిగా మారారు. అలాంటి మిథాలీ.. తొలిసారిగా భారత మహిళల జట్టు టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరిన వేళ సిటీ గ్రూప్‌తో కలిసి ఓ ప్రత్యేక వీడియోను రూపొందించారు. ఆ వీడియోలో మిథాలీ చీరకట్టులో క్రికెట్ ఆడుతూ కనిపిస్తారు. అందులో మిథాలీ అచీవ్‌మెంట్స్‌ను కూడా పేర్కొన్నారు. ఈ వీడియోను మిథాలీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కట్టుబాట్లు తెంచుకుని అమ్మాయిలు ఎదుగుతున్నారని చెప్పడానికి ఆమె చీరకట్టులో క్రికెట్ ఆడారు. ‘కమాన్ టీమిండియా, ప్రపంచకప్‌ను తీసుకురండి’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు మిథాలీని చూస్తే గర్వంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : ఇంగ్లండ్‌ను చూస్తే బాధేస్తోంది: మిథాలీ) అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజునే(మార్చి 8) టీమిండియా ఆసీస్‌తో ప్రపంచకప్ ఫైనల్లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీల్లో ఇప్పటివరకూ మూడు సందర్భాల్లో సెమీస్ వరకే పరిమితమైన భారత మహిళలు.. ఈసారి మాత్రం తుది పోరుకు అర్హత సాధించారు. ఈ రోజు ఇంగ్లండ్‌తో జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గ్రూప్-ఎలో అజేయంగా నిలిచిన భారత్ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. View this post on Instagram Every saree talks more than you and I know! It never tells you to fit in, it makes you stand out. This Women's day, #StartSomethingPriceless and show the world that we can do it too. It's time you start living life #OnYourTerms. Follow @CitiIndia page for more inspiring stories of women living life on their own terms. @mastercardindia A post shared by Mithali Raj (@mithaliraj) on Mar 4, 2020 at 8:07am PST -
ఇంగ్లండ్‌ను చూస్తే బాధేస్తోంది: మిథాలీ
న్యూఢిల్లీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఫైనల్ చేరడంపై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ ఫైనల్‌కు చేరడం కచ్చితంగా అతి పెద్ద ఘనతేనని ఆమె అభివర్ణించారు. ఈ మేరకు తన ట్వీటర్ అకౌంట్లో కంగ్రాట్స్ అంటూ హర్మన్ ప్రీత్ అండ్ గ్యాంగ్‌కు అభినందనలు తెలిపిన మిథాలీ.. ఇంగ్లండ్ మహిళల పట్ల మాత్రం సానుభూతి వ్యక్తం చేశారు. ‘ ఒక భారతీయరాలిగా భారత్ ఫైనల్ చేరడాన్ని థ్రిల్‌గా ఫీలవుతా. కానీ ఒక క్రికెటర్‌గా ఇంగ్లండ్ గర్ల్స్ను చూస్తే జాలేస్తోంది. (ఫైనల్‌కు టీమిండియా తొలిసారి) ఈ తరహా పరిస్థితిని నేను ఎప్పుడూ కోరుకోను. నా జట్టుకి కూడా రాకూడదు. కాకపోతే రూల్స్ ను పాటించాలి కాబట్టి మనం చేసేది ఏమీ ఉండదు. కంగ్రాట్స్ గర్ల్స్. ఇదొక పెద్ద ఘనత’ అని మిథాలీ పేర్కొన్నారు. వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో గ్రూప్ స్టేజ్‌లో టాపర్‌గా ఉన్న భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. కాకపోతే వర్షం రావడం ఇంగ్లండ్‌కు శాపంగా మారింది. రిజర్వ్ డే లేని కారణంగా నాకౌట్ మ్యాచ్ ఆడకుండానే ఇంగ్లండ్ ఇంటి దారి పట్టింది. మహిళల టి20 ప్రపంచ కప్ చరిత్రలో భారత జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీల్లో ఇప్పటివరకూ మూడు సందర్భాల్లో సెమీస్ వరకే పరిమితమైన భారత మహిళలు.. ఈసారి మాత్రం తుది పోరుకు అర్హత సాధించారు. ఈ రోజు ఇంగ్లండ్‌తో జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గ్రూప్-ఎలో అజేయంగా నిలిచిన భారత్ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. భారీ వర్షం కారణంగా కనీసం టాస్ కూడా పడకుండానే గేమ్ రద్దయ్యింది. (ఐసీసీపై మార్క్ వా ఫైర్) -
మిథాలీ, జులన్ లేకపోవడం లోటే: హర్మన్
సిడ్నీ: భారత టి20 ప్రపంచకప్ జట్టులో బ్యాటింగ్, బౌలింగ్ దిగ్గజాలు మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలు లేకపోవడం లోటేనని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. అయితే ప్రతిభావంతులైన యువ క్రీడాకారిణులు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారని 30 ఏళ్ల కెప్టెన్ పెర్కొంది. మిథాలీ, జులన్ ఇద్దరూ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పగా ప్రస్తుత భారత మహిళల జట్టు పూర్తిగా యువ క్రికెటర్లతో ఉంది. ప్రస్తుత జట్టులో అమ్మాయిల సగటు వయసు 22.8 ఏళ్లే! ఇందులో ఒక్క హర్మన్‌ప్రీతే అందరికంటే సీనియర్. ఆస్ట్రేలియాలో ఈ నెల 21న మొదలయ్యే పొట్టి మెగా ఈవెంట్ కోసం సన్నద్ధమయ్యేందుకు హర్మన్ సేన గత నెలలోనే కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. సన్నాహకంగా ఇంగ్లండ్, ఆసీస్‌లతో కలిసి ముక్కోణపు టి20 సిరీస్ ఆడింది. ప్రపంచకప్‌కు ముందు మీడియాతో కెప్టెన్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జట్టు సత్తా, సామర్థ్యంపై తన అభిప్రాయాలను వెల్లడించింది. చక్కని కూర్పుతో.... ‘ఇప్పటికే మేం ఇద్దరు అనుభవజ్ఞుల సేవల్ని కోల్పోయాం. ఆ లోటు పూడ్చలేనిది. ఇప్పుడు యువ ప్రతిభావంతులపైనే ఆధారపడ్డాం. వీరికి సత్తా చాటే సామర్థ్యం ఉంది. మా సహచరులెవరిలోనూ మేం అంతగా అనుభవం లేని యువ క్రికెటర్లం అనే భావనే లేదు. ఆశించిన స్థాయిలో వారంతా రాణిస్తున్నారు. జట్టు చక్కని కూర్పుతో ఉంది. జట్టుకు అవసరమైన రోజు శక్తికి మించి అదనపు భారం మోసేందుకు, బాధ్యతలు స్వీకరించేందుకు మా అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. రోజురోజుకీ మా జట్టు బాగా పటిష్టమవుతోంది’ అని హర్మన్ వ్యాఖ్యానించింది. అప్పటి నిరాశ ఇప్పుడెందుకు... ‘మూడేళ్ల క్రితం 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన చేదు అనుభవం ఎప్పుడో మరిచిపోయాం. ఇప్పుడు తాజాగా ఈ టోర్నీని ఆరంభిస్తాం. మా శక్తిమేర మేం రాణిస్తాం. ఒకవేళ టి20 కప్ గెలిస్తే అదే పెద్ద బహుమతి అవుతుంది. ఏదేమైనా ఒత్తిడి లేకుండా ఆడేందుకే ప్రయత్నిస్తాం. సహచరుల్లో కొందరికి ఇక్కడ మహిళల బిగ్‌బాష్ లీగ్ ఆడిన అనుభవం ఉంది. అది ఇప్పుడు అక్కరకొస్తుంది. మేం కప్ కొడితే మాత్రం ఎన్నో మారిపోతాయి. ఒకవేళ మహిళల ఐపీఎల్ అంటూ పెడితే మాకెంతో మేలు జరుగుతుంది’ అని వరుసగా ఏడో టి20 ప్రపంచకప్‌లో ఆడనున్న హర్మన్ తెలిపింది. -
థాంక్యూ తాప్సీ: మిథాలీ రాజ్
తన జీవితాన్ని వెండితెరపై వీక్షించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నానని భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ అన్నారు. తన కథను ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు వయాకామ్ 18 సంస్థకు కృతఙ్ఞతలు తెలిపారు. భారత మహిళా క్రికెట్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా.. ‘శభాష్ మిథు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాప్సీ ప్రధాన పాత్రలో రాహుల్ డోలకియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో శభాష్ మిథుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా... ‘‘నీ అభిమాన క్రికెటర్ ఎవరు అని తరచుగా నన్ను అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్లను మీ అభిమాన మహిళా క్రికెటర్ అడగండి’’... ఈ స్టేట్మెంట్ ప్రతీ క్రికెట్ ప్రేమికుడిని ఒక్క క్షణం ఆలోచింపజేసింది. నిజానికి వాళ్లు ఆటను ప్రేమిస్తున్నారా లేదా ఆటగాళ్లను ప్రేమిస్తున్నారా అనే ప్రశ్నను తలెత్తించింది. మిథాలీ రాజ్ నువ్వు గేమ్ ఛేంజర్’ అంటూ ఆమె మాటలను ఉటంకిస్తూ తాప్సీ తన పవర్ఫుల్ లుక్‌ను ట్విటర్లో షేర్ చేశారు. ఇందుకు స్పందించిన మిథాలీ రాజ్... ‘‘ థాంక్యూ తాప్సీ!!... నువ్వు నా జీవితాన్ని వెండితెరపైకి తీసుకువస్తున్నావు’’ అని ట్వీట్ చేశారు. నువ్వు దీన్ని మైదానం అవతల పడేలా కొడతావు అంటూ క్రికెట్ భాషలో ఆమె నటనా కౌశల్యంపై ప్రశంసలు కురిపించారు. అదే విధంగా నిర్మాణ సంస్థ వయాకామ్18 కు కూడా ధన్యవాదాలు తెలిపారు. (స్టైలిష్ షాట్ కొడుతూ.. 'శభాష్ మిథు' ఫస్ట్ లుక్) It’s really time to stand up for the women in blue . Thank you @AndhareAjit the poster looks really good . https://t.co/Np3sia5oeo — Mithali Raj (@M_Raj03) January 29, 2020 -
స్టైలిష్ షాట్ కొడుతూ.. 'శభాష్ మిథు' ఫస్ట్ లుక్
ప్రస్తుతం దేశంలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే ధోని, సచిన్ ఇలా ఎందరో క్రీడాకారుల జీవితాలపై సినిమాలు రూపొందిన సంగతి తెల్సిందే. వారి దారిలోనే మహిళా ప్రపంచ క్రికెట్లో అద్భుతంగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించిన ఉమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్. భారత్ క్రికెట్‌కి ఎనలేని సేవలందించిన ఆమె జీవిత నేపథ్యంలో తాజాగా ఓ బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. వయాకామ్ 18 సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. మిథాలీ బయోపిక్‌లో ఆ నటి.. ఈ చిత్రంలో మిథాలీ పాత్రలో తాప్సీ నటిస్తోంది. షారుఖ్ ఖాన్‌తో ‘రాయీస్’ మూవీ రూపొందించిన రాహుల్ డోలాకియా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ‘శభాష్ మిథు’ పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. కాగా నేడు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో తాప్సీ మిథాలీ పాత్రలో ఒదిగిపోయి.. స్టైలిష్ షాట్ కొడుతున్నట్టుగా కనిపిస్తోంది. 2021 ఫిబ్రవరి 2న సినిమాను విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. “I have always been asked who’s your favourite male cricketer but you should ask them who their favourite female cricketer is.” The statement that made every cricket lover pause n introspect that do they love the game or the gender playing it.@M_Raj03 you are a ‘Game Changer’ pic.twitter.com/2VlxYpXmSM — taapsee pannu (@taapsee) January 29, 2020 -
‘నో’ కాంట్రాక్ట్ ‘లో’ కాంట్రాక్ట్
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాబోయే ఏడాది కాలానికి కొత్తగా వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. 27 మందితో రూపొందించిన ఈ జాబితాలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి చోటు దక్కలేదు. గత జులైలో ప్రపంచ కప్ సెమీ ఫైనల్ తర్వాత భారత్‌కు ప్రాతినిధ్యం వహించని ధోని భవిష్యత్తుపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. 2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబరు వరకు ఈ కాంట్రాక్ట్ వర్తిస్తుంది. టాప్ గ్రేడ్ అయిన ‘ఎ ప్లస్’లో ఎప్పటిలాగే ముగ్గురు క్రికెటర్లు కోహ్లి, రోహిత్, బుమ్రాలకే అవకాశం దక్కింది. రాహుల్‌కు ప్రమోషన్... టాపార్డర్ బ్యాట్స్‌మన్ లోకేశ్ రాహుల్ ఇటీవల నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. దాంతో అతడిని ‘బి’ గ్రేడ్ నుంచి ‘ఎ’ గ్రేడ్‌లోకి ప్రమోట్ చేశారు. టెస్టు ఓపెనర్‌గా తన స్థానం సుస్థిరం చేసుకున్న మయాంక్ అగర్వాల్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా ‘సి’నుంచి ‘బి’లోకి వచ్చారు. ముగ్గురు ఆటగాళ్లు అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, ఖలీల్ అహ్మద్ తమ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. కొత్తగా సైనీ, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్‌లకు తొలిసారి గ్రేడ్ ‘సి’ కాంట్రాక్ట్ దక్కింది. సమాచారమిచ్చారట..! ప్రపంచ కప్ సెమీఫైనల్ తర్వాత ధోని మైదానంలో కనిపించలేదు. మళ్లీ ఆడతాడా లేదా తెలీదు. తాను ఏ ప్రకటన ద్వారానూ చెప్పడు. సెలక్షన్ కమిటీకి సమాచారమే ఉండదు. బోర్డు అధ్యక్షుడు గంగూలీ త్వరలోనే తేలుస్తామంటాడు గానీ స్పష్టతనివ్వడు. ఇలాంటి నేపథ్యంలో కోచ్ రవిశాస్త్రి నోటినుంచి వచ్చిన మాటలే బ్రహ్మపలుకులుగా భావించాల్సి వస్తోంది. టెస్టులకు ఎప్పుడో దూరమైన ధోని ఇక వన్డే కెరీర్ కూడా ముగిసినట్లేననే అతను పరోక్షంగా చెప్పాడు. ఇప్పుడు కాంట్రాక్ట్‌నుంచి తప్పించడం ద్వారా బీసీసీఐ కూడా తమ నిర్ణయం వెలువరించిందనే అర్థం చేసుకోవచ్చు. గత అక్టోబరు నుంచి ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వచ్చే సెప్టెంబరులోగా ఆడతాడనే నమ్మకం లేదు. ఒక వేళ ఐపీఎల్లో అద్భుతంగా ఆడి టి20 ప్రపంచకప్ జట్టులోకి వచ్చినా ఆ టోర్నీ అక్టోబరులో ఉంది. కాబట్టి నిబంధనల ప్రకారం చూస్తే ధోనికి కాంట్రాక్ట్ అర్హత లేదు. ఈ విషయంపై మాజీ కెప్టెన్‌కు ముందే సమాచారం ఇచ్చినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. స్వయంగా గంగూలీయే దీనిని చెప్పినట్లు తెలుస్తోంది. ‘బోర్డు అత్యున్నత అధికారి ఒకరు కాంట్రాక్ట్ విషయం గురించి ధోనితో మాట్లాడారు. తనకు అర్హత లేదు కాబట్టి తన పేరు పరిశీలించవద్దని అతనే చెప్పాడు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. మళ్లీ అతను జట్టులోకి వస్తే కాంట్రాక్ట్ తిరిగి రావడం పెద్ద విషయం కాదు’ అని బోర్డు సభ్యుడొకరు వెల్లడించారు. రంజీ టీమ్‌తో కలిసి... రూ. 5 కోట్ల విలువ గల కాంట్రాక్ట్‌లో చోటు కోల్పోయిన రోజే ధోని మైదానంలోకి దిగడం విశేషం. తన స్వస్థలం రాంచీలో జార్ఖండ్ జట్టు రంజీ జట్టు సభ్యులతో కలిసి అతను ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. బ్యాటింగ్‌తో పాటు రెగ్యులర్ ట్రైనింగ్‌లో కూడా అతను భాగమైనట్లు జార్ఖండ్ టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ప్రత్యేక బౌలింగ్ మెషీన్ ద్వారా అతను సాధన చేయడం విశేషం. రంజీ ఆటగాళ్లంతా ఎర్రబంతితో ప్రాక్టీస్ చేస్తే ధోని మాత్రం తెల్ల బంతితో ఆడాడు. తద్వారా పోటీ క్రికెట్ కోసం తాను సిద్ధమవుతున్నట్లు మహి పరోక్షంగా చూ పించాడు. ఐపీఎల్‌తోనే పునరాగమనం చేయవచ్చు. కొత్త కాంట్రాక్ట్ జాబితా (గ్రేడ్లవారీగా) ‘ఎ ప్లస్’ (రూ. 7 కోట్లు) కోహ్లి, రోహిత్, బుమ్రా ‘ఎ’ (రూ. 5 కోట్లు) అశ్విన్, జడేజా, భువనేశ్వర్, పుజారా, రహానే, ధావన్, షమీ, ఇషాంత్, కుల్దీప్, పంత్, రాహుల్ ‘బి’ (రూ. 3 కోట్లు) ఉమేశ్, చహల్, పాండ్యా, సాహా, మయాంక్ ‘సి’ (రూ. 1 కోటి) జాదవ్, మనీశ్ పాండే, విహారి, సైనీ, దీపక్ చాహర్, శార్దుల్, అయ్యర్, వాషింగ్టన్ సుందర్. ‘బి’ గ్రేడ్‌కు మిథాలీ రాజ్ మహిళల జట్టు కాంట్రాక్ట్‌లలో వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ దిగువకు పడిపోయింది. ఇప్పటి వరకు ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న ఆమెను ‘బి’ గ్రేడ్‌లోకి మార్చారు. టి20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రస్తుతం మిథాలీ ఒకే ఫార్మాట్లో ఆడుతోంది. ‘ఎ’ గ్రేడ్‌లో టి20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ , ఓపెనర్ స్మృతి మంధాన తమ స్థానాలు నిలబెట్టుకోగా, కొత్తగా లెగ్‌స్పిన్నర్ పూనమ్ యాదవ్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది. ఇటీవల భారత్ విజయాల్లో పూనమ్ కీలక పాత్ర పోషించింది. రాధ యాదవ్, తాన్యా భాటియాలకు ‘సి’ గ్రేడ్‌నుంచి ‘బి’లోకి ప్రమోషన్ లభించగా, 15 ఏళ్ల షఫాలీ శర్మకు తొలిసారి కాంట్రాక్ట్ దక్కింది. మహిళల జట్టు కాంట్రాక్ట్‌లు కూడా 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబర్ వరకు వర్తిస్తాయి. కొత్త కాంట్రాక్ట్ జాబితా (గ్రేడ్లవారీగా) ‘ఎ’ (రూ. 50 లక్షలు) హర్మన్, స్మృతి, పూనమ్ యాదవ్ ‘బి’ (రూ. 30 లక్షలు) మిథాలీ, ఏక్తా బిష్త్, జులన్, శిఖా పాండే, దీప్తి శర్మ, జెమీమా, తాన్యా, రాధ ‘సి’ (రూ. 10 లక్షలు) హేమలత, అనూజ, వేద, మాన్సి, అరుంధతి రెడ్డి, రాజేశ్వరి, పూజ, హర్లీన్, ప్రియ పూనియా, పూనమ్ రౌత్, షఫాలీ వర్మ -
‘స్టార్స్’ @ రాజ్‌భవన్
-
శభాష్ మిథు
వెండితెరపై కొత్త ఆట ఆడటానికి రెడీ అయిపోయారు కథానాయిక తాప్సీ. ‘శభాష్ మిథు’లో క్రికెటర్‌గా కనిపించబోతున్నారామె. ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ ఇది. ఈ చిత్రానికి రాహుల్ థోలాకియా దర్శకుడు. ‘కహానీ’ (2012), ‘క్వీన్’ (2014), ‘మేరీకోమ్’ (2014), ‘పద్మావత్’ (2018) వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తీసిన వయాకామ్ 18 సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. మంగళవారం మిథాలీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించడం విశేషం. ‘‘కలలను సాకారం చేసుకోవాలనుకునే యువతులకు నా సినిమా ఓ స్ఫూర్తిగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు మిథాలీరాజ్. ‘‘మిథాలీ.. నీ పుట్టినరోజుకి ఏం బహుమతి ఇవ్వాలో అర్థం కావడం లేదు. వెండితెరపై నాలో నువ్వు ప్రతిబింబించేలా ప్రయత్నిస్తానని ప్రామిస్ చేస్తున్నాను. కవర్ డ్రైవ్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’’ అన్నారు తాప్సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సూర్మ’ (2017)లో హాకీ ప్లేయర్‌గా, సాంద్ కీ ఆంఖ్ (2019) సినిమాలో షూటర్‌గా నటించిన తాప్సీ తాజాగా ‘రష్మీ: ద రాకెట్’లో అథ్లెట్ (రన్నింగ్)గా నటిస్తున్నారు. ఇప్పుడు ‘శభాష్ మిథు’ సినిమా కోసం ఆమె క్రికెటర్‌గా మారారు. ఇవన్నీ గమనిస్తుంటే బాలీవుడ్లో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ అంటే తాప్సీనే చేయాలని దర్శక–నిర్మాతలు భావిస్తున్నట్లు అనిపిస్తోంది కదూ. -
మిథాలీ బయోపిక్‌లో ఆ నటి..
సాక్షి, హైదరాబాద్ : భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌లో టైటిల్ పాత్ర పోషిస్తున్నట్టు హీరోయిన తాప్సీ నిర్ధారించారు. మిథాలీ బర్త్‌డే సందర్భంగా తాప్సీ ఈ విషయం వెల్లడించారు. శభాష్ మితు పేరిట తెరకెక్కనున్న ఈ బయోపిక్‌లో దిగ్గజ మహిళా క్రికెటర్ పాత్రలో తాప్సీ ఒదిగిపోనున్నారు. హ్యాపీ బర్త్‌డే కెప్టెప్ మిథాలీరాజ్ అంటూ సోషల్ మీడియాలో తాప్సీ ఈ వివరాలు పోస్ట్ చేశారు.మహిళా క్రికెటర్‌గా మిథాలీ ప్రస్ధానాన్ని తాను స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసే అవకాశం రావడం గర్వకారణమని, శభాష్మిథులో మిథాలీ తనను తాను సరైన రీతిలో చూసుకునేలా నటిస్తానని తాప్సీ చెప్పుకొచ్చారు. చివరిగా తాను కవర్‌డ్రైవ్ ఎలా ఆడాలో నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తాప్సీ పేర్కొన్నారు. -
సెల్ఫీ దిగండి.. పోస్ట్ చేయండి..
భారతదేశాన్ని కర్మభూమిగా పిలుస్తాం. మాతృగడ్డను తల్లితో పోలుస్తాం.మహిళను ఆదిపరా శక్తిగా ఆరాధిస్తాం. దేవతగా పూజిస్తాం. ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందంటూ ఆనందిస్తాం. అలాంటి ఆడపిల్లను గౌరవించుకునే అరుదైన అవకాశం వచ్చింది. వివిధ వృత్తుల్లో భాగస్వాములైన అమ్మాయిలు దేశ నిర్మాణంలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. మామూలు ఉద్యోగాల నుంచి ‘మంగళ్యాన్’ ప్రయోగాల వరకు వారి పాత్ర అనన్యం. అబల నుంచి సబలగా మారి జాతికి దశ దిశ నిర్దేశించడంలో భాగస్వాములవుతున్న మహిళలను ఈ దీపావళికి భారతలక్ష్మి పేరుతో గౌరవించుకుందామన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో దేశమంతా కదులుతోంది. వివిధ రంగాల్లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న మన ఇంటి మహాలక్ష్మినిసత్కరించుకోవాల్ని బాధ్యత ఎంతో ఉంది. ఈ క్రమంలో మన భాగ్యనగరలక్ష్మిలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, క్రికెటర్ మిథాలీరాజ్, టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ సింగిల్స్ ప్లేయర్ సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల, జిమ్నాస్ట్ అరుణాబుద్ధారెడ్డి, టెన్నిస్ ప్లేయర్ ప్రాంజల, త్రోబాల్ క్రీడాకారిణి ఇందూజ గడ్డం... ఇలా పలువురు మహిళా క్రీడాకారులు తమ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరుస్తూ.. ప్రపంచ పటంలో భారత్ కీర్తిని నలు దిశలా చాటుతున్నారు. వీరి రికార్డ్స్, అచీవ్‌మెంట్స్‌ను గురిస్తూ.. ప్రతి ఒక్కరూ తమ ప్రాంతంలో వారిని గౌరవించాలంటూ మోదీ పిలుపునిచ్చారు. కేవలం క్రీడారంగమే కాదు.. విద్య, వైద్యం వంటి రంగాల్లోనూ ప్రతిభ కనబరుస్తున్న వారిని ఈ దీపావళి సందర్భంగా గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఉందనేది ప్రధాని మోదీ ఆలోచన. మిక్స్డ్.. ఉమన్కేటగిరీలో కెరటం గుత్తా జ్వాల. 1990లో బ్యాడ్మింటన్ ఆటలో అరంగ్రేటం చేసింది. మిక్స్డ్, ఉమెన్ కేటగిరీల బ్యాడ్మింటన్‌లో గుత్తా ఓ సరికొత్త కెరటం. 2009, 2011 సంవత్సరాల్లో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌ని సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. ఒలింపిక్స్‌లో రెండు ఈవెంట్స్‌లో క్వాలిఫై అయిన మొదటి క్రీడాకారిణిగా రికార్డ్ నెలకొల్పింది. బ్యాడ్మింటన్‌లో మేటి.. పీవీ సింధు. బ్యాడ్మింటన్‌పై మక్కువతో అడుగుపెట్టిన ఈమె ఇంటర్నేషనల్ డెబ్యూ గేమ్‌ని 2009లో ఆడింది. నాటి నుంచి ఇప్పటికీ తన ఆటతో క్రీడాభిమానులను మెప్పిస్తోంది. ఇటీవల ప్రపంచ టోర్నమెంట్లో బంగారు పతకం సాధించి తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రస్తుతం యావత్ప్రపంచమే సింధు జపం చేసేలా, తన ఆటకు ఫిదా అయ్యేలా మలుచుకోవడం ఆమెకు ఆమే సాటి. షీ ఈజ్ ఫస్ట్ వరల్డ్‌నంబర్‌వన్ సానియా మీర్జా.. పరిచయం అక్కర్లేని పేరు. టెన్నిస్ గేమ్‌లో ఈమె రారాణి. బ్యాట్ చేతపట్టి దిగితే యువత నుంచి వృద్ధుల వరకు కేరింతలు కొట్టాల్సిందే. ఎవరెన్ని కామెంట్స్ చేసినా.. తన ఆటతోనే సమాధానం చెప్పి ఫస్ట్ వరల్డ్‌నంబర్ వన్ ర్యాంకును సాధించింది ఈ హైదరాబాదీ. తన ఆటతో ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకొన్న ఘనత సానియా సొంతం. సింధుకు మోదీ పిలుపు ఇటీవల ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో ‘భారత్‌కీ లక్ష్మి’ అంశంపై మాట్లాడారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న అమ్మాయిలను గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు, బాలీవుడ్ టాప్ స్టార్ దీపిక పదుకొనేలను గౌరవించుకుందాం.. అంటూ ఆయన చెప్పారు. ఇదే విషయంపై వారిద్దరూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. దీనికి తాము సహకరిస్తున్నామని, మహిళకు గుర్తింపు ఉంటేనే దేశ నిర్మాణంలో భాగస్వామ్యం మరింత ఎక్కువగా, బాధ్యతగా ఉంటుందనడం విశేషం. త్రోబాల్‌లో టాపర్.. త్రోబాల్ గేమ్ పెద్దగా ఆదరణ లేని గేమ్ ఇది. కానీ..సిటీకి చెందిన గడ్డం ఇందూజ ఇదే గేమ్‌ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపర్చింది. స్కూల్ గేమ్‌తో ప్రారంభించి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో విజయదుందుభి మోగిస్తోంది. ఇప్పటి వరకు 8 అంతర్జాతీయ టోర్నమెంట్లను ఆడిన ఇందూజ 5 గోల్డ్ మెడల్స్ సాధించింది. కొన్నేళ్లుగా భారత్ జట్టు కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తోంది. టెన్నిస్ సింగిల్స్‌లో సూపర్.. ప్రాంజల యడ్లపల్లి. టెన్నిస్ ప్లేయర్. తన కెరీర్లో హైయెస్ట్ సింగిల్స్ ఆడిన సూపర్ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా సింగిల్స్ ర్యాంకింగ్‌లో 280, డబుల్స్‌లో 232 ర్యాంకులను సొంతం చేసుకున్న క్రీడాకారిణిగా సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. మహిళా క్రికెట్లో సంచలనం.. మిథాలీరాజ్ దొరై. క్రికెట్ అనే ఆట కేవలం పురుష క్రికెటర్లకే పరిమితం అనే మాటలకు చెక్ పెట్టింది. తన సారథ్యంలో భారత జట్టును రెండు పర్యాయాలు ఫైనల్స్‌కి తీసికెళ్లిన ఘనత సొంతం చేసుకుంది. ఆమె ద్వారానే మహిళా క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం విశేషం. నేటితరం అమ్మాయిలు క్రికెట్‌ని కెరీర్‌గా ఎంచుకోవడానికి ప్రధాన కారణం మిథాలీరాజ్ అంటే అతిశయోక్తి కాదేమో. 24 అంతర్జాతీయ టైటిల్స్ విజేత సైనా నెహ్వాల్. బ్యాండ్మింటన్ సింగిల్స్‌లో ఈమె ఓ ప్రభంజనం. 2006లో అండర్– 19 నేషనల్ చాంపియన్‌షిప్‌లో ఓ చరిత్రను సృష్టించింది. ఆ రంగంలో ఇప్పటి వరకు ఈమె 24 అంతర్జాతీయ టైటిల్స్‌ని సాధించి తిరుగులేని బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణించడంవిశేషం. కన్నతండ్రి స్వప్నం సాకారం.. అరుణ బుద్ధారెడ్డి. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్‌లో ఈ హైదరాబాదీ పెను ప్రభంజనం సృష్టించింది. తన తండ్రి చూపిన బాటలో నడుస్తూ.. ఆయన ఇచ్చిన భరోసాతో ముందుకెళుతూ.. 2018 వరల్డ్‌కప్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. అందరి మనసులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతోంది. సెల్ఫీ దిగండి.. పోస్ట్ చేయండి మీ ఇంట్లో కూడా ప్రతిభావంతమైన కూతురు, కోడలు ఉన్నారా? వారు ఏం రంగంలో రాణిస్తున్నారు, వారు సాధించిన ఘనతలు ఏంటి? వారికి తల్లిదండ్రులుగా మీరు ఇస్తున్న గౌరవం ఏంటి అనే విషయాలను పొందుపరుస్తూ.. సెల్ఫీ దిగండి. దాన్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ‘భారత్‌కీ లక్ష్మి’ పేరుకు హ్యాష్‌ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. ఈ దీపావళి సందర్భంగా ఇటు నేరుగా.. అటు సోషల్ మీడియా ద్వారా మన ఇంటి లక్ష్మిలను మనం సత్కరించుకుందాం.. గౌరవించుకుందామంటున్నారు ప్రధాని మోదీ. -
దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మిథాలీ రాజ్
సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు ట్రోలింగ్ బెడద తప్పడం లేదు. అనవసర విషయాలను హైలెట్ చేస్తూ సెలబ్రెటీలను ఇరుకున్న పెట్టాలని కొందరు నెటిజన్లు భావిస్తుంటారు. అయితే కొన్ని సార్లు సఫలమవుతే.. మరికొనిసార్లు విమర్శలపాలవుతుంటారు. తాజాగా టీమిండియా మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్ తనను ఇరుకున పెట్టాలని భావించిన ఓ నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఇటీవలే దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇదే క్రమంలో మిథాలీ కెప్టెన్‌గా వందో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మిథాలీని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. దీంతో చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన క్రికెట్ దిగ్గజం మెచ్చుకోవడం ఆనందంగా ఉందని మిథాలీ రీట్వీట్ చేసింది. అయితే మిథాలీ ట్వీట్‌పై సుగు అనే ఓ నెటిజన్ మిశ్రమంగా స్పందించింది. మిథాలీ మాతృభాష తమిళం అయినప్పటికీ ఎప్పుడూ ఆ భాష మాట్లడదని, కేవలం ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లోనే మాట్లాడుతుందని విమర్శించింది. అయితే ‘నా మాతృభాష తమిళమే. నేను ఈ భాషను బాగా మాట్లాడుతా. ఒక తమిళ వ్యక్తిగా జీవించడం గర్వపడుతున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా భారతీయురాలిగా గర్విస్తున్నా. నా ప్రతీ పోస్టుకు మీరు వెరైటీగా స్పందిస్తారు. అయితే మీ మాటలను సలహాలుగా తీసుకొని ముందుకుసాగుతా’అంటూ ఆ నెటిజన్‌కు మిథాలీ గట్టి కౌంటర్ ఇచ్చింది. అంతేకాకుండా టేలర్ స్విఫ్ట్ పాటను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం మిథాలీ ట్వీట్ తెగ వైరల్ అయింది. మిథాలీకి మద్దతు తెలుపుతూ సదరు నెటిజన్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల క్రికెట్ తలరాతను మార్చిన లెజండరీ క్రికెట్ మిథాలీ అని ప్రశంసిస్తున్నారు. ‘20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్.. అత్యధిక పరుగులు.. వంద కెప్టెన్సీ విజయాలు.. ఇవేమీ కనిపించలేదా కేవలం తన భాష మాత్రమే నీకు కనిపించిందా? దీంతో నువ్వేంటో అర్థం చేసుకోవచ్చు’అంటూ మరికొంత మంది మిథాలీకి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా, మిథాలీ సారథ్యంలోని టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికాను వైట్‌వాష్ చేసిన విషయం తెలిసిందే. -
స్మృతి... టాప్ ర్యాంక్ చేజారె
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వ్యక్తిగత వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ‘టాప్’లో ఉన్న స్మృతి మంధాన రెండో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికాతో సోమవారం ముగిసిన వన్డే సిరీస్‌కు గాయం కారణంగా దూరమవ్వడం ఆమె వ్యక్తిగత ర్యాంకింగ్‌పై ప్రభావం చూపింది. ప్రస్తుతం స్మృతి 755 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... 759 పాయింట్లతో న్యూజిలాండ్ ప్లేయర్ అమీ సాటర్త్‌వెయిట్ మొదటి ర్యాంక్‌కు ఎగబాకింది. క్రికెట్ కెరీర్లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సారథి మిథాలీ రాజ్ ఒక స్థానాన్ని కోల్పోయి ఏడో ర్యాంక్‌కు పరిమితం కాగా... టి20 కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 17వ స్థానంలో నిలిచింది. -
భారత మహిళలదే వన్డే సిరీస్
వడోదర: ఇప్పటికే టి20 సిరీస్‌ను గెల్చుకున్న భారత మహిళల జట్టు అదే దూకుడుతో వన్డే సిరీస్‌ను వశం చేసుకుంది. దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పూనమ్ రౌత్ (92 బంతుల్లో 65; 7 ఫోర్లు), కెపె్టన్ మిథాలీ రాజ్ (82 బంతుల్లో 66; 8 ఫోర్లు) అర్ధ సెంచరీల కారణంగా భారత్ మరో రెండు ఓవర్లు ఉండగానే విజయాన్ని అందుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో దక్కించుకుంది. తొలుత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఆరంభంలో ఓపెనర్లు లిజెల్లే లీ (40; 3 ఫోర్లు, సిక్స్), లారా వోల్వార్డ్ (69; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించి శుభారంభం చేశారు. అనంతరం ప్రీజ్ (44; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో ఒక దశలో దక్షిణాఫ్రికా 142/3తో పటిష్టంగా కనిపించింది. అయితే చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడంతో పర్యాటక జట్టు అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. శిఖా పాండే, ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్ చెరో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. అనంతరం భారత్ 48 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. మిథాలీ రాజ్, పూనమ్ రౌత్ అర్ధ సెంచరీలకు తోడు చివర్లో హర్మన్‌ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది. సిరీస్‌లో చివరి వన్డే ఈనెల 14న ఇక్కడే జరుగుతుంది.