పవన్ కల్యాణ్
‘అజ్ఞాతవాసి’ (2018) తర్వాత పవన్ కల్యాణ్ మేకప్ వేసుకుని మూవీ కెమెరా ముందుకు రాలేదు. ఆయన సినిమా విడుదలై కూడా రెండేళ్లు పూర్తయింది. తన అభిమానులకు ఆ లోటును తీర్చేందుకు డబుల్ ధమాకా ఇవ్వాలని ఫిక్స్ అయినట్లున్నారు. ఒకేసారి రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు పవన్ కల్యాణ్. ఆల్రెడీ హిందీ హిట్ ‘పింక్’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు.
‘దిల్’ రాజు, బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ చిత్రం వేసవిలో విడుదల అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇది సెట్స్ మీద ఉండగానే క్రిష్ దర్శకత్వంలో ఎ.యం. రత్నం నిర్మించనున్న ఓ పీరియాడికల్ మూవీకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ సినిమా ఈ నెల 27న ప్రారంభం అవుతుందని సమాచారం. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment