పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు రేపు పండగే! | Pawan Kalyan 26th Telugu Movie First Look On 2nd March | Sakshi
Sakshi News home page

పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు రేపు పండగే!

Published Sun, Mar 1 2020 1:48 PM | Last Updated on Sun, Mar 1 2020 1:49 PM

Pawan Kalyan 26th Telugu Movie First Look On 2nd March - Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో హిట్‌గా నిలిచిన ‘పింక్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. వేణుశ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ‘అజ్ఞాతవాసి’ తర్వాత పవన్‌ వెండితెరపై కనిపించలేదు. దీంతో రెండేళ్ల గ్యాప్‌ తర్వాత తీసున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఫ్యాన్స్‌కు చిత్ర బృందం తీపి కబురు తెలిపింది. 

ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సోమవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రచారంలో ఉన్న ‘వకీల్‌ సాబ్‌’ అనే టైటిల్‌నే చిత్రబృందం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టైటిల్‌ ఏంటో తెలుసుకోవడానికి అటు​ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్‌ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. బోని కపూర్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
 

చదవండి:
పవర్‌స్టార్‌ సరసన ప్రగ్యా జైస్వాల్‌
‘ఈ పాటను ప్రేమతో నింపేయండి సర్‌’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement