tapsi pannu
-
ఓటీటీలో తాప్సీ హిట్ సినిమా సీక్వెల్ రెడీ
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హసీన్ దిల్రుబా’. మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం 2021లో విడుదలైంది. వినీల్ మాథ్యూ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని సస్పెన్స్‌కి గురి చేయడమే కాకుండా బాక్సాఫీసు దగ్గర సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ పేరుతో మళ్లీ వచ్చేస్తుంది. ఈ క్రమంలో విడుదల తేదీని కూడా మేకర్స్ తాజాగా ప్రకటించారు.‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ సీక్వెల్‌ను జయ్‌ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించారు. కనికా థిల్లాన్ నిర్మాత. ఇందులో విక్రాంత్ మాస్సే, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. మర్డర్ మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 9న డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు.నిర్మాత కనికా ధిల్లాన్ మాట్లాడుతూ తాప్సీ పన్ను చాలా అద్భుతంగా ఈ చిత్రంలో నటించారని తెలిపింది. పార్ట్ 1 కంటే సీక్వెల్లో ఆమె అందరినీ ఆకట్టుకునేలా మెప్పించారని చెప్పారు. మరో ప్రధాన పాత్రలో నటించిన విక్రాంత్‌మాస్సే గురించి కూడా ఆమె మాట్లాడింది. ఆయనలోని ప్రతిభ ఈ సినిమాతో మరింతగా ప్రకాశిస్తుందని కనికా చెప్పింది. మీర్జాపూర్లో బబ్లూ పండిట్ పాత్రలో కనిపించిన విక్రాంత్ తెలుగువారికి పరిచయం అయ్యాడు. '12th ఫెయిల్' సినిమాతో మరింత పాపులర్ అయ్యాడు. -
బ్యాట్ పట్టిన బ్యూటీ.. వీడియో వైరల్
హీరోయిన్ తాప్సీ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న ‘రష్మీ రాకెట్’ మూవీ షూటింగ్ ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తాప్సీకి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తాప్పీ క్రికెట్ బ్యాట్ పట్టుకొని నెట్ ప్రాక్టిస్ చేస్తున్నారు. వైవిధ్యమైన చిత్రాల్లో నటించే తాప్సీ.. సినిమా కోసం ఎలాంటి విద్యనైనా నేర్చుకోవడంలో ముందుంటారు. ఆమె నటిస్తున్న మరో చిత్రం ‘షాబాష్ మిథు’. ఈ మూవీలో ఆమె భారత మహిళ క్రికెట్ ప్లేయర్ మిథాలి రాజ్ పాత్రలో కనిపించనున్నారు. అందుకోసం తాప్సీ క్రికెట్లో శిక్షణ తీసుకుంటూ బ్యాటింగ్ మెలకువలు నేర్చుకుంటున్నారు. ఈ సినిమాలో క్రికెట్ ప్లేయర్ మిథాలి రాజ్ బయోపిక్‌గా తెరకెక్కనుంది. క్రికెట్ శిక్షణకు సంబంధించిన తాప్సీ ఫొటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. ఆమె శిక్షణ వారం రోజులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆమెకు నూషిన్ అల్ ఖదీర్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆమె తన కొత్తం చిత్రం ‘లూప్ లపేటా’ చిత్రీకరణలో పాల్గొన్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: బాయ్‌ఫ్రెండ్ గురించి నోరువిప్పిన తాప్సీ -
చర్మాన్ని చర్మం తాకలేదు గనుక..
చిన్నారుల రక్షణ చట్టం ‘పోక్సో’. తగని విధంగా వారిని తాకితే మూడేళ్ల జైలు! అతడు తాకాడు. తగని విధంగానే తాకాడు. కానీ అతడు దోషి కాదని తీర్పొచ్చింది! స్కిన్–టు–స్కిన్ తాకలేదు కనుక..‘పోక్సో’ కింద శిక్షించలేమని ‘వస్త్ర’ భాష్యం! సమాజం దిగ్భ్రాంతి చెందింది. చట్టానికి గ్రిప్ లేదా? న్యాయానికి నిజంగానే చూపులేదా? పేరొద్దు. ముప్పై తొమ్మిదేళ్ల అతను అందాం. పేరు చెబితే ఆ పేరు గల వాళ్లందరికి తలవంపులుగా ఉండొచ్చు. ఇక ఆ పన్నెండేళ్ల బాలిక పేరు కూడా చట్ట ప్రకారం బయటికి తెలియడానికి లేదు. అతను నిందితుడు. ఆ చిన్నారి బాధితురాలు. 2016 డిసెంబర్లో ఓ రోజు అతడు తినేందుకు ఏదో తాయిలం ఇస్తానని ఆశపెట్టి ఆ బాలిక ను తన ఇంటికి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్లాక తలుపేసి, బాలిక ఛాతీని నొక్కాడు. ఒంటి మీది బట్టలు కూడా తీయబోయాడు. బాలిక పెద్దగా అరిచింది. పెద్దవాళ్లకు తెలిసింది. అతడికి నాలుగు తగిలించి పోలీసులకు అప్పగించారు. అతడిపై ‘పోక్సో’ కేసు నమోదైంది. పోక్సో అంటే ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్’! కఠినమైన చట్టం. లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేందుకు భారత ప్రభుత్వం 2012లో ఈ చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం దోషికి కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. ఈ కేసులో దోషికి కూడా కింది కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్ 354 కేసు కింద కూడా అతడిపై మరో కేసు నమోదైంది. ఈ సెక్షన్ ప్రకారం మహిళపై లైంగిక అకృత్యానికి పాల్పడితే కనీసం రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ విధిస్తారు. ఈ రెండు కేసులపై అతడు నాలుగేళ్లు గా బాంబే హైకోర్టులో ‘న్యాయం’ కోసం పోరాడుతున్నాడు! చివరికి ఈ జనవరి 19న తీర్పు వెలువడింది. తీర్పేంటి? బాంబే హైకోర్టులో తీర్పు కోసం ఈ కేసు నాగపూర్ బెంచ్ పైకి వచ్చింది. సింగిల్ జడ్జి బెంచి అది. ఆ రోజు బెంచిపై జస్టిస్ పుష్పా గనేడివాలా ఉన్నారు. మహిళా జడ్జి! కింది కోర్టు విధించిన శిక్షను తన తీర్పులో ఆమె సమర్థించబోతున్నారనే బాలిక వైపు వాళ్లు అనుకున్నారు. కానీ తీర్పు దోషికి అనుకూలంగా వచ్చింది! ‘‘అతడు దోషే కానీ, అతడు చేసిన నేరం ‘పోక్సో’ పరిధిలోకి రాదు కనుక, ఆ చట్టం నుంచి మినహాయించి, ఐపీసీ సెక్షన్ 354 కింద మాత్రమే అతడిని నేరస్థుడిగా పరిగణించడం జరిగింది’’ అని జస్టిస్ పుష్ప తీర్పు ఇచ్చారు! అంటే.. చిన్నారికి రక్షణ కల్పించే చట్టం కింద అతడికి శిక్ష పడదు. ఒక మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు మాత్రమే పడుతుంది. ‘‘దుస్తుల పై నుంచి చిన్నారి ఒంటిని తాకినంత మాత్రాన అది పోక్సో నేరం అవదు. చర్మాన్ని చర్మం తాకాలి. కానీ ఈ కేసులో అలా జరగలేదు’’ అని జస్టిస్ పుష్ప తన తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. చిన్నారుల ఒంటిని తాకకూడని చోట తాకడం, చిన్నారుల చేత తగని చోట ఒంటిని తాకించుకోవడం మాత్రమే పోక్సో చట్టం కింద నేరం అవుతాయి కనుక, అతడు ఆ పని చేయలేదు కనుక ఆ ప్రత్యేక చట్టం ప్రకారం అతడు నిర్దోషే అని జస్టిస్ పుష్ప తీర్పునకు ముగింపు ఇచ్చారు. తీర్పులో తప్పేంటి? తీర్పు తీర్పే. అందులో తప్పొప్పులను ఎంచేందుకు ఉండదు. పైకోర్టుకు వెళ్లడం తప్ప! అయితే ఈ కేసుపై స్పందించకుండా మాత్రం ఎవరూ ఉండలేకపోతున్నారు. స్కిన్–టు–స్కిన్ కాంటాక్టు లేదు కనుక ‘పోక్సో’ చట్టం ప్రకారం చిన్నారి ఛాతీని ప్రెస్ చేయడం నేరం అవదన్న జస్టిస్ పుష్ప పరిశీలనను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ‘అలాగైతే మరి స్కిన్–టు–స్కిన్ తాకక పోయినా, దుస్తుల పైనుంచి తాకినా నేరమేనని పోక్సో చట్టంలో చేర్చండి’ అని అడుగుతున్నవాళ్లూ ఉన్నారు. మరికొందరు ఇంకొంచెం సూక్ష్మంగా ముందుకు వెళ్లి, మరింత తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పునకు అర్థమేంటి! ఇలాంటి ఒక నీతిబాహ్యమైన చర్యను, మానసిక రుగ్మతను, హీనత్వాన్నీ ఒక మామూలు విషయంగా చూసేందుకు మనం అలవాటు పడబోతున్నామా?! – ప్రియాంక చతుర్వేది, రాజ్యసభ సభ్యురాలు తీర్పును గురించిన వార్తను చదివాక ఎలా స్పందించాలో తెలీక మాటల్ని వెతుక్కున్నాను. గాట్ ఇట్ నౌ. హ్యాపీ నేషనల్ గర్ల్ చైల్డ్‌డే. (ఆవేదనగా, ఆవేశంగా..) – తాప్సీ, బాలీవుడ్ నటి ఈ తీర్పు ఫేక్ న్యూస్ అని ఎవరైనా చెప్పండి ప్లీజ్. – రితేశ్ దేశ్‌ముఖ్, టెలివిజన్ పర్సనాలిటీ బాంబే హైకోర్టులో సింగిల్ బెంచ్ వచ్చిన తీర్పుపై తక్షణం ‘లెటర్స్ పేటెంట్ అప్పీల్’ను ఫైల్ చేయండి. – కనూంగో, ఛైర్మన్, నేషనల్ కమిషన్, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ (మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం) -
నేనూ కూడా నెపోటిజం బాధితురాలినే!
చెన్నై : నేను బాధితురాలనే అంటోంది తాప్సీ. ఈ ఉత్తరాది భామ దక్షిణాదిలో మొదట కథానాయికగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళంలో మొదటగా ఆడుగళం చిత్రంలో ధనుష్‌కు జంటగా పరిచయమైంది. ఆ చిత్రం విజయంతో తర్వాత ఇక్కడ కొన్ని చిత్రాల్లో నటించిన నటిగా పెద్దగా పేరు సంపాదించుకోలేక పోయింది. తెలుగులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో తాప్సీ బాలీవుడ్‌ను నమ్ముకుంది. అక్కడ ఈ అమ్మడు నటించిన నామ్ షబానా, పింక్ వంటి చిత్రాలు సక్సెస్ అవడంతో బాలీవుడ్లో ప్రముఖ కథానాయికగా రాణిస్తోంది. ముఖ్యంగా నటనకు అవకాశం ఉన్న పాత్రలు ఈ అమ్మడిని వరించడం విశేషం. కాగా ఇప్పుడు అక్కడ నేపోటిజం అనే పదం చర్చనీయాంశంగా ట్రోల్ అవుతోంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటన తరువాత దానికి తామూ బాధితులమే అంటూ చెప్పుకొని పలువురు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అలా తాప్సీ కూడా బాధితురాలినే నని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. దీని గురించే ఆమె తెలుపుతూ సినీ పరిశ్రమలో ప్రముఖుల వారసులుగా రంగప్రవేశం చేసిన వారికి పరిచయాలు ఎక్కువగా ఉంటాయని చెప్పింది. అలా వారికి సినిమాల్లో అవకాశాలు చాలా సులభంగా వస్తాయని అంది. అయితే ఏలాంటి సినీ నేపథ్యం లేని వాళ్లు ప్రముఖులతో పరిచయాలు అవడానికి చాలా కాలం పడుతుందని చెప్పింది. దీంతో దర్శకులు కూడా బయటి నుంచి వచ్చే వారికి అవకాశాలు కల్పించడం కంటే ప్రముఖుల వారసులతో చిత్రాలు చేయడానికే నటింపజేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారని చెప్పింది. అలా మొదట్లో తాను పలు అవకాశాలను కోల్పోయినట్టు చెప్పింది. అప్పుడు తాను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేనని పేర్కొంది. ఇలాంటి బాధాకరమైన సంఘటనలకు ప్రేక్షకులు కూడా ఒక కారణమని ఆరోపించింది. సినిమా వారసులకు నటించిన చిత్రాలను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని, ఇతరులు వారి చిత్రాలను పట్టించుకోకపోవడం ఇందుకు కారణమని నటి తాప్సీ పేర్కొంది. -
‘మిషన్ మంగళ్’పై కిషన్ రెడ్డి రివ్యూ!
ముంబై: ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రేక్షకులను అలరించేందుకు ‘మిషన్ మంగళ్’ సినిమా సిద్ధమవుతోంది. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్‌కుమార్, విద్యాబాలన్, తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరి, నిత్యమీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మిషన్ మంగళ్’ గురువారం (ఆగస్టు 15న) ప్రేక్షకులముందుకు రాబోతోంది. ఒకింత దేశభక్తి నేపథ్యంలో ఇస్రో చేపట్టిన మార్స్ మిషన్ ప్రాజెక్టు కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. జగన్ శక్తి దర్శకత్వంలో ఆర్ బాల్కీ రచన, పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి అప్పుడే పాజిటివ్ టాక్ మొదలైంది. ఆదివారం ఢిల్లీలో ఈ సినిమా స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ చూసినవారిలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు సెలబ్రెటీలు ఉన్నారు. ఈ సినిమా తమకు చాలా బాగా నచ్చిందని, సినిమా అద్భుతంగా ఉందని ఈ స్పెషల్ స్క్రీనింగ్ వీక్షించిన ప్రముఖులతోపాటు పలువురు నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. సినిమాకు సర్వత్రా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ‘ఓ చక్కని రోజును ఆసక్తికరంగా ముగించాను. అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హాతోపాటు ఇతర చిత్రయూనిట్‌తో కలిసి ‘మిషన్ మంగళ్’ ప్రివ్యూ చూడటం అమేజింగ్‌గా అనిపించింది. సినిమాను బాగా తెరకెక్కించారు. ఇస్రో ఘనతను, విజయాలను అద్భుతంగా చూపించారు’ అని కిషన్‌రెడ్డి ట్వీట్ చేశారు. What an interesting way to end a good day! Had an amazing time watching the preview of the movie #MissionMangalyaan along with the movie leads @AkshayKumar, @Sonakshisinha, and other cast & crew members. It's a movie very well shot, to depict the glory of @isro and its success. pic.twitter.com/biSSpRhttD — G Kishan Reddy (@kishanreddybjp) August 13, 2019 -
రూ. 50 కోట్లు దాటేసింది!
విమర్శకుల ప్రశంసలతో పాటు అభిమానుల ఆదరణ కూడా పొందుతున్న సినిమా.. పింక్. అమితాబ్ బచ్చన్‌తో తొలిసారి తాప్సీ పన్ను నటించిన ఈ సినిమా కలెక్షన్లు అదరగొడుతోంది. ఇప్పటికే 50 కోట్ల రూపాయల మార్కును ఈ సినిమా దాటేసింది. రెండో వారం కూడా సినిమా మంచి పట్టు మీద ఉందని, కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా దీని స్థానం మాత్రం చెక్కు చెదరడం లేదని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. బాక్సాఫీసు వద్ద స్థిరంగా కలెక్షన్లు సాధిస్తోందన్నారు. పింక్ సినిమా ఇప్పటికే రూ. 50 కోట్ల వసూళ్లు దాటిందని లెక్కలతో సహా చూపించారు. ఈ కలెక్షన్ల వెల్లువ ఇప్పట్లో ఆగేలా లేదని కూడా చెప్పారు. రెండోవారంలో శుక్రవారం 3.15 కోట్లు, శనివారం 5.49 కోట్లు, ఆదివారం 6.57 కోట్లు వచ్చాయని, ఇప్పటివరకు మొత్తం రూ. 51.12 కోట్ల వసూళ్లు సాధించిందని తరణ్ ఆదర్శ్ తెలిపారు. #Pink is WINNING ACCOLADES + having a TRIUMPHANT RUN at the BO... Maintains a STRONG GRIP in Weekend 2, unaffected by new films... — taran adarsh (@taran_adarsh) 26 September 2016 #Pink cruises past ₹ 50 cr mark... Is UNSTOPPABLE... [Week 2] Fri 3.15 cr, Sat 5.49 cr, Sun 6.57 cr. Total: ₹ 51.12 cr. India biz. — taran adarsh (@taran_adarsh) 26 September 2016 -
తాప్సీకి ఎవరూ ప్రపోజ్ చేయలేదా?
తాను ముందునుంచి అబ్బాయిలాగే పెరిగానని, కాలేజిలో కూడా టామ్ బాయ్‌లా ఉండేదాన్నని హీరోయిన్ తాప్సీ చెబుతోంది. తన దగ్గరకు వచ్చి మాట్లాడాలంటేనే అబ్బాయిలు భయపడేవారని తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఐ లవ్యూ అని చెబితే వాళ్లను చితక్కొట్టేస్తానని భయపడ్డారేమో గానీ.. ఏ ఒక్కరూ తనకు ప్రపోజ్ చేయనేలేదని చెప్పింది. ప్రస్తుతం తెలుగులో 'ముని-3', తమిళంలో 'వెయ్ రాజా వెయ్', హిందీలో 'రన్నింగ్ షాదీ డాట్ కామ్', 'బేబీ' లాంటి సినిమాల్లో ఆమె నటిస్తోంది. చదువుకునే రోజుల్లో తాను ఇంత అందంగా లేనో, లేక భయపడ్డారో గానీ ఎవరూ తనకు ప్రపోజ్ చేయలేదని ఓ కార్యక్రమంలో ఆమె చెప్పింది. ప్రేమికుల రోజున అందరూ జంటలు జంటలుగా వెళ్తుంటే తనకు చాలా డల్‌గా అనిపించేదని, ఎవరూ గిఫ్టులు ఇవ్వనందుకే ఆ ఆ బాధ అని తెలిపింది. తీరా ఇప్పుడు చూస్తే.. సెలబ్రిటీనని ఎవరూ తనకు ప్రపోజ్ చేసేందుకు ధైర్యం చేయట్లేదంది. అయినా.. ఒంటరి జీవితం చాలా ఆనందంగా ఉందని, తన స్వేచ్ఛ తనకు ఉందని చెప్పుకొచ్చింది. లెక్కలు చేయడమంటే భలే ఇష్టమంటున్న తాప్సీ.. కష్టమైన సమస్యలను సులభంగా చేయగలిగినప్పుడు కలిగే ఆనందం ముందు ఇవన్నీ ఎందుకూ పనికిరావని తెలిపింది. అయితే.. లెక్కలంటే ఎంత ఇష్టం ఉన్నా, 10-5 ఉద్యోగం చేయడం అంటే ఇష్టంలేకనే ఆ రంగం వైపు వెళ్లలేదని తాప్సీ వివరించింది. -
నా అందం రెట్టింపయ్యింది: తాప్సీ
అందం చూడవయా ఆనందించవయా అన్నాడో కవి. అందానికి అంత రసజ్ఞత ఆపాదించారు. నేటి హీరోయిన్లు అలాంటి అందంతోనే రాణిస్తున్నారనేది నిజం. అందానికి మరింత మెరుగులు దిద్దుకోవడానికి వారు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. తాప్సీ విషయానికొస్తే కోలీవుడ్‌లో విజయం కోసం చకోరపక్షిలా ఎదురు చూస్తోంది. తొలి చిత్రం ఆడుగళం అవార్డులను కొల్లగొట్టినా ఈ ముద్దుగుమ్మకు అంతగా లాభించలేదన్నది వాస్తవం. తర్వాత నటించిన ఏ చిత్రమూ తాప్సీ కెరియర్‌కు ఉపయోగ పడలేదు. ఈ ఉత్తరాదిభామ తొలి చిత్రం ఆడుగళం విడుదల సమయంలో ఎంత ఉద్వేగానికి గురైంది. తాజా చిత్రం ఆరంభం విడుదల సమయంలోనూ అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. అజిత్, నయనతార జంటగా నటించిన చిత్రం ఆరంభం. ఇందులో మరో జంటగా ఆర్య, తాప్సీ నటించారు. ఈ చిత్రం దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తాప్సీ మాట్లాడుతూ ఆరంభంలో అజిత్, ఆర్య, నయనతార అంటూ సీనియర్లు నటించినా వారితో సమానమైన పాత్ర తనదని చెప్పింది. ఇందులో తాను విలేకరిగా నటించానని తెలిపింది. చిన్నతనం నుంచి జర్నలిస్టు అవ్వాలనే కోరిక ఉండడంతో ఈ చిత్రంతో ఆ పాత్రను ఒక లక్ష్యంగా తీసుకుని నటించానని వెల్లడించింది. ఆరంభంలో తన పాత్రకు మంచి పేరు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే నిత్యం నృత్యంలో శిక్షణ పొందుతున్నానని పేర్కొంది. దీని వల్ల తన అందం ద్విగుణీకృతం కావడమే కాకుండా మనసు ఎంతో హారుుగా ఉంటోందని తెలిపింది.