పవన్‌తో సినిమా.. శృతి క్లారిటీ | Shruti Hassan Gives Clarity On Pawan Kalyans Vakeel Saab Movie | Sakshi
Sakshi News home page

పవన్‌తో సినిమా.. శృతి క్లారిటీ

Apr 11 2020 1:52 PM | Updated on Apr 11 2020 1:52 PM

Shruti Hassan Gives Clarity On Pawan Kalyans Vakeel Saab Movie - Sakshi

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. పింక్‌ రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్‌ రాజు, బోనీ కపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, ‘మగువా మగువా’ సాంగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. రెండేళ్ల తర్వాత పవన్‌ రీ ఎంట్రీ ఇస్తుండటం, ఫస్ట్‌ సాంగ్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించడంతో ‘వకీల్‌ సాబ్‌’ అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌ వాయిదా పడగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం అంజలి, నివేదా థామస్‌లను చిత్ర బృందం ఇప్పటికే ఎంపిక చేసింది. అయితే మరో కీలక పాత్రలో శృతిహాసన్‌ నటిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో అనేక వార్తల వస్తున్నాయి. అయితే ఇటీవలే తన సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. ప్రస్తుతం తను తెలుగులో క్రాక్‌ చిత్రంలో మాత్రమే నటిస్తున్నాని, ఏ రీమేక్‌ చిత్రంలో నటించడం లేదని పేర్కొంది. అంతేకాకుండా తనను ఎవరూ కూడా సంప్రదించలేదని తేల్చిచెప్పడంతో సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడింది. గబ్బర్‌ సింగ్‌, కాటమరాయుడు చిత్రంలో పవన్‌, శృతిహాసన్‌ల కెమిస్ట్రీ వర్కౌట్‌ కావడంతో ‘వకీల్‌ సాబ్‌’ కోసం దర్శకనిర్మాతలు ఈ ముద్దుగుమ్మను సంప్రదించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 

చదవండి:
ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: త‌మ‌న్
వకీల్‌ సాబ్‌ ఫస్ట్‌ లుక్‌పై వర్మ ట్వీట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement