పుంజుకుంటున్న కలెక్షన్లు | pink movie collections on a raise, thanks to amitabh | Sakshi
Sakshi News home page

పుంజుకుంటున్న కలెక్షన్లు

Published Sat, Sep 17 2016 5:35 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

పుంజుకుంటున్న కలెక్షన్లు

పుంజుకుంటున్న కలెక్షన్లు

ఈమధ్య కాలంలో ఏ సినిమాకూ రివ్యూయర్లు ఐదుకు ఐదు స్టార్లు ఇవ్వలేదు. అలా వచ్చిన ఒకే ఒక్క సినిమా.. పింక్. అమితాబ్ బచ్చన్ న్యాయవాదిగా నటించిన ఈ సినిమా కలెక్షన్లు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి. సినిమా విడుదలైన తొలిరోజు రూ. 4.32 కోట్లు కలెక్ట్ చేసింది.

ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసల జల్లు కురిపించడంతో క్రమంగా థియేటర్లు, మల్టీప్లెక్సులలో ప్రేక్షకుల సందడి పెరుగుతోందని, మంచి ప్రచారం వచ్చింది కాబట్టి ఈ సినిమాకు వసూళ్లు కూడా బాగానే ఉంటాయని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను కూడా ఈ సినిమాలో అమితాబ్‌తో పాటు నటించిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement