రూ. 50 కోట్లు దాటేసింది! | pink movie crosses 50 crore mark, tweets taran adarsh | Sakshi
Sakshi News home page

రూ. 50 కోట్లు దాటేసింది!

Published Mon, Sep 26 2016 11:26 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

రూ. 50 కోట్లు దాటేసింది!

రూ. 50 కోట్లు దాటేసింది!

విమర్శకుల ప్రశంసలతో పాటు అభిమానుల ఆదరణ కూడా పొందుతున్న సినిమా.. పింక్. అమితాబ్ బచ్చన్తో తొలిసారి తాప్సీ పన్ను నటించిన ఈ సినిమా కలెక్షన్లు అదరగొడుతోంది. ఇప్పటికే 50 కోట్ల రూపాయల మార్కును ఈ సినిమా దాటేసింది. రెండో వారం కూడా సినిమా మంచి పట్టు మీద ఉందని, కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా దీని స్థానం మాత్రం చెక్కు చెదరడం లేదని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. బాక్సాఫీసు వద్ద స్థిరంగా కలెక్షన్లు సాధిస్తోందన్నారు.

పింక్ సినిమా ఇప్పటికే రూ. 50 కోట్ల వసూళ్లు దాటిందని లెక్కలతో సహా చూపించారు. ఈ కలెక్షన్ల వెల్లువ ఇప్పట్లో ఆగేలా లేదని కూడా చెప్పారు. రెండోవారంలో శుక్రవారం 3.15 కోట్లు, శనివారం 5.49 కోట్లు, ఆదివారం 6.57 కోట్లు వచ్చాయని, ఇప్పటివరకు మొత్తం రూ. 51.12 కోట్ల వసూళ్లు సాధించిందని తరణ్ ఆదర్శ్ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement