venu sriram
-
బ్లాక్ బస్టర్ అందించిన ఈ దర్శకులు.. ఇలా సైలెంట్ అయ్యారేంటి?
ఓ సినిమా సెట్స్‌పై ఉండగా లేదా విడుదలకు సిద్ధం అవుతున్న సమయంలోనే తర్వాతి సినిమా గురించి అనౌన్స్ చేస్తుంటారు కొందరు దర్శకులు. అయితే కొందరు డైరెక్టర్స్ మాత్రం మూడు నాలుగేళ్లుగా తమ తర్వాతి ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ‘వాట్ నెక్ట్స్?’ అనే చర్చ జరగడం కామన్ . మరి ఆ ప్రశ్నకు ఆయా దర్శకులే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగులో తమ తర్వాతి సినిమాలపై ఓ క్లారిటీ ఇవ్వని శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, విజయ్ కుమార్ కొండా, సంతోష్ శ్రీనివాస్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, సుజిత్, బుచ్చిబాబు వంటి దర్శకులపై ఓ లుక్కేద్దాం. లవ్, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్ని జానర్స్‌లో సినిమాలు తీసి హిట్ అందుకున్నారు శ్రీను వైట్ల. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రవితేజ, మంచు విష్ణు, రామ్.. వంటి హీరోలతో వరుసగా చిత్రాలు తీసిన ఆయన నాలుగేళ్లుగా నెమ్మదించారు. వరుణ్ తేజ్‌తో తీసిన ‘మిస్టర్’ (2017), రవితేజతో తెరకెక్కించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (2018) చిత్రాల తర్వాత మంచు విష్ణుతో శ్రీను వైట్ల ‘ఢీ’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఢీ అండ్ ఢీ’ని ప్రకటించారు. అయితే ఆ సినిమాని ప్రకటించి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకూ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ మధ్యలో మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాని పూర్తి చేశారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విషయానికి వస్తే.. సున్నితమైన ప్రేమకథకు ఫ్యామిలీ ఎవెషన్స్ యాడ్ చేసి తొలి సినిమాతోనే (కొత్తబంగారు లోకం) హిట్‌కొట్టారు. ఆ తర్వాత వెంకటేశ్, మహేశ్‌బాబులతో మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ‘ముకుంద, బ్రహ్మోత్సవం, నారప్ప’ వంటి చిత్రాలు తీశారాయన. వెంకటేశ్ హీరోగా రూపొందిన ‘నారప్ప’ గత ఏడాది జూలై 20న ఓటీటీలో విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం రిలీజై ఏడాది దాటినా తర్వాతి ప్రాజెక్టుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు శ్రీకాంత్ అడ్డాల. సేమ్ ఇలానే దర్శకుడు విజయ్ కుమార్ కొండా కూడా ఏడాదికిపైనే అయినా తాజా చిత్రాన్ని ప్రకటించలేదు. నితిన్ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ త్రాన్ని తెరకెక్కిం బ్లాక్‌బస్టర్ అందుకున్నారు విజయ్ కుమార్ కొండా. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే’ వంటి సినిమాలు తెరకెక్కించారు. రాజ్ తరుణ్‌తో తీసిన ‘పవర్ ప్లే’ చిత్రం 2021 మార్చి 5న రిలీజ్ అయింది. ఈ చిత్రం విడుదలై ఏడాదిన్నర్ర అవుతున్నా ఆయన తర్వాతి సినిమాపై ఎలాంటి స్పష్టత లేదు. శ్రీకాంత్ అడ్డాల, విజయ్‌కుమార్‌లా తదుపరి చిత్రంపై ఏడాది అవుతున్నా స్పష్టత ఇవ్వని మరో దర్శకుడు ‘బొమ్మరిల్లు భాస్కర్’. అందమైన కుటుంబ కథకి ప్రేమ, భావోద్వేగాలు కలగలిపి ‘బొమ్మరిల్లు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు భాస్కర్. ఆ సినిమానే ఆయన ఇంటిపేరుగా మారిందంటే ఆ త్రం ఏ రేంజ్లో ఆయనకి గుర్తింపు తీసుకొచ్చిందో ప్రత్యేకించెప్పక్కర్లేదు. ఆ తర్వాత తెలుగులో ‘పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త’ చిత్రాలు తీశారు. అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ త్రాన్ని తెరకెక్కించారు. 2021 అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అయితే తన నెక్ట్స్ సినిమాపై భాస్కర్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక కెమెరామేన్ నుంచి దర్శకునిగా మారిన సంతోష్ శ్రీనివాస్ కూడా తదుపరి చిత్రం ప్రకటించని దర్శకుల జాబితాలో ఉన్నారు. ‘కందిరీగ, రభస, హైపర్, అల్లుడు అదుర్స్’ వంటి త్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కింన ‘అల్లుడు అదుర్స్’ (2021 జనవరి 15న విడుదలైంది) తర్వాత తన నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుంది? అనే స్పష్టత ఇవ్వలేదాయన. పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు గతంలో వినిపించాయి. సీనియర్లే కాదు.. యువ దర్శకుడు సుజీత్ కూడా మూడేళ్లయినా తన తదుపరి త్రం ప్రకటించలేదు. తొలి చిత్రం ‘రన్ రాజా రన్(2014)’ తో మంచి హిట్ అందుకున్నారు సుజిత్. ఆ సినిమా ఇచ్చిన హిట్‌తో స్టార్ హీరో ప్రభాస్‌ని డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్నారు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వం వహించిన ‘సాహో’ చిత్రం 2019 ఆగస్టు 30న విడుదలైంది. యాక్షన్, టెక్నికల్ పరంగా అత్యున్నత విలువలతో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై ఉన్న భారీ అంచనాలను అందుకోలేకపోయింది. ‘సాహో’ విడుదలై మూడేళ్లు అవుతున్నా తన తర్వాతి సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు సుజిత్. అయితే పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారని, ఇప్పటికే కథ వినిపించారని టాక్. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ప్రేమకథతో టాలీవుడ్‌కి ‘ఉప్పెన’లా దూసుకొచ్చారు బుచ్చిబాబు. డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా చేసిన బుచ్చిబాబు తొలి చిత్రంతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ చిత్రంతో హీరో హీరోయిన్లుగా పరిచయమైన వైష్ణవ్ తేజ్, కృతీశెట్టి ఫుల్ బిజీ అయిపోయారు. 2021 ఫిబ్రవరి 12న ఈ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలై దాదాపు ఏడాదిన్నర్ర కావస్తున్నా బుచ్చిబాబు తర్వాతి సినిమాపై స్పష్టత లేదు. అయితే తన తర్వాతి మూవీ ఎన్టీఆర్‌తో ఉంటుందని, ఇందుకోసం కథ కూడా సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి.. కానీ, దీనిపై అధికారిక ప్రకటన లేదు. వీరితో పాటు వేణు శ్రీరాం, రాహుల్ సంకృత్యాన్, రాధాకృష్ణ కుమార్, పరశురామ్ వంటి దర్శకుల తర్వాతి మూవీస్పైనా క్లారిటీ రావాల్సి ఉంది. వీరిలో వేణు శ్రీరామ్ హీరో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయనున్నారని టాక్. నాగచైతన్య హీరోగా పరశురామ్ ఓ మూవీ చేయనున్నారని సమాచారం. -
Allu Arjun : ‘తగ్గేదే లే’ అంటున్నబన్నీ.. 2025 వరకు ఫుల్ బిజీ
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు అల్లు అర్జున్. అందుకే ఇప్పుడు తన ఇమేజ్ కు తగ్గట్లు సినిమాలు చేయాలనుకుంటున్నాడు. అదే సమయంలో పాన్ ఇండియా సినిమాలతో కెరీర్ ను పరుగులు పెట్టించాలనుకుంటున్నాడు. అందుకోసం స్టార్ డైరెక్టర్స్ ను లైనప్ లో పెడుతున్నాడు. ‘అల వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ తో అల్లు అర్జున్ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. వరుసగా మూవీస్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.ఇప్పటికే పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు రెడీ అవుతోంది. క్రిస్మస్ కానుకగా ఈ మూవీని విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే పుష్ప పార్ట్ 2 మాత్రం కొంత ఎక్కువ గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నాడు బన్నీ. పుష్ప ఫస్ట్ పార్ట్ పూర్తి కాగానే,వేణు శ్రీరామ్ మేకింగ్ లో ఐకాన్ పట్టాలెక్కనుంది. దసరా కానుకగా ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేయనున్నారట. పూజా హెగ్డే, కృతిశెట్టి శెట్టీ హీరోయిన్స్ గా నటించనున్నారట. ఇక ఐకాన్ పూర్తైన వెంటనే పుష్ప పార్ట్ 2 తెరకెక్కాలి. కాని ఇప్పుడు అల్లు అర్జున్ మూడ్ మారిందని సమాచారం. ఐకాన్ తో పాటు బోయపాటి మేకింగ్ లో మూవీ చేయాలనుకుంటున్నాడట. అల్లు అర్జున్, బోయపాటి కాంబోలో ‘సరైనోడు’వచ్చి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అంతకు మించి మాస్ మూవీ ప్లాన్ చేస్తున్నారట. ఈ రెండు చిత్రాలు పూర్తైన తర్వాత అల్లు అర్జున్ పుష్ప 2 పై దృష్టి పెట్టనున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. రాబోయే ఐదేళ్లకు సరిపడా సినిమాలను ఇప్పుడే ఫిక్స్ చేసుకున్నాడు బన్ని. 2025 వరకు అల్లు అర్జున్ డైరీ ఫుల్ అయినట్లు సమాచారం. పుష్ప సిరీస్, ఐకాన్, బోయపాటితో మూవీస్ పూర్తైన వెంటనే,గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేయనున్నాడు. వీరితో పాటు కొరటాల శివ, మురుగదాస్ కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం స్టోరీస్ రెడీ చేస్తున్నారు. -
'ఐకాన్' స్టార్ ప్రయోగం : అంధుడిగా అల్లు అర్జున్!
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. రెండు భాగాలుగా వస్తోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఆగస్టులో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక పుష్ప షూటింగ్ అనంతరం అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కనుబడుట లేదు’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కబోతున్న ఈ మూవీలో బన్నీకి నిజంగానే కళ్లు కనిపించవట. అంధుడి పాత్రలో బన్నీ కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. త్వరలోనే ఐకాన్ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. గతంలో మాస్ మహారాజా రవితేజ కూడా ‘రాజా ది గ్రేట్’ సినిమాలో అంధుడి పాత్రలో నటించి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరి బన్నీ చేయనున్న ఈ ప్రయోగంలో ఎంత వరకు సక్సెస్ అవుతారన్నది చూడాల్సి ఉంది. చదవండి : పది కేజీఎఫ్‌లు ఒక్క పుష్పతో సమానం: ఉప్పెన డైరెక్టర్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ సరికొత్త రికార్డు -
'వకీల్‌సాబ్' డైరెక్టర్‌తో నాని తర్వాతి సినిమా?
హీరో నాని ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన టక్ జగదీష్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం టాక్సీ వాల ఫెమ్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమా చేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగుకు బ్రేక్ పడింది. ఈ సినిమాలో సాయి పల్లవి , ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, అధితిరావు హైదరి నటిస్తున్నారు. తాజాగా నాని తన తదుపరి చిత్రాన్ని వేణు శ్రీరామ్‌తో చేసేందుకు మొగ్గు చూపుతున్నాడట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ చిత్రాన్ని తెరెకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే అల్లుఅర్జున్‌తో ఐకాన్ చిత్రాన్ని ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల బన్నీ ఈ ప్రాజెక్టు చేసేందుకు సుముఖంగా లేరట. దీంతో ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కేలా కనిపించడం లేదు. దీంతో తన తదుపరి చిత్రాన్ని నానితో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే నానికి కథ చెప్పారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. నాని కూడా శ్రీరామ్ వేణుతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. చదవండి : డ్యామెజ్ అయిన ‘శ్యామ్ సింగరాయ్’ సెట్!.. కోట్లలో నష్టం ఆ కారణంతోనే బాలీవుడ్ సినిమా చేయలేకపోతున్నా: నాని -
కలలు బాగున్నాయ్ అన్న రాశీ.. చెత్తగా ఉందన్న అషూ
♦ డైరెక్టర్ వేణు శ్రీరామ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపిన అంజలి ♦ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ థ్యాంక్స్ చెప్పిన అనుష్క శర్మ ♦ వాస్తవం కన్నా కలలే ఎంతో బాగున్నాయ్.. అంటోన్న రాశీ ఖన్నా ♦ నీకు నువ్వే పోటీ అంటోన్న లావణ్య త్రిపాఠి ♦ లాక్‌డౌన్‌కు ముందు అక్కడున్నానంటోన్న నిత్యామీనన్ ♦ వీడియో చెత్తగా ఉంది కదూ అంటోన్న అషూ రెడ్డి View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
కాంబినేషన్ కుదిరేనా?
ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా చేయనున్న దర్శకుడి పేరు ఇదేనంటూ ఇప్పటికే కొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రశాంత్ నీల్, అనిల్æరావిపూడి వంటి దర్శకుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ పేరు తెరపైకి వచ్చింది. ఈ కాంబినేషన్ దాదాపు కుదిరినట్లేనని టాక్. ఇదిలా ఉంటే.. దర్శకుడు వేణు శ్రీరామ్‌తో అల్లు అర్జున్ ‘ఐకాన్: కనపడుటలేదు’ సినిమా కమిటయ్యారు. అలాగే కొరటాల శివతో ఓ సినిమా ఫిక్స్ అయింది. మరి... ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేస్తారో చూడాలి. -
Vakeel Saab: ‘మగువా.. మగువా’ వీడియో సాంగ్ వచ్చేసింది
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్’. ఏప్రిల్ 9న విడుదలైన ఈ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య, శ్రుతి హాసన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ‘మగువా.. మగువా’ వీడియో పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, మోహన భోగరాజు ఆలపించారు. తమన్ సంగీతం అందించారు. -
అల్లు అర్జున్ను దారుణంగా అవమానించిన దిల్ రాజు!
అల్లు అర్జున్- దిల్‌రాజు కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నట్లు ఆ మధ్య అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారని, మూవీ మోషన్ పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. ఈ మూవీకి 'ఐకాన్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను కూడా అనౌన్స్ చేసేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ పట్టాలెక్కలేదు. సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న పుష్ప మూవీలో అల్లు అర్జున్ నటిస్తుండగా, డైరెక్టర్ వేణు శ్రీరామ్ వకీల్‌సాబ్ మూవీని తెరకెక్కించడంలో బిజీ అయిపోయారు. దీంతో ఈ మూవీ ఆగిపోయిందనే వార్తలు వినిపించాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దిల్ రాజ్ ఐకాన్‌పై వస్తున్న వార్తలపై స్పందించారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తన తదుపరి చిత్రం ఐకాన్ ఉండబోతుందని, త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమాలో బన్నీ పాత్రపై మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంతేకాకుండా స్టైలిష్ స్టార్ బన్నీకి ఐకాన్ స్టార్ అనే టైటిల్‌ను తాము పెట్టలేదని, బన్నీ తనకు తాను పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో, వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరినందువల్ల, బన్నీ ఈ సినిమాలోనటించడం లేదని ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. ముందు నుంచీ ఈ ప్రాజెక్టుపై బన్నీ ఆసక్తి చూపడం లేదని, అందుకే పుష్ప తర్వాత కొరటాల డైరెక్షన్లో మూవీ చేసేందుకు రెడీ అయిపోయాడని తెలుస్తోంది. అయితే వకీల్‌సాబ్ హిట్‌తో వేణు శ్రీరామ్ డైరెక్షన్లో 'ఐకాన్' చేయడానికి అల్లు అర్జున్ అంగీకరించవచ్చని దిల్ రాజు భావించడట. కానీ వేణు శ్రీరామ్‌ని కాదని, బన్నీ ఇంకో మూవీ కమిట్ అవ్వడంపై దిల్ రాజ్ అసహనం వ్యక్తం చేస్తున్నారట. అందుకే ఐకాన్ మూవీలో బన్నీ కాకుండా మరో హీరోతో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది. ఈ వార్తలపై మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. చదవండి : 'అతని వల్లే ఆర్తి అగర్వాల్ కెరీర్ ఫేడ్ అవుట్ అయ్యింది' పుష్ప: తగ్గేదే లే అంటున్న నిర్మాతలు.. ఆ సీన్ కోసం 40కోట్లు! -
బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఐకాన్’ మూవీపై దిల్‌రాజు క్లారిటీ
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ముందుగా అనుకున్న తేది ప్రకారం ఆగష్టు 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అనుకోకుండా కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతుండటంతో షూటింగ్ ఆలస్యమవుతోంది. తో పుష్ప విడుదల మరో నాలుగు నెలలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగష్టు 13 తేదీని వాయిదా వేసి డిసెంబర్ 17న రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా పుష్ప అనంతరం బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఏ క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు ఏ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చదవండి: అల్లు స్నేహారెడ్డి ఐడియాకి సమంత ఫిదా అయితే పుష్పకు ముందు శ్రీరామ్ వేణు డైరెక్షన్ బన్నీ ‘ఐకాన్’..కనబడుట లేదు అనే ట్యాగ్‌లైన్‌తో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు దీన్ని నిర్మించనున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల అది వీలు కాకపోవడంతో తరువాత బన్నీ సుకుమార్ దర్శకత్వంలో, శ్రీరామ్ పవన్ ‘వకీల్ సాబ్’ సినిమాతో బిజీ అయిపోయారు. అయితే ఇటీవల జరిగిన వకీల్‌సాబ్ ప్రమోషనల్లో దర్శకుడు శ్రీరామ్‌ను అందరూ బన్నీతో ఐకాన్ సినిమా ఎప్పుడు స్టార్ కానుందని ప్రశ్నించారు. దీంతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభంపై తనకు ఎలాంటి అప్డేట్ అందలేని సమాధానమిచ్చారు. చదవండి: తమ్ముడికి కంగ్రాట్స్ చెప్పిన అల్లు అర్జున్.. కారణం ఇదే తాజాగా ఐకాన్ సినిమాపై నిర్మాత దిల్‌రాజ్ క్లారిటీ ఇచ్చారు. వకీల్‌సాబ్ ప్రెస్ మీట్లో ఐకాన్‌కు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. ఆయన మాటలతో బన్నీ ఐకాన్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. తమ తక్షణ తదుపరి ప్రాజెక్టు ఐకాన్ అని దిల్‌రాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా నాకు ఈ స్క్రిప్ట్‌తో బాగా కనెక్ట్ అయ్యాను. నా హార్ట్‌కు టచ్ అయ్యింది. శ్రీరామ్‌వేణు స్టోరీ వినిపించినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు దీనిపై పనిచేయాలన్న ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’. అని వెల్లడించారు. -
ప్రభాస్‌తో ప్యాన్ ఇండియా చిత్రం.. రాజు భారీ స్కెచ్?
బాహుబలి, సాహో చిత్రాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ హాలీవుడ్ స్థాయికి చేరింది. దీంతో అతడితో భారీ చిత్రాలను తెరకెక్కించాలని దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్’ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. వింటేజ్ స్టైల్లో ఓ లవ్ స్టోరీని బలమైన స్క్రిప్ట్‌తో తెరపై చూపించేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ చిత్రం తర్వాత ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో భారీ చిత్రానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కే ఈ భారీ బడ్జెట్ చిత్రానిన్న అశ్వినీ దత్ నిర్మిస్తున్నాడు. నాగ్ అశ్విన్ చిత్రం తర్వాత ప్రభాస్‌తో తప్పక ఓ చిత్రం చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడని ఇండస్ట్రీ టాక్. అయితే ఈ చిత్రం తర్వాత ప్రభాస్‌తో ఓ భారీ ప్యాన్ ఇండియా సినిమాను నిర్మించాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడని ఫిలింనగర్లో ప్రస్తుతం వినిపిస్తున్న హాట్ న్యూస్. ఈ భారీ బడ్జెట్ చిత్ర దర్శకత్వ బాధ్యతలను వేణు శ్రీరామ్‌కు అప్పగించినట్లు సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రం కోసం బలమైన స్కి్రప్ట్‌ను సిద్దం చేసే పనిలో ఈ యువ దర్శకుడు ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం పింక్ రిమేక్ ‘వకీల్ సాబ్’ చిత్రం కోసం దిల్ రాజు, వేణుశ్రీరామ్లు కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రం తర్వాతనే ప్రభాస్ సినిమాను లైన్లో పెట్టాలని వీరిద్దరు అనుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ‘వకీల్ సాబ్’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉన్న లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక దిల్ రాజు బ్యానర్లో ప్రభాస్ ‘మిస్టర్ ఫరెఫెక్ట్’ చిత్రాన్ని చేసిన విషయం తెలిసిందే. చదవండి: పదిహేనేళ్లవుతున్నా.. జనాల గుండెల్లో ‘భద్ర’oగా దేవిశ్రీ ఫిక్స్.. ప్రకటించిన క్రేజీ డైరెక్టర్ దిల్ వాకిట్లో తేజస్విని -
పవన్‌తో సినిమా.. శృతి క్లారిటీ
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’. పింక్ రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ‘మగువా మగువా’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. రెండేళ్ల తర్వాత పవన్ రీ ఎంట్రీ ఇస్తుండటం, ఫస్ట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ‘వకీల్ సాబ్’ అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం అంజలి, నివేదా థామస్‌లను చిత్ర బృందం ఇప్పటికే ఎంపిక చేసింది. అయితే మరో కీలక పాత్రలో శృతిహాసన్ నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో అనేక వార్తల వస్తున్నాయి. అయితే ఇటీవలే తన సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. ప్రస్తుతం తను తెలుగులో క్రాక్ చిత్రంలో మాత్రమే నటిస్తున్నాని, ఏ రీమేక్ చిత్రంలో నటించడం లేదని పేర్కొంది. అంతేకాకుండా తనను ఎవరూ కూడా సంప్రదించలేదని తేల్చిచెప్పడంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పడింది. గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రంలో పవన్, శృతిహాసన్‌ల కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో ‘వకీల్ సాబ్’ కోసం దర్శకనిర్మాతలు ఈ ముద్దుగుమ్మను సంప్రదించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: తమన్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్‌పై వర్మ ట్వీట్ -
బన్నీ ‘ఐకాన్’పై మరోసారి క్లారిటీ..
గతేడాది అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ‘ఐకాన్- కనబడుటలేదు’ అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓ మైండ్ ఫ్రెండ్, ఎమ్సీఏ సినిమాలను తెరకెక్కించిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలిపారు. త్రివిక్రమ్, సుకుమార్‌లతో సినిమాల అనంతరం ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లనున్నట్టుగా చెప్పారు. బన్నీ కేరీర్లో 21వ చిత్రంగా దీనిని ప్రకటించారు. అయితే ఆ తర్వాత నుంచి ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వెలువడలేదు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు వేణు శ్రీరామ్.. పవన్ కల్యాణ్ హీరోగా ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ చిత్రం ఆగిపోయిందని అనుకున్నారు. అయితే సరిగా ఏడాదికి అంటే.. ఈ ఏడాది బన్నీ బర్త్ డే సందర్భంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చేసిన ట్వీట్ చూస్తే ఐకాన్ మూవీ త్వరలోనే పట్టాలెక్కనున్నట్టుగా తెలుస్తోంది. ఐకాన్ టీమ్ తరఫును బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే గతేడాది ఏ పోస్టర్‌ను అయితే విడుదల చేశారో.. ఇప్పుడు కూడా అదే పోస్టర్‌ను పోస్ట్ చేశారు. అయితే పుష్ప చిత్రం పూర్తయిన తర్వాత ఐకాన్ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. అయితే కొంతకాలం కిందట వేణు శ్రీరామ్ పవన్ సినిమాతో బిజీగా మారడంతో ఐకాన్ మూవీ ఆగిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. గతంలో ఈ వార్తలను అల్లు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాస్ ఖండించారు. ఐకాన్ ప్రాజెక్ట్ ఆగిపోలేదని.. ఆ కథ బన్నీకి బాగా నచ్చిందని అతి త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలిపారు. కాగా, ఐకాన్ చిత్రంలో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా తెలుస్తోంది. Team #ICON wishes Stylish Star @alluarjun a Very Happy Birthday! #HappyBirthdayAlluArjun pic.twitter.com/jeRDhpc4zw — Sri Venkateswara Creations (@SVC_official) April 8, 2020 చదవండి : బన్ని బర్త్‌డే.. ‘నువ్వు బాగుండాలబ్బా’ బన్ని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన సుకుమార్ -
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు రేపు పండగే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం బాలీవుడ్లో హిట్‌గా నిలిచిన ‘పింక్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ‘అజ్ఞాతవాసి’ తర్వాత పవన్ వెండితెరపై కనిపించలేదు. దీంతో రెండేళ్ల గ్యాప్ తర్వాత తీసున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఫ్యాన్స్‌కు చిత్ర బృందం తీపి కబురు తెలిపింది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రచారంలో ఉన్న ‘వకీల్ సాబ్’ అనే టైటిల్‌నే చిత్రబృందం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఫస్ట్‌లుక్ పోస్టర్, టైటిల్ ఏంటో తెలుసుకోవడానికి అటు ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. బోని కపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. Here’s the Pre Look of Power Star @PawanKalyan’s #PSPK26 💥 First Look on March 2nd at 5PM🔥@SVC_official #SriramVenu @MusicThaman pic.twitter.com/SzTWTLObSo — Sri Venkateswara Creations (@SVC_official) March 1, 2020 చదవండి: పవర్‌స్టార్ సరసన ప్రగ్యా జైస్వాల్ ‘ఈ పాటను ప్రేమతో నింపేయండి సర్’ -
పవన్ కల్యాణ్ ఎంట్రీకి భారీ ప్లాన్!
‘పింక్’ రీమేక్‌తో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే15న విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడట. ఇక తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ సినీ అభిమానులను ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు హుషారెత్తిస్తోంది. ఈ సినిమాలో లాయర్ పాత్రలో కనిపించనున్న పవన్ ఎంట్రీ సీన్‌ను భారీగా ప్లాన్ చేశారట దర్శకనిర్మాతలు. దాదాపు రెండేళ్ల తర్వాత తెరపై కనిపించనున్న పవర్ స్టార్ ఎంట్రీ సాదాసీదాగా ఉంటే ఫ్యాన్స్‌కు రుచించదని వారు భావిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. భారీ ఫైట్ సీన్‌తో పవన్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారట చిత్ర బృందం. దీని కోసం దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రత్యేక సెట్ వేయించడాని టాక్. వాస్తవానికి పింక్ చిత్రంలో అమితాబ్ ఎంట్రీ నార్మల్‌గానే ఉంటుంది. కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథతో పాటు పాత్రలను కూడా సమూలంగా దర్శకుడు మార్చడంతో ఇలా భారీ ఫైట్ సీన్‌కు ప్లాన్ కుదిరిందట. కాగా, ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తుండగా.. ఇప్పటికే రెండు మూడు పాటలు కంపోజ్ చేసినట్టు సమాచారం. క్రేజీ సింగర్ సిద్ శ్రీరామ్‌తో ‘సామజవరగమన’రేంజ్లో ఓ పాటను పాడించినట్టు టాలీవుడ్ టాక్. ఇక ఈ చిత్రానికి ‘లాయర్ సాబ్’అనే టైటిల్ పెట్టే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది. చదవండి: పవన్ మరో మూవీ ప్రారంభం పవర్‌స్టార్ సరసన ప్రగ్యా జైస్వాల్ చిరంజీవి తొలి సినిమా దర్శకుడు మృతి -
డబుల్ ధమాకా
‘అజ్ఞాతవాసి’ (2018) తర్వాత పవన్ కల్యాణ్ మేకప్ వేసుకుని మూవీ కెమెరా ముందుకు రాలేదు. ఆయన సినిమా విడుదలై కూడా రెండేళ్లు పూర్తయింది. తన అభిమానులకు ఆ లోటును తీర్చేందుకు డబుల్ ధమాకా ఇవ్వాలని ఫిక్స్ అయినట్లున్నారు. ఒకేసారి రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు పవన్ కల్యాణ్. ఆల్రెడీ హిందీ హిట్ ‘పింక్’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ చిత్రం వేసవిలో విడుదల అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇది సెట్స్ మీద ఉండగానే క్రిష్ దర్శకత్వంలో ఎ.యం. రత్నం నిర్మించనున్న ఓ పీరియాడికల్ మూవీకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ సినిమా ఈ నెల 27న ప్రారంభం అవుతుందని సమాచారం. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. -
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్?
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిచింది. ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాలతో బిజీ అయిన పవన్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. అయితే పవర్ స్టార్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన ‘పింక్’ను తెలుగులో దిల్ రాజు, బోనీ కపూర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఓ మై ఫ్రెండ్, ఎమ్సీఏ’ చిత్రాల ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక హిందీ ‘పింక్’లో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ చేస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై పవన్ వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను పరిశీలిస్తే.. షూటింగ్లో భాగంగా హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్లో పవన్ పాల్గొన్నారని తెలుస్తోంది. సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు మరోటాక్. అయితే ఈ చిత్ర విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒక వేళ ఈ ఫోటోలు నిజమై ఆయన షూటింగ్లో పాల్గొంటే పవన్ ఫ్యాన్స్‌కు నిజంగా పండగే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్‌కు ఇది 26వ చిత్రం కావడంతో ట్విటర్లో ‘#PSPK26’ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ఇక పింక్ రిమేక్‌తో పాటు క్రిష్, పూరి జగన్నాథ్‌లతో కూడా సినిమాలు చేసేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నారని సమచారం. -
అల్లు అర్జున్ కెరీర్లో తొలిసారిగా..!
2003లో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయిన బన్నీ ఇప్పటి వరకు 18 సినిమాల్లో హీరోగా నటించాడు. బన్నీ చేయబోయే 19, 20వ సినిమాలు కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈసినిమాలన్నింటిల్లో బన్నీ ఒక్కసారి కూడా ద్విపాత్రాభినయం చేయలేదు. కానీ తొలిసారిగా బన్నీ డ్యూయల్ రోల్‌కు ఓకె చెప్పాడట. ఇటీవల బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఐకాన్ అనే సినిమాను ప్రకటించారు. ఓ మై ఫ్రెండ్, ఎమ్సీఏ సినిమాలను తెరకెక్కించిన వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడట. అంతుకాదు రెండు పాత్రలు పూర్తి భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. త్రివిక్రమ్, సుకుమార్ సినిమాలు పూర్తయిన వెంటనే ఐకాన్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. -
ఆ హిట్ ట్రాక్ కంటిన్యూ అవ్వాలనుకున్నా!
‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎంసీఏ’ చిత్రానికి కాస్త గ్యాప్ వచ్చింది. ఆ మధ్యలో రెండు సినిమాలు ఫైనలైజ్ అవుతాయనుకున్న తరుణంలో చేజారాయి. వాటి కోసం మూడేళ్లు వృథా అయ్యాయి’’ అని శ్రీరామ్ వేణు అన్నారు. నాని, సాయిపల్లవి జంటగా ఆయన దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ‘ఎంసీఏ’ ఇటీవల విడుదలైంది. శ్రీరామ్ వేణు మాట్లాడుతూ– ‘‘కొన్ని విషయాలు ఎన్నిసార్లు చెప్పినా బాగానే ఉంటాయి. మిడిల్ క్లాస్ అలాంటిదే. నేను, మా బ్రదర్ క్లోజ్‌గా ఉండేవాళ్లం. నాకు పెళ్లయిన తర్వాత మా బ్రదర్ కొంచెం ఫీలయ్యాడు. ఆ స్ఫూర్తితోనే ఈ కథ రాశా. కథ అనుకున్నప్పుడే నాని అనుకున్నాం. ‘ఎంసీఏ’ రిలీజ్ అయ్యాక సుకుమార్‌గారు మొదట ఫోన్ చేశారు. కొరటాల శివగారు మెసేజ్ చేశారు. ఓ సినిమా కోసం టైమ్ వెచ్చించాక అది ఓకే కాకపోవడంతో రెండు, మూడు రోజులు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లి, బయటపడ్డాను. మంచి సినిమా చూసిన ప్రతిసారీ నేను స్ఫూర్తి పొందేవాణ్ణి. ఎందుకంటే.. మాది మధ్యతరగతి కుటుంబం. ఓ పెద్దాయన సలహా మేరకు వేణు శ్రీరామ్‌గా ఉన్న నా పేరుని శ్రీరామ్ వేణుగా మార్చుకున్నా. న్యూమరాలజీ కోసం కాదు. రవితేజగారికి కథ చెబుతా. ఆయనకు నచ్చితే చేస్తా. రాజుగారికి ఆరో హిట్ ఇవ్వాలనే టెన్షన్ ఉండేది. నేను హిట్ ఇవ్వకపోతే ఆయన ట్రాక్ దెబ్బతింటుందని జాగ్రత్తగా పనిచేశా’’ అన్నారు. -
'ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయ్)' మూవీ రివ్యూ
టైటిల్ : ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయ్) జానర్ : రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా తారాగణం : నాని, సాయి పల్లవి, భూమిక, రాజీవ్ కనకాల సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : వేణు శ్రీరామ్ నిర్మాత : దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని, అదే ఫాంలో ఉన్న నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఎమ్సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయ్). ఓ మై ఫ్రెండ్ సినిమాతో పరిచయం అయిన దర్శకుడు వేణు శ్రీరామ్ లాంగ్ గ్యాప్ తరువాత తెరకెక్కించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఎమ్సీఏ అందుకుందా..? నాని, దిల్ రాజులు తమ విజయ పరంపర కొనసాగించారా..? దర్శకుడిగా వేణు శ్రీరామ్ విజయం సాధించాడా..? కథ : నాని ఎలాంటి బాధ్యత లేకుండా అన్నయ్య (రాజీవ్ కనకాల) మీద ఆధారపడి హ్యాపీగా కాలం గడిపేస్తుంటాడు. తల్లి తండ్రి లేకపోటంతో నానిని గారాబంగా పెంచుతాడు అన్న. అయితే తన అన్నకు పెళ్లి కావటంతో వదిన జ్యోతి (భూమిక) వల్ల తన అన్న తనకు దూరమయ్యాడని ఆమె మీద కోపం పెంచుకుంటాడు నాని. అందుకే దూరంగా వెళ్లి హైదరాబాద్ లో బాబాయ్, పిన్నిలతో కలిసి ఉంటాడు. కానీ ఆర్టీవో గా పనిచేసే జ్యోతికి వరంగల్ ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఆమెకు తోడుగా నానిని పంపిస్తాడు. ఇష్టం లేకపోయినా అన్న కోసం వదినకు తోడుగా వెళ్తాడు నాని. అక్కడే హాస్టల్లో ఉండి చదువుకునే పల్లవి (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. (సాక్షి రివ్యూస్)అయితే నాని ప్రేమ విషయం తెలిసిన వదిన జ్యోతి.. పల్లవిని దూరంగా పంపిచేస్తుంది. దీంతో నాని.. వదిన మీద మరింత కోపం పెంచుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటాడు. కానీ అదే సమయంలో వరంగల్ ను భయపెట్టే శివ (విజయ్) అనే వ్యక్తి కారణంగా నాని కుటుంబం ప్రమాదంలో పడుతుంది. ఈ ప్రమాదం నుంచి నాని తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు..? శివ.. నాని ఫ్యామిలీ జోలికి ఎందుకు వచ్చాడు..? నానికి వదిన మీద కోపం తగ్గిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : పాత్రల ఎంపికలో తనదైన ముద్ర వేస్తూ సూపర్ ఫాంలో దూసుకుపోతున్న నాని, మరోసారి ఆసక్తికరమైన పాత్రలో ఆకట్టుకున్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయ్ నానిగా తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యాడు. ఇప్పటికే నేచురల్ స్టార్ గా ప్రూవ్ చేసుకున్న ఈ యంగ్ హీరో ఎమోషనల్, రొమాంటిక్ సీన్స్ లో తన మార్క్ చూపించాడు. ఫిదా సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ను ఫిదా చేసిన సాయి పల్లవి, మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటిన భూమిక మరోసారి కీలక పాత్రలో మెప్పించింది. తన సీనియారిటీతో వదిన పాత్రకు మరింత హుందాతనం తీసుకొచ్చింది.(సాక్షి రివ్యూస్) విలన్‌గా నటించిన కొత్త కుర్రాడు విజయ్ ఆకట్టుకున్నాడు. కేవలం హావభావాలతోనే విలనిజాన్నిపండించాడు. ఇతర పాత్రలో రాజీవ్ కనకాల, ప్రియదర్శి, నరేష్, ఆమని తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : తొలి చిత్రంతో నిరాశపరిచిన దర్శకుడు వేణు శ్రీరామ్ రెండో ప్రయత్నంలో సక్సెస్ సాధించాడు. మిడిల్ క్లాస్ అబ్బాయ్ పాత్రకు నానిని ఎంపిక చేసుకొని సగం సక్సెస్ అయిన వేణు శ్రీరామ్.. కథా కథనాల్లోనూ మంచి పట్టు చూపించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అన్ని అంశాలతో సినిమాను ఫుల్ మీల్స్ లా రెడీ చేశాడు. ముఖ్యంగా నాని, భూమికల కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హీరో, విలన్ ల మధ్య సాగే ఎత్తుకు పై ఎత్తులు థ్రిల్లింగ్ గా ఉన్నాయి. తొలి భాగాన్ని ఎంటర్ టైనింన్గా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ ను మాత్రం ఒకే మూడ్ లో కొనసాగించాడు. (సాక్షి రివ్యూస్) ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఆడియన్స్ లో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు తన స్థాయికి తగ్గ సంగీతం అందించలేదనిపిస్తుంది. ఆడియో పరవాలేదనిపించినా.. దేవీ మార్క్ ఆశించిన ఆడియన్స్ కు నేపథ్యం సంగీతం నిరాశపరుస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : ప్రధాన పాత్రల నటన ఇంటర్వెల్, క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సెకండ్ హాఫ్ లో ఎంటర్ టైన్మెంట్ లేకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
నేను పేర్ల వెనక పరిగెత్తను
‘‘ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు పేర్లు (ప్రముఖ దర్శకులు) కావాలేమో కానీ, ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పుడు, కుదిరితే ప్రతి సినిమాకి ఓ కొత్త డైరెక్టర్ని పరిచయం చేయాలి. మంచి పొజిషన్లో ఉంటే ఒక కొత్త హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేయగలగాలి. నా లాస్ట్ సినిమా పెద్ద హిట్ అయితే... వెంటనే పెద్ద పేరున్న డైరెక్టర్‌తో సినిమా చేయాలనుకోను. కొత్తవాళ్లతో చేయాలని ఆలోచిస్తాను. తెలుగులో కొత్త హీరోయిన్స్ లేరు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ రావడం లేదు అన్న మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తుంటాయి. చాన్స్‌లు ఇస్తే కదా కొత్తవారు వచ్చేది. నేనెప్పుడూ పేర్ల వెనక పరిగెత్తలేదు. పరిగెత్తను కూడా. పేర్ల కోసం నేను సినిమాలు చేయలేదు. చేయను.’’ అన్నారు హీరో నాని. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నాని, సాయి పల్లవి జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ‘ఎంసీఏ’ సినిమా గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నాని మంగళవారం పాత్రికేయులతో మాట్లాడారు. ఆయన చెప్పిన విశేషాలు.. ► ‘ఎంసీఏ’లో క్యారెక్టర్స్ రియల్‌గా ఉంటాయి. సినిమా స్క్రీన్‌ప్లే యాక్షన్ మూడ్‌లో సాగుతుంది. కానీ యాక్షన్ సినిమా కాదు. రెగ్యులర్ మిడిల్ క్లాస్ అబ్బాయిలానే నా క్యారెక్టర్ ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి హీరో అవ్వాల్సి వచ్చిందన్నది స్క్రీన్‌పై చూస్తే ప్రేక్షకులు థ్రిల్ అవుతారన్న నమ్మకం ఉంది. డైరెక్టర్ వేణు శ్రీరామ్ మిడిల్ క్లాస్ ఎమోషన్స్ అండ్ క్యారెక్టర్స్‌కు కమర్షియల్ హంగులు జోడించి బాగా తీశారు. ‘ఎంసీఏ’ షూటింగ్ స్పాట్లో నాకు, సాయి పల్లవికి మధ్య క్లాషెస్ వచ్చాయన్న న్యూస్ విని, ఇద్దరం నవ్వుకున్నాం. ► బ్యాగ్రౌండ్ ఉంటే చాలా ప్రెజర్ ఉంటుందేమో. ఇప్పుడు నాకు నచ్చిన సినిమా చేసుకుంటూ కెరీర్లో ముందుకెళ్లొచ్చు. బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లకు ఈ ఫ్రీడమ్ ఉండకపోవచ్చేమో. ► ‘భలే భలే మగాడివోయ్’ టైమ్‌లో నేచురల్ స్టార్ నాని అనే ట్యాగ్ ఇబ్బందిగా అనిపించింది. కానీ ఇప్పుడు లేదు. నేచురల్ స్టార్ అన్న పదంలో ప్రేక్షకుల ప్రేమ కనిపిస్తోంది. ► ‘మహానటి, భారతీయుడు’ లాంటి కథలు నాకు చెప్పి ఉంటే... నేను రిజెక్ట్ చేసి ఉంటే.. అదో రకం. నా దగ్గరకు అలాంటి కథలు రావడం లేదు. ప్రతిరోజు కొత్త కథలు వినడానికి టైమ్ కేటాయిస్తా. బట్ ఒక్క కథ కూడా రావడం లేదు. కమల్‌హాసన్‌గారు చూపిన వేరియేషన్స్‌ను మా యంగ్ జనరేషన్ యాక్టర్స్ అసలు చేయగలరా? అనిపిస్తుంది. చేస్తే మా జన్మ ధన్యమైనట్టే. ► మంచి సినిమాలు చేద్దామనే నిర్మాతగా మారాను. ‘అ!’ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అనుకుంటున్నాం. సినిమా కాన్సెప్ట్ విని థ్రిల్ అయ్యాను. మంచి ఐడియా విన్నప్పుడు ఎవరూ ప్రొడ్యూస్ చేయరన్నప్పుడు, ఆ ఐడియా నాకు నచ్చితే నిర్మిస్తా. ► డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య చెప్పిన కథ నాగార్జునగారికి, నాకు నచ్చింది. ‘కృష్ణార్జునయుద్ధం’లో డబుల్ రోల్ చేస్తున్నా. అనిల్ రావిపూడితో ఓ సినిమా ఉండొచ్చు. మణిరత్నంగారి మూవీకి డిస్కషన్స్ జరిగాయి. డేట్స్ కుదరలేదు. అవసరాల శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయాలి. మంగళవారం మార్నింగ్ ఓ వెబ్సైట్లో న్యూస్ చదివి, బాధపడ్డాను. సంస్కారహీనంగా ఎంత దిగజారిపోయారంటే... ‘సినిమా బాగోలేదు. అంటే బాగోలేదు’ అని చెప్పండి. లేకపోతే ఇతను రెమ్యూనరేషన్ పెంచాడనో, షూటింగ్లో ఇబ్బంది పెడతాడనో, వీడికి తిక్క అనో.. ఇలాంటి గాసిప్‌లు రాయొచ్చు. వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి ... అంటే అది ఏ విషయం గురించో కూడా చెప్పలేని పరిస్థితి నాదిప్పుడు. అంత దిగజారిపోయారు. ఇది సందర్భం అవునో కాదో నాకు తెలీదు. కానీ లింక్ చూసిన వెంటనే పదేళ్లు ఇండస్ట్రీలో ఉండి, ఇన్ని సినిమాలు చేసి, నేనేంటో అందరికీ తెలిశాక, ఇంత దారుణమైన మాటలతో, ఇలాంటి ఆర్టికల్ కూడా ఒకటి నా మీద రాయొచ్చా? అన్న ఫీలింగ్ కలిగింది. పెళ్లై ఒక రిలేషన్లో ఉన్నాను. అసలు.. ఎలా? పొద్దునే కూర్చొని అలా రాసేస్తారా? అనిపిస్తుంది. ఒక సినిమా రెండు రోజుల్లో రిలీజ్ అవుతుంది అనగానే.. ఒక దారుణమైన హెడ్డింగ్ పెట్టేసి, నా పేరు చెప్పకుండా రెండు రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యే ఒక హీరో అని రాస్తున్నారు. గాసిప్‌లు రాయొచ్చు. కానీ దిగజారిపోయి రాయాల్సిన అవసరంలేదేమో అనిపిస్తుంది. మనం సినిమాల మీద రన్ అవుతున్నాం. గాసిప్‌లు, రివ్యూస్, ఊహలు, నిజాలు ఇలా అన్ని పార్ట్స్ రాసుకోవచ్చు. కానీ ఊహకు కూడా అందని ఓ థాట్‌ని రుద్ది ఓ హెడ్డింగ్‌లా పెట్టి, రిలీజ్‌కి ముందు క్లిక్స్ కోసం ఇలా రాయడం సరికాదని నా ఫీలింగ్. నాకు బాధ కలిగింది కాబట్టి చెప్పాను. -
నాని సినిమాలో సీనియర్ హీరోయిన్
వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న యువ కథానాయకుడు నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఎమ్ సీ ఏ'. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. చాలా రోజుల కిందటే సీనియర్ హీరోయిన్ భూమిక రీ ఎంట్రీపై టాలీవుడ్ లో వార్తలు వినిపించాయి. అయితే నాని సినిమాతో భూమిక మరోసారి టాలీవుడ్ లో అధృష్టాన్ని పరీక్షించుకోనుందట. ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న భూమిక, పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటోంది. పూర్తిగా నటించటం మానేయకపోయినా.. చాలా తక్కువగా సినిమాల్లో నటిస్తోంది. ఖుషి, ఒక్కడు లాంటి కమర్షియల్ సినిమాలతో పాటు మిస్సమ్మ, అనసూయ లాంటి లేడి ఓరియంటెడ్ చిత్రాల్లోనూ అలరించింది భూమిక. చివరగా టాలీవుడ్లో లడ్డుబాబు సినిమాలో నటించిన ఈ భామ త్వరలో మరో తెలుగు సినిమా చేసేందుకు అంగీకరించింది. నాచ్యురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సినిమాలో భూమిక కీలక పాత్రలో కనిపించనుందట. అయితే ఈ సినిమాలో భూమికది వదిన క్యారెక్టర్ అన్న టాక్ వినిపిస్తోంది. హీరోయిన్గా గ్లామర్ రోల్స్‌తో పాటు, లేడి ఓరియంటెండ్ సినిమాల్లోనూ అలరించిన భూమిక, ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఆకట్టుకుంటుందోమో చూడాలి. -
మిడిల్ క్లాస్ అబ్బాయి ముందే వస్తున్నాడు..!
వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎమ్సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి). వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ మూడోవారంలో క్రిస్టమస్ కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే సమయంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘హలో’ రిలీజ్ కూడా ఉండటంతో నాని రేసు నుంచి తప్పుకున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను వారం ముందుగానే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ముందుగా అనుకున్నట్టుగా డిసెంబర్ 21న కాకుండా డిసెంబర్ 15నే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో నాని తన విజయపరంపర కొనసాగిస్తాడని నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్. అందుకే ఎలాంటి రిస్క్ లేకుండా వారం ముందుగానే థియేటర్లలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
నాని సినిమాలో సీనియర్ హీరోయిన్
త్వరలో నిన్ను కోరి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న యంగ్ హీరో నాని.. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ప్రారంభించాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం దర్శకత్వంలో ఎమ్‌సిఎ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రలో ఓ సీనియర్ హీరోయిన్ కనిపించనుంది. టాలీవుడ్ టాప్ హీరోలందరితో సినిమాలు చేసిన భూమిక చావ్లా నాని కొత్త సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. స్టార్ హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైన ఈ బ్యూటి రీ ఎంట్రీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే లాంగ్ గ్యాప్ తీసుకున్న భూమిక, నాని సినిమాతో రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఈ సినిమాలో భూమికతో పాటు మరో సీనియర్ నటి ఆమని కూడా నటిస్తోంది. -
నాని కొత్త సినిమా లాంచింగ్ డేట్
యంగ్ హీరో నాని ఫుల్ ఫాంలో ఉన్నాడు. వరుస విజయాలతో సత్తా చాటుతున్న ఈ యువ కథానాయకుడు, ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా ప్రారంభిస్తున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడితో నిన్నుకోరి సినిమా చేస్తున్నాడు నాని. ఎక్కువ భాగం ఫారిన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ సినిమా లైన్ లో ఉండగానే మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకొస్తున్నాడు నాని. దిల్ రాజు నిర్మాణంలో నాని హీరోగా తెరకెక్కనున్న ఎమ్సిఏ సినిమాను ఈ శనివారం(06-05-2017) లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నాని సరసన మలయాళీ బ్యూటి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే కొత్త రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
నాని చేతికి మాస్ మహారాజ్ మూవీ
బెంగాల్ టైగర్ సినిమాతో మంచి విజయం సాధించిన రవితేజ. ఇంత వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టలేదు. ఒకటి రెండు సినిమాలు సెట్స్ మీదకు వచ్చినట్టుగానే అనిపించినా చివరి నిమిషంలో ఆగిపోయాయి. ముఖ్యంగా దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఎవడో ఒకడు సినిమా ఎనౌన్స్మెంట్ కూడా అయ్యాక ఆగిపోయింది. కారణం ఏంటన్నది బయటికి రాకపోయినా ఈ ప్రాజెక్ట్ రవితేజతో కాకుండా వేరే హీరోతో చేయాలని ఫిక్స్ అయ్యాడు దిల్ రాజు. రవితేజ తరువాత ఈ కథను సీనియర్ హీరో నాగార్జునకు వినిపించాడు. కథ బాగుందన్న కింగ్ తనకు సూట్ అవ్వదేమో అన్న ఆలోచనతో పక్కన పెట్టేశాడు. దీంతో మరోసారి హీరో కోసం వేట కొనసాగిస్తున్నాడు దిల్ రాజు. ప్రస్తుతం నాని హీరోగా నేను లోకల్ సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు, అదే హీరోతో ఎవడో ఒకడు సినిమాను చేయాలని భావిస్తున్నాడట. అయితే ఈ సినిమా తరువాత మరో మూడు సినిమాలను లైన్లో పెట్టిన నాని, ఎవడో ఒకడు సినిమా చేయాలంటే మరో ఏడాది సమయం పడుతుంది. మరి అప్పటి వరకు దిల్ రాజు వెయిట్ చేస్తాడా..? లేక వేరే హీరోతో పట్టాలెక్కిస్తాడా చూడాలి.