ఆమె కొత్త పిల్ల కాదు: అమితాబ్ | Taapsee Pannu not a newcomer, says Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

ఆమె కొత్త పిల్ల కాదు: అమితాబ్

Published Sat, Mar 19 2016 8:55 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఆమె కొత్త పిల్ల కాదు: అమితాబ్ - Sakshi

ఆమె కొత్త పిల్ల కాదు: అమితాబ్

దుబాయ్: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ టాలీవుడ్ హీరోయిన్ పై ప్రశంసల జల్లులు కురిపించాడు. ప్రస్తుతం ఆయన జాతీయ అవార్డు సాధించిన బెంగాలీ దర్శకుడు అనిరుద్ధా రాయ్ చౌదరి తెరకెక్కిస్తున్న 'పింక్' మూవీలో నటిస్తున్నారు. దుబాయ్ లో శుక్రవారం జరిగిన ఓ సినిమా అవార్డుల కార్యక్రమానికి హాజరైన అమితాబ్.. మీడియాతో కాసేపు సరదాగా ముచ్చటించారు. టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ లాంటి కొత్త వాళ్లతో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ప్రశ్నలు అడిగారు.

దానికి ఆయన స్పందిస్తూ, ''తాప్సీ పన్ను కొత్త హీరోయినేం కాదు.. ఆమె ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది. అంతకుమించి మంచి ప్రొఫెషనల్'' అంటూ ఈ భామకు  బిగ్ బీ మంచి మార్కులే వేశారు. అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య తారలుగా రూపొందుతున్న ‘పింక్’  చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయట. సెప్టెంబర్ 16న ‘పింక్’  చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సూజిత్ సర్కార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సూజిత్ ప్రొడక్షన్ లో తనకు ఇది మూడో చిత్రమని, గతంలో 'షోబైట్', 'పీకూ' మూవీలలో నటించానని చెప్పుకొచ్చారు.‘‘అమితాబ్ బచ్చన్ పేరు తర్వాత వెండి తెరపై నా పేరు రాబోతుందనే విషయం తల్చుకుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతోంది. ఆందోళనగా, ఆనందంగా.. ఇలా రకరకాల ఫీలింగ్స్ కలుగుతున్నాయి’’ అని తాప్సీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement