Vakeel Saab
-
ఆ ఫోటోలు ఎందుకు షేర్ చేస్తానంటే: అనన్య నాగళ్ల
మల్లేశం సినిమాతో వెండితెరకు పరిచయమైన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. అందం, అభినయంతో పాటు నటనలో మంచి టాలెంట్ ఉన్న బ్యూటీ అనన్య.. వకీల్ సాబ్ సినిమా అనన్యకు మంచి బ్రేక్ ఇచ్చింది కానీ, అవకాశాలను మాత్రం అందివ్వలేకపోయింది. దానికి ప్రధాన కారణం తెలుగమ్మాయి అనే ప్రశ్నలు రావడం సహజం. తను హీరోయిన్ మెటిరీయల్ అయినప్పటికీ సహాయనటిగానూ ప్రేక్షకులను మెప్పించింది. ప్రధాన కథాననాయకగా ఆమె నటించిన తాజా చిత్రం ‘అన్వేషి’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇన్‌స్టా వేదికగా తరచూ గ్లామరస్ ఫొటోలు షేర్ చేయడానికి గల కారణాన్ని ఆమె తెలిపారు. 'వకీల్‌సాబ్’కు ముందు ఎక్కువగా ట్రెడిషనల్ ఫొటోలు షేర్ చేసేదాన్ని. శాకుంతలం చిత్రంలో నటిస్తున్న సమయంలో ఒక గ్లామర్ పిక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. దానికి చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఆ ఫొటోలు షేర్ చేయడానికి అప్పట్లో ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. కాకపోతే ఆ ఫొటోలకు భారీగా రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు సినిమా అనే రేస్‌లో నేను ఉండాలనుకుంటున్నా.. ఇక్కడ నువ్వు కొనసాగాలంటే అన్ని రకాలుగా కనిపించాలి. ఈ కారణంతో మాత్రమే నేను గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తున్నాను. అంతకుమించి ఎలాంటి కారణం లేదు. కమర్షియల్ సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి.. కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు.' అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఇలా ఓపెన్‌గా ఉన్న విషయాన్ని చెప్పిన అనన్యపై నెటిజన్లు కూడా పాజిటివ్‌గానే రెస్పాన్స్ అవుతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'అన్వేషి' చిత్రాన్ని వి.జె.ఖన్నా డైరెక్ట్ చేశాడు. నవంబర్ 17న ఇది విడుదల కానుంది. -
వకీల్‌సాబ్ నటిపై రూమర్లు.. మండిపడ్డ టాలీవుడ్ బ్యూటీ
టాలీవుడ్లో మల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ అనన్య నాగళ్ల. మొదటి మూవీతోనే మంచి గుర్తింపు పొందిన ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే కెరీర్లో ముందుకెళ్తోంది. అయితే ఇటీవల ఆమెపై గాసిప్స్ గుప్పుమంటున్నాయి. త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టాలీవుడ్లో ఓ అగ్రనిర్మాత కుమారుడితో వివాహబంధంలోకి అడుగు పెడుతున్నట్లు పలు కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది అనన్య . 'నాకోసం వరుడిని చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా పెళ్లి ఎప్పుడు, ఎక్కడ చేస్తున్నారో దయచేసి నాకు తెలియజేయండి. దానివల్ల నా పెళ్లికి నేను కూడా హాజరవుతానంటూ' వ్యంగ్యాస్త్రాలు సంధించింది. పవన్ కల్యాణ్ ‘వకీల్‌సాబ్’, ‘మ్యాస్ట్రో’ చిత్రాల తర్వాత అనన్య ‘శాకుంతలం’లో నటించారు. Guys, thanks for selecting a groom for me 🙏 but please naku kuda evaro cheppandi with the date and time as well, so that i can attend my own wedding 😊 — Ananya Nagalla (@AnanyaNagalla) October 2, 2022 -
తమిళంలో ఎంట్రీ ఇచ్చేసిన వకీల్‌సాబ్ బ్యూటీ
Annaya Nagalla Enter Into Kollywood: మల్లేశం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల. వకీల్‌సాబ్ సినిమాతో మాంచి క్రేజ్ సంపాదించుకున్న అనన్య ఇప్పుడు తమిళంలో సైతం ఎంట్రీ ఇచ్చేసింది. కోలీవుడ్ హీరో శశికుమార్ సినిమాలో కీలక పాత్ర చేసేందుకు అనన్య ఎంపికైంది. దీనికి సంబంధించిన అప్డేట్ను అనన్య ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. టైమ్ ట్రావెల్ బేస్డ్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి అంజల ఫేమ్ తంగం పా శరవణన్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. Tamil debut❤️ https://t.co/Qq35I2dDon — Ananya Nagalla (@AnanyaNagalla) February 15, 2022 -
అచ్చ తెలుగు అమ్మాయి నటి అంజలి పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు
-
Pawan Kalyan: ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మళ్లీ వస్తున్న ‘వకీల్ సాబ్’
Vakeel Saab: దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’మూవీలో రీ ఎంట్రీ ఇచ్చి న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 9న విడుదలై పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే దాదాపు రూ.80 కోట్లకు పైగా వసూళ్లను సాధించి పవన్ సత్తా ఏంటో నిరూపించింది. అయితే సినిమా వచ్చిన రెండు వారాల గ్యాప్ లోనే కరోనా వైరస్ తీవ్రత పెరిగి పోవడంతో కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోయాయి. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ని ప్రకటించింది. దీంతో థియేటర్లు అన్ని మూతపడటంతో మూడు వారాల్లోనే ప్రముఖ ఓటీటీ అమెజాన్‌లో స్ట్రీమింగ్ అయింది. ఓటీటీలో కూడా ఎక్కువ వ్యూస్‌ని సాధించి రికార్డుని క్రియేట్ చేసింది. ఈ విషయం పక్కన పెడితే.. తమ అభిమాన హీరో సినిమాని థియేటర్లలో చూడాలని ఆశ పడిన చాలామంది అభిమానుల కరోనా వైరస్ మాత్రం బ్రేకులు వేసింది. ఈ సమయంలో వకీల్ సాబ్ దర్శక నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్‌ని మరోసారి థియేటర్లకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు కనిష్ఠ స్థాయికి చేరుకుంది. ప్రభుత్వాలు కూడా ఒక్కొక్కటిగా అన్‌లాక్‌ని ప్రకటిస్తున్నాయి. 50 శాతం అక్యుపెన్షీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా త్వరలో థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వనున్నాయి.దీంతో నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్‌ని మరోసారి థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఈ మూవీని దాదాపు 300 థియేటర్స్‌లో రీ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఇదే ఇదే కనుగా నిజమైతే పవన్ ఫ్యాన్స్‌కి పండగనే చెప్పొచ్చు. చదవండి: ‘శాకుంతలం’ అప్డేట్స్ : సెట్స్‌పైకి ఎప్పుడంటే.. ఒంటినిండా బురదతో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? -
Sid Sriram: సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటలు విన్నారా?
Happy Birthday Sid Sriram: పొగడ్త అందరికీ చేత కాదు. అందరి గొంతు అందుకు నప్పదు. స్త్రీలను పొగిడే ఒక గొంతు కొన్నాళ్లుగా తెలుగులో తళతళలాడుతోంది. కొంత అరవం కొంత తెలుగు కలగలిసిన ఆ శబ్దానికి హీరోయిన్లే కాదు ప్రేక్షకులూ ఫిదా అవుతున్నారు. మే 19 సిద్ శ్రీరామ్ జన్మదినం. 32లోకి ఎంటర్ అవుతున్నాడు.ఆ గొంతు పొగిడిన స్త్రీ సౌందర్యపు పాటలు ఇవి. ‘ముల్లో పువ్వో పోయే దారిదైనా నిన్నే నమ్మి వచ్చానే అడవి గుర్రమంటి ఒక గుర్రెపిల్లలాగా నీ వెంటే వస్తున్నానే యాడికే... యాడికే తీసుకెళ్తావే నీతో పాటే’.... మణిరత్నం ‘కడలి’ సినిమా కోసం సిద్ శ్రీరామ్ మొదటిసారి ప్రియురాలిని కీర్తిస్తూ ఈ పాట ఏ ముహూర్తాన పాడాడోగాని తెలుగులో అమ్మాయిలను బుట్టలో వేసుకోవడానికి సినిమాల్లో సిద్ గొంతును హీరోలు అరువు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. సిద్ గొంతుతో ‘నీ బాగున్నావు... ముచ్చటగా ఉన్నావు.. నువ్వు నవ్వితే బుగ్గన సొట్ట పడుతుంది’ వంటి మామూలు మాటలు మాట్లాడినా ఆ హీరోయిన్ తప్పక లవ్‌ను యాక్సెప్ట్ చేసే మెస్మరిజమ్ అతని గొంతులో ఉంది. అది సినిమాకు ప్లస్ అవుతోంది. శంకర్ కూడా ఇది కనిపెట్టి ‘ఐ’ కోసం సిద్ చేత పాడించాడు. ‘నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా’ పాట బయట హిట్. చూడటానికి కాదు. వినడానికి. ‘హృదయం వేగం వీడదే వెతికే చెలిమే నీడై నన్ను చేరితే’... అని ‘సాహసం శ్వాసగా సాగిపో’లో సిద్ శ్రీరామ్ ‘వెళ్లిపోమాకే’ పాటలో అంటాడు. ఆ లైన్స్‌తో హీరోయిన్ హీరో నాగచైతన్య ప్రేమలో పడుతుంది. ప్రేమను చెప్పడానికి కాదు ఆ ప్రేమలో దూరం వస్తే దాని లోతును చెప్పడానికి కూడా సిద్ శ్రీరామ్ గొంతు బాగా నప్పుతుంది. ‘అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలి ఏదనీ’ అని ‘నిన్ను కోరి’లో సిద్ పాడిన పాట అలాంటి స్థితిలో ఉన్న ప్రేమికులను తాకుతుంది. ఇక ‘గీత గోవిందం’లోని ‘ఇంకెం ఇంకెం ఇంకేం కావాలే’ పాటతో సిద్ తెలుగువారి ఇంటింటి గాయకుడు అయ్యాడు. ‘నీ ఎదుట నిలబడు చనువే వీసా... అందుకుని గగనపు కొనలే చూసా’ అని అమాయకంగా పాడుతుంటే రష్మికా మందన్నా ఏంటి మందికా రష్మన్నా కూడా ఫిదా కాక తప్పదు కదా. అదే వరుసలో ‘టాక్సీ వాలా’లో ‘మాటే వినదుగా వినదుగా’ కూడా విజయ్ దేవరకొండకు దక్కింది. కళ్లను శ్లాఘించి హిట్ కొట్టినవాళ్లున్నారు. కాని సిద్ శ్రీరామ్ ‘అల వైకుంఠపురములో’ కాళ్లను శ్లాఘించి సూపర్‌హిట్ కొట్టాడు. ‘నీ కాళ్లను పట్టుకు వదలవన్నవి చూడే నా కళ్లు’... ఒక ఊపు ఊపింది. ‘ఎంతో బతిమాలినా ఇంతేనా అంగనా మదిని మీటు మధురమైన మనవిని వినుమా’ అని సిద్ ఈ పాటలో అంటాడు. వినక ఊరుకోగలదా పూజా హేగ్డే. ఇక చిన్న సినిమాలకు ఒక్క పాటతో ప్రాణం పోయొచ్చు అని ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలో ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ పాటతో సిద్ చూపిస్తాడు. ‘నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే... నువ్వు వదిలేటి శ్వాసకే గాలులు బతికాయి చూడవే’... సిద్ మాత్రమే ఆ పదానికి ప్రాణవాయువు ఇవ్వగలడు. కాని స్త్రీ గొప్పతనాన్ని నిజంగా వర్ణించడానికి కూడా సిద్ శ్రీరామ్ గొంతు అవసరమవుతుంది. ‘వకీల్‌సాబ్’లో ‘మగువా మగువా’ పాటను సిద్ పాడాడు. ‘ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా... నీవు లేని జగతిలో దీపమే వెలుగునా’ అని ఆమె గొప్పను సిద్ నిర్ధారిస్తూ పాడతాడు. మగవ మెచ్చే పాటలు మరెన్నో సిద్ పాడాలి. మనం వినాలి. స్త్రీలు ముచ్చటపడుతూనే ఉండాలి. హ్యాపీ బర్త్‌డే హృదయగాయకా.(నేడు సిద్ శ్రీరామ్ జన్మదినం) – సాక్షి ఫ్యామిలీ -
Vakeel Saab: మొదట అనుకుంది పవన్‌ను కాదట!
వకీల్ సాబ్తో మూడేళ్ల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. బాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన పింక్‌కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాను తెలుగులో ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా మార్పులుచేర్పులు చేశారు. తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వకీల్ సాబ్‌లో మొదటగా పవన్ కల్యాణ్‌ను హీరోగా అనుకోలేదట. నందమూరి బాలకృష్ణ అయితే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతారని భావించారట. దీంతో ఈ ప్రాజెక్టును ఆయన దగ్గరకు తీసుకువెళ్తే బాలయ్య దీన్ని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పేరును సూచించాడని, అలా దిల్ రాజు పవన్‌ను కలిసి వకీల్‌సాబ్‌కు ఒప్పించినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. బాక్సాఫీస్‌తోపాటు, ఓటీటీలోనూ మంచి ఆదరణ లభించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, శృతి హాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం వకీల్‌సాబ్ టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే బాలయ్య మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' సినిమా చేస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా కనిపించనుంది. శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రల్లో నటించనున్నారు. మరోవైపు పవన్.. క్రిష్ జాగర్లమూడితో కలిసి హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్‌లో రానా దగ్గుబాటితో కలిసి నటిస్తున్నాడు. చదవండి: చిరు, పవన్, వెంకీతో సహా అంతా..ఆ కథలే, ఎందుకు? హాట్ టాపిక్‌గా మారిన పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ -
రెమ్యునరేషన్ పెంచిన తమన్.. ఒక్కో మూవీకి ఎంతంటే..
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మంచి ఊపు మీద ఉన్నాడు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వరస సినిమాలకు సంగీతం అందిస్తూ టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్నాడు. ‘అల వైకుంఠపురము’లో తర్వాత ఆయన సంగీతంలో మరింత కొత్తదనం కనిపిస్తోంది. రొటీన్‌గా కాకుండా ఢిపరెంట్ స్టైల్లో సంగీతం అందించి ఆకట్టుకుంటున్నాడు. ఆయన ఈ ఏడాది ‘క్రాక్’, ‘వకీల్‌సాబ్’, ‘వైల్డ్ డాగ్’ లాంటి పెద్ద సినిమాలకు సంగీతం అందించాడు. వాటిలో ‘వకీల్‌సాబ్’లోని పాటలు జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘మగువా’ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇలా మెలోడీలతో పాటు మాస్ సాంగ్స్‌ని కూడా ఆకట్టుకునేలా కంపోజ్ చేస్తూ.. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌కు సరైన పోటీగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం తమన్ బాలకృష్ణ ‘అఖండ’, మహేశ్ బాబు ‘సర్కారువారి పాట’, పవన్ కల్యాణ్ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ రీమేక్, నాని ‘టక్ జగదీశ్’ అఖిల్ ‘ఏజెంట్’, శంకర్- రామ్‌చరణ్ మూవీ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న తమన్.. తాజాగా తన రెమ్యునరేషన్‌ని కూడా పెంచేశాడట. ‘అల వైకుంఠపురములో’ వరకు రూ. కోటి కంటే తక్కువ తీసుకునే తమన్.. ఆ తర్వాత తన పారితోషికాన్ని కోటిన్నర వరకు పెంచేశాడట. ఇక ఈ ఏడాది క్రాక్, వకీల్‌సాబ్ కూడా సూపర్ హిట్ కావడంతో మరో 50 లక్షలు పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమన్ ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు పుచ్చుకుంటున్నాడట. కొన్ని సినిమాలకు బడ్జెట్‌ని బట్టి తీసుకుంటాడని టాక్. కథ నచ్చితే తక్కువ తీసుకోనైనా సంగీతం అందిస్తాడని తమన్‌కు పేరుంది. ఇక రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఒక్కో సినిమాకు రూ.3కోట్లు తీసుకుంటారని సమాచారం. చదవండి : త్రివిక్రమ్ సినిమా : మరోసారి మహేశ్‌కు జోడిగా ఆ హీరోయిన్ బెడ్ సీన్.. వెక్కి వెక్కి ఏడ్చిన రాశీ ఖన్నా -
పవన్ కల్యాణ్‌కు భార్యగా నిత్యా మీనన్!
వకీల్‌సాబ్ తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘అయ్యప్పనమ్ కోషియం’. మలయాళ సూపర్ హిట్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇప్పటివరకు హీరోయిన్గా ఎవరు నటించనున్నారన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. మొదట సాయి పల్లవిని హీరోయిన్గా అనుకున్నా తన డేట్స్ కుదరక పోవడంతో సెట్ కాలేదు. దీంతో మేకర్స్ నిత్యా మీనన్‌ను సంప్రదించగా, ఆమె వెంటనే ఓకే చెప్పేసింది. ఇప్పటికే పవన్ సినిమాలో నిత్య నటించనుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే . తాజాగా ఈ సినిమాలో పవన్‌కు భార్యగా నిత్యా మీనన్ నటించనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఒక రకంగా ఈ సినిమా నిత్యామీనన్‌కు కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగులో సన్ ఆఫ్ సత్యమూర్తి (2015) తరువాత పెద్ద చిత్రాలకు ఆమె ఇంత వరకు సంతకం చేయలేదు. ఇక ఇదే సినిమాలో మరో యంగ్ హీరో రానా నటిస్తుండగా, అతడికి జోడీగా కోలివుడ్ నటి ఐశ్వర్య రాజేష్‌ను ఎంపిక చేశారు. ఇటవలె పవన్ కల్యాణ్ కరోనా నుంచి కోలుకోవడంతో త్వరలోనే ఈ మూవీ షూటింగులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. చదవండి : రీ ఎంట్రీ ఇస్తున్న వరుణ్ సందేశ్.. బోల్డ్ పోస్టర్ రిలీజ్ Vakeel Saab: పవన్ సినిమాపై పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు -
Vakeel Saab: పవన్ సినిమాపై పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా మీద అభ్యంతరం తెలుపుతూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో తన ఫోన్ నంబర్‌ను వాడుకున్నారంటూ సుధాకర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన అనుమతి లేకుండానే వకీల్ సాబ్‌లో ఓ చోట తన ఫోన్ నంబర్‌ను స్క్రీన్ మీద చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనివల్ల ఎంతో మంది తరచూ ఫోన్లు చేస్తూ తనకు ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిపాడు. కొందరైతే నోటికొచ్చినట్లు తిడుతున్నారని వాపోయాడు. ఇప్పటికే ఈ విషయంపై బాధితుడి తరపు లాయర్ వకీల్ సాబ్ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపాడు. దీనిపై వారు స్పందించాల్సి ఉంది. కాగా 'అజ్ఞాతవాసి' ఫెయిల్యూర్ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుని వకీల్‌సాబ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన 'పింక్'కు రీమేక్‌గా తెరకెక్కిందీ చిత్రం. ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది. చదవండి: ప్రభాస్ అలా ఉంటాడని ఊహించలేదు : శృతీహాసన్ -
డ్రగ్స్ అవసరం లేదు, అవి మాత్రమే చాలు: థమన్
ఈ ఏడాది సంగీత దర్శకుడు థమన్ మాంచి స్పీడు మీదున్నాడు. తను అందించే సంగీతం ఒకెత్తు అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో లెవల్లో ఉంటోంది. మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాకు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరింత బలాన్నిచ్చింది. దీంతో ఈ సినిమానే కాదు, మ్యూజిక్ కూడా జనాలకు బాగా కిక్కిచ్చింది. ఇది చూసి టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా తన వైల్డ్‌డాగ్ సినిమాకు థమన్ కావాలని కోరాడట. అలా నాగ్ సినిమాలో కూడా అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చి అందరినీ ఫిదా చేశాడు. ఇక మూడేళ్ల తర్వాత 'వకీల్‌సాబ్'తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ సినిమాకు కూడా మంచి నేపథ్య సంగీతాన్ని అందించి అందరి చేత ప్రశంసలు అందించుకున్నాడు. ఏప్రిల్ 30న ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఓటీటీలో ఈ సినిమాను వీక్షించిన ఓ నెటిజన్ థమన్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. 'ఇది కంపోజ్ చేసేటప్పుడు ఏమైనా తాగావా ఏంటి? నీ కెరీర్లో ఇప్పటివరకు చేసినవాటిలో ఇదే హైలైట్. అసలు మామూలుగా లేదు..' అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన థమన్.. 'అలాంటిదేమీ లేదు, కాకపోతే పవన్ కల్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడటంతో అలా అనిపిస్తుంది అంతే. మాకు డ్రగ్స్ అవసరం లేదు, కేవలం హగ్స్, థగ్స్ ఇస్తే చాలు.. రెచ్చిపోతాం..' అని రిప్లై ఇచ్చాడు. Not exactly ⚠️ but the truth is the MAN on the screen @PawanKalyan gaaru ⚡️❤️ it will automatically make us feel high we don’t need drugs jus hugs 🤗 and some thugs 😎 @Karthika28_ ⚡️ #VakeelSaabBGM ♥️ https://t.co/d7J5kLQKMG — thaman S (@MusicThaman) May 2, 2021 సూపర్ స్టార్ మహేశ్‌బాబు 'సర్కారు వారి పాట'కు కూడా అందరూ ఆశ్చర్చపోయే రీతిలో సంగీతాన్నివ్వాలని మరో నెటిజన్ కోరగా.. తప్పకుండా ఇస్తానని మాటిచ్చాడు. మరోవైపు ఆయన సంగీతం అందించిన అల వైకుంఠపురములోని బుట్టబొమ్మ పాట యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సాంగ్ 600 మిలియన్ల వ్యూస్‌ను దాటేసింది. Sure o sure ❤️👩@imManaswinidhfm 💫☀️ https://t.co/TBujiOhdsm — thaman S (@MusicThaman) May 2, 2021 చదవండి: ‘వకీల్ సాబ్’తో నా కల నెరవేరింది: తమన్ -
Vakeel Saab: ‘మగువా.. మగువా’ వీడియో సాంగ్ వచ్చేసింది
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్’. ఏప్రిల్ 9న విడుదలైన ఈ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య, శ్రుతి హాసన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ‘మగువా.. మగువా’ వీడియో పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, మోహన భోగరాజు ఆలపించారు. తమన్ సంగీతం అందించారు. -
OTTకి మహర్దశ: కొత్తగా రిలీజయ్యే సినిమాలివే!
2020 సంవత్సరంతోనే కరోనా పీడ విరగడువుతుందనకుంటే అది మరింత విజృంభిస్తూ ఇక్కడే తిష్ట వేసింది. దీంతో గతేడాదే వినోదానికి దూరమైన సినీ లవర్స్ ఈసారి కూడా తమకు ఎంటర్టైన్మెంట్ దొరకదా? అని నెత్తిన చేయి పెట్టుకుంటున్నారు. అయితే ఇలాంటివారికోసమే దర్శకనిర్మాతలు కొత్త రూట్లో పయనిస్తున్నారు. థియేటర్ లేకపోతే ఓటీటీ ఉందిగా, ఇంక టెన్షన్ ఎందుకు దండగ అని అభయమిస్తున్నారు. ఎంచక్కా ఎక్కడికీ వెళ్లకుండా కూర్చున్న చోటే కాలక్షేపం అందిస్తామంటే ఎవరు మాత్రం వద్దంటారు. అందుకే చాలామంది ఓటీటీకి జై కొడుతున్నారు. ఫలితంగా థియేటర్లో రిలీజైన సినిమాలు, ఇంకా విడుదల కాని సినిమాలు అన్నీ కూడా పోలోమని ఓటీటీకి క్యూ కడుతున్నాయి. తాజాగా కొన్ని పెద్ద, చిన్న సినిమాలు కూడా వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ డేట్స్‌ను ప్రకటించాయి. అవేంటో చూసేద్దాం.. జగమే తంత్రం.. హీరో ధనుష్- కార్తీక్ సుబ్బరాజు కలయికలో వచ్చిన చిత్రం 'జగమే తందిరమ్'. తెలుగులో 'జగమే తంత్రం' పేరుతో విడుదల అవుతోంది. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించింది. కరోనా కారణంగా చాలా నెలల నుంచి వాయిదా పడుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. జూన్ 18 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇందులో ధనుష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తాడట. వకీల్ సాబ్.. ఇటీవలే థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన సినిమా 'వకీల్ సాబ్'. 'అజ్ఙాతవాసి' డిజాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ చేసిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, అంజలి, నివేదా థామస్, అనన్య, శృతి హాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించగా, థమన్ సంగీతం అందించాడు. థ్యాంక్ యు బ్రదర్.. యాంకర్ అనసూయ భరద్వాజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'థ్యాంక్ యు బ్రదర్'. సందేశాత్మక అంశంతో తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు మూత పడటంతో ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా నుంచి మంచి ఆఫర్ వచ్చింది. దీంతో అనసూయ సినిమా ఆహాలో మే 7 నుంచి స్ట్రీమింగ్ అవనుంది. నారప్ప.. విక్టీర వెంకటేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'నారప్ప'. సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ అసురన్‌కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. మే 14న ఈ చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ గతంలో ప్రకటించింది. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తారా? లేదా ఓటీటీలో రిలీజ్ చేస్తారా? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం నారప్పను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. రంగ్‌దే.. నితిన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రంగ్‌దే'. మార్చి 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాను ఓటీటీ సంస్థ జీ 5 కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ మంచి డీల్ కుదిరితే మే 21 నుంచి జీ 5లో ప్రసారం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కర్ణన్.. ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కర్ణన్'. మాలి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజైంది. కోట్లాది రూపాయల కలెక్షన్లు కురిపించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఫిల్మీ దునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో మే 9 నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్లో మార్పు ఉండే అవకాశం ఉంది. మోహన్ గోవింద్ డైరెక్షన్లో అశ్విన్ కాకుమను ముఖ్య పాత్రలో నటించిన 'పిజ్జా 3 ద మమ్మీ' సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుందట. కార్తీ, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన 'సుల్తాన్' ఆహాలో మే 2న విడుదల కానున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' మే 13న అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో ఒకేసారి రిలీజ్ అవుతోంది. చదవండి: మీ డ్యాన్స్, స్టైల్.. ఫెంటాస్టిక్, లవ్ యూ అల్లు అర్జున్: సల్మాన్ బిగ్‌బాస్ దివిపై ట్రోల్స్.. పాప కాస్త ఓవర్ చేస్తోందంటూ.. -
అమెజాన్‌లో వకీల్ సాబ్: ఎప్పటి నుంచి అంటే
మూడేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్తో రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క అన్నట్లుగా పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ చేస్తూ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడీ హీరో. అభిమానులను ఏమాత్రం నిరాశపర్చకుండా ఏడాదికి ఒకటీ రెండు సినిమాలైనా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట పవన్. మూస ధోరణిలో ఉన్న పాత్రలను కాకుండా విభిన్నంగా ఉండేవాటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన 'వకీల్ సాబ్' ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజైంది. దీన్ని అంత త్వరగా ఓటీటీలో ప్రసారం చేయొద్దని అనుకున్నారు. కలెక్షన్లు కూడా ఓ రేంజ్లో రావడంతో అందులో పవన్ వాటా సైతం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇదిలా వుంటే ఇప్పుడు థియేటర్లు మూత పడటంతో ఈ సినిమాను ఓటీటీలో ప్రసారం చేసేందుకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ నెల 30 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో దీన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు స్పెషల్ ప్రోమోను సైతం రిలీజ్ చేశారు. He is his own judge, in his court... only the truth will be served! New trailer out now! Meet #VakeelSaabOnPrime on April 30. @PrimeVideoIN@PawanKalyan #SriramVenu @shrutihaasan @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @MusicThaman @BayViewProjOffl pic.twitter.com/vCvBFA2I3O — Sri Venkateswara Creations (@SVC_official) April 27, 2021 చదవండి: వకీల్ సాబ్ సినిమా డైలాగ్ రైటర్ మన ఊరి అల్లుడే.. -
హాట్ టాపిక్‌గా మారిన పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్‌సాబ్. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఏపప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాలో పవన్ లాయర్‌గా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. వకీల్‌సాబ్‌కు కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా 65 కోట్లు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. రెమ్యూనరేషన్‌గా 50 కోట్ల, లాభాల్లో 15 కోట్లు వాటాగా తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో నటించిన నివేదా థామస్‌కు 75 లక్షలు, అంజలి 50 లక్షలు, అనన్యకు 25 లక్షలు పారితోషికంగా అందినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు సైతం భారీ రెమ్యూనరేషనే ఇచ్చినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలుచోట్ల ఆంక్షలు విధించారు. తెలంగాణలో థియేటర్లు, మల్టీఫ్లెక్స్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చాలా చోట్ల 50% ఆక్యుపెన్సీతో థియేటర్లు కొనసాగుతున్నాయి. దీంతో వకీల్‌సాబ్ మూవీను త్వరలోనే ఓటీటీలో రిలేజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చేనెలలో ఈ మూవీ అమెజాన్ పప్రైమ్లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చదవండి: అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్ 'అతని వల్లే ఆర్తి అగర్వాల్ కెరీర్ ఫేడ్ అవుట్ అయ్యింది' -
సినిమా షూటింగ్‌లకు ‘సెకండ్ బ్రేక్’
ఈ సినిమా పరిశ్రమ పరిస్థితి ఏంటి? ఈ కరోనా ఎటువైపు తీసుకెళుతోంది? కరోనా ఫస్ట్ వేవ్ చాలా నష్టాన్ని మిగిల్చింది. తొలి తాకిడి తట్టుకుని, మెల్లిగా తేరుకుంటున్న సమయంలో... ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చిపడింది. మళ్లీ సినిమా షూటింగ్‌లకు ‘సెకండ్ బ్రేక్’ వేయక తప్పడం లేదు. సెకండ్ వేవ్ ప్రభావంతో తాజాగా అర్ధంతరంగా షూటింగ్ ఆగిన చిత్రాల గురించి తెలుసుకుందాం... కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలూ తీసుకుని, చిరంజీవి ‘ఆచార్య’ సినిమా షూటింగ్ చేస్తూ వచ్చారు. కానీ, రోజురోజుకీ కరోనా కేసులు ఎక్కువ అవుతుండడం, ఇదే చిత్రం షూటింగ్లో పాల్గొన్న సోనూ సూద్ కరోనా బారినపడటంతో ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చేశారు. చిత్రీకరణ ఆపాలనే నిర్ణయాన్ని సోమవారం తీసుకుంది చిత్రబృందం. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్‌కి పడిన బ్రేక్ కారణంగా ఆ సమయానికి ‘ఆచార్య’ తెరపైకి రావడం కుదరకపోవచ్చు. మరోవైపు ఇంకో పదంటే పది రోజులు మాత్రమే షూటింగ్ చేస్తే, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ పూర్తయిపోతుంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం కృష్ణంరాజు–ప్రభాస్ కాంబినేషన్ సీన్స్ తీస్తే సినిమా పూర్తయిపోతుంది. పది రోజుల షూటింగ్ ఎలాగోలా పూర్తి చేయాలనుకున్నారు కూడా! కానీ, ఇప్పుడు మాత్రం షూటింగ్ ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ‘ఆచార్య’, ‘రాధేశ్యామ్’ చిత్రాల షూటింగ్ ఆపాలనుకున్న విషయం సోమవారం బయటికొచ్చింది. ఇక, ఇప్పటికే కరోనా వల్ల ఆగిన సినిమాల విషయానికొస్తే... మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. షూటింగ్లో పాల్గొనే ముందు యూనిట్ సభ్యులకు కరోనా పరీక్షలు చేయగా నలుగురికి పాజటివ్ నిర్ధారణ అయిందట. వీరిలో హీరో వ్యక్తిగత సహాయకుల్లో ఒకరు కూడా ఉన్నారు. దీంతో హైదరాబాద్‌లో జరగాల్సిన ‘సర్కారువారి పాట’ సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణకు బ్రేక్ పడింది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. ఇక రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రౌద్రం... రణం... రుధిరం’ (ఆర్ఆర్ఆర్)కి బ్రేక్ పడింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను ముంబయ్‌లో గ్రీన్ మ్యాట్ బ్యాక్‌డ్రాప్‌లో ప్లాన్ చేశారట. అయితే మహరాష్ట్రలో చిత్రీకరణలను ఆపేయాల్సిందిగా ప్రభుత్వం నిబంధన విధించడంతో ‘ఆర్ఆర్ఆర్’ ప్లాన్ ముందుకు సాగలేదని సమాచారం. ‘ఎఫ్ 2’లో బోలెడంత ఫస్ అందించిన వెంకటేశ్, వరుణ్ తేజ్ మళ్లీ నవ్వించడానికి ‘ఎఫ్ 3’ చిత్రీకరణతో బిజీ అయ్యారు. సరదా సరదాగా సాగుతున్న ఈ సినిమా చిత్రీకరణకు చిత్రదర్శకుడు అనిల్ రావిపూడికి కరోనా సోకడం వల్ల బ్రేక్ పడింది. ఈ చిత్రం ఆగస్టు 27న రిలీజ్‌కు ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల పవన్‌కల్యాణ్ కరోనా బారిన పడ్డారు. అంతే కాదు... ఆయన చిత్రబృందంలో ఇంకా పాజిటివ్ నిర్ధారణ అయినవాళ్లు చాలా ఉన్నారట. దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న సీనియర్ కో–డైరెక్టర్ సత్యం కరోనా బారిన పడి కన్నుమూశారు. దీంతో పవన్‌కల్యాణ్–రానా నటిస్తున్న మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ షూటింగ్ నిలిచిపోయింది. మరోవైపు వేగంగా షూటింగ్ సాగుతున్న హీరో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమాకు కూడా కరోనా బ్రేక్ వేసింది. హీరో వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి పాజిటివ్ రావడంతో షూటింగ్ నిలిపివేసినట్లు తెలిసింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 1న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిన్నా పెద్ద సినిమాల చిత్రీకరణలు ఆగాయి. మొత్తానికి షూటింగ్స్ తేదీలన్నీ తారుమారవుతున్నాయి. విడుదల తేదీలు తారుమారయ్యే అవకాశం ఉంది. కరోనా చేస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. -
'వకీల్‌సాబ్'కు వ్యతిరేకంగా చేసిన జీవో కాదు
సినిమా టిక్కెట్ రేట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో సామాన్యులకూ, చిన్న నిర్మాతలకూ మేలు చేసేలా ఉందని అన్నారు దర్శక – నిర్మాత నట్టి కుమార్. ఈ విషయంపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ – ‘‘ఏప్రిల్ 8న ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 35 జారీ చేసింది. టిక్కెట్ల రేట్ల సవరణకు సంబంధించి కొత్త జీవో పాస్ చేయాలని టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే ఫిల్మ్ ఛాంబర్ తరఫున మేము అడుగుతూ వచ్చాం. ఏపీ సీయం జగన్ మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి, చిన్న సినిమాల నిర్మాతలకు ఉద్దేశించి ఇప్పుడు జీవోను పాస్ చేశారు. ‘వకీల్‌సాబ్’ సినిమా 9న రిలీజ్ అయితే, ఆ జీవో 8న పాస్ అయ్యింది. ‘వకీల్‌సాబ్’కు వ్యతిరేకంగా ఈ జీవో పాస్ చేశారంటూ ప్రచారం సాగింది. అది వాస్తవం కాదు. నిజానికి, ఇలాంటి జీవో కోసం ఫిల్మ్ ఛాంబర్ నుంచి చాలా సార్లు సంప్రదించాం. ‘వకీల్‌సాబ్’ టికెట్ రేట్లలో తేడాల వల్లే బెనిఫిట్ షోలు రద్దు అయ్యాయి. అంతేకానీ ప్రభుత్వం ఆ బెనిఫిట్ షోలను రద్దు చేసిందనేది అవాస్తవం. నిర్మాత డి. సురేశ్‌బాబు మీటింగులు పెట్టి, థియేటర్స్ బంద్ అంటున్నారని తెలిసింది. ‘వకీల్‌సాబ్’ నడిచేవరకు థియేటర్లు ఉంచి, తరువాత బంద్ చేస్తారట. ఈ నెల 16న నా సినిమా (‘ఆర్జీవీ దెయ్యం’) విడుదల ఉంది. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కోర్టుకు వెళతాను. థియేటర్లను మూసివేస్తామని బెదిరిస్తుంటే, వారి లైసెన్సులను రద్దు చేయాలి’’ అన్నారు. ‘‘కరోనా సమయంలోని మూడు నెలల ఫిక్స్డ్ కరెంట్ ఛార్జీలను రద్దు చేస్తూ, మరో ఆరు నెలల ఛార్జీలను వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకం. అలాగే, టిక్కెట్ రేట్ల అడ్డగోలు పెంపును అడ్డుకుంటూ, సామాన్యుడికి ప్రభుత్వం మేలు చేసింది’’ అన్నారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రెటరీ జె.వి. మోహన్ గౌడ్. -
సినీ రంగంలో రాణిస్తున్న నెల్లిమర్ల అల్లుడు
సాక్షి, విజయనగరం (నెల్లిమర్ల): వకీల్ సాబ్ సినిమా డైలాగ్ రైటర్ మన ఊరి అల్లుడే. ఆ సినిమాకు డైలాగులు రాసిన మామిడాల తిరుపతి నెల్లిమర్ల పట్టణానికి చెందిన అమ్మాయినే వివాహం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందిన తిరుపతి నెల్లిమర్ల మండల పరిషత్ కార్యాలయంలో సబ్‌స్టాఫ్‌గా పనిచేస్తున్న బొద్దాన శంకరరావు, మంగమ్మ దంపతుల కుమార్తె బొద్దాన రూపాదేవిని 2011వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. తిరుపతి, రూపాదేవి దంపతులకు కైవల్య అనే పాప ఉంది. ప్రస్తుతం వారి కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తోంది. తిరుపతి 20 ఏళ్ల కిందట సినీ పరిశ్రమకు వెళ్లారు. 13 ఏళ్ల కిందట చిత్ర నిర్మాత దిల్‌రాజు టీమ్‌లో చేరారు. అప్పట్నుంచి ఆ టీమ్‌లో ప్రధాన టెక్నీషియన్‌గా కొనసాగుతున్నారు. 2011లో వేణుశ్రీరామ్ డైరెక్షన్లో వచ్చిన ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ సినిమాకు స్క్రిప్ట్ కోఆర్డినేటర్‌గా, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2013లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2017లో మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘స్పైడర్’ సినిమాకు స్క్రిప్ట్ అసిస్టెంటుగా, నాని నటించిన ‘ఎంసీఏ’కు డైలాగ్ రైటరుగా వ్యవహరించారు. తాజాగా శుక్రవారం విడుదలైన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్‌కు డైలాగులు రాశారు. సినీ పరిశ్రమలో తిరుపతికి మంచి భవిష్యత్ ఉందని నెల్లిమర్ల పట్టణవాసులు చర్చించుకుంటున్నారు. ఆయన నెల్లిమర్ల అల్లుడు కావడంపై గర్వపడుతున్నారు. ఆయనకు ఫోన్లో అభినందనలు తెలుపుతున్నారు. -
ప్రభుత్వ ధరలకే సినిమా టికెట్లు అమ్మాలి
-
ప్రభుత్వ ధరలకే సినిమా టికెట్లు అమ్మాలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జీవోలోని ధరల ప్రకారమే ఆదివారం నుంచి సినిమా టికెట్లు అమ్మాలని థియేటర్ల యాజమాన్యాలను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ అధిక ధరలు వసూలు చేస్తే ఆయా థియేటర్ల యాజమాన్యాలపై అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. శనివారం(10వ తేదీ) వరకు అడ్వాన్స్ బుకింగ్‌లో ఇచ్చిన టికెట్ల విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారులకు సూచించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులిచ్చింది. వకీల్‌సాబ్ సినిమాకు మొదటి మూడు రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవచ్చన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి హౌస్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం శనివారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. సినీ ప్రేక్షకుల నుంచి అధిక రేట్లు వసూలు చేయకుండా ఉండేందుకే కొత్త మార్గదర్శకాలతో జీవో ఇచ్చినట్లు తెలిపారు. మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నా.. సింగిల్ జడ్జి మాత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్‌లో ఇచ్చిన టికెట్లు మాత్రమే కాకుండా మూడు రోజుల పాటు అన్ని రకాల టికెట్లను అధిక ధరలకు అమ్ముకునేందుకు అనుమతిచ్చారని వివరించారు. థియేటర్ల యాజమాన్యాల తరఫు న్యాయవాది కె. దుర్గా ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. దీనివల్ల థియేటర్ల యజమానులు నష్టపోతున్నారని వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. ఆదివారం నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని స్పష్టం చేసింది. -
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వీరంగం.. కానిస్టేబుల్‌పై కత్తితో దాడి
సాక్షి, అనంతపురం : పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ సృష్టించిన వీరంగంలో ఓ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురంలోని నార్పలలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శ్రీనివాస డీలక్స్ థియేటర్లో వకీల్ సాబ్ సినిమా సెకండ్ షోలో పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఘర్షణ నెలకొంది. సీన అనే వ్యక్తి తాగిన మైకంలో ముందు సీట్లో కూర్చున్న వ్యక్తిపై వాటర్ ప్యాకెట్ విసిరేయడంతో అతని ఫోన్ తడిచిపోయింది. వాటర్ ప్యాకెట్‌తో మొదలైన గొడవ కొట్టుకునేదాకా చేరింది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు పరస్పరం దాడి చేసుకుంటుండగా థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సీన అనే పవన్ కల్యాణ్ ఫ్యాన్ పోలీసులపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి : షూటింగ్ : అలాంటి సీన్లు చేయడానికి నో పర్మిషన్ 'పుష్ప'పై కాంట్రవర్సీ.. కాపీ కొట్టారంటూ నెటిజన్లు ఫైర్ -
ప్రేక్షకుడిపై భారం పడకూడదనే..
సాక్షి, అమరావతి: వినోదం కోసం సినిమా థియేటర్‌కు వెళ్లే సగటు ప్రేక్షకుడిపై భారం పడకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రతిపక్షాలు అనవసర రాజకీయం చేసి రాద్ధాంతం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కొత్త సినిమా పేరుతో అడ్డగోలుగా ధరలు పెట్టి, ఇష్టం వచ్చినన్ని షోలు వేసి ప్రేక్షకుల జేబులు గుల్లచేయడానికి అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను గుడ్డిగా వ్యతిరేకించడం ఎంతవరకూ సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రేక్షకులకు మేలు జరిగేలా తీసుకున్న నిర్ణయాలను వక్రీకరించి.. పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్‌సాబ్ సినిమాను అడ్డుకోవడం కోసమే కొత్త నిబంధనలు తెచ్చారని బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ దేవ్‌ధర్, చంద్రబాబు, జనసేన నాయకులు ఈ సినిమా రేట్లపై రాద్ధాంతం చేయడం వెనుక రాజకీయ లబ్ధి కోణమే తప్ప సామాన్యుల కోణం ఏమాత్రం కనిపించడంలేదు. ఉన్నతస్థాయి కమిటీ మార్గదర్శకాలు.. సినిమా టికెట్ల ధరలు ఎంత ఉండాలనే దానిపై ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. సామాన్యులకు అందుబాటులో ఉండేలా టికెట్ల ధరలు నిర్ణయించింది. ఈ రేట్లకు మించి అమ్మితే థియేటర్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. థియేటర్లలో సౌకర్యాలు, పార్కింగ్, అక్కడ అమ్మే తినుబండారాల ధరలపైనా మార్గదర్శకాలు ఇచ్చింది. అన్నింటికీ మించి కొత్త సినిమాలు విడుదలైనప్పుడు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేసి టికెట్లు అమ్మే విధానానికి స్వస్తి పలికింది. అందరికీ ఒకే ధరలో టికెట్లు అందేలా చర్యలు తీసుకుంది. 24 గంటలపాటు షోలు వేసే విధానానికి అడ్డుకట్ట వేసింది. ఈ నిబంధనలు రాష్ట్రంలో విడుదలయ్యే చిన్నా, పెద్దా అన్ని సినిమాలకు వర్తిస్తాయి. అందరికీ ఒకే ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులు సరదాగా సినిమాకెళ్లి ఎంజాయ్ చేయడం కోసమే మేం టికెట్ల ధరలను నిర్ణయించాం. ఇవి ఏ హీరోకైనా, ఏ సినిమాకైనా ఒకటే. కొత్త సినిమాలు విడుదలైతే టికెట్లు ఎక్కువ రేట్లకు అమ్మడం, బ్లాక్‌లో అమ్మడం వంటి వాటికి చెక్ పెట్టాం. దీనివల్ల సామాన్యులకు మేలు జరుగుతుంది. – పేర్ని నాని.. రవాణా, సినిమాటోగ్రఫీ మంత్రి -
నా పాల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు
సాక్షి, పొదలకూరు/తిరుపతి: ముప్పై ఏళ్లుగా తాను పాల వ్యాపారం చేస్తుంటే దానిని దెబ్బతీయాలని గుజరాత్ నుంచి ఒకడిని (అమూల్) పట్టుకొచ్చారని.. వాడికి బలవంతంగా పాలు పోయమంటున్నారని.. ఇది కక్షసాధింపు కాదా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. మీరు ఈ రాష్ట్రంలో ఉంటారు, ఎక్కడికి వెళ్లిపోరు.. అసలు, వడ్డీతో సహా మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి అని వైఎస్సార్సీపీ నేతలనుద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. పవన్‌ను, తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం చంద్రబాబు నెల్లూరు జిల్లా పొదలకూరులో పర్యటించారు. సభలో ఆయన మాట్లాడుతూ.. వకీల్‌సాబ్ సినిమా స్పెషల్ షోలకు ఏపీలో అనుమతులివ్వలేదని, పవన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. తాను తలుచుకుంటే ఒక్కరు కూడా మిగలరు.. ఖబడ్దార్ అంటూ వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. అలాగే, విశాఖలో ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించిన గోడౌన్‌కు అన్ని అనుమతులున్నా ఆక్రమించారంటూ కూల్చివేశారని ఆరోపించారు. అధికారంలోకి వస్తేకార్యకర్తలకు ఫుల్ పవర్స్ అంతకుముందు.. శ్రీకాళహస్తిలో జరిగిన కార్యకర్తల సమావేశంలోనూ చంద్రబాబు మాట్లాడారు. పార్టీ కోసం టీడీపీ కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని.. అయితే వారికి న్యాయం చేయలేకపోయానన్నారు. న్యాయం చేయలేదని మనస్సులో పెట్టుకోవద్దని, ఎనిమిది రోజులపాటు అన్ని పనులు వదిలిపెట్టి పార్టీ సత్తాచాటాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసుధన్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మీరు సీఎం అయితే మేం ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా.. జరగాల. ఇప్పుడున్న పోలీసులు, రెవెన్యూ వారిపై కక్ష తీర్చుకోవాలి’.. అని కోరగా, చంద్రబాబు స్పందిస్తూ.. ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలకు ఫుల్ పవర్స్ ఇచ్చి వడ్డీతో సహా కక్ష తీర్చుకునేలా అవకాశం కల్పిస్తామన్నారు. వలంటీర్లు వెంట్రుకలు కూడా పీకలేరని మండిపడ్డారు. ఉద్యోగులు తోక తిప్పితే కట్ చేస్తానని హెచ్చరించారు. నిలిచిపోయిన 108 అంబులెన్స్ అంబులెన్స్‌కు దారివ్వని తమ్ముళ్లు పొదలకూరు: నెల్లూరు జిల్లా పొదలకూరులో టీడీపీ కార్యకర్తలు మానవత్వం లేకుండా వ్యవహరించారు. ‘108’ అంబులెన్స్‌కు వారు దారి ఇవ్వలేదు. పట్టణంలో శుక్రవారం చంద్రబాబు రోడ్‌షో, బహిరంగసభ కోసం గేటు సెంటరుకు ఆ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. ఇంతలో.. గుండెనొప్పితో బాధపడుతున్న పొదలకూరు మండలానికి చెందిన మహిళను 108లో నెల్లూరు ఆస్పత్రికి తరలిస్తున్నారు. అంబులెన్స్ గేటు సెంటర్‌కు చేరుకుంది. అయితే, టీడీపీ తమ్ముళ్లు సుమారు 30 నిమిషాలపాటు దాన్నిపట్టించుకోలేదు. దారి ఇవ్వమని 108 టెక్నీషియన్ (డ్రైవర్)తో పాటు బాధితురాలి కుటుంబ సభ్యులు ఎంత బతిమాలినా కనికరించలేదు. -
ఆ నిబంధన ప్రకారం రోజూ 4 షోలకే అనుమతి
తిరుపతి: వకీల్‌సాబ్ సినిమాకు, ఎన్నికలకు సంబంధం ఏంటని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం రోజు 4 షోలకే అనుమతుందని తెలిపారు. టికెట్ రేట్లు పెంచి జనం జేబులు కొట్టాలా.. పవన్ సినిమా కోసం ప్రత్యేకంగా నిబంధనలు మార్చరని కుండ బద్దలు కొట్టారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీజేపీ అసలు ఏపీ ప్రజలకు ఏం చేసిందో తెలపాలని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశారని బీజేపీ మీద మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం పాచిపోయిన లడ్డూలు పెట్టిందని పవన్ గతంలో చేసిన ఆరోపణలను మంత్రి గుర్తుచేశారు. బీజేపీ నేతలు చెప్పిన అచ్చేదిన్ ఎక్కడ వచ్చిందో చెప్పాలని పేర్నినాని ప్రశ్నించారు. 14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో మాట్లాడాలంటే వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనకు తానే భజన చేసుకుంటున్నాడని, కానీ ఇప్పటికే ప్రజలు అతడిని తరిమికొట్టారని విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని పేర్నినాని ధీమా వ్యక్తం అన్నారు. చదవండి: ‘రుణమాఫి పేరుతో చంద్రబాబు రైతులను దోచుకున్నాడు’ -
‘వకీల్ సాబ్’ మూవీ రివ్యూ
టైటిల్ : వకీల్ సాబ్ జానర్: లీగల్ డ్రామా నటీనటులు : పవన్ కల్యాణ్, శృతిహాసన్, ప్రకాశ్ రాజ్, అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్ సమర్పణ : బోనీ కపూర్ దర్శకత్వం : శ్రీరామ్ వేణు సంగీతం : తమన్ సినిమాటోగ్రఫీ : పీఎస్ వినోద్ ఎడిటింగ్ : ప్రవీన్ పూడి విడుదల తేది : ఏప్రిల్ 09, 2021 అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని ‘వకీల్ సాబ్’గా ఈ శుక్రవారం (ఏప్రిల్ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవన్. పవన్ రీఎంట్రీ మూవీ కావడం.. అందులోనూ అమితాబ్ నటించి బాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ పింక్ సినిమాకు రీమేక్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో ‘వకీల్ సాబ్’పై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ వకీల్ సాబ్ ఏ మేరకు అందుకున్నాడు? పవన్ రీఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథ పల్లవి(నివేధా థామస్), జరీనా బేగం(అంజలి), దివ్య నాయక్(అనన్య నాగళ్ళ )వేరు వేరు ప్రాంతాలకు చెందిన మధ్యతరగతి యువతులు. ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి ఒకే ఇంట్లో అద్దెకు ఉంటారు. డ్యూటీకి వెళ్లడం, వచ్చిన డబ్బులు ఇంటికి పంపించడం వీరి కర్తవ్యం. ఇలా హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్న ఈ ముగ్గురు ఒక రోజు పార్టీ కోసం బయటకు వెళ్లి రాత్రి క్యాబ్‌లో ఇంటికి వెళ్తూ అనుకోకుండా ఎంపీ రాజేందర్(ముఖేష్ రిషి) కొడుకు వంశీ(వంశీకృష్ణ) గ్యాంగ్‌తో రిసార్ట్‌కి వెళ్తారు. అక్కడ జరిగిన ఓ సంఘటన ఈ ముగ్గురి జీవితాలను మలుపుతిప్పుతుంది. ఈ ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు అవుతుంది. పల్లవిని అరెస్ట్ చేస్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఈ ముగ్గురు యువతులకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాని క్రమంలో సస్పెండ్‌కు గురైన లాయర్ సత్యదేవ్ అలియాస్ వకీల్ సాబ్( పవన్ కల్యాణ్) అండగా నిలబడతాడు. అసలు సత్యదేవ్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? అతని చరిత్ర ఏంటి? మధ్యతరగతి కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపడుచులకు వకీల్ సాబ్ ఎలా న్యాయం చేశాడు? రాజకీయ నేపథ్యం ఉన్న వంశీని, డబ్బులకు అమ్ముడుపోయే లాయర్ నందా(ప్రకాశ్ రాజ్)ని సత్యదేవ్ ఎలా ఢీకొన్నాడు? అనేదే మిగతా కథ. నటీనటులు అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కల్యాణ్ వెండితెరకు దూరమయ్యాడు. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లి తెరపై కనిపించాడు. వకీల్ సాబ్ పాత్రలో పవన్ పరకాయ ప్రవేశం చేశారు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాల్లో పవన్ చెప్పే డైలాగ్స్ అబ్బురపరచడంతో పాటు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఇక శృతిహాసన్ చనిపోయినప్పుడు వచ్చే ఎమోషనల్ సీన్లో పవన్ కల్యాణ్ జీవించేశాడు. అలాగే మధ్యతరగతి చెందిన యువతుల పాత్రల్లో అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ అద్భుతంగా నటించారు. వకీల్ సాబ్ భార్య పాత్రలో శృతిహాసన్ పర్వాలేదనిపిస్తుంది. ఇక క్రిమినల్ లాయర్ నందా పాత్రలో ప్రకాశ్‌రాజ్ ఎప్పటిమాదిరే జీవించేశాడు. వంశీకృష్ణతో మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కి రీమేకే ఈ వకీల్ సాబ్ సినిమా. సమాజంలో మహిళల పట్ల కొంతమంది వ్యక్తులకు ఉన్న చులకన భావాన్ని, దానివల్ల స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం ‘పింక్’. అక్కడ అమితాబ్ బచ్చన్, తాప్సీ, కృతి కల్హరి, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే సినిమాను అజిత్‌లో కోలీవుడ్‌లో రీమేక్ చేశారు. అక్కడా సూపర్ హిట్ అయింది. రెండు చోట్ల సూపర్ హిట్ కావడంతో ఈ కథను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని భావించాడు నిర్మాత దిల్ రాజు. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ స్టార్‌డమ్‌ని దృష్టిలో ఉంచుకుని మూలకథలో ఎలాంటి మార్పులు చేయకుండా, దానికి కొన్ని కమర్షియల్ హంగుల్ని చేర్చాడు దర్శకుడు వేణు శ్రీరామ్. బాలీవుడ్, కోలీవుడ్‌లో చూపించని విధంగా ఇందులో పవన్‌ని యంగ్ లుక్‌లో చూపించారు. అలాగే హీరోకి ప్లాష్ బ్యాగ్ కూడా పెట్టాడు. అయితే అది మాత్రం వర్కౌట్ కాలేదు. సినిమా కథకు అది కాస్త అడ్డంకిగా అనిపిస్తుంది. అలాగే శ్రుతీహాసన్, పవన్ కల్యాణ్ మధ్య వచ్చిన లవ్ సీన్స్‌కూడా అంతగా ఆకట్టుకోవు. ఫస్టాఫ్‌లో కొన్ని చోట్ల అనవసరమైన సీన్స్ కూడా ఉండటం కొంతమేర ప్రతికూల అంశమే. అలాగే ఇంటర్వెల్ వరకు అసలు కథ ముందుకు సాగదు. ఇక సినిమాకు ప్రధాన బలం కోర్టు సీన్స్ . కోర్టు సన్నీవేశాల్లో వచ్చే డైలాగ్స్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేవిగా ఉంటాయి.‘అడుక్కునోళ్లకి అన్నం దొరుకుంది. కష్టపడినోడికి నీడ దొరుకుంది కానీ పేదోడికి మాత్రం న్యాయం దొరకదు’, ‘ఆడది అంటే బాత్రుంలో ఉండే బొమ్మ కాదు నిన్ను కన్న అమ్మ’ లాంటి డైలాగ్స్ హృదయాలను హత్తుకుంటాయి. అయితే సెకండాఫ్ మొత్తం కోర్టు సన్నివేశాలే ఉండడం పవన్ ఫ్యాన్స్‌కు నచ్చినా.. సాధారణ ప్రేక్షకుడికి కాస్త ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంది. అలాగే కొన్ని డైలాగ్స్ పవన్ రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టి రాసినట్లుగా అనిపిస్తాయి. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. పలు సన్నివేశాలను తన నేపథ్య సంగీతంతో ఓ రేంజ్‌కి తీసుకెళ్లాడు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాలకు తనదైన బీజీఎం ఇచ్చి తమన్ అదరగొట్టాడు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి బాగుంది. కోర్టు సన్నివేశాలను కళ్లకుకట్టినట్లు చూపించాడు. పవీన్ పూడి ఎడిటింగ్ పర్వాలేదు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లకు కత్తెరపడితే బాగుండనిపిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ పవన్ కల్యాణ్, ప్రకాశ్‌రాజ్ నటన తమన్ సంగీతం కోర్టు సీన్స్ మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్