Pink movie
-
నటుడిని చూసి భయపడ్డ సింగర్.. దగ్గరికి రావొద్దంటూ..
నెగెటివ్ రోల్స్ చేసే నటీనటులను కొందరు నిజంగానే ద్వేషిస్తారు. వాళ్లు పోషించేవి రీల్ పాత్రలు మాత్రమే అని అర్థం చేసుకోలేక నిజ జీవితంలోనూ ఇంతే కాబోలు అన్నట్లుగా వాళ్లను చూస్తేనే భయపడిపోతారు. తన విషయంలోనూ ఇదే జరిగిందంటున్నాడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ.నన్ను చూస్తేనే భయంతాజాగా ఓ ఈవెంట్‌కు వెళ్లిన విజయ్ వర్మ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అందమైన అమ్మాయిలు.. వారి తల్లులు ఎందరో నన్ను చూస్తేనే భయపడిపోతారు. ఈ విషయంలో నేను చాలా బాధగా ఫీల్ అవుతాను. పింక్ సినిమాలో క్రూరమైన వ్యక్తిగా నటించాను. అది చిన్న పాత్రే.. అయినా సరే చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మహిళల కోసం స్పెషల్ స్క్రీనింగ్ వేసినప్పుడు అందరూ సినిమా చూసి చలించిపోయారు. కొందరైతే ఏడ్చేశారు. నేనేం చేశా?ఈ క్రమంలో సింగర్ సునిధి చౌహాన్ దగ్గరకు వెళ్లి ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించాను. కానీ ఆమె.. నా దగ్గరకు రావొద్దు.. నిన్ను చూస్తేనే భయంగా ఉంది అనేసింది. నేను నోరెళ్లబెట్టాను.. దేవుడా, నేనేం చేశాను అనుకున్నాను. ఇంతలో డైరెక్టర్ నన్ను పిలిచి.. నీ పని సక్రమంగా నిర్వర్తించావు అని మెచ్చుకున్నాడు అని గుర్తు చేశాడు.సినిమా..విజయ్ వర్మ.. గల్లీ బాయ్ (2019) సినిమాతో పేరు సంపాదించుకున్నాడు. డార్లింగ్స్, షి, మీర్జాపూర్, దాహడ్ వంటి ప్రాజెక్టులతో అలరించాడు. ఐసీ 814: ద కాందహర్ హైజాక్ అనే వెబ్ సిరీస్‌లో చివరగా నటించాడు.చదవండి: ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా? -
షూటింగ్‌కి రెడీ
కరోనా బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్స్‌తో బిజీ కాబోతున్నారు శ్రుతీహాసన్. ఇటీవలే కొన్ని యాడ్స్ చిత్రీకరణల్లో పాల్గొన్నారామె. తాజాగా సినిమా చిత్రీకరణలకు కూడా సిద్ధమయ్యారు. అక్టోబర్ నుంచి ‘వకీల్ సాబ్’ చిత్రీకరణలో పాల్గొంటారట శ్రుతీహాసన్. పవన్ కల్యాణ్, అంజలి, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ ‘పింక్’కి రీమేక్. ఇందులో పవన్ కల్యాణ్ భార్యగా శ్రుతీహాసన్ నటించనున్నారు. అయితే ఇందులో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని సమాచారం. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాతో పాటు రవితేజ ‘క్రాక్’లోనూ నటిస్తున్నారు శ్రుతి. ఆ సినిమా చిత్రీకరణ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. -
డబుల్ ధమాకా
‘అజ్ఞాతవాసి’ (2018) తర్వాత పవన్ కల్యాణ్ మేకప్ వేసుకుని మూవీ కెమెరా ముందుకు రాలేదు. ఆయన సినిమా విడుదలై కూడా రెండేళ్లు పూర్తయింది. తన అభిమానులకు ఆ లోటును తీర్చేందుకు డబుల్ ధమాకా ఇవ్వాలని ఫిక్స్ అయినట్లున్నారు. ఒకేసారి రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు పవన్ కల్యాణ్. ఆల్రెడీ హిందీ హిట్ ‘పింక్’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ చిత్రం వేసవిలో విడుదల అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇది సెట్స్ మీద ఉండగానే క్రిష్ దర్శకత్వంలో ఎ.యం. రత్నం నిర్మించనున్న ఓ పీరియాడికల్ మూవీకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ సినిమా ఈ నెల 27న ప్రారంభం అవుతుందని సమాచారం. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. -
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్. పవర్‌స్టార్ మళ్లీ తెరపై సందడి చేయనున్నారు. సరికొత్త కాంబినేషన్లో పవన్ కొత్త సినిమా తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. హిందీలో హిట్ అయిన పింక్ సినిమా రీమేక్‌లో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. నాని హీరోగా ‘ఎంసీఏ’ సినిమా తీసిన వేణు శ్రీరామ్‌కు దర్శకత్వం బాధ్యతలు అప్పగించినట్టు ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అమితాబ్ బచ్చన్, తాప్పీ పొన్ను ప్రధాన పాత్రల్లో నటించిన ‘పింక్’ సినిమా 2016లో హిందీలో మంచి విజయాన్ని అందుకుంది. 23 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు రూ. 85 కోట్లు వసూలు చేసింది. సామాజిక సందేశంతో క్రైమ్ డ్రామా జానర్లో తెరకెక్కిన ఈ సినిమాను తమిళంలో ‘నేర్కొండ పార్వై’ పేరుతో రీమేక్ చేశారు. స్టార్ హీరో అజిత్ ప్రధానపాత్ర పోషించిన ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించారు. తమిళంలోనూ విజయం సాధించడంతో తెలుగులోనూ రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ‘పింక్’ రీమేక్‌లో పవన్ నటిస్తున్నాడని తెలియడంతో సోషల్ మీడియాలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీదేవి కల నెరవేరనుందా?
చెన్నై : హీరో అజిత్ సినిమా పరంగానూ, వ్యక్తిగతంగానూ భిన్నమనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన పనేంటో తాను చేసుకుంటూ పోయే మనస్తత్వం ఆయనది. తనకు సంబంధం లేని ఏ విషయంలోనూ తల దూర్చరు. ఇంకా చెప్పాలంటే వివాదాలకు దూరంగా ఉండే అరుదైన నటుడు అజిత్. కాగా ప్రస్తుతం అజిత్ నటించిన నేర్కొండ పార్వై చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్ 8న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇది ఆయనకు 59వ చిత్రం అన్నది గమనార్హం. ఇది హిందీలో సంచలన విజయాన్ని సాధించిన పింక్ చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. అమితాబ్‌బచ్చన్ పోషించిన పాత్రలో అజిత్ నుటించగా ఆయనకు జంటగా నటి విద్యాబాలన్ నటించింది. ఇక హిందీలో తాప్సీ పాత్రను తమిళంలో నటి శ్రద్ధాశ్రీనాథ్ పోషించింది. దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మించారు. ఈయన సోమవారం ట్విట్టర్లో ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో నేర్కొండ పార్వై చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ‘అజిత్ 60వ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో నేను నిర్మించనున్నాను. వచ్చే నెలలోనే ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఇది రేస్ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుంది. ఇందులో అజిత్ బైక్ రేస్‌లో పాల్గొనాలని తపించే రేసర్‌గా నటించనున్నారు’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. విశేషం ఏమిటంటే నటుడు అజిత్ నటనలోనే కాకుండా ఫోటోగ్రఫీ, బిరియానీ లాంటి వంటలు చేయడంలోనూ, బైక్ రేసింగ్‌లోనూ ఆసక్తి కలిగిన వ్యక్తి. ఈయన ఇంతకు ముందే జిల్లా స్థాయి బైక్ రేస్‌లో పాల్గొన్నారు కూడా. కాగా తాజాగా అలాంటి పాత్రనే చిత్రంలో పోషించనున్నారన్నమాట. అజిత్‌కు కూతురిగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కల నెరవేరనుందా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. శ్రీదేవి పుట్టింది తమిళనాడులోనేనన్న విషయం తెలిసిందే. కాగా ఆమె తన కూతురు జాన్వీని తమిళంలో కథానాయకిగా పరిచయం చేయాలని ఆశ పడింది. అది తీరకుండానే హఠాన్మరణం పొందింది. అయితే శ్రీదేవి కలను ఆమె కూతును జాన్వీ నిజం చేయబోతోందనే ప్రచారం జరుగుతోంది. శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మాతగా కోలీవుడ్‌కు ఎంటర్ అయ్యి అజిత్ హీరోగా నేర్కొండ పార్వై చిత్రం నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం 8న తెరపైకి రానుంది. కాగా వెంటనే అజిత్‌తో మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇందులో అజిత్‌కు కూతురిగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ నటించనున్నట్లు తాజా సమాచారం. ఇదే నిజం అయితే జాన్వీ తన తల్లి కలను నిజం చేయబోతోందన్నమాట. -
అజిత్ చిత్రానికి డేట్ ఫిక్స్
చెన్నై : హీరో అజిత్ చిత్రం విడుదలవుతుందంటే ఆయన అభిమానులకు పండగే. తాజాగా అజిత్ నటించిన చిత్రం ‘నేర్కొండ పార్వై’. కొత్తదనానికి, సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చే అజిత్ ఈసారి మరో వైవిధ్యభరతమైన కథా చిత్రంతో తెరపైకి రానున్నారు. ఇది బాలీవుడ్లో సంచలన విజయాన్ని అందుకున్న ‘పింక్’ చిత్రానికి రీమేక్. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన పవర్ఫుల్ పాత్రను అజిత్ చేశారు. ఇక తాప్సీ పాత్రలో నటి శ్రద్ధాశ్రీనాథ్ నటించింది. మరో కీలక పాత్రలో నటి విద్యాబాలన్ కనిపించనుంది. ఈమె కోలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం ఇది. విలన్ పాత్రలో దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ నటించిన ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో బోనీకపూర్ జీ.స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మించారు. అజిత్ న్యాయవాదిగా సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో నటించారు. చిత్ర చివరి ఘట్టంలో అజిత్ నట విశ్వరూపాన్ని ప్రదర్శించినట్లు చిత్ర యూనిట్ టాక్. మరో విశేషం ఏమిటంటే యువన్‌శంకర్‌రాజా సంగీ తం అందించిన ఇందులో ఆంగ్ల సాంగ్ చోటు చేసుకోవడం. కవలై వేండామే తోళా అనే ఈ పాటలో ర్యాప్ సంగీతా నికి తగ్గట్టుగా ఆంగ్ల పదాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయట. కాగా కాలం అనే పాట ఇటీవలే విడుదలై సంగీత ప్రియులను విపరీతంగా అలరిస్తోంది. ఇక నేర్కొండ పార్వై చిత్రం ట్రైలర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో విశేష ఆదరణను చూరగొంటోంది. చిత్ర విడుదల కోసం అజిత్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేర్కొండ పార్వై చిత్రాన్ని అక్టోబరు నెలలో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు గతంలో వెల్లడించారు. అయితే తాజాగా ఒక నెల ముందే అంటే ఆగస్ట్ 8వ తేదీనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. -
అజిత్ 60వ చిత్రం ఖరారు
చెన్నై : నటుడు అజిత్‌ను అల్టిమేట్ స్టార్ అంటారు. ఇది ఆయనకు ఇష్టం ఉన్నా, లేకపోయినా అభిమానులు ఇచ్చిన బిరుదు ఇదే. ఇక నటుడు అజిత్ వేరు. వివాదాలకు దూరంగా ఉండే నటుడు. అంతే కాదు తన చిత్రాల ప్రమోషన్‌కు కూడా దూరంగా ఉండే నటుడీయన. అంతే కాదు ఇతరులతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేసుకుపోయే నటుడు. ఇక ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్ తాజా చిత్రం విశ్వాసం రజనీకాంత్ చిత్రం పేటకు పోటీగా తెరపైకి వచ్చి వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం అజిత్ నేర్కొండ పార్వై చిత్రంలో నటిస్తున్నారు. ఇది హిందీ చిత్రం పింక్‌కు రీమేక్ అన్నది తెలిసిందే. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను అజిత్ చేస్తున్నారు. దీనిని దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్నారు. ఈయన అజిత్‌తో వరుసగా చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపడం విశేషం. అంతే కాదు ఈయన్ని బాలీవుడ్‌కు పరిచయం చేయాలని కోరుకుంటున్నారు. అజిత్ నటిస్తున్న నేర్కొండ పార్వై చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ఆగస్టు 10న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఆయన తదుపరి చిత్రం ఏమిటన్న విషయంపై అందరికీ ఆసక్తి కలగడం సహజమే. మరో విషయం ఏమిటంటే అజిత్ ఒకే దర్శకుడితో వరుసగా చిత్రాలు చేయడం, చేసిన నిర్మాణ సంస్థకే మళ్లీ అవకాశం ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ఇంతకు ముందు దర్శకుడు శివకు వరుసగా నాలుగు సార్లు అవకాశం కల్పించారు. అదే విధంగా సత్యజ్యోతి ఫిలింస్ సంస్థలో వరుసగా వివేగం, విశ్వాసం చిత్రాలు చేశారు. అలా మరోసారి రిపీట్ చేయనున్నారు. అజిత్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. దీని తరువాత అజిత్ 60వ చిత్రానికి ఆయనకే అవకాశం ఇచ్చారన్నది తాజా సమాచారం. దీన్ని నిర్మాత బోనీకపూర్‌నే నిర్మించబోతున్నారని సమాచారం. ఇది దర్శకుడు వినోద్ తయారు చేసుకున్న స్క్రిప్ట్‌తో తెరకెక్కనుందని, కమర్శియల్ అంశాలతో కూడిన ఈ చిత్రం షూటింగ్‌ను త్వరలో ప్రారంభించి 2020లో తెరపైకి తీసుకొచ్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తాజా సమాచారం. దీనికి జిబ్రాన్ సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. -
‘పింక్’ కాంబినేషన్లో ‘బద్ల’
పింక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అమితాబ్ బచ్చన్, తాప్సీ పన్నులు మరో క్రైమ్ థ్రిల్లర్‌తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, అజుర్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న బద్ల సినిమాలో ఈ ఇద్దరు మరోసారి కలిసి నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌరీఖాన్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ సినిమాలోనూ అమితాబ్ లాయర్ పాత్రలోనే కనిపిస్తున్నారు. 40 ఏళ్ల కెరీర్లో ఒక్క కేసు కూడా ఓడిపోని లాయర్ బాదల్ గుప్తా పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ సినిమా 2016లో రిలీజ్ అయిన స్పానిష్ థ్రిల్లర్ ది ఇన్విజిబుల్ గెస్ట్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. -
మాట నిలబెట్టుకున్న అజిత్
తమిళ్ సూపర్ స్టార్ అజిత్, అతిలోక సుందరి శ్రీదేవికి మాట ఇచ్చారట. ఈ విషయాన్ని ఆమె భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్వయంగా వెల్లడించారు. అజిత్ కథానాయకుడిగా బోనీ కపూర్ తమిళంలో వరుసగా రెండు చిత్రాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి హిందీలో సంచలన విజయం సాధించిన ‘పింక్’ చిత్రానికి రీమేక్. ఇందులో అమితాబచ్చన్ నటించిన పాత్రలో తమిళంలో అజిత్ నటించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత బోనీకపూర్ మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రం చేస్తున్న సమయంలోనే అజిత్‌తో పరిచయం ఏర్పడింది. . అప్పుడు శ్రీదేవి తాను నిర్మించబోయే తమిళ చిత్రంలో నటించాలని అజిత్‌ను కోరారు. అప్పుడు ఆయన కచ్చితంగా చేస్తానని మాట ఇచ్చారు. శ్రీదేవికిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఆయనే ముందుకు వచ్చారు. నన్ను పిలిచి సినిమా చేద్దాం అని చెప్పారన్నా’రు బోనీకపూర్. అంతేకాక పింక్ చిత్రంతో పాటు అజిత్ హీరోగా మరో సినిమాను కూడా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు బోనీకపూర్. ఈ ఏడాది జూలైలో ఆ చిత్రాన్ని ప్రారంభిస్తామని.. 2020లో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. ‘పింక్’ రీమేక్‌కు యువన్‌శంకర్‌రాజా సంగీత బాణీలు అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రను నటి శ్రద్ధాశ్రీనాధ్ పోషిస్తుండగా.. మరో ముఖ్య పాత్రను రంగరాజ్ పాండే చేయనున్నారు. విలన్ పాత్రలో దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ నటించనున్నారని బోనీ కపూర్ తెలిపారు. -
అది బోనస్ మాత్రమే!
చేతి నిండా అవకాశాలతో తాప్సీ డైరీ ఫుల్‌గా ఉంది. నార్త్‌లో మంచి జోరు మీదున్న తాప్సీ సౌత్‌లోనూ అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, తాప్సీ కలిసి నటించిన ‘పింక్’ సినిమా సూపర్‌హిట్ కావడం వల్లే బీ టౌన్లో తాప్సీ క్రేజ్ పెరిగిందని కొందరి మాట. ఈ విషయం గురించి ఆమెను అడిగితే..‘‘ప్రస్తుతం హిందీలో నాకు అవకాశాలు పెరిగాయి. కానీ ‘పింక్’ సినిమా సక్సెస్ నా లైఫ్‌లో పెద్దగా మార్పు తీసుకురాలేదు. నా కెరీర్ తొలినాళ్లో నేను నటించిన ‘ఆడుకాలమ్’ సినిమా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. అంతకన్నా ఇంకేం కావాలి. బాలీవుడ్‌కి రావడానికి ముందు నా కెరీర్లో బాక్సాఫీస్ సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను చూశాను. ‘పింక్’ సినిమా సక్సెస్ ఒక బోనస్ మాత్రమే. గెలుపోటములను నేను అంత సీరియస్‌గా తీసుకోను. అలా జరిగిపోతుంటాయంతే. కానీ, నన్ను నేను సీరియస్‌గా తీసుకుంటాను’’ అని పేర్కొన్నారామె. ప్రస్తుతం ‘మిషన్ మంగళ్’ అనే హిందీ చిత్రంతోపాటు, సౌత్‌లో ‘గేమ్ ఓవర్’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు తాప్సీ. ‘పింక్’ సినిమా తర్వాత అమితాబ్, తాప్సీ కలిసి నటించిన ‘బద్లా’ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. -
లాయర్‌గా!
ప్రస్తుతం ‘విశ్వాసం’ సినిమాలో హీరోగా నటిస్తున్న అజిత్ షెడ్యూల్స్ గ్యాప్‌లో కాస్త టైమ్ దొరికితే కోర్టుకు వెళ్లాలనుకుంటున్నారట. ఎందుకంటే నెక్ట్స్ సినిమాలో ఆయన లాయర్‌గా కనిపించనున్నారని టాక్. అజిత్ హీరోగా ‘చతురంగ వేటై్ట, ధీరమ్ అధికారమ్ ఒండ్రు’ చిత్రాల ఫేమ్ హెచ్.వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. ఇది హిందీ హిట్ ‘పింక్’కి రీమేక్ అని టాక్. అనిరుద్ధరాయ్ భట్టాచార్య దర్శకత్వంలో రూపొందిన ‘పింక్’లో అమితాబ్‌బచ్చన్, తాప్సీ ముఖ్య తారలుగా నటించిన విషయం తెలిసిందే. అమితాబ్ పాత్రలోనే అజిత్ నటిస్తారట. ఈ సినిమాను శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మిస్తారట. -
రూ. 50 కోట్లు దాటేసింది!
విమర్శకుల ప్రశంసలతో పాటు అభిమానుల ఆదరణ కూడా పొందుతున్న సినిమా.. పింక్. అమితాబ్ బచ్చన్‌తో తొలిసారి తాప్సీ పన్ను నటించిన ఈ సినిమా కలెక్షన్లు అదరగొడుతోంది. ఇప్పటికే 50 కోట్ల రూపాయల మార్కును ఈ సినిమా దాటేసింది. రెండో వారం కూడా సినిమా మంచి పట్టు మీద ఉందని, కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా దీని స్థానం మాత్రం చెక్కు చెదరడం లేదని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. బాక్సాఫీసు వద్ద స్థిరంగా కలెక్షన్లు సాధిస్తోందన్నారు. పింక్ సినిమా ఇప్పటికే రూ. 50 కోట్ల వసూళ్లు దాటిందని లెక్కలతో సహా చూపించారు. ఈ కలెక్షన్ల వెల్లువ ఇప్పట్లో ఆగేలా లేదని కూడా చెప్పారు. రెండోవారంలో శుక్రవారం 3.15 కోట్లు, శనివారం 5.49 కోట్లు, ఆదివారం 6.57 కోట్లు వచ్చాయని, ఇప్పటివరకు మొత్తం రూ. 51.12 కోట్ల వసూళ్లు సాధించిందని తరణ్ ఆదర్శ్ తెలిపారు. #Pink is WINNING ACCOLADES + having a TRIUMPHANT RUN at the BO... Maintains a STRONG GRIP in Weekend 2, unaffected by new films... — taran adarsh (@taran_adarsh) 26 September 2016 #Pink cruises past ₹ 50 cr mark... Is UNSTOPPABLE... [Week 2] Fri 3.15 cr, Sat 5.49 cr, Sun 6.57 cr. Total: ₹ 51.12 cr. India biz. — taran adarsh (@taran_adarsh) 26 September 2016 -
పుంజుకుంటున్న కలెక్షన్లు
ఈమధ్య కాలంలో ఏ సినిమాకూ రివ్యూయర్లు ఐదుకు ఐదు స్టార్లు ఇవ్వలేదు. అలా వచ్చిన ఒకే ఒక్క సినిమా.. పింక్. అమితాబ్ బచ్చన్ న్యాయవాదిగా నటించిన ఈ సినిమా కలెక్షన్లు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి. సినిమా విడుదలైన తొలిరోజు రూ. 4.32 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసల జల్లు కురిపించడంతో క్రమంగా థియేటర్లు, మల్టీప్లెక్సులలో ప్రేక్షకుల సందడి పెరుగుతోందని, మంచి ప్రచారం వచ్చింది కాబట్టి ఈ సినిమాకు వసూళ్లు కూడా బాగానే ఉంటాయని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను కూడా ఈ సినిమాలో అమితాబ్‌తో పాటు నటించిన విషయం తెలిసిందే. After a slow start, #Pink picked up rapidly at plexes of major centres... Footfalls in evening/night shows at plexes were very encouraging. — taran adarsh (@taran_adarsh) 17 September 2016 #Pink Fri ₹ 4.32 cr. India biz... Strong word of mouth should ensure escalation in biz on Sat and Sun. — taran adarsh (@taran_adarsh) 17 September 2016 -
కడుపు నింపుకోడానికే పనిచేస్తున్నా: అమితాబ్
ఏడు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఆయన్ను చూసే సినిమాలు ఆడిస్తున్నారు. తెల్లటి జుట్టుతో ఆరడుగులకు పైగా పొడవుండి.. ఇప్పటికీ తనదైన స్టైలుతో బాలీవుడ్‌ను అల్లాడిస్తున్న వ్యక్తి అమితాబ్ బచ్చన్. తాజాగా ఆయన నటించిన పింక్ సినిమాపై విమర్శకుల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే ఏకంగా ఐదుకు ఐదు స్టార్ల రేటింగ్ ఇచ్చేశారు. ఇంత జరిగినా.. ఆయన మాత్రం ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలన్న సూత్రాన్ని బాగా పాటిస్తున్నారు. తాను కడుపు నింపుకోవాలి కాబట్టి సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. మీ విజయ రహస్యం ఏంటని అడిగినా కూడా.. ''నేను ప్రతిరోజూ ఉదయాన్నే లేస్తాను.. ఏదో ఒక సినిమాలో నటిస్తూ ఉంటాను. నేను కడుపు నింపుకోవాలి కాబట్టి మాత్రమే పనిచేస్తున్నాను. మీరు కూడా అందుకే కదా.. ఉద్యోగాలు చేసేది'' అని ఆయన మీడియాతో అన్నారు. ఇండియా టుడే మైండ్ రాక్స్ యువజన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఇలా వ్యాఖ్యానించారు. తనకు స్ఫూర్తినిచ్చిన మహిళ తన తల్లేనని, ఆమె సిక్కు మహిళ అని.. అందుకే తాను సగం సర్దార్నని చెప్పారు. ఆమె తనకు చాలా శక్తినిచ్చిందని తెలిపారు. తాను ఒకరోజు ఇంటి వెనక ఆడుకుంటుంటే కొందరు పిల్లలు వచ్చి తనను కొట్టారని, తాను ఏడుస్తూ ఇంట్లోకి వెళ్తే, తన తల్లి వెళ్లి వాళ్లను తిరిగి కొట్టమని ధైర్యం చెప్పారని.. దాంతో తాను వెళ్లి కొట్టానని అమితాబ్ చెప్పారు. పింక్ సినిమాలో అమితాబ్‌తో పాటు కలిసి నటించిన తాప్సీ, నిర్మాత షూజిత్ సర్కార్.. ఇలా ప్రతి ఒక్కరూ అమితాబ్‌ను ఆరాధనా భావంతో చూస్తున్నారు. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండి కూడా ఆయన ఏ విషయాన్నీ ఊరికే వదిలేయరని, సెట్లలో ఆయన చూపించే అంకిత భావం, పడే శ్రమ చూస్తుంటే అందుకే ఆయన ఇంత స్థాయిలో ఉన్నారని సర్కార్ అన్నారు. -
నిద్రలేని రాత్రులు గడిపా: మెగాస్టార్
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు నటుడిగా 40 ఏళ్లకుపైగా అనుభవముంది. ఆయన ఎన్నో రకాల పాత్రలు పోషించారు. 73 ఏళ్ల వయసులోనూ సత్తాచాటుతున్నారు. కోట్లాది అభిమానులకు ఆరాధ్యుడైన అమితాబ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రతి సినిమా ఓ పరీక్షని, తనకు ఓ పరీక్ష (ఎగ్జామ్) వంటిదని, పింక్ షూటింగ్ సమయంలో ప్రతిషాట్లో నటించే ముందు నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు. ఓ షాట్లో నటించే ముందు 40 ఏళ్ల క్రితంలాగే ఇప్పుడూ ఆత్రుతతో ఎదురుచూస్తానని అన్నారు. జీవితంలో సులభంగా ఏదీ రాదని చెప్పారు. పింక్ సినిమాలో అమితాబ్ లాయర్ పాత్రలో నటించారు. షూజిత్ సిర్కర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అగ్రహీరోగా వెలుగొంది, క్యారెక్టర్ స్టార్‌గా మారడం ఇబ్బందిగా అనిపించిందా అన్న మీడియా ప్రశ్నకు.. ఆ దిశగా ఆలోచించలేదని అమితాబ్ చెప్పారు. నటించడం తనకు ఇష్టమని, అదృష్టవశాత్తూ ఇప్పటికీ అవకాశాలు వస్తున్నాయని, క్యారెక్టర్ పాత్రలోనైనా లేదా ఇతర పాత్రలోనైనా నటిస్తానని అన్నారు. పింక్ సినిమాలో అమితాబ్‌తో పాటు తాప్సీ, కృతీ కుల్హరి, ఆండ్రియా, అంగాద్ బేడీ తదితరులు నటించారు. -
ఆమె కొత్త పిల్ల కాదు: అమితాబ్
దుబాయ్: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ టాలీవుడ్ హీరోయిన్ పై ప్రశంసల జల్లులు కురిపించాడు. ప్రస్తుతం ఆయన జాతీయ అవార్డు సాధించిన బెంగాలీ దర్శకుడు అనిరుద్ధా రాయ్ చౌదరి తెరకెక్కిస్తున్న 'పింక్' మూవీలో నటిస్తున్నారు. దుబాయ్ లో శుక్రవారం జరిగిన ఓ సినిమా అవార్డుల కార్యక్రమానికి హాజరైన అమితాబ్.. మీడియాతో కాసేపు సరదాగా ముచ్చటించారు. టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ లాంటి కొత్త వాళ్లతో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ప్రశ్నలు అడిగారు. దానికి ఆయన స్పందిస్తూ, ''తాప్సీ పన్ను కొత్త హీరోయినేం కాదు.. ఆమె ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది. అంతకుమించి మంచి ప్రొఫెషనల్'' అంటూ ఈ భామకు బిగ్ బీ మంచి మార్కులే వేశారు. అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య తారలుగా రూపొందుతున్న ‘పింక్’ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయట. సెప్టెంబర్ 16న ‘పింక్’ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సూజిత్ సర్కార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సూజిత్ ప్రొడక్షన్ లో తనకు ఇది మూడో చిత్రమని, గతంలో 'షోబైట్', 'పీకూ' మూవీలలో నటించానని చెప్పుకొచ్చారు.‘‘అమితాబ్ బచ్చన్ పేరు తర్వాత వెండి తెరపై నా పేరు రాబోతుందనే విషయం తల్చుకుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతోంది. ఆందోళనగా, ఆనందంగా.. ఇలా రకరకాల ఫీలింగ్స్ కలుగుతున్నాయి’’ అని తాప్సీ అన్నారు. -
అమితాబ్‌తో పింక్!
‘‘అమితాబ్ బచ్చన్ పేరు తర్వాత వెండి తెరపై నా పేరు రాబోతుందనే విషయం తల్చుకుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతోంది. ఆందోళనగా, ఆనందంగా.. ఇలా రకరకాల ఫీలింగ్స్ కలుగుతున్నాయి’’ అని తాప్సీ అన్నారు. అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య తారలుగా రూపొందుతున్న ‘పింక్’ చిత్రం గురించే ఆమె ఇలా అంటున్నారు. జాతీయ అవార్డు సాధించిన బెంగాలీ దర్శకుడు అనిరుద్ధా రాయ్ చౌదరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘ఈవ్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే వార్త వచ్చింది. ఆదివారం ‘పింక్’ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల విహార యాత్ర నిమిత్తం యూఎస్ వెళ్లి, ఎంజాయ్ చేసొచ్చిన తాప్సీ రావడం రావడమే ఈ షూటింగ్‌తో బిజీ అయిపోయారు. మహిళలకు సంబంధించిన అంశంతో ఈ చిత్రం ఉంటుందని ఆమె అన్నారు. విరామం సమయంలో అమితాబ్‌తో కలిసి లొకేషన్లో సెల్ఫీ దిగారామె. బిగ్ బి చాలా కూల్ అని అమితాబ్ గురించి తెలిపారు. సెప్టెంబర్ 16న ‘పింక్’ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నో కెమెరాస్.. నో సెక్యూర్టీ! ఇక.. అమితాబ్ అయితే ఏకంగా రోడ్డు మీద సాదా సీదా వ్యక్తిలా వాక్ చేశారు. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పిన తర్వాత ‘పింక్’ చిత్రానికి సంబంధించిన గెటప్‌లోనే అమితాబ్ ఈ నడక సాగించారు. మొహానికి మాస్క్ ఉండటంవల్ల ఆయన్ను ఎవరూ గుర్తుపట్టలేదు. సెక్యూర్టీ గార్డులు లేకుండా రోడ్డు మీద వాక్ చేసిన వైనం గురించి అమితాబ్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘‘ఢిల్లీలో చాలా బిజీ రోడ్డులో హాయిగా నడవడం థ్రిల్ అనిపించింది. కెమెరాలు ఫాలో కాలేదు. ఎలాంటి హంగామా లేదు. ఎవరూ గుర్తుపట్టలేనంతగా నన్ను మార్చేసిన మేకప్ ఆర్టిస్ట్‌కే ఈ ఘనత దక్కుతుంది’’ అని ఆయన అన్నారు.