
హీరోయిన్ తాప్సీ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న ‘రష్మీ రాకెట్’ మూవీ షూటింగ్ ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తాప్సీకి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తాప్పీ క్రికెట్ బ్యాట్ పట్టుకొని నెట్ ప్రాక్టిస్ చేస్తున్నారు. వైవిధ్యమైన చిత్రాల్లో నటించే తాప్సీ.. సినిమా కోసం ఎలాంటి విద్యనైనా నేర్చుకోవడంలో ముందుంటారు. ఆమె నటిస్తున్న మరో చిత్రం ‘షాబాష్ మిథు’. ఈ మూవీలో ఆమె భారత మహిళ క్రికెట్ ప్లేయర్ మిథాలి రాజ్ పాత్రలో కనిపించనున్నారు.
అందుకోసం తాప్సీ క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటూ బ్యాటింగ్ మెలకువలు నేర్చుకుంటున్నారు. ఈ సినిమాలో క్రికెట్ ప్లేయర్ మిథాలి రాజ్ బయోపిక్‌గా తెరకెక్కనుంది. క్రికెట్ శిక్షణకు సంబంధించిన తాప్సీ ఫొటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. ఆమె శిక్షణ వారం రోజులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆమెకు నూషిన్ అల్ ఖదీర్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆమె తన కొత్తం చిత్రం ‘లూప్ లపేటా’ చిత్రీకరణలో పాల్గొన్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.
చదవండి: బాయ్‌ఫ్రెండ్ గురించి నోరువిప్పిన తాప్సీ
Comments
Please login to add a commentAdd a comment